AP Inter 2nd Year Botany Notes Chapter 1 మొక్కలలో రవాణా

Students can go through AP Inter 2nd Year Botany Notes 1st Lesson మొక్కలలో రవాణా will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 1st Lesson మొక్కలలో రవాణా

1. మొక్కలు యొక్క ‘రవాణా వ్యవస్థ’లో నీటి రవాణా, ద్రావితాల రవాణా మరియు ఆహారం మొక్కలో ఒక భాగం నుంచి వేరొక భాగానికి రవాణా అవుతాయి.

2. మొక్కలు రెండు రకాల రవాణా కణజాలాన్ని కలిగి ఉంటాయి. [IPE]

  1. ‘దారునాళాలు’ వేరు నుంచి, నీటిని మరియు ద్రావితాలను గ్రహించి కాండం ద్వారా ప్రతాలకు రవాణా చేస్తాయి.
  2. ‘పోషక కణజాలం’ అనునది పత్రాలలో తయారైన ఆహారాన్ని మిగిలిన భాగాలకు రవాణా చేస్తుంది. [IPE]

3. ‘స్ధానాంతరణ’ లో ఎక్కువ దూరంలో ఉన్న పదార్థాల రవాణా అనునది దారువు మరియు పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. [IPE]

AP Inter 2nd Year Botany Notes Chapter 1 మొక్కలలో రవాణా

4. కణాల వెలుపలికి మరియు లోపలికి పదార్థాల రవాణా ఈ క్రింది మూడు రకాలుగా జరుగుతుంది.

  1. విసరణ
  2. సులభతర విసరణ
  3. సక్రియా రవాణ [IPE]

5. ‘విసరణ’ అనగా అధిక గాఢత ప్రదేశం నుంచి, తక్కువ గాఢత ప్రదేశమునకు ద్రావితా రేణువుల కదలిక.ఇది ఒక నిష్క్రియాత్మక(శక్తి వాడబడదు) రవాణా. ఇది గాఢత ప్రవణతతో పాటు జరుగుతుంది. [IPE]

6. ‘సులభతర విసరణ’ అనేది ఒక నిష్క్రియాత్మక శోషణ. ఇందులో ద్రావిత రేణువులు ఒక త్వచం ద్వారా గాఢతా ప్రవణతకు దిగువలో రవాణా చెందుతాయి. [IPE]

7. ‘ద్రవాభిసరణ’ అనగా ద్రావిత అణువులు తక్కువ గాఢత ద్రావణం నుంచి అధిక గాఢత ద్రావణం వైపుకు అర్ధపారగమ్య త్వచం ద్వారా చలించడం. [IPE]

8. ‘కణద్రవ్య సంకోచం’లో కణంలోని జీవ పదార్ధం ‘నీరు మరియు స్ఫీతం’ ను కోల్పోయి ముడుచుకుపోతుంది. [IPE]

9. ‘నిపానం’అనేది ఒక ప్రత్యేక విసరణ పద్ధతి. ‘నీరు’ విత్తనాల ద్వారా నిపానం చెందుతుంది. [IPE]

10. నీటి శక్మం (yw) అనగా నీరు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతమునకు ప్రయాణించే సామర్ధ్యాన్ని కొలిచే ప్రమాణం. [IPE]

AP Inter 2nd Year Botany Notes Chapter 1 మొక్కలలో రవాణా

11. ‘అపోప్లాస్ట్ నీటి చలనం’ లో మొక్కలో నీటి రవాణా ఎటువంటి కణత్వచాన్ని దాటదు.

12. ‘సింప్లాస్ట్ నీటి చలనం’ లో మొక్కలో నీటి రవాణా అనేది కణత్వచాలను దాటుతూ జరుగుతుంది.

13. బాష్పోత్సేకం అంటే మొక్క యొక్క వాయుగత భాగాల నుంచి నీరు ‘ఆవిరి రూపం’లో బయటకుపోవడం. [IPE]
దాని యొక్క ఉపయోగాలు మరియు నిరుపయోగాలు దృష్ట్యా ‘బాష్పోత్సేకం ఆవశ్యకమైన అనర్ధం’ అంటారు. [IPE]

14. ‘బిందుస్రావం’ అంటే మొక్కలో అధికంగా ఉన్న నీరు పత్రాల కొనల నుంచి బిందువుల రూపంలో బయటకు కోల్పోవటం. [IPE]

15. పెద్ద వృక్షాలలో ‘ద్రవ్యోద్గమం’ అనేది గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా, బాష్పోత్సేకకర్షణ వలన ఏర్పడుతుంది. [IPE]

Leave a Comment