AP Inter 2nd Year Zoology Notes Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

→ నాడీ వ్యవస్థ, నాడీ కణాలతో నిండి దేహాన్ని ‘నియంత్రించే వ్యవస్థ’ .

→ ‘సమన్వయం’ అనే ప్రక్రియలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అవయవాలు ఒక దానితో ఒకటి కలిసి, సంపూరకంగా వాటి విధులను నిర్వర్తించడం జరుగుతుంది.

→ మానవుని నాడీ వ్యవస్థ: (i) CNS(కేంద్ర నాడీ వ్యవస్థ) (ii) PNS (పరిధీయ నాడీ వ్యవస్థ).

→ CNS వ్యవస్థ మెదడు మరియు వెన్నుపామును కలిగి ఉంటుంది. ఇది సమాచార విశ్లేషణ మరియు నియంత్రణ కేంద్రం.

→ PNS వ్యవస్థ దేహం యొక్క అన్ని నాడులను కలిగి ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Notes Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

→ నాడీకణం నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం.

→ ‘నాడీ కణసంధి’ రెండు వరుస నాడీ కణాల మధ్య ఏర్పడి ఉన్న జంక్షన్.
ఇది ఒక నాడీ కణం నుంచి ఇంకోక నాడీ కణంకు ప్రచోదనాలను పంపిస్తుంది.

→ ‘మస్తిష్క వల్కలం’కు దగ్గరగా రెండూ మస్తిష్కార్ధగోళాలను కలుపుతూ ఉన్న నిలువు బంధనాన్ని ‘కార్పస్ కెల్లోసమ్’ అంటారు. [IPE]

→ బాసిల్లరి త్వచం పై, కాక్లియార్ శాఖ కర్ణావర్తనంలో ఏర్పడిన అంగాన్ని ‘కోర్టి అంగం’ అంటారు. [IPE]

→ దైహిక నాడీ వ్యవస్థ మరియు స్వయంచోదిత నాడీ వ్యవస్థ రెండూ పరీధీయ నాడీ వ్యవస్థ యొక్క భాగాలు.

Leave a Comment