TS Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

Access to a variety of TS Inter 2nd Year Telugu Model Papers Set 2 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. అవమతిలేదు నీయెద రహస్యపు వేళలనైన శైవవై
ష్ణవములపైన దానికిల సత్తులసీద్రుమపాళి బిల్వప
త్రవనము తీరదేశముల దాల్చుచు తిక్కన గంటమీను స
త్కవితను బోలి పారెదపు తాత్వికత నిశివకేశవాఢ్యవై.
జవాబు:
ప్రతిపదార్థం :

రహస్యము + వేళలన్ + ఐనన్ = తెలియని సమయంలో కూడా (ప్రాచీన కాలంలో)
శైవ = శివునికి సంబంధించిన
వైష్ణవము = విష్ణుకు సంబంధించిన
ల పైన = అంశాలపై
దానికి = ఆ మతాలకు సంబంధించి
ఇలన్ = ఈ భూమిపై
నీ యెద = నీ మనసులో
అవమతిలేదు = అనాసక్తత లేదు
సత్ + తులసీ = మంచి తులసి
దుమపాళి = చెట్ల వరుస
బిల్వపత్ర వనము = మారేడు పత్ర వృక్షాల సమూహంతో
తీర దేశముల = నీ రెండు అంచులు,
తాల్చుచు = నింపి ఉంచుతూ
తిక్కన = కవిబ్రహ్మ తిక్కన
గంటము + ఈను = కాలము ఇచ్చిన
సత్కవితను బోలి = మంచి కవిత తీరుగా
శివ = శివుని
కేశవ = నారాయణుని
తాత్వికత = తత్వాలతో
ఆఢ్యపై = సంపన్నురాలవై
పారెదువు = ప్రవహిస్తావు

తాత్పర్యం : తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

2. ఎవడి తొందర వాడిది.
ఎవరి పనులు వారివి;
రొప్పుకుంటూ, రోజుకుంటూ – .
అంతా పరుగెత్తే వాళ్ళే !
త్రొక్కుకుంటూ, త్రోసుకుంటూ –
అంతా ఎక్కివెళ్లే వాళ్లే !
జవాబు:
ప్రతిపదార్థం:

ఎవడి తొందర వాడిది = ఈ ప్రజల్లో ఎవరి వేగిరపాటు వాళ్లకు ఉంది
ఎవరి పనులు వారివి = ఎవరి పనులు వారికి ఉన్నాయి
రొప్పుకుంటూ = వేగంగా నడవడం వల్ల వచ్చే అధిక శ్వాస
రోజుకుంటూ = ఆయాసపడుతూ (ఇష్టం లేకున్నా)
అంతా పరుగెత్తే వాళ్ళే = అందరూ వేగంగా వెళ్ళే వారే
త్రొక్కుకుంటూ = ఒకరినొకరు తొక్కుతూ (బలవంతులు బలహీనులను తొక్కుతున్నారు)
త్రోసుకుంటూ = మరొకరిని తోసేస్తూ (అభివృద్ధి మార్గంలో అడొచ్చిన వారిని తోసేస్తున్నారు)
అంతా ఎక్కివెళ్లే వాళ్లే ! = అందరూ ఎదో ఒక వాహనం ఎక్కి వెళ్ళే వారే (అందరూ. ఇతరులపై అధికారాన్ని ప్రదర్శించాలని ఆలోచించే వారే)

తాత్పర్యం : ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి.. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే.. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే.

TS Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

II. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘భగీరథ ప్రయత్నం’ పాఠ్య సారాంశం రాయండి.
జవాబు:
సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసలరాజు భగీరథుడు. తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయిన తీరును మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. వారికి మోక్షం కలిగించాలని నిశ్చయించు కున్నాడు. భగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, గోకర్ణం వెళ్లి, అక్కడ వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకో అంటే భగీరథుడు సంతోషించి, సాగరుల భస్మరాశులపై దేవనదీ నీటిని ప్రవహింప చేయమని మొదటి వరంగా, తన వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని అనుగ్రహించమని రెండవ వరంగా కోరాడు.

అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. కానీ దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే భూమండలం భరించలేదు. కావున శివున్ని మెప్పిస్తే దేవనదిని ఆయన భరిస్తాడు అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు.

ఆరాజు తపస్సుకు మెచ్చిన శివుడు దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై భరిస్తాను. అని చెప్పగా భగీరథుడు విజయం సాధించానని సంతోషించాడు. శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలని మనస్సులో అనుకున్నాడు.

దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా శబ్దం చేస్తూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉండి పోయింది.

దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగు తుంది. అని దేవతలు వేడుకొనగా శివుడు పరమ సంతోషంతో ఆ గంగానదిని సముద్రంలోకి వదిలాడు.

శివుని జడలనుండి గంగానది ఏడు పాయలుగా ప్రవహించింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథం ఎక్కి కదిలాడు.

అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందంగా దేవనదీ జలాలలో స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకి మరింత పవిత్రంగా మారిన దేవనదీ జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు అనేకసార్లు ఆనదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్య చకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వం అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది.

భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది. ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసే విధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గానికి చేరుకున్నారు.

బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథునితో “భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అప్పటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆగొప్ప లోకంలో ఉంటావు. గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుందని అన్నాడు.

ప్రశ్న 2.
జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశాన్ని తెలియజేయండి.
జవాబు:
నాయనలారా! వినండి. మీ తాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధను రచించాడు. దీనిలో మానవులకు కావలసిన సందేశాన్ని ఇచ్చాడు. కుమ్మరి చేసిన కుండలన్ని ఎలా అయితే పనికిరావో అలానే మానవులు అందరూ మోక్షాన్ని పొందలేరని చెప్పాడు. కేవలం మర్యాదతో మంచి పనులు చేసినవారే మోక్షాన్ని పొందుతారు. కోపం వల్ల డబ్బు, పరువు, ఆరోగ్యం అన్ని నశిస్తాయి.

కోపం కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని హితవు పలికాడు. ఏళ్ల కాలం ఒక్క తీరుగా గడవదు. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది. కాబట్టి తెలివిగలవారు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోకూడదనే సందేశాన్ని ఇచ్చాడు.

కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక ” లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది.

ఆస్థులు శాశ్వతమని భావించ రాదు. ప్రజలు సంసారంపై గల కోరికను వదిలిపెట్టక, తిండి బట్టలకు అలవాటుపడి మా కులమే గొప్పది అనుకుంటూ గర్వాన్ని ప్రదర్శిస్తారు. అలా ఉంటే ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారని హెచ్చరించాడు.

వేమన, బద్దెన, వీరబ్రహ్మంగారు, ఈశ్వరమ్మ, సిద్ధప్ప, కాళిదాసు, అమర సింహుడు, యాగంటి మొదలైన మహానుభావులు కవికి ఆత్మ బంధువుల వంటివారని చెప్పడం ద్వారా వారిలాగా ప్రజల మేలు కొరకు జీవించాలని సూచించాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపాడు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. జ్ఞానం లేని వానికి ఒక పుస్తకం ఇచ్చి జ్ఞానవంతునిగా చేయగలవాడే నిజమైన జ్ఞాన సంపన్నుడు. ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు.

బలంగా వెయ్యి. సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారని సందేశాన్ని ఇచ్చాడు.

III. కింది వాటిలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
చిందు భాగోతం ప్రదర్శనకు వస్తువుల తయారీని వివరించండి.
జవాబు:
ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : చిందు భాగవత ప్రదర్శనలో అలంకరణకు చాల ప్రాధాన్యత ఉంది. అలంకరణలో భాగంగా వాడే భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం వచ్చేది. పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టకు ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి.

దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం . చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నారు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటి దాకా వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆది, ఆటయినంక సూసుకుంటే అవన్నీ సెమటకు ఉబ్బేవి. ఆ నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు.

ప్రశ్న 2.
సృజనాత్మకత గురించి రచయిత అభిప్రాయం తెలుపండి..
జవాబు:
సృజనాత్మకత గురించి సృజనశీలత అనే పాఠంలో రచయిత ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన అభిప్రాయాలను కింది విధంగా వివరించాడు. సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడి నుండైనా, ఏమూల నుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం అవుతుంది.

సృజనాత్మకత వివిధ కోణాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి.

మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాల కోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలైనా రానివ్వండి. ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియా రూపం పొందని ఆలోచనలు నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని బహిర్గతం చేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది.

పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను రేఖాచిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

IV. కింది వాటిలో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి .ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు. ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాలు ఇంగ్లాండ్లో ఎం.ఇడిలేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.

ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, యుద్ధకాలంలో ఒక నెలలో ఫాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 2.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ?
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్ రూమ్ బుక్ చేశాడు.

కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా ఆడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై * పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు.

చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో. అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.

ప్రశ్న 3.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు:
ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం, ఇడి.లో ప్రవేశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గైడ్గా ఉన్నారు. ఆయన మాథ్స్, సైకాలజీ, చరిత్రలలో ఏం తీసుకుంటావని అడిగారు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే అంశంపై అరవై వేల శబ్దాలతో చరిత్రను రెండు సంవత్సరాలలో రాయాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ ఫ్రాంక్ చాలా ప్రేమగా సలహాలు ఇచ్చేవారు. రాసిన వాటిని ఓపికగా సరిదిద్దే వారు. ముఖ్యంగా ది అనే ఆర్టికల్ వాడటం విషయంలో భారతీయులు పొరపాట్లు చేస్తారని అనేవారు.

ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. వారికి లభించిన మాంసాహార పదార్థాలు, పంది కొవ్వు ఇంటి ఓనర్కు ఇచ్చి శాఖాహార పదార్థాలు తీసుకునే వారు. పని చేయడానికి ఎంప్లాయ్మెంటు ఎక్స్ఛేంజ్లో పేరు నమోదు చేసుకున్నారు. రైల్వే పోర్టులో హమాలిగా పని చేసేవారు. దానిలోనుంచి కొంత మొత్తాన్ని ఇంటికి పంపేవారు. డీన్ అనుమతితో లండన్లో కలోనియల్ సెంటర్లో చేరాడు. కలోనియల్ సెంటర్లో నే నైట్ పోర్టర్గా రాత్రీ పది నుండి ఉదయం నాలుగు వరకు పని చేసేవాడు. సాయంత్రం ఆరు నుండి పది వరకు హోటల్ వెయిటర్ గా పని చేసేవాడు. ఉదయం తొమ్మిది నుండి- సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలో ఐదు నుండి పది వరకు కలోనియల్ సెంటర్లో చదువుకునేవారు. ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు పడుకునేవారు.

హోటల్లో పని చేసేటప్పుడు హైదరాబాద్ ప్రభుత్వపు అధికారి కలిశారు. వారు ప్రధాని నవాబు చత్తారికి చెప్పి వెయ్యి రూపాయలు పౌండ్లు థామస్ కుక్ ద్వారా పంపించారు. తరువాత బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం లభించింది. ఆ’ తరువాత వారికి ఆర్ధిక ఇబ్బందులు రాలేదు. బిబిసిలో ఉద్యోగం వచ్చాక ప్రొఫెసర్ ఫ్రాంక్ను కలిసి వారానికి ఒక రోజు వచ్చి పది గంటల క్లాస్ వినడానికి అనుమతి పొందాడు. మిగతా పనులన్నీ మానేసి బిబిసిలో మాత్రమే పని చేస్తూ శ్రద్ధగా చదువును కొనసాగించాడు. వందల పుస్తకాలు, డాక్యుమెంట్లు చదివి నోట్స్ రాసి ప్రొఫెసర్కు చూపిస్తే ఆయన ప్రేమతో సలహాలు ఇచ్చేవారు. అలా రెండు సంవత్సరాలలో నిజాం రాజ్యంలో విద్య చరిత్ర పేరుతో దక్షిణ భారతదేశ విద్య చరిత్రను రాసి ఎం. ఇడి పూర్తి చేసుకున్నారు.

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు. పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణిం బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి. ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్టెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు.

పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. ‘అతను చాల మంచివాడు. రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు. అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేశాడు. `కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది. ఈ విషయాన్ని సురేశ్ బాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాబై పౌన్ల డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్ లోని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

V. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
నాటనుండి జహ్నునకు కూఁతురగుట
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
అర్థం : ఆ రోజు నుండి జహ్ను మహర్షికి కూతురైనది.
సందర్భం : భగీరథుని వెంట వెళ్తున్న గంగ జహ్ను మహర్షి యాగశాలను ముంచి వేస్తే జహ్నువు గంగను మింగాడు. దేవతల ప్రార్థనతో మళ్ళీ చెవుల నుండి వదిలిన సందర్భంలోనిది.
వ్యాఖ్య : జహ్నువు గంగను తాగేయడాన్ని చూసిన దేవతలందరూ ఆశ్చర్యచకితులై “నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింపచేశావు. గంగాదేవి యొక్క గర్వం అణిచివేశావు. ఇకపై ఈ గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది అని అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజు నుండి గంగ జాహ్నవిగా పిలువబడుతున్నది.

ప్రశ్న 2.
సత్యశుభదాయకమయ్యును దైవముండెడున్
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం’ అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.
సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి సంధి చేసుకోకుంటే దైవం తన పని తాను చేస్తాడని హెచ్చరిస్తున్న సందర్భంలోనిది.
అర్థం : సత్యమునకు శుభం కలిగించటానికి భగవంతుడు ముందుకు వస్తాడు. వివరణ : ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం పాపం చేతను, అబద్దం చేత దరి చేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి ఉన్నా ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి, సత్యమునకు శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

ప్రశ్న 3.
నీదు తీరమున రాచరికమ్ముల నోచిరెందరో
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి, జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే. రాజులుగా అదృష్టాన్ని పొందారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : నీ సమీపంలోనే రాజ్య పాలన చేసే అదృష్టాన్ని పొందారు అని అర్థం. వివరణ : దుందుభి నదీ తీరంలో ఎంతో మంది చాళుక్య రాజులు చాల ఆనందంగా రాజ్య పాలన చేశారని భావం.

ప్రశ్న 4.
నీ గళమే ఒక మధుర కవితల క్యాసెట్
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా! ఓ కోకిలా!! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : నీ గొంతు మధురమైన కవితలతో కూడిన క్యాసెట్ వంటిది అని అర్థం. వ్యాఖ్య : కోకిల ప్రతీ కూతలో కొత్త భావాలు వస్తున్నాయని భావం.

VI. కింది వాటిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్టు దొరికినది
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం..
సందర్భం : ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. కొన్ని షరతులతో సీటు ఇస్తామని వచ్చిన `టెలిగ్రాఫ్ను చూపించి పాస్పోర్ట్ ఇమ్మన్నాడు. పదివేల రూపాయలు చూపించాలి, లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. దానిని మీర్ రజాకు చెప్తే వకీల్ నవరతన్ సహకారంతో సర్టిఫికెట్ ఇప్పించారని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. అర్థం : ఆ సందర్భంలో కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినదని అర్థం.
వ్యాఖ్య : ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు ఉండడానికి సరిపడా డబ్బు ఉందని సర్టిఫికేట్ దొరికిందని భావం.

ప్రశ్న 2.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథని జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం.
వ్యాఖ్య : రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని భావం.

TS Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 3.
పాలముంచినా నీట ముంచినా నీదే భారం
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : అనేక కష్టాల తరువాత విద్యా శాఖనుండి అనుమతి, యూనివర్సిటీలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్ రావడం ఇలా అనేక పనులు అయినాయి. ఓడ బయలుదేరడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉందని థామస్ కుక్ కంపనీ లేఖ పంపింది. కాని అన్నింటికి మించిన డబ్బు సమస్య తీరడం ఎలా అని భగవంతున్ని ప్రార్థించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా దేవునిదే భారం అని అర్థం.
వ్యాఖ్య : పాలల్లో ముంచినా అంటే కష్టాలు తీర్చినా, నీళ్ళల్లో ముంచినా అంటే కష్టాల్లోనే ఉంచిన దేవునిదే బాధ్యత అని భావం. అంతా దైవాదీనం అని అంతరార్థం.

ప్రశ్న 4.
ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను
జవాబు:
రచయిత పరిచయం : పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం : ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలులో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో బషీరుద్దిన్ అనే వారు సంతకం చేశారు. ఇంకొకరి సంతకం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక ముసలి ముస్లిం టీచర్ రేషన్ అందక బాధపడుతూ రామకృష్ణయ్యను ఐదు రూపాల బియ్యం ఇప్పిస్తే జామీను మీద సంతకం చేస్తానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం ఇది.
అర్థం : ఐదు రూపాయల విలువైన బియ్యం ఇప్పిస్తే జామీనుపై సంతకం చేస్తానని అర్థం.
వ్యాఖ్య : వందకు పైన వేతనం వస్తున్నప్పటికీ రేషన్ కారణంగా తమ పిల్లలకు సరైన తిండి పెట్టలేని స్థితి ప్రపంచ యుద్ధ సమయంలో ఉండేది. రామకృష్ణయ్యకు ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని ముసలి ముస్లిం ఉపాధ్యాయుడు ఐదు రూపాయల బియ్యం అడిగాడని భావం.

VII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చానన్నాడు ?
జవాబు:
ధృతరాష్ట్రుని సభలో ఉన్న వారందరూ శ్రద్ధగా వింటుండగా పాండవులు పంపిన సంధి సమాచారాన్ని ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పాడు. “ఓ జననాథ ! నీకు తెలియని విషయాలు ఏమున్నాయి ? ఐనప్పటికీ, భరతవంశం సంతోషించేటట్లు నా ఇరు కుటుంబాల వారికి న్యాయమూ, పరమహితమూ చెప్పటం ఉచితమని నేనిక్కడికి వచ్చాను అని శ్రీకృష్ణుడు అన్నాడు.

ఇందులో జననాథ అనడం ద్వారా కేవలం నీ కొడుకుల గురించి మాత్రమే కాకుండా సమస్త ప్రజల గురించి ఆలోచించాలి అనే విషయాన్ని గుర్తు చేశాడు. నీకు తెలియని విషయాలు ఏమున్నాయి అనడం ద్వారా ‘తన విషయాన్ని ప్రదర్శించాడు. ఇరు కుటుంబాల వారికి అనడం ద్వారా కౌరవ పాండవులు ఇరువురు తనకు కావలసిన వారే అని చెప్పాడు. న్యాయము, పరమ హితము చెప్పడానికి వచ్చాననడం లోకకళ్యాణాన్ని సూచిస్తుంది. కావున శ్రీకృష్ణుడు లోకకళ్యాణం కోసం యుద్ధాన్ని మాన్పించడానికి వచ్చానని చెప్పాడు.

ప్రశ్న 2.
బుద్ధిమంతులు ఎలా ఉంటారు ?
జవాబు:
డబ్బు ఉన్నవారికి కుర్చీలు ఇస్తారు కాని పేదవాడు కూర్చోవడానికి కనీసం చెక్క పీటను కూడా ఇవ్వరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. ఒక్కోసారి దోమ కూడా ఏనుగును ఎత్తుతుంది. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చిన్న చలిచీమలు కూడా పామును చంపడం సాధ్యమే కదా. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది కదా. కాబటి బుద్ధిమంతులు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోరు.

ప్రశ్న 3.
నిసార్ కవి పరిచయం రాయండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే అనే పాఠాన్ని ‘నిసార్ పాట’ అనే ఉద్యమగీతాల సంపుటిలోనుండి గ్రహించారు. దీని రచయిత నిసార్. ఈయన పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహమద్. నిస్సార్ డిసెంబర్ 16, 1964 న జన్మించాడు. జూలై 8, 2020 న కరోనా కారణంగా చనిపోయాడు. ఈయన స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామం. తల్లిదండ్రులు హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్. సుద్దాలలో ప్రాథమిక విద్యను, సీతారాంపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు.

ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం కారణంగా నిసార్ చదువుకు స్వస్తిచెప్పి, ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు చేరుకున్నాడు. దూర విద్య ద్వారా బి.ఏ. డిగ్రీ పట్టా అందుకున్నాడు. తొలితరం ప్రజావాగ్గేయకారుల స్ఫూర్తితో 1986 సం|| నుంచి పాటలు రాయడం ప్రారంభించాడు. “చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు.

ప్రశ్న 4.
దుందుభి ఎక్కడ పుట్టి ఎక్కడెక్కడ పారింది ?
జవాబు:
హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్ట దగ్గర కొంత ఆగుతుంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహిస్తుంది. పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామికి పూజలు చేస్తుంది. అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపుతుంది. ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపుతుంది. శాశ్వతంగా తెలుగు బిడ్డలకు ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి తల్లిగా, పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహిస్తుంది.

VIII. కింది వాటిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. (2 × 2 = 4)

ప్రశ్న 1.
సృజనాత్మకతకు ఉన్న పార్శ్వాలను వివరించండి.
జవాబు:
సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి.

జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా – మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

ప్రశ్న 2.
తనను రక్షించమని వేడుకున్న జింకతో నక్క ఏమన్నది ?
జవాబు:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒకరోజు నక్క జింకకు బాగా పండిన ఒక పొలం చూపించింది. ఆ రోజునుండి జింక ప్రతిరోజు ఆ పొలానికి వెళ్లి మేయగా, ఒకరోజు ఆ పొలం యజమాని రహస్యంగా ఒక వలను పెట్టి ఇంటికి పోయాడు. ఎప్పటిలానే జింక మేయడానికి వెళ్లి ఆవలలో చిక్కుకుంది.

ఇప్పుడు నా మిత్రుడైన నక్క వస్తే నన్ను రక్షిస్తాడని అనుకుంటుండగా నక్క వచ్చింది. జింకను చూసి ఇన్ని రోజులకు నా ప్రయత్నము ఫలించిందని నక్క లోలోపల సంతోషించింది. దీని రక్తమాంసాలతో నేను పండగ చేసుకోవచ్చునని మనసులో అనుకొని ఆ జింక దగ్గరికి వెళ్ళింది. నక్కను చూసిన జింక త్వరగా వచ్చి ఈ వల తాళ్ళను కొరికి నన్ను రక్షించు అని అడిగింది. అలా అనగానే నక్క ఇంకా దగ్గరికి వెళ్లి అయ్యో ! ఈ వల పేగులు, నరములతో చేసినది. ఈ రోజు ఆదివారము, నేను నరములను పంటితో తాకలేను. నన్ను మరోరకంగా అనుకోకు. ఇంక వేరే ఏ పనైనా చేస్తానని చెప్పింది.

TS Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 3.
భాగోతం ప్రదర్శనకు వేదికను ఎలా సిద్ధం చేసేవారు ?
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందినీ అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

ప్రశ్న 4.
తెలంగాణ ప్రాంతంనుండి వెలువడిన పత్రికల గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణాలోని మొదటి పత్రిక హితబోధిని 1818వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో తెనుగు అనే పత్రిక ఒద్దిరాజు సోదరులు సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి, నీలగిరి అనే పత్రిక షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండ నుండి నడిచాయి. ఈరెండు పత్రికలూ ఐదేండ్లు మాత్రమే నడిచాయి. 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది. సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది.

ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనేపత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి. తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి.ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి. సికింద్రాబాదు నుంచి ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి.

IX. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
గంగాపురం హనుమచ్ఛర్మ స్వగ్రామం ఏది ?
జవాబు:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గర ఉన్న గూడూరు. జన్మ స్థలం వేపూరు.

ప్రశ్న 2.
కోకిల ఎలాంటి ఉత్తేజాన్నిస్తుంది ?
జవాబు:
జాతీయ గీతం వంటి

ప్రశ్న 3.
నిసార్ ఏ సంవత్సరం నుంచి పాటలు రాస్తున్నాడు ?
జవాబు:
1986 నుండి

ప్రశ్న 4.
సంధికార్యం ఎవరి చేతిలో ఉంది ?
జవాబు:
ధృతరాష్ట్రుని

ప్రశ్న 5.
‘నాకము’ అనగానేమి ?
జవాబు:
స్వర్గం

ప్రశ్న 6.
ఒక్కరీతిగా నడవనిది ఏది ?
జవాబు:
కాలం

ప్రశ్న 7.
నిసార్ జన్మస్థలం ఏది ?
జవాబు:
నల్లగొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం

ప్రశ్న 8.
దుందుభి ఒడిలో శాంతి పొందినవి ఏవి ?
జవాబు:
దైన్య, శుష్క కంకాలములు. ఎండిన అస్థిపంజరాలు

X. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
సింహద్వారం నేలపైనున్న రాతిఫలకము ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే ‘దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.

ప్రశ్న 2.
ఎల్లమ్మ ప్రదర్శన చూసి ప్రశంసించిన నాట్యాచార్యుడు ఎవరు ?
జవాబు:
నటరాజ రామకృష్ణ.

ప్రశ్న 3.
“నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నది. ఎవరు ?
జవాబు:
రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్.

ప్రశ్న 4.
పరులకు హాని చేయగోరువారు ఏమైపోతారు ?
జవాబు:
చెడిపోతారు

ప్రశ్న 5.
తెలంగాణాలోని మొదటి పత్రిక ఏది ?
జవాబు:
హితబోధిని.

ప్రశ్న 6.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (1978) వజోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సు ఏది ?
జవాబు:
భోదనా భాషగా తెలుగు.

ప్రశ్న 7.
మానవునికి మాత్రమే లభించిన అద్వితీయ బహుమానం ఏది ?
జవాబు:
మానవుని మేధ.

ప్రశ్న 8.
‘ఎనుగల చెట్టు’ గొప్పదనం తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దీని చుట్టుకొలత సుమారు వంద అడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాల తక్కువ.

XI. కింది ప్రశ్నలలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. శార్దూలం
జవాబు:
శార్దూలం లక్షణము :

1) ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
2) ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
3) ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
4) అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
5) నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 2 with Solutions 1

2. మత్తేభం
జవాబు:
మత్తేభం లక్షణము :

1) ప్రతి పొదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
2) ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
3) ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
4) నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
5) నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 2 with Solutions 2

3. తేటగీతి
జవాబు:
తేటగీతి లక్షణము :

1) తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
2) ప్రతి పాదానికీ వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మరల రెండు సూర్యగణాలు ఉంటాయి.
3) ప్రతిపాదంలోనూ 1-4 గణాల మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
4) ప్రాసయతిని పాటింపవచ్చు.
5) ప్రాస నియమం ఉండదు.

ఉదా :
TS Inter 2nd Year Te Model Paper Set 2 with Solutions 3

XII. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
‘గురువు’ అనగానేమి ?
జవాబు:
రెండు మాత్రల కాలములో, పలికేది ‘గురువు’. గురువును (U) గుర్తుతో సూచిస్తాము.

TS Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

ప్రశ్న 2.
ప్రాస అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

ప్రశ్న 3.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ?
జవాబు:
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :

1) వృత్తాలు
2) జాతులు
3) ఉపజాతులు.

ప్రశ్న 4.
‘ఉత్పలమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
ఉత్పలమాలలో 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది.

ప్రశ్న 5.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, అనేవి.

ప్రశ్న 6.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.

ప్రశ్న 7.
‘శార్దూలం’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
శార్దూలంలో, 13వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 8.
‘మత్తేభం’ ఎన్నవ అక్షరం యతి స్థానం ?
జవాబు:
మత్తేభం, 14వ అక్షరం, యతిస్థానం.

XIII. కింది వాటిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి.

1. వృత్త్యనుప్రాస
జవాబు:
వృత్త్యనుప్రాస : ఒకటిగాని, అంతకంటే ఎక్కువ హల్లులుగాని అనేకసార్లు ఆవృత్తి (మరల మరల రావడం) అయినట్లైతే దానిని వృత్త్యనుప్రాస అంటారు.

ఉదాహరణలు :

  1. చిటపట చినుకులు పటపట కురిసెను,
  2. జలజల కాలువలు గలగల పారెను.

గమనిక : మొదటి ఉదాహరణలో ‘ట’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. రెండవ ఉదాహరణలో ‘ల’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది.

2. ఉత్ప్రేక్షాలంకారం
జవాబు:
ఉత్ప్రేక్షాలంకార లక్షణము : ‘ఉత్ప్రేక్ష’ అంటే, ఊహించడం అని అర్థం. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.

ఉదాహరణలు :

  1. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి.
  2. గాంధీ మహాత్ముని హత్య వల్ల భారతజాతికి కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు.

వివరణ : పై రెండు ఉదాహరణలలోనూ, ఊహ ప్రధానంగా ఉన్నది. మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు, దుఃఖం చూడలేకనే సూర్యుడు అస్తమించాడా అన్నట్లు, అనే రెండు చోట్లనూ ఊహలే ఉన్నాయి. అందువల్ల, ఇవి ‘ఉత్ప్రేక్ష’లకు ఉదాహరణలు.

3. అర్ధాంతరన్యాసాలంకారం
జవాబు:
అర్ధాంతరన్యాసాలంకార లక్షణము : సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోనూ, సమర్థించి చెప్పినట్లయితే ‘అర్ధాంతరన్యాసా
లంకారము’.
ఉదాహరణ : గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాడు.
మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదు కదా !
వివరణ : భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం, విశేష విషయము. దాన్ని ‘మహాత్ములకు సాధ్యముకానిది లేదు కదా !’ అనే సామాన్య వాక్యంతో సమర్థించడం వల్ల ఇది ‘అర్ధాంతరన్యాసాలంకారం’.

XIV. కింది ప్రశ్నలలో ఆరింటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

ప్రశ్న 1.
ఒకే హల్లు అనేకసార్లు ఆవృతి అయితే అది ఏ అలంకారం ?
జవాబు:
ఒకే హల్లు, అనేకసార్లు ఆవృతి అయితే, అది ‘వృత్త్యనుప్రాస అలంకారం.

ప్రశ్న 2.
‘కమలాక్షు నర్చించు కరములు కరములు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘లాటానుప్రాస’ అలంకారము.

ప్రశ్న 3.
‘ఉపమానం’ అనగానేమి ?
జవాబు:
‘ఉపమానం’ అనగా, పోల్చు వస్తువు. (ఉదా : ‘హంస’)

ప్రశ్న 4.
‘ఉపమేయం’ అనగానేమి ?
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : ‘రాజు కీర్తి’)

ప్రశ్న 5.
‘అతిశయోక్తి’ అనగానేమి ?
జవాబు:
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’.

ప్రశ్న 6.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించడం ఏ అలంకారం?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.

ప్రశ్న 7.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.

ప్రశ్న 8.
ఉపమావాచకాలు ఏవి ?
జవాబు:
పోలె, వలె, బలె, అట్లు, లాగు మొదలైనవి ఉపమావాచకాలు.

XV. ఈ కింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులు న్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్య్ర ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి – తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం : తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.

TS Inter 2nd Year Telugu Model Paper Set 2 with Solutions

XVI.

(అ) కింద పేర్కొన్న పదాల ఆధారంగా చేసుకుని కాలిదెబ్బలకు వైద్యం కోసం : వెళ్ళినపుడు వైద్యునితో సంభాషణ. రాయండి. (1 × 5 = 5)
(క్రికెట్ ఆడటం – దెబ్బ తగలడం – నొప్పి – ఫస్ట్ ఎయిడ్ – మందులు కాపడం – పథ్యం)
జవాబు:
విద్యార్థి : నమస్తే డాక్టర్ !
డాక్టర్ : నమస్తే సురేశ్ ! ఎలా ఉన్నావు ? కుంటుతున్నావెందుకు ?
విద్యార్థి : మా కళాశాలలో క్రికెట్ ఆడుతుంటే కాలిబొటన వేలికి దెబ్బ తగిలింది.
డాక్టర్ : రక్తం ఏమైనా పోయిందా ? ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారా !
విద్యార్థి : చాలా రక్తం పోయింది. బాగా నొప్పిగా ఉంది డాక్టర్ ! దెబ్బ తగలగానే మా టీచర్ శుభ్రంగా కడిగి పసుపు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసింది.
ఉదాహరణ : గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాడు.
మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదు కదా !
వివరణ : భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం, విశేష విషయము. దాన్ని ‘మహాత్ములకు సాధ్యముకానిది లేదు కదా !’ అనే సామాన్య వాక్యంతో సమర్థించడం వల్ల ఇది ‘అర్ధాంతరన్యాసాలంకారం’.

(ఆ) కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ప్రశ్న 1.
అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ?
జవాబు:
ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది.
పై వాక్యంలోని ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు.

ప్రశ్న 2.
సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు ?
జవాబు:
సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణం’ అంటారు.

ప్రశ్న 3.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

ప్రశ్న 4.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ?
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

ప్రశ్న 5.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

Leave a Comment