Students can go through AP Inter 1st Year Zoology Notes 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు
→ ఈ ప్రపంచంలో ఉండే జంతువులలో 90% అకశేరుక వర్గానికి చెందిన జంతువులే ఉన్నాయి.
→ అకశేరుక వర్గాలు ‘వెన్నముక లేని’ జంతువులను కల్గి ఉంటాయి.
→ అకశేరుకాల స్వభావిక లక్షణాలు:
- ఖండిత దేహం
- కీళ్ళు గల ఉపాంగాలు
- బాహ్య అస్థిపంజరం
- మెదడు
→ అకశేరుక వర్గాలు (మూలార్థం) – ఉదాహరణలు:
- పొరిఫెరా (రంధ్రాలను కలిగి ఉండటం) – స్పంజికలు
- నిడేరియా(స్పర్శకాలలో కుట్టు కణాలు) – హైడ్రా, జెల్లిచేపలు, ప్రహళం
- టీనోఫోరా (కంకా కారలను కల్గి ఉండటం) – కోంబో జెల్లీలు
- ప్లాటి హెల్మింథిస్ (బల్లపరుపు జీవులు) – బల్లపరుపు జీవులు
- నిమటోడా (దారం వంటివి) – గుండ్రటి పురుగు
- అనెలిడా (వలయం) – జలగ
- ఆర్థ్రోపొడా (కీళ్ళుగల ఉపాంగాలు) – సాలీడు, కీటకాలు
- మొలస్కా (సున్నితం) – ఆక్టోపి, స్క్విడ్
- ఇకైనోడర్మేటా (ముళ్ళుకలిగినచర్మం) – స్టార్ చేప
- హెమి కార్డేటా (అర్ధసకేశరుకాలు) – ఎకార్న్ వర్మ్
→ లిమ్యులస్ ( రాచపీత) ఒక సజీవ శిలాజ ఆర్థ్రోపోడాజీవి . దాని శ్వాస అవయవాలు పుస్తకాకార మొప్పలు. [IPE]
→ ‘అరిస్టాటిల్ లాంతరు’ అనగా సీఆర్చిన్ నోటిలో ఉన్న ఒక సంక్లిష్టమైన ఐదు దవడల నమిలే యంత్రాంగం[IPE]
ఉదా: ఎకైనస్ (సీఆర్చిన్)
→ ఆంధోజోవా జీవులను సాధారణంగా ‘సీ అనిమోన్లు’ అని అంటారు. ఇవి స్థాన బద్ధజీవులు. [IPE]
→ పాలీకీటా జీవులు సముద్రపు అనెలిడా జీవులు. ఇవి సాధరణంగా బ్రిసిల్ పురుగులు (లేదా) క్లామ్ వార్మ్స్ [IPE]
→ క్రస్టేషియాలు జలచర, స్పర్శ శృంగాలు కలిగిన ఆర్థ్రోపోడా జీవులు. ఉదా: మంచినీటి రొయ్య [IPE]
→ ఎకినాయిడ్లు ఇకైనోడర్మేటా వర్గానికి చెందినవి. ఉదా: సీ అర్చిన్ [IPE]