TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 1 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
వరదుఁడు సాధుభక్తజన ………….. ననూన సంపదల్.
జవాబు:
వరదుఁడు సాధుభక్తజన వత్సలుఁ డార్తశరణ్యుఁ డిందిరా వరుఁడు దయాపయోనిధి భగవంతుఁడు కృష్ణుఁడు దాం గుశస్థలి పురమున యాదవ ప్రకరముల్ భజియింపఁగ నున్నవాఁడు; నీ వరిగిన నిన్నుఁ జూచి విభుఁడప్పుడ యిచ్చు ననూన సంపదల్.
భావం : “వరములను ప్రసాదించువాడును, భక్తుల యందు దయగలవాడును, దీన జనులను రక్షించువాడును, దయకు సముద్రుని వంటివాడును, సకల సంపదలు కలవాడును అగు శ్రీకృష్ణ పరమాత్మడు యాదవుల సేవలందుకొనుచు ద్వారకాపురములో నున్నాడు. నీవు వెళ్ళినచో నిన్ను చూచి, మరుక్షణమే ఆ విశ్వవిభుడు అపారమైన సంపదలనిచ్చును”. అని కుచేలుని భార్య తన భర్తతో పలికెను. భక్తుల పట్ల శ్రీకృష్ణ పరమాత్మునికి గల కృపా విశేషమును పోతన ఈ పద్యములో వర్ణించినాడు.

ప్రశ్న 2.
వెళ్లి కుక్కల …….. దురితదూర!
జవాబు:
వెట్టి కుక్కల భ్రమలన్ని విడిచి నన్ను
భజన జేసెడివారికిఁ బరమసుఖము
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస !
దుష్ట సంహార! నరసింహ ! దురితదూర!

భావం : ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాములకు దూరమైనవాడా ! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ !

భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించు కోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘అచలం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు” నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో ‘ఇద్దాసు’ కలికితురాయి.
ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగ, తత్వపరంగ తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తత్వాక అంశాలను పరిచయం చేయటం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధనధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోక తప్పదు.

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. దాని అంతు తెలియక అల్లరిపాలు అవతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలు కోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరసుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగి శక్తిని పొందితే, ఆ రహస్యం అంతుచిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞాచక్రంమును పొందండి, తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం గమనించాలి. మన దేహంలో షటం చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంత చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

ప్రశ్న 2.
ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి ?
జవాబు:
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్యా నిపుణుడు. కౌరవులకు, పాండవులకు విలువద్య నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని రాజగురువు గా నియమించాడు. దివ్యాస్త్రాలతో సహా అన్నిరకాల అస్త్ర, శస్త్ర యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు ద్రోణుడు. అర్జునుడు అతని ప్రియ విద్యార్ధి.

ద్రోణుడికి అర్జునుని కన్నా ప్రియమైనవారు ఎవరన్నా ఉంటే అది అతని కుమారుడు అశ్వత్థామ మాత్రమే.

మహాభారత ఇతిహాసంలో ఉత్తమ గురువుగా ద్రోణాచార్యుడు, మరియు ఉత్తమ విద్యార్ధిగా అర్జునుడు గురుశిష్య బంధానికి తార్కాణంగా నిలిచి పోయారు. రాజకుమారులందరికీ గురువుగా ఉన్న ద్రోణుడు అర్జునుడు ఒక అసాధారణ విద్యార్ధి అని గమనించాడు. విద్యార్ధులందరికీ పెట్టిన తొలి పరీక్షలోనే అర్జునుడిలోని అపారమైన సంకల్పం మరియు ఏకాగ్రతను గమనించాడు ద్రోణుడు.

ఒక రోజు గొప్ప యోధుడవుతాడని గ్రహించాడు. ద్రోణాచార్యుడు పెట్టిన అన్ని పరీక్షలలోను అర్జునుడు అందరినీ మించిపోయాడు.

అర్జునుడు అపారమైన గురుభక్తితో ద్రోణుడిని సేవించాడు. భీష్మునిచే ఆచార్యునిగా నియమింపబడగానే రాకుమారులందరినీ చూసి నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చి నా కోరికమీలో ఎవ్వడు తీర్చగలడు? అన అడుగగా కౌరవులందరూ పెడమొగం పెట్టగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. అలా ముందుకు వచ్చిన అర్జునుని అపారప్రేమతో కౌగలించుకున్నాడు. అలాగే ద్రోణుని సరస్సులో మొసలి పట్టుకున్న సమయంలో అర్జునుడే ద్రోణుని మొసలి నుంచి విడిపించి తన ప్రతిభను చాటుకున్నాడు.

చీకటిలో బాణాలు వేయడం అభ్యసిస్తున్నా అర్జునుని చూసి, అస్త్రవిద్యలోని అతని పట్టుదలకి శ్రద్ధకు సంతోషించి నీకంటే విలువిద్యలో అధికులు లేనట్లుగా నేర్పిస్తానన్నాడు ద్రోణుడు అన్నట్లుగానే సకల విద్యాయుద్ధకౌశలాన్ని, అస్త్ర, శస్త్రాలను, దివ్యాస్త్రాలను యుద్ధవ్యూహాలను సంపూర్ణంగా బోధించి ఒకనాటి పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడు అనేట్లుగా అర్జునుని తీర్చిదిద్దాడు.

అర్జునునికన్నా విద్యపట్ల శ్రద్ధ, ఆసక్తి, గురుభక్తి, వినయ కారణంగా ద్రోణుడి ప్రియ శిష్యుడయ్యాడు. బ్రహ్మాస్త్రాన్ని అర్జునునికి ఇచ్చి సాధారణ యోధులకి వ్యతిరేకంగా వాడవద్దని చెప్పాడు. విలువిద్య కళను నేర్చుకోవటంతో ఉన్న అంకిత భావం అచంచల ఏకాగ్రత కారణంగా గురువు హృదయంలో స్థానం సంపాదించాడు.

ద్రోణుడు కూడా తనకున్న విద్యాజ్ఞానాన్నంతటినీ శిష్యులకు ధారపోసాడు. గురుద్రోణాచార్య, శిష్యుడు అర్జునుడు పంచుకున్న బంధం భారత ఇతిహాసంలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
సోమన రచనలను తెలిపి, వాటిని సంక్షిప్తంగా వివరించండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మచే రచించబడిన “చైతన్యలహరి” అనుసంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి జీవితం, రచనలు, కవితాగుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు.

1. బసవపురాణం
2. పండితారాధ్య చరిత్ర
3. అనుభవసారం
4. చతుర్వేద సారము
5. సోమనాథ భాష్యం
6. రుద్రభాష్యం
7. బసవరగడ
8. గంగోత్పత్తి రగడ
9. శ్రీ బసవారాధ్య రగడ
10. సద్గురు రగడ
11. చెన్నముల్లు సీసములు
12. నమస్కార గద్య
13. వృషాధిప శతకము
14. అక్షరాంక గద్య అష్టకం
15. పంచప్రకార గద్య
16. పంచకము
17. ఉదాహరణ యుగములు మొదలగునవి వాటిలో ముఖ్యమైనవి.

1. అనుభవసారం : సోమనాథుని మొదటి రచన ఇది. దీనిలో 245 పద్యాలున్నాయి. ఈ కావ్యంలో భక్తి స్వరూపం, లక్షణాలు, పూజా విధానం, జంగమ సేవ మొదలగు వీరశైవ ధర్మములు చెప్పబడ్డాయి.

2. బసవపురాణం : సోమన శ్రీశైల క్షేత్రమును దర్శించి భక్తి పారవశ్యముతో వ్రాసిన గ్రంథము ఇది. దీనిలో నందికేశ్వరుని అవతారుడైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటు దీనిలో 75 గురు భక్తుల కథలున్నాయి. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూడికథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలున్నాయి.

3. లఘుకృతులు : సోమనాథుడు శివ స్తుతిపరమైన కొన్ని లఘుకృతులను రచించాడు. వాటిలో 4 గద్యలు,
1. రగడ,
2. ఉదాహరణములు 11 పంచకములు 2 అష్టకములు 1 స్తవము ఉన్నాయి.

4. వృషాధిపశతకం : బసవేశ్వరుని శివస్వరూపునిగా భావించి ఆయనపై 108 చంపక ఉత్పలమాలలతో రచించిన శతకమిది. సోమనాథుని అష్టభాసా ప్రావీణ్యమునకు ఇది ఒక ఉదాహరణ.

5. చమర్వేదసారం: దీనిలో ‘బసవలింగ’ మకుటము గల 357 సీసపద్యాలున్నాయి. శైవమునకు సంబంధించిన భక్తి విషయాలు ఇందులో ఉన్నాయి.

6. చెన్నమల్లు సీసములు : ఇది 32 సీసద్యాలు గల చిన్న కృతి.

7. రుద్రభాష్యం : ఇది లభ్యం కాలేదు.

8. సోమనాథ భాష్యం : ఇది ఒక సంస్కృత గ్రంథం. 25 ప్రకరణములున్నాయి. దీనినే బసవరాజీయం అంటారు. వీరశైవమతం తాంత్రికం కాదని శుద్ధవైదికమని నిరూపించటానికి ఈ గ్రంథాన్ని రచించాడు.

9. పండితారాధ్య చరిత్రము : ఇది సోమనాథుని చివరికృతి, ద్విపద రచించబడిన ప్రౌఢ పురాణ కావ్యం. దీనిలో మల్లికార్జున పండితారాధ్యుని పుణ్యచరిత్రతోపాటుగా పలువురి శివ భక్తులు చరిత్రలువ్రాయబడ్డాయి. ఇది 12 వేల ద్విపదలతో రాయబడిన కావ్యం. సోమన కావ్యకళా విశిష్టతను, బహుభాషా పాండిత్యమును, సంగీత, నాట్య రసవాద, వైద్య శాస్త్రాల పరిజ్ఞానమును లోకానుభవంతో వ్రాయబడ్డాయి.

భాషలో ద్విపద రచనలో పాల్కురికి తరువాత తరాల వారికి మార్గదర్శకుడయ్యాడు. పోత భక్తి పారవశ్యానికి శ్రీనాథుని నుడికారమునకు, కృష్ణదేవరాయల వర్ణనాపటిమకు ఇతరుల విశిష్ట రచనలకు సోమనాథుని ద్విపదలైన బసవపురాణం పండితారాధ్య చరిత్రలే మార్గదర్శకాలని పండితుల అభిప్రాయం.

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

ప్రశ్న 2.
రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన విద్యావ్యవస్థలను వివరించండి ?
జవాబు:
‘రాజాబహదూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహదూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వెంకట రామారెడ్డి అందరి మన్ననలను పొందిన వ్యక్తి. బహుభాషావేత్త. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. ఆయనకు విద్యపట్ల శ్రద్ధగలవారు. పలు విద్యాసంస్థలను స్థాపించి ప్రజాసేవ చేశారు.

1. బాలికల ఉన్నత పాఠశాల : మొత్తం హైదరాబాదు రాష్ట్రంలో మన బాలికలకు మాతృభాషా బోధనకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవటం దురదృష్టకరమని రెడ్డిగారు భావించారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతుంది. కావున హైదరాబాదులో ఒక మాతృభాషా పాఠశాలను బాలికల కోసం నిర్మించాలని తలచి స్రీ విద్యా ప్రోత్సాహకులు మాడపాటి హనుమంతరావు గారిని కలిసి బాలికల పాఠశాలను నిర్మించారు. ఇది బొంబాయిలో ‘కార్వే’ మహాశయులు స్థాపించిన మహిళావిద్యాపీఠంతో జత చేశారు. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.

2. పరోపకారిణీ బాలికా పాఠశాల: హైదరాబాద్లో రామారెడ్డిగారు స్థాపించిన మరొక పాఠశాల పరోపకారిణీ బాలికా పాఠశాల. ఇది ప్రైమరీ తరగతి వరకు ఉన్నది. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.

3. ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల : ఈ పాఠశాలను 1945లో స్థాపించారు. దీని పాలక వర్గ అధ్యక్షులు రామారెడ్డిగారే! దీనిలో తెలుగు బాలురకే ప్రవేశముంది. ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలు లేకపోవటంతో అంతగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు.

4. బాలికా పాఠశాల (గొల్లఖిడ్కి): హైదరాబాదు గొల్లఖిడ్కిలో ఒక ఆంధ్రబాలికా పాఠశాలను ప్రజాసేవకులు కొందరు స్థాపించారు. దీని బాధ్యతను కూడా రెడ్డిగారే స్వీకరించారు.

5. పరోపకారిణీ బాలికా పాఠశాల : సికిందరాబాదు నగరంలో కీ॥శే॥ సీతమ్మగారు ఆ కాలంలో ఉండేవారు. ఆమె తన జీవిషాన్ని ధారపోసి ఒక మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాల అభివృద్ధికి రెడ్డిగారు సహాయపడ్డారు.

6. ఆంధ్రవిద్యాలయం : హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువు చెప్పుటకు ఒక్క మాధ్యమిక పాఠశాల కూడా లేదు. 1931లో దేవరకొండ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజాబహదూర్ వెంకట రామరెడ్డిగారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఎలాగైనా ఒక పాఠశాలను నిర్మించాలని తీర్మానం చేశారు. అది చివరకు సెప్టెంబరు1, 1944కు కానీ సానుకూలం కాలేదు. ఆ తరువాత అది 1947 నాటికి రెడ్డిగారి చలవతో ఉన్నత పాఠశాలగా ఎదిగింది.

ఇలా రాజాబహద్దూర్ రామారెడ్డిగారు విద్యపట్ల మిక్కిలి ఆసక్తిని కనపరచి, తెలుగు మాధ్యమంలో బాలికలు చదువు కోవటానికి పాఠశాలలను స్థాపించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులయ్యారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది ?
జవాబు:
‘గొల్లరామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్ల రామవ్వ – మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటకాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్

తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను, పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత.

గొల్లరామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయం భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్నుకాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు. నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గిట్లెందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల పండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లలు పిసుక్కచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడితే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు. అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఊ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊనడూ అంది”. “చెయ్యసి పండుకో ‘పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు మా పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచంమీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతవే” అన్నాడు.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఎదుర్కున్న సమస్యలను చర్చించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగము డా. ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడిన. “విసుర్రాయి” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి ఆర్థిక స్వాలంబనకు చాలా ప్రాధాన్యత ఉందనే వాస్తవాన్ని వివరిస్తుంది. యువత చిన్న విషయానికే కుంగిపోయి, అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి ప్రతికూల ధోరణులను ఆ కథ నిరసిమైంది. ఆత్మ విశ్వాసంలో దేన్నైనా సాధించవచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మా నాన్నలకు స్నేహలత రాసినలేఖ పై విషయాలను రుజువుచేస్తుంది.

స్నేహలత తన పెళ్ళి విషయముపై తన తల్లిదండ్రులు దిగులు పెట్టుకున్నారని తెలుసుకుంది. వారిని ఓదార్చుతూ వర్తమానకాలంలోని యువతులకు ధైర్యాన్నిస్తూ వ్రాసిన లేఖ స్నేహలతాదేవి లేఖ. అమ్మ నాకు పెళ్ళికాలేదని మీరు చింతపెట్టుకున్నారు. మిమ్మల్నిచూసి నాకు మొదట్లో చింతగానే ఉంది.

ఏకాంతంగా ఎన్నో సార్లు ఏడ్చాను కూడా? పెళ్ళిచూపులకు వచ్చిన ప్రతి మగాడు నన్ను కాదనటం వల్ల నాకు న్యూనతా భావం కలిగింది. నాలో నాకే ఎన్నో లోపాలు కన్పించడం మొదలుపెట్టాయి. పెళ్ళిచూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. పెళ్ళి చూపులనే తతంగం ఆడదానికి జరిగే ఎన్నో అవమానాలలో ఒకటిగా స్నేహలత భావించింది.

నిజంగా పెళ్ళి చూపులకు వచ్చిన వారిలో చాలా మంది నాకు నచ్చలేదు. కాని ఆ మాటలను చెప్పే హక్కునాకు లేదని మీరు, సమాజం నాకు నేర్పారు. అందుకే నోరు మూసుకున్నాను. నేను పెళ్ళి చూపులకు వచ్చిన వారికి వచ్చాకపోవటానికి నా అందం కాదు ప్రమాణం అని నాకు తెలిసింది. వారికి నచ్చంది మీరిచ్చే కట్నకానుకలు నేను చదువకున్నాను. వచ్చేవాడు ఏమంటాడోనని నన్ను ఉద్యోగ ప్రయత్నం మీరు చేయనీయలేదు.

నేను మరీ అంత అందగత్తెను కాకున్నా వికారంగా మాత్రం లేను కదా! ఎంతోమంది పెళ్ళిచూపులకు వచ్చారు కదా? ఒక్కరన్నా నా చదువు సంస్కారం గురించి అడిగారా! కట్న కానుకలను గురించి బేరాలాడటమే సరిపెట్టారు. ఈ సమాజంలో ఆచారాలు కట్టుబాట్లు ఆడదాన్ని బేరమాడే అంగట్లో వస్తువుగా చేశాయి. అమ్ముడు పోయేది వరుడు అవమానాల పాలయ్యేది వధువు ఇదేమి విడ్డూరం. ఇదేమి సంస్కారం.

వరకట్న వ్యతిరేకంగా పొసెషన్లు, నినాదాలు చేసి రోడ్లమీద తిరిగితే ప్రయోజనం ఉండదు, మానవ మనస్తత్వాలు మారాలి. స్త్రీలలో ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం రావాలి. స్త్రీలు తమ జీవితాలను తమకు ఇష్టమైన రీతిలో మలచు కోవటానికి ప్రయత్నించాలి. ఒత్తిడితో ధైర్యాన్ని కోల్పోయి ప్రాణత్యాగం చేయవద్దని కోరింది. తనకు ఎదురైన సమస్యలు నేటి సమాజంలోని ప్రతి స్త్రీ ఎదుర్కోంటుందని వారిందరికి ధైర్యం నూరిపోసింది స్నేహలతాదేవి.

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

ప్రశ్న 3.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి ?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది.

కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.

పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అందర్నీ అత్తా, అక్కడ, బావా, అత్తా, మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మధ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే!

ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఇందుకు ఒక ఉదాహరణ.
“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోందుబాబు అంటే

“బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.

అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్దీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.

“మర్దీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.

ప్రశ్న 4.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలుపేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగలు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి.ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది. ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాల పేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు.

ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటుచూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయికూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. – నీ కింత పొగరుండీ మాకెంతుండాల్నే? ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకన్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే టి.సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు. “ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని -డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి గర్భిణి నుండి ‘ సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
సజ్జనుల జేయులేడెంత చతురుడైన
జవాబు:
పరిచయం : శేషప్ప కవిచే రచింపబడిన నృసింహశతకం నుండి గ్రహించిన పద్యభాగం.
సందర్భము : క్రూరజీవులనైన అదుపు చేయవచ్చుగానీ, దుర్మార్గుల మనసును ఎంతటి తెలివిగల వాడైనను, మార్చలేడని కవి చెబుతున్న సందర్భంలోనిది.
భావము : భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

ప్రశ్న 2.
సఖ్యము దానొడఁ గూడ నేర్చునే !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం : స్నేహపూర్వకంగా తనతో మాట్లాడిన ద్రోణుడిని అవమానిస్తూ ద్రుపదుడు పలికి సందర్భంలోనిది.
భావం : ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

ప్రశ్న 3.
అంబరాన్ని చుంబించాలి మనం
జవాబు:
పరిచయం : ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవితా సంపుటి గ్రంథం నుండి గ్రహిబచబడినది.
సందర్భము : మానవుడు అభ్యుదయ భావనలతో భవిష్యుత్తుపై ఆశలతో బ్రతకాలని చెప్పిన సందర్భము లోనిది.
భావము : మానవులంతా ఆశాపాశాలతో బ్రతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనంతమైన ఈ ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ మానవులంతా సోదర భావంతో మెలగాలని ఇందలి భావం.

ప్రశ్న 4.
వెనక్కు నడిచేవారిని వెక్కిరించే కోర్కిలేదు.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, నా పేరు ప్రజాకోటి అను పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను కవితా ఖండికలోనిది.
సందర్భము : ప్రతికాలాలను గురించి కవి తెలియచేయు సందర్భంలోనిది.
భావము : గతించిన కాలమే జీవితం అనుకుని వర్తమానాన్ని నిందిస్తూన్న వారిని పరిహాసం చేసే కోరిక తనకు లేదని ఇందలి భావం.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
కుచేలుడి దారిద్ర్యాన్ని వర్ణించండి.
జవాబు:
కుచేలుడు అతని భార్యాపిల్లలు ఆకలి బాధతో కృశించిపోయారు. కుచేలుడు పేదరికంలో చిక్కి శల్యమైన శరీర అవయవములు కలిగి ఉన్నాడు. చినిగిన బట్టలు ధరించాడు. మనసులో శ్రీకృష్ణుడు సహాయం చేస్తాడనే గొప్ప ఆశతో ఉండి, చూడగానే నవ్వు పుట్టించే వాడుగా ఉన్నాడు. చినిగిన వస్త్రాన్ని ధరించి తన మిత్రుడైన శ్రీకృష్ణుని చూసి తొట్రుపాటుతో దూరంగా నిలబడ్డాడు అని కుచేలుని దారిద్య్ర స్థితిని వర్ణించాడు.

ప్రశ్న 2.
దేహ తత్త్వాన్ని గురించి ఇద్దాసు ఏమి చెప్తున్నాడు?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఏడ చూసినా ఏమీ లేదు. అంతామిథ్య. ఎక్కడ వెదకినా ఏమీ కన్పించదు. అంతాశూన్యం. అజ్ఞానంలో ఉన్నంత కాలం చీకటే కన్పిస్తుంది. అజ్ఞానాన్ని వదలి గురుని నమ్మి ఆయనను అనుసరిస్తే ఫలితం ఉంటుంది. మానవులు జీడికంటి వంటి నేత్రాలను తెరచుకోవాలి. ఆ జ్ఞాన నేత్రాలు, ఆ అగ్నినేత్రాలు మన దేహం తత్వాన్ని తెలియచేస్తాయి. అపుడు గురుని ద్వారా ముక్తి మూలాలను తెలుసుకోగలమని దున్న ఇద్దాసు వివరించాడు.

ప్రశ్న 3.
బలిష్ఠునికే బంధుసహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు?
జవాబు:
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

ప్రశ్న 4.
ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు?
జవాబు:
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు. ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన విద్యావ్యవస్థలను వివరించండి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే · రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.
భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో . ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే ! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే ! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు. తాము సంపాదించిన ధనములో ఎంతో కొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.
కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.

ప్రశ్న 2.
‘బసవపురాణం’ కావ్యం గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ రచించిన ఎచైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడింది.
బసవపురాణం పాల్కురికి ద్విపద రచన. ఆయన ఒకనాడు శ్రీశైల క్షేత్రమును దర్శించి అక్కడ భక్తుల ద్వారా బసవేశ్వరుని దివ్య చరితమును విని బసవపురాణాన్ని రచించాడు. ఈ ద్విపద కావ్యంలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటుగా ఈ కావ్యంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి. ఈ కావ్యమందు సోమనాథుని కథా కథననైపుణ్యం కన్పిస్తుంది. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలు చక్కగా వర్ణించబడ్డాయి.
సోమనాథుని రచనా రీతిలో అంత్యానుప్రాసల ప్రభావం అధికం. ఇది పోతన లోని అంత్య ప్రాసరచనకు కారణమైందని చెప్పవచ్చు. ద్విపద రచనలలో సోమనాథునికి మంచిపేరు తెచ్చిన కావ్యం బసవపురాణం.

ప్రశ్న 3.
అన్నదాన ప్రాముఖ్యతను తెలియజేయండి.
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో అన్నదాన మహిమను వర్ణించారు.
దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పది. అది మానవుల ఆకలి బాధను తీరుస్తుంది. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తూంటే చూసి చూడనట్లుండటం మానవత్వం కాదు అని మన ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది. తైత్తిరీయ ఉపనిషత్తులో, అన్నాన్ని ఎక్కువగా వండాలని ఆకలితో అలమటించే దీనులకు అన్నం పెట్టాలని అలా పెట్టనివాడు నరకానికి పోతాడని వివరించబడింది. అలా అన్నార్తులకు అన్నం పెట్టనివాడు కేవలం పాపాన్నే భుజిస్తాడని చెప్పింది.
ఎవరు తనకోసం మాత్రమే వండుకుంటాడో అంటే ఎవరు అన్నార్తుల బాధను పట్టించుకోకుండా తన పొట్టమాత్రమే చూసుకుంటాడో వాడు నరకాన్ని పొందుతాడని పాపాన్ని ప్రోగుచేసుకుంటాడని స్మృతులు వివరించాయి. భాగవతంలో కూడా గృహస్థ ధర్మాన్ని వివరిస్తూ తన కడుపు నింపుకోవడానికి అవసరమైన ధనం మీదే మానవునకు అధికారం ఉంటుంది. మిగిలినది అన్నార్తులకు వినియోగించాలని చెప్పింది. ఇలా అన్నదాన ప్రాముఖ్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు వివరించాయి.

ప్రశ్న 4.
బొడ్డెమ్మ ఆటను గురించి రాయండి.
జవాబు:
‘బతుకమ్మపండుగ’ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి స్వీకరించబడింది.
బొడ్డెమ్మఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగం బతుకమ్మతోపాటు ఎర్రమట్టిముద్దను త్రిభుజాకారంలో తయారుచేసి దాని వెంపలిచెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేస్తారు. దీనిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది. బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంలో మలచటం, పూజించటం భూమిని స్త్రీ మూర్తిగా భావించి అర్చింటయే ! ఇది ఆటవికులు భూదేవిని పూజిస్తూ చేసే నాట్యాలలో వలే విందులు వినోదాలతో పాటలతో జరుపబడుమంది. భూదేవికి ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించటం, అడవిపూలైన తంగేడు, ముత్యాలపూలతో పూజించటం ఆటవికుల నమ్మకాల ప్రభావంగా భావించాలి.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
నన్నయభట్టు గురించి తెలపండి?
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనా శోభితుడు. ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలిగినవాడు. రాజరాజు కోరికపై వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. రెండున్నర పర్వముల వరకే నన్నయ్య భారతరచన సాగింది. ఆంధ్రశబ్ధ చింతామణి, ఇంద్రవిజయం, లక్షణసార వంటి ఇతర గ్రంథాలు రచించాడు.

ప్రశ్న 2.
ఏనుగు లక్ష్మణకవిని గురించి తెలపండి
జవాబు:
భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతం వంటి మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.

ప్రశ్న 3.
గడియారం రామకృష్ణ శర్మ సాహిత్యసేవను తెలుపండి.
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ సుబ్బమ్మ జ్వాలాపతి దంపతులకు మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆయన జీవితమంతా మహబూబ్నగర్ జిల్లా అలంపురంలోనే గడిచింది. ఈయన తిరుపతి వేంకటకవులు శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి వద్ద విద్యలనభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల సాహిత్యాలలో పండితుడయ్యాడు. కవిగా, పండితునిగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకర్తగా క్రియాశీలక పాత్రను పోషించాడు.

నిజాం రాష్ట్రంలో తెలుగు భాషను చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్ర మహాసభల ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణమంతా పర్యటించి ‘భాగ్యనగర్ రేడియో’ ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. బాలవితంతవును వివాహమాడటంతోపాటు వితంతు వివాహాలు జరిపించాడు. ‘సుజాత’ పత్రికను ప్రారంభించారు. మెకంజీ కైఫీయత్తులను వ్రాయించారు. తెలంగాణ శాసనాలు’ రెండవ సంపుటిని తీసుకువచ్చారు. కన్నడ సాహిత్య చరిత్రను రాశారు. కన్నడకవి రన్నడు రాసిన ‘గదాయుద్ధాన్ని’ వెలుగునకు అనువదించినాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యుల చరిత్రలను రాశాడు. వీరి ఆత్మకథ ‘శతపత్రం’ 2006లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకుంది.

ప్రశ్న 4.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి.
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళావారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభావము అనే లఘు కావ్యం, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్య దానము, విశ్వామిత్ర మొదలుగునవి ఉన్నాయి.

హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవితా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.

అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
దివ్యమైన ధనం ఏది?
జవాబు:
విద్య

ప్రశ్న 2.
‘మై గరీబు’ నవలనను ఎవరికి అంకితమిచ్చాడు?
జవాబు:
భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అంకితమిచ్చాడు.

ప్రశ్న 3.
అశ్వత్థామ ఎవరి కుమారుడు?
జవాబు:
ద్రోణుడు

ప్రశ్న 4.
దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పారేయాలని ఆకాంక్షించాడు?
జవాబు:
“అఖాదం”లో పడవేయాలని ఆకాంక్షించాడు.

ప్రశ్న 5.
కనురెప్పపాటులో పోయేది ఏమిటి?
జవాబు:
ప్రాణం, శరీరతత్త్వం.

ప్రశ్న 6.
కుచేలుడికి మరోపేరు ఏమిటి ?
జవాబు:
సుధాముడు.

ప్రశ్న 7.
‘పక్షికున్ను’ లక్ష్యంగా ఎవరు బాణం వేశారు.
జవాబు:
అర్జునుడు

ప్రశ్న 8.
ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు?
జవాబు:
ధర్మపురి నరసింహస్వామి భజన చేసేవారు

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

ప్రశ్న 1.
ధర్మసింధువు ఏమని ప్రబోధిస్తుంది ?
జవాబు:
బాలురకు వృద్ధులకు అన్నంపెట్టందే భుజింపరాదని ప్రబోధిస్తుంది.

ప్రశ్న 2.
తెలుగులో తొలి విజ్ఞానసర్వస్వంగా ఏ గ్రంథాన్ని పరిగణించారు ?
జవాబు:
తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా పరిగణించిన గ్రంథం పండితారాధ్య చరిత్ర.

ప్రశ్న 3.
బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు ?
జవాబు:
‘తంగేడు’ పూలకు బతుకమ్మ పండుగలలో అగ్రస్థానం ఇస్తారు.

ప్రశ్న 4.
సోమన గురువులెవరు ?
జవాబు:
సోమనకు 4గురు గరువులు. ఒకరు దీక్షాగురువు గురులింగార్యుడు, శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వమనారాధ్యుని మనుమడు, సాహిత్యగురువు కరస్థలి విశ్వనాథయ్య.

ప్రశ్న 5.
సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఏ గ్రంథం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
జవాబు:
1948లో రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అనే గ్రంథానికి.

ప్రశ్న 6.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 7.
‘కులాసా’ తెలుగు పదానికి ఉర్దూరూపం ?
జవాబు:
కులాసా తెలుగు పదానికి ఉర్దూరూపం ‘ఖులాసా’

ప్రశ్న 8.
ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృతానువాద రచనలేవి ?
జవాబు:
డా.సి. నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి, వేమన శతకం, నృసింహ శతకాలు శ్రీహరి సంస్కృతాలనువాదాలు.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
కళాశాల నుండి వెళ్ళిన విహారయాత్ర గురించి తల్లిదండ్రులకు లేఖ రాయండి.
జవాబు:

వరంగల్,
10-01-2023.

పూజ్యులైన అమ్మానాన్నలకు నమస్కారములు.

నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమమే అని తలుస్తున్నాను. నేను బాగా చదువుతున్నాను. ఇక్కడ మాకు ఉపన్యాసకులు చక్కగా బోధిస్తున్నారు. పాఠ్యాంశాలు పూర్తి అయినవి.

ఇటీవల మా కళాశాల నుండి హైదరాబాదుకు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లి వచ్చాం. నగరంలోగల సాలార్జంగ్ మ్యూజియంనందున్న పురాతన వస్తువులు, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో నేను ఇంతవరకు చూడని ఎన్నో జంతువులను చూశాను.

బిర్లా మందిర్ అద్భుతమైన పాలరాతి కట్టడం, బిర్లా ప్లానిటోరియం మరియు సైన్స్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి నన్ను ఎంతగానో ఆకర్షించాయి.

ఈ విజ్ఞాన, విహారయాత్రకు వెళ్ళడం వలన ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవ డంతో పాటు, ఎంతో విజ్ఞానం పొందడం జరిగింది. ఈ విజ్ఞాన, విహారయాత్ర నా భవిష్యత్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి విషయాలు ఇంటికి వచ్చిన తరువాత వివరిస్తాను. తాతయ్యకు, నానమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి.

ఇట్లు
మీ కుమారుడు
XXXX

చిరునామా :
జి. రాజేశ్వర్
ఇంటి నెంబర్ 1-3-178,
ఎ.యన్.రెడ్డి కాలని, నిర్మల్,
పిన్ నం. 504106

ప్రశ్న 2.
బదిలీ పత్రము (టి.సి) కొరకు కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ రాయండి.
జవాబు:

కరీంనగర్,
15-01-2023.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్, నమస్కారాలు.

విషయము : టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.
కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

ఇట్ల
మీ విద్యార్థి
XXXX

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) పాలికిఁబోవ
జవాబు:
పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు

2) కురియకుండునే
జవాబు:
కురియకుండునే
కురియక + ఉండునే = ఉకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

3) అప్పద్మనేత్రం
జవాబు:
అప్పద్మనేత్రం : ఆ + పద్మనేత్రు = త్రిక సంధి

సూత్రం :

  1. ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికమనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమగును.

4) సొమ్మయా
జవాబు:
సొమ్మయా : సొమ్ము + అయా – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

5) కానిదెవడు
జవాబు:
కానిదెవడు : కానిది + ఎవడు = కానిదెవడు – ఇత్వసంథి/ఇకారసంథి సూత్రము : ఏ. మ్యాదులయిత్తనకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదులనగా ఏమి, మరి,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము.

6) లేదెన్నటికి
జవాబు:
లేదెన్నటికి : లేదు + ఎన్నటికి – లేదెన్నటికి – ఉకారసంధి/ఉత్వసంధి సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.

7) భ్రమలన్నీ
జవాబు:
భ్రమలన్నీ భ్రమలు + అన్ని = ఉకార సంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

8) దివ్యాంబర
జవాబు:
దివ్యాంబర : దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) బసవగురుడు
జవాబు:
బసవగురుడు – బసవ అనుపేరుగల గురుడు – సంభావనా పూర్వపద కర్మధారయము

2) యమపాశము
జవాబు:
యమపాశము – యముని యొక్క పాశము – షష్ఠీతత్పురుష సమాసం

3) ధనుర్విద్యాకౌశలం
జవాబు:
ధనుర్విద్యాకౌశలం – ధనుర్విద్యయందుకౌశలం – సప్తమీ తత్పురుష సమాసం

4) చూతఫలము
జవాబు:
చూతఫలము – చూతము (మామిడి) అనెడి ఫలము రూపక సమాసము

5) మనోజ్ఞభావి
జవాబు:
మనోజ్ఞభావి మనోజ్ఞమైన భావి – విశేషణ పూర్వపద కర్మధారయము

6) కరకంకణ రవంబు
జవాబు:
కరకంకణ రవంబు – కరకంకణముల యొక్క రవంబులు – షష్ఠీతత్పురుష సమాసము

7) ఉదధి నీరు
జవాబు:
ఉదధి నీరు – ఉదధి యందలి నీరు – సప్తమీ తత్పురుష సమాసం

8) అస్త్రశస్త్రాలు
జవాబు:
అస్త్రశస్త్రాలు – అస్త్రములు మరియు శస్త్రములు = ద్వంద్వసమాసం

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. యువత జీవన నైపుణ్యాలు
జవాబు:
ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం. ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు.

యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు.
“We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది.

విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4 భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు.

మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఎక్కడో మరొకదారి మన కోసం. తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత గురించి విమర్శన గోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

2. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి . మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు. ఇదే పెద్ద ఆనందం.. ! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్

కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు. అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది.

ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం.

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు.

సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం.

అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం. మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

3. జాతీయవిపత్తులు
జవాబు:
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.
విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు.

విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు.

విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్ 19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి.

విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్వాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 1 with Solutions

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Imagination rules the world.
జవాబు:
ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది.

2. Language is the dress of the thought.
జవాబు:
ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష.

3. Learn as if you live forever.
జవాబు:
ఎప్పటికీ జీవిస్తావన్నట్లుగానే నేర్చుకోవాలి.

4. Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.

5. Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనావెయ్యద్దు.

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిన ప్రక్రియ నవల. ఆంగ్లంలో ‘Novel’ అనే పదంనుండి ‘నవల’ పుట్టింది. అయితే నవల పదానికి మూలం సంస్కృతంలో కనిపిస్తుందని కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి ‘నవాన్ విశేషాలాతి గృష్ణాతీతి నవలా’ అంటూ ‘కొత్త విశేషాలు తెలిపేది నవల’గా ‘నిర్వచించాడు. 1872 కాలంలో నవలను ‘వచన ప్రబంధము’ అనే పేరుతో పిలుచుకున్నారు. దీనికి సమర్ధనగా కందుకూరి వీరేశలింగం ‘తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితిని’ అని ప్రకటించుకున్నాడు.

‘తెలుగులో తొలి నవల ఏది?” అనే విషయంలో పరిశోధకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. 1872లో గోపాలకృష్ణమశెట్టి ‘శ్రీరంగరాజ చరిత్రము’ నవల వెలువడింది. ‘శ్రీరంగరాజ చరిత్రము’లో నవలా లక్షణములు లేవనే అభిప్రాయాలతో ‘రాజశేఖర చరిత్ర’నే తొలి నవలగా అందరూ అంగీకరించారు. ఈ నవలకు. ‘వివేకచంద్రిక’ అనే మరో పేరు ఉంది. ఇది ఆంగ్లంలో అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’ అనే ప్రసిద్ధ నవలకు అనుకరణ.

రచనా కాలంలోని ‘వాస్తవికాలనే జీవితాచార వ్యవహారాలను చిత్రించేది నవల’. అని ‘తెలుగు నవలా పరిణామం’ గ్రంథంలో బొడ్డపాటి కుటుంబరావు, ‘వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సాంఘిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ నవల’ అని ఆర్.ఎస్. సుదర్శనం నిర్వచించారు. కథ సంఘటన చుట్టు తిరిగితే, నవల అనేక జీవితాల చుట్టు తిరుగుతుంది. కథకు సంక్షిప్తత ప్రాణమయితే, నవల విస్తృతమైన వివరణలతో నడుస్తుంది. కథ, కథావస్తువు, ఇతివృత్త నిర్వహణ, పాత్రలు, పాత్రోచిత సంభాషణలు, సంఘటనలు, సన్నివేశం, నేపథ్య చిత్రణ, మంచి ఎత్తుగడ, అర్థవంతమైన ముగింపు మొదలైన లక్షణాలతో, పద్ధతులతో నవల పఠితల్ని ఆకర్షితుల్ని చేస్తుంది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి నవలను ఏవిధంగా నిర్వచించాడు?
జవాబు:
విద్యావాన్ విశేషాన్వాతి గృష్ణాతీతి నవలా అంటూ కొత్త విశేషాలు తెలిసేది నవలగా నిర్వచించారు.

ప్రశ్న 2.
‘మొదటి వచన ప్రబంధము నేనే రాసానని’ ఎవరన్నారు?
జవాబు:
కందుకూరి విరేశలింగం

ప్రశ్న 3.
తెలుగులో తొలి నవల ఏది?
జవాబు:
రాజశేఖర్ చరిత్ర

ప్రశ్న 4.
‘తెలుగు నవలా పరిణామం ‘గ్రంథకర్త ఎవరు?
జవాబు:
ఆర్.ఎస్ సుదర్శనం

ప్రశ్న 5.
నవల దేనిచుట్టూ తిరుగుతుంది.
జవాబు:
అనేక జీవితాల

Leave a Comment