TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 7 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి.

ప్రశ్న 1.
తే. బహువిధ …….. జనులు.
జవాబు:
తే. బహువిధ వ్యూహ భేదనోపాయములను
సంప్రయోగ రహస్యాతిశయము గాఁగఁ
గఱపె నర్జునుఁ దొంటి భార్గవుఁడు
వింట నిట్టిం డే!యని పొగడంగ నెల్ల జనులు.

భావము : అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అన్నా! నీకంటే వేరెవ్వరూ అధికులు కానట్లుగా విలువిద్య నేర్పిస్తానన్నాడు. ద్వంద్వయుద్ధ, సంకులయుద్ధ పద్ధతులను, రథం మీద నేలమీద, గుర్రాల మీద, ఏనుగులమీద ఉండి దృఢం చిత్రం, సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయటాన్ని, బహువిధాలైన వ్యూహాలను ఛేదించే ఉపాయాలను, బాణ ప్రయోగ రహస్యాలను ఇది వరకటి ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడుకాడని ప్రజలు అర్జునుని పొగిడేటట్లుగా అతనికి నేర్పాడు.

ప్రశ్న 2.
అన్నలూ ……… పృథ్వికి నవ్యత్వం
జవాబు:
అన్నలూ
చేతుల్లో చేతులు కలపండి
విశ్రాంతిని విసర్జించి నడవండి
అక్కలూ
ఆహ్లాదగీతిక లాలాపించండి
ఆనందంతో కందళిస్తూ కదలండి
మనందరి ఏకత్వం
పృథ్వికి నవ్యత్వం

భావము : అన్నా తమ్ములు చేతిలో చేయివేసి ముందుకు కదలండి. బద్దకాన్ని వదలివేసి ముందుకు నడవండి. అక్కా చెల్లెళ్ళు మీరు ఆనందకర గీతాలను పాడండి. ఆనందంతో అంకురంలా వికసిస్తూ కదలండి. మనమధ్య ఏకత్వం కావాలి. ఐకమత్యంగా ముందుకు నడవాలి. అపుడే ఈ భూమిపై నూతనత్వం వెల్లివిరుస్తుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘మిత్రధర్మం’ పాఠ్యభాగ సారాంశం వివరించండి.
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్య్ర బాధ అనుభవించాడు.

కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్ర్యబాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి – భర్తను, శ్రీకృష్ణుని దర్శించి – ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.

భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య – ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడిగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యనం నిదర్శనంగా నిలుస్తుంది.

మహాపతివ్రతయు, అభిమనవతియునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే క్రుంగికృశించి పోయినది. ఆకలిమంటచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణేశ్వరా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.

మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయా సాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.

భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే – ఆ చక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా?” యని అడుగగా ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొంగునకు కొన్ని అటుకులు ముడి వేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.

“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమాన మిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ – నా భాగ్యము -” అనుకొనుచు కుచేలుడు. ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యాంతములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని గాంచి – బ్రహ్మానందమును అనుభవించెను.

అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను.

మంచి గంధమును శరీరమునకు అలదెను. వింజామరలతో గాలి విసరి మార్గాయాసమును పోగెట్టెను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి – అంతఃపుర కాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.

శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.

కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని తాము గురుకులంలో చదివిన రోజులలోని సంఘటనలు గుర్తుచేసాడు. కుచేలుని భార్యా పిల్లల కుశలమడిగాడు. ధర్మనిష్ఠతో, కర్తవ్య నిష్ఠతో జీవించే ఉత్తములను భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. మనం గురు నివాసంలో ఉంటు ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాం గుర్తుంది కదా ! దారి తెన్నూ కనపడకుండా పడిన ఆ కష్ట సమయంలో ఒకరికొకరు ఆసరాగా ఆ అడవిలో చలికి వణుకుతూ గడిపాము. ఇంతలో తెల్లవారడంతోనే మనకోసం గురువుగారు వెతుకుతూ వచ్చి మనలను దీవించారు.

కృష్ణుని మాటలకు పొంగిపోయిన కుచేలుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని శ్లాఘించాడు. నా కోసం ఏమి తెచ్చావు అని అడుగగా సిగ్గుతో తలదించుకుని కూర్చున్న కుచేలుని ఉత్తరీయం ముడిలో ఉన్న అటుకులను ప్రేమతో తిని అతనికి సకల సంపదలను అనుగ్రహించాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన సుధామునికి (కుచేలుడు) ఇదంతా కృష్ణలీల అని గ్రహించి ఆనందించాడు. స్నేహంలో ఆస్తుల తారతమ్యం, ధనిక బీద తేడాలుండకూడదని శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా లోకానికి చాటి చెప్పాడు.

ప్రశ్న 2.
ఏనుగు లక్ష్మణకవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. లక్ష్మణకవి సంస్కృతంలో భర్తృహరి రచించిన, సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువదించారు. సుభాషిత రత్నావళి నీతి, శృంగార, వైరాగ్య, శతకాలని మూడు భాగములు. రత్నావళిల పద్యాలు అవి మనోహరంగా, యథామూలంగా, సందర్భోచితంగా ఉంటాయని విమర్శకుల భావన.

లక్ష్మణకవి నీతి శతకంలో అనేక విషయాలు తెలియచేసాడు. కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముత్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదాల విందాలను శిరస్సున దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం- ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

ఇలా ఏనుగు లక్ష్మణకవి తెలుగులో అనువదించిన నీతి శతకాలలోని నీతి అన్ని కాలాలకూ వర్తిస్తుంది. విద్యార్థులకు పెద్దలకు అందరికీ వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఎలా మసలుకోవాలో అనేక ఉపమానాలు సుమధురంగా నీతిని ప్రబోధించారు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
భాషల మధ్య జరిగే ఆదానప్రదానాలను చర్చించండి ?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి.నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన “వ్యాసగుళుచ్ఛం” రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజంగానే జరుగుతాయని సదాశివ వివరించారు.

ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని వేరొక భాష స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది. స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది.

కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మల భాష యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడా స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావం కూడా! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవృత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి.

ఉదాహరణకు : లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోకి ‘లాట్సాహెబ్’గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ. వర్ణవృత్యయాలకు ఉదాహరణులుగా చెప్పవచ్చు.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 2.
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన సాహితీ నీరాజనం అన్న వ్యాస సంకలనం లోనిది. ఇందులో ఆయన మానవతావాదాన్ని గురించి చక్కగా వివరించారు.

మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి దీనిని మానవతా వాదం అనే కన్నా మానవతా దృక్పధం అనటం సబబని రవ్వాహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పధానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని వల్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూషించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది.

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహత్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయిన వానితో సమానుడట.

వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం అన్న అది కావ్యా రామాయణ వాక్యాలు పరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని బాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం వాల్మీకిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా!

ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్భాధను తీరుస్తుంది కాబట్టి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉదాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్పించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో ఏ దానమైన నిత్యం చేస్తే అది మానవత్వం అనిపించుకుంటుందని చెప్పబడింది.

భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మానవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు. అష్టాంగ హృదయంలో “బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నం పెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం.

మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలని అన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వాశ్రీహరి పేర్కొన్నారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘గొల్లరామవ్య’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.
జవాబు:
‘గొల్లరామయ్య కథ’ దక్షిణ భారతదేశం నుండి తొలిసారి భారత ప్రధాని అయిన పాముల పర్తి వేంకటనరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు’ సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో చిత్రించబడిన అద్భుతఘట్టం గొల్లరామవ్య కథ. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాశ్రేయస్సు కోసం విజృంభించిన ఒక సాహస విప్లవ కారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వఘటం, ఇందులోని ఇతివృత్తం. తెలంగాణా పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె, గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె వడిలో పదిహేనేండ్ల బాలిక. ఆ గ్రామంలో అప్పుడు అయిన పెద్ద శబ్దాలకు గ్రామంలోకి వారితోపాటు వీరిద్దరి మొహాల్లో భయం తాలూకా ప్రకంపనలు కన్పిస్తున్నాయి.

“అవ్వా! గిప్పుడిదేం చప్పుడే! అని ఆ బాలిక ప్రశ్నించింది” “నీకెందుకే మొద్దముండా… అన్నీ నీకే కావాలె” అని నోరు మూయిచింది గొల్లరామవ్వ. హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టినట్లుంది రజకార్లో, పోలీసులో అని భయపడింది గొల్లరామవ్వ. ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. అగంతకు డొకడు ఆ ఇంటి కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు. సందేహం లేదు. రజాకార్లో, తురకోడో, పోలీసోడు అయి ఉండాడు. తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు అని తల్లడిల్లిపోయింది.

అంతలో ఆగంతకుడు నేను దొంగను కాను, రజాకారును కాను పోలీసునూ కాను నేను మీలానే ఒక తెలుగోడిని. ఇది రివల్వార్ మిమ్మల్ని చంపేవాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపాను. మొన్న మీ గ్రామంలో నలుగురు అమాయకులను చంపిన పోలీసు లే, లే, ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్’ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతుంది.

తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది.

వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్లరామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.

పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఎదుర్కున్న సమస్యలను చర్చించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగము డా. ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడిన. “విసుర్రాయి” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి ఆర్థిక స్వాలంబనకు చాలా ప్రాధాన్యత ఉందనే వాస్తవాన్ని వివరిస్తుంది.

యువత చిన్న విషయానికే కుంగిపోయి, అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి ప్రతికూల ధోరణులను ఆ కథ నిరసిమైంది. ఆత్మ విశ్వాసంలో దేన్నైనా సాధించవచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మా నాన్నలకు స్నేహలత రాసినలేఖ పై విషయాలను రుజువుచేస్తుంది.

స్నేహలత తన పెళ్ళి విషయముపై తన తల్లిదండ్రులు దిగులు పెట్టుకున్నారని తెలుసుకుంది. వారిని ఓదార్చుతూ వర్తమానకాలంలోని యువతులకు ధైర్యాన్నిస్తూ వ్రాసిన లేఖ స్నేహలతాదేవి లేఖ. అమ్మ నాకు పెళ్ళికాలేదని మీరు చింతపెట్టుకున్నారు. మిమ్మల్నిచూసి నాకు మొదట్లో చింతగానే.. ఉంది. ఏకాంతంగా ఎన్నో సార్లు ఏడ్చాను కూడా? పెళ్ళిచూపులకు వచ్చిన ప్రతి మగాడు నన్ను కాదనటం వల్ల నాకు న్యూనతా భావం కలిగింది. నాలో నాకే ఎన్నో లోపాలు కన్పించడం మొదలుపెట్టాయి. పెళ్ళిచూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. పెళ్ళి చూపులనే తతంగం ఆడదానికి జరిగే ఎన్నో అవమానాలలో ఒకటిగా స్నేహలత భావించింది.

నిజంగా పెళ్ళి చూపులకు వచ్చిన వారిలో చాలా మంది నాకు నచ్చలేదు. కాని ఆ మాటలను చెప్పే హక్కునాకు లేదని మీరు, సమాజం నాకు నేర్పారు. అందుకే నోరు మూసుకున్నాను. నేను పెళ్ళి చూపులకు వచ్చిన వారికి వచ్చాకపోవటానికి నా అందం కాదు ప్రమాణం అని నాకు తెలిసింది. వారికి నచ్చంది మీరిచ్చే కట్నకానుకలు నేను చదువకున్నాను. వచ్చేవాడు ఏమంటాడోనని నన్ను ఉద్యోగ ప్రయత్నం మీరు చేయనీయలేదు.

నేను మరీ అంత అందగత్తెను కాకున్నా వికారంగా మాత్రం లేను కదా! ఎంతోమంది పెళ్ళిచూపులకు వచ్చారు కదా? ఒక్కరన్నా నా చదువు సంస్కారం గురించి అడిగారా! కట్న కానుకలను గురించి బేరాలాడటమే సరిపెట్టారు. ఈ సమాజంలో ఆచారాలు కట్టుబాట్లు ఆడదాన్ని బేరమాడే అంగట్లో వస్తువుగా చేశాయి. అమ్ముడు పోయేది వరుడు అవమానాల పాలయ్యేది వధువు ఇదేమి విడ్డూరం. ఇదేమి సంస్కారం.

వరకట్న వ్యతిరేకంగా పొసెషన్లు, నినాదాలు చేసి రోడ్లమీద తిరిగితే ప్రయోజనం ఉండదు. మానవ మనస్తత్వాలు మారాలి. స్త్రీలలో ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం రావాలి. స్త్రీలు తమ జీవితాలను తమకు ఇష్టమైన రీతిలో మలచు కోవటానికి ప్రయత్నించాలి. ఒత్తిడితో ధైర్యాన్ని కోల్పోయి ప్రాణత్యాగం చేయవద్దని కోరింది. తనకు ఎదురైన సమస్యలు నేటి సమాజంలోని ప్రతి స్త్రీ ఎదుర్కోంటుందని వారిందరికి ధైర్యం నూరిపోసింది స్నేహలతాదేవి.

ప్రశ్న 3.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలుపేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి. ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది. ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాలపేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటుచూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయికూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా బిచ్చముండవు. నీ పొగరుండీ మాకెంతుండాల్నే? ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకున్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే. టి. సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు. “ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘ సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

ప్రశ్న 4.
పాతిమా గొప్ప మనసును వివరించండి ?
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ‘ఫాతిమా’ గొప్ప మనసు ఒక నిదర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లి, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. -సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది. రాంరెండ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు.

రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా! పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల పానానికి తన పానం అడ్డమేసుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికిపానంగా చూసుకునేటోల్లు, ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది. మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, ‘మత పిచ్చిగాల్లు రామ్ – రహీమ్ల నడ్మ చిచ్చు పెట్టడం గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా! ఒకలకు ఆపతౌత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. రాంరెడ్డి కొడుకన్నా బతికితే అంతేచాలు అని అనున్నది పాతిమా!

“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక ఆ అల్లా. తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా!” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోల్గెనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా! నీకు చేతులెత్తి మొక్కుత! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

“మర్దీ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయత్సుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా!

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ
ఉంటుంది.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా ఖండికలోనిది.
సందర్భము :- మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.
భావము :- కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

ప్రశ్న 2.
అంబరాన్ని చుంబించాలి మనం
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవితా సంపుటి గ్రంథం నుండి గ్రహిబచబడినది.
సందర్భము :- మానవుడు అభ్యుదయ భావనలతో భవిష్యుత్తుపై ఆశలతో బ్రతకాలని చెప్పిన సందర్భము లోనిది.
భావము :- మానవులంతా ఆశాపాశాలతో బ్రతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనంతమైన ఈ ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ మానవులంతా సోదర భావంతో మెలగాలని ఇందలి భావం.

ప్రశ్న 3.
మూల మెరిగిన గురునిచేత ముక్తి దొరకును మనకయా!
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. దున్న విశ్వనాథం “సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసు తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
సందర్భము :- మానవులు మంచి గురువును ఆశ్రయిస్తే ముక్తి దొరకుతుందని వివరించిన సందర్భంలోనిది.
భావము :- ఎక్కడ వెదికినా ఏమీ కన్పించదు శూన్యం తప్ప. జ్ఞాననేత్రాన్ని తెరచి, దాని మూలాన్ని గ్రహించిన గురువును ఆశ్రయించిన మానవులకు మోక్షం లభిస్తుందని ఇద్దాసు చెప్పాడని ఇందలి భావం.

ప్రశ్న 4.
వెల్తికుండ తొఁదొలుకుచునుండు
జవాబు:
పరిచయం :- ఈ వాక్యం మారద వెంకయ్యచే రచింపబడిన భాస్కర శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :- నీచుడికి, గుణవంతుడికి ఉన్న లక్షణాలను కవి తెలిపిన సందర్భం లోనిది.
భావము :- వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభను తెలుండి?
జవాబు:
ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగకొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణ్యాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారలను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు.

ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు. పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జునుని అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.

గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రశ్న 2.
యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి?
జవాబు:
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన దాశరథి తాడిత పీడితుల కోసం తన కవితను ‘మైక్’గా అమర్చాడు. ఒకరినొకరు ద్వేషించటం తగదని రాక్షస స్వభావం గల వారితో కూడా మైత్రిని చేయాలని అంటారు దాశరథి. ఆయన దృష్టిలో యుద్ధం రాక్షసక్రీడ. నవ సమాజానికి పనికిరానిది.

“అందరికంటే ముందే
అణ్వస్త్రము గొనిపోయి
అఖాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి”
అని అణ్వస్త్ర ప్రయోగాన్ని నిరసించాడు.
కత్తి పట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు
మెత్తని హృదయం దాటికి
తుత్తునియలు కానిదెవరు?
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు”

అని నవసమాజానికి యుద్ధం పనికిరాదని మెత్తని హృదయంతో అహింసా యుతంగా విజయాలను పొందాలని దాశరథి భావన.

ప్రశ్న 3.
అధమ, మద్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు?
జవాబు:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 4.
ఆగం కాకుండా జీవించాలంటే ఏమీ చేయాలి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగము ‘దున్న ఇద్దాసు’ చేరచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

‘ఓనామః శ్రీవాయుః’ అన్న అక్షరాలు రాస్తున్నాం. నేర్చుకుంటున్నాం, మన జీవిత ఆనవాళ్ళను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితం యొక్క ఆనవాళ్ళను తెలుసుకోలేకపోవటం వలననే అల్లరిపాలు అవుతున్నాం. మంచి చెడులను, పూర్వాపరాలను, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేక పోవటం వలననే మనం ఆగమవుతున్నామని ఇద్దాసు ‘అచలం’ అను తత్వాల ద్వారా మనకు తెలియచేశాడు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా రాయండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించబడిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో సోమనాథుని రచనలలోని భాష ఛందస్సులలో నూతనత్వాన్ని ఎలా తీసుకువచ్చాడో వివరించబడింది. సోమనాథుని రచనలను, వర్ణనానైపుణ్యాన్ని ఇందులో వివరించాడు. పాల్కురికి రాసిన 21 రచనలను పేర్కొంటూ వాటిలో లఘు కృతులను తెలియజేశాడు.

సోమనాథుడు శివభక్తి తత్పరుడైన బసవేశ్వరుని పై భక్తి తన్మయత్వంతో కొన్ని లఘుకృతులను రచించాడు. అవి 1. రగడ 4 గద్యలు, 2 ఉదాహరణలు 11 పంచకములు 2 అష్టకములు, 1 స్తవము ఉన్నాయి. ఇవన్నీ వైరశైవమత సంబంధ రచనలే.

ప్రశ్న 2.
తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది. ఎందుకు ?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి.నారాయణరెడ్డి, సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాస గుళుచ్ఛం’, రెండవ భాగం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుగు, తెలుగు గ్రాంథిక రూపంలో ఈ నాలుగు ప్రాంతాలలో ఒకటిగానే ఉంటుంది. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి నాలుగు ప్రాంతాలలోనూ వేరు వేరుగా ఉంటుంది. తెలంగానా తెలుగు భాష మిగిలిన మూడు ప్రాంతాల భాష కంటే భిన్నంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో ఉర్దూ, హిందీ మరాఠీ భాషా పదాలు అధికంగా ఉండటం వలన మిగిలిన ప్రాంతాల తెలుగు భాషకన్నా తెలంగాణ తెలుగు భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 3.
బట్టకాల్చి మీదవేయడం అంటే ఏమిటి ?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

బట్టకాల్చి మీద వేయటమంటే నిందులు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగతనం చేశాడు. నేను నా సొంత బంగారమని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను. బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఆ జాతీయం ప్రస్తావించబడుతుంది.

ప్రశ్న 4.
‘రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల దృష్టి తెలుపండి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. మీరు తన బలమును, ధనమును, అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాథలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు.

హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృస్యతా నివారణను పెద్దదోషముగా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లలను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారుచేసేవారు.

బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషిచేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలనందుకున్నారు.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
దాశరథి కృష్ణమాచార్యులు గారి కవిపరిచయం రాయండి.
జవాబు:
“నా తెలంగాణ కోటిరతనాల వీణ” అని నినదించిన కవి దాశరథి. పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని “మైగ్”గా అమర్చిన కవి. జూలై 22, 1925న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేంకటమ్మ వేంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరూ సాహిత్యాభి రుచి గలవారే! ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయం చేశారు. ఖమ్మంలో హైస్కూలు విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆంగ్లం చదివారు.

అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం అమృతాభిషేకం, కవితాపుష్పం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం, వంటి పద్య వచన రచనలు చేశారు. “మహాబోధి” వీరి కథాకావ్యం నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా వంటి గేయాలు రచించారు. గాలీబు గీతాలను తెలుగులోనికి తీసుకువచ్చారు. నవమి నాటి కల సంపుటి, దాశరథి శతకం, వందలాది సినిమా పాటలు దాశరథి కలం నుండి జాలువారాయి.

దాశరథి తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గుర్తించి ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం, “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలను అందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. నవంబరు 5, 1987న దాశరథికాలం చేశారు.

ప్రశ్న 2.
కవిరాజుమూర్తి గారి కవిపరిచయం రాయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యుల చేత “తిరుగుబాటు సాహిత్య ధ్రువతార” ప్రశంసలు అందుకున్న కవిరాజుమూర్తి అసలు పేరు ‘దేవభట్ల నరసింహమూర్తి’. వీరు అక్టోబరు 1926న ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా ఖమ్మంజిల్లా మామిళ్ళ గూడెంలో సాగింది. ఉన్నత కుటుంబంలో పుట్టినా నాటి నియంతృత్వ భూస్వాముల అధికార పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్య సమయంలోను పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఖమ్మం జిల్లాలో “ప్రజాసాహిత్య పరిషత్తును” స్థాపించారు.

తెలుగు వచన కవితారంగంలో దీర్ఘకవితలు రాసిన తొలి తరం కవులలో మూర్తి ముఖ్యుడు. వీరి ‘మహైకా’ మానవ సంగీతం, పణుతి దీర్ఘ కవితలు ప్రశంసలను అందుకున్నాయి. ‘మైగరీబ్ హు’ అన్న ఉర్దూ నవల మంచి గుర్తింపు పొందింది. దీనిని జవ హర్లాల్ నెహ్రూకు అంకితం చేశారు. దీనిని గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు.

ఉర్దూలో హీరాలాల్ మోరియా రాసిన కావ్యాన్ని ‘మహాపథం’ పేరుతో తెలుగులోకి మూర్తి అనువదించారు. గాంధీ దివ్య చరిత్రను ‘జముకుల’ కథా రూపంలో రచించాడు. ఉర్దూలో ‘లాహుకే, లఖీర్, అంగారే నవలలను తెలుగులో ‘చివరి రాత్రి’ ‘మొదటిరాత్రి’ జారుడుబండ నవలలను రాశాడు. తెలుగులో, నవయుగశ్రీ, పేరుతో. గేయాలను, ఉర్దూ పారశీకవుల గజళ్ళను ముక్తకాలుగా రాశాడు.

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు గారి కవి పరిచయం రాయండి.
జవాబు:
వేముల పెరుమాళ్ళు కరీంనగర్ జిల్లా రయికల్ గ్రామంలో ఆగష్టు 5, 1949న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాళ్ళమ్మ-రాజయ్యలు. మాతా మహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు. వీరి విద్యాభ్యాసం రాయకల్ కోరుట్ల జగిత్యాలల్లో జరిగింది. గ్రామాభివృద్ధి అధికారిగా 18 సం॥లు పనిచేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాయికల్ మండల అధ్యక్షునిగా పనిచేశాడు. సహకార రంగంలో గీత, పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్, వినియోగ, గృహనిర్మాణ సంఘాలను స్థాపించాడు.

పెరుమాళ్ళు శ్రీరాజరాజేశ్వర, శ్రీధర్మపురి, నృకేసరి శతకాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో వీరు బాలనీతి శతకం. ‘కిట్టూ’, పర్యావరణ శతకం ‘నిమ్ము’లు రాశారు. మహాత్ముని మహానీయ సూక్తులను “గాంధీమార్గం” త్రిశతిగా రచించాడు.

రాజనీతి చతుశ్శతిగా వీరు ‘లోగుట్టు’ రాశాడు. 1958 నుండి 1968 వరకు సమాజంలో జాతీయ పరిణామాలను పద్యాలుగా రాశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఈయన “మానవతా పరిమళాలు” ప్రసంగాలుగా వెలువడ్డాయి. జీర్ణదేవాలయ పునరుద్ధరణ చేశారు. వీరు సెప్టెంబరు 17, 2005న కాలం చేశారు.

ప్రస్తుత పాఠ్యభాగం “తెలంగాణ జాతీయాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 4.
డా॥ సామల సదాశివ గారి కవి పరిచయం రాయండి.
జవాబు:
డా॥ సామల సదాశివ భిన్న భాషా సంస్కృతులకు వారధి ఈయన మే 11, 1928న ఆదిలాబాద్: జిల్లా దహగాం మండలం తెలుగు పల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. అధ్యాపక వృత్తిని చేపట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. ప్రభాతము అనే లఘు కావ్యాన్ని సాంబశివ శతకం, నిరీక్షణ, అంబపాలి, సర్వస్వదానం, విశ్వామిత్రము వీరి తొలి రచనలు.

హిందూస్థానీ సంగీత కళాకారులపై మయల మారుతాలు ప్రముఖులు జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, వీరి రచనలే. అమాన్ రుబాయిలు’ అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2022లో లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆగస్టు 7, 2012న పరమపదించారు.

ప్రస్తుత పాఠ్యభాగం డా|| సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘వ్యాసగుళచ్చం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
మానవజాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది?
జవాబు:
మానవత్వంతో మెలగినపుడు

ప్రశ్న 2.
దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలపండి?
జవాబు:
దున్న రామయ్య – ఎల్లమ్మలు

ప్రశ్న 3.
దివ్యమైన ధనం ఏది?
జవాబు:
విద్య

ప్రశ్న 4.
దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పారేయాలని ఆకాంక్షించాడు?.
జవాబు:
“అఖాదం”లో పడవేయాలని ఆకాంక్షించాడు.

ప్రశ్న 5.
‘పక్షికన్ను’ లక్ష్యంగా ఎవరు బాణం వేశారు.
జవాబు:
అర్జునుడు

ప్రశ్న 6.
కుచేలుడికి మరోపేరు ఏమిటి ?
జవాబు:
సుధాముడు

ప్రశ్న 7.
కనురెప్పపాటులో పోయేది ఏమిటి?
జవాబు:
ప్రాణం, శరీరతత్త్వం.

ప్రశ్న 8.
‘మై గరీబు’ నవలను ఎవరికి అంకితమిచ్చాడు?
జవాబు:
భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అంకితమిచ్చాడు.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
‘కులాసా’ తెలుగు పదానికి ఉర్దూరూపం ?
జవాబు:
కులాసా తెలుగు పదానికి ఉర్దూరూపం ‘ఖులాసా’

ప్రశ్న 2.
బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి ?
జవాబు:
బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు జీవన విధానాలు ఒదిగి ఉంటాయి.

ప్రశ్న 3.
అనాథ బాల బాలికల సంరక్షణ కోసం ఎలాంటి శాసనం వచ్చింది ?
జవాబు:
అనాథ బాలబాలికల కోసం “శిశువుల సంరక్షక శాసనము వచ్చింది.”

ప్రశ్న 4.
ధర్మసింధువు ఏమని ప్రబోధిస్తుంది ?
జవాబు:
బాలురకు వృద్ధులకు అన్నం పెట్టందే భుజింపరాదని ప్రబోధిస్తుంది.

ప్రశ్న 5.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 6.
బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలున్నాయి ?.
జవాబు:
బసవపురాణంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి.’

ప్రశ్న 7.
బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు ?
జవాబు:
‘తంగేడు’ పూలకు బతుకమ్మ పండుగలలో అగ్రస్థానం ఇస్తారు.

ప్రశ్న 8.
‘సామల సదాశివ’ రాసిన శతకం ?
జవాబు:
‘సాంబశివ’ శతకం

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
బదిలీ పత్రము (టి.సి.) కొరకు కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ రాయండి.
జవాబు:
కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ

కరీంనగర్,
15-06-2023.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.

విషయము : టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో. ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.
కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

ప్రశ్న 2.
ఇటీవల మీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం గురించి వివరిస్తూ స్నేహితునికి లేఖ రాయండి.
జవాబు:
స్నేహితురాలికి లేఖ

మెదక్
09-08-2023.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా
ఎ. సౌమ్య,
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్ నం. – 500067.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) కానిదెవడు
జవాబు:
కానిది + ఎవడు = కానిదెవడు – ఇత్వసంథి/ఇకారసంథి
సూత్రము : ఏ మ్యాదులయిత్తనకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదులనగా ఏమి, మరి,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి ఇత్తు అంటే హ్రస్వమైన

2) క్షణమాగాలి
జవాబు:
క్షణము + ఆగాలి – క్షణమాగాలి – ఉకార సంధి/ఉత్వసంధి సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగును.

3) ముద్దుసేయగ
జవాబు:
ముద్దు+చేయగ = గసడదవాదేశ
సూత్రము : కళలైన క్రియా పదములపై పరుషములకు గసడడవలు వైకల్పికముగానగు.

4) నా దని
జవాబు:
నాది + అని – ఇత్వసంధి.
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధిపై కల్పికముగానను. ‘
ఏమ్యాదులు అనగా ఏమి, మరి, కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలగునవి.

5) నాటనేసి
జవాబు:
నాటన్ + ఏసి = ద్రుతప్రకృతిక సంధి
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతికంబులకు సంధిలేదు

6) దివ్యాంబర
జవాబు:
దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

7) పేదరికమిట్లు
జవాబు:
పేదరికము + ఇట్లు = ఉకార సంధి
సూత్రం : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

8) సంగమమైనా
జవాబు:
సంగమము+ఐన – సంగమమైనా – ఉకారసంథి/ఉత్వసంథి
సూత్రము : ఉత్తనకచ్చు పరంబగునపుడు సంథియగు

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) ఆహ్లాదగీతిక
జవాబు:
ఆహ్లాదమైన గీతిక – విశేషణపూర్వపద కర్మధారయ సమాసం

2) బసవగురుడు
జవాబు:
బసవ అను పేరుగల గురుడు – సంభావనాపూర్వపద కర్మధారయము

3) కరకంకణ రవంబు
జవాబు:
కరకంకణముల యొక్క రవంబులు – షష్ఠీతత్పురుష సమాసము

4) గురువచనం
జవాబు:
గురువు యొక్క వచనం – షష్ఠీ తత్పురుష సమాసం

5) లోకరక్షణ
జవాబు:
లోకమునకు రక్షణ – షష్ఠీ తత్పురుష సమాసము

6) భరతభూమి
జవాబు:
భరత అనుపేరుగు భూమి – సంభావనా పూర్వపద కర్మధారయము

7) చక్రపాణి
జవాబు:
చక్రము పాణియందుకలవాడు – బహువ్రీహి కర్మధారయ సమాసము

8) ఇలాగోళము
జవాబు:
భూమి యొక్క గోళము – షష్ఠీతత్పురుష సమాసం

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురు మండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని

జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత
సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం. తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

2. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు.

అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది.

సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది.

ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు.

ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు.

అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. `అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

3. జాతీయ విపత్తులు
జవాబు:
జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది. విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు.

విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. A journey of thousand miles begins with a single step.
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

2. There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

3. The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.

4. Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.

5. What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

కవిత్వం పద్య, గేయ రూపంలో గాకుండా వ్యవహారిక పదాలు; వాక్యాలతో కొత్త · రూపాన్ని సంతరించుకుంది. పాశ్చాత్య కవితాధోరణుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ఫ్రెంచి భాషలోని ‘verse libre’ అని, ఆంగ్లంలో ‘free verse’ అని పిలుచుకుంటున్న కవితా పద్ధతే తెలుగులో వచనకవితగా స్థిరపడింది. వచనకవితకు ఆద్యుడుగా చెప్పుకునే శిష్ట్లా ఉమామహేశ్వరరావు తను రాసిన వచనకవితల్ని 1938లో ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ సంపుటాలుగా ప్రకటించాడు.

వచనకవిత ప్రయోగదశ, తొలిదశలో వచ్చిన ఈ కవిత్వాన్ని శిష్ట్లా ‘ప్రాహ్లాద కవిత’గా పేర్కొన్నాడు. అటుతర్వాత వచనగేయం, వచనపద్యం, ముక్తచ్ఛంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వర్క్స్బర్, వచనకవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చినా వచనకవిత అనే పేరు స్థిరపడిపోయింది. వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచనకవిత నడుస్తుంది. భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచనకవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శిల్పం వుండటం వచనకవిత ప్రత్యేకత. వచనకవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించేట్లుగా ఒక విరుపు, భావలయ, అంతరయలు నిగూఢంగా వుంటాయి.

వచనకవిత ఆవిర్భావధశలో 1939లో పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ కవితాసంపుటి, ‘నయాగరా’ కవితాసంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచనకవితా సంకలనమైన ‘నయాగరా’ను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాన్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. కుందుర్తి వచనకవితకు ఉద్యమస్ఫూర్తిని అందించాడు. వచన కావ్యంగా ‘తెలంగాణ’ కావ్యాన్ని రచించి ‘వచనకవితాపితామహుడి’గా ప్రసిద్ధి చెందాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
వచన కవితకు ఆద్యుడుగా ఎవరిని భావిస్తున్నాం?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

ప్రశ్న 2.
శిష్ట్లా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి?
జవాబు:
ప్రాహ్లాద కవిత

ప్రశ్న 3.
‘వచనకవితాపితామహుడు’ ఎవరు?
జవాబు:
కందుర్తి

ప్రశ్న 4.
తెలుగులో తొలి వచనకవితా సంకలనం ఏది?
జవాబు:
‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’

ప్రశ్న 5.
‘ఫిడేలు రాగాల డజన్’ కవితా సంపుటి కర్త?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

Leave a Comment