TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

Telangana SCERT 7th Class Telugu Guide Answers Telangana ఉపవాచకం 3rd Lesson మన పండుగలు Textbook Questions and Answers.

TS 7th Class Telugu Guide Upavachakam 3rd Lesson మన పండుగలు

పాఠం ఉద్దేశం :

తెలంగాణతో హిందూముస్లిమ్ల అలయలట్లు మమైకం. గంగా జమునా తెహజీబ్ తెలంగాణకే ప్రత్యేకం. ఇటువంటి సంస్కృతిలోని పండుగల వైభవాన్ని తెలియచేయటమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠం నేపథ్యం :

మనం ఎన్నో పండుగలు జరుపుకొంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించినవి, కొన్ని భక్తికి సంబంధించినవి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు. ఇటువంటి పండుగల గురించి తెలపటమే ఈ పాఠ్యభాగ నేపథ్యం.

పాఠం ప్రత్యేకత :

  1. పండుగలన్నీ ప్రజలలో ఐకమత్య భావననే పెంచుతాయి.
  2. వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగల యొక్క విశిష్టతలు తెలుస్తాయి.
  3. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన అనేక పాటలు గురించి తెలుస్తాయి.
  4. పండుగలు సామరస్యాన్ని తెలియచేస్తాయి.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పండుగలు ఎన్ని విధాలుగా ఉంటాయి? పండుగలు జరుపుకోవడం వల్ల లాభాలేవి?
జవాబు.
మనం ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని చరిత్రకు సంబంధించినవి, కొన్ని భక్తికి సంబంధించినవి. కొన్ని కాలగమనానికి సంబంధించినవి. మనిషిలో ఒక స్ఫూర్తిని నింపి మంచిని బోధించేందుకు పండుగలు ఎంతో ఉపయోగపడతాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు పండుగల ద్వారా ప్రస్ఫుటమవుతాయి.

ప్రశ్న 2.
“మత సామరస్యానికి మొహరం పండుగ ప్రతీక” ఎట్లో తెల్పండి.
జవాబు.
మొహరం పండుగనే పీరీల పండుగ అంటారు. పీరీల పండుగను హిందూ-ముస్లింలు భక్తి శ్రద్ధలతో కలిసి చేసుకుంటారు. కులం, మతం పట్టింపులు లేకుండా జరుపుకుంటారు. కొన్ని గ్రామాల్లో హిందువులే నిర్వహిస్తారు. పదిరోజులు జరిగే ఈ పండుగలో హిందూ-ముస్లింలు పకీర్లవలె పీరీల కోసం భిక్షమెత్తుతారు. మట్టి చిప్పల్లోనే భోజనం చేస్తారు. స్త్రీ పురుషులు ముస్లింల మాదిరిగానే వేషధారణ చేస్తారు. మటికీలు తీయడం, ఒడిపట్టడం, పకీర్లు కావడం, వేషాలు వేయడం వంటివి హిందువులే చేస్తారు. హిందూ-ముస్లింలు కలిసిమెలసి చేసుకునే పండుగ కనుక ఇది మతసామరస్యానికి ప్రతీక.

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో జాజిరిపాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి కదా! వాటిని గురించి రాయండి.
జవాబు.
తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన అనేక పాటల మాతృకలన్నీ జాజిరి పాటల్లోనే ఉన్నాయి. అచ్చమైన తెలంగాణ యాసలో ప్రజలభాషకు దగ్గరగా, ప్రజల నాలుకమీద ఆడే ఈ బాణీలు ఒక్క తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా అంతకుముందు జరిగిన రైతాంగ పోరాటాలకు, ప్రజాఉద్యమాలకు కూడా స్ఫూర్తినిచ్చే గేయాలయినవి. సుద్దాల హనుమంతులాంటి ప్రజాకళాకారులు ఈ బాణీలోనే పాటలు అల్లుకున్నారు.

ప్రశ్న 4.
బతుకమ్మ పండుగ తొమ్మిదిరోజుల కార్యక్రమాన్ని పట్టికరూపంలో రాయండి.
జవాబు.
బతుకమ్మ పండుగను తొమ్మిదిరోజులు జరుపుకుంటారు. తొమ్మిదిరోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పేరుస్తారు.
మొదటి రోజు – ఎంగిలిపూల బతుకమ్మ
రెండవ రోజు – అటుకుల బతుకమ్మ
మూడవ రోజు – ముద్దపప్పు బతుకమ్మ
నాలుగవ రోజు – నానబియ్యం బతుకమ్మ
ఐదవ రోజు – అట్ల బతుకమ్మ
ఆరవ రోజు – అలకల బతుకమ్మ
ఏడవ రోజు – వేపకాయల బతుకమ్మ
ఎనిమిదో రోజు – వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదోరోజు – సద్దుల బతుకమ్మ

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
మీ ఊరిలో జరిగే బతుకమ్మ పండుగను గురించి వివరించండి.
జవాబు.
తెలంగాణ పండుగలు అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది బతుకమ్మ. ఆశ్వయుజ మాసం శుద్ధపాడ్యమి నుండి మొదలుపెట్టి తొమ్మిదిరోజులు చేస్తారు. ఇది పూలజాతర.

మా ఊరిలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆ సందడి చెప్పనలవికాదు. ఇంటి ఆడపడుచులను ఇంటికి పిలుస్తాము. ఊరంతా సంబరంగా జరుపుకుంటాము. ఆ తొమ్మిది రోజులు మరో ప్రపంచంతో పని ఉండదు. పూలు సేకరణ, బతుకమ్మ పేర్చుడు, పిండివంటలు చేయడం వంటి కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉంటారు. బతుకమ్మ ఆటలు ఆడి, పాటలుపాడి ప్రతిరోజు సాయంత్రం బావిలోనో, చెరువులోనో నిమజ్జనం చేస్తారు.

ఈ పండుగను అన్ని కులాల వాళ్ళు చేసుకుంటారు. బతుకమ్మ చుట్టూ తిరిగి ఆడవాళ్ళు చప్పట్లు కొట్టి పాటలు పాడుతూ ఆడుతుంటే పిల్లలు మధ్యలో కూర్చుంటారు. మగవాళ్ళు ఆ ఆటను సంతోషంగా చూస్తారు. తొమ్మిదిరోజులు తొమ్మిదిరకాల బతుకమ్మలను పేర్చి ఆయా రోజుల్లో ఆయా నైవేద్యాలను ప్రసాదాలుగా పెడతారు.

బతుకమ్మ పాటల్లో ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, అత్తగారింట వారు ఎదుర్కొనే సమస్యలు తెలిపే పాటలే ఎక్కువగా పాడుతాము. బతుకమ్మ పండుగకు తోబుట్టువులు, కన్నవారు ఆడపిల్లలకు కట్నకానుకలు బహూకరిస్తారు. బతుకమ్మ పండుగను నియమ నిష్ఠలతో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటాము.

ప్రశ్న 2.
తెలంగాణలో జరుపుకునే కొన్ని పండుగలు, వాటి గొప్పదనాన్ని తెలియజేయండి.
జవాబు.
తెలంగాణ పండుగలకు పెట్టింది పేరు. వారు పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆట, పాటలు, సాంస్కృతిక వేషధారణలు, వారి ప్రత్యేకతలు.

1. బతుకమ్మ :
ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించినది. కొన్ని వేలయేండ్లనుంచి జరుపుకుంటున్నారు. చోళరాజు ధర్మాంగదునికి వందమంది కుమారులు పుట్టి చనిపోయి, చివరికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పుట్టిన ఆడపిల్లే బతుకమ్మ. నిండునూరేళ్ళు బతకాలని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలందుకొన్నది.

వివిధ రకాల పూలతో, పసుపుముద్దతో బతుకమ్మను పేర్చి పసుపుముద్దను గౌరమ్మగా కొలుస్తారు. బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాటలు పాడుతూ చప్పట్లు కొడతారు. తొమ్మిదిరోజులు తొమ్మిదిరకాల పేర్లతో బతుకమ్మను అలంకరిస్తారు. కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలిసి గ్రామమంతా ఒకచోట చేరి సంతోషంగా పండుగను జరుపుకుంటారు. ఆడపిల్లలకు కన్నవారు కట్నకానుకలిస్తారు.

2. మొహరం :

క్రీ.శ. 680 సం॥లో ప్రజల హక్కుల కోసం జరిగిన ఒక పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జరిపే పండుగే పీరీల పండుగ. ఇమామాసన్, ఇమామ్ హుస్సేన్ల సంతాపదినాలుగా జరుపుకునేదే మొహరం. రకరకాల ఆకారాలతో పీరీలను ఇత్తడితో తయారుచేస్తారు. హిందూ, ముస్లింలు కలిసి జరుపుకొని మతసామరస్యాన్ని పాటిస్తారు. ఉదయాన్నే లేచి, స్నానంచేసి, వంటచేసుకొని, వంటపదార్థాలను తీసుకొని అన్నం, బెల్లం షర్బత్, మేకపిల్లలు. కోడిపిల్లలను పీరీలకు సమర్పించి వారివారి స్థోమత ప్రకారం మసీదులో ఇస్తారు. చివరిరోజున నాలుగు తొవ్వలకాడ దయ్యాన్ని కొట్టడంతో పండుగ ముగుస్తుంది.

3. హోళీ :
వసంత ఋతువులో జరుపుకొనే రంగుల పండుగ ఇది. ఆడా, మగ, చిన్నా, పెద్దా వయోభేదం లేకుండా జరుపుకునే పండుగ ఇది. హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. కామదహన వేళ డప్పులు కొడుతూ పాటలు పాడుతారు. కాలిన పిడకలను రైతులు విత్తనాలలో కలుపుతారు. మోదుగపూలను తెచ్చి ఉడికించి రంగులు తయారుచేసుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందిస్తారు. రంగులు తయారు చేసుకొని చల్లుకోవడం వల్ల హోళీ రంగుల పండుగగా ప్రసిద్ధి పొందింది.

ప్రశ్న 3.
మొహర్రం ప్రత్యేకత వివరించండి.
జవాబు.
అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల పేరు మొహర్రం. ఇస్లాం నూతన సంవత్సరం ఈ నెలతోనే మొదలవుతుంది. ఈ నెలలో చంద్రుడు కనిపించిన ఐదవరోజు నుంచి మొహర్రం పండుగ మొదలౌతుంది. దీనినే పీరీల పండుగ అంటారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మనిర్దేశకులని అర్థం.

క్రీ.శ. 680వ సంవత్సరంలో ప్రజల హక్కులకోసం జరిగిన శాంతియుద్ధంలో ఇమామ్ హసన్. ఇమామ్ హుస్సేన్ మరణించారు. వారి సంతాపదినాలుగా పాటించే పండుగే మొహర్రం. ఈ పండుగను హిందూ-ముస్లింలు కలిసి చేసుకుంటారు. కనుక దీనిని మతసామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.

చంద్రుడు కనిపించిన ఐదవరోజున పీరీలను మసీదువద్దకు తెచ్చి నిలుపుతారు. పీరీల గుండాన్ని ఏర్పాటుచేసి రాత్రిపూట గుండం చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతారు. పదిరోజుల తర్వాత పీరీలు చెరువులో పడటంతో పండుగ ముగుస్తుంది. అన్నం, బెల్లం, షర్బత్, మేకపిల్ల, కోడిపిల్లలు తమ స్థోమత ప్రకారం పీరీలకు సమర్పిస్తారు.

హిందువులు, ముస్లింలూ పకీర్లవలె పీరీలకోసం భిక్షం ఎత్తుతారు. మట్టిచిప్పల్లోనే భోజనం చేస్తారు. వేషధారణకూడా ముస్లింల వలే ఉంటుంది హిందువులది. మటికీలు తీయడం, ఒడిపట్టడం, పక్కీర్లు కావడం, వేషాలు వేయడం లాంటి మొక్కులన్నీ హిందువులే చేస్తారు. ఇదే మొహర్రం ప్రత్యేకత.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

I. అవగాహన-ప్రతిస్పందన:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మొహర్రం అనేది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల పేరు. ఇస్లాం నూతన సంవత్సరం ఈ నెలతోనే మొదలవుతుంది. ఈ నెలలో చంద్రుడు కనిపించిన ఐదవ రోజు నుంచి మొహర్రం పండుగ మొదలౌతుంది. దీనినే పీరీల పండుగ అంటారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మ నిర్దేశకులని అర్థం.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల పేరు ?
జవాబు.
మొహర్రం

ప్రశ్న 2.
పీర్ అంటే అర్థం ?
జవాబు.
మహాత్ములు, ధర్మనిర్దేశకులు

ప్రశ్న 3.
ఇస్లాం నూతన సంవత్సరం ఏ నెలతో మొదలవుతుంది ?
జవాబు.
మొహర్రం

ప్రశ్న 4.
‘ధర్మం’ వికృతి పదం ఏది ?
జవాబు.
దమ్మం

ప్రశ్న 5.
మొహర్రం పండుగకు మరో పేరు
జవాబు.
పీరీల పండుగ

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చంద్రుడు కనిపించిన ఐదవరోజున ‘ముజావర్’ ఆఘరానా నుంచి పీరీలను మసీదు వద్దకు తెచ్చి నిలుపుతారు. మసీదు ముందు పెద్ద గుంటను తీసి, పెద్ద పెద్ద కట్టెలు వేసి, అగ్గి రాజేస్తారు. దీనిని పీరీల గుండం అంటారు. రాత్రిపూట ఈ గుండం చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ ‘అలావా’ ఆట ఆడుతారు. పీరీలకు ఒడి పడితే పిల్లలు పుడతారని,దస్తీ కడితే అనుకున్న పని అవుతుందని నమ్మకం. ఆరోగ్యం బాగా లేనివారు వేషం వేస్తామని మొక్కుతారు. పులి వేషాలే కాకుండా ఆడవాళ్ళు మగవేషం, మగవాళ్ళు ఆడవేషం వేస్తారు. కొందరు పీరీలకు ‘దివిటి’ పట్టుకుంటామని మొక్కుతారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పీరీలను ఎక్కడ నుంచి మసీదుకు తెస్తారు ?
జవాబు.
ముజావర్ ఆఘరానా నుంచి

ప్రశ్న 2.
గుండం చుట్టూ తిరుగుతూ ఆడే ఆట ఏది ?
జవాబు.
అలావా

ప్రశ్న 3.
పీరీల పండుగ ఏయే నమ్మకాలకు ప్రతీక ?
జవాబు.
ఒడి పడితే పిల్లలు పుడతారని, దస్తీ కడితే అనుకున్న పని అవుతుంది.

ప్రశ్న 4.
ఆరోగ్యం బాగాలేనివారు ఏమని మొక్కుతారు ?
జవాబు.
వేషం వేస్తామని

ప్రశ్న 5.
‘దివిటి’ అంటే అర్థం ?
జవాబు.
ఇనుప సలాకకు గుడ్డలు చుట్టి వెలిగించే దీపం.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

3. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవుడుగా కొలవడం, తమ బతుకులను కష్టాలనే పాటలుగా పాడుకోవడం ఒక్క తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడా గుడి కనిపించదు. ఎవరికీ బతుకమ్మ పేరు పెట్టుకోరు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
బతుకమ్మ పండుగ దేనితో ముడి పడింది ?
జవాబు.
ప్రకృతితో

ప్రశ్న 2.
ఈ పండుగలో వేటిని దేవుడుగా కొలుస్తారు ?
జవాబు.
పువ్వులనే

ప్రశ్న 3.
వేటిని పాటలుగా పాడతారు ?
జవాబు.
తమ బతుకులను కష్టాలను

ప్రశ్న 4.
ఎవరికి గుడి లేదు ?
జవాబు.
బతుకమ్మకు

ప్రశ్న 5.
‘భక్తి శ్రద్ధలు’ ఏ సమాసం?
జవాబు.
ద్వంద్వ సమాసం

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

4. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వసంత ఋతువు రాకతో ప్రకృతిలో ఎంతో మార్పు వస్తుంది. చెట్లు కొత్త చిగుళ్ళతో, పూలతో కనువిందు చేస్తాయి. ఆ సమయంలో జరుపుకునే రంగుల పండుగ ఇది. ఆడ, మగ, చిన్నా, పెద్ద వయోభేదం లేకుండా జరుపుకునే పండుగ హోళి. ఇది అతి ప్రాచీనమైన పండుగ. మోదుగ పూలను తెచ్చి నీటిలో ఉడికించి రంగుగా తయారు చేసుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు, ఆనందిస్తారు. వివిధ చెట్ల ఆకులు, పూలతో రంగులు తయారు చేసుకొని చల్లుకోవడం వల్ల హోళీ రంగుల పండుగగా ప్రసిద్ధి పొందింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
హోళీ పండుగ ఏ ఋతువులో వస్తుంది ?
జవాబు.
వసంతఋతువు

ప్రశ్న 2.
ఈ పండుగలో ఏ పూలతో రంగునీళ్ళు తయారుచేస్తారు ?
జవాబు.
మోదుగ పూలు

ప్రశ్న 3.
హోళీ పండుగ ఏ పండుగగా ప్రసిద్ధి పొందింది ?
జవాబు.
రంగుల పండుగగా

ప్రశ్న 4.
పై పేరాలో జంటపదాలను గుర్తించండి.
జవాబు.
ఆడ మగ, చిన్నా పెద్ద

ప్రశ్న 5.
‘ప్రాచీనం’ వ్యతిరేక పదం ఏది ?
జవాబు.
అర్వాచీనం, నవీనం

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

5. కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

తొమ్మిదిరోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. తొమ్మిది రకాల ఫలహారాలను సమర్పిస్తారు. మొదటిరోజు మహాలయ అమావాస్య (పెత్రమాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినంక బతుకమ్మను పేరుస్తారు. ఈరోజు నువ్వులు, బెల్లం, చెక్కరను ఫలహారంగా పెడతారు. రెండవరోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజు పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదం చేస్తారు. మూడోరోజున ముద్దపప్పుల బతుకమ్మగా పిలుస్తారు.

ఈ రోజు ముద్దపప్పు, బెల్లం, ప్రసాదంగా చేస్తారు. నాలుగవరోజు నానబియ్యం, ఐదవరోజు అట్ల బతుకమ్మ, ఆరోరోజు అలకల బతుకమ్మ. ఈ ఆరో రోజును (అర్రెమి) అంటారు. ఈ రోజు ఎవరి ఇళ్లల్ల వాళ్ళు బతుకమ్మ ఆడుతారు. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. తొమ్మిదవ రోజును సద్దుల బతుకమ్మగా పిలుస్తారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
సద్దుల బతుకమ్మగా పిలువబడే రోజు ఏది ?
జవాబు.
తొమ్మిదవ రోజు

ప్రశ్న 2.
మహాలయ అమావాస్యరోజు బతుకమ్మకు ఏవి ప్రసాదంగా పెడతారు ?
జవాబు.
నువ్వులు, బెల్లం, చెక్కర

ప్రశ్న 3.
అర్రెమి రోజున ఏమి చేస్తారు.
జవాబు.
ఎవరి ఇళ్ళల్ల వాళ్ళు బతుకమ్మ ఆడుతారు.

ప్రశ్న 4.
బతుకమ్మను మొత్తం ఎన్ని రోజులు ఆడతారు ?
జవాబు.
తొమ్మిది రోజులు

ప్రశ్న 5.
పై పేరాలో దేని గురించి చెప్పబడింది ?
జవాబు.
బతుకమ్మ పండుగ గురించి

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

6. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. ఆశ్వయుజ శుద్ధపాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తారు. గునుగు, చామంతి, తంగేడు, బంతి లాంటి రకరకాల పూలను సేకరించి రంగురంగులుగా పేర్చి పైన పసుపుముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ఈ పండగకు ఆడబిడ్డలను పిలుచుకుంటారు. చివరిరోజు పిండివంటలు చేసుకుంటారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి ఆడుకొని చెరువులో సాగనంపుతారు. తెచ్చిన సద్దులను ఒకరినొకరు పంచుకొని తింటారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
బతుకమ్మ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకొంటారు ?
జవాబు.
తెలంగాణ రాష్ట్రంలో

ప్రశ్న 2.
ఇది ఎన్ని రోజుల పండగ ?
జవాబు.
తొమ్మిది రోజుల పండుగ

ప్రశ్న 3.
దేనిని గౌరీదేవిగా కొలుస్తారు ?
జవాబు.
పసుపు ముద్దను

ప్రశ్న 4.
కొన్ని పిండివంటల పేర్లు రాయండి.
జవాబు.
చక్రాలు, చక్కిలాలు, అరిసెలు, సున్నుండలు, గారెలు, పూర్ణాలు, పూతరేకులు

ప్రశ్న 5.
ఈ పేరాకు శీర్షిక పెట్టండి.
జవాబు.
బతుకమ్మ పండుగ శోభ

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

7. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు తయారుచేయండి.

బతుకమ్మ పాటల బాణీలు ఎంతో ప్రసిద్ధి గాంచినవి. ఆయా ప్రాంతాల ఆచారాలు, ‘పేర్లు, అలవాట్లను, భాషను కలబోసుకుని ప్రాంతీయ కథలతో ఉయ్యాలో అని, కోల్ అని, చందమామ అని, గౌరమ్మ అని, వలలో అని, ఎన్నెలో అనే మాటలను చివరన చేరుస్తూ పాటలు పాడుతారు. ఈ పండుగకు ఆడపిల్లలు ఎక్కడున్నా పుట్టింటికి చేరుకుంటారు. తోబుట్టువులు, కన్నవారు ఆడ పిల్లలకు కట్న కానుకలను బహుకరిస్తారు. అత్తవారింట్లో ఉన్న అమ్మాయి ఈ పండుగ వచ్చిందంటే చాలు పుట్టింటివారి కోసం ఎదురుచూస్తుంది. ఆ ఎదురుచూపును కూడా పాటల రూపంలోనే చెబుతుంది. ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, వారు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు, వీటి గురించిన పాటలే ఎక్కువగా ఉంటాయి.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
బతుకమ్మ పాటల్లో ప్రతి పాదంలో చివర వచ్చే పదాలు ఏవి ?
జవాబు.
ఉయ్యాలో

ప్రశ్న 2.
బతుకమ్మ పండుగకు తప్పకుండా పుట్టింటికి వచ్చే వారెవరు ?
జవాబు.
ఆడపిల్లలు

ప్రశ్న 3.
బతుకమ్మ పండుగ నాడు కట్న కానుకలు ఎవరికి, ఎవరు బహుకరిస్తారు ?
జవాబు.
తోబుట్టువులు, కన్నవారు ఆడ పిల్లలకు కట్న కానుకలను బహుకరిస్తారు.

ప్రశ్న 4.
బతుకమ్మ పాటల్లో ఏ అంశాలు ఎక్కువగా ఉంటాయి ?
జవాబు.
ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, వారు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు, వీటి గురించిన పాటలే ఎక్కువగా ఉంటాయి.

ప్రశ్న 5.
మీకు తెలిసిన బతుకమ్మ పాటలో చరణాన్ని లేదా పల్లవి రాయండి.
జవాబు.
అప్పుడే వచ్చెను ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో
బంగారు నగలు ఉయ్యాలో
బంగారు గాజులు ఉయ్యాలో
గుమ్మడీ పూలు ఉయ్యాలో
గునుగూ పూలు ఉయ్యాలో
వరుస వరుసలతోటి ఉయ్యాలో
వరుసగా పేర్వగా ఉయ్యాలో
అప్పుడే వచ్చిరి ఉయ్యాలో

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

8. క్రింది గద్యభాగం చదివి, దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.

దసరాకు ఒకటి, రెండురోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకొంటారు. ఆ రోజు కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉంటారు. బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్తబట్టలు కట్టుకుంటారు. ఆడబిడ్డలను, బంధువులను పిలుచుకుంటారు. బతుకమ్మను ఎత్తుకుని సద్దులు తీసుకుని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు. జొన్నపిండి, మక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలీద, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులను తయారుచేస్తారు.

చెరువుదగ్గర బతుకమ్మలను దించి మరోసారి ఆడుకుని చెరువులో సాగనంపుతారు. తర్వాత తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మను నీళ్ళలో వదలడం కూడా ఒకపద్దతి ప్రకారం చేస్తారు. మోకాలిలోతు నీటివరకు వెళ్ళి నీటిపై బతుకమ్మను ఉంచి ఏ మాత్రం చెదరకుండా ఒడుపుగా వదిలి ఇత్తడి తాంబాళాన్ని పక్కకు తప్పిస్తారు. తర్వాత నీటిని మూడుసార్లు ముందుకు నెట్టి దండంపెట్టి వెనుకకు తిరుగుతారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
బతుకమ్మను నీళ్ళలో వదిలే పద్ధతి ఏమిటి?
జవాబు.
మోకాలి లోతు నీటిలోకి దిగి నీటిపై బతుకమ్మను ఉంచి ఏమాత్రము చెదరకుండా ఒడుపుగా ఇత్తడి తంబాళాన్ని పక్కకు తప్పిస్తారు. నీటిని మూడుసార్లు నెట్టి దండం పెట్టి వెనుకకు తిరుగుతారు.

ప్రశ్న 2.
సద్దుల బతుకమ్మను ఎప్పుడు జరుపుకుంటారు?
జవాబు.
దసరాకు ఒకటి రెండురోజులముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు.

ప్రశ్న 3.
సద్దులు దేనితో తయారుచేస్తారు?
జవాబు.
జొన్నపిండి, మక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలీద, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పులతో సద్దులను తయారుచేస్తారు.

ప్రశ్న 4.
సద్దులను ఏమి చేస్తారు?
జవాబు.
సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు.

ప్రశ్న 5.
సద్దుల బతుకమ్మరోజు కుటుంబ సభ్యులు ఏమి చేస్తారు?
జవాబు.
సద్దుల బతుకమ్మరోజు కొత్తబట్టలు కట్టుకొని కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉంటారు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

9. క్రింది గద్యభాగం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. దీనివెనుక ఎన్నో కథలున్నా అవన్నీ చెప్పేది “చెడుపై మంచి విజయం సాధిస్తుంది” అన్నది ఒక్కటే. ప్రతి యేడు ఫాల్గుణ మాసంలోని పున్నమిరోజున వచ్చే ఈ పండుగను ‘కాముని పున్నం’ అని కూడా పిలుస్తారు. మనిషిలోని చెడు ప్రవర్తనను అంతంచేసి మంచిని పెంచే పండుగగా దీనిని అందరూ భావిస్తారు. కామదహనం తర్వాత ఆ బూడిదను పొలాల్లో కలుపుకుంటే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. ఇప్పటికీ కామదహనం రోజున తెలంగాణలో ఇంటింటికి ఒక పిడకను లేదా ఇంట్లోని పాతకట్టెలు, చెక్కవస్తువులను ఒక్కచోట చేర్చి కామదహనం చేస్తారు. కామదహనవేళ వాటిచుట్టూ తిరుగుతూ, డప్పులు కొడుతూ, పాటలు పాడుతారు. తర్వాత కాలిన పిడక బూడిదను తెచ్చుకుని రైతులు కొత్త విత్తనాల్లో కలుపుకుంటారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
హోళీ పండుగకు గల మరొక పేరేమి?
జవాబు.
హోళీ పండుగకు గల మరొక పేరు కాముని పున్నమి.

ప్రశ్న 2.
హోళీ పండుగపై ప్రజల భావనేమి?
జవాబు.
మనిషిలోని చెడు ప్రవర్తనను అంతంచేసి మంచిని పెంచే పండుగని ప్రజల భావన.

ప్రశ్న 3.
కామదహనం బూడిద పొలాల్లో ఎందుకు కలుపుతారు?
జవాబు.
పంటలు బాగా వండుతాయనే నమ్మకంతో కామదహనం బూడిదను పొలాల్లో కలుపుతారు.

ప్రశ్న 4.
కామదహన వేళ ప్రజలు ఏమిచేస్తారు?
జవాబు.
కామదహన వేళ ప్రజలు డప్పులు కొడుతూ పాటలు పాడుతారు.

ప్రశ్న 5.
కాలిన పిడక బూడిదను ఏమి చేస్తారు?
జవాబు.
కాలిన పిడక బూడిదను రైతులు కొత్త విత్తనాల్లో కలుపుకుంటారు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson మన పండుగలు

10. క్రింది గద్యభాగం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

పీరీలు-రకాలు : పీరీలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. అర్ధచంద్రాకారంలో, పంజా ఆకారంలో, చేయి ఆకారంలో ఇత్తడితో తయారుచేస్తారు. వీటిని పొడుగాటి కట్టెలకు కట్టి రంగురంగుల బట్టలు (దట్టీలు) చుట్టి పూలదండలతో అలంకరిస్తారు. తెలంగాణలోని కొన్ని గ్రామాలలో ఈ పీరీలకు పేర్లుకూడా ఉంటవి. దూద్పిరి, మక్కాపీరి, లాల్చావా, వెండిపీరి, సత్యపీరి అని, తర్వాత ఆయా కులాలు, ఇంటిపేర్లమీద కూడా పీరీలను నిలుపుతారు.

5. చంద్రుడు కనిపించిన ఐదవరోజున ‘ముజావర్’ అఘరానా నుంచి పీరీలను మసీదు వద్దకు తెచ్చి నిలుపుతారు. మసీదు ముందు పెద్ద గుంటను తీసి, పెద్ద పెద్ద కట్టెలువేసి, అగ్గి రాజేస్తారు. దీనిని పీరీలగుండం అంటారు. రాత్రిపూట ఈ గుండం చుట్టు తిరుగుతూ పాటలుపాడుతూ ‘ఆలువ’ ఆట ఆడుతారు. పదిరోజులపాటు జరిగే ఈ పండుగలో పీరీలను నిలుపడం మొదలు పీరీలు చెరువులో పడటంతో పండుగ పూర్తి అవుతుంది.

అన్నం, బెల్లం, షర్బత్, మేకపిల్లలు, కోడిపిల్లలను పీరీలకు సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత. దీనిని ‘మటికీలు’ తీయడం, చదివించడం అంటారు. మబ్బున్నే లేచి, స్నానం చేసి, వంటచేసుకొని, వంటపదార్థాలను తీసుకొని “అసోయ్… దుల …. అసోయ్… దుల’ అనుకుంటూ మసీద్ దగ్గరికి వెళ్ళి అన్నం, షర్బత్, బెల్లం ఇట్లా ఎవరి స్థోమత ప్రకారం వారు మసీదులో ఇచ్చి వస్తారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
వీరీలు ఏయే ఆకారాలలో ఉంటాయి?
జవాబు.
పీరీలు అర్ధచంద్రుడు, పంజా, చేయి ఆకారంలో ఉంటాయి.

ప్రశ్న 2.
పీరీలను దేనితో చేస్తారు?
జవాబు.
పీరీలను ఇత్తడితో చేస్తారు.

ప్రశ్న 3.
మొహర్రం ఏ రోజున మొదలవుతుంది?
జవాబు.
మొహర్రం చంద్రుడు ఉదయించిన ఐదవరోజున మొదలవుతుంది.

ప్రశ్న 4.
పండుగ చివరిరోజు ఏమి జరుగుతుంది?
జవాబు.
పండుగ చివరిరోజు పీరీలు చెరువులో పడుతాయి.

ప్రశ్న 5.
పీరీలకు ఏమేమి సమర్పిస్తారు?
జవాబు.
అన్నం, బెల్లం, షర్బత్, మేకపిల్లలు, కోడిపిల్లలను పీరీలకు సమర్పిస్తారు.

Leave a Comment