AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి

Students get through AP Inter 1st Year Zoology Important Questions 5th Lesson గమనం, ప్రత్యుత్పత్తి which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Zoology Important Questions 5th Lesson గమనం, ప్రత్యుత్పత్తి

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
కశాభం అడ్డుకోత పటంగీసి భాగాలను గుర్తించండి? [AP-18, TS May-17]
జవాబు:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి 1

ప్రశ్న 2.
కశాభానికీ, శైలికకీ మధ్య రెండు భేదాలు రాయండి. [AP M-17,19,20] [TS M-16,18,20]
జవాబు:

  1. ‘కశాభా’ పొడవైన కొరడాలాంటి గమనాంగం. కాని ‘శైలిక’ పొట్టి రోమాల వంటి గమనాంగం.
  2. కశాభా తరంగ చలనాన్ని మరియు శైలికలు లోలక చలనాన్ని చూపిస్తాయి.
  3. ‘కశాభా’ చలనానికి సహయపడుతుంది. కాని శైలిక చలనానికి, ఆహర సేకరణకు, పదార్థాల కదలికల మరియు స్పర్శకు సహాయపడతాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి
ప్రశ్న 3.
డైనీస్ భుజాలు అంటే ఏమిటి? వాటి విశిష్ఠత ఏమిటి? [TS M-19]
జవాబు:

  1. కశాభాలు మరియు శైలికలు రెండూ కూడా ‘డైనీన్ భుజాల’ ను కలిగి ఉంటాయి.
  2. కశాభంలో కేంద్రీయ సూక్ష్మనాళిక ‘A’ కు జతల భుజాలు ఉంటాయి. ఇవి డైనీన్ అనే ప్రోటీన్ నిర్మితాలు. వీటిని డైనీన్ బాహువులు అంటారు. ఇవి డైనీన్ అనే ప్రోటీన్ తో ఏర్పడతాయి.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి 3
  3. డైనీన్ భుజాలు జారుడు శక్తిని పుట్టిస్తాయి.
  4. ‘డైనీస్ భుజాల’ చర్య వల్ల సూక్ష్మనాళికలు ఒకదానిపై ఒకటి జారడం జరుగుతుంది. దీనివల్ల ATP వినియోగించుకోబడుతుంది మరియు కశాభా లేదా శైలికలు వంగడం జరుగుతుంది.

ప్రశ్న 4.
కెనైటి అంటే ఏమిటి ? [AP MAY-22] [TS M-19][TS May-17][AP, TS M-16] [IPE-14]
జవాబు:

  1. ఒక ఆయత వరుసలో ఉన్న కైనెటోజోమ్లు మరియు వాటిని అంతర్గతంగా కలుపుతున్న కైనెటో డెస్మేటాలన్నింటిని కలిపి ‘కైనెటి’ అంటారు.
  2. సీలియేట్ నిమ్నశైలికా వ్యవస్థ నందు ‘కైనెటి’ అనేది ఒక భాగం.

ప్రశ్న 5.
ఏకకాలిక, దీర్ఘకాలిక లయబద్ధ చలనాల మధ్య భేదాలు రాయండి?
జవాబు:
శైలికలు రెండు రకాల కదలికలను ప్రదర్శిస్తాయి.

  1. ఏకకాల లయబద్ధకదలిక: అడ్డు వరుసలో ఉన్న అన్ని శైలికలు ఏకకాలంలో ఒకే దిశలో కదులుతాయి.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి 4
  2. దీర్ఘకాల తరంగ కదలిక: ఒక ఆయత వరుసలో శైలికలు ఒకటి తరువాత ఒకటి ఒకే దిశలో కొడతాయి. ఈ చలనం వరి పంటపై ఒక దిశ నుంచి గాలి వీచినపుడు ఏర్పడే తరంగంలా ఉంటుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా ఏర్పడిన పిల్ల జీవులను ‘క్లోన్’ అని ఎందుకు అంటారు. [TS Mar-17] [AP M-19,20]
జవాబు:

  1. ‘క్లోన్’ అనే పదాన్ని ‘స్వరూపంగా మరియు జన్యు పరం’గా తల్లిదండ్రులను పోలియున్న జీవులకు వాడతారు.
  2. నిమ్నస్థాయి జీవులు ‘అలైంగిక ప్రత్యుత్పత్తి’ ద్వారా పిల్లజీవులను ఉత్పత్తి చేస్తాయి.
  3. పిల్ల జీవులు తల్లిదండ్రుల పోలికలను ఎటువంటి జన్యువైవిధ్యం లేకుండా ప్రదర్శిస్తే వాటిని ‘క్లోన్’లు అంటారు.

ప్రశ్న 7.
ప్రోటర్, ఒపిస్తే మధ్య భేదాలను రాయండి. [AP M-18] [AP,TS M-15,17]
జవాబు:

  1. ప్రోటర్ అనేది పూర్వాంతరజీవి. ఇది పూర్వాంత సంకోచరిక్తిక, కణగ్రసని మరియు కణముఖమును తల్లి నుంచి గ్రహిస్తుంది.
  2. ఓపిస్థే అనేది పరాంతర జీవి. ఇది పర సంకోచరిక్తికను మాత్రమే తల్లినుంచి గ్రహిస్తుంది, మరియు ఇతర భాగాలను అభివృద్ధి చేసుకుంటుంది.

ప్రశ్న 8.
జీవపరిణామంలో లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉన్నతమైంది?
జవాబు:

  1. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజం అనునది పురుష మరియు స్త్రీ బీజ కణాల కలయిక వలన ఏర్పడుతుంది. దీనియందు జన్యుపునఃసంయోజనం జరుగుతుంది.
  2. పిల్ల జీవలు తల్లిజీవులకు సమరూపాలు కాదు. ఎందుకనగా వీటిలో వైవిధ్యాలు ఏర్పడతాయి.
  3. తర తరాల నుంచి’ వైవిధ్యాలు ఏర్పడటం’ కొత్త జాతులు ఏర్పడుటకు ఇది దారి తీస్తుంది. కావున లైంగిక ప్రత్యుత్పత్తి అనేది పరిణామమునకు ఆధారం.

ప్రశ్న 9.
లోబోపోడియమ్, ఫిలోపోడియమ్ల మధ్య భేదాలను రాయండి. ఒక్కొక్కదానికి ఒక ఉదాహరణ రాయండి. [APM-15,16,17] [TS M-17,20]
జవాబు:

  1. మొద్దు వేలి లాంటి మిధ్యా పాదులను లోబోపొడియా అంటారు ఉదా: అమీబా, ఎంటమీబా.
  2. పొడవైన మరియు ఆంతురూప మిధ్యాపాదులను ఫిలోపొడియా అంటారు. ఉదా: యూగ్లైఫా [TS M-17,20]

ప్రశ్న 10.
సీలియేట్ల సంయుగ్మాన్ని నిర్వచించండి? రెండు ఉదాహరణలు రాయండి. [AP, TS-18][TS M-15]
జవాబు:

  1. సీలియేట్ల సంయుగ్మం అనగా. జీవసత్తువను కోల్పోయిన రెండు విభిన్న సంగమ రకాల సీలియేట్ల మధ్య కేంద్రక పదార్ధాల మార్పిడి మరియు పునర్వ్యస్థీకరణ
  2. ఉదా: పేరమీషియం మరియు వర్టిసెల్లా.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ప్రోటోజోవన్లలో వేగంగా ఈదే గమనాన్ని నియంత్రించే వ్యవస్థ పేరును రాసి, దాని సంఘటకాలు రాయండి.
జవాబు:
ప్రోటోజోవన్లలో వేగంగా ఈదే జీవులు సీలియేట్లు. వీటి గమనానికి సహయపడే వ్యవస్థ నిమ్నశైలికా వ్యవస్థ నిమ్నశైలికావ్యవస్థ:

  1. సీలియేట్ జీవులలో పెల్లికిల్ క్రింద ఉండే జీవద్రవ్యంలో ఈ వ్యవస్థ ఉంటుంది.
  2. ఈ వ్యవస్థ కైనటోసోమ్లు, కైనెటెస్మటా మరియు మోటోరియమ్లను కలిగి ఉంటుంది.
  3. కైనెటోసోమ్లు అడ్డు మరియు ఆయత వరుసలలో అమరి ఉంటాయి.
  4. కైనెటోడెస్మలో ఆంతువులు కైనెటోసోమ్లకు కలుపబడి, కుడి వరుస వైపుకు సాగుతూ, కైనోటోసోమ్ల తంతువుల దండాలను ఏర్పరుస్తాయి. వీటినే కైనెటోడెస్మేటు అంటారు.
  5. ఒక ఆయత వరుసలో ఉన్న కైనెటోజోమ్లు మరియు వాటిని అంతర్గతంగా కలుపుతున్న కైనెటో కెస్మేటాలన్నింటిని కలిపి ‘కైనెటి’ అంటారు.
  6. ‘కైనెటి’ లు అన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి. ఇవి నిమ్నశైలికా వ్యవస్థను ఏర్పరుస్తాయి.
  7. ఈ వ్యవస్థ ‘మోటోరియమ్కు’ కలుపబడతాయి.
  8. నిమ్నశైలికా వ్యవస్థ మరియు మోటోరియమ్ రెండూ కలిసి నాడీ చాలక వ్యవస్ధను ఏర్పరుస్తాయి. ఇది శైలికల కదలికలను నియంత్రించి సమన్వయపరుస్తుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి

ప్రశ్న 2.
కశాభం వంగే యాంత్రికం గురించి రాసి, ప్రభావక ఘాతం, పునఃస్థితి ఘాతాన్ని గురించి రాయండి.
జవాబు:
కశాభం వంగి కదిలే యాంత్రిక విధానం:

  1. కశాభాం వంగే కదలికలు అనేవి డైనిన్ బాహువులు ATP ని వినియోగించుకుంటూ, సూక్ష్మనాళికలను జరపడం వల్ల ఏర్పడుతాయి.
  2. డైనిన్ బాహువులు సంక్లిష్ట చక్రీయ కదలికలను చూపిస్తాయి.
  3. ఇవే ATP యుత చర్యాకేంద్రాలు.
  4. డైనీన్ బాహువులలో ఉన్న ప్రతియుగళ సూక్ష్మనాళిక, పక్కన ఉన్న యుగళ సూక్ష్మ నాళికతో అతకబడి దాన్ని లాగుంది.
  5. బాహువులు వదులవుతాయి మరల వేరే ప్రక్కకు అతకబడి లాగబడతాయి.
  6. ఈ వరుస లాగుళ్లు కశాభను వంపుకు గురి చేస్తాయి.

కశాభ పార్శ్వ తోపుడు చలనం: ఈ చలనంలో కశాభం ప్రభావక ఘాతం మరియు పునఃస్థితి అనే రెండు రకాల ఘాతాలను ప్రదర్శిస్తుంది.

ప్రభావక ఘాతం: కశాభం గట్టిగా మారి, ఒకవైపునకు వంగుతూ నీటిని ఎదురుగా బలంగా కొడుతుంది. ఈ కొట్టడం అనేది జీవి దేహం ఆయత అక్షానికి లంబకోణంలో జరుగుతుంది. దీని వలన జీవి ముందుకు జరుగుతుంది.
పునఃస్థితి ఘాతం: కశాభం మృదువుగా మారి, తన పూర్వస్థితికి చేరుతుంది. దీన్నే పునఃస్థితి ఘతం అంటారు.

ప్రశ్న 3.
పార్శ్వ నిర్మాణాలు అంటే ఏమిటి? వాటి ఉనికిని బట్టి వివిధ రకాల కశాభాలను గురించి రాసి, ఒక్కొక్కదానికి ఒక ఉదాహరణ రాయండి. [AP,TS M-15,17]
జవాబు:
పార్శ్వ నిర్మాణాలు: కొన్ని కశాభాలు ఒకటి లేదా రెండు లేదా అనేక వరుసలలో పొట్టి, పార్శ్వ రోమాల వంటి తంతువులను కలిగి ఉంటాయి. వీటినే పార్శ్వ నిర్మాణాలు (లేదా) మాస్టిగోనీమ్లు అంటారు. మాస్టిగోనిమ్ల ఆధారంగా ఐదు రకాల కశాభాలను గుర్తించారు.

కశాభాల రకాలు:

  1. స్ట్రైకోనిమాటిక్: ఈ కశాభానికి అక్షీయతంతువుపై ఒక వరుస పార్శ్వ నిర్మాణాలు ఉంటాయి.
    ఉదా: యూగ్లీనా, ఆస్టేషియా
  2. పాంటోనిమాటిక్:అక్షీయ తంతువుపై రెండు లేదా అంతకంటే ఎక్కువ వరుసల్లో పార్శ్వ నిర్మాణాలుంటాయి. ఉదా: పేరానీమా మరియు మోనాస్
  3. ఏక్రోనిమాటిక్: ఈ రకపు కశాభానికి పార్శ్వనిర్మాణాలుండవు. అక్షీయ తంతువు అంత్యభాగం అచ్ఛారహితమై వెలుపలి తొడుగు లేకుండా నగ్నంగా ఉంటుంది. ఉదా: క్లామిడోమోనాస్ మరియు పాలిటోమ.
  4. పాంటోక్రొనిమాటిక్: అక్షీయ తంతువుపై పార్శ్వ నిర్మాణాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ వరుసల్లో ఉంటాయి. అక్షీయ తంతువు నగ్నంగా ఉన్న ఆంత్యతంతువుగా అంతమవుతుంది.
  5. ఏనిమాఇక్ (సామాన్యరకం): పార్శ్వ నిర్మాణాలు ఉండవు. ఆంత్య తంతువులు ఉండవు.
    ఉదా: కైలోమోనాస్ & క్రిప్టోమోనాస్

ప్రశ్న 4.
పేరమీషియమ్లో అడ్డు ద్విధావిచ్ఛిత్తిని గురించి వివరించండి? [TS M-19, 20]
జవాబు:
పేరమీషియమ్లో అడ్డు ద్విధావిచ్ఛిత్తి:

  1. పేరామీషియమ్ అనుకూల పరిస్థితులలో ‘అడ్డు ద్విధావిచ్ఛితిని’’ జరుపుతుంది.
  2. ద్విదావిచ్ఛిత్తికి ముందుగా ఆహారం తీసుకోవడం ఆపేస్తుంది మరియు నోటి ‘గాడి’ అదృశ్యమవుతుంది.
  3. సూక్ష్మకేంద్రకం ‘సమవిభజన ద్వారా’ రెండు పిల్ల కేంద్రకాలుగా విభజన చెందుతుంది.
  4. స్థూల కేంద్రకం ‘ఎమైటాసిస్ ద్వారా’ రెండు పిల్ల కేంద్రకాలుగా విభజన చెందుతుంది.
  5. మధ్య భాగంలో ఒక నొక్కు ఏర్పడుతుంది.
  6. ఈ నొక్కు విస్తరించడం వల్ల తల్లి కూడా రెండు పిల్ల జీవులుగా విడిపోతుంది.
  7. పూర్వాంత భాగం నుండి ఏర్పడిన పిల్లజీవిని ‘ప్రోటర్’ మరియు పరాంత భాగం నుంచి ఏర్పడిన పిల్లజీవిని ‘ఓపిస్థే’ అంటారు.
  8. రెండు పిల్ల జీవులు ఒక సంకోచరిక్తికను తల్లి జీవి నుండి పొందుతాయి మరియు రెండవ సంకోచరిక్తకను నూతనంగా ఏర్పరుచుకుంటాయి.
  9.  అవి స్థూల మరియు సూక్ష్మ కేంద్రకాలను పొందుతాయి.
  10. మిగతా భాగాలను రెండూ కూడా క్రొత్తగా ఏర్పరుచుకుంటాయి.
  11. ద్విధావిచ్ఛిత్తి రెండు గంటలలో పూర్తవుతుంది.
  12. పేరామీషియమ్ రోజుకు నాలుగుసార్లు ద్విధావిచ్ఛిత్తి జరుపుకోగలదు.
  13. అడ్డు ద్విధావిచ్ఛితిని ‘హోమోథెటోజెనిక్’ విచ్ఛిత్తి (విచ్ఛిత్తి ఆయుత అక్షానికి లంబకోణంగా) అని అంటారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి

ప్రశ్న 5.
యూగ్లీనాలో ఆయత ద్విధావిచ్ఛిత్తిని గురించి వర్ణించండి.
జవాబు:
యూగ్లీనాలో ఆయత ద్విధావిచ్ఛిత్తి:

  • యూగ్లీనాలో అనుకూల పరిస్థితులలో నిలువు విభజన జరిగి రెండు పిల్ల జీవులు ఏర్పడతాయి.
    కావున దీనిని ఆయుత ద్విధావిచ్ఛిత్తి అంటారు.
  • ద్విధావిచ్ఛిత్తి జరిగేటప్పుడు కేంద్రకం, ఆధారకణికలు, క్రొమాటోఫోర్లు, జీవద్రవ్యం విభజన చెందుతాయి.
  • మొదట కేంద్రకం సమవిభజన ద్వారా రెండు పిల్ల కేంద్రకాలుగా విభజింపబడును.
  • తరువాత కైనోటోసోమ్లు, క్రోమోటోఫోర్లు కూడా విభజన చెందుతాయి.
  • మొదట పూర్వాంతం మధ్యలో ఒక ఆయత గాడి ఏర్పడుతుంది.
  • ఈ గాడి నెమ్మదిగా పరాంతానికి విస్తరిస్తూ జీవిని రెండు పిల్ల జీవులుగా విడగొడుతుంది.
  • ఒక పిల్ల జీవి యూగ్లీనా తల్లి కశాభాన్ని పొందుతుంది, రెండవది కొత్త కశాభాన్ని ఏర్పరుచుకుంటుంది.
  • రెండు పిల్ల యూగ్లీనాలు దర్పణ ప్రతిబింబాల లాగా ఉంటాయి. కావున ఈ రకమైన విచ్ఛిత్తిని సిమ్మెట్రోజెనిక్ విభజన అంటారు.
  • నేత్రపు చుక్క, పేరంకశాభ దేహం మరియు సంకోచరిక్తికలను పిల్ల జీవులు క్రొత్తగా ఏర్పరుచుకుంటాయి.

ప్రశ్న 6.
బహుధావిచ్ఛిత్తిని గురించి సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు:
బహుధావిచ్ఛిత్తి:

  1. తల్లి జీవి నుంచి అనేక పిల్ల జీవులు ఏర్పడే విధానమే బహుధా విచ్ఛిత్తి.
  2. సాధారణంగా బహుధా విచ్ఛిత్తి ప్రతికూల పరిస్ధితులలో జరుగుతుంది. 3. కేందక్రం అనేకుమార్లు సమవిభజనలు జరుపుతుంది.
  3. అప్పుడు అనేక పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి.
  4. పిల్ల కేంద్రకాల సంఖ్యతో సమానంగా జీవద్రవ్యం కూడా చిన్న చిన్న ముక్కలుగా విభజన చెందుతుంది.
  5. ఒక్కొక్క జీవద్రవ్య ముక్క ఒక్కొక్క పిల్లకేంద్రకం చుట్టూ ఆవరించి అనేక చిన్న జీవులుగా ఏర్పడతాయి.
  6. బహుధా విచ్ఛిత్తి రకాలు: ప్లాస్మోడియంలో షైజోగని, పురుష గామిటోగాని మరియు స్పోరోగని, అమీబాలో స్పోరులేషన్.

ప్రశ్న 7.
మిథ్యాపాదాల గురించి ఒక వ్యాఖ్య రాయండి [AP MAY-22] [AP M-19,20]
జవాబు:
మిథ్యాపాదాలు: ఇవి రైజోపోడా జీవులలో ఉంటాయి. ఇవి తాత్కాలిక గమనం మరియు ఆహార సేకరణకు ఉపయోగపడతాయి. ఇవి చలించే దిశలో ఏర్పడే తాత్కాలిక జీవద్రవ్యపు విస్తరణలు.
మిథ్యాపాదాలు నాలుగు రకాలు.

  1. లోబోపోడియా: మొద్దు, వేలి లాంటి మిథ్యాపాదాలు ఉదా: అమీబా, ఎంటమీబా
  2. ఫిలోపోడియా: తంతురూప మిథ్యాపాదాలు ఉదా: యూగ్లీఫా
  3. రెటిక్యులోపోడియా:జాలక పాదాలు కల మిధ్యాపాదాలు. ఉదా: ఎల్ఫీడియం
  4. ఏక్సోపోడియా లేదా హీలోపోడియా: సూర్యకిరణం లాంటి మిథ్యాపాదాలు ఉదా: ఏక్టినోఫ్రిస్

మిథ్యాపాదాలు ఏర్పడే విధానం:

  • మిథ్యాపాదాలు జెల్ అంతర్జీవ ద్రవ్యం నుంచి సాల్ అంతర్జీవ ద్రవ్యంగా మార్పు చెందడం ద్వారాను మరియు విపర్యయంగాను ఏర్పడతాయి.
  • సాల్-జెల్ రూపాంతర సిద్ధాంతం అత్యంత ఆదరణీయమైన సిద్ధాంతం.
  • వీటి నిర్మాణంలో ఏక్టిన్ మరియు మయోసిన్ అణువుల పాత్ర కూడా ఉంటుంది.
  • అమీబా,ఎంటమీబా,మాక్రోఫేజ్లు, న్యూట్రోఫిల్లు మొదలైనవి మిథ్యాపాద లేదా అమీబాయిడ్ గమనాన్ని ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 8.
ఏక్సోనీమ్ సూక్ష్మ నిర్మాణాన్ని గురించి రాయండి.
జవాబు:
1. ఏక్సోనీమ్: ఏక్సోనీమ్ అనునది కశాభం లేదా శైలికల మధ్యలో ఉండే సూక్ష్మ నాళిక నిర్మాణం. దీనిని ఆవరించి అవిచ్ఛిన్నంగా ప్లాస్మాత్వచం ఉంటుంది.

2. సూక్ష్మ నాళికలు: ఏక్సోనీమ్ రెండు కేంద్రీయ నాళికలు (ఒంటరి) మరియు తొమ్మిది పరిధీయ నాణికలు (2 నాళికలు) లను కల్గిఉంటుంది. నాళికలు టాబ్యూలీన్ అనే ప్రోటీన్ తో ఏర్పడతాయి. ప్రతి పరిధీయ యుగళ సూక్ష్మ నాళిక A మరియు B అనే రెండు నాళికలను కలిగి ఉంటాయి. A నాళిక చిన్నది మరియు పూర్తిగా ఉంటుంది. B నాళిక పెద్దది మరియు అసంపూర్తిగా ఉంటుంది. ఇవి నెక్సిన్ అనే లింకర్ తో జత చేయబడి వుంటాయి.

3. డైనిన్ బాహువులు: కశాభంలో కేంద్రీయ సూక్ష్మనాళిక ‘A’ కు ద్వంద్వ భుజాలు ఉంటాయి. ఇవి డైనీన్ అనే ప్రోటీన్ నిర్మితాలు.ఆ . అందుకే వీటిని డైనీన్ బాహువులు అంటారు. డైనీన్ భుజాలు జారుడు శక్తిని పుట్టిస్తాయి.‘డైనీన్ భుజాల’ చర్య వల్ల సూక్ష్మనాళికలు ఒకదానిపై ఒకటి జారడం జరుగుతుంది. దీనివల్ల ATP వినియోగించు కోబడుతుంది మరియు కశాభా (లేదా) శైలికలు వంగడం జరుగుతుంది.

4. లోపలి బాహ్య తొడుగు: పరిధీయుగళ సూక్ష్మ నాళికల చూట్టూ లోపలి బాహ్య తొడుగు ఉంటుంది.

5. వ్యాసార్ధ స్పోక్ లు: ఇవి స్థితి స్ధాపక పోగులు లోపలి తొడుగును ‘A’ సూక్ష్మ నాళికతో కలుపుతాయి.

6. ఆధారకణికలు (కైనెటోసోమ్ / ఆధారదేహం/ బ్లెఫారోప్లాస్): ఆధారకణికలు రూపాంతరం చెందిన తారావత్కేంద్రం. ఇది తొమ్మిది పరిథీయ త్రితీయాలతో ABC నాళికలుగా ఏర్పడతాయి. A మరియు B అనేవి ఆధార ఫలకాన్ని దాటుతూపోయే పరిధీయ యుగళ సూక్ష్మనాళికలు. ‘C’ సూక్ష్మనాళిక పెల్లికిల్ వద్దనే ఆగిపోతుంది.

7. పార్శ్వనిర్మాణాలు: ఇవి కశాభాలకు ఇరుప్రక్కల పొట్టిగా, రోమాల వలె ఉన్న ఆంతురూప నిర్మాణాలు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి

ప్రశ్న 9.
యూగ్లీనా పటం గీసి భాగాలను గుర్తించండి
జవాబు:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి 5

ప్రశ్న 10.
పేరమీషియమ్ పటంగీసి, ముఖ్యమైన భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Important Questions Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి 6

Leave a Comment