AP Inter 1st Year Zoology Notes Chapter 2 జంతుదేహ నిర్మాణం

Students can go through AP Inter 1st Year Zoology Notes 2nd Lesson జంతుదేహ నిర్మాణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 2nd Lesson జంతుదేహ నిర్మాణం

→ జంతుదేహనిర్మాణ వ్యవస్థలో జంతు కణాలు, కణజాలల నిర్మాణం, విధులు, రకాల గురించి అధ్యయనం చేస్తారు.

→ ‘కణజాలల అభివృద్ధి’ అనేది పరిణామ క్రమంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం.

→ జంతు కణజాలాలు నాలుగు రకాలు: (i) ఉపకళా కణజాలం (ii) సంయోజక కణజాలం (iii)కండర కణజాలం (iv) నాడీ కణజాలం

→ ‘ఉపకళా కణజాలాలు’ స్రావకానికి, రక్షణ, వ్యాపనం మొదలైన వాటికి సహాయపడతాయి.

→ ‘సంయోజక కణజాలాలు’ ఇతర కణజాలలను బంధించడానికి మరియు ఊతమివ్వడానికి ఉపయోగపడతాయి.

→ ‘కండర కణజాలాలు’ వివిధ రకాల నియంత్రిత మరియు అనియంత్రిత కదలికలకు సహాయపడతాయి.

AP Inter 1st Year Zoology Notes Chapter 2 జంతుదేహ నిర్మాణం

→ ‘నాడీ కణజాలాలు’ వివిధ అవయవాలకు అనుసంధాయకంగా పని చేస్తూ జీవి మనుగడకు సహాయపడుతాయి.

→ ‘శీర్షత’ అనగా నాడీ కణాలు మరియు జ్ఞానకణాలు దేహం యొక్క పూర్వాంతంలో అమరి వుండటం.

→ ‘నాళంలో మరోక నాళం ‘అనే అమరిక మొదటిసారిగా నిమటోడా జీవులలో కనిపించింది. [IPE]

→ మూత్రపిండాల వంటి అవయవాలు సకశేరుకాలలో దైహిక వేష్టనంతో కప్పబడి, ఉదర భాగంలో మాత్రమే ఉంటాయి. ఈ విధంగా కప్పబడి వున్నటువంటి అవయవాలను ‘తిరోవేష్టన అవయవాలు’ అని అంటారు.

→ ‘మాస్ట్ కణాలు’ అనునవి హెపారిన్, హిస్టమన్, బ్రాడికైనిన్ మరియు సెరటోనిన్లను స్రవిస్తాయి. [IPE]

→ ‘స్నాయు బంధనం’ అనునది అస్థి కండరాలను ఎముకతో బంధించి ఉంచుతుంది. [IPE]

→ ‘బంధకం’ అనునది ఒక ఎముకను ఇతర ఎముకలతో బంధించి ఉంచుతుంది. [IPE]

→ తంతుయుత మృదులాస్థి అత్యంత ధృడమైన మృదులాస్థి. [IPE]

→ హేవర్షియన్ వ్యవస్థ అనేది ఘనాస్థి యొక్క సమూహం. దీనిలోని భాగాలు (i) హేవర్షియన్ కుల్య (ii)వలయ లామెల్లాలు(iii) లిక్విణులు (iv) సూక్ష్మకుల్యలు (v) వోల్కోమెన్సో కుల్యలు. [IPE]

→ ఆస్టియాన్: ధృడమైన ఎముకలో, హేవర్షియన్ కుల్య మరియు దాని చుట్టూ ఉన్న పటలికలు మరియు లిక్విణులు అన్నింటిని కలిపి ‘హేవర్షియన్ వ్యవస్థ’ లేదా ‘ఆస్టియాన్’ అని అంటారు. [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 2 జంతుదేహ నిర్మాణం

→ సెసమాయిడ్ ఒక మృదువైన ఎముక. ఇది స్నాయుబంధకాలు అస్థీభవనం చెందుట వలన ఏర్పడతాయి. ఉదా: పాటెల్లా

→ రక్తం పరిమాణంలో మొత్తం RBCలు ఆక్రమించిన శాతాన్ని ‘హిమాటోక్రిట్ విలువ’ అంటారు.

→ హృదయ కండరం( మయోకార్డియమ్) అనేది గుండె యొక్క కణజాలం. [IPE]

→ హృదయ కండరం ‘గ్లానికి’ లోను కాదు. ఎందుకనగా దానిలో అధిక సంఖ్యలో ఉండే సార్కోసోమ్స్, మయోగ్లోబిన్ అణువులు మరియు అధిక రక్త సరఫరా వలన ‘నిరంతర వాయుశ్వాసక్రియ’ జరుగుతూ వుంటుంది. [IPE]

→ అస్థిపంజరం నిర్మాణాలను అంటిపెట్టుకొని ఉన్నటువంటి కండరాలను అస్థిపంజరం కండరం అంటారు. అస్థిపంజర కండరం స్నాయు బంధనం ద్వారా ఎముకలను అంటిపెట్టుకొని ఉంటుంది. [IPE]

Leave a Comment