Students get through AP Inter 1st Year Physics Important Questions 1st Lesson భౌతిక ప్రపంచం which are most likely to be asked in the exam.
AP Inter 1st Year Physics Important Questions 1st Lesson భౌతిక ప్రపంచం
Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
భౌతిక ప్రపంచం [Imp.Q]
జవాబు:
ప్రకృతిలోని మూల నియమాలు, విభిన్న దృగ్విషయాలలో ప్రత్యక్షమయ్యే వాటి స్వయం వ్యక్తీకరణలను అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్రపు విభాగాన్ని భౌతిక శాస్త్రముగా పరిగణించవచ్చు.
ప్రశ్న 2.
సి.వి.రామన్ ఆవిష్కరణ ఏమిటి? [AP 22][AP, TS 17,18,19,20][Model Paper, Imp.Q]
జవాబు:
ఏకవర్ణకాంతితో ఒక ద్రవమును ప్రకాశింప చేసినపుడు పరిక్షిప్త కాంతిలో (scattered light) కొంత భాగము యొక్క తరంగ దైర్ఘ్యము పతన కాంతి యొక్క తరంగ దైర్ఘ్యము కంటె తక్కువగా గాని, ఎక్కువగా గాని యుండును. దీనిని రామన్ ఫలితము అని అంటారు. దీనిని కనుగొన్నందుకు ఈయనకు 1930లో నోబెల్ బహుమతి లభించెను..
ప్రశ్న 3.
ప్రకృతిలోని ప్రాథమిక బలములు ఏవి? [AP 19][TS 18, 22]
జవాబు:
ప్రకృతిలో 4 ప్రాథమిక బలములు ఉన్నవి.
- గురుత్వాకర్షణ బలం
- విద్యుదయస్కాంత బలం
- ప్రబల కేంద్రక బలం
- దుర్బల కేంద్రక బలం
ప్రశ్న 4.
ఈ క్రింది వానిలో సౌష్టవత గలది ఏది?
(a) గురుత్వ త్వరణం
(b) గరుత్వాకర్షణ నియమం
జవాబు:
గురుత్వాకర్షణ నియమం ప్రపంచం (విశ్వం) లోని ఏ రెండు వస్తువులకైనా, ఎక్కడైనా ఒకే విధముగా ఉండును. కనుక అది సౌష్టవము కలది.
ప్రశ్న 5.
భౌతిక శాస్త్రమునకు ఎస్. చంద్రశేఖర్ చేసిన అంశదానం ఏమిటి? [Mar, May 13][AP,TS 15,16,17,19]
జవాబు:
చంద్రశేఖర్ ముఖ్యముగా నక్షత్రములపై పరిశోధనలు చేసెను. నక్షత్ర వాతావరణము, నక్షత్ర నిర్మాణము, శ్వేత వామన తారలు (white dwarfs), గేలక్సీ (నక్షత్ర వీధి) చలన ప్రకారము, ఆదిగా గల అనేక ఖగోల విషయములపై ఆయన పరిశీలన జరిపెను.
Extra Question అదనపు ప్రశ్నలు
ప్రశ్న 1.
భౌతిక శాస్త్రమునకు ఐన్స్టీన్ చేసిన అంశదానములు ఏవి?
జవాబు:
ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చిన అంశదానములలో ముఖ్యమైనవి.
1. కాంతి విద్యుత్ ఫలితమునకు వివరణ
2. బ్రౌనియన్ చలన సిద్ధాంతము
3. సాపేక్షతా సిద్ధాంతం
4. ద్రవ్యరాశి శక్తి తుల్యత ( E = mc²)
ప్రశ్న 2.
ఏ సంవత్సరమును భౌతిక శాస్త్రపు అంతర్జాతీయ సంవత్సరముగా గుర్తించిరి?
జవాబు:
1905 వ సంవత్సరములో భౌతిక శాస్త్రానికి ఐన్స్టీన్ చేసిన బృహత్తర కృషికి గుర్తింపుగా, 2005 సంవత్సరాన్ని భౌతిక శాస్త్రపు అంతర్జాతీయ సంవత్సరముగా గుర్తించారు.
ప్రశ్న 3.
భౌతిక శాస్త్రపు ప్రాథమిక నియమములు ఏవి?
జవాబు:
ఆవేశ, రేఖీయ ద్రవ్యవేగ, కోణీయ ద్రవ్యవేగ, శక్తి నిత్యత్వ నియమములను ప్రాథమిక నియమాలు అని అంటారు.
ప్రశ్న 4.
భౌతిక శాస్త్రమునకు S.N. బోస్ చేసిన అంశదానములు ఏవి?
జవాబు:
వికిరణాన్ని ఫోటాన్లతో కూడిన ఒక వాయువుగా పరిగణించి ప్లాంక్ నియమానికి సరికొత్త ఉత్పాదనను ఇచ్చాడు. ఫోటాన్ స్థాయిలను లెక్కించే ఒక కొత్త క్వాంటమ్ గణాంక శాస్త్రాన్ని అభివృద్ధి చేసాడు.
ప్రశ్న 5.
బీటా (B) క్షయం అనగా నేమి? ఇది ఏ బల ప్రమేయం? [TS 16]
జవాబు:
రేడియో ధార్మిక కేంద్రకం, ఎలక్ట్రాన్ లేదా పాజిట్రాన్ ను విఘటనం చెందించడం ద్వారా B -క్షయాన్ని ప్రదర్శిస్తుంది. ఇవి బలహీన కేంద్రక బలాలు.