AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు

Students get through AP Inter 2nd Year Botany Important Questions 8th Lesson వైరస్లు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 8th Lesson వైరస్లు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వైరస్లలో గల జీవ, నిర్జీవ లక్షణాలను తెలపండి.
జవాబు:
వైరస్ జీవలక్షణాలు:

  1. కేంద్రకామ్లం ( DNA లేదా RNA)ను కలిగి ఉంటాయి.
  2. ఇవి అవికల్పకణాంతస్థ పరాన్నజీవులు.
  3. ఇవి ఉత్పరివర్తనాలకు లోనవుతాయి.
  4. ఇవి అతిథేయి కణంలో ప్రత్యుత్పత్తిని జరుపుతాయి.

వైరస్ నిర్జీవ లక్షణాలు:

  1. ఇవి కణవ్యవస్థను కలిగి ఉండవు. ఇవి కణరహితాలు.
  2. జీవ క్రియలను ప్రదర్శించవు.
  3. అతిథేయి వెలుపల ఇవి స్ఫటీకలుగా లేదా రేణువులుగా ఉంటాయి.
  4. ఇవి పెరుగుదల ప్రక్రియను ప్రదర్శించవు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు

ప్రశ్న 2.
T4 ఫాజ్ ఆకారం ఏమిటి? దానిలోని జన్యుపదార్ధాన్ని తెలపండి.
జవాబు:

  1. T4 ఫాజ్ వైరస్ ‘తోక కప్ప’ ఆకృతిలో ఉంటుంది.
  2. దీనిలోని జన్యుపదార్ధం రెండు పోచల DNA.

ప్రశ్న 3.
విరులెంట్ ఫాజ్లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. E కోలై బాక్టీరియాలపై దాడి చేసే వైరస్లను ‘విరులెంట్ ఫాజ్లు’ అంటారు.
  2. అతిధేయిలోకి ప్రవేశించిన వెంటనే అవి అతిధేయిని చంపివేస్తాయి.
  3. ఉదా: ‘ఆంకో జెనిక్ వైరస్లు’ T- ఈవెన్ ఫాజ్లు

ప్రశ్న 4.
లైసోజైమ్ అంటే ఏమిటి? దాని విధి ఏమిటి? [TS MAR-16]
జవాబు:

  1. ‘లైసోజైమ్’ అనే ఎన్ఎమ్ అతిధేయి కణం యొక్క ప్లాస్మాత్వచంను కరిగిస్తుంది.
  2. ఇది కణకవచంను విచ్ఛిన్నం చేసి, కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువులు (లేదా) విరియన్లను విడుదల చేస్తుంది.

ప్రశ్న 5.
వైరస్లకు సంబంధించి ‘విచ్ఛిన్నం’, ‘పగిలే పరిమాణం’ లను నిర్వచించండి. అతిథేయి కణాలపై వాటి ప్రభావం ఏమిటి?
జవాబు:

  1. విచ్ఛిన్నం (లైసిస్): అతిధేయి యొక్క ప్లాస్మాత్వచాన్ని కరిగించి, విరియన్లు విడుదలయ్యే ప్రక్రియను విచ్ఛిన్నం అంటారు.
  2. పగిలే పరిమాణం: ఒక కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే ఫాజ్ రేణువుల ను ‘పగిలే పరిమాణం’ అంటారు. ఇవి సాధారణంగా 50-200 వరకు ఉంటాయి.

ప్రశ్న 6.
ప్రోఫాజ్ అంటే ఏమిటి?
జవాబు:
ప్రోఫాజ్:లైసోజెనిక్ చక్రం నందు అతిధేయి కణంలోనికి ప్రవేశపెట్టబడిన ఫాజ్ DNA ను ప్రోఫాజ్ అంటారు.

ప్రశ్న 7.
టెంపరేట్ ఫాజ్లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. టెంపరేట్ ఫాజ్లు: ప్రోఫాజ్లను ఉత్పత్తి చేయుటకు అతిధేయి కణంలోకి ప్రవేశపెట్టబడిన ఫాజ్ DNA లను టెంపరేట్ ఫాన్లు అంటారు.
  2. ఇది లైసోజెనిక్ చక్రం నందు జరుగుతుంది, కాని అతిధేయి కణం యొక్క విచ్ఛిన్నం జరగదు.
    ఉదా: కోలిఫాజ్ 2

ప్రశ్న 8.
విరులెంట్ ఫాజ్లు, టెంపరేట్ ఫాజ్లు మధ్య భేదాలను తెలపండి? [AP MAR-15]
జవాబు:

  1. విరులెంట్ ఫాజ్లు: లైటిక్ చక్రం ద్వారా మాత్రమే ప్రతికృతి చెందే ఫాజ్లను విరులెంట్ ఫాజ్లు అంటారు. ఉదా: T– సరిసంఖ్య ఫాజ్లు
  2. టెంపరేట్ ఫాజ్లు:లైటిక్ మరియు లైసోజెనిక్ చక్రం రెండింటి ద్వారా ప్రతికృతి చెందే ఫాజ్లను టెంపరేట్ ఫాన్లు అంటారు. ఉదా: కోలిఫాజ్ 2.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు

ప్రశ్న 9.
TMV ఆకారం ఏమిటి? దానిలోని జన్యుపదార్ధం ఏమిటి?
జవాబు:

  1. TMV దండాకారంలో ఉంటుంది.
  2. దీని జన్యుపదార్ధం ఏక పోచయుత RNA, 6500 న్యూక్లియోటైడ్లను కలిగి ఉంటుంది.
  3. TMV అంటే టుబాకో మొజాయిక్ వైరస్.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ICTVఅంటే ఏమిటి? వైరస్లను నామీకరణం చేసే విధానం ఏమిటి? [TS MAR-15] [TS M-19]
జవాబు:

  1. ICTV అనగా – ఇంటర్నేషనల్ కమిటి ఆన్ టాక్సానమి ఆఫ్ వైరసెస్.
  2. ఇది వైరస్ల యొక్క వర్గీకరణను మరియు నామీకరణను నియంత్రిస్తుంది.
  3. ICTV నందు మూడు వర్గీకరణ స్థాయిలు ఉంటాయి. అవి కుటుంబం, ప్రజాతి మరియు జాతి.
  4. ‘కుటుంబం పేరు విరిడే’ అనే పదంతో అంతమవుతుంది.
  5. ‘ప్రజాతి పేరు వైరస్’ అనే పదంతో అంతమవుతుంది.
  6. జాతినామాలు వాటి స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణ ఆంగ్ల భాషలో వ్యక్తపరచబడతాయి.
  7. కొన్ని సందర్భాలలో వైరస్ల నామీకరణ, అది కలుగజేసే వ్యాధులను బట్టి ఉంటుంది. ఉదా: పోలియో వైరస్
  8. ICTV పద్ధతిలో AIDS వైరస్ ను ఈ క్రింది విధంగా వర్గీకరించారు.
    కుటుంబం: రిట్రోవిరిడే; ప్రజాతి: లెంటి వైరస్; జాతి: హ్యుమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్(HIV)

ప్రశ్న 2.
వైరస్ల రసాయన నిర్మాణాన్ని వివరించండి. [AP MAR-20]
జవాబు:

  1. అన్ని వైరస్లు రెండు ప్రాధమిక అంశాలను కలిగి ఉంటాయి. a) కేంద్రకామ్లం (కోర్) b) కాప్సిడ్
  2. కేంద్రకామ్లం యొక్క కోర్ ‘జీనోమ్’ ను ఏర్పరుస్తుంది.
  3. కాప్సిడ్ అనేది కోర్ ఆవరించియున్న ప్రోటీన్ త్వచం.
  4. కాప్సిడ్ వైరస్కు ఆకారాన్ని మరియు రక్షణనిస్తుంది.
  5. కాప్సీడ్ అనేది ప్రోటీన్ ఉప ప్రమాణాలైన కాప్సోమియర్లతో నిర్మితమవుతుంది.
  6. ప్రతి వైరస్కు దాని కాప్సోమియర్ల సంఖ్య ‘గుర్తింపు లక్షణం’ గా ఉంటుంది.
  7. వైరస్ యొక్క జీనోమ్ ఏక పోచయుత DNA లేదా ద్విసర్పిలాకార DNA ను కలిగి ఉంటుంది.
  8. సాధారణంగా మొక్కలను ఆశించే వైరస్లు ssRNA మరియు జంతువులను ఆశించే వైరస్లు dsDNAను కలిగి ఉంటాయి.
  9. వైరల్ కేంద్రకామ్ల అణువులు వలయాకారంగా గాని లేదా దీర్ఘాకారంలోగాని ఉంటాయి.
  10. అనేక వైరస్లు ఒకే కేంద్రకామ్ల అణువును కలిగి ఉంటాయి. కాని కొన్ని ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉంటాయి.
  11. ఉదా: HIV. ఇది రెండు సారూప్యత గల RNA అణువులను కలిగి ఉంటుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు

ప్రశ్న 3.
వైరస్ల సౌష్ఠవం గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
వైరస్ల సౌష్ఠవం ‘కాప్సిడ్ ని కాప్సోమియర్ల’ అమరికపై ఆధారపడి ఉంటుంది.

సౌష్ఠవం రకాలు:
1) సర్పిల సౌష్ఠవం: సర్పిల వైరస్లు సర్పిల సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఇవి పొడవైన దండాకారంలో ఉంటాయి. కాప్సోమియర్లు కేంద్రకామ్లం చుట్టూ సర్పిల సౌష్ఠవంలో అమరి ఉంటాయి.
ఉదా: TMV వైరస్లు, రేబిస్ వైరస్లు

2) బహుభుజాకృతి సౌష్ఠవం: కాప్సిడ్ బహుభుజాలతో మరియు కాప్సోమియర్లు ఏకభుజాకృతి సౌష్టవంను కలిగి ఉంటాయి.
ఉదా: అనేక జంతు మరియు వృక్ష వైరస్లు అయిన ‘పోలియో’ మరియు ‘హెర్పిస్ సింప్లెక్స్’,

3) సౌష్ఠవం: ‘బాక్టీరియోఫాజ్లు’ బహుభుజాకృతి సౌష్ఠవంను తలభాగంలో, సర్పిలాకార సౌష్ఠవంలను తోకతొడుగు భాగంలో కలిగి ఉంటాయి.

4) గోళాకార సౌష్ఠవం: ‘ఆచ్ఛాదిత వైరస్లు’ గోళాకారం సౌష్ఠవంను కలిగి ఉంటాయి. ఉదా: ఇన్ఫ్లూయెంజా వైరస్.

ప్రశ్న 4.
TMV నిర్మాణాన్ని వివరించండి. [AP MAR-18][AP MAY-17,22][TS MAR, MAY-17]
జవాబు:

  1. TMV అంటే టుబాకో మొజాయిక్ వైరస్
  2. TMV అనేది ssRNA వైరస్, ఇది పొగాకు మొక్కకు వ్యాధిని సంక్రమింపజేస్తుంది.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు 1
  3. TMV వైరస్ దండాకారంలో ఉంటుంది. ఇది సుమారుగా 300nm పొడవు మరియు 18nm వ్యాసం, 39×106 డాల్టన్ అణుభారంతో ఉంటుంది.
  4. దీని యొక్క కాప్సిడ్ 2,130 ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. వీటినే కాప్సోమియర్లు అంటారు.
  5. ఈ కాప్సోమియర్లు మధ్యలో 4nm తో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి, సర్పిల క్రమంలో అమరి ఉంటాయి.
  6. ప్రతి ప్రోటిన్ ఉపప్రమాణం 158 అమైనో ఆమ్లాలతో ఏర్పడి వుంటుంది.
  7. కాప్సిడ్ లోపల, ఒకే పోగు గల సర్పిలాకారంలో చుట్టుకొని వున్న RNA అణువు, 6,500 న్యూక్లియోటైడ్లతో ఉంటుంది.

ప్రశ్న 5.
T- సరిసంఖ్య గల బాక్టీరియోఫాజ్ల నిర్మాణాన్ని వివరించండి. [TS MAR-18,20][AP MAR-17]
జవాబు:

  1. బాక్టీరియాలపై దాడి చేసే వైరస్లను బాక్టీరియోఫాజ్లు అంటారు.
  2. బాక్టీరియోఫాజ్లు తోక కప్ప ఆకృతిలో పొడవాటి తల మరియు ఒక తోకను కలిగి ఉంటాయి.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు 2
  3. దీని తల షడ్భుజాకృతిలో ఉండి, పైభాగం షడ్భుజాకృతి పిరమిడ్ తో కప్పబడి వుంటుంది.
  4. తోక భాగం ఒక తోక తొడుగు, ఒక ఆధారఫలకం, పిన్లు మరియు తోక పోచలతో ఏర్పడి ఉంటుంది.
  5. తోక తొడుగు వైరస్ DNA ను అతిధేయి కణంలోకి ప్రవేశపెట్టడానికి సహయపడుతుంది.
  6. తల మరియు తోక, కాలర్ ద్వారా కలుపబడి ఉంటాయి.
  7. తోక చివరి భాగంలో షడ్భుజాకారంలో తోక ఫలకం, ఆరు తోక విన్లు మరియు తోక పోచలతో ఉంటుంది.
  8. తోక పోచల సహయంతో వైరస్ అతిధేయి కణానికి అంటి పెట్టుకుని ఉంటుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు

ప్రశ్న 6.
కొన్ని వైరస్లకు సంబంధించి లైటిక్ చక్రాన్ని వివరించండి. [AP MAR-16,19]
జవాబు:

  • T- సరిసంఖ్య ఫాజ్లు ఎ.కోలై అనే బాక్టీరియమ్లపై దాడి చేస్తాయి.
  • ఇవి అతిధేయి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజ్లు అంటారు.
  • ‘లైటిక్ చక్రం’ అయిదు దశలను కలిగి వుంటుంది. అవి

1) అంటిపెట్టుకొనుట: వైరస్ యొక్క తోకపోచలు, బాక్టీరియమ్ కణకవచం మీద సంపూరక గ్రహీతస్థానాల వద్ద అంటిపెట్టుకోవడానికి సహయపడతాయి.

2) ప్రవేశం:

  • బాక్టీరియా కణంలోకి ఫాజ్ కేంద్ర కామ్లం చొచ్చుకొనిపోతుంది. దీనినే ప్రవేశం అంటారు.
  • తోక కేంద్రభాగం బాక్టీరియమ్ల కణకవచం ద్వారాలోనికి చొచ్చుకొనిపోతుంది.
  • బాక్టీరియోఫాజ్ల యొక్క DNA ప్లాస్మాత్వచంను చేరి అక్కడ నుంచి బాక్టీరియా కణంలోకి ప్రవేశిస్తుంది.
  • ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె విధిని నిర్వహిస్తూ DNA ని బాక్టీరియమ్ కణంలోకి చొప్పిస్తుంది.
  • బాక్టీరియమ్ కణం వెలుపలే ఉన్న కాప్సిడ్ను ‘ఘోస్ట్’ అని అంటారు.

3) జీవసంశ్లేషణ:

  1. ఒకసారి ఫాజ్ DNA అతిధేయి కణంలోని కణద్రవ్యంలోకి చేరిన మీదట అతిధేయి కణ యాంత్రకాన్ని వినియోగించుకొని, అనేక ఫాజ్ DNA నకళ్ళు, ఎన్జైమ్లు మరియు కాప్సిడ్ ప్రోటీన్లు సంశ్లేషణ చెందుతాయి.
  2. పూర్తి ఫాజ్లు అతిధేయి కణంలో కనిపించవు.

4) పరిపక్వత

  1. ఈ ప్రక్రియలో ఫాజ్ DNA మరియు కాప్సిడ్లు పూర్తి విరియన్లుగా ఏర్పడతాయి.
  2. వైరస్చే సంక్రమణ జరిగి మరియు కణంలో ముదిరిన వైరస్ కనిపించేంత వరకు పట్టే కాలాన్ని ‘గుప్తదశ’ అంటారు.

5) విడుదల:

  1. వైరస్ వృద్ధిలో చివరి దశ అతిధేయి కణం విచ్ఛిన్నం అయ్యే దశ.
  2. అతిధేయి కణం యొక్క ప్లాస్మా త్వచం, అతిధేయి ఎన్జైమ్ అయిన లైసోజైమ్ చేత కరిగించబడుతుంది.
  3. అతిధేయి కణకవచం పగిలిపోయి, కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువులు (లేదా) విరియన్లు విడుదలవుతాయి.

ప్రశ్న 7.
జన్యువహనంలో టెంపరేట్ఫాన్లు ఏ విధమైన పాత్ర వహిస్తాయో వివరించండి.
జవాబు:

  1. కొన్ని ఫాజ్ల లాంటి బాక్టీరియోఫాజ్లు వృద్ధి చెందేటపుడు అతిధేయి కణం విచ్ఛిన్నం చెందడంగానీ, నాశనం చెందడం కానీ జరగదు.
  2. దీనికి బదులు ఫాజ్ DNA ఎ.కొలై కణంలోకి ప్రవేశించి వలయాకార బాక్టీరియాతో సమాకలితమై దానిలో ఒక భాగమై గుప్తంగా ఉండిపోతుంది.
  3. ఇటువంటి ఫాజ్లను ‘టెంపరేట్ ఫాజ్లు’ అంటారు. ఇలా కలిసిపోయిన ఫాజ్ DNA ను ‘ప్రోఫాజ్’ అంటారు.
  4. ప్రోఫాజ్ ‘తర్వాతి సంతతి’ కణాలలో క్లుప్తంగా ఉండిపోతుంది.
  5. కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనలలో లేదా అతిధేయి కణం అతినీలలోహిత కాంతికిగాని లేదా కొన్ని రసాయనాల ప్రభావానికి గురి అయినప్పుడు, ఫాజ్ DNA బాక్టీరియల్ జన్యుపదార్థం నుంచి విడిపోయి ‘లైటిక్ చక్రం’ ప్రారంభానికి దారి తీస్తుంది.
  6. ఈ లైసోజెనిక్ చక్రం ‘జన్యువహనం’కు దారి తీస్తుంది.

ప్రశ్న 8.
లైటిక్, లైసోజెనిక్ చక్రాల మధ్య భేదాలు తెలపండి.
జవాబు:
లైటిక్ చక్రం

  1. లైటిక్ చక్రం చివరి దశలో బాక్టీరియా కణం ‘విచ్ఛిన్నం’ చెందుతుంది.
  2. బాక్టీరియల్ DNA విచ్ఛిన్నం లేదా నాశనం చెందిన తరువాత వైరల్ DNA ప్రవేశిస్తుంది.
  3. ప్రోఫాజ్లు ఏర్పడవు. విరులెంట్ పాట్లు వలన బాక్టీరియా మనుగడ కొనసాగదు.
  4. ఈ వైరస్ లను ‘విరులెంట్’ లు అంటారు. ఉదా: T-సరిసంఖ్యఫాజ్

లైసోజెనిక్ చక్రం

  1. లైసోజెనిక్ చక్రంలో బాక్టీరియ కణం విచ్ఛిన్నం చెందదు.
  2. బాక్టీరియల్ DNA నాశనం చెందకుండా, వైరల్ DNA ఇమిడిపోతుంది.
  3. బాక్టీరియల్ కణం అనేక విభజన చక్రాలను జరిపిన తరువాత కూడా ప్రోఫాజ్లు శాశ్వత అనుబంధాన్ని ఎక్కువ కాలం వరకు కొనసాగిస్తాయి.
  4. అటువంటి వైరస్లను ‘టెంపరేట్ పాన్లు’ అంటారు. ఉదా: కోలిపాజ్ -2.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వైరస్ల ఆవిష్కరణ, నిర్మాణాత్మక సంవిధానాన్ని గురించి రాయండి.
జవాబు:

  1. ఆది నుంచి వైరస్లు మానవులలో వ్యాధులను కలుగజేస్తున్నాయి. కాని అవి మొక్కలు మరియు జంతువుల దృష్ట్యా ఆర్ధికంగా ఉపయోగకరమైనవి.
  2. ‘జెర్మ్ ధియరీ ఆఫ్ డిసీస్’ ప్రతిపాదించిన కాలం నాటికి కూడా ఈ వ్యాధులకు కారణమైన కారకాన్ని గుర్తించలేదు.
  3. రష్యన్ పెథాలజిస్ట్ ఐవనోస్కీ (1892) పొగాకు మొజాయిక్ వ్యాధి గురించి అధ్యయనం చేసారు.
  4. అతడు వ్యాధిగ్రస్తమైన పొగాకు పత్ర సారాన్ని వడపోత పరికరం ద్వారా గాలనం జరిపాడు.
  5. ‘వ్యాధికారకం’ వడపోత రంధ్రాల ద్వారా ప్రయాణించింది. .
  6. ఈ గాలనీయ ద్రవాన్ని ఆరోగ్యవంతమైన మొక్కలోకి ప్రవేశపెట్టిన తరువాత, అతడు దానిలో మొజాయిక్ వ్యాధి చిహ్నలు అభివృద్ధి చెందడాన్ని గుర్తించాడు.
  7. తేటగా ఉన్న ద్రవంలో ఏ సూక్ష్మజీవిని చూడనప్పటికి, ఐవనోస్కీ ఒక గాలనీయ కారకం వ్యాధికి కారణమై ఉంటుందని తెలియజేసాడు.
  8. బైజరింక్ అనే శాస్త్రవేత్త ఐవనోస్కీ చేసిన ప్రయోగాలను పునఃప్రయోగించి, ఆ వ్యాధి కారకం “సజీవ సంక్రియ ద్రవం” అని నిర్ధారించాడు.
  9. పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగించే వైరసన్ను W.M. స్టాన్లీ. (1935) స్ఫటికీకరణ గావించాడు.
  10. దీనికి ‘పొగాకు మొజాయిక్ వైరస్’ అని పేరు పెట్టారు.
  11. ఫ్రెంకెల్ కమ్రాట్ (1956) అనే శాస్త్రవేత్త TMV మొక్క యొక్క జన్యు పదార్ధం RNA అని నిర్ధారణ చేశాడు.
  12. అపధృవ అపకేంద్రీకరణ, x-ray కిరణ క్రిస్టల్లోగ్రఫి మరియు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పద్ధతుల అనేక కొత్త వైరస్లను గుర్తించి, వాటి అతి సూక్ష్మ నిర్మాణాన్ని వివరించగలిగారు.

ప్రశ్న 2.
వైరస్ల వృద్ధి విధానాన్ని వర్ణించండి?
జవాబు:
T- సరిసంఖ్య ఫాజ్లు ఎ. కోలై అనే బాక్టీరియమ్లపై దాడి చేస్తాయి.
ఇవి అతిధేయి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి, వీటిని విరులెంట్ ఫాజ్లు అంటారు.
లైటిక్ చక్రం అయిదు దశలను కలిగి వుంటుంది. అవి
1) అంటిపెట్టుకొనుట: వైరస్ యొక్క తోకపోచలు, బాక్టీరియమ్ల కణకవచం మీద సంపూరక గ్రహీతస్థానాల వద్ద అంటిపెట్టుకోవడానికి సహాయపడతాయి.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు

2) ప్రవేశం:

  1. బాక్టీరియా కణంలోకి ఫాజ్ కేంద్ర కామ్లం చొచ్చుకొనిపోతుంది. దీనినే ప్రవేశం అంటారు.
  2. తోక కేంద్రభాగం బాక్టీరియమ్ల కణకవచం ద్వారం లోనికి చొచ్చుకొనిపోతుంది.
  3. బాక్టీరియోఫాజ్ల యొక్క DNA ప్లాస్మాత్వచంను చేరి అక్కడ నుంచి బాక్టీరియా కణంలోకి ప్రవేశిస్తుంది.
  4. ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె విధి నిర్వహిస్తూ DNA బాక్టీరియమ్ను కణంలోకి చొప్పిస్తుంది.
  5. బాక్టీరియమ్ కణం వెలుపలే ఉన్న కాప్సిడ్ను ఘోస్ట్ అని అంటారు.

3) జీవసంశ్లేషణ:

  1. ఒకసారి ఫాజ్ DNA అతిధేయి కణంలోని కణద్రవ్యంలోకి చేరిన మీదట అతిధేయి కణ యాంత్రకాన్ని -వినియోగించుకొని అనేక ఫాజ్ DNA నకళ్ళు, ఎన్ఎమ్లు మరియు కాప్సిడ్ ప్రోటీన్లు సంశ్లేషణ చెందుతాయి.
  2. పూర్తి ఫాజ్లు అతిధేయి కణంలో కనిపించవు.

4) పరిపక్వత:

  1. ఈ ప్రక్రియలో ఫాజ్ DNA మరియు కాప్సిడ్ల పూర్తి విరియన్లుగా ఏర్పడతాయి.
  2. వైరస్చే సంక్రమణ జరిగి మరియు కణంలో ముదిరిన వైరస్ కనిపించేంత వరకు పట్టే కాలాన్ని ‘గుప్తదశ’ అంటారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు 3

5) విడుదల:

  1. వైరస్ వృద్ధిలో చివరి దశ అతిధేయి కణం విచ్ఛిన్నం అయ్యే దశ.
  2. అతిధేయి కణం యొక్క ప్లాస్మా త్వచం, అతిధేయి కరిగించబడుతుంది.
  3. అతిధేయి కణకవచం పగిలిపోయి, కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువులు (లేదా) విరియన్లు విడుదలవుతాయి.

లైసోజెనిక్ చక్రం:

  1. బాక్టీరియోఫాజ్ల ద్వారా జన్యుపదార్ధం ఒక బాక్టీరియమ్ నుంచి వేరొక బాక్టీరియము రవాణా చెందడాన్ని ‘జన్యువహనం’ అంటారు.
  2. టెంపరేట్ ఫాజ్లు అనేవి జన్యువహనం లో ముఖ్యపాత్రను పోషిస్తాయి.
  3. లామ్డా (λ) ఫాజ్ల లాంటి బాక్టీరియోఫాజ్లు వృద్ధి చెందేటపుడు అతిధేయికణం విచ్ఛిన్నం చెందడంగానీ, మరియు చనిపోవడం గాని జరగదు.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 8 వైరస్లు 4
  4. ఫాజ్ DNA ఈ.కోలై కణంలోకి ప్రవేశించాక బాక్టీరియాలో DNAలో సమాకలితమై ఉండిపోతుంది.
  5. గుప్తంగా ఉన్న బాక్టీరియలో DNAను టెంపరేట్ ఫాజ్లు అని కూడా అంటారు.
  6. ఈ ఫాజ్ DNA ను ప్రోఫాజ్ అని అంటారు.
  7. ప్రతిసారి బాక్టీరియా యొక్క జన్యుపదార్ధం ప్రతికృతి చెందుతుంది.
  8. ప్రోఫాజ్ కూడా ప్రతికృతికి లోనవుతుంది.
  9. తర్వాతి సంతతి కణాలలో ప్రోఫాజ్ గుప్తంగా ఉండిపోతుంది.
  10. కొన్ని అరుదైన సంఘటనలలో అతిధేయి కణమును UV కిరణాలకు గురి చేసినపుడు, ఫాజ్ DNA బాక్టీరియల్ జన్యుపదార్ధం నుంచి విడిపోయి, లైటిక్ చక్రం ప్రారంభానికి దారి తీస్తుంది.

Leave a Comment