Students can go through AP Inter 1st Year Zoology Notes 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం
→ ‘జంతుశాస్త్రం’ ప్రపంచంలో ఉండే వివిధ రకాల జంతు సంబంధిత అంశాలను, లక్షణాలను అధ్యయనం చేస్తుంది.
→ మన భూమి మీద విస్తృత స్థాయిలో ఉన్న జీవులలో ఉండే జీవ భిన్నత్వాన్నే’ ‘జీవ వైవిధ్యం’ అంటారు.
→ ‘వర్గీకరణ శాస్త్రం’ అనేది జీవుల గుర్తింపు, నామీకరణ మరియు వర్గీకరణలను గురించి అధ్యయనం చేస్తుంది.
→ ICZN అనగా ‘అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి’.
→ ‘వర్గీకరణ’ అనగా సారూప్యత కలిగిన జంతు సమూహాల విభజన.
→ జీవశాస్త్రీయ వర్గీకరణ – ప్రాధాన్యతా క్రమం:
- రాజ్యం
- వర్గం
- విభాగం
- క్రమం
- కుటుంబం
- ప్రజాతి
- జాతి
→ ‘జాతి’ అనునది వర్గీకరణకు ఒక ‘ప్రాధమిక ప్రమాణం’.
→ త్రినామ నామీకరణం: ఒక జీవిని ప్రజాతి, జాతి మరియు ఉపజాతి అనే మూడు పదాలతో నామీకరణ చేయుట. ఉదా: హోమోసెపియన్స్ సెపియన్స్ [IPE]
→ టాటోనిమ్ అనగా జీవుల యొక్క శాస్త్రీయ నామంలో ప్రజాతి పేరు మరియు జాతి పేరు ఒకటిగా ఉండటం. ఉదా:నాజా నాజా – భారతీయ నాగుపాము [IPE]
→ కణజాల శాస్త్రం:అనగా వివిధ కణజాలల యొక్క సూక్ష్మ నిర్మాణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం [IPE]
→ బయోజెనిసిస్ సిద్ధాంతం పరిణామక్రమంలో ‘జీవం జీవం నుంచే ప్రారంభమవుతుంది’ అని తెలియజేస్తుంది. [IPE]
→ ప్రోటోస్టోమియా జీవులు అనగా ‘ఆంత్రరంధ్రం నోరుగా మార్పు’ చెందే యుమెటాజోవన్లు . ఉదా: అనెలిడా, ఆర్థ్రోపొడా, మొలస్కా, [IPE]
→ డ్యుటిరోస్టోమియా జీవులు అనగా ‘ఆంత్రరంధ్రము పాయువుగా మార్పు’ చెందే యుమెటాజోవన్లు .
ఉదా: ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. [IPE]
→ కొన్ని జాతుల నాశనం (విలుప్తత) త్వరితంగా జరగడానికి దోహదపడే నాలుగు ప్రధాన కారణాలే ‘అరిష్ట చతుష్టయం’. [IPE]
- ఆవాసక్షీణత మరియు శకలీకరణ
- స్థానికేతర జాతుల చొరబాటు
- వనరుల అతి వినియోగం
- సహ విలుప్తతలు
→ ‘బయోడైవర్సిటీ హట్స్పాట్లు’ అనేవి జీవభౌగోళిక ప్రాంతాలు. ఇవి మానవుడి కారణంగా నాశనానికి గురయ్యే జీవవైవిధ్య సంరక్షణ కేంద్రాలు. [IPE]
→ ‘రివెట్పాపర్ దృగ్విషయం’ జీవావరణ వ్యవస్థలో కొన్ని జాతుల నాశనం వలన కలిగే పరిణామాలను వివరిస్తుంది. [IPE]