TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 10 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. పలుమఱు ………… నీరముగాక భాస్కరా !
జవాబు:
చ. పలుమఱు సజ్జనుండు ప్రియభాషలెపల్కు ఉగఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁ గీడునుగాదు నిక్కమే ..
చలువకు వచ్చి మేఘుఁ డొక జాడను దా వడగండ్ల రాల్సినన్
శిలలగునోటు వేగిరమె శీతల నీరముగాక భాస్కరా !

భావం : మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుగాని రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోరవచనమును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

2. బిసబిస నెప్పుడు …….. సంశుమంతుఁడు పొడిచెన్.
జవాబు:
క. బిసబిస నెప్పుడు నుడుగక,
విసరెడ్డి వలిచేత వడఁకు విడువక మనముం
బస చెడి మార్గముఁ గానక,
మసలితి మంతటను నంశుమంతుఁడు పొడిచెన్.

భావం : బిసబిసమని తీవ్రంగా వీచే చలిగాలులకు మన శరీరాలు కనిపించాయి. మనం శక్తి కోల్పోయి దిక్కూ తెన్నూ తెలియన్ వనమంతా తిరిగాము. ఎట్టకేలకు సూర్యోదయమైంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘మహైక’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరుపొంది న కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణలో నియంతృత్వ, భూస్వామ్య అధికారులు పీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.

మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.

భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. దీర్ఘకవితను చదివినపుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు.

ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటి వాడు.

తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.

అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.

కుండలు వేరైనా ముట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే. మానవులలో భేదాల సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.

ప్రశ్న 2.
‘నా పేరు ప్రజాకోటి’ కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియచేయండి ?
జవాబు:
‘నాపేరు ప్రజా కోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించిబడిన “పున్నవం” అను కవితాఖండిక నుండి గ్రహించబడింది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని తెలంగాణ వైభవాన్ని వివరించిన కవి దారశథి. ఆయన పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’గా అమర్చాడు.

కవి అయిన వానికి మానవత ఉండాలి. మంచి చెడులకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పధాలకు కేంద్ర బిందువు మానవుడే! తోటి మానవుని ప్రేమించ లేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిషత్తుకు బాటలు వేయాలన్నాడు. మన దేశం అనాది నుండి శాంతి అహింసలకు ఉపాసించిందన్నాడు. విశ్వశ్రేయస్సును కోరేవారు భారతీయులని అభివర్ణించాడు. తనతో అందరిని కలుపుకోవటం అందరిలో తాను ఒకడిగా కలిసిపోవటమే భారతీయత. చెడు నుండి మంచి వైపుకు ప్రయాణం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.

అహింసను అలవరచుకోవాలి. హింసద్వారా విజయాన్ని పొందినవారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అహింసే జీవిత పరమావధి కావాలని ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు.

గతమంతా బూది కుప్పకాదు. వర్తమానం అద్భుతమూ కాదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని నడిస్తేనే ప్రజా విజయ మౌతుందన్నాడు. ఎన్ని శక్తులను సాధించినా మానవత ముందు దిగదుడుపే. ఏ జెండా పట్టుకున్నా మైత్రీ బంధం కూర్చేనేరు అహింసకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ మానవున్నాడ వాడు మానవుడే. రంగు రూపు భేదమున్నా స్నేహం చేయటం నేర్చుకోవాలన్నాడు. హింసాత్మక ధోరణులను వదలి హాయిగా జీవనం గడపమని దాశరథి ఈ కవిత ద్వారా ప్రబోధించాడు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
బతుకమ్మ పండుగలోని సంగీత, సాహిత్య కళాంశాలను పేర్కొనండి ?
జవాబు:

బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జ్ఞానపద విజ్ఞానం పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలు వారి సాహిత్య సంగీత, నృత్య కళారూపాల త్రివేణి సంగమం సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవిని అందమైన పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆడుతూ పూజించటం వారి కళాభిలాషకు ఉదాహరణం.

సుఖదుఃఖాలతో, ఉత్సాహ ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినపుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూల మయంగా ఉంటుంది. పంటచేలు నిండు గర్భిణులుగా దర్శనమిస్తాయి. పప్పుధాన్యాలు ఇళ్ళకు చేరతాయి. అలాంటి సంతోష సమయంలో పల్లెపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా నాట్యం చేస్తూ తమ ఆనంద పారవశ్యాలను సంగీత రూపంలో ప్రకటించుకుంటారు.

అలంకరణ : బతుకమ్మను అలంకరించటమే ఒక కళ. ఉదయాన్నే ఇంటిముందు అలికి రంగు రంగుల ముగ్గులేయటం మరొక కళ. ఒక ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పేర్చటం, పొడవైన గుత్తులు గుత్తులుగా అమర్చటం, స్త్రీల కళాభిరుచికి ఒక ఉదాహరణం.

పూవులు ఎక్కువగా దొరికితే మనిషంత ఎత్తుగా బతుకమ్మను అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ, ప్రక్కల పిల్ల బతుకమ్మను అమర్చుతారు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తయిదువలు సాయంత్రం తమని తాము అలంకరించుకొని ఇంటిముందు’ ఆటపాటలతో కొంతసేపు కాలక్షేపంచేసి ఆ తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మను సాగనంపుతారు.

పాట-నాట్యం : జానపద స్త్రీలు వలయాకారంలో తిరుగుతూ నాట్యం చేస్తూ. పాటలు పాడుకుంటారు..
నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

అని రాగయుక్తంగా పాడటం వారి కళాసక్తికి నిదర్శనం. జానపద. స్త్రీల బొడ్డెమ్మ బతుకమ్మ ఆటలకు మూలం. ఆటవికులు పండుగ సమయాలలో చేసే బృంద నృత్యాలే ! పార్వతీపరమేశ్వరులు సాయంత్రం వేళల్లోనే నృత్య పోటీని పెట్టుకునేవారని అందులో ఈశ్వరుడే విజయం సాధించేవాడని ఒక కథనం. తెలంగాణ ప్రాంతంలో ఉంది. అందుకే బతుకమ్మను సాయంత్ర సమయంలో ఆడతారు.

బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడుదుడుకులు లేకుండా ఒకే స్వరంలో సాగిపోతాయి. వీరు పాడే పాటలకు సంగీత శాస్త్రనియమా “లుండవు. అవి చతరస్రగతిలో ‘కిటతక, కిటతకిట అను మాత్రలతో ఉంటాయి.

స్త్రీలు పౌరాణిక గీతాలు, నీతిబోధాత్మక గీతాలు కథాగేయాలను పడుతుంటారు. పాటలోని ప్రతి చరణాంతంలో ఉయ్యాలో, వలలో, చందమామ అని పునరావృత మౌతుంటుంది. ఆ పాటల్లో ప్రతి వనిత యొక్క మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేది సతిగూడి ఉయ్యాలో”

వారు పనిచేసే పనిలోని శ్రమను మరచి పోవటం ఈ పాటలలోని అసలు రహస్యం. పనిపాటలు పరమాత్మ స్వరూపాలుగా భావించటం ప్రజల సంప్రదాయం. ఇలా బతుకమ్మ పండుగలో సంగీత సాహిత్యనాట్యాలు కళాంశాలుగా రూపుదిద్దుకుంటాయి.

ప్రశ్న 2.
పాఠ్యాంశంలోని జంతువులు పక్షుల ఆధారంగా రూపొందిన ఏవేని ఐదు జాతీయాలను వివరించండి.
జవాబు:
“తెలంగాణ జాతీయాలు” అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన ‘తెలంగాణ జాతీయాలు’ అన్న గ్రంథం నుండి గ్రహింపబడింది. ఇందులో జంతువుల పక్షుల ఆధారంగా కొన్ని జాతీయాలున్నాయి.

1. కోతికి పుండు పుట్టినట్లు ఒక కోతికి పుండయ్యింది. విచిత్రంగా కన్పించింది. మరొక కోతి వచ్చి ఆ పుండును గిల్లి చూసి వెళ్ళిపోయింది. అలాగే మరొక కోతి కూడా అలా చేసింది. ఆ కోతి కూడా పుండు బాధ పడలేక గోకున్నది. పుండు మరింత నెత్తురుకారి పెద్దదయింది. ఏ కోతికి పుండు పెద్దది కావాలని ఉండదు.

అయినా తెలియని తనం వలన ఈ కోతి పుండు మానదు “అత్తా! ఈ పోరగాని కాలుకు దెబ్బ తాకిందని పట్టేసి బడికితోలేస్తే మళ్ళీ దెబ్బతాకించుకున్నాడు. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది” అన్న కోడలి మాటల్లో ఈ జాతీయం పలుకబడింది.

2. ఎద్దును చూసి మేతెయ్యాలి : ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కదురుతుందా ? విచక్షణతో దేనికెంత వెయ్యాలో తెలుసుకోవాలి. ఎద్దుల్లో కొన్ని పెద్ద ఎద్దులుంటాయి. వాటికి తగ్గమేత వాటికి వేయాలి. కొన్ని బొండలుంటాయి. వాటి పుట్టుకే చిన్నది. కడుపు కూడా అంతకు తగ్గట్టుగానే ఉంటుంది.

వాటికి మేత ఎక్కువ వేస్తే తొక్కి పాడు చేస్తాయి. ‘దసరా మామూళ్ళని అందరికి పదిరూపాలే ఇస్తిరి. ఎద్దును చూసి మేతెయ్యాలి. మే ఎల్లకాలం పనికొచ్చేటోల్లం. మాది మా కుండాల” అని జాతీయం ప్రయోగించబడుతుంది.

3. ఊరు లేదు : ఊరిలో ఎక్కడో ఒకచోట దొరకుండా పోదు అనుట ఒక కుటుంబంలో వస్తువు దొరకకుండా పోవచ్చు. ఊరిలో దొరకకుండా పోదు. గొడ్డు పోవుట చే వంధత్వం, అలభ్యం. ఒక కుటుంబంలో దొరకకపోతే వేరే కుటుంబంలో దొరుకుతుందని భావం” “అయ్యో ! నీవు యియ్యకపోతే మాయె.

ఊరుగొడ్డుపోయిందా ? ఎక్కడో ఒకచోట ఎవరన్నా ఇస్తారు. అందరూ ఒకే తీరు ఉంటారా ? అని ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

4. కోడి మెదడు : అల్పత్వం మతిమాలిన తనం అని అర్థం. కోడి చిన్న ప్రాణి. దాని మెదడు కూడా చిన్నదే ! చెపితే అర్థం చేసుకోకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకునే వాడిని కోడిమెడవాడు అంటారు. “వానిది కోడి మెదడు. వానికి తోచదు. ఒకరు చెప్తే వినడు” అంటారు.

5. బుడుబుంగ : నీటిలో తిరిగే పక్షి. బాతు జాతికి చెందింది. నల్లగా ఉంటుంది. ఒక చోట’ బుడుక్కున మునుగుతుంది. కూత పెట్టు దూరంలో తేలుతుంది. మళ్ళీ

మళ్ళీ ముగిగినా అలాగే తేలుతుంది. లోపల చేపలను వేటాడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో, వెంటనే మరో ఇంట్లో ఇలా కాలాగకుండా తిరిగే వాడిని బుడుబుంగ అని అంటారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
పాతిమా గొప్ప మనసును వివరించండి.
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ”ఫాతిమా’ గొప్ప మనసు ఒక నిదర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లి, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది. రాంరెండ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు. రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా! పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల పానానికి తన పానం అడ్డమేనుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికిపానంగా చూసుకునేటోల్లు.

ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది. మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, మత పిచ్చిగాల్లు రామ్ – రహీమ్ల నడ్మ చిచ్చుపెట్టడం గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా! ఒకలకు ఆపతొత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. రాంరెడ్డి. కొడుకన్నా బతికితే అంతేచాలు అని అనున్నది పాతిమా !

“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక ఆ అల్లా తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా!” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోలెనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా! నీకు చేతులెత్తి మొక్కుత! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

‘మర్షీ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయత్సుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా!

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ
ఉంటుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది.

యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ ? చదువుకుంది. సంస్కారం ఉంది.

మరీ అంత అందంగా లేకపోయినా వికారం మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకొని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిగతం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుఁడి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది.

ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడు దొరికినప్పుడే ఫెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొనాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి. తనతోపాటు స్త్రీ జాతికంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 3.
బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీనే చే రచించబడింది. అంపశయ్య నవీన్ అసలు పేరు . దొంగరి మల్లయ్య ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల’ కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలస కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది.

వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ ‘బిచ్చగాడి కథ. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం. ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది.

ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు. చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది.

ఆమె ఓ బిచ్చగత్తె. ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.

ట్రైన్ కదలింది. టికెట్ తెస్తానన్నవాడు ఆ డబ్బులతో అటే పోయాడు. టి.సి రానే వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య. ఒరేయ్ టికెట్ తీయరా! అన్నాడు టి.సి. “అయ్యా! టికెట్ కోసమే పోయినయ్యా! ఇయ్యాళ కొత్తగూడెం టేషన్లో అంతా మందే…… టికెట్ తీసుకోమని మా అన్న కొడుకుని పంపిన. ఆడు చెయ్యి బెడ్తుండగనే బండి కదిలింది. నేను వాణ్ణి వదిలేసి బండెక్కిన” “నోర్ముయిరా దొంగ వెధవ. ఎక్కడి వెళ్ళాలి” అన్నాడు. “నెక్కొండ” “బాంచెన్” అన్నాడువాడు. ఆ ఆడది నల్గురు పిల్లలు నీ వాళ్ళేనా” “అయ్యా మా వాళ్ళే’ అయితే 56 రూపాయలు తియ్” అతడు వెంటనే టి.సి రెండు కాళ్ళు పట్టుకున్నాడు.

“లే గాడిద కొడకా! నా కాళ్ళెందుకుకురా పట్టుకుంటావ్”. పైసలిస్తవా పోలీసోళ్ళకు . పట్టించనా అన్నాడు టి.సి “నన్ను కోసినా నా దగ్గర పైసల్లేవు బాంచనా” ఈ భాగోతం. అంతా బండిలో ఉన్న వారికి వినోదంగా మారింది” వరేయ్ బ్రహ్మయ్య! డబ్బు తియ్యరా” అన్నాడు టి.సి “అయ్యా! నన్ను కోసినా నా వద్ద పైసాలేదయ్యా! అంటూ బ్రహ్మయ్య

మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. “నన్నుంటుకున్నావంటే చంపేస్తా… బద్మాష్ లుచ్ఛ నీ దగ్గర డబ్బులేదురా. ఆరుమాలు తీయ్” అన్నాడు టి.సి “ఈ రూమాల్నేముందు బాంచెన్….మీ అసుంటి ఓ దొర దగ్గర అడుక్కున్నా నన్ను నమ్మండ్రి బాంచెన్ అని మళ్ళీ కాళ్ళు పట్టుకోబాయాడు.

ఇద్దరి మధ్య పెనుగులాటలో రుమాలు చిరిగి పోయింది. దాన్లో నుండి 30 రూ॥ బయట పడ్డాయి. ఆ ముప్పై ఇదేనా అన్నాడు. టి.సి “ఛట్ దొంగ రాస్కెల్. ఇంకా మోసం చేద్దామని చూస్తావురా! తీయ్ మిగతా 26రూ॥ అన్నాడు. “మమ్ముల కొట్టుండి. సంపుండ్రి. ఈ బండ్ల నుంచి బయటకు ఇసిరి కొటుండ్రి మా వద్దిక పైసల్లేవ్ అంది బ్రహ్మయ్య. భార్య.

“నోర్మూయ్యలే దొంగముండ. పైసల్ లేవంటే ఫైనెవ్వడు కడ్డడు. నీ వడుంకున్న ఆ సంచితియ్ అన్నాడు టి.సి. దాంట్లో ముంది నిన్న మొన్న అడుక్కున్న డబ్బులు. నిండు చూలాలు. నలుగురు పిల్లలలో ఉన్న ఆమెను చూస్తే ఎవరికి జాలి కలుగలేదు “ఈ పూటకు నూక మందమన్నా ఉంచుండ్రయ్యా! నిన్న మొన్న ఏమిటి నేను ఏమిటినేను.

నా పోరగాండ్లను సూడుండ్రి ఆకలితో నకనక లాడిపోతండ్రు అని ఎంత కాళ్ళు పట్టుకున్నా ప్రతమ్నాయం లేకపోయింది. ఆ సంచిలోని డబ్బంతా క్రింద సి. 26 రూ॥ తీసుకుని ఒక రిసీట్ బుక్ తీసి ఏదో రాశాడు. నా దృష్టి ఆ కాగితం పై 22 రూ||లు డోర్నక్ టు నెక్కొండ” అని పడింది. ఇంతకూ ఎవరు పెద్ద బిచ్చగాడో మీరే చేసుకోండి. అని కవికథలు ముగించాడు.

ప్రశ్న 4.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది ?
జవాబు:
‘గొల్లరామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్లరామవ్వ – మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటకాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్

తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను, పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత..

గొల్లరామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్నుకాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు.

నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. ‘భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గిట్లెందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల పండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లలు పిసుక్కొచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న.. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడితే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు.

అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఊ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊనడూ అంది”. “చెయ్యని పండుకో పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు మా పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచంమీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతవే” అన్నాడు.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
వట్టిచేతితో శత్రువుపై దుమికే శక్తి ఉంది
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “నాపేరు -ప్రజాకోటి” అని పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. “పునర్నవం” అన్న కవితాఖండికలోనిది.
సందర్భము :- కవి “అహింసా” శక్తిని గురించి వివరించే సందర్భములోనిది.
భావము : చిన్నపాటి అంకుశంతో గున్నఏనుగు బంధించే కొత్త శక్తిని కనుగొన్నాను. అలాగే వట్టి చేతులతో ‘అహింస’నే ఆయుధంగా చేసుకుని శత్రువుపై దూకే శక్తిని తెలుసుకున్నాని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

ప్రశ్న 2.
అంబరాన్ని చుంబించాలి మనం
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవితా సంపుటి గ్రంథం నుండి గ్రహిబచబడినది.
సందర్భము :- మానవుడు అభ్యుదయ భావనలతో భవిష్యుత్తుపై ఆశలతో బ్రతకాలని చెప్పిన సందర్భము లోనిది.
భావము :- మానవులంతా ఆశాపాశాలతో బ్రతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనంతమైన ఈ ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ మానవులంతా సోదర భావంతో మెలగాలని ఇందలి భావం.

ప్రశ్న 3.
వెల్తికుండ తొఁదొలుకుచునుండు
జవాబు:
పరిచయం :- ఈ వాక్యం మారద వెంకయ్యచే రచింపబడిన భాస్కర శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :- నీచుడికి, గుణవంతుడికి ఉన్న లక్షణాలను కవి తెలిపిన సందర్భం లోనిది.
భావము :- వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

ప్రశ్న 4.
సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్
జవాబు:
కవి పరిచయం : భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.
సందర్భము : తన భార్య కోరికపై కుచేలుడు శ్రీకృష్ణ సందర్శనార్థమై ద్వారకా నగరము చేరుకొని-అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోదములలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచెను. వచ్చిన తన బాల్యమిత్రుడైన కుచేలుని చూచి, శ్రీకృష్ణుడు హంసతూలికా తల్పము నుండి దిగి, ప్రేమతో ఎదురేగి స్వాగతము పల్కు సందర్భములోనిదీ పద్యపాదము.
వివరణ : ఎడతెగని దారిద్య్రముచేత పీడింపబడువాడును, చిక్కిపోయిన అవయవ ములు కలవాడును, చినిగిపోయిన వస్త్రములను ధరించినవాడును, హాస్యమునకు నిలయమైన వాడునగు ఆ పేద విప్రుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ తన పాన్పుపై నుంది క్రిందికి దిగెనని పోతన వర్ణించినాడు.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 1)

ప్రశ్న 1.
శ్రీకృష్ణుడిని దర్శించేందుకు కుచేలుడు భార్యకు చెప్పిన కారణమేమిటి ?
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను.

నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ? దివ్వ దీప్తితో ప్రకాశించు అంతఃపురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వడవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టినచో వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడును. అయినను ఆయన దయ”నా భాగ్యము.

ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాలమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.

ప్రశ్న 2.
గురువు తత్వం వివరించండి ?.
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది.. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.

ప్రశ్న 3.
అధమ, మద్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు?
జవాబు:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే ‘తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

ప్రశ్న 4.
‘మహైక’ కావ్య విశిష్టతను వర్ణించండి ?
జవాబు:
‘మహైక’ కావ్యం ‘కవిరాజుమూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత కావ్యం నుండి గ్రహించబడింది. వచన కవితా ప్రక్రియలో వచ్చిన దీర్ఘకావ్యం ‘మహైక’, ఇది సెప్టెంబరు 1953లో ప్రచురించబడింది. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతితల పాత్రల పరస్పర సంభాషణలతో సాగింది.

నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్నకష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నిర్వేదంగా నివేదించుట ఈ కావ్యంలోని ముఖ్య అంశం. భవిష్యత్తుపై ఆశలను ప్రేరేపిస్తూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిని రక్షిస్తూ మానవ విలువలను తెలియచేస్తూ అసమానతలు లేని సోషలిజానికి ‘మహైక’ కావ్యం బాటలు వేసింది.

దీనికి ముందు మాటలు రాసిన బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ మాటలలో “మహోజ్జ్వలమైన ఈ ‘మహైకా’ కావ్యం చదివినపుడు ఏదో నూతనలోకాన్ని చూసినట్టుంది” అన్న మాటలే ఈ కావ్యం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. ఈ కావ్యాన్ని తెలంగాణ పోరాటయోధుడు ‘జమలాపురం కేశవరావుకు అంకితం ఇచ్చినపుడే కవి అభ్యుదయ, విప్లవాలు తెలుస్తున్నాయి. దీర్ఘ కవితలలో ‘మహైక’ అత్యంత విశిష్ట కావ్యంగా పేర్కొనవచ్చు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ధనవంతులు తమ అధికార బలాన్ని దేనికి ఉపయోగించాలి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంటకరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.

భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే ! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే ! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు. తాము సంపాదించిన ధనములో ఎంతోకొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి.

దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.

కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.

ప్రశ్న 2.
బతుకమ్మను పేర్చే విధానాన్ని వర్ణించండి.
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం’ రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలనుపరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు.

ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు. ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖరంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు.

పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది. బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో చద్దుల పులిహోర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్టించటంగా భావిస్తారు.

ప్రశ్న 3.
వరిగడ్డి మంట.
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

వరిగడ్డి ఎండినదైతే అగ్ని అంటించే తడవుగా మంటలంటుకొని కాలుతుంది. వాముగా ఉంటే మాత్రం కమ్ముకుని పొగలేచి కుమ్ముగా కాలుతుంది. వంట చెరకు అంటుకోవటానికి, పొయ్యి రాజుకోవటానికి, చలిమంటలకు బుగ్గున లేచి మంటల కోసం వరిగడ్డినే వాడతారు. ఏదైనా వరిగడ్డి బుగ్గున మండి బుగ్గయిపోతుంది. మంచివాళ్ళకు వచ్చే కోపం వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటలాంటిది. కొద్దిసేపటిలో మాయమైపోతుంది. అలాంటప్పుడు వరిగడ్డి మంటతో పోలుస్తారు.

ప్రశ్న 4.
తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది ఎందుకు ?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి, సంపాదకీయంలో వెలువడిన ‘వ్యాస గుళుచ్చం’, రెండవ భాగం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుగు, తెలుగు గ్రాంథిక రూపంలో ఈ నాలుగు ప్రాంతాలలో ఒకటిగానే ఉంటుంది. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి నాలుగు ప్రాంతాలలోనూ వేరు వేరుగా ఉంటుంది.

తెలంగాణా తెలుగు భాష మిగిలిన మూడు ప్రాంతాల భాష కంటే భిన్నంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో ఉర్దూ, హిందీ, మరాఠీ భాషా పదాలు అధికంగా ఉండటం వలన మిగిలిన ప్రాంతాల తెలుగు భాషకన్నా తెలంగాణ తెలుగు భిన్నంగా ఉంటుంది.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు (పేరు ఈదయ్య) గురించి తెలపండి ?
జవాబు:
దున్న ఇద్దాసు గొప్ప తత్త్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు ఈయన నల్గొంజిల్లా చింతపల్లి గ్రామంలో క్రీశ 1811-1919 మధ్య కాలంలో జీవించారు. తల్లిదండ్రులు దున్న రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తత్వకారుడయ్యాక ఇద్దాసు అయ్యాడు. ప్రముఖ పరిశోధనకుడు డా. బిరుదు రాజు రామరాజు ఇద్దాసును “మాదిగ మహాయోగి” గా అభివర్ణించాడు.

ఇద్దాసు చింతపల్లి గ్రామంలో మోతుబరి ఇంటి పశువుల కాపరి. రోజూ బావి దగ్గర “మోటకొడుతూ” ఆనువుగా గీతాలను ఆలపించేవాడు. ఆ గీతాలను విన్న వరసిద్ధ జంగమదేవర “పూదోట బసవయ్య ఇద్దాసు పంచాక్షరీ మంత్రోపదేశం చేశారు. లింగధారణ చేయించి శైవునిగా మార్చాడు. అడవులలో సందరిస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంలో సాధన చేశాడు. దానితో ఆయన అష్టసిద్దులను పొందాడు. పూర్వతాత్విక కవులైన శివరామదీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరాంబల ప్రభావం ఇద్దాసుపై ఉంది. ఈయన ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆమె సమాధి సందర్శనకు ఇద్దాసు కందిమల్లయ్యపల్లెను దర్శించాడు.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా వీరశైవ తత్త్వ జ్ఞానిగా కన్పిస్తాడు. పఠేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులయ్యారు. సంచార యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు తిరుగుతూ అథ్యాత్మికతను ప్రచారంచేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి మొదలగు చోట్ల ఈశ్వరమ్మ పీఠాలను స్థాపించాడు.

ఇద్దాసు 30కి పైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వచ్చిన “శ్రీ దున్న ఇద్దాసు తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 2.
కవిరాజుమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి) గురించి తెలుపండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యుల చేత “తిరుగుబాటు సాహిత్య ధ్రువతార” ప్రశంసలు అందుకున్న కవిరాజుమూర్తి అసలు పేరు ‘దేవభట్ల నరసింహమూర్తి’. వీరు అక్టోబరు 1926న ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా ఖమ్మంజిల్లా మామిళ్ళ గూడెంలో సాగింది.

ఉన్నత కుటుంబంలో పుట్టినా నాటి నియంతృత్వ భూస్వాముల అధికార పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్య సమయంలోను పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఖమ్మం జిల్లాలో “ప్రజాసాహిత్య పరిషత్తును” స్థాపించారు.

తెలుగు వచన కవితారంగంలో దీర్ఘకవితలు రాసిన తొలి తరం కవులలో మూర్తి ముఖ్యుడు. వీరి ‘మహైకా’ మానవ సంగీతం, పణుతి దీర్ఘ కవితలు ప్రశంసలను అందుకున్నాయి. ‘మైగరీబ్ హు’ అన్న ఉర్దూ నవల మంచి గుర్తింపు పొందింది. దీనిని జవ హర్లాల్ నెహ్రూకు అంకితం చేశారు. దీనిని గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు.

ఉర్దూలో హీరాలాల్ మోరియా రాసిన కావ్యాన్ని ‘మహాపథం’ పేరుతో తెలుగులోకి మూర్తి అనువదించారు. గాంధీ దివ్య చరిత్రను ‘జముకుల’ కథా రూపంలో రచించాడు. ఉర్దూలో ‘లాహుకే, లఖీర్, అంగారే నవలలను తెలుగులో ‘చివరి రాత్రి’ ‘మొదటిరాత్రి’ జారుడుబండ నవలలను రాశాడు. తెలుగులో, నవయుగశ్రీ, పేరుతో గేయాలను, ఉర్దూ పారశీకవుల గజళ్ళను ముక్తకాలుగా రాశాడు.

ప్రశ్న 3.
రావి ప్రేమలత గురించి తెలుపండి.
జవాబు:
డా. రావి ప్రేమలత జూన్ 10, 1945 ఉమ్మడి నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లెలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ. నాగిరెడ్డిలు, భువనగిరి కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, పి.హెచ్.డి. పూర్తి చేశారు. నాయని కృష్ణకుమారిగారి పర్యవేక్షణలో “తెలుగు జానపద సాహిత్యం – పురాణగాథలు” అన్న అంశంపై పరిశోధనచేసి పి.హెచ్.డి. సాధించారు.

రావి ప్రేమలత జానపద విజ్ఞానం సిద్ధాంతాల నేపథ్యంలో ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ అనే వ్యాస సంపుటిని ప్రచురించారు. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి “తెలుగు స్త్రీల చిత్రలిపి” అన్న వైవిధ్య గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతి, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకుంది.

ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకుంది. ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శ గ్రంథంగా పురస్కారం అందుకుంది. డా॥ కురుగంటి లక్ష్మీతో కలిసి ‘జ్ఞానపద విజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాస సంపుటిని వెలువరించారు. Folk Tales of South India Andhra Pradesh అనే సంకలనానికి సంపాదకత్వం వహించారు. రావి ప్రేమలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకురాలు, తంగిరాల సాహిత్య పీఠం ఉత్తమ పరిశోధకురాలిగా పురస్కారం అందుకున్నారు.

ప్రశ్న 4.
ఆచార్య రవ్వా శ్రీహరి గురించి తెలుపండి.
జవాబు:
మహా మహోపాధ్యాయ రవ్వా శ్రీహరి దక్షిణ భారతంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు పొందారు. వీరు మే 5 1943న నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెల్దుర్తి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ, నరసయ్యలు. ఎం.ఏ. తెలుగు ఎం.ఏ సంస్కృతంలో బంగారు పతకాన్ని పొందారు. “భాస్కర రామాయణం-విమర్శ నాత్మక పరిశీలన” అన్న అంశంపై పరిశోధన చేశారు. ఉస్మానియా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యునిగా పని చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించారు.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
‘మహైక ‘ కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు ?
జవాబు:
తెలంగాణ యోధుడు ‘సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితమిచ్చాడు.

ప్రశ్న 2.
అశ్వత్థామ ఎవరి కుమారుడు ?
జవాబు:
ద్రోణుడు

ప్రశ్న 3.
భాస్కర శతకకర్త ఎవరు ?
జవాబు:
మారద వెంకయ్య

ప్రశ్న 4.
నృసింహ శతక కర్త ఎవరు ?
జవాబు:
శేషప్ప కవి

ప్రశ్న 5.
నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు.
జవాబు:
నారాయణభట్టు

ప్రశ్న 6.
తెలంగాణలో గొప్ప ‘అచల’ గురువు
జవాబు:
దున్న ఇద్దాసు.

ప్రశ్న 7.
కుచేలుడు ఇంటికి వెళ్ళగానే భార్య ఎలా కనిపించింది ?
జవాబు:
మానవ రూపం దాల్చిన లక్ష్మీదేవివలె కనిపించింది

ప్రశ్న 8.
అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
అజ్ఞానాన్ని కవి “అడుసు”తో పోల్చాడు.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
చరక సంహితలో చరకాచార్యుడు ఏమని శాసించాడు ?
జవాబు:
మానవుడు నిత్యమూ సమస్త ప్రాణుల కళ్యానాన్ని కోరుకోవాలని శాసించాడు.

ప్రశ్న 2.
తెలుగు స్త్రీల ముగ్గులపై రావి ప్రేమలత రాసిన గ్రంథం పేరేమిటి ?
జవాబు:
“తెలుగు స్త్రీల చిత్రలిపి” రావి ప్రేమలత స్త్రీల ముగ్గులపై వ్రాసిన గ్రంథం

ప్రశ్న 3.
సోమన జన్మస్థలం ఏది ?
జవాబు:
ఓరుగల్లుకు 12మైళ్ళ దూరంలోని జనగామా తాలూకా పాలకుర్తి గ్రామం.

ప్రశ్న 4.
‘ఉర్దూ’ భాషకు ‘ఉర్దూ’ అను పేరు ఏ శతాబ్దంలో వచ్చింది
జవాబు:
18వ శతాబ్దంలో

ప్రశ్న 5.
సోమన తల్లిదండ్రులెవరు ?
జవాబు:
తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు

ప్రశ్న 6.
బొంబాయిలో మహిళా విద్యాపీఠాన్ని ఎవరు స్థాపించారు ?
జవాబు:
బొంబాయిలో మహిళా విద్యాపీఠాన్ని స్థాపించినవారు ‘కార్వే’ మహాశయుడు.

ప్రశ్న 7.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 8.
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యమేది ?
జవాబు:
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం వాల్మీకి రచించిన ‘రామాయణం’.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి.
జవాబు:
ఉద్యోగానికి లేఖ

నల్లగొండ,
26.07.2023.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము : నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2023.
ఆర్యా,
ఈ నెల తేది 20.07.2023 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు :

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

ప్రశ్న 2.
బదిలీ పత్రము (టి.సి.) కొరకు కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ రాయండి.
జవాబు:
కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ

కరీంనగర్,
15-06-2023.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.

విషయము : టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం. పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.
కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12).

1) భ్రమలన్నీ
జవాబు:
భ్రమలన్నీ = భ్రమలు + అన్ని = ఉకార సంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

2) గతమంత
జవాబు:
గతమంత = గతము + అంత = గతమంత – ఉత్వసంధి/ ఉకారసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

3) పోతుందయా
జవాబు:
పోతుందయా – పోతుంది + అయ – ఇత్వసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధివైకల్పికముగానను ఏమ్యాదులు అనగా ఏమి, మది,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి ఏది ఏవి మొదలగునవి.

4) దివ్యాంబర
జవాబు:
దివ్యాంబర : దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి:
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

5) లేదెన్నటికి
జవాబు:
లేదెన్నటికి – లేదు+ఎన్నటికి – లేదెన్నటికి – ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

6) అణ్వస్త్రము
జవాబు:
అణ్వస్త్రము : అణు+అస్త్రము = అణ్వస్త్రము – యణాదేశ సంధి
సూత్రము :- ఇ.డి. ఋ అనువానికి అసవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమముగా య,వ,ర,ల అనునవి ఆదేశముగా వచ్చును.

7) వాలుఁగన్నులు
జవాబు:
వాలుఁగన్నులు : వాలున్ + కన్నులు = సరళాదేశ సంధి = ఉకరా సంధి
సూత్రం : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

8) సూకరంబునకేల
జవాబు:
సూకరంబునకేల = సూకరంబునకు + ఏల = ఉకరా సంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8).

1) నరజాతి
జవాబు:
నరజాతి – నరుల యొక్క జాతి – షష్ఠీతత్పురుష సమాసం

2) ఆలు పిల్లలు
జవాబు:
ఆలు పిల్లలు – ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం

3) చూతఫలము
జవాబు:
చూతఫలము – చూతము (మామిడి) అనెడి ఫలము – రూపక సమాసము

4) విపులతేజుడు
జవాబు:
విపులతేజుడు – విపులమైన తేజం కలవాడు – బహువ్రీహి సమాసం

5. చక్రపాణి
జవాబు:
చక్రపాణి – చక్రము పాణియందుకలవాడు – బహువ్రీహి కర్మధారయ సమాసము

6) ఇలాగోళము
జవాబు:
ఇలాగోళము : భూమి యొక్క గోళము – షష్ఠీతత్పురుష సమాసం

7) దివ్యబాణం
జవాబు:
దివ్యబాణం – దివ్యమైన బాణం – విశేషణపూర్వపద కర్మధారయం

8) శబ్దధాటి
జవాబు:
శబ్దధాటి : శబ్దము యొక్క ధాటి – విశేషణ పూర్వపద కర్మధారయము

XIV. ఈ క్రింది అంశాలలో ఒక దానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు.

ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని,. ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం

ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు.

మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు.. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

2. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు.. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు.

అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా -మారిపోయింది.

ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే.అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం. ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది.

ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం, కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం.

మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం -వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇప్పుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం. అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

3. జాతీయ విపత్తులు
జవాబు:
జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి,.ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి..

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే. సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు.

విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ

విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్ 19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.

2. A picture is a poem without words.
జవాబు:
పదాలు లేని పద్యమే చిత్రం

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

3. Maturity comes with experience not age.
జవాబు:
పరిణతి, వయసుతో కాదు, అనుభవంతో వస్తుంది.

4. A journey of thousand miles begins with a single step.
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

5. There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

వచనకవిత్వ వికాసంలో భాగంగా వచనకవిత విభిన్న లఘురూపాలుగా వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలో కవిత్వచరిత్రలో ప్రాచుర్యం పొందిన మినీకవిత, . హైకూ, నానీల. ప్రక్రియలను స్థూలంగా తెలుసుకుందాం. 1970వ దశకం నుండి మినీకవిత వెలుగులోకి వచ్చింది. పదిపంక్తులు మించకుండా సంక్షిప్తంగా సూటిగా కొసమెరుపుతో చెప్పగలగడం మినీకవిత ప్రధాన లక్షణం.

మినీకవితలో ధ్వని, వ్యంగ్యం ప్రాధాన్యం వహిస్తాయి. మినీకవితలపై 1977లో నండూరి రామమోహనరావు మొదలుపెట్టిన చర్చ మినీకవిత్వోద్యమంగా మారింది. అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీ లైఫ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన మినీకవితలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘మినీకవిత ఆయుష్షు మెరుపంత, కాని అది ప్రసరిస్తుంది కాలమంత’ అని డా|| సి. నారాయణ రెడ్డి మినీకవితా ప్రక్రియను నిర్వచనాత్మకంగా ప్రశంసించాడు.

జపాన్ కవి బషో సృష్టించిన కవితా ప్రక్రియ ‘హైకూ’. హైకూలో మూడుపాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడోపాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది. హైకూ జైన, బౌద్ధ తాత్త్వికతను, ప్రకృతి సౌందర్యాన్ని, మార్మిక అంశాలను ధ్యాన ఛాయలతో ఆవిష్కరిస్తుంది.

తెలుగులో హైకూ ప్రక్రియను గాలి నాసరరెడ్డి రేఖామాత్రంగా పరిచయం చేసాడు. ఇస్మాయిల్ హైకూ ప్రక్రియను విస్తృత పరిచాడు. తెలుగులో పదిహేడు అక్షరాల నియమం పాటించకుండా మూడు పొడుగు పాదాలతో హైకూలు. రాసినవారే ఎక్కువ.

నానీల ప్రక్రియ రూపకర్త డా॥ ఎన్. గోపి. 1997లో వార్త దినపత్రిక ఎడిట్ పేజీలో నానీలు తొలిసారిగా సీరియల్గా వెలువడినాయి. నానీలు అంటే ‘చిన్నపిల్లలు’, ‘చిట్టి పద్యాలు అని అర్ధం. నావీ, నీవీ వెరసి మన భావాల సమాహారమే నానీలు, నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా . నానీ నడుస్తుంది. ఈ నాలుగు పాదాల నానీలో మొదటి, రెండు పాదాల్లో ఒక భావాంశం, చివరి రెండుపాదాల్లో మరొక భావాంశం ఉంటాయి. మొదటి దానికి రెండోది సమర్థకంగా ఉంటుంది.

కొన్ని వ్యాఖ్యానా త్మకం గాను, వ్యంగ్యాత్మకంగాను ఉంటాయి.. ఇప్పటివరకు నానీలను ప్రముఖ, వర్ధమాన కవులు రాయడం విశేషం. ఈ ఇరవైమూడు. సంవత్సరాల్లో నానీలు మూడువందల యాభై సంపుటాలు రాగా, వందలాది కవులు నానీలు రాయడం నానీ ప్రక్రియకున్న శక్తికి, ఆదరణకు నిదర్శనం. భారతీయ సాహిత్య చరిత్రలో లఘు ప్రక్రియను అనుసరిస్తూ ఇన్ని గ్రంథాలు వెలువడడం అద్భుతమైన విషయం.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
‘సిటీ లైఫ్’ పేరుతో మినీకవితల్ని రాసిన కవి. ఎవరు?
జవాబు:
అలిశెట్టి ప్రభాకర్

ప్రశ్న 2.
మినీ కవితను నిర్వచనాత్మకంగా ప్రశంసించిన కవి ఎవరు?
జవాబు:
డా॥ సి. నారాయణరెడ్డి

ప్రశ్న 3.
హైకూలోని పాదాలు, అక్షరాల నియమాలను తెలుపండి.
జవాబు:
హైకులో మూడు పాదాలుంటాయి. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడవ పాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం 17 అక్షరాలతో హైకు కవిత రూపొందుతుంది.

ప్రశ్న 4.
నానీల్లోని పాదాలు, అక్షరాల నియమాలను వివరించండి.
జవాబు:
నానీలో నాలుగు పాదాలు ఉంటాయి. నాలుగు పాదాలలో ఇరవై అక్షరాలకు తగ్గకుండా; ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది.

ప్రశ్న 5.
నానీలు తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమైనాయి ?
జవాబు:
1997లో వార్తా దినపత్రిక ఎడిట్ పేజీలో సీరియస్ గా ప్రచురితమైనాయి.

Leave a Comment