TS 7th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson www.కారడవి.కామ్

Telangana SCERT 7th Class Telugu Guide Answers Telangana ఉపవాచకం 4th Lesson www.కారడవి.కామ్ Textbook Questions and Answers.

TS 7th Class Telugu Guide Upavachakam 4th Lesson www.కారడవి.కామ్

పాఠం ఉద్దేశం:

ఆధునిక సాంకేతిక ప్రవాహంలో జనం మితిమీరిన ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఒకవేళ జంతువులు సైతం కంప్యూటర్లు వాడితే ఏం జరుగుతుంది ? అనే విషయాలు తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠం నేపథ్యం:

జంతువులు సైతం కంప్యూటర్లు వాడి తమను తాము ఎలా సంరక్షించుకున్నాయో తెలియచేయటమే ఈ పాఠం నేపథ్యం.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఇంటర్నెట్ వల్ల లాభాలున్నాయి? ఏమేమి ఉన్నాయో రాయండి.
జవాబు.
ఇంటర్నెట్ ఒక రకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉండే కంప్యూటర్ల నెట్వర్క్ ఇది ప్రజలకు ఒకరికొకరు సూచనలు ఇచ్చిపుచ్చుకోవడంలో సాయపడుతుంది. కంప్యూటర్లో ఇంటర్నెట్ ద్వారా మీరు ఎన్నో వెబ్సైట్ల నుండి సమాచారాన్ని పొందవచ్చు. ఎవరితోనైనా మాట్లాడవచ్చు. స్నేహం చేయవచ్చు.

ప్రశ్న 2.
షేర్సింగ్ బిహారీపై కోపంతో ఉండడానికి కారణాలేవి?
జవాబు.
బిహారీ అడవిలోని యువకులకు సెల్ఫోన్లు తెచ్చియిచ్చింది. అప్పటి నుండి విప్లవం వచ్చినట్లయింది. ఎందుకంటే అడవిలోని జంతువులు ప్రమాదానికి అప్రమత్తమయ్యే సూచనలు లభించేవి. షేర్సింగ్ వేటకు బయలుదేరగానే అన్ని జింకలు, తెల్లచుక్కల లేళ్ళు, కుందేళ్ళు కూడా షేర్సింగ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేవి. ఒకరినొకరు వార్త నందించుకునేవి. దాని ఫలితంగా షేర్సింగ్ చాలా రోజులవరకు ఆకలితో ఉండవలసి వచ్చింది. దాంతో అతడు బిహారిపై మనసులోనే కోపంగా ఉంది.

ప్రశ్న 3.
మైకాల్ స్వభావాన్ని గురించి రాయండి.
జవాబు.
జయకాల్ పెద్దన్న మైకాల్. పరమక్రూరుడు. జయకాల్తో కలిసి కారడవికి ద్రోహం చేద్దామని చూశాడు. అతని ఎత్తుగడ ఫలించలేదు. తనకు అడ్డుపడుతున్నాడని సొంత తమ్ముడు జయకాల్ను చంపడానికి కూడా వెనుకాడలేదు. అతని ప్రవర్తనతో జయకాల్లో పరివర్తన కలిగి అడవికి మంచిపనులు చేయసాగాడు.

ప్రశ్న 4.
బిహారీ ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు.
బిహారి ఒక కోతి. అడవికి కొంతకాలం దూరంగా ఉంది. కంప్యూటరు జ్ఞానాన్ని పొందింది. WWW. కారడవి. కామ్ అనే వెబ్సైట్్వరా అడవికి ఎంతో ఉపయోగపడింది. అతని ద్వారా మనం కూడా చదువుకోవాలంటే ఎంతదూరమైనా వెళ్ళాలి. బాగా చదువుకోవాలి. చదువుకొని సమాజంలోని చెడును తొలగించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి అని బిహారీ ద్వారా గ్రహించాను.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson www.కారడవి.కామ్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బిహారీ అడవిని ఎలా అభివృద్ధి చేశాడు?
జవాబు.
బిహారి అనే కోతి దట్టమైన కారడవిలో ఉండేది. అడవిలోని జంతువులను, చెట్లను రక్షించాలని, జగ్గూ గూండాగిరిని ఆపాలని కంకణం కట్టుకున్నాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పెంచుకోవాలని తలచి పట్టణానికి వెళ్ళి కంప్యూటర్ విద్యను నేర్చుకుని వచ్చాడు. ఇక బిహారి అడవిని అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఒక వెబ్సైట్ను తెరచి దానికి WWW. కారడవి.కామ్ అని పేరు పెట్టాడు. అడవికి సంబంధించిన సమాచారమంతా తెలుసుకొనే వారికి “బిహారీ @ హాట్మెయిల్. కామ్” అనే ఈ-మెయిల్ చిరునామాను కూడా ప్రకటించాడు.

తన మెయిల్ ఆధారంగా పోలీసులకు జగ్గూ సమాచారాన్ని అందించి జగ్గూ ముఠాను అంతం చేశాడు. ఆపై కోతి బిహారి కంప్యూటర్ సెంటర్ ప్రారంభించి తన తోటి జంతువులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాడు. అడవిలోని పిల్లలకీ, యువకులకు కాలుక్యులేటర్లు, మొబైల్ ఫోనులు అందించి నవ విప్లవానికి నాంది పలికాడు. గుంటనక్క జయకాల్. చేసే అన్ని కుట్రలను భగ్నం చేశాడు. సింహరాజం షేర్సింగ్కు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని పలుదేశాల్లో ఉన్న సింహాలతో సంభాషణలు నెరపించి అక్కడి జంతువులను తమ కారడవికి ఆహ్వానం పలికాడు. ఈ విధంగా కారడవి వెబ్సైట్ కారడవి టి.వి. ఛానెల్, కోతి బిహారి కంప్యూటర్ సెంటర్ల ద్వారా బిహారి అడవిని అభివృద్ధి చేశాడు.

ప్రశ్న 2.
అడవిని అభివృద్ధి పరచడంలో బిహారికి ఎదురైన ఆటంకాలేవి?
జవాబు.
అడవిని అభివృద్ధి పరచటానికి బిహారి అనే కోతి ఎంతో కృషిచేసింది. ప్రపంచ దేశాల్లోనే కారడవి పేరును నిలబెట్టింది. అడవిని అభివృద్ధి పర్చే క్రమంలోనే అనేక ఆటంకాలను కూడా ఎదుర్కొంది. అడవి అభివృద్ధికోసం ముందుగా “WWW. కారడవి. కామ్” అనే వెబ్సైట్ను ప్రారంభించింది. అడవిలోని సమాచారం తెలుసుకోవడానికి “బిహారి @ హాట్మెయిల్.కామ్” అని ఈ-మెయిల్ చిరునామా ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో షేర్సింగ్ అనే సింహానికి ఆహారం కరువైంది. సింహం ఎంగిలి చేసిన మాంసం తిని బతికే నక్క ఖోఖల్ ఆకలితో అలమటించింది. నక్క కొడుకు గూండా జయకాల్ (జె.కె.) బిహారిపై కక్ష పెంచుకున్నాడు. బిహారీ కంప్యూటర్లను నాశనం చేసే వైరస్ ఉన్న ప్లాపీలను తెచ్చాడు.

కొండముచ్చు కాలూ వల్ల ఆ ప్రమాదం తప్పింది. బిహారీని ఎలాగైనా దెబ్బ తీయాలని జయకాల్ పట్టణానికి వెళ్ళి సైబర్ కేఫేలో శిక్షణ పొంది జయకాల్ సైబర్ కేఫేసెంటర్ నడిపాడు. అలాగే “WWW.లకీ ఆజ్ వికె. కామ్” పేరుతో ఓ వెబ్ సైట్ మొదలుపెట్టాడు. కారడవి సమాచారాన్ని అడవి దొంగలకు అందించాడు. ఈ నేపథ్యంలో వేటగాళ్ళ తుపాకీలకు ఐదు ఏనుగులు బలైపోయాయి. దీంతో బిహారి పట్టణానికి వెళ్ళి పాస్వర్డ్ డిటెక్టర్ సాఫ్ట్వేర్ సాయంతో జయకాల్ వెబ్సైట్ పాస్వర్డ్ హైజాక్ చేసి నక్క ఆట కట్టించాడు. ఈ విధంగా బిహారీ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని అడవిని అభివృద్ధి పర్చాడు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson www.కారడవి.కామ్

ప్రశ్న 3.
క్లోనింగ్ అంటే ఏంటి? దానివల్ల లాభమా? నష్టమా? చర్చించండి.
జవాబు.
ప్రకృతి సహజమైన సంపర్కంతో పనిలేకుండా అదే రకమైన జన్యుధర్మాలుండే ప్రాణుల సృష్టినే ‘క్లోనింగ్’ అంటారు. దీన్ని సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ఒక కణం నుండి కేంద్రకాన్ని తొలగించి దానిని వేరొక ఫలదీకరణం చెందని అండకణంలోనికి ప్రవేశపెట్టే ప్రక్రియ క్లోనింగ్. ఇది రెండు రకాలు. మొదటిది ప్రత్యుత్పాదక క్లోనింగ్. అంటే కొంత విభజన జరిగిన తర్వాత అండకణాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టినపుడు అది దాత కేంద్రకంతో జన్యుపరంగా సారూప్యత కలిగిన పిండంగా అభివృద్ధి చెందుతుంది. రెండవది చికిత్సాయుత క్లోనింగ్. అంటే అండాన్ని రాతిగిన్నెలో ఉంచినప్పుడు అనేక రుగ్మతలపై ప్రభావవంతంగా పనిచేసే పిండ మూలకణాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి రోగాల చికిత్సకు ఉపయోగిస్తారు.

1997లో కోస్లిన్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇయన్ విల్ముట్ తన సహచరులతో కలసి డాలీ అనే గొర్రెపిల్లను క్లోనింగ్ ద్వారా సృష్టించాడు. ఇలాంటి ప్రయోగాల వల్ల మానవులను సృష్టించడం కూడా సాధ్యమేనని తేల్చారు. వీటి వల్ల లాభాల మాట అటుంచితే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా సాగిన ప్రతిదీ అనర్థదాయక ఫలితాలనే ఇస్తుంది. క్లోనింగ్ ప్రక్రియద్వారా సృష్టించబడిన జీవులు అతి తక్కువకాలం మాత్రమే జీవిస్తాయి. ఇది మానవ మనుగడకు ఎంతో ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెప్పారు. బ్రిటన్, అమెరికావంటి దేశాలు ఇలాంటి క్లోనింగ్ ప్రక్రియను నిషేధించాయి. చికిత్సాయుత క్లోనింగ్వల్ల కొంత లాభమున్నప్పటికీ ఇది క్రమంగా ప్రత్యుత్పాదక క్లోనింగ్కు దారితీయవచ్చు. అందుకే ఈ క్లోనింగ్ ప్రక్రియను అందరూ వ్యతిరేకించాల్సిందే.

ప్రశ్న 4.
బిహారికి కంప్యూటర్ జ్ఞానం చాలా ఉంది కదా? ఆ విషయాలు మీకు ఏ మేరకు తెలిశాయి? ఈ పాఠం కంటే ముందు మీకు తెలిసిన విషయాలు ఏమిటి?
జవాబు.
బిహారి కంప్యూటర్ జ్ఞానం అద్భుతమైంది. కోతిగా ఉన్నప్పటికీ మనుషులవలె కంప్యూటర్ జ్ఞానాన్ని పొందాడు. ఏకంగా కారడవి పేరు మీద వెబ్సైట్ను ప్రారంభించడమంటే మాటలుకాదు. ఈ- మెయిల్ద్వారా సమాచారాన్ని అందిస్తూ అడవి అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాడు. బిహారి ద్వారా నేను కంప్యూటర్కు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకున్నాను. మనకు సంబంధించి ప్రత్యేకంగా ఇంటర్నెట్ ద్వారా వెబ్సైట్ ఏర్పాటు చేసుకోవచ్చని అర్థమైంది. ఎవరికైనా ఏదైనా సమాచారం అందించడానికి, గ్రహించడానికి మెయిల్ అనేది ఉంటుందని తెలిసింది. అలాగే ఇతరుల కంప్యూటర్లను చెడగొట్టే వైరస్లుంటాయని తెలిసింది.

ప్రతి వెబ్సైట్కి పాస్వర్డ్ లుంటాయని, దాన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని గ్రహించాను. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశముందని గ్రహించాను. ప్రపంచంలోని ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాలను క్షణాల్లో తెలియజేసే అద్భుత యంత్రం కంప్యూటర్ అని తెలుసుకున్నాను. ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి, సందేశాలు పంపుకోవడానికి కూడా కంప్యూటర్ ఉపయోగపడుతుందని నాకర్థమైంది. ఈ పాఠం కంటే ముందు నాకు ఇన్ని విషయాలు తెలియవు. కంప్యూటర్ అంటే కేవలం లెక్కలు చేసుకోవడానికి, వీడియో గేమ్లు ఆడుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారని తెలుసు. కారడవి. కామ్ పాఠం ద్వారా కంప్యూటర్కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది.

ప్రశ్న 5.
కారడవి. కామ్ పాఠ్యభాగ సారాంశం రాయండి.
జవాబు.
ఒక దట్టమైన కారడవి ఉంది. అందులోకి వెళ్ళినవారు మరలా తిరిగి రాలేరు. దట్టమైన అడవి కావడం, జంతువులు విశేషంగా సంచరించడం అక్కడ జరుగుతుంది. అలాంటి అడవిలో గూండా జగ్గూ తన దౌర్జన్యాన్ని సాగించేవాడు. కలప వ్యాపారం చేసే కాంట్రాక్టర్ల నుండి మామూళ్ళు వసూలు చేస్తుండేవాడు. అదే అడవిలో బిహారి అనే కోతి పట్టణానికి వెళ్ళి కంప్యూటర్ నేర్చుకున్నాడు. అడవి అభివృద్ధికోసం స్వయంగా “WWW. కారడవి. కామ్” పేరిట ఒక వెబ్సైట్ ప్రారంభించాడు. అడవి సమాచారం కోసం “బిహారి @ హాట్మెయిల్. కామ్”అనే ఈ-మెయిల్ తెరిచాడు. దీన్ని మిగతా జంతువులు కొన్ని వ్యతిరేకించినా అడవి అభివృద్ధికోసం కొన్ని జంతువులు బిహారి బాట పట్టాయి.

బిహారీ తన మెయిల్ సమాచారంతో జగ్గూను అంతమొందించాడు. కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించి అందరికీ ఆ జ్ఞానాన్ని పంచాడు. దీంతో ఆహారం కరువైన నక్క భోఖల్ అతని కొడుకు జయకాల్ బిహారికి శత్రువర్గంగా తయారైంది. పట్టణానికి వెళ్ళి బిహారి కంప్యూటర్లను నాశనం చేసే వైరస్ ప్లాపీ తెచ్చాడు. కానీ అతని ఎత్తుగడ ఫలించలేదు. స్వయంగా జయకాల్ సైబర్ కేఫే మొదలుపెట్టాడు. “WWW.లకీఆజికె. కామ్” ప్రారంభించి అడవి దొంగలకు సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాడు. దీంతో బిహారి పట్నం వెళ్ళి పాస్వర్డ్ డిటెక్టర్ సాఫ్ట్వేర్ తెచ్చి జయకాల్ ఆట కట్టించాడు. షేర్సింగ్ సింహానికి ఇంటర్నెట్లోని చాటింగ్ ద్వారా పలుదేశాల్లో ఉన్న సింహాలతో మాటా మంతి కలిపాడు.

వన్యజీవుల సంరక్షణకోసం ఏం చేయాలనే సలహాలను, సూచనలను పొందాడు. క్లోనింగ్ ప్రక్రియను షేర్సింగ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. బిహారి టి.వి. ఛానెల్ ఏర్పాటుచేసి మంచి పేరు సంపాదించాడు. ఈ ఛానెల్ కార్యక్రమాల కోసం ప్రపంచంలోని పలు దేశాల జంతువులకు ఇంటర్నెట్ ద్వారా ఆహ్వానం పలికాడు. చివరకు వాటి రాకతో ఛానెల్ కీర్తి మరింత పెరిగింది. ఈ విధంగా బిహారి అడవిలో నూతన విప్లవానికి నాంది పలికి బిహారి కారడవి ప్రతిష్ఠని పెంచాడు. ప్రపంచంలోని అడవులన్నింటికీ కారడవిని ఆదర్శంగా నిలిపాడు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson www.కారడవి.కామ్

I. అవగాహన – ప్రతిస్పందన:

1. ఈ క్రింది గద్యాన్ని చదివి, అర్థం చేసుకోండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కారడవికి దగ్గరగా ఉన్న పట్టణం అనూప్ గంజ్. ఇక్కడ ముఖార్ సింగ్ ఎం.ఎల్.ఏ. ముఖ్యమైన నాయకుడు. గూండా జగ్గు దౌర్జన్యాన్ని నిలువరిస్తానని, ఆయన ప్రజలకు మాట ఇచ్చాడు. ఇది విని జగ్గు మండిపడ్డాడు. ముఖార్సింగ్ను కిడ్నాప్ చేసి, కారడవి మధ్యలో బంధించాడు. ప్రభుత్వానికి, పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ రాత్రి పోలీస్ కమిషనర్ ఇంట్లో సమావేశం జరుగుతున్నది. అకస్మాత్తుగా కమిషనర్ గారి పది సంవత్సరాల కొడుకు రాజు ఆయాసపడుతూ వచ్చాడు. ‘నాన్నా! నేనిప్పుడే ఇంటర్నెట్లో ఒక కొత్త వెబ్సైట్ చూశాను. దాని పేరు www. కారడవి. కామ్. దాంట్లో నీకు కారడవి వివరాలు దొరకవచ్చు. ఈ వింత వెబ్సైట్ గురించి అందరు పోలీస్ అధికారుల్లో ఆసక్తి పెరిగింది. వాళ్ళు వెంటనే ఆ వెబ్సైట్ తెరిచారు. అందులో నిజంగానే కారడవి గురించి వివరాలు ఉన్నాయి.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ముఖార్సింగ్ ఎవరు ?
జవాబు.
ముఖ్తర్ సింగ్ ఎం.ఎల్.ఏ. ముఖ్యమైన నాయకుడు.

ప్రశ్న 2.
వెబ్సైట్ దేనిలో చూడబడింది ?
జవాబు.
ఇంటర్నెట్లో

ప్రశ్న 3.
జగ్గు ఎందుకు మండిపడ్డాడు ?
జవాబు.
గూండా జగ్గు దౌర్జన్యాన్ని ముఖ్తర్సింగ్ నిలువరిస్తానని ప్రజలకు మాట ఇచ్చినందు వల్ల

ప్రశ్న 4.
కారడవి వివరాలు ఏ వెబ్సైట్లో దొరకవచ్చు ?
జవాబు.
WWW. కారడవి. కామ్

ప్రశ్న 5.
ప్రభుత్వానికి, పోలీసులకు పాలుపోని విషయం ఏమిటి ?
జవాబు.
ముఖార్సింగ్ను కిడ్నాప్ చేసి, కారడవి మధ్యలో జగ్గూ బంధించడం.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson www.కారడవి.కామ్

2. కింది పేరా చదువండి. దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.

కోతి బిహారి తన గుహ బయట ఒక సైన్ బోర్డ్ తగిలించేసరికి అడివంతా సందడి వ్యాపించింది. అక్కడ బిహారి ఒక కంప్యూటర్ సెంటర్ని తన పేరు మీద ప్రారంభించాడు. “కోతి బిహారి కంప్యూటర్ సెంటర్” అంటే ‘కె.బి.సి.సి’ అని సైన్ బోర్డు కింద రాసి ఉంది. “రిజిస్ట్రేషన్ తెరచి ఉన్నది”. దానితో సాయంత్రాని కల్లా రిజిస్ట్రేషన్ చేయించే వారితో పెద్ద లైన్ ఏర్పడింది. ఇందులో ఎక్కువగా జంతువులు, పక్షులు, యువకులు, పిల్లలు ఉన్నారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
అడవంతా ఎందుకు సందడి వ్యాపించింది ?
జవాబు.
కోతి బిహారి తన గుహ బయట ఒక సైన్ బోర్డ్ తగిలించేసరికి

ప్రశ్న 2.
కోతి బిహారి ఏమి స్థాపించాడు ?
జవాబు.
కంప్యూటర్ సెంటరిని

ప్రశ్న 3.
సైన్ బోర్డ్ కింద ఏమి రాసి ఉంది ?
జవాబు.
కె. బి. సి. సి

ప్రశ్న 4.
పెద్దగా లైన్ ఎందుకు ఏర్పడింది ?
జవాబు.
రిజిస్ట్రేషన్ చేయించేవారితో

ప్రశ్న 5.
రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ఎవరెవరున్నారు ?
జవాబు.
జంతువులు, పక్షులు, యువకులు, పిల్లలు.

3. క్రింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

షేర్సింగ్ వేటాడటం మానేశాక నక్క ఖోఖల్ ఆకలితో మాడసాగాడు. ఎందుకంటే నక్క భోఖల్ సింహం ఎంగిలి చేసిన మాంసం తిని బతికేవాడు. వాడి గూండా కొడుకు జయకాల్ (అందరు వాడిని జె.కె. అనేవారు) కూడా తండ్రి తెచ్చినవి తిని హాయిగా ఉండేవాడు. ఇప్పుడు చాలా రోజుల నుండి పస్తులుంటున్నాడు. ఒకరోజు వాడు తన తండ్రి ఖోఖల్ని కోపగించుకున్నాడు. అప్పుడు భోఖల్ నక్క అన్నాడు. “నువ్వు ఏ బీహారి దగ్గర కంప్యూటర్ నేర్చుకునేందుకు వెళుతున్నావో అతడు మన నెం.1. అతడి పనులను ఆపకపోతే మనం తొందరలోనే చచ్చిపోతాం”. నక్క జె.కె.కి విషయమేమిటో ఇప్పుడు అర్థమైంది. “అలా అయితే నేను కోతి బిహారికి జీవితంలో మరచిపోలేని గుణపాఠం చెబుతాను” అన్నాడు. మరునాడు జె.కె. పట్టణం వెళ్ళి కోతి బిహారీ కంప్యూటర్లను నాశనం చేసే వైరస్ ఉన్న ప్లాపీ తెచ్చాడు. కానీ కొండముచ్చు ‘కాలూ’ దీన్ని పసిగట్టి బిహారికి చెప్పింది. జయకాల్ బండారం బయటపడింది.

బిహారి సెక్యూరిటీ గార్డులు అతడిని ఎంతగా చితక్కొట్టారంటే, అతడు చాలారోజులవరకు తన గుహలో పడుండి కేకలు పెడుతుండేవాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
షేర్సింగ్ ఎవరు?
జవాబు.
సింహం

ప్రశ్న 2.
బిహారి కంప్యూటర్ విజ్ఞానం వల్ల నక్క భోఖలికి వచ్చిన సమస్య ఏమిటి?
జవాబు.
బిహారీ కంప్యూటర్ విజ్ఞానం వల్ల సింహం షేర్సింగ్ వేటకు బయలుదేరగానే అన్ని జంతువులకు తెలిసి పోయేది. సింహంకు ఏ జంతువు చిక్కేది కాదు. సింహం వేటాడి తినగా మిగిలిన మాంసమ్మీదే నక్క ఖోఖో బతికేది. ఇప్పుడు నక్క భోఖోకు ఈ అవకాశమే లేదు.

ప్రశ్న 3.
కంప్యూటర్ వైరస్ వల్ల జరిగే ప్రమాదమేమిటి?
జవాబు.
కంప్యూటర్లు పనిచేయకుండా చెడిపోతాయి.

ప్రశ్న 4.
జయకాల్ బండారాన్ని బయటపెట్టింది ఎవరు?
జవాబు.
కాలూ అనే కొండముచ్చు.

ప్రశ్న 5.
జయకాల్ ఎవరు?
జవాబు.
ఒక నక్క.

4. క్రింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

షేర్సింగ్కు క్లోనింగ్ అంటే అర్థంకాలేదు. కోతి బిహారి చెప్పాడు. “ఏదైనా ప్రాణి నుంచి ఒక ప్రత్యేక జీన్ ను వేరుచేసి దానిని మరొక ప్రాణి కోశంలో చేరుస్తారు. ఈ విధంగా ఆ జీన్ కొత్తప్రాణిలో పాతప్రాణియొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలని కలుగజేస్తుంది. ‘డాలీ’ అనే గొర్రె ఈ విధంగానే పుట్టింది.”

“ఏమన్నావు? గొర్రెల్లాగా సింహాలను పుట్టిద్దామనుకున్నావా?” షేర్సింగ్ చికాగ్గా ప్రశ్నించాడు.

తరువాత షేర్సింగ్, అమెరికా పులి మధ్య ఈ రకంగా సంభాషణ జరిగింది. “అవి నిజం సింహాలవుతాయా?”

“పూర్తిగా నిజమైనవే. ఆకారం, పని, అలవాట్లు అన్నీ సింహంలాగే ఉంటాయి.”
“వీటిని ఎవరు పుట్టిస్తారు? వీటి తల్లి ఆడసింహమే అవుతుందా?”

“రాబోయే కాలంలో ఆడసింహం అవసరం కూడా ఉండదు. అంతా టెస్ట్ ట్యూబ్లోనూ, ప్రయోగశాలల్లోనూ అయిపోతుంది.”

“ఏమన్నావు? ఆడసింహం లేకుండా కూడా పుడతాయా? కాని అప్పుడు వాటిని సింహం పిల్లలని ఎలాగ అంటారు? వాళ్ళలా అనగలరు. మేము సింహం పాలుతాగామని నీకు తెలియదా? మేము జాతి సింహాలం మాకు పూర్తి వంశ సంప్రదాయం ఉంది.”
“ఈ పాత మాటలన్నీ మరచిపో. ప్రపంచం మారిపోతూంది. శాస్త్రవేత్తలు, మనుషుల జాతిని కూడా మార్చబోతున్నారు.”

ప్రశ్నలు :

ప్రశ్న 1.
క్లోనింగ్ అంటే ఏమిటి ?
జవాబు.
ఏదైనా ప్రాణి నుంచి ఒక ప్రత్యేక జీన్ ను వేరుచేసి, దానిని మరొక ప్రాణి కోశంలో చేరుస్తారు. ఈ విధంగా ఆ జీన్ కొత్తప్రాణిలో పాతప్రాణి యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలను కలుగజేస్తుంది.

ప్రశ్న 2.
క్లోనింగ్ ద్వారా పుట్టిన ఒక జంతువు పేరు చెప్పండి.
జవాబు.
డాలీ అనే గొర్రె

ప్రశ్న 3.
క్లోనింగ్ ద్వారా పుట్టిన జంతువుకు, తల్లికి తేడాలు ఉంటాయి?
జవాబు.
ఉండవు.

ప్రశ్న 4.
‘పాత మాటలన్నీ మరచిపో’ పాత మాటలంటే ఏవి?
జవాబు.
తామే ఉత్తమ జాతికి చెందినవారమని, తమకే పూర్తి వంశ సంప్రదాయం ఉందని అనుకునే పాతతరం ఆలోచనలు.

ప్రశ్న 5.
రాబోయే కాలంలో సింహాలను పుట్టించాలంటే ఆడ సింహాలు అవసరమా?
జవాబు.
అవసరం లేదు

Leave a Comment