TS Inter 2nd Year Telugu Question Paper March 2023

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers and TS Inter 2nd Year Telugu Question Paper March 2023 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Question Paper March 2023

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి.

1) వారలు శాంతశూరులు ; భవచ్చరణంబులు గొల్వబ్రూని యు
న్నారటుఁగాక మీ కది మనంబున కప్రియమేని నింతకుం
బోరికి వచ్చుచుండుదురు; భూవర ! రెండు దెఱంగులందు నీ
కారయఁ బథ్యమేది యగు నవ్విధ మేర్పడ నిశ్చయింపుమా !

2) గగన ధునీ నిపాతము జగత్ప్రభుఁడైన త్రిలోచనుండు స
ర్వగుఁడు సహింపఁజాలు ననవద్య తపోమహిమన్ బ్రసన్నుఁ జే
యఁగఁదగు, నాతనిం; గరుణ నాతఁడు మేలని పల్కినన్ సురా
పగ తదుదగ్ర మస్తకముపైఁ బడుఁ దతక్షణమంద భూవరా!

TS Inter 2nd Year Telugu Question Paper March 2023

II. ఈ క్రింది వానిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 8 = 8)

1) దుందుభి గొప్పతనాన్ని తెలుపండి.

2) ‘ఆడపిల్లలంటేనే’ పాటలో కవి చిత్రించిన స్త్రీల శ్రమతత్త్వాన్ని విశ్లేషించండి.

III. ఈ క్రింది వానిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) ముసలి గద్ద మార్జాల వృత్తాంతాన్ని రాయండి.
2) సృజనాత్మకత గురించి రచయిత అభిప్రాయం తెలుపండి.

IV. ఈ క్రింది వానిలో ఏవైనా రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానాలు రాయండి. (2 × 4 = 8)

1) ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం అనుభవాలు వివరించండి.

2) ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.

3) ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి.

4) ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?

V. ఈ క్రింది వానిలో ఏవైనా రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి.

1) ఎవరికుందే నీ పాట వినే తీరిక.

2) ఏ లెక్క జూసినా నువు జేసే కష్టమే ఎక్కువాయే.

3) మముబెంచు తల్లివై మా పాల వెల్లివై

4) కోపము నరుని సొంతము కూల్చునిలను.

VI. ఈ క్రింది వానిలో ఏవైనా రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1) వివాహం విద్యానాశీయ

2) నా జాతికి నావలన పాడుమాట రానివ్వను

3) ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను.

4) పాలముంచినా నీట ముంచినా నీదే భారం.

VII. ఈ క్రింది వానిలో ఏవైనా రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) కోకిల ఎక్కడ ఉంది ? దాని పాటకు స్పందన ఎలా ఉంది ?

2) గంగకు ‘జాహ్నవి’ అనే పేరు ఎందుకు వచ్చింది ?

3) సారపు ధర్మం ఎలాంటిది ?

4) శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు ?

TS Inter 2nd Year Telugu Question Paper March 2023

VIII. ఈ క్రింది వానిలో ఏవైనా రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

1) తెలుగు భాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలుపండి.

2) భుజకీర్తులు, కిరీటాల తయారీ ఎలా జరిగేది ?

3) “పురానపుల్” నిర్మించుటకు గల కారణాలు ఏవి ?

4) ఆంధ్రుల సంస్కృత సాహిత్యానికి బిరుదురాజు చేసిన కృషి తెలుపండి.

IX. క్రింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1) “నాకము” అనగా నేమి ?

2) సుఖదుఃఖాలను ఒకే విధంగా చూసేదెవరు ?

3) కోకిలను ఎవరు తరిమి కొడతారు ?

4) కుండలను చేసేది ఎవరు ?

5) కనపర్తికి ఉన్న బిరుదు ఏమిటి ?

6) యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది ?

7) దుందుభి అద్దాన్ని చూసి రూపము దిద్దుకొనేదెవరు ?

8) ఆకు రాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు ?

X. క్రింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1) కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు ?

2) “ఏనుగుల చెట్టు” గొప్పదనం తెలుపండి.

3) దయాళువులకు కరస్థమైనది ఏది ?.

4) బిరుదురాజు రామరాజు పి హెచ్.డి. గ్రంథం పేరేమి ?

5) భారతదేశపు ‘మిస్సైల్ మ్యాన్” అని ఎవరికి పేరు ?

6) న్యాయమున్నచోట ఎవరు ఉంటారు ?

7) రామానుజరావు రాసిన ఖండ కావ్యసంపుటి పేరేమిటి?

8) ఎల్లమ్మ ఏ వయస్సులో రంగస్థల ప్రవేశం చేసింది ?

XI. ఈ క్రింది వానిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1) శార్దూలం

2) తేటగీతి

3) ఉత్పలమాల

XII. ఈ క్రింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1) “చంపకమాల”లో వచ్చే గణాలు ఏమి ?

2) “ఇంద్రగణాలు” ఎన్ని ?

3) “మత్తేభం”లో ఎన్నవ అక్షరం యతి స్థానం ?

4) ప్రాస అనగా నేమి ?

5) పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ?

6) ‘కంద పద్యంలో” ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ?

7) సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?

8) యతి అనగా నేమి ?

XIII. క్రింది వానిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1) ఛేకానుప్రాస

2) ఉత్ప్రేక్షాలంకారం

3) అంత్యానుప్రాస

TS Inter 2nd Year Telugu Question Paper March 2023

XIV. క్రింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1) ఉపమావాచకాలు ఏవి ?

2) ‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.

3) ఆ ‘నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి’ ఏ అలంకారం ?

4) ‘ఉపమేయం’ అనగా నేమి ?

5) ‘యమకం’ అనగా నేమి ?

6) ‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?

7) ఒకే హల్లు అనేకసార్లు ఆవృత్తి అయితే అది ఏ అలంకారం.

8) సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం?

XV. ఈ క్రింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. (రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశ వరకు బోధనభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది.) ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దము నుంచి భారత స్వాతంత్ర్య ప్రాప్తి వరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. (సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోధైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి.) కొద్ది మంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని (ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.

XVI.
(అ) క్రింద పేర్కొన్న పదాల ఆధారంగా చేసుకుని సంభాషణను రాయండి. (5 మా.)
కాలిదెబ్బలకు వైద్యం కోసం వెళ్ళినపుడు వైద్యునితో సంభాషణ.
(క్రికెట్ ఆడటం-దెబ్బ తగలడం-నొప్పి-ఫస్టెయిడ్ మందులు – కాపడం – పథ్యం)

(ఆ) క్రింద ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ?

2. ‘శ్రీజ మంచి తెలివి గల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?

3. ‘అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?

4. అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ?

5. ‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ?

Leave a Comment