AP 10th Class Telugu Model Paper Set 4 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 4 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 4 with Solutions

సమయం : 3 గం. 15 ని.లు
మార్కులు: 100

సూచనలు :

  1. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15ని.లు, జవాబులు రాయడానికి 3.00 గం||ల సమయం ఉంటుంది.
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.

విభాగము – I
I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (2 మా)

గిరి గ్రుంగఁద్రొక్కి చెంగున
హరి నింగికి దాఁటుగొనిన హరిహరి యపు
హరి యెగసినట్లు దోఁచక
గిరి యెగసినయట్లు తోఁచెఁ గెళవుల కెల్లన్.

ప్రశ్నలు :

అ) ఆంజనేయుడు దేనిని అణగదొక్కి పైకి ఎగిరాడు ?
జవాబు:
ఆంజనేయుడు కొండను అణగదొక్కి పైకి ఎగిరాడు.

ఆ) దేనిని దాటడానికి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు ?
జవాబు:
సముద్రాన్ని దాటడానికి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు.

ఇ) హనుమంతుడు ఎగిరినపుడు దూరం నుండి చూసేవారికి ఏమని అనిపించింది ?
జవాబు:
దూరం నుండి చూసేవారికి హనుమంతుడు ఎగిరినట్లు కాక ఒక పర్వతం ఎగిరినట్లు అనిపించింది.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పద్యంలో హనుమంతుడిని సంబోధించిన పేరు ఏది ?

(లేదా)

యవన పుణ్యాంగనామణి వగుదుగాక
హైందవులపూజ తల్లియట్లందరాదె?
నీదురూపము నాయందు లేద యైనఁ
గనని తల్లివిగా నిన్ను గారవింతు

ప్రశ్నలు :

ఉ) హైందవుల పూజను స్వీకరించమని శివాజీ ఎవరిని ప్రార్థిస్తున్నాడు ?
జవాబు:
హైందవుల పూజను స్వీకరించమని శివాజీ యవన స్త్రీని ప్రార్థిస్తున్నాడు.

ఊ) యవన స్త్రీతో పైపద్యంలోని మాటలను ఎవరు అన్నారు?
జవాబు:
యవన స్త్రీతో పై పద్యంలోని మాటలను శివాజీ అన్నాడు.

ఋ) శివాజీ యవనకాంతను ఎలా గౌరవిస్తానని అన్నాడు?
జవాబు:
శివాజీ యవనకాంతను తల్లిగానే గౌరవిస్తానని అన్నాడు.

ౠ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
శివాజీ యవనకాంతను ఏమని ప్రార్థిస్తున్నాడు?

AP 10th Class Telugu Model Paper Set 4 with Solutions

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (8 మా)

చిత్రగ్రీవానికి మూడువారాల వయనప్పుడు దాని గూటిలోకి ఒక చీమ పాకింది. గూటి అంచున కూర్చొని ఉన్న చిత్రగ్రీవం ఎవరి ఉపదేశవ:ూ లేకుండానే ఆ చీమను టక్కున తన ముక్కుతో పొడిచింది. అప్పటిదాకా ఏకఖండంగా సాగిన ఆ చీమ ఒక్కదెబ్బతో రెండు ముక్కలై పోయింది. తన ముక్కుతో ఆ చీమ తునకలను కదిపి చూసి తాను చేసిన ఘనకార్యం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది చిత్రగ్రీవం. అది ఏదో తినే వస్తువు అనుకొని తన పావురాల జాతికి మిత్రుడైన ఆ అమాయకపు నల్లచీమను చిత్రగ్రీవం పొడిచి చంపిందనడంలో సందేహం లేదు.

ప్రశ్నలు :

అ) గూటిలోకి చీమ పాకే సమయానికి చిత్రగ్రీవం వయసెంత ?
జవాబు:
గూటిలోకి చీమపాకే సమయానికి చిత్రగ్రీవం వయసు మూడువారాలు.

ఆ) చిత్రగ్రీవం చీమను ఏఁం చేసింది ?
జవాబు:
చిత్రగ్రీవం చీమను టక్కున తన ముక్కుతో పొడిచింది.

ఇ) ఏమని అనుకొని చిత్రగ్రీవం చీమను పొడిచింది ?
జవాబు:
ఏదో తినే వస్తువు అనుకొని చిత్రగ్రీవం చీమను పొడిచింది.

ఈ) ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పేరాలో పావురాల జాతికి మిత్రుడు అని ఎవరిని అన్నారు?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది సంఘటనలు ఏయే కాండలకు చెందినవో రాయండి.

అ) అరణ్యంలో సీతను వెదుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు.
జవాబు:
అరణ్యకాండ

ఆ) హనుమంతుడు తాను శ్రీరామ దూతనని చెప్పుకొన్నాడు.
జవాబు:
సుందరకాండ

ఇ) బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి.
జవాబు:
బాలకాండ

ఈ) పడిపోయిన లక్ష్మణుణ్ణి చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు.
జవాబు:
యుద్ధకాండ

4. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా)

చదవడానికి, రాయడానికి ఉపయోగపడేవే అక్షరాలు. అక్షరము అంటే నాశనం లేకుండా శాశ్వతంగా ఉండేదని అర్థం. ఈ అక్షరాలు మనిషికి వెలుగును చూపిస్తాయి. అందుచేతనే మన ప్రభుత్వం “అక్షరజ్యోతి” కార్యక్రమం చేపట్టింది, ఈ అక్షరజ్యోతి పట్టణవాసులకే కాక పల్లె ప్రజలను కూడా అక్షరాస్యులను చేయడానికి ఎంతగానో తోడ్పడింది. అక్షరజ్ఞానం లేకపోతే మనిషి కొంతమంది చేతిలో మోసపోయే అవకాశం ఉంది. చదవడం, రాయడం నేర్పడమే ప్రభుత్వ లక్ష్యం. అందువల్లే ప్రాథమిక స్థాయి నుండి ఉచిత నిర్బంధ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది.

ప్రశ్నలు :

అ) అక్షరాలు దేనికి ఉపయోగపడతాయి ?
జవాబు:
చదవడానికి, రాయడానికి ఉపయోగపడేవే అక్షరాలు.

ఆ) మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏది ?
జవాబు:
మన ప్రభుత్వం. “అక్షరజ్యోతి” కార్యక్రమం చేపట్టింది.

ఇ) ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో ఏ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ?
జవాబు:
ప్రాథమిక స్థాయి నుండి ఉచిత నిర్బంధ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది.

ఈ) గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘అక్షరం’ అంటే అర్థమేమిటి ?

విభాగము – II (8 మా)
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత : (3 × 4 = 12 మా)

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి. (3 × 4 = 12 మా)

5. భాస్కర శతక కర్తను గురించి వివరించండి.
జవాబు:
కవి : భాస్కర శతక కర్త – మారన వెంకయ్య. ఈయనను మారద వెంకయ్య, మారవి అని కూడా కొందరు అంటారు.
కాలం : ఈయన 1550-1600 కాలంలో జీవించి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయం.
ఇతర విశేషాలు : సుమతి, వేమన శతకాల తరువాత విస్తృత ప్రచారంలోనికి వచ్చిన నీతిశతకాలలో భాస్కరశతకం మొదటిది. భాస్కరశతకము తెలుగులో వెలసిన మొదటి దృష్టాంతశతకము. ప్రత్యక్ష నీతిబోధకంటే దృష్టాంత పూర్వకమైన అంటే ఉదాహరణతో నీతిబోధ చాలా ప్రభావవంతంగా ఉండగలదు.

AP 10th Class Telugu Model Paper Set 4 with Solutions

6. “గోరంత దీపాలు” పాఠ్యభాగ నేపథ్యం తెల్పండి.
జవాబు:
సమాజంలో ఎవరూ పట్టించుకోని అనాథబాలలు ఎంతో మంది ఉన్నారు. తిండి, బట్ట, చదువు దేనికీ నోచుకోని అభాగ్యులు వీరు. వీరిని చేరదీసి చేయూతనిచ్చి ఆధరించి విద్యాబుద్ధులు చెప్పిస్తే మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తారు. సమాజానికి సేవచేసే గొప్ప మనసున్న వ్యక్తులు, తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే గోరంత దీపాలు పాఠం కథ.
రైలు ప్రయాణంలో తటస్థపడిన ఓ బాలుణ్ణి చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతా భావం, వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాలు తెలియజెప్పడమే “గోరంత దీపాలు” పాఠం ఉద్దేశం.

7. “హనుమంతుడు” పాత్ర, స్వభావం వివరించండి.
జవాబు:

  1. హనుమంతుడు సుగ్రీవుని మంత్రి, రాముని దూత.
  2. గొప్ప పరాక్రమవంతుడు. విచక్షణా జ్ఞానసంపన్నుడు.
  3. అసాధ్యమైన పనిని కూడా సాధించగల సమర్థుడు.
  4. లక్ష్మణుని ప్రాణాలను నిల్పిన ప్రాణదాత.
  5. నూరు యోజనాల సముద్రందాటి లంకలో సీతను దర్శించాడు.
  6. లంకను దహింపచేసి, రావణుని గుండెల్లో వణుకుపుట్టించినవాడు.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 8 = 24 మా)

8. సజ్జన లక్షణాలు పేర్కొనండి.
(లేదా)
కోపం కారణంగా వ్యాసుడు కాశీనగరాన్నే శపించాలనుకున్నాడు కదా!
‘కోపం-మనిషి విచక్షణను నశింపజేస్తుంది.’ అనే అంశం గురించి రాయండి.
జవాబు:

  1. సజ్జనుడు ప్రియమైన మాటలు మాట్లాడుతాడు.
  2. మంచిని కలిగించే విషయాలే చెపుతాడు.
  3. కఠినమైన మాటలు మాట్లాడడు.
  4. ఒకవేళ కఠినమైన మాటలు మాట్లాడినా అవి నిజాలే గాని, కీడును కలిగించవు.
  5. సిరిసంపదలు లేకపోయినా సజ్జనుడికి మంచి లక్షణాలే ఆభరణాలుగా ఉంటాయి.
  6. తలవంచి వినయ, విధేయతలతో గురువులకు నమస్కారం చేస్తాడు.
  7. తన చెవులతో మంచి మాటలే వింటాడు తప్ప, చెడు మాటలను వినడానికి కూడా కనీసం ప్రయత్నించడు.
  8. సత్యమైన మాటలే మాట్లాడుతాడు తప్ప అబద్ధాలు మాట్లాడడు.
  9. మనసును ఆకట్టుకునే లక్షణాలు కలిగి ఉంటాడు.

(లేదా)

కోపం మనిషిలోని వివేకాన్ని, విచక్షణని పోగొట్టి ఉద్రేకం కలిగిస్తుంది. ఆ ఉద్రేకంలో తామేం చేస్తున్నారో తెలియక ఒళ్ళుమరచి ప్రవర్తిస్తారు. తరువాత ఆలోచించి పశ్చాత్తాప పడినా ఉపయోగం ఉండదు. కోపస్వభావం కలవారిని ఎవరూ ఇష్టపడరు. బంధుమిత్రులు దూరంగా ఉంటారు. వెలివేసినట్లు అందరికీ దూరంగా ఉండాల్సి వస్తుంది. ‘తన మనోభావాలు పంచుకునే ఆప్తుడు ఉండడు. అందుకే మన పెద్దలు ‘తన కోపమే తన శత్రువు’ అని చెప్పారు. కోపంతో ఎవరినీ ఏ విషయంలోనూ ఒప్పించలేం కాని మెత్తగా, అనునయంగా మాట్లాడి ఎవరినైనా ఒప్పించవచ్చు.

కోపావేశంలో ఉన్నప్పుడు శరీరంలోని గ్రంథులు, నాడులు ఉద్రేకం చెంది రక్తపోటు పెరిగే ప్రమాదం కూడా ఉందట. ఈ విధంగా మన కోపం మన శారీరక అనారోగ్యానికి కూడా కారణమవుతోంది. కోపంవల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టే ‘కోపమున ఘనత కొంచెమై పోవును’ అన్నారు.

ఇన్ని నష్టాలను తెచ్చిపెట్టే కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అందుకే మనవాళ్ళు కోపం వచ్చినప్పుడు పది అంకెలు లెక్క పెట్టమని, గ్లాసెడు మంచి నీళ్ళు త్రాగమనీ చెప్పారు. మనకు హాని చేసే ఈ కోపాన్ని తగ్గించుకొని, శాంత స్వభావాన్ని అలవరచుకొన్నవారు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు.

9. మారీచుని సహాయంతో రావణుడు సీతను అపహరించిన తీరును విశ్లేషించండి.
(లేదా)
సీతాన్వేషణ వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
రావణుడు మారీచుని సీతాపహరణకు సహాయపడమని అడిగితే అందుకు నిరాకరించిన మారీచుడు సీతను అపహరించడం కోరి చావును కొనితెచ్చుకోవడమేనని హెచ్చరించాడు. దానితో రావణుడు నిరాశగా తిరిగి లంకకు వెళ్ళాడు. శూర్పణఖ పలుకులతో రావణుడు మనసు మార్చుకొని సీతను అపహరించుటకు నిశ్చయించుకున్నాడు.

రావణుడు మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని అడిగాడు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.

దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడి పట్టి తెమ్మని రాముని కోరింది. రాముడు లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, బంగారు లేడి కోసం వెళ్ళాడు. రాముడు మాయలేడిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా! హా లక్ష్మణా!” అని అరిచింది.

ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని, రామునికి సాయంగా లక్ష్మణుడిని వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు మొదట కాదన్నా వెళ్ళక తప్పలేదు. ఇదే అదనుగా రావణుడు సన్న్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, ఆమెను బలవంతంగా లంకా నగరానికి తీసుకుపోయాడు. లంకలో అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉంచాడు.

(లేదా)

సీతాన్వేషణ కోసం వానరవీరులను సుగ్రీవుడు నాలుగు దిక్కులకు పంపాడు. తూర్పుదిక్కుకు ‘వినతుని’ నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు ప్రముఖులతో సైన్యాన్ని పంపాడు. మేనమామ అయిన సుషేణుని నాయకత్వంలో పడమరకు, శతబలి నాయకత్వంలో ఉత్తర దిక్కుకు సైన్యాన్ని పంపాడు. ఏ దిక్కుకు ఏ విధంగా వెళ్ళాలో చెప్పాడు. సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుని విశ్వాసం, రాముని భావన కూడా అదే.

శ్రీరాముడు తన పేరు చెక్కిన ఉంగరాన్ని హనుమంతునికి ఇచ్చాడు. సీత దీన్ని చూస్తే నిన్ను రామదూతగా నమ్ముతుందన్నాడు. హనుమంతుడు శ్రీరామునికి నమస్కరించి రామముద్రికను గ్రహించాడు. హనుమంతుడు శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి సీతాన్వేషణకు ప్రయాణమయ్యాడు. త్రికూట పర్వతంమీద ఉన్న లంకకు చేరాడు హనుమంతుడు. లంకలో అణువణువునా వెదికాడు హనుమంతుడు. చివరికి రాక్షస స్త్రీల మధ్యనున్న ఒక స్త్రీని చూసి సీతామాతయే అని నిశ్చయించుకున్నాడు. ఆమెను చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకొని నమస్కరించి, తాను ‘రామదూత’ నని సీతమ్మను నమ్మించాడు.

10. చూడాకర్ణునికి, వీణాకర్ణునికి మధ్య జరిగిన మాటలను సంభాషణ రూపంలో రాయండి.
(లేదా)
ఒక ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించదలచుకున్నారో ఆ ప్రశ్నల జాబితాను (ప్రశ్నావళి?) రాయండి.
జవాబు:
వీణాకర్ణుడు : మిత్రమా ! చూడాకర్ణా! ఏమిటి? పైకి చూస్తూ నేలమీద కఱ్ఱతో కొడుతున్నావు?
చూడాకర్ణుడు : ప్రతి రోజూ ఒక ఎలుక చిలుకకొయ్యమీద ఉన్న పాత్రలోని అన్నాన్ని తినిపోతోంది. నాకు దీనివల్ల చాలా కష్టంగా ఉంది.
వీణాకర్ణుడు : ఎక్కడ ఎలుక? ఎక్కడ చిలుకకొయ్య? ఇంత చిన్న జంతువుకు, అంత ఎత్తు ఎగరడానికి బలం ఎక్కడ నుండి వచ్చింది? దీనికి కారణం ఏదో లేక మానదు.
చూడాకర్ణుడు : ఈ ఎలుక చాలా కాలం నుండి ఇక్కడ స్థానం ఏర్పాటు చేసికొని నివసిస్తున్నది. ఇక్కడ నివసించడానికి కారణం తెలియడం లేదు.

(లేదా)

  • మీరు రచనలు ఏ విధంగా ప్రారంభించారు?
  • స్త్రీవాద రచయిత్రిగా మీరు సాధించిన విజయాలు ఏమిటి?
  • ప్రస్తుతం సమాజంలో స్త్రీలపై ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయికదా! దీనికి కారణాలు ఏమిటి?
  • మేము కూడా రచయితలుగా, రచయిత్రులుగా కావాలని ఉంది? దానికి మీ సలహా ఏమిటి?
  • సమాజంలో ఇప్పటికే మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి కదా! వాటిని రూపుమాపటానికి రచయిత్రిగా మీరు ఏం చేస్తున్నారు?
  • ప్రస్తుత విద్యా విధానం మీ దృష్టిలో ఎలా ఉంది?
  • ‘దేశభాషలందు తెలుగులెస్స’ అన్నారు కదా! ప్రస్తుతం తెలుగుభాష పరిస్థితి ఎలా ఉందో చెప్పండి.
  • స్త్రీవాద రచయిత్రి కావటానికి మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు?
  • ‘స్త్రీలు విద్యావంతులు కావాలి’ అన్న వీరేశలింగం పంతులుగారిని గురించి మీ అభిప్రాయం చెప్పండి. గృహిణిగా, రచయిత్రిగా మీకు శ్రమ అనిపించడం లేదా?
  • సామాజికంగా స్త్రీలు ఎదగాలంటే ఇంకేమైనా లోపాలున్నాయని భావిస్తున్నారా?

III. భాషాంశాలు’: (32 మా)
విభాగము – III

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (9 × 2 = 18 మా)

11. సీత నవ్వు వెన్నెలలా స్వచ్ఛంగా ఉంది. – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
ఉపమాలంకారం

12. ఈ క్రింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. (1 × 2 = 2 మా)
దెసలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 4 with Solutions 1
ఈ పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలున్నాయి కాబట్టి ఇది చంపకమాల పద్యం.

AP 10th Class Telugu Model Paper Set 4 with Solutions

13. అ) విద్యార్థులు పరీక్షలు రాయటానికి ఆయత్తం అవుతున్నారు – గీతగీసిన పదానికి అర్థం రాయండి.
జవాబు:
సిద్ధమవటం

ఆ) నేను మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాను-గీతగీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి.
అ) డబ్బు
ఆ) దీవెన
ఇ) బహుమతి
ఈ) నింద
జవాబు:
ఆ) దీవెన

14. అ) నేడు స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. – గీతగీసిన పదానికి సరైన పర్యాయపదాలు రాయండి. (1 మా)
జవాబు:
వనితలు, మహిళలు

ఆ) వివరములో ఎలుకలు, పాములు ఉంటాయి. (1 మా)
– గీతగీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించి విడిగా రాయండి.
అ) జిలుగు-వెలుగు
ఆ) బుట్ట-తట్టు
ఇ) భూమి – నేల
ఈ) బిలము – రంధ్రము
జవాబు:
ఈ) బిలము – రంధ్రము

15. అ) చట్టం ముందు అందరూ సమానులే – గీతగీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. (1 మా)
జవాబు:
శాస్త్రము

ఆ) ధనము కన్నా గుణము మిన్న – గీతగీసిన పదానికి వికృతి గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) గీణము
ఆ) గొనము
ఇ) గగనము
ఈ) గొణము
జవాబు:
ఆ) గొనము

16. అ) సుమకు డాక్టర్ అవ్వాలని ఆశ. అది నెరవేరడానికి భగవంతుడే తనకు ఆశ. (1 మా)
(గీతగీసిన పదానికి నానార్థాలు రాయండి.)
జవాబు:
కోరిక, దిక్కు

ఆ) వీడువీడు వాడోగాని దుష్కార్యములను వీడుచున్నాడు.
(గీతగీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
అ) ఇతడు, పట్టణము
ఆ) తోట, అడవి
ఇ) స్నేహితుడు, సూర్యుడు
ఈ) ఉపాధ్యాయుడు, తండ్రి
జవాబు:
అ) ఇతడు, పట్టణము

17. అ) మూషికం వినాయకుడి వాహనం. (గీతగీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.) (1 మా)
జవాబు:
అన్నాదులకు దొంగిలించేది (ఎలుక)

ఆ) భారతదేశం ప్రతివ్రత లకు నిలయం అని శివాజీ అన్నాడు. (1 మా)
(గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.)
అ) కాలక్రమంలో స్వల్పమై పోయేది (ప్రవాహం)
ఆ) పతిని సేవించుటయే నియమంగా కలిగినది (సాధ్వి)
ఇ) వనంలో పుట్టినది (పద్మం)
ఈ) హిమంతుడనే పర్వతరాజు కూతురు (పార్వతి)
జవాబు:
ఆ) పతిని సేవించుటయే నియమంగా కలిగినది (సాధ్వి)

18. ఉలుకూ పలుకూ లేకుండా మౌనంగా ఉండటం మంచిది కాదు. -ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
ఉలుకు, పలుకు

19. “పురిటిలోనే సంధి కొట్టడం” – ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.
జవాబు:
మొదలు పెట్టిన పనికి ప్రారంభంలోనే ఆటంకంకల్గి సందర్భంలో వాడతారు.

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (14 × 1 = 14 మా)

20. భారతదేశం త్యాగధనులకు పుణ్యావాసం. – గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి. (1 మా)
జవాబు:
పుణ్య + ఆవాసం

21. పల్లె + ఊరు – ఈ పదాలను కలిపి రాయండి. (1 మా)
జవాబు:
పల్లెటూరు

AP 10th Class Telugu Model Paper Set 4 with Solutions

22. మహెూపకారం చేసిన వారిని మరిచిపోరాదు – గీతగీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణ సంధి
ఇ) వృద్ధి సంధి
ఈ) ఉత్వ సంధి
జవాబు:
ఆ) గుణ సంధి

23. మానవ జీవితంలో అన్ని రోజులూ, ప్రముఖదినములే. -గీత గీసిన సమాసపదానికి విగ్రహవాక్యం
అ) అవ్యయీభావ సమాసం
ఆ) ద్విగు సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) షష్ఠీతత్పురుష సమాసం
జవాబు:
ప్రముఖమైన దినం

24. సుబ్బయ్య ప్రతిదినము పొలానికి వెళతాడు. (గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)
జవాబు:
అవ్యయీభావ సమాసం

25. “పాత్రము నందున్నయన్నము భక్షించి పోవుచున్నది”
– ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచన రూపాన్ని గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) పాత్రములోని యన్నం తినిపోతున్నది
ఆ) పాత్రలో అన్నం తింటున్నది
ఇ) పాత్రలో ఉన్న అన్నం తినిపోతోంది
ఈ) పాత్రము నందలి అన్నం తిని పోతూ ఉంది
జవాబు:
ఇ) పాత్రలో ఉన్న అన్నం తినిపోతోంది.

26. చిత్రగ్రీవం ఆకాశంలోకి ఎగిరింది. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి). (1 మా)
జవాబు:
చిత్రగ్రీవం ఆకాశంలోకి ఎగురలేదు.

27. కింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి.
అ) చేసి
ఆ) చేయక
ఇ) చేస్తూ
ఈ) చేస్తే
జవాబు:
ఆ) చేయక

28. రామకృష్ణుడు గురువు. వివేకానందుడు శిష్యుడు.
(ఈ సామాన్యవాక్యాలను సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
రామకృష్ణుడు, వివేకానందుడు గురుశిష్యులు

29. విద్వాన్ విశ్వం పెన్నేటిపాట రాశాడు. (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
అ) పెన్నేటిపాట రాసింది విద్వాన్ విశ్వం
ఆ) పెన్నేటిపాట విద్వాన్ విశ్వం రచించాడు
ఇ) విద్వాన్ విశ్వం చేత పెన్నేటిపాట రాయబడింది.
ఈ) విద్వాన్ విశ్వం పెన్నేటిపాట చేత రాయబడ్డాడు
జవాబు:
ఇ) విద్వాన్ విశ్వం చేత పెన్నేటిపాట రాయబడింది.

30. ఆహా ! ఆ విద్యా నగరం ఎంత బాగుందో ! – ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం.

AP 10th Class Telugu Model Paper Set 4 with Solutions

31. నువ్వు చేతులు శుభ్రంగా కడుగు (ఇది ఏరకమైన సామాన్యవాక్యమో గుర్తించండి.). (1 మా)
అ) విధ్యర్థక వాక్యం
ఆ) అనుమత్యర్థక వాక్యం
ఇ) ప్రార్థనార్థక వాక్యం
ఈ) నిషేధార్థక వాక్యం
జవాబు:
అ) విధ్యర్థక వాక్యం

32. దయచేసి పక్షులను కాపాడండి. ఇది ఏ రకమైన వాక్యమో రాయండి.
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం.

33. మీకు శుభం కలుగు గాక ! ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి. (1 మా)
అ) ప్రశ్నార్థకం
ఆ) ఆశ్చర్యార్థకం
ఇ) ఆశీరర్థకం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
ఇ) ఆశీరర్థకం

Leave a Comment