AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

Students get through AP Inter 1st Year Zoology Important Questions 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Zoology Important Questions 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
పరాన్న జీవనాన్ని నిర్వచించి, వివరించండి. [AP M-18]
జవాబు:

  1. ‘పరాన్న జీవనం’ అనగా రెండు వేరు వేరు జాతి జీవుల మధ్య సహవాసం. దీని వలన ఒక జీవి(పరాన్నజీవి) లాభం పొందుతుంది, మరో జీవి (అతిధేయి) నష్టపోతుంది .
  2. పరాన్న జీవనం అనగా ఇతరులకు వడ్డించిన భోజనాన్ని తినడం లాంటిది.
  3. ఉదా: ప్లాస్మోడియం మానవుని దేహంలో (అతిధేయి) పరాన్న జీవిగా జీవిస్తుంది. దీనివల్ల ప్లాస్మోడియం లబ్ది పొందుతుంది, మానవునికి హాని కలుగుతుంది.

ప్రశ్న 2.
వాహకం, ఆశయ అతిథేయి మధ్య గల భేదాన్ని గుర్తించండి.
జవాబు:
వాహకం

  1. వాహకం అనేది ఒకజీవి. ఇది పరాన్న జీవుల సాంక్రమిక దశలను ఒక అతిధి నుంచి మరొక అతిధేయికి రవాణా చేస్తుంది.
  2. ఉదా: ఈగలు, బొద్దింకలు

ఆశయ అతిథేయి

  1. ఆశయ అతిథేయి అనేది ఒక అతిథేయి. ఇది ఏ విధమైన సంక్రమణ జరగకుండానే పరాన్న జీవుల సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పిస్తుంది.
  2. ఉదా: ప్లాస్మోడియంకు కోతి .

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం
ప్రశ్న 3.
యాంత్రిక వాహకం, జీవసంబంధ వాహకం మధ్య ఉండే భేదాన్ని గుర్తించండి.
జవాబు:
యాంత్రిక వాహకం

  1. యాంత్రిక వాహకం అనేది ఒక సాధారణ, పరాన్న జీవుల సాంక్రమిక దశలను రవాణా చేసే వాహకం
  2. ఉదా: మలేరియా పరాన్న జీవికి ఆడ ఎనాఫిలస్ దోమ ఒక యాంత్రిక వాహకం.

జీవ వాహకం

  1. జీవవాహకం అనేది ఒక జీవి. దీనియందు పరాన్నజీవి తన జీవితచక్రంలో కొంత భాగాన్ని పూర్తి చేస్తుంది.
  2. ఉకరేరియా జీవికి ఆడ క్యూలెక్స్ దోమ జీవవాహకం

ప్రశ్న 4.
అథి పరాన్నజీవి అంటే ఏమిటి? ఒకదాని పేరు రాయండి. [TS MAY-22]
జవాబు:

  1. ఒక పరాన్న జీవి దేహంపై జీవించే మరో పరాన్న జీవిని ‘అథిపరాన్న జీవి’ అంటారు.
  2. ఉదా: నోసిమా నొటాబిలిస్, (అథిపరాన్న జీవి) సీఫాలోస్పోరా పాలిమార్ఫా (పరాన్నజీవి) పై పరాన్న జీవనం సాగిస్తుంది. ఇది మరల టోడ్ చేప (అతిధేయి) మూత్రాశయంలో పరాన్న జీవనం సాగిస్తుంది

ప్రశ్న 5.
పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఏమిటి? ఉదాహరణ రాయండి? [AP M-17,20][TS M-16,20]
జవాబు:

  1. పరాన్న జీవి వలన అతిథేయి బీజకోశాలు నాశనం చేయబడితే దానిని పరాన్న జీవ కాస్ట్రేషన్ అంటారు.
  2. ఉదా: సాక్యులినా (క్రస్టేషియా పరాన్న జీవి) పీత బీజ కోశాలని నాశనం చేస్తుంది.

ప్రశ్న 6.
ఫాసియోల హెపాటికాలో అంతర్ పరాన్నజీవ అనుకూలనాలను తెలపండి.
జవాబు:
ఫాసియోలా హెపాటికాలో అంతరపరాన్న జీవి (గొర్రె లివర్ ఫ్లూక్ ) అనుకూలనాలు:

  1. రెండు చూషకాలు (ఒక నోరు మరియు ఒక ఉదరం)
  2. రక్షణయుత అవభాసిని
  3. ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉండుట.
  4. జీవిత చక్రం అనేక డింభక దశలతో క్లిష్టంగా ఉంటుంది (మిరాసీడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా).
  5. బహుపిండత్వం.

ప్రశ్న 7.
నియోప్లాసియాను నిర్వచించండి? దీనికి ఒక ఉదాహరణ తెలపండి? [TS MAY-22][AP MAY-22]
జవాబు:

  1. కొన్నిసార్లు పరాన్న జీవి వలన అతిధేయి కణాల పరిమాణంలో విపరీత పెరుగుదల జరుగుతుంది.
    దీనినే నియోప్లాసియా అంటారు. కొన్ని సందర్భాలలో ఇది కాన్సర్ కు దారి తీస్తుంది.
  2. ఉదా: వైరస్ వలన వచ్చే కార్సినోమా

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 8.
ఆరోగ్యాన్ని సరిగ్గా నిర్వచించి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రెండు అంశాలను తెలపండి?
జవాబు:

  1. ఆరోగ్యం అనేది పరిపూర్ణమైన భౌతిక, మానసిక మరియు సామజిక స్థితిని కలిగి ఉండటం. అంతేగాని కేవలం అనారోగ్యం లేకుండట లేదా శారీరక ధృడత్వం కల్గి ఉండుట మాత్రమే కాదు.
  2. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు (i) జన్యు రుగ్మతలు (ii) సంక్రమణలు

ప్రశ్న 9.
సంక్రమణ, అసంక్రమణ వ్వాధుల మధ్య భేదాన్ని తెలపండి. ఒక్కొక్క దానికి రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
1. సంక్రమణ వ్యాధులు: వ్యాధులు సులువుగా ఒకవ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి రవాణా చెందితే వాటిని సంక్రమణ వ్యాధులు అంటారు. ఇవి పరాన్న జీవుల వలన కలుగుతుంది.
ఉదా: సాధారణ జలుబు, మలేరియా, టైఫాయిడ్, అమీబిక్ విరేచనాలు, తామర మొదలైనవి.

2. అసంక్రమణ వ్యాధులు: ఒకరి నుంచి మరొకరికి రవాణా చెందకుండా, పరాన్న జీవుల వలన కాకుండా, వచ్చే వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా: గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు మరియు జన్యు రుగ్మతలు.

ప్రశ్న 10.
ఎంటమీబా హిస్టోలైటికా అవికల్పిక అవాయు పరాన్న జీవి అని ఎలా చెప్పగలవు?
జవాబు:
‘ఎంటమీబా హిస్టోలైటికా’, అమీబిక్ విరేచనాలను కల్గించే ఒక జీర్ణాశయ పరాన్నజీవి. దీని దేహం నందు మైటోకాండ్రీయాలు ఉండవు. మానవుడి జీర్ణాశయం నందు ఆక్సిజన్ లభించదు. కావున ఇది అవికల్పిక అవాయు పరాన్నజీవి.

ప్రశ్న 11.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థదశ మధ్య భేదాన్ని గుర్తించండి?
జవాబు:
పూర్వకోశస్థదశ

  1. ఇది గుండ్రంగా, చలన రహితంగా ఉంటుంది.
  2. ఇది ఏక కేంద్రకాన్ని కల్గి విభజనలు చెందకుండా ఉంటుంది.

కోశస్థ దశ

  1. ఇది గుండ్రంగా మృదువైన, పలుచని నిరోధక శక్తి గల కోశ కుడ్యాన్ని కలిగి ఉంటుంది..
  2. దీని యందు గల కేంద్రకం సమవిభజనలు జరుపుకుంటుంది.

ప్రశ్న 12.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వకోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ దశలో నిల్వ ఆహారమేది?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ దశలో నిల్వ ఆహారము ‘గ్లైకోజన్ రేణువుల రూపం’లో మరియు ‘క్రొమాటిడ్ దేహాల రూపం’లో ఉంటుంది.

ప్రశ్న 13.
ఒక వ్యక్తి పేగులో క్రమరహితం, ఉదరనొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం ఉన్నాయి ఈ లక్షణాల ఆధారంగా జీవి పేరు, వ్యాధిని తెలపండి. [TS M-15]
జవాబు:

  1. ఇచ్చిన లక్షణాలు ఆధారంగా కలిగే వ్యాధి పేరు అమీబిక్ విరేచనాలు.
  2. ఆ వ్యాధి కారక జీవి ‘ఎంటమీబా హిస్టోలైటికా’,

ప్రశ్న 14.
ఒక వ్యక్తి డాక్టరు సలహాతో క్లినికల్ ప్రయోగశాలలో మల పరీక్షకు వెళ్లాడు అందులోని టెక్నీషియన్ మలంను వరీక్షించి అమీబియాసిస్తో బాధపడుతున్నాడని గుర్తించాడు. టెక్నిషియన్ గుర్తించిన రెండు లక్షణాలను తెలపండి.
జవాబు:
మలంలో అమీబియాసిస్ను గుర్తించే లక్షణాలు: (i) చతుష్కేంద్రక కోశం (ii) రక్త కణాలు

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 15.
ఎంటమీబా హిస్టోలైటికాను ఉద్దేశించి ఎసింప్టమాటిక్ సిస్ట్ పాసర్స్ నిర్వచించండి?
జవాబు:
‘ఎసింప్టమాటిక్ సిస్ట్ప్సర్స్’లో ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి ఉన్నప్పటికి వీరిలో అమీబియానిస్ లక్షణాలు కనబడవు. కాని వీరి మలంలో చతుష్కేంద్ర కోశాలుంటాయి. అటువంటి వారిని ‘ఎసింప్టమాటిక్ సిస్ట్ పాసర్స్’ అని అంటారు.

ప్రశ్న 16.
మానవునిలో హిపాటోసైట్స్ను సంక్రమించే ప్లాస్మోడియం వైవాక్స్ దశలను తెలపండి?
జవాబు:
కాలేయ కణాలకు సంక్రమించే ప్లాస్మోడియం దశ ‘స్పోరోజాయిట్’.

ప్రశ్న 17.
ప్రీపేటెంట్ కాలంను నిర్వచించండి? ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో దీనికి ఎంతకాలం ఉంటుంది?
జవాబు:

  1. ప్రీపేటెంట్: ప్రప్రధమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవుడి రక్తంలోకి ప్రవేశించినప్పటి నుంచి మరియు రెండోసారి క్రిప్టోజాయిట్లు రూపంలో రక్తంలో చేరే వరకు పట్టే కాలాన్ని ప్రీపేటేంట్ కాలం అంటారు.
  2. దీనికి ఎనిమిది రోజులు పడుతుంది.

ప్రశ్న 18.
పొదిగే కాలంను నిర్వచించండి? ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో ఇది ఎంతకాలం ఉంటుంది? [AP M-18] : స్పోరోజాయిట్లు మానవుడి రక్తంలోకి ప్రవేశించిన వాటినుంచి, మరియు మలేరియా లక్షణాలు కల జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని ‘పొదిగేకాలం’ అంటారు.
జవాబు:

  1. పొదిగే కాలం:
  2. ఇది దాదాపు 10-14 రోజులు.

ప్రశ్న 19.
షఫ్నర్ చుక్కలు అంటే ఏమిటి? వీటి ప్రాముఖ్యం తెలపండి?
జవాబు:
రక్తకణ చక్రంలో విఖండదశలో పరాన్నజీవి, ఎర్ర రక్తకణాలు జీవపదార్ధంలో చిన్న ఎర్రని మచ్చలుగా కనిపిస్తాయి. వీటిని షఫ్నర్ చుక్కలు అంటారు. ఇవి ప్లాస్మోడియం విడుదల చేసే ప్రతిజనకాలు. పరాన్నజీవి వీటికి నిరోధకంగా ప్రతి రక్షకాలను అభివృద్ధి చేస్తుంది.

ప్రశ్న 20.
హీమోజాయిన్ రేణువులు అంటే ఏమిటి? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
మలేరియా పరాన్నజీవి హిమోగ్లోబిన్ లోని హీమన్ను, జీర్ణం చేసుకొని మరియు కరిగే హీమ్ను కరగని హీమోజాయిన్ కణికలుగా ఏర్పరుస్తుంది. ఎరిత్రోసైట్లు పగిలినపుడు, హిమోజాయిన్ రక్తంలోకి విడుదల అవుతుంది. ఇది మలేరియా జ్వరాన్ని కల్గిస్తుంది.

ప్రశ్న 21.
కశాభనిర్మోచనం అంటే ఏమిటి? దీనివల్ల ఏర్పడినవి ఏవి?
జవాబు:
పురుష సంయోగబీజాలు ‘విసిరిన కొరడా మాదిరి కదలికలను చూపుతూ’ జీవపదార్ధం నుంచి విడుదలవుతాయి. ఈ విధంగా విడుదల కావడాన్ని కశాభ నిర్మోచం అంటారు. దీని వలన ఏర్పడినవే ‘పురుష సంయోగ బీజాలు’.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 22.
ప్లాస్మోడియంలో బీజకణాల కలయికను అసమసంయోగం అని ఎందుకంటారు?
జవాబు:
ప్లాస్మోడియంలో పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు పరిమాణరీత్యా అసమానంగా ఉంటాయి. కాబట్టి ఈ సంయోగాన్ని అసమసంయోగం అని అంటారు.

ప్రశ్న 23.
గమన సంయుక్తబీజం అంటే ఏమిటి? క్రోమోసోముల స్థితిని అనుసరించి దీన్ని ఎలా వివరిస్తావు?
జవాబు:

  1. ఆడ ఎనాఫిలస్ దోమలో ప్లాస్మోడియం, లైంగిక జీవిత చక్రంలో పొడవైన, సన్నటి కదలిక చూపే క్రియ రూపాన్ని అన్నకోశంలో ఏర్పరుస్తుంది. దీనినే ఊకినైట్ అంటారు.
  2. ఇది ద్వయస్ధితికం. అనగా రెండు జతల క్రోమోజోమ్లను కల్గిఉంటుంది.

ప్రశ్న 24.
ఒక వ్యక్తి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతున్నాడు. విపరీతమైన చెమటలతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరింది. ఈ లక్షణాల ఆధారంగా వ్యాధిని, కారకజీవిని తెలపండి.
జవాబు:
వ్యాధి: మలేరియా జ్వరం
కారకం: ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాన్న జీవి.

ప్రశ్న 25.
దోమలను అరికట్టడానికి జీవసంబంధ నియంత్రణ తెలపండి.
జవాబు:
దోమలను అరికట్టడానికి జీవసంబంధ నియంత్రణ:

  1. క్రిమ సంహరకాలైన DDT, BHC లను దోమ గుడ్డు పెట్టే చోట చల్లాలి.
  2. దోమ లార్వాలను తినే చేపలైన దంబూనియాలను ప్రవేశపెట్టాలి.
  3. కీటకాహరి మొక్కలయిన యుట్రికులేరియాలను పెంచాలి.
  4. నిశ్చలమైన నీటి ప్రాంతాలలో కిరోసిన్, పైరిత్రమ్ నూనెలను చల్లాలి.

ప్రశ్న 26.
ఆస్కారిస్ గుడ్లను ‘మామ్మిల్లేటిడ్ గుడ్లు’ అని ఎందుకు అంటారు? [AP M-19][TS M-18,19]
జవాబు:
ఆస్కారిస్ యొక్క గుడ్లు ప్రోటిన్ పొరను కలిగి ఉండటం వల్ల ఇవి బుడిపెలను కల్గివుంటాయి. కావున వీటిని మామ్మిల్లేటెడ్ గుడ్లు అని అంటారు.

ప్రశ్న 27.
మీరు చదివిన నిమటోడా పరాన్నజీవి జీవితచక్రంలో నిశా కాల గమనం అంటే ఏమిటి? [TS Mar, May-17] [AP M-15]
జవాబు:
తొడుగు గల మైక్రోఫైలేరియా డింభకాలు లోపలి రక్తనాళాల నుంచి పరిధీయ రక్తనాళాలకు రాత్రి సమయంలో 10.00 pm మరియు 4am మధ్య బదిలీ చెందుతాయి. దీనినే ‘నిశాకాల ఆవర్తనం’ అంటారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 28.
లింఫాడినైటిస్ మరియు లింఫాంజైటిస్ మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:

  1. ‘శోషరస గ్రంధుల’లో వాపు, మంట ఉంటే దాన్ని లింఫాడినైటిస్ అని అంటారు.
  2. ‘శోషరస నాళాల’లో వాపు, మంట ఉంటే దాన్ని లింఫాజైటిస్ అని అంటారు.

ప్రశ్న 29.
ఫైలేరియాసిస్ వ్యాధి చివరి ఘట్టం బోదకాలు/ఎలిఫెంటియాసిస్ నిరూపించండి?
జవాబు:
బోదకాలు, ఫైలేరియా అనే పరాన్న జీవి వలన కలుగుతుంది. ఈ వ్యాధి యొక్క ఆఖరి దశలు:

  1. తలనొప్పి, మానసిక ఆందోళన మరియు శరీర ఉష్ణోగ్రత పెరగడం
  2. లింఫాంజైటిస్
  3. లింఫాడైంటిస్
  4. శోషరస నాళాలలో ఆటంకం
  5. చివరి దశ ఎలిఫెంటియాసిస్

ప్రశ్న 30.
పొగాకు ఏవిధంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది? దీనిలో గల ఆల్కలాయిడ్ ఏది? [AP May-17]
జవాబు:

  1. పొగత్రాగడం వల్ల శ్వాసక్రియ దెబ్బతింటుంది. ఎందుకనగా పొగాకును పీల్చినపుడు రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ శాతం పెరిగి ఆక్సిజన్ శాతం తగ్గుతుంది.
  2. పొగాకులో ‘నికోటిన్’ అనే ఆల్కాయిడ్ వుంటుంది.

ప్రశ్న 31.
మందుల దుర్వినియోగాన్ని నిర్వచించండి. [AP MAY-22]
జవాబు:

  1. మందుల దుర్వినియోగం అంటే మందుల మోతాదును అవసరం కన్నా ఎక్కువగా తీసుకోవటం.
  2. ఇది శారీరక మరియు మానసిక అలజడలుకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాలలో దేహాన్నీ బాగు చేయలేనంత నష్టం జరుగుతుంది.

ప్రశ్న 32.
కోక్, స్మాక్ దేని నుంచి లభిస్తాయి? [AP M-16]
జవాబు:

  1. కోక్ (క్రాక్): ఎరిత్రోజైలం కోకో అనే మొక్కల ఆకుల నుండి కోక్ తయారవుతుంది.
  2. స్మాక్ (హేరాయిన్): మార్ఫిన్ ను ఎసిటైలేషన్ చేయడం వల్ల స్మాక్ ఏర్పడుతుంది.

ప్రశ్న 33.
మొక్కలలో చాలా ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలు ఉన్నాయి. వీటి దుర్వినియోగం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి సరైన ఉదాహరణతో నిరూపించండి.
జవాబు:

  1. మొక్కల ద్వితీయ జీవపదార్థాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
  2. వాటిని దుర్వినియోగం చేయడం వలన, భౌతిక (లేదా) మానసిక విధులలో సమస్యలు ఏర్పడతాయి. మానసిక రోగాలైన కుంగిపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 34.
ఆటలు, క్రీడలలో నిషేధించిన కనబినాయిడ్స్ అనబాలిక్, స్టీరాయిడ్స్ లను ఎందుకు నిషేధించారు?
జవాబు:

  1. కనబినాయిడ్స్ మరియు అనబాలిక్ మందులను స్టీరాయిడ్స్ అని అంటారు.
  2. ఇవి టెస్టోస్టిరాన్ మరియు డైహైడ్రోటెస్టోస్టిరాన్ పై ప్రభావం చూపుతాయి. ప్రోటీన్ సంశ్లేషణా చర్యలను పెంచడంవల్ల క్రీడాకారుల యొక్క నైపుణ్యాలను పెంచుటకు కణాజాలాన్ని వృద్ధి చేస్తుంది. కావున వీటిని నిరోధించారు..

ప్రశ్న 35.
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడుతూ తరచుగా దుర్వినియాగం అయ్యే, నాలుగు మందులను తెలపండి.
జవాబు:
మానసిక రుగ్మతల చికిత్స కొరకు వాడే మందులు:

  1. లైసర్జిక్ ఆమ్ల డై ఈథైల్ అమైడ్స్ (ప్రశాంతకాలు)
  2. బెంజోడయాజిపైన్స్ (ప్రశాంతకాలు)
  3. ఆంఫిట మైన్స్ (నిద్రహరిణి మాత్రలు)
  4. బార్బిట్యురేట్స్ (నిద్రమాత్రలు)

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
పరాన్నజీవులలో ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరమేమిటి? పరాన్నజీవులలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను తెలపండి. [TS M-19]
జవాబు:

  • పరాన్న జీవులు వాటి మనుగడ కొరకు అతిధేయిలపై ఆధారపడతాయి. కాని అతిధేయిలు, పరాన్న జీవులకు వ్యతిరేకతచూపు నిరోధకతను కల్గివుంటాయి.
  • కావున పరాన్న జీవులు కొన్ని అనుకూలనాలను అభివృద్ధి చేసుకొని, అతిధేయి యొక్క రక్షణా వ్యవస్థను ఎదుర్కొవడం మరియు తటస్థీకరణం చేయడం జరుగుతుంది.
  • అనుకూలనాలు: అనవసర జ్ఞానాంగాలను కోల్పోవడం, అంటిపెట్టుకునుటకు అవసరమైన అంగాల అభివృద్ధి, అధిక ప్రత్యుత్పత్తి శక్తి మొదలైనవి.

ప్రత్యేక పరాన్న జీవుల అనుకూలనాలు:

  1. అతిధేయిలో నివసించే క్రమంలో, కొన్ని పరాన్న జీవులు కొక్కేలు, చూషకాలు, స్టెల్లం లాంటి అవయవాలను అభివృద్ధి చేసుకున్నాయి.
  2. కొన్ని పరాన్న జీవులు మందమైన ‘అవభాసిని’ పొరను జీర్ణక్రియా ఎంజైముల నుంచి రక్షణా కవచంగా అభివృద్ధి చేసుకుంటాయి. ఉదా: ఆస్కారిస్, ఫాసియోలా
  3. కొన్ని పరాన్నజీవులు అధిక సంఖ్యలో గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి.
    ఉదా: టినీయా 700-900 ప్రోగ్లాటిడ్స్, 3500 ప్రతిప్రోగ్లాటిడ్, 35,000 గుడ్లను విడుదల చేస్తాయి.
  4. మరికొన్ని పరాన్నజీవులు యాంటీ ఎంజైములను విడుదల చేసి, అతిధేయి యొక్క జీర్ణక్రియా ఎంజైములను తటస్థీకరణం చేస్తాయి. ఉదా:టినీయా
  5. కొన్ని తమ జీవితచక్రాలను చాల సంక్లిష్టం చేసుకుంటూ అనేక డింభక దశలను పొందుతాయి. ఉదా: ఫాసియోలా
  6. కొన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకొనుటకు కోశస్థ దశలను అభివృద్ధి పరుచుకుంటాయి. ఉదా: ఎంటమీబా
  7. మరికొన్ని వాక్సీన్ల నుంచి తప్పించుకొనుటకు అనువుగా ఉపరితల ప్రతిజనకాలను మారుస్తూ ఉంటాయి. ఉదా: ప్లాస్మోడియం, HIV మొదలైనవి.

ప్రశ్న 2.
హైపర్ ట్రోఫి మరియు హైపర్ ప్లాసియాల మధ్య భేదాలను ఒకొక్క ఉదాహరణతో వివరించండి. [AP,TS M-20]
జవాబు:
1. హైపర్ ట్రోఫీ: కొన్ని పరాన్న జీవులు అతిధేయి కణాల పరిమాణాన్ని విపరీతంగా పెంచటం వల్ల, అవి పెరిగి పెరిగి చివరకు పగిలిపోతాయి.
ఉదా: ప్లాస్మోడియం ఎర్ర రక్తకణాలను విపరీతంగా పెంచుతుంది. చివరకు ఆ రక్తకణాలు పగిలిపోతాయి.

2. హైపర్ ప్లాసియా: కొన్ని పరాన్నజీవులు అతిథేయి దేహంలో కణాల సంఖ్యను పెంచటం ద్వారా, కణాంగం ఆకృతిని పెంచుతాయి.దీని వల్ల దేహ భాగాలు మందంగా మారతాయి. తద్వారా అతిధేయి మరణం సంభవించవచ్చును. ఉదా: ‘ఫాసియెలా’ హెపాటికా గొర్రె యొక్క పైత్య రస నాళాలలో నివశిస్తుంది. దీని వలన పైత్యరస నాళాలలో కణాల సంఖ్య పెరిగి ఆ నాళాలు మందంగా మారుతాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 3.
ఎంటమీబా హిస్టోలైటికా పోషకజీవి నిర్మాణాన్ని వివరించండి. ఎంటమీబా హిస్టోలైటికా పోషకజీవి దశ నిర్మాణాలు:
జవాబు:

  • ఇది చాలా చురుకైన, చలించే, పోషక మరియు వ్యాధికారక దశ.
  • ఇది మానవుని పెద్ద పేగు శ్లేష్మస్తరం, అధఃశ్లేష్మస్తరంలో నివసిస్తుంది.
  • ఈ పోషక జీవి దేహం ‘ప్లాస్మా లెమ్మా’ పొరతో కప్పబడి ఉంటుంది.
  • జీవపదార్థం వెలుపలి చిక్కని, కణికారహిత ‘బాహ్యజీవద్రవ్యంగా’ లోపలి కణికాయుత, ద్రవరూప ‘అంతర్జీవద్రవ్యంగా’ విభజించబడి ఉంటుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1
  • అంతర్జీవ ద్రవపదార్ధం రైబోజోమ్లు, ఎర్రరక్తకణాలతో కూడిన ఆహార రిక్తికలు మరియు బండి చక్రం వంటి కేంద్రకంను కలిగి ఉంటుంది.
  • ‘పోషణ’ జాంతవభక్షక రకం (holozoic)
  • ఇది అవాయు శ్వాసక్రియను జరుపుకుంటుంది.
  • ఇది ప్రోటీన్లను జీర్ణం చేసే ‘హిస్టోలైసిన్’ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది.

ప్రశ్న 4.
ఎంటమీబా హిస్టోలైటికా జీవిత చక్రంను తెలపండి.
జవాబు:
ఎంటమీబా జీవిత చక్రం:

  1. ఎంటమీబా హిస్టోలైటికా ఒక ప్రోటోజువాన్, ఏకాతిధేయి, కణజాల పరాన్న జీవి.
    ఇది మానవుడి పెద్ద ప్రేగులోని గోడలపై నివశిస్తుంది.
  2. వ్యాధి సంక్రమణ కలుషిత ఆహరం మరియు నీటి ద్వారా లేదా యాంత్రిక వాహకాలైన ఈగ మరియు బొద్దింకల ద్వారా జరుగుతుంది.
  3. మానవుడికి సంక్రమించే దశ ‘చతుష్కేంద్రక దశ’. ఈ దశలో ఇది చిన్న ప్రేగులోనికి చేరి కోశంను జీర్ణం చేసుకుని చతుష్కేంద్రక అమీబాలను విడుదల చేస్తుంది.
  4. కేంద్రక విభజనను అనుసరించి, జీవపదార్థం విభజన చెంది, ‘8’ పిల్ల ఎంటమీబాలను ఉత్పత్తి చేస్తుంది.
  5. ఇవి పెద్ద ప్రేగు గోడలను చేరుకుని, పెరిగిపెద్దవైన పోషకదశ జీవులుగా మారతాయి.
  6. ద్విధావిచ్ఛిత్తి ద్వారా పోషకదశజీవులు రెట్టింపు అవుతాయి.
  7. పోషకదశజీవులు పూర్వకోశస్థదశ జీవులుగా మారతాయి.
  8. పరాన్న జీవి తన చుట్టూ కోశాన్ని ఏర్పాటు చేసుకుని కోశస్థ జీవిగా మార్పుచెందుతుంది.
  9. కేంద్రకం నాలుగు భాగాలుగా విభజన చెంది కోశస్థ దశ చతుష్కేంద్రకం కోశంగా మార్పుచెందుతుంది. మలంతో పాటు ఈ చతుష్కేంద్రక కోశాలు బయటకు విడుదలై 10 రోజులపాటు జీవంతో ఉంటాయి. కలుషిత నీరు మరియు ఆహరం ద్వారా కొత్త అతిధేయిని చేరి జీవిత చక్రాన్ని మరల ప్రారంభిస్తాయి.

ప్రశ్న 5.
ఎంటమీబా హిస్టోలైటికా వ్యాధికారకతపై లఘుటీక రాయండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా వ్యాధికారకత:

  1. ఎంటమీబా పెద్దపేగులలో పుండ్లను ఏర్పరుస్తాయి.
  2. పుండ్లలో ఎర్రరక్త కణాలు, కణశిధిలాలు మరియు బాక్టీరియాలు ఉంటాయి.
  3. చివరగా మలంలో రక్తం మరియు రక్తశ్లేష్మం కనిపిస్తాయి. ఈ స్థితిని అమీబిక్ విరోచనాలు లేదా ఆంత్ర అమీబియాసిస్ అంటారు.
  4. కొన్నిసార్లు పోషక జీవులు రక్త ప్రవాహంలోకి విడుదలై అక్కడ నుండి ఊపిరితిత్తులు, హృదయం, మూత్రపిండాలు మరియు మెదడును చేరుకొని, పుండ్లను ఏర్పరచి తీవ్ర వ్యాధి కారక స్థితికి దారి తీస్తాయి. దీనినే ‘బాహ్యంత్ర అమీబియాసిస్’ అని అంటారు.
  5. కొందరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. వీరిని వాహకులు లేదా ఎసింప్టోమాటిక్ సిస్ట్పసర్స్ అంటారు. వీరి మలంలో చతుష్కేంద్ర కోశాలుంటాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 6.
ప్లాస్మోడియం వైవాక్స్ స్పోరొజాయిట్ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ప్లాస్మోడియం వైవాక్స్ స్పోరొజాయిట్ నిర్మాణం:

  • ‘గారామ్’ ప్లాస్మోడియం స్పోరోజాయిట్ నిర్మాణాన్ని వివరించాడు. స్పోరోజాయిట్ ‘కొడవలి’ ఆకారంలో ఉంటుంది. కణదేహం మధ్యలో ఉబ్బెత్తుగాను, కొనభాగాలు మొనదేలి ఉంటాయి.
  • ఇది 15 మైక్రాన్ల పొడవు మరియు 1 మైక్రాను వెడల్పు ఉంటుంది. దీని రక్షక త్వచం సూక్ష్మనాళికలను కల్గి ఉంటుంది. ఇవి స్పోరోజాయిట్ క్రిమి చలనాలకు తోడ్పడతాయి.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2
  • దీని జీవపదార్థం గాల్జిసంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలకం, మైటోకాండ్రియా మరియు కేంద్రకంను కల్గి ఉంటుంది. ఇందులో మెలికలు తిరిగిన, విధి తెలియని నాళికలుంటాయి. దేహ పూర్వాంతంలో అగ్రచూషకం అనే కప్పు లాంటి పల్లం ఉంటుంది, దీనిలోనికి ఒక జత స్రావక స్రావకాంగాలు తెరచుకుంటాయి.
  • ఇవి ‘కణవినాశక’ ఎంజైములను స్రవిస్తాయి. ఇవి కాలేయ కణాల్లోకి ప్రవేశించడానికి సహాయపడతాయి.

ప్రశ్న 7.
ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో గాల్జి చక్రాన్ని వివరించండి?
జవాబు:

  • గాల్జీ చక్రం(రక్తకణ చక్రం ):ఈ చక్రాన్ని మొదటగా ‘గాల్జి’ అనే శాస్త్రవేత్త వివరించాడు. కావున దీనిని గాల్జి చక్రం అంటారు.
  • మొదట క్రిప్టోజాయిట్లు లేదా సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి.
  • ఇవి ట్రోఫోజాయిట్లుగా మార్పు చెందుతాయి.
  • ఈ ట్రోఫోజాయిట్లలో ఒక చిన్న రిక్తిక ఏర్పడుతుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 3
  • జీవపదార్ధాన్ని, కేంద్రకాన్ని అంచువైపుకు నెట్టడం వల్ల ఈ రిక్తిక పరిమాణం పెరుగుతుంది.
  • ఈ దశలో పోషక జీవి ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. కావున ఈ దశను అంగుళీక దశ అంటారు.
  • ఇక్కడ రిక్తిక అదృశ్యమవుతుంది. ఈ స్థితిలో మిధ్యాపాదాలను అభివృద్ధి చేసుకొని అమీబాయిడ్ దశగా మారుతుంది.
  • ఈ దశలో పోషక జీవి ‘అతివృద్ధి స్థితిని’ కల్గి వుంటుంది. (ఎర్రరక్త కణాల పరిమాణం రెండింతలు పెరుగును).
  • ఇది హీమోగ్లోబిన్లోని ‘గ్లోబిన్’ ను ఆహారంగా తీసుకొని, పరిమాణాన్ని పెంచుకుంటుంది.
  • పరాన్న జీవి కరిగే హీము, కరగని ‘హీమోజాయిన్’ కణికలుగా మారుస్తుంది.
  • ఎర్ర రక్తకణాల జీవపదార్ధంలో చిన్న ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. వీటినే ‘షఫ్నర్ చుక్కలు’ అంటారు.
  • వీటిని పరాన్నజీవి విడుదల చేసే ‘ప్రతి జనకాలుగా’ భావించవచ్చును.
  • ఇది ‘గుండ్రని విఖండం’గా మార్పు చెందుతుంది.
  • ఇది ‘విఖండ జననంకు’ లోనై 12-24 ఎర్ర రక్తకణ మీరోజాయిట్లను ఏర్పరుస్తుంది.
  • చివరిగా ఎర్రరక్తకణం పగిలి హీమోజాయినన్ను మరియు మీరోజాయిట్లను రక్తంలోనికి విడుదల చేస్తుంది.
  • హీమోజాయిన్ విడుదల విపరీతమైన చలి మరియు జ్వరమును కలిగిస్తాయి.
  • మీరోజాయిట్లు ఎర్రరక్త కణాలపై దాడి జరిపి మరల రక్తకణ చక్రాన్ని కొనసాగిస్తాయి.
  • రక్తకణ చక్రం సుమారు 48 గంటలలో పూర్తవుతుంది.

ప్రశ్న 8.
ఉకేరియా బాంక్రాఫ్టి వల్ల మానవునిలో కలిగే వ్యాధి కారకతను తెలపండి. [TS MAY-22].
జవాబు:
ఉకేరియా బాంక్రాఫ్టి వల్ల మానవునిలో కలిగే వ్యాధి కారకత:

  1. ఉకరేయా బాంక్రాఫ్టి ఒక ఫైలేరియా పురుగు.
  2. సంక్రమణ స్వల్పంగా ఉంటే, జ్వరం, తలనొప్పి మానసిక ఆందోళన కలుగుతాయి.
  3. సాధారణంగా ఫైలేరియా సంక్రమణలో శోషరసనాళాలు మరియు శోషగ్రంధులలో వాపు కలుగుతుంది.
  4. శోషరస నాళాలలో కలిగే వాపు ‘లింఫాజైటిస్’ అని అంటారు.
  5. శోషరస గ్రంధులలో కలిగే వాపు ‘లింఫాడెంటిస్’ అని అంటారు.
  6. సంక్రమణ అధికంగా ఉంటే, ఫైలేరియా శోషరస నాళాలను ఆటంకపరుస్తాయి. దీనివల్ల కుళ్ళిన భాగాలలో వాపు ఏర్పడుతుంది.
  7. ఈ భాగాలలో ఆంతుయుత కణజాలం అభివృద్ధి చెందుతుంది.
  8. స్వేద గ్రంధులు క్షీణించి అక్కడ చర్మం గరుకుగా మారుతుంది.
  9. ఈ స్థితినే ‘ఎలిఫెంటియాసిస్’ అని అంటారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 9.
టైఫాయిడ్ జ్వరం మరియు రోగనిరోధకత పై లఘుటీక రాయండి.
జవాబు:
టైఫాయిడ్ జ్వరం: టైఫాయిడ్ ‘సాల్మోనెల్లా టైఫీ ‘ అనే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా వలన వస్తుంది.

  • ఇది మానవుని చిన్న పేగులో నివశిస్తుంది.
  • ఇది దేహంలోని మిగతా భాగాలకు రక్తప్రసరణ ద్వారా చేరుతుంది.
  • వైడాల్ పరీక్ష ద్వారా సాల్మోనెల్లాను నిర్ధారిస్తాయి.

సంక్రమణ విధానం: కలుషిత ఆహరం మరియు నీరులక్షణాలు: నిరంతరం జ్వరం, నీరసం, కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి, మరియు ఆకలి లేకపోవటం.

వ్యాధి తీవ్రతలో పేగుకు రంధ్రాలు ఏర్పడటం మరియు తీవ్రస్థాయిలో మరణం సంభవిస్తుంది.

నివారణ: వ్యాక్సిన్ల ద్వారా నిరోధకత, త్రాగేనీరు పరిశుభ్రంగా ఉండటం, సెప్టిక్ ట్యాంక్ కల మరుగుదొడ్లను వాడటం.

ప్రశ్న 10.
న్యుమోనియా మరియు రోగనిరోధకత పై లఘుటీక రాయండి. [TS MAY-22]
జవాబు:
న్యూమోనియా: ఇది బ్యాక్టీరియా వ్యాధి

  • ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అయిన స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా మరియు హీమోఫిలస్ ఇన్ఫ్లూయెంజా వలన కలుగుతుంది.
  • ఇవి ఊపిరితిత్తులలోని వాయుకోశాలపై సంక్రమణ చేస్తాయి.
  • సంక్రమణ విధానం: వ్యాధిసోకిన వ్యక్తి పీల్చిన ‘ఎరోసాల్స్’ను పీల్చుకోవడం ద్వారా
  • లక్షణాలు: శ్వాసక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
  • నివారణ: మాస్క్లలు వాడటం, వేడిచేసిన పాత్రలు, వ్యాక్సిన్లు మరియు యాంటిబయాటిక్స్ వాడకం.

ప్రశ్న 11.
సాధారణ జలుబు మరియు రోగనిరోధకత పై లఘుటీక రాయండి.
జవాబు:
సాధారణ జలుబు: సాధారణ జలుబు ‘రైనో వైరస్’ వలన కలుగుతుంది.

  • ఇది ముక్కు మరియు వాయు మార్గాలకు మాత్రమే సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులకు సంక్రమించదు.
  • సంక్రమణ విధానం: వ్యాధిసోకిన వ్యక్తి నుంచి వచ్చే దగ్గు మరియు తుమ్ముల తుంపర్లు (లేదా) కలుషితమైన వస్తువులు ద్వారా సంక్రమణ జరుగుతుంది.
  • నివారణ: మాస్క్ వాడకం, కాచిన నీరుత్రాగడం, యాంటిబయాటిక్స్ వాడకం.

ప్రశ్న 12.
తామర మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
1. తామర ఒక సంక్రమణ వ్యాధి. ఇది మైక్రోస్పోరం, టైకోఫైటాని మరియు ఎపిడెర్మోఫైటాన్ అనే శిలీంధ్రాల వలన జరుగుతుంది.

2. వేడి, తేమ ప్రాంతాలలో నివసించే ప్రజలలో ఇది సంక్రమిస్తుంది.

3. ఇది చర్మం ముడతలలో, చంకలలో మరియు కాలిమేళ్ళలో వస్తుంది.

వ్యాధిసంక్రమణ: వ్యాధిసోకిన వ్యక్తి వాడిన తువ్వాలు, దుస్తులు లేదా దువ్వెన లేదా తడి మట్టి వలన కూడా.

లక్షణాలు: చర్మంపై పొడిగా, పొలుసులు గల గుండ్రటి పుండ్లు ఏర్పడతాయి. ఇవి తీవ్ర దురదగా ఉంటాయి. నివారణకు శిలింధ్రకాలు సహయపడతాయి.

నివారణ : యాంటిబయాటిక్స్ మరియు పూతమందులు వాడటం.

ప్రశ్న 13.
పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి. [TS MAY-22] [TS May-17] [AP M-16,19]
జవాబు:
పొగాకు వాడకం వలన దుష్పలితాలు:

  1. పొగ త్రాగడం అంటే పొగాకును పీల్చడం, కాల్చడం, గుట్కాలను నమలడం లేదా పీల్చడం.
  2. పొగత్రాగడం వలన, రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి పెరిగి ఆక్సిజన్ స్ధాయి తగ్గుతుంది.
  3. పొగాకు ‘నికోటిన్’ అనే ఆల్కాయిడ్ను కలిగి ఉంటుంది.
  4. నికోటిన్ ఎడ్రినల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది.
  5. ఎడ్రినలిన్ మరియు నార్ ఎడ్రినలిన్ హార్మోన్లు రక్తపీడనాన్ని మరియు గుండె స్పందన రేటును పెంచుతాయి.
  6. ఇది బ్రాంకైటిస్ ఎంఫిసిమా, కరోనరి గుండె వ్యాధి మరియు జఠరంలో పుండ్లను కలిగిస్తుంది.
  7. ఈ పొగాకు వాడకం గొంతు, ఊపిరితిత్తులు మరియు మూత్రాశయం క్యాన్సర్లకు దారి తీస్తుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 14.
ఒపియోడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
ఒపియోడ్స్ మందులు ‘పాపి యొక్క పెపావర్ సోమ్నిఫెకం’ నుంచి లభిస్తాయి.
ఈ ముందులు కేంద్రనాడీ వ్యవస్థ (CNS) మరియు జీర్ణనాళంలో ప్రత్యేక గ్రాహకాలతో బంధనం చెందుతాయి.

రెండు ముఖ్యమైన ఒపియోడ్స్ (i) మార్ఫిన్ (ii) హెరాయిన్
(i) మార్ఫిన్: ఇది పాపి మొక్క అపరిపక్వ ఫలాలు లేదా ఎండిన లేటెక్స్ నుంచి లభిస్తుంది.

  • ఇది రంగులేని స్ఫటికం లేదా తెలుపు పటికపొడి రూపంలో ఉంటుంది.
  • దీనిని నోటి ద్వారా లేదా సూది ద్వారా తీసుకుంటారు.
  • ఇది సమర్ధవంతమైన మత్తుమందు మరియు ఉపశమనకారిణి.
  • శస్త్ర చికిత్స రోగులకు మరియు బాధలతో వున్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

(ii) హెరాయిన్: ఇది మార్ఫిన్ ను ఎసిటైలేషన్ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇది చేదుగా, తెల్లగా ఉండే పదార్ధం రసాయినికంగా ఇది·‘డై ఎసిటైల్ మార్ఫిన్’.

  • దీనిని స్మాక్ అని కూడా అంటారు.
  • దీనిని పీల్చడం మరియు సూదుల ద్వారా తీసుకుంటారు.
  • ఇది ఉపశమనకారిణి మరియు శరీర చర్యలను నెమ్మది చేస్తుంది.

ప్రశ్న 15.
కెనాబినాయిడ్స్ పై లఘుటీక రాయండి.
జవాబు:
కెనాబినాయిడ్స్: ఈ మందులు భారత హెంప్ మొక్క ‘కనాబిస్ సటైవా’ నుంచి లభిస్తాయి.

  1. ఈ మొక్క పుష్పాల చివరలు, పత్రాలు మరియు రెసిన్ ను వివిధ పాళ్లలో వినియోగించి మరిజువాన, హాషిష్, చరస్ మరియు గంజాయిలను తయారు చేస్తారు.
  2. ఆ మందులను క్రీడాకారులు వారి యొక్క ఆటతీరును మెరుగుపరచుకోవడానికి వాడతారు.
  3. ఈ ముందులను నోటి ద్వారా గాని లేదా పీల్చడం ద్వారా తీసుకుంటారు.
  4. వీటి వలన హృదయ ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది.

ప్రశ్న 16.
కొకైన్ పై లఘుటీక రాయండి.
జవాబు:
కొకైన్: కొకైన్ తెల్లని పటికరూప ఆల్కాలాయిడ్

  1. ఇది కొకా మొక్క ఎరిత్రోజైలం నుంచి లభిస్తుంది.
  2. ఇది దక్షిణ అమెరికాలో దొరుకుతుంది. దీనిని సాధారణంగా కోక్ లేదా క్రాక్ అని అంటారు.
  3. దీనిని ముక్కు ద్వారా పీలుస్తారు.
  4. డోపమైన్ అనే నాడీ అభివాహక రవాణాలో ఇది జోక్యం చేసుకుంటుంది.
  5. దీనివలన ఉల్లాసస్థితి మరియు శక్తి పెరుగుదల కలుగుతుంది.
  6. దీని యొక్క అధిక మోతాదు భ్రాంతికి గురిచేస్తుంది.

ప్రశ్న 17.
కౌమారదశను భేద్యమైన దశగా ఎందుకంటారు? [AP MAY-22][AP M-15,18]
జవాబు:

  1. కౌమారదశ అనేది 12 నుండి 18 సంవత్సరముల మధ్యలో ఉండే యుక్త వయస్సు (టీనేజీ వయస్సు).
  2. ఇది చిన్నతనానికి మరియు ప్రౌడ దశకు మధ్య వారధి.
  3. ఈ సమయంలో పిల్లలు పరిపక్వత చెందుతారు.
  4. అనేక జీవసంబంధ మరియు ప్రవర్తనా సంబంధ మార్పులు ఈ కాలంలో చోటు చేసుకుంటాయి.
  5. కావున కౌమార దశను ఒక వ్యక్తి మానసిక మరియు మనోవిజ్ఞాన అభివృద్ధిలో ‘హాని పొందే దశ’గా చెబుతారు.

ప్రశ్న 18.
వ్యసనం, ఆధారపడుట మధ్య భేదాలను తెలపండి? [TS M-17]
జవాబు:
వ్యసనం:

  1. వ్యసనం అనేది కొన్ని ప్రత్యేక మానసిక అంశాలలో కలిగే ఉల్లాస స్థితి.
  2. ఆల్కాహలు, డ్రగ్స్ మరియు పొగాకు సేవనంలో దాగిన ప్రవృత్తే వ్యసనం.
  3. అనేకమార్లు ఈ మందులను మానవుని దేహంలోకి తీసుకోవటం వలన శరీరం ఆ గ్రాహకాలను తట్టుకునే శక్తిని పెంచుకుంటుంది. దీని వల్ల మరింత ఎక్కువ పరిమాణంలో మందులను తీసుకుంటేనే గ్రాహకాలు ప్రతిస్పందిస్తాయి. ఇలా వ్యక్తిని వ్యసనానికి బానిస చేస్తాయి.
  4. ఒక్కసారి డ్రగ్స్న తీసుకోవటం వలన మనస్సులోకి మరల అదే ఆలోచన వచ్చి వ్యసనం వైపుకి దారి తీస్తుంది.
  5. వ్యసన శక్తి గల పొగాకు, మందులు ఆల్కహల్స్, వ్యసన స్వభావం గల గుంపులోకి వాడే వారిని లాగేస్తాయి. వాటిని క్రమంతప్పకుండా తీసుకునేలా చేస్తాయి. దీని వలన వాటి నుండి వారు బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది.
  6. సరైన సలహా లేదా కౌన్సిలింగ్ లేనపుడు వ్యసనపరులు వాటిపైనే ఆధారపడతారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ఆధారపడటం:

  1. ఇది క్రమం తప్పకుండా మోతాదులో మత్తు మందులు లేదా ఆల్కహాల్ వినియోగాన్ని ఒకేసారి మానివేయడం వల్ల శరీరంలో కనిపించే అసంతృప్తి లక్షణం లేదా ఉపసంహరణ సిండ్రోమ్.
  2. ఉపసంహరణ సిండ్రోమ్ లో ఆందోళన, వణకటం, వికారం మరియు చెమట పట్టడం వంటి మొదలైనవి లక్షణాలు మొదట కనిపిస్తాయి. ఈ డ్రగ్స్ మరల వాడటం మొదలెడితే ఆ లక్షణాలు కనిపించవు.
  3. ఆధారం అనేది అన్ని సామాజిక కట్టుబాట్లను వదిలేస్థితికి దారి తీస్తుంది.

ప్రశ్న 19.
TDA దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది నిరూపించండి? [AP, TS-18] [TS M-15,16]
జవాబు:

  • TDA అనగా టీనేజ్ డ్రగ్స్ దుర్వినియోగం
  • ‘చిక్సిత కంటే నివారణ మంచిది’ అనే సామెత TDA విషయంలో నిజం.

నివారణకు ఉపయోగకరమైన ప్రమాణాలు:
1. తల్లిదండ్రులు అనవసర ఒత్తిడిని తప్పించడం:పిల్లలందరికీ వారి వారి ఎంపికలు, గ్రహణశక్తి, మరియు వ్యక్తిత్వం ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల గ్రహణశక్తికి మించి ఒత్తిడి చేయకూడదు. విద్య, ఆటల విషయంలో తోటి వారితో పోల్చకూడదు.

2. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల బాధ్యతలు: వీరు విద్యార్థులకు సలహలు, హితబోధ మరియు సహయం చేయాలి.TDA కు గురికాకుండా, వాటి ఉచ్చులో పడకుండా చేయాలి.

3. తోటివారిసహాయం: తోటి వారు తమ మిత్రులు TDA ఉచ్చులో పడినట్లు గుర్తిస్తే వెంటనే తల్లిదండ్రులు (లేదా) ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్ళాలి.

4. విద్య మరియు హితబోధ: నిరంతరంగా పిల్లలను TDA విషయంలో, పాఠ్యాంశాల రూపంలో అన్ని దశలలో బోధించాలి.

5. వృత్తి పరమైన మరియు వైద్యపరమైన సహయం అందించుట: యోగ్యమైన మనోవిజ్ఞాన వేత్తల, మానసికవేత్తల, ‘డి ఎడిక్షన్’ మరియు రిహబిలిటేషన్ ప్రోగ్రామర్స్ను అధిక మొత్తంలో సహాయం కొరకు నిర్వహించాలి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి. పటం గీసి భాగాలను గుర్తించండి. [AP M-15] [TS M-19]
జవాబు:
వర్గం: ప్రోటోజోవా
ఉప వర్గం: సార్కోమాస్టిగోఫోరా
తరగతి: రైజోపోడియా

  • ఎంటమీబా హిస్టోలైటికా ఏకాతిధేయి పరాన్న జీవి.
  • ఈ జీవి మానవుని పెద్ద పేగులో జీవిస్తుంది.
  • ఇది అమీబియాసిస్ అనగా అమీబిక్ విరోచనాలను కల్గిస్తుంది.

ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణమును మూడు దశలలో వివరించవచ్చు.

  1. పోషక దశ
  2. పూర్వకోశస్థ దశ
  3. కోశస్థ దశ

1. పోషక దశ :

  • ఇది చాలా చురుకైన, కదలికలు గల పోషక మరియు వ్యాధి కారక దశ.
  • ఈ దశలో పరాన్న జీవి మానవుని పెద్ద పేగు శ్లేష్మస్తరం, అధఃశ్లేష్మస్తరంలో నివసిస్తుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1
  • దీని దేహం ‘ప్లాస్మా లెమ్మా’ పొరతో కప్పబడి ఉంటుంది. దీని జీవపదార్థం
    (i) వెలుపల చిక్కని, కణికారహిత ‘బాహ్యజీవ ద్రవ్యంగా’
    (ii) లోపల కణికాయుత, ద్రవరూప ‘అంతర్జీవ ద్రవ్యంగా విభజించబడి ఉంటుంది.
  • అంతర్జీవ ద్రవపదార్ధం రైబోజోమ్లు, ఎర్రరక్తకణాలతో కూడిన ఆహార రిక్తికలు మరియు బండి చక్రం వంటి కేంద్రకంను కలిగి ఉంటుంది.
  • ఇది అవాయు శ్వాసక్రియను జరుపుకుంటుంది.
  • దీని పోషణ ‘జాంతవభక్షక రకం’ (holozoic)
  • ఇది ప్రోటీన్లను జీర్ణం చేసే ‘హిస్టోలైసిన్’ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది.

2. పూర్వకోశస్థ దశ:

  • ఈ దశ పోషణలేని, కదలికలేని మరియు వ్యాధికారకత కాని దశ.
  • ఈ దశలో ఇది పెద్ద పేగు కుహరంలో ఉంటుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 5
  • ఇది చిన్నగా మరియు అండాకారంగా ఉంటుంది.
  • జీవపదార్ధం గ్లైకోజన్ రేణువులు మరియు కడ్డీలాంటి క్రొమటాయిడ్ దేహాలను నిల్వ ఆహారంగా కల్గి ఉంటుంది.

3. కోశస్థ దశ:

  • ఈ దశలో పరాన్న జీవి గుండ్రంగా ఉంటుంది.
  • ఇది పెద్దపేగు కుహరంలో ఉంటుంది.
  • పరాన్న జీవి చుట్టూ పలచని, మృదువైన, అధిక నిరోధక శక్తిగల కోశకుడ్యాన్ని ఏర్పరచుకునే విధానాన్ని కోశీకరణం అని అంటారు.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 6
  • పరాన్నజీవిలోని కేంద్రకం రెండుసార్లు సమవిభజనలు జరుపుకొని నాలుగు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. దీనినే చతుష్కేంద్రక కోశం అని అంటారు. ఇదే మానవుడికి వ్యాధిని కల్గించే దశ.
  • ఈ కోశాలు మలంతో పాటు బయటికి విడుదలై, ఆరోగ్యకరమైన కొత్త అతిథేయిని చేరే వరకు వేచి ఉంటాయి.

ఎంటమీబా హిస్టోలైటికా జీవిత చక్రం:

  1. పోషక దశలో ఉన్న ఎంటమీబా ద్విధావిచ్ఛిత్తి ద్వారా అనేక పిల్ల ఎంటమీబాలను ఏర్పరుస్తుంది.
  2. అవి బాక్టీరియా మరియు అతిధేయి కణజాలాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఆకారంలో పెరుగుతూ ద్విధావిచ్ఛిత్తి ద్వారా సంఖ్యను అధికంగా పెంచుతాయి.
  3. వీటిలో కొన్ని పెద్ద పేగును చేరి ‘పూర్వకోశస్థ దశ’లోకి మారుతాయి.
  4. తరువాత ఈ దశ నుండి ‘కోశస్థ దశ’లోకి మారుతాయి.
  5. చివరగా చతుష్కేంద్రక కోశాలుగా మారుతాయి. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటల వ్యవధిలోనే జరుగుతుంది.
  6. చతుష్కేంద్రక కోశాలు మలంతోపాటు బయటికి విడుదలై సుమారు 10 రోజుల వరకు జీవంతో ఉంటాయి.
  7. ఈ కోశాలు కలుషిత నీరు మరియు ఆహారం ద్వారా ‘కొత్త మానవ అతిధేయిని’ చేరుతాయి.
  8. ఆ మానవుని చిన్న పేగునందలి ట్రిప్సిన్ ఎంజైము వలన ఈ కోశాల గోడలు విచ్ఛిన్నమవుతాయి.
  9. తద్వారా చతుష్కేంద్రక అమీబాలు విడుదలవుతాయి. వీటినే ‘మెటాసిస్ట్స్’ అని అంటారు.
  10. మెటాసిస్ట్లలోని నాలుగు కేంద్రకాలు సమవిభజనకులోనై ఎనిమిది పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తాయి. ప్రతి కేంద్రకం కొంత జీవపదార్థంను గ్రహించి మరియు ఎనిమిది పిల్ల ఎంటమీబాలుగా ఏర్పడతాయి.
  11. ఇవి పెద్దప్రేగు గోడలను చేరి పరిపక్వ పోషక జీవులుగా ఏర్పడి అమీబిక్ విరోచనాలను కలుగజేస్తాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

వాహకాలు: కొందరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. అటువంటి వారినే వాహకాలు అంటారు. (ఎసింప్టోమాటిక్ సిస్ట్ పాసర్స్).

బాహ్యాంత్ర అమీబియాసిస్: కొన్ని సార్లు పోషక జీవులు కాలేయాన్ని చేరి పుండ్లను ఏర్పరుస్తాయి ( ద్వితీయ అమీబియాసిస్) . అక్కడినుంచి ఊపిరితిత్తులు, హృదయం, మెదడు, మూత్రపిండాలు, బీజకోశాలు మొదలైన అవయవాలను చేరి పుండ్లను ఏర్పరచి తీవ్రవ్యాధికారక స్థితికి దారితీస్తాయి.

మెటాసిస్టిక్ ఎంటామీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులు. ఇవి పెద్ద పేగును చేరి పరిపక్వ పోషక జీవులుగా మారుతాయి.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 7

ప్రశ్న 2.
మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని వివరించండి. దాని పటం గీసి భాగాలు గుర్తించండి. [AP M-17] [TS May-17]
జవాబు:
‘ప్లాస్మోడియం వైవాక్స్’ మానవునిలో మలేరియా పరాన్న జీవి. ఇది ద్వి అతిధేయి. ఇది కాలేయ కణాలు మరియు RBCలో జీవించే కణాంతస్థ పరాన్న జీవి.

మానవుడిలో ప్లాస్మోడియం జీవిత చక్రం (మానవ దశ):
వర్గం: ప్రోటోజోవా
ఉప వర్గం: ఎపికాంప్లెక్సా
తరగతి: టెలోస్పోరియా

మానవునిలో ప్లాస్మోడియం అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తిని జరుపుతుంది. దీనినే ‘విఖండ జననం’ అంటారు.
ఇది రెండు రకాలు.
(a) కాలేయ విఖండ జననం (కాలేయ కణాలలో)
(b) గాల్జి చక్రం – ఎరిత్రోసైటిక్ విఖండ జననం(ఎర్ర రక్త కణాలలో)

(a) కాలేయ విఖండ జననం: దీన్ని ‘షార్ట్ మరియు గారమ్’లు కనుగొన్నారు.
వ్యాధికారక దోమ ఆరోగ్యవంతమైన మానవుడిని కుట్టినప్పుడు వీటిలోని స్పోరోజాయిట్లు మానవుడి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇవి కేవలం అర్ధగంట లోపలే కాలేయ కణాలను చేరుతాయి. కాలేయ కణాలలో ఈ పరాన్న జీవులు రెండు చక్రాలలో తమ సంఖ్యను పెంచుకుంటాయి. అవి (i) రక్తకణ పూర్వ చక్రం మరియు (ii) రక్తకణబాహ్య చక్రం.

(i) రక్తకణపూర్వచక్రం:

  • స్పోరోజాయిట్లు కాలేయ కణాలలోనికి ప్రవేశించిన తరువాత పోషక దశలుగా మారతాయి.
  • ఇవి గుండ్రంగా ఏర్పడి పరిమాణంలో పెరుగుతాయి. వీటినే విఖండ/షైజాంట్ అంటారు.
  • వీటి కేంద్రకం అనేకమార్లు విభజన చెందుతుంది. దీనితో పాటుగా జీవపదార్థం కూడా విభజన చెంది 12,000 క్రిప్టోజాయిట్లను (మొదటి తరం మెరోజాయిట్లను) విడుదల చేస్తుంది.
  • ఇవి విఖండ కణత్వచాన్ని మరియు కాలేయ కణాలను విచ్ఛిన్నం చేసి, కాలేయంలోని సైనుసాయిడ్లలోకి విడుదల చేస్తాయి.
  • ఈ రక్తకణ పూర్వచక్రం ప్రక్రియ కాలం ఎనిమిది రోజులు.
  • ‘క్రిప్టోజాయిట్లు’ క్రొత్త కాలేయ కణాల్లోకి ప్రవేశించి ‘రక్తకణబాహ్య జీవిత చక్రాన్ని’ లేదా అవి ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశిస్తే ‘రక్తకణ జీవిత చక్రాన్ని’ జరుపుకోవడం జరుగుతుంది.

(ii) రక్తకణ బాహ్య చక్రం:

  • కాలేయ కణాలలోనికి ప్రవేశించిన క్రిప్టోజాయిట్లు ‘రక్త విఖండజననం’ ద్వారా రెండు రకాల మెటాక్రిప్టోజాయిట్ల’ను రెండు రోజులలో విడుదల చేస్తాయి.
  • చిన్నగా ఉన్న వాటిని ‘సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్లు’ అని పెద్దవిగా ఉన్నవాటిని ‘స్థూల మెటా క్రిప్టోజాయిట్లు’ అంటారు. స్థూల మెటా క్రిప్టోజాయిట్లు రక్తకణబాహ్య చక్రాన్ని కొనసాగిస్తాయి.

ప్రీపెటెంట్ కాలం: ప్రప్రధమంగా ప్లాస్మోడియం (స్పోరోజాయిట్) మానవుడి రక్తంలోనికి ప్రవేశించినప్పటి నుండి రెండోసారి ప్లాస్మోడియం (క్రిప్టోజాయిట్లు) ప్రవేశించటానికి ఉన్నటువంటి 8 రోజుల విరామ కాలమే ‘ప్రీపెటెంట్ కాలం’. ఈ కాలంలో అతిధేయిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు.

(b) గాల్జీ చక్రం(రక్తకణ జీవిత చక్రం ): ఈ చక్రాన్ని మొదటగా ‘గాల్జి’ అనే శాస్త్రవేత్త వివరించాడు. కావున దీనిని గాల్జి చక్రం అంటారు.

  • మొదట క్రిప్టోజాయిట్లు లేదా సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి ట్రోఫోజాయిట్లుగా మార్పు చెందుతాయి.
  • ఈ ట్రోఫోజాయిట్లలో ఒక చిన్న రిక్తిక ఏర్పడుతుంది.
  • జీవపదార్ధాన్ని, కేంద్రకాన్ని అంచువైపుకు నెట్టడం వల్ల ఈ రిక్తిక పరిమాణం పెరుగుతుంది.
  • ఈ దశలో పోషక జీవి ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. కావున ఈ దశను అంగుళీక దశ అంటారు.
  • ఇక్కడ రిక్తిక అదృశ్యమవుతుంది. ఈ స్థితిలో మిధ్యాపాదాలను అభివృద్ధి చేసుకొని అమీబాయిడ్ దశగా మారుతుంది.
  • ఈ దశలో పోషక జీవి ‘అతివృద్ధి స్థితిని’ కల్గి వుంటుంది. (ఎర్రరక్త కణాల పరిమాణం రెండింతలు పెరుగును).
  • ఇది హీమోగ్లోబిన్లోని ‘గ్లోబిన్’ ను ఆహారంగా తీసుకొని, పరిమాణాన్ని పెంచుకుంటుంది.
  • ఈ పరాన్న జీవి ‘కరిగే హీము’, కరగని ‘హీమోజాయిన్ కణికలుగా’ మారుస్తుంది.
  • ఎర్ర రక్తకణాల జీవపదార్ధంలో చిన్న ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. వీటినే ‘షఫ్నర్ చుక్కలు’ అంటారు.
  • వీటిని పరాన్నజీవి విడుదల చేసే ‘ప్రతి జనకాలుగా’ భావించవచ్చును.
  • ఇది ‘గుండ్రని విఖండం’గా మార్పు చెందుతుంది.
  • ఇది ‘విఖండ జననంకు లోనై 12-24 ఎర్ర రక్తకణ మీరోజాయిట్లను ఏర్పరుస్తుంది.
  • చివరిగా ఎర్రరక్తకణం పగిలి హీమోజాయినన్ను మరియు మీరోజాయిట్లను రక్తంలోనికి విడుదల చేస్తుంది.
  • హీమోజాయిన్ విడుదల విపరీతమైన చలి మరియు జ్వరమును కలిగిస్తాయి.
  • మీరోజాయిట్లు ఎర్రరక్త కణాలపై దాడి జరిపి మరల రక్తకణ చక్రాన్ని కొనసాగిస్తాయి.
  • రక్తకణ చక్రం సుమారు 48 గంటలలో పూర్తవుతుంది.

పొదిగే కాలం: ప్లాస్మోడియం (స్పోరోజాయిట్లు) ప్రవేశించినప్పటి నుండి మరియు మలేరియా జర్వం లక్షణాలు మొదటగా బహిర్గతమయ్యేంత వరకు పట్టే కాలాన్ని ‘పొదిగే కాలం’ అంటారు. దీని సమయం 10-14 రోజులు.

సంయోగ బీజ మాతృకలు ఏర్పడటం: అనేక ఎర్రరక్త కణ విఖండ జననాలు జరిగిన తరువాత ఏర్పడిన మీరోజాయిట్లు RBC లను చేరి రక్తకణ చక్రాన్ని కొనసాగించకుండా సంయోగ బీజ మాతృకలుగా మారుతాయి.

సంయోగ బీజ మాతృకలు రెండు రకాలు అవి:

  1. సూక్ష్మ సంయోగ బీజ మాతృకలు లేదా పురుష సంయోగ బీజ మాతృకలు
  2. స్థూల సంయోగ బీజ మాతృకలు లేదా స్త్రీ సంయోగ బీజ మాతృకలు

సంయోగ బీజ మాతృకలు మానవుడి రక్తంలో ఎలాంటి అభివృద్ధి చెందవు. ఇవి ఆడ ఎనాఫిలిస్ (దోమ)ను చేరడానికి వేచి ఉంటాయి. ఒక వారం రోజుల లోపల ఇవి దోమను చేరకపోతే క్షీణించి చనిపోవడం జరుగుతుంది.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 8

ప్రశ్న 3.
దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని పటం సహాయంతో వివరించండి? [APM-16,17,19,20] [TSM-16,17,20]
జవాబు:
దోమలో ప్లాస్మోడియం జీవిత చక్రం (దోమ దశ)-రాస్ వలయం:
`ప్లాస్మోడియం బీజ మాతృకలు మొదట మానవునిలో ఏర్పడతాయి మరియు వాటి తరువాత అభివృద్ధి ఆడ ఎనాఫిలిస్ దోమలో జరుగుతుంది.

ఆడ ఎనాఫిలిస్ దోమ వ్యాధిగ్రస్తుడైన మానవుడిని కుట్టి రక్తాన్ని పీల్చినపుడు రక్తం ద్వారా సంయోగ బీజ మాతృకలు, వివిధ దశలలో దోమ అన్నాశయం చేరతాయి. ఇక్కడ సంయోగ బీజ మాతృకలు మాత్రమే జీవిస్తాయి. మిగిలిన అన్ని దశలు జీర్ణమైపోతాయి.

వీటి జీవిత చక్రంలో నాలుగు దశలు ఉంటాయి.

  1. బీజకణోత్పత్తి
  2. ఫలదీకరణం
  3. గమన సంయుక్త బీజం, సంయుక్త బీజకోశాలు ఏర్పడటం
  4. సిద్ధబీజోత్పత్తి.

1. బీజకణోత్పత్తి: సంయోగబీజ మాతృకణాల నుంచి పురుష, స్త్రీ బీజకణాలు ఏర్పడటాన్ని బీజకణోత్పత్తి అంటారు. ఇది దోమ అన్నాశయ కుహరంలో జరుగుతుంది.

(i) పురుష సంయోగబీజకణాలు ఏర్పడటం: ఈ ప్రక్రియలో సూక్ష్మ సంయోగ బీజ మాతృక కేంద్రకం విభజన చెంది ఎనిమిది పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది.

  • ఈ ఎనిమిది పిల్ల కేంద్రకాలు ఎనిమిది కశాభాలను పోలిన కీలితాలను ఏర్పరిచి, పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి.
  • ఈ కశాభాలను పోలిన కీలితాలు ‘విసిరిన కొరడా మాదిరి కదలికలను’ చూపుతూ కశాభాయుత దేహం నుండి వేరుపడతాయి. ఈ విధంగా విడుదల అవడాన్ని కశాభ నిర్మోచనం అంటారు.

(ii) స్త్రీ సంయోగ బీజ కణాలు ఏర్పడటం: స్త్రీ సంయోగ బీజ మాతృకణాలు కొద్ది మార్పులతో స్త్రీ సంయోగ బీజకణంగా ఏర్పడుతుంది. దీన్ని పరిపక్వత అంటారు.

  • కేంద్రకం పరిధి వైపు కదులుతుంది. జీవపదార్ధం ఆ వైపు ఒకనొక్కును ఏర్పరుస్తుంది. దీనినే ఫలదీకరణ శంకువు అంటారు.

2. ఫలదీకరణం: స్త్రీ, పురుష బీజకణాల సంయోగాన్ని ఫలదీకరణం అంటారు.

  • చురుకుగా ఉన్నటు వంటి సూక్ష్మ సంయోగ బీజం కదులుతూ, స్థూల సంయోగబీజం యొక్క ఫలదీకరణ శంకువును తాకి, దానిలోనికి ప్రవేశిస్తుంది.
  • రెండు బీజకణాల ప్రాక్కేంద్రకాలు మరియు జీవ పదార్ధం కలిసిపోతాయి. ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది.
  • సంయోగ బీజాలు పరిమాణ రీత్యా అసమానం, కాబట్టి దీన్ని అసమ సంయోగం అంటారు.

3. గమన సంయుక్త బీజం & సంయుక్త బీజకోశం ఏర్పడటం:

  • సంయుక్త బీజం పొడవుగా, కదలిక చూపే ఊకినైట్/ గమన సంయుక్త బీజంగా 18-24 గంటలో మార్పు చెందుతుంది.
  • ఇది అన్నాశయ కుడ్యాన్ని తొలుచుకొని, ఆధార త్వచం క్రిందకు చేరుతుంది.
  • ఇది గుండ్రంగా మారి దేహం చుట్టూ ఒక కోశాన్ని స్రవిస్తుంది.
  • ఈ కోశస్థ దశను ఊసిస్ట్ అంటారు. (వీటిని సర్ రోనాల్డ్ రాస్ మొట్ట మొదటగా గుర్తించారు.)

4. సిద్ధబీజోత్పత్తి:

  • బానో అనే శాస్త్రవేత్త ప్రకారం, ఊసిస్ట్ యొక్క కేంద్రకం మొదట క్షయకరణ విభజన జరుపుకుంటుంది. ఆ తరువాత కేంద్రకం అనేక సార్లు సమవిభజనలను జరిపి అనేక పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది.
  • ప్రతి కేంద్రకం చుట్టూ కొంత జీవపదార్థం చేరి కొడవలి ఆకారంలో కల స్పోరోజాయిట్స్ను ఏర్పరుస్తుంది.
  • ఇటువంటి స్పోరోజాయిట్స్ (సుమారు 10,000) గల ఊసిస్ట్ను ‘సిద్ధ బీజకోశం’ అంటారు.
  • ఇవి అక్కడ నుండి లాలాజల గ్రంధులలోనికి చేరి ఆరోగ్యవంతుడైన మానవుడికి సంక్రమించుటకు సిద్ధంగా ఉంటాయి.
  • దోమలో ప్లాస్మోడియం జీవిత చక్రం పూర్తికావడానికి దాదాపుగా 10-24 రోజులు పడుతుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 9

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నిర్మాణాన్ని, జీవితచక్రపటాలతో వివరించండి. [AP May-17][ TS M-15][IPE- 13][AP-18]
జవాబు:
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్:

  1. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ ను ‘సాధారణ గుండ్రటి పురుగు’ అంటారు.
  2. ఇది మానవుని ప్రేగులో చేరి ఆస్కారియాసిస్ వ్యాధిని కలిగిస్తుంది.ఇది చిన్న పిల్లలలో ఎక్కువగా నివసిస్తుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 10
  3. ఇది ద్విరూప, ఏకాతిధేయ, మిధ్యాశరీర కుహర, ఆంత్రపరాన్న జీవి.
  4. కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది.

వ్యాధి: పిండసహిత గుడ్లలోని రెండవ దశ రాబ్దిటిఫార్మ్ డింభకం.
ఇది వ్యాధిని వ్యాపింప జేసే దశ.

నిర్మాణం: వీటిలో స్త్రీ, పురుష జీవులు వేరు వేరుగా ఉంటాయి అవి స్పష్టమైన లైంగిక ద్విరూపకతను చూపుతాయి.

  • స్త్రీ, పురుష జీవులు రెండూ స్థూపాకారంలో, సన్నగా ఉంటాయి.
  • రెండు జీవులలో పూర్వాంతంలో నోరు మూడు కైటిన్ పెదవులతో ఆవరించి ఉంటుంది.
  • విసర్జక రంధ్రం ఉదర మధ్యంగా, నోటికి దగ్గరగా ఉంటుంది.

పురుషజీవి: ఇది పొట్టిగా, వంపు తిరిగిన తోకతో ఉంటుంది. పరాంతంలో అవస్కర రంధ్రం, ఒక జత సమాన సంపర్క కంటకాలు ఉంటాయి.

స్త్రీజీవి: ఇది పొడవుగా, పరాంతంలో నిటారైన తోకతో ఉంటుంది. పాయువు తోకదగ్గరగా ఉంటుంది. జనన రంధ్రం నోటికి కింద ఉంటుంది.

జీవిత చక్రం:

  1. మానవుడి చిన్నపేగులో సంపర్కం తరువాత స్త్రీజీవి రోజుకు దాదాపుగా 2 లక్షల గుడ్లను విడుదల చేస్తుంది..
  2. ప్రతి గుడ్డును బుడిపెలుగా వున్న ప్రోటీన్ పొర ఆవరించి వుంటుంది. ఈ గుడ్లను ‘మామ్మిల్లేటేడ్ గుడ్లు’ అంటారు.
  3. మలంతో పాటు గుడ్లు విడుదలవుతాయి.
  4. తేమ నేలలో, గుడ్డులో పిండాభివృద్ధి జరిగి మొదటి దశ ‘రాబ్దిటి ఫార్మ్ డింభకం’ ఏర్పడుతుంది.
  5. ఇది మొదటి నిర్మోచనంకు లోనై రెండో దశలో రాన్టిటి ఫార్మ్ డింభకంను ఏర్పరుస్తుంది. ఇదే మానవుడికి వ్యాధిని కలిగించే సాంక్రమిక దశ.
  6. ఈ గ్రుడ్లు కలుషిత ఆహారం, నీటి ద్వారా క్రొత్త అతిధేయిని చేరుతాయి.
  7. చిన్న పేగులో కర్పరం కలిగిన డింభకం విడుదల అవుతుంది.
  8. ఈ డింభకం ‘కాలేయ నిర్వాహక సిర’ ద్వారా కాలేయాన్ని చేరుతుంది.
  9. పరమహసిర ద్వారా హృదయాన్ని చేరుతుంది.
  10. పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులను చేరి బాహ్యంత్రవలస చేస్తుంది.
  11. ఊపిరితిత్తుల వాయు కోశాలలో, రెండో నిర్మోచనం చెంది మూడోదశ డింభకంగా మారుతుంది.
  12. ఊపిరితిత్తుల వాయు కోశాలలో, మూడో నిర్మోచనం చెంది నాలుగో డింభకంగా మారుతుంది.
  13. ఈ డింభకం శ్వాసనాళికలు, వాయునాళం, స్వరపేటిక, కంఠబిలం, గ్రసని, ఆహార వాహిక మరియు జీర్ణాశయం. ద్వారా చిన్న పేగును చేరుతుంది.
  14. చిన్న పేగులో నాల్గవ (చివరి) నిర్మోచనం చెంది పిల్ల జీవిగా మారుతుంది.
  15. ఇది 8-10 వారాలలో లైంగిక పరిపక్వతను పొందుతుంది.

వ్యాధికారకత: ఆస్కారిస్ వలన ‘ఆస్కారియాసిస్’ వ్యాధి వస్తుంది. వ్యాధి తీవ్రమైనపుడు పోషణ లోపాలు, ఉదరంలో తీవ్రమైన నొప్పి మరియు చిన్న పిల్లలలో పెరుగుదల కుదించబడటం జరుగుతాయి.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 11

ప్రశ్న 5.
ఉకరేరియా బాంక్రాఫ్టి జీవితచక్రాన్ని వివరించండి? [TS M-18]
జవాబు:
వర్గం: నెమటోడా
తరగతి: ఫాస్మిడియా

  1. ఉకరేరియా బాంక్రాఫ్టిని సాధారణంగా ‘ఫైలేరియలో క్రిమి’ అని అంటారు.
  2. ఇది ద్విఅతిధేయి, ద్విరూపక, కణజాల, మిధ్యాశరీరకుహర పరాన్నజీవి.
  3. ఇది మానవుడి శోషనాళాలలో నివశిస్తుంది. దీని యొక్క ద్వితీయ అతిధేయి దోమ.

నిర్మాణం:

  1. వీటిలో స్పష్టమైన లైంగిక ద్విరూపకత ఉంది.
  2. శరీరం పొడవుగా మరియు తంతు రూపంగా ఉంటుంది. పూర్వాంతం మొండిగా, పరాంతం మొనదేలి ఉంటుంది.
  3. పూర్వాంతంలో పెదవులు లేని నోరు ఉంటుంది.

పురుషజీవి: పరాంతం వంపు తిరిగి, అవస్కరంతో ఉంటుంది మరియు ఒక జత అసమాన ‘సంపర్క శుంకాలను’ కల్గి ఉంటుంది.

“జీవి: పరాంతం నిటారుగా పాయువుతో అంతమవుతుంది. నోటికి 1/3 వంతు దిగువుగా ఉదర మధ్య భాగాన స్త్రీ జనన రంధ్రం వుంటుంది. ఇది అండ శిశూత్పాదక జీవి.

జీవిత చక్రం: ఉకరేరియా జీవిత చక్రం రెండు అతిధేయిలలో పూర్తి అవుతుంది. అవి: మానవుడు మరియు ఆడ క్యూలెక్స్ దోమ

AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

మానవుడు: మానవుడి శోషరస నాళాలలో స్త్రీ, పురుష జీవులు ఒక దానితో ఒకటి మెలివేసుకుని వుంటాయి.

  • సంపర్కం తరువాత స్త్రీజీవి ‘తొడుగు గల మైక్రోఫెలేరియా డింభకాలను’ విడుదల చేస్తుంది. ఇవి 0.2 నుండి 0.3 మి.మీ పొడవు వుంటాయి.
  • దీని చూట్టూ వదులైన అవభాసిని తొడుగు ఉంటుంది. ఇది పగలు లోపలి రక్త నాళాల్లో మరియు రాత్రి సమయంలో 10 PM నుండి 4AM. మధ్య పరిధేయ రక్త ప్రసరణ నాళాల్లో వుంటుంది.
  • దీన్ని విశాకాల ఆవర్తనం అంటారు. ఈ డింభకాలు దోమను చేరే 70 రోజుల లోపల వరకు జీవించి ఉండగలుగ్గుతాయి.

ఆడ క్యూలెక్స్ దోమ:

  • ఆడ క్యూలెక్స్ దోమ సాంక్రమిక మానవుడిని కుట్టినపుడు డింభకాలు దోమ ఆహర నాళాన్ని చేరతాయి.
  • ఆహార నాళంలో తొడుగు కరిగిపోతుంది.
  • ఈ డింభకం ఆహార నాళ కుడ్యాన్ని తొలుచుకుని ఉరఃకండారాలను చేరుతుంది.
  • రెండు రోజులలో ‘సాసేజో ఆకార డింభకం’ (లేదా) ‘మొదటి దశ మైక్రో ఫైలేరియా’గా మారుతుంది.
  • రెండు నిర్మోచనాలు పూర్తి చేసుకొని పొడవైన సాంక్రమిక మూడోదశ మైక్రోఫైలేరియాగా మారుతుంది. ఈ మూడో దశ దోమ అధరం చేరి మానవుడిని చేరుటకు నిరీక్షిస్తుంది.

సంక్రమణ తరువాత మానవుడిలో:

  • సంక్రామిక దోమలు ఆరోగ్యవంతుడైన మానవుడిని కుట్టినపుడు, మూడో దశ డింభకాలు రక్తప్రవాహన్ని చేరి చివరగా శోషరస నాళాలను చేరతాయి.
  • ఇవి ఇక్కడ మూడు మరియు నాలుగు నిర్మోచనాలను జరిపి ప్రౌఢ జీవులుగా మారతాయి.
  • ఇవి 5-18 నెలల కాలంలో లైంగిక పరిపక్వతను పొందుతాయి.

వ్యాధికారకత: సంక్రమణ స్వల్పంగా ఉంటే ఫైలేరియా జ్వరం వస్తుంది. సంక్రమణ అధికంగా ఉంటే లింఫాంజైటిస్ మరియు లింఫాడెంటిస్ దశలు ఏర్పడి చివరిగా ‘ఎలిఫెంటియాసిస్’ వస్తుంది.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 12

Leave a Comment