Telangana SCERT 7th Class Telugu Guide Telangana 9th Lesson ఏ కులం? Textbook Questions and Answers.
TS 7th Class Telugu 9th Lesson Questions and Answers Telangana ఏ కులం?
బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి: (TextBook Page No.84)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో ఉపాధ్యాయురాలు, బాలుడు, బాలిక ఉన్నారు.
ప్రశ్న 2.
నల్లబల్లపైనున్న పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు.
నల్లబల్లపై ఉన్న పద్యం వేమన శతకంలోనిది.
ప్రశ్న 3.
ఆ పద్యం ఏ సందేశాన్నిస్తుంది ?
జవాబు.
ఆ పద్యము ‘కులం కంటే గుణమే ప్రధానం’ అనే సందేశాన్నిస్తుంది.
ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 86)
ప్రశ్న 1.
కార్మికుల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నది ?
జవాబు.
కార్మికులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తారు. దుమ్ము, ధూళిలో పనిచేస్తారు. అగ్ని సెగల్లో పనిచేస్తారు. ఆ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురౌతాయి. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది.
ప్రశ్న 2.
“మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు” అని ఉద్దేశం ఏమి
జవాబు.
ఈనాడు రైతే దేశానికి వెన్నెముక. మూడు కాలాల్లో పంటలు పండిస్తాడు. తనకు మాత్రం తిండి దొరకడం లేదు. కేవలం మాడిపోయిన చెక్కలు మాత్రమే తింటున్నాడు. రైతు తాను మాత్రం మాడినవి తింటూ ప్రజలకు మాత్రం పంటలు పండించి అందిస్తున్నాడు. అతడు నిజంగా ధన్యజీవి.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 87)
ప్రశ్న 1.
రామకోటి రాసే కాగితాన్నీ, పూలబుట్టను కష్టపడి తయారుచేసిన వారిపట్ల మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
కాగితాలు తయారుచేసే కార్మికులు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాగితాల తయారీలో ఎన్నో రసాయనాలు కలుస్తాయి. అట్లే బుట్టలు అల్లేవారు ముర అడవుల్లో తిరిగి వెదురును తెచ్చి జాగ్రత్తగాను, అందంగాను అల్లుతారు. ఈ ఇద్దరి కార్మికులకు తగిన కూలి దొరకడం లేదు. అయినా ప్రజల కోసం కష్టపడతారు.
ప్రశ్న 2.
శ్రామికులు కూటికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ?
జవాబు.
శ్రామికులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తారు. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయినా వారి శ్రమకు తగిన కూలీ దొరకడం లేదు. దాంతో శ్రామికులు ఆర్థిక ఇబ్బందులతోను, కుటుంబపోషణ భారంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 87)
ప్రశ్న 1.
“పాతరోత రథం విరిగిపోయింది” అని కవి అన్నాడు. కదా ! దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
రథం ప్రగతి గమనానికి సూచిక. ఇంతవరకు కులం పేరుతో మమ్ములను విడగొట్టి ముందుకు వెళ్ళారు. ఇక ఆ రథం పాడైపోయింది. అది విరిగిపోయింది. అంటే ఇప్పుడు కులాలు, కులాల శాఖలు అంతరించిపోయాయి. ఇక మీ ఆటలు సాగవు అని కవి ఆశయం.
ప్రశ్న 2.
శ్రామికులందరు చేయి చేయి కలిపి నిలబడితే ఏమి జరుగుతుంది ?
జవాబు.
శ్రామికులందరు చేయి చేయి కలిపి ముందుకు నడిస్తే. అరాచక శక్తుల ఆటలు సాగవు. పెత్తందారుల దురాగతాలు సాగవు. దోపిడీ రాజ్యానికి చరమగీతం పలుకుతుంది. కార్మికశక్తి ముందు ఏ శక్తి నిలువలేదు.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.
ప్రశ్న 1.
“ఏ కులమబ్బీ….” అనే పాట ఉద్దేశం ఏమై ఉంటుంది ? చర్చించండి.
జవాబు.
అన్ని వృత్తుల సేవల వల్లే సమాజం ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నది. అవసరాలు తీర్చేటప్పుడు లేని కులం మిగతా సందర్భాలలో ఎందుకు అని భావిస్తూ ఈ పాటను రాసి ఉంటాడు.
ప్రశ్న 2.
పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు ఉన్నాయా ? దీనిమీద అభిప్రాయాలు తెలుపండి.
జవాబు.
అవును, పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు ఉన్నాయి. మన నిత్యజీవితంలో అవసరమయ్యే అన్ని పనులను శ్రామికులు మనకు లోటు లేకుండా తీరుస్తారు. మన జీవితగమనమంతా శ్రామికుల మీద ఆధారపడి నడుస్తుంది. కాబట్టి శ్రామికుల స్వేదంతో ఈ ప్రపంచం కదులుతుందన్న సత్యాన్ని గౌరవించాలి అనునవి కవి అభిప్రాయాలు.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
ప్రశ్న 1.
మనిషి జీవనగమనమంతా శ్రామికులమీద ఆధారపడి నడుస్తుంది. మనిషి లౌకిక జీవన పార్శ్వాలన్నీ శ్రామికుల స్పర్శతో చైతన్యవంతమవుతున్నాయి. పొద్దున్నే లేవగానే అవసరమయ్యే నీళ్ళు మన ఇంట్లోకి రావడానికి వెనుక ఎవరి శ్రమ దాగివున్నదో ఆలోచించామా ? వేడివేడి చాయ్, కాఫీలు తాగే రుచి వెనుక పాలుపోసే పాలవాడిని గుర్తుచేసుకుంటామా ? ఇల్లూ వాకిలిని పరిశుభ్రంగా ఉంచేవారిని, మనం వేసుకునే ఉతికిన దుస్తులు, ఇస్త్రీమడతల వెనకున్న శ్రమ సౌందర్యాన్ని తలచుకున్నామా ? అందమైన పూలతోటల పరిమళాలు, అపురూప శిల్పసంపదలతో విలసిల్లే దేవాలయాల వాతావరణం వెనుక దాగిన కార్మికశక్తులను స్మరించుకున్నామా ? ఇట్లా అడుగడుగునా మన అవసరాలకు, విలాసాలకు ఉపయోగపడే శ్రామికులు, కార్మికులు, వివిధ కులవృత్తులవాళ్ళు తీవ్రమైన సామాజవాబు.క వివక్షతకు గురౌతున్నారు. చేసిన పనికి తగిన వేతనం లేక, సరైన గౌరవమూ లభించక శ్రమదోపిడికి, నిరాదరణకు గురౌతూ మానసిక వేధనలను అనుభవిస్తున్నారు. వారిపట్ల సమాజ దృక్పథం మారవలసిన అవసరమున్నది. ఆయా వృత్తుల వెనుక వున్న సాంస్కృతిక వారసత్వాన్ని సామాజవాబు.క బాధ్యతను మనం గుర్తించాలి. శ్రామికుల స్వేదంతో ప్రపంచం కదులుతుందన్న సత్యాన్ని గౌరవిద్దాం. పై పేరా ఆధారంగా పట్టికను నింపండి.
జవాబు.
శ్రమజీవులు | వారి సేవలు |
తాపీ పనివారు | ఇళ్ళు కట్టడము |
మునిసిపాలిటీవారు | నీరు సరఫరా చేయడము |
పాలవాడు | పాలు పితికి, పాలు అమ్మడము |
పాచిపనివారు | ఇల్లు వాకిలిని పరిశుభ్రంగా ఉంచేవారు |
చాకలి | దుస్తులు ఉతకడము, ఇస్త్రీ చేయడము |
శిల్పి | శిల్పాలను చెక్కడము |
ప్రశ్న 2.
ఈ పాఠంలోని ప్రాసపదాలు రాయండి.
జవాబు.
ఉదా :
- పెట్టినపుడు, ఎత్తినపుడు, చిమ్మినపుడు, త్రవ్వినపుడు, దున్నినపుడు, చెక్కినపుడు, ఇచ్చినపుడు, చేసినపుడు.
- కుట్టిచ్చినపుడు, జేసిచ్చినపుడు, చేసినపుడు, ఇచ్చినపుడు.
III. స్వీయరచన.
ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) “చెమటోడ్చే మనుషులు చేయి కలిపి నిలబడితే” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
కులమతాలను సృష్టించి, వారిలో వారికి చిచ్చుపెట్టి, అన్ని శాఖలను వేరుచేసి కల్లోలం సృష్టించేవారికి ఇక కాలం . చెల్లింది అని, అబద్ధాలతో ఉన్న మాటలను వినము అని అందరికీ కనువిప్పు కలిగే విధంగా చెమటను చిందించే మనుషులు అందరూ చేయి చేయి కలిపి నిలబడతారు. అప్పుడే క్రొత్త సమాజం, సమసమాజం ఏర్పడుతుంది.
ఆ) శ్రమ చేసేవారికి సమాజంలో తగిన గౌరవం లభిస్తుందా ? అభిప్రాయం రాయండి.
జవాబు.
కష్టించి, శ్రమించి పనిచేసే వారికి నేటి సమాజంలో తగిన గౌరవం లభించటం లేదు. ఎందుకంటే వారి సేవలతో అందరూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నాము. ఎందుకంటే వారు తీవ్రమైన సామాజవాబు.క వివక్షతకు గురి అవుతున్నారు. వారి పనికి తగిన వేతనం లేక శ్రమదోపిడికి లోనవుతున్నారు.
ఇ) పాత కబుర్లకు చెదలు పట్టాయని కవి అంటున్నాడు. ఎందుకు అట్లా అన్నాడో ఆలోచించి రాయండి.
జవాబు.
మానవుడు సంఘజీవి. ప్రతి ఒక్కరు ప్రక్కవారి సేవలను వినియోగించుకోవలసి ఉంది. అలాగే మన సేవలను కూడా మనము ఇతరుల కొరకు వినియోగిస్తాము. అలాంటి సందర్భంలో ఏవో కల్పితమైన కబుర్లు చెప్పి, కులమతాలు అనే అడ్డుగోడలను పెంచి మనలో మనకు కల్లోలాలను సృష్టిస్తున్నారు. కాని నేటి కార్మికులలో అవగాహనా శక్తి పెరిగి ఇతరుల మాటలను నమ్మటం లేదు. వారి కల్లబొల్లి మాటలకు ప్రలోభపడడం లేదు. అందువలన కవి పాత కబుర్లకు చెదలు పట్టాయని అంటున్నాడు.
ఈ) పాఠం ఆధారంగా కవికి గల సామాజవాబు.క భావన ఎటువంటిదో రాయండి.
జవాబు.
శ్రామికుల శ్రమను సమాజం వాడుకుంటుంది. వారు ప్రజల అవసరాలను తీరుస్తూనే ఉన్నారు. కులాలను, కులాలలోని అన్ని శాఖలను వేరుచేసి అనైక్యతను సృష్టించాలని చూసేవారికి, గుణపాఠంగా చెమటను చిందించే శ్రామికులు అందరూ చేయిచేయి కలిపి నిలబడతారు. అన్ని వృత్తుల సేవలవల్లే సమాజం ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నది. ఈ విధంగా కవి తన గేయంలో సామాజవాబు.క చైతన్యం చూపించాడు.
ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
అ) ‘సమాజంలో మనుషులంతా ఒక్కటే’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
మట్టిని మెత్తగా తొక్కి, పిసికి, ఇటుకలు తయారుచేసే కార్మికుడు, కడుపు మాడ్చుకొని దున్నిన చాలులో పంటను పండించే కర్షకుడు, మండే ఎండలో బండలను అందమైన ఆకృతులలో విగ్రహాలను చెక్కిన శిల్పి అందరూ ఈ సమాజంలో అలాగే జంతువుల చర్మంతో చెప్పులు కుట్టేవారు, బట్టలు ఉతికేవారు కూడా సమాజంలో ఒక భాగమే.
కాబట్టి మనమందరము ఎవరి వృత్తిని వారు సక్రమముగా నిర్వర్తిస్తున్నాము. సమాజంలో పేద, ధనిక అనే తారతమ్యాలు కానీ, పెద్ద చిన్న అనే భేదం కానీ లేవు. చేతి పనులలో, చేసే పనులలో తేడాలు ఉంటాయి కాని, మనుషులలో కాదు. అందువలన సమాజంలో మనుషులంతా ఒక్కటే అనే వాక్యాన్ని నేను సమర్థిస్తాను.
IV. సృజనాత్మకత / ప్రశంస.
అ) మీ పాఠశాలలో ఈ గేయానికి తగినట్లుగా అభినయం చేసి చూపండి.
(లేదా)
ఆ) ఈ పాఠం స్ఫూర్తిగా తీసుకొని వివిధ పనులు చేసేవారి ప్రాధాన్యత తెలిపేటట్లు చిన్న కవిత / గేయం రాయండి.
జవాబు.
చేయెత్తి జే కొట్టుమురా !
మన శ్రామిక జీవులందరికి !
త్యాగాలకు మారుపేరుగా
శ్రామికశక్తికి ప్రతిరూపంగా
నవజీవన నాగరికతకు నాందిగా
ఉపమే జీవన నాడిగా
వెలసిన శ్రామికులందరకీ వందనం
ఆరోగ్యాన్ని లెక్క చేయని బొగ్గు కార్మికులకి
తిండిలేక అలమటిస్తున్న రైతన్నలకు
లుగు వెలుగుల బట్టలనేయు కార్మికులకు
పారిశుధ్యమే పరిమావధిగా జీవించు కార్మికులకు,
ఇదే మా వందనం, మా అభివందనం
కార్మికులు లేనిదే ప్రగతి లేదు
భవితలేదు, పురోగతి లేదు,
బ్రతుకులేదు, జీవన వాహిని లేదు,
అందుకే వందనం నీకు అభివందనం.
V. పదజాల వినియోగం.
ప్రశ్న 1.
కింద ఇచ్చిన వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది.
జవాబు.
మా నాయనమ్మ ఆరోగ్యం నశించింది.
ఆ) నేను మా బడిదగ్గర కమ్మరి కొలిమిని చూశాను.
జవాబు.
నేను మా బడిదగ్గర కమ్మరి కుంపటిని చూశాను.
ఇ) పొలంలోని కొండ్రలు చక్కని గీతలవలె ఉన్నాయి.
జవాబు.
పొలంలోని దున్నిన చారలు చక్కని వరుసల వలె ఉన్నాయి.
ఈ) మా వీధిలోని కుక్కకు తిండిలేక డొక్కలెండిపోయినాయి.
జవాబు.
మా వీధిలోని కుక్కకు తిండిలేక కడుపులెండిపోయినాయి.
ఉ) పిల్లలు కబుర్లలో పడిపోయారు.
జవాబు.
పిల్లలు మాటలలో పడిపోయారు.
ఊ) మన దేశంలో కూడు లేనివారు ఉండరాదు.
జవాబు.
మన దేశంలో తిండి లేనివారు ఉండరాదు.
ప్రశ్న 2.
కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) కల్లబొల్లి = _________
జవాబు.
కల్లబొల్లి = అబద్ధపు మాటలు
ఎప్పుడూ కల్లబొల్లి కబుర్లు చెప్పరాదు.
ఆ) పాతరోత = _________
జవాబు.
పాతరోత = పాత ఆలోచన
నేటితరం వారికి పాతరోతలు పనికిరావు.
ఇ) చెమటోడ్చి = _________
జవాబు.
చెమటోడ్చి = చెమటను చిందించి
కర్షకులు చెమటోడ్చి శ్రమిస్తారు.
ఈ) విగ్రహాలు = _________
జవాబు.
విగ్రహాలు = బొమ్మలు
శిల్పి తన మనసులోని భావాలను విగ్రహాల రూపంలో చెక్కుతాడు.
ప్రశ్న 3.
కింది వాక్యాలు చదువండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి – వికృతి పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి.
అ) పిల్లవాడు పశువుకు మేత వేశాడు. తరువాత కుడితిని తెచ్చి పసరం దగ్గర పెట్టాడు.
జవాబు.
పశువు – పసరం
ఆ) జాతరలో రథం తిప్పుతరట ! ఆ అరదం అందంగా ఉంటుందట !
జవాబు.
రథం – అరదం
VI. భాషను గురించి తెలుసుకుందాం.
ప్రశ్న 1.
కింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు రాయండి.
ఉదా : ఎవరితడు = ఎవరు + ఇతడు (ఉకార సంధి)
అ) డొక్కలెండి = _________
జవాబు.
డొక్కలు + ఎండి (ఉకార సంధి)
ఆ) బుట్టలల్లి = _________
జవాబు.
బుట్టలు + అల్లి (ఉకార సంధి)
ఇ) గుడ్డలుతికి = _________
జవాబు.
గుడ్డలు + ఉతికి (ఉకార సంధి)
ఈ) రాముడెప్పుడు = _________
జవాబు.
రాముడు + ఇప్పుడు (ఉకార సంధి)
ప్రశ్న 2.
ఈ కింది పదాలను కలుపండి. సంధుల పేర్లు రాయండి.
ఉదా : వెలుగును + ఇచ్చెను = వెలుగునిచ్చెను (ఉకార సంధి)
అ) కులాలు + అని = _________
జవాబు.
కులాలని (ఉకార సంధి)
ఆ) కూటికి + ఇంత = _________
జవాబు.
కూటికింత (ఉకార సంధి)
ఇ) కొండ్రలు + ఏసి = _________
జవాబు.
(ఉకార సంధి)
ఈ) కబుర్లు + అని = _________
జవాబు.
కబుర్లని (ఉకార సంధి)
ఉ) అంది + ఇచ్చు = _________
అందిచ్చు (ఇకార సంధి)
ప్రశ్న 3.
కింది పట్టిక ఆధారంగా సరైన ప్రత్యయాలతోటి ఖాళీలు పూరించండి.
అనగనగా ఒక రాజ్య _________ ఆ రాజ్యము _________ ప్రజల _________ కులాలు, మతాలు లేవు. వారంతా ఒకరి _________ ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారి _________ మంచివారు ప్రపంచం _________ ఎవరూ లేరు. అన్నదానం _________ పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు _________ అన్నదానం చేయబడింది. కాని ఆ అన్నదానాని _________ ఎవరూ రాలేదు. కారణం ఆ ఊరిప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. _________ ప్రజలారా ! మీరంతా ధన్యులు. మీ _________ నా జేజేలు అన్నాడు రాజు.
జవాబు.
కు, ఓ, చేత, కి, ము, వలన, లో, కొరకు, కంటె, తో
అనగనగా ఒక రాజ్యము. ఆ రాజ్యములో ప్రజలకు కులాలు, మతాలు లేవు. వారంతా ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారి కంటే మంచివారు ప్రపంచంలో ఎవరూ లేరు. అన్నదానం వలన పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత అన్నదానం చేయబడింది. కాని ఆ అన్నదానానికి ఎవరూ రాలేదు. కారణం ఆ ఊరిప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. ఓ ప్రజలారా ! మీరంతా ధన్యులు. మీకు నా జేజేలు అన్నాడు రాజు.
ప్రాజెక్టు పని:
కులవ్యవస్థను రూపుమాపేందుకు కృషిచేసిన ఒక సంఘసంస్కర్త గురించి, మీ పాఠశాల గ్రంథాలయం నుండి సమాచారం సేకరించండి. వారి గురించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
కులవ్యవస్థను రూపుమాపేందుకు, కృషిచేసిన సంఘసంస్కర్తలలో కందుకూరి వీరేశలింగంగారు ఒకరు. ఈయన రాజమహేంద్రవరం పట్టణంలో 1848వ సం|| ఏప్రిల్ నెల 16వ తేదీన జన్మించారు. వీరేశలింగంగారు ఎన్నో సంఘ సంస్కరణలు చేపట్టారు. వాటిలో కులవ్యవస్థను రూపుమాపడం ఒకటి. కులాలకు, మతాలకు, సమాజానికి అవినాభావ సంబంధం ఉన్నది. సాంఘిక రుగ్మతలన్నింటికీ కులమతాలే మూలకారణాలు అయ్యాయి. అందువలన మతాన్ని, కులాన్ని సంస్కరించకపోతే సంఘసంస్కరణ, తద్వారా వ్యక్తిత్వ నిర్మాణం కుదరదని భావించాడు. మతం పేరిట జరిగే దుర్నీతిని, అన్యాయాలను తొలగించడానికి కృషిచేశాడు. దానితో గొప్ప సంఘసంస్కర్తగా పేరు తెచ్చుకున్నాడు.
TS 7th Class Telugu 9th Lesson Important Questions ఏ కులం?
I. అవగాహన – ప్రతిస్పందన
అపరిచిత పద్యాలు:
1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఉడుముండదె నూతేండ్లును
బడియుండదె పేర్మిఁబాము పదినూతేండ్లున్
మడువున కొక్కెర యుండదె
కడు నిల పురుషార్థపరుడు గావలె సుమతీ !
ప్రశ్న 1.
నూటేండ్లు జీవించే జంతువు ఏది?
జవాబు.
నూటేండ్లు జీవించే జంతువు ‘ఉడుము’.
ప్రశ్న 2.
పాము ఎన్నాళ్ళు జీవిస్తుంది?
జవాబు.
పాము పదినూర్లు అనగా వేయి సంవత్సరాలు జీవిస్తుంది.
ప్రశ్న 3.
‘కొక్కెర’ అంటే ఏమిటి?
ఎ) పాము
బి) ఉడుము
సి) కొంగ
డి) బాతు
జవాబు.
(సి) ‘కొక్కెర’ అంటే ‘కొంగ’ అని అర్ధము.
ప్రశ్న 4.
‘భూమండలంలో ధర్మార్థమోక్షాలను సాధించేవాడు కావాలి’ అనే అర్థం ఇచ్చే పాదం ఏది?
ఎ) 1వ పాదం
బి) 2వ పాదం.
సి) 4వ పాదం
డి) 3వ పాదం
జవాబు.
(సి) పై అర్థం ఇచ్చే వాక్యం, 4 వ పాదము.
ప్రశ్న 5.
కొక్కెర ఎక్కడ ఉంటుంది?
జవాబు.
కొక్కెర మడుగులో ఉంటుంది.
2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆత్మశుద్ధిలేని ఆచారమది యేల ?
భాండ శుద్ధిలేని పాక మేల ?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా ?
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఆచారం కంటే గొప్పది ఏది ?
జవాబు.
ఆత్మశుద్ధి
ప్రశ్న 2.
వంటకు ప్రధానమైనదేది ?
జవాబు.
భాండశుద్ధి
ప్రశ్న 3.
శివపూజకు ఏమి కావాలి ?
జవాబు.
చిత్తశుద్ధి
ప్రశ్న 4.
ఈ శతక మకుటమేది ?
జవాబు.
విశ్వదాభిరామ వినురవేమ
ప్రశ్న 5.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
సుభాషితం (లేక) శుద్ధి
పద్యములు & భావము
3. పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానే
వ్వరి కిచ్చినఁ గోటి గుణో
త్తర వృద్ధి భజించు విద్య తన ధన మెపుడున్.
భావం :
పూర్తిగా తన అధీనమైన విద్యను ఇతరులు. అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడూ మన సొంత ధనం.
4. సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము
విశ్వశాంతికోరు విజ్ఞానమే యిమ్ము
చిద్విలాస భాస ! శ్రీనివాస!
భావం :
ఓ శ్రీనివాసా ! జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా! మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు. కమలాల వంటి కన్నులు కలవాడా ! నిన్ను కనులారా చూడనివ్వు. ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానమును ఇవ్వు.
II. స్వీయరచన.
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
గేయ ప్రక్రియ గూర్చి రాయండి. (4 మార్కులు)
జవాబు.
గేయం అంటే పాట. పద్యాలలో లాగే దీనిలోనూ ఒక ఛందస్సు ఉంటుంది. ముఖ్యంగా లయబద్ధంగా పాడుకోవడానికి మాత్రా ఛందస్సులతో ఇది నడుస్తుంది. దీనిలో అంత్యప్రాసలు ఉంటాయి.
ప్రశ్న 2.
“మురికి గుడ్డలుతికి మల్లెపూలు చేసి ఇచ్చినప్పుడు” అనడంలో కవి భావమేమి ?
జవాబు.
బట్టల మురికి తొలగించి, స్వచ్ఛంగా చేయడానికి అడ్డం రాని కులం, అవసరాలు తీర్చేటప్పుడు లేని కులం మిగతా సందర్భాలలో ఎందుకు అని కవి ప్రశ్నిస్తున్నాడు.
ప్రశ్న 3.
“ఏ కులం” పాఠంలో ఏయే వృత్తుల వారు ఉన్నారు ?
జవాబు.
ప్రస్తుత పాఠం ‘ఏ కులం’లో ఇళ్ళు కట్టే మేస్త్రీలు, కూలీలు, రైతులు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, శిల్పులు, మేదరులు, కాగితాలు తయారుచేసే శ్రామికులు, చెప్పులు కుట్టేవారు, కుమ్మరులు, క్షురకులు, రజకులు, ఆయా వృత్తుల వారిని గూర్చి చెప్పబడింది.
IV. భాషాంశాలు
పదజాలం:
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
కులం = _________
జవాబు.
వంశం, కొలము, వంగడం, జాతి
ప్రశ్న 2.
సేవ = _________
జవాబు.
ఊడిగం, చాకిరి, కొలువు, దాస్యం
ప్రశ్న 3.
ఇల్ల = _________
జవాబు.
గృహం, సదనం, భవనం, మందిరం
ప్రశ్న 4.
విగ్రహం = _________
జవాబు.
ప్రతిమ, అర్చ, ప్రతిబింబం, ప్రతిమానం
ప్రశ్న 5.
రథం =
జవాబు.
తేరు, అరదం, శతాంగం, స్యందనం
నానార్థాలు:
ప్రశ్న 1.
పశువు = _________
జవాబు.
ప్రాణి, జంతువు, ప్రమథగణం, ఆత్మ
ప్రశ్న 2.
విగ్రహం = _________
జవాబు.
శరీరం, విస్తారం, బొమ్మ
వ్యాకరణాంశాలు:
సమాపక – అసమాపక క్రియలు
అ)ప్రశ్న 1.
మట్టితో ఇటుకలను తయారు చేసి, ఇల్లు కడతారు.
జవాబు.
అస = చేసి, స = కడతారు.
ప్రశ్న 2.
పంట పండించి, ధాన్యం బస్తాలకు ఎత్తారు.
జవాబు.
అస = పండించి, స = ఎత్తారు.
ప్రశ్న 3.
అబద్ధాలతో ఉన్న మాటలు వినం.
జవాబు.
సమాపక = వినం
ఆ) భాషాభాగాలు గుర్తించండి.
ప్రశ్న 1.
పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంటారు ?
జవాబు.
సర్వనామం
ప్రశ్న 2.
పనిని తెలుపునది.
జవాబు.
క్రియ
ప్రశ్న 3.
లింగ, వచన, విభక్తులు చేరనిది.
జవాబు.
అవ్యయం
గేయాలకు అర్థాలు – భావాలు:
1. ఏ కులమబ్బీ !
మా దేమతమబ్బీ !!
మట్టి పిసికి ఇటుక చేసి
ఇల్లు కట్టి పెట్టినపుడు
డొక్క లెండి కొండ్ర లేసి
ధాన్యరాసులెత్తినపుడు
అర్థాలు :
డొక్కలు = కడుపులు
కొండ్ర = దుక్కి
రాసులు = కుప్పలు
భావం:
మట్టిని మెత్తగా తొక్కి, పిసికి ఇటుకలను తయారుచేసి, ఇల్లు కట్టేవారిది ఏ కులం ? కడుపు మాడ్చుకొని, దున్నిన చాలులో పంటను పండించి, ధాన్యరాసులను బస్తాలకు ఎత్తినపుడు రైతుది ఏ కులం ? ! ఏ మతం ?
2. పొగగొట్టాలై పేగులు
కొలిమి సెగలు చిమ్మినపుడు
దగ్గులతో క్షీణిస్తూ
బొగ్గుట్టలు త్రవ్వినపుడు ॥ ఏ॥
అర్థాలు :
సెగలు = పొగలు
చిమ్మినపుడు =వెదజల్లబడినపుడు
క్షీణిస్తూ = నశిస్తూ
బొగ్గుట్టలు = పొగ గొట్టాలు
భావం :
ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నపుడు ఆ కొలిమి సెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి. బొగ్గు గుట్టలను తవ్వినపుడు దుమ్ము, ధూళి వల్ల దగ్గుతో కార్మికుని ఆరోగ్యం క్షీణిస్తుంది. వీరిది ఏ కులం ? ఏ మతం ?
3. మాడు చెక్కలే తింటూ
మాగాణం దున్నినపుడు
ఎండలలో బండలపై
విగ్రహాలు చెక్కినపుడు
అర్ధాలు:
మాడు చెక్కలు = మాడు అన్నం
మాగాణి = నేల
భావం :
మాడిన అన్నం తింటూ కూడా నేలను దున్నుతూ వరిపంటను పండించే రైతుది ఏ కులం ? మండే ఎండలో బండలను ఆకృతులలో విగ్రహాలను చెక్కిన శ్రమజీవి శిల్పిది ఏ కులం ? ఏ మతం ?
II.
4. పూజకు అందిచ్చు పూల
బుట్టలల్లి ఇచ్చినపుడు
రామకోటి రాసుకొనే
కాగితాలు చేసినపుడు ॥ ఏ ॥
అర్థం:
బుట్టలు = గంపలు
భావం :
దైవపూజకు తీసుకొని వెళ్ళే బుట్టలను అల్లి ఇచ్చిన వారిది ఏ కులం? భక్తితో రామకోటి రాసుకునేవారికి కాగితాలను తయారుచేసే శ్రామికులది ఏ కులం ? ఏ మతం?
5. పశువు గొంతు కోసి మీకు
చెప్పులు కుట్టిచ్చినపుడు
కూటికింత కూడు లేక
కుండలు జేసిచ్చినపుడు ॥ ఏ ॥
అర్థం:
కూటికి = అన్నానికి
భావం:
పశువుల చర్మంతో చెప్పులు తయారుచేసి ఇచ్చిన వారిది ఏ కులం ? ఏ మతం ? బతకడానికి తిండిలేక జనం కోసం కుండలను తయారుచేసిన శ్రమజీవులది ఏ కులం ? ఏ మతం ?
6. సన్యాసుల్లై వస్తే
క్షవరాలూ చేసినపుడు
మురికి గుడ్డలుతికి మల్లె
పూలు చేసి ఇచ్చినపుడు
అర్థం:
క్షవరాలు = గడ్డాలు
భావం:
గడ్డాలు, మీసాలు, జుట్టు పెంచుకొని వచ్చిన వారికి, క్షవరాలు చేసే వారిది ఏ కులం ? మురికి బట్టలను మల్లెపువ్వుల వలె తెల్లగా ఉతికే వారిది ఏ కులం ? ఏ మతం ? ఇట్లా వారి శ్రమను సమాజం వాడుకుంటుంది. వారు ప్రజల అవసరాలను తీరుస్తూనే ఉన్నారు.
7. చెల్లవు మీ కల్లబొల్లి
కబుర్లన్ని చెదలు పట్టె
ఆగదు మీ పాతరోత
రథం విరిగిపోయినది.
అర్థాలు:
కల్లబొల్లి మాటలు = కల్పిత మాటలు
చెదలు = చెదపురుగులు
భావం :
మీ కల్పిత మాటలకు కాలం చెల్లింది. అబద్ధాలతో ఉన్న మాటలను వినం. వాటికి చెదలు పట్టినాయి. ఆగకుండ సాగిన మీ పాత ఆలోచనల రథం విరిగిపోయింది.
8. కులాలనీ కులంలోని
శాఖలనీ వేరుజేస్తే
చెమటోడ్చే మనుషులమూ
చేయి కలిపి నిలబడితే
అర్థాలు:
శాఖలు = కొమ్మలు
చెమటోడ్చే = కష్టపడే
భావం :
కులాలను, కులాలలోని అన్ని శాఖలను వేరుచేసి అనైక్యతను సృష్టించాలని చూసేవారికి, గుణపాఠంగా చెమటను చిందించే శ్రామికులు అందరూ చేయి చేయి కలిపి నిలబడతారు. అప్పుడే నవసమాజం, సమసమాజం ఏర్పడుతుంది.
పాఠం ఉద్దేశం:
సమాజంలో అనేక కులాలవారు, తెగలవారు, వృత్తులవారు ఉన్నారు. కొందరు స్వార్థపరుల ఆలోచనల వల్ల వారు చీలిపోతున్నారు. వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతను సాధిస్తుంది. అందుకే కులవృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి. అప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
గేయ ప్రక్రియ మాత్రాఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది.
కవి పరిచయం:
కవి : చెరబండ రాజు.
అసలుపేరు : బద్దం భాస్కరరెడ్డి
జననం : 3-1-1944వ సం॥
జన్మస్థలం : మేడ్చల్ జవాబు.ల్లాలోని అంకుశాపురం
ఇతర రచనలు : గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట
మరణం : 2-07-1982వ సం॥
ప్రవేశిక:
మానవశరీరంలోని ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉన్నది. ఏ అవయవానికి దెబ్బ తగిలినా, శరీరమంతా బాధపడుతుంది గదా ! అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, దేశాభివృద్ధికి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంతో, సంఘీభావంతో ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించాలి. అందుకే కులాలు వేరైనా, వృత్తులు వేరైనా మనదంతా ఒకే జాతి మనమంతా భారతీయులం. ‘ఐకమత్యమే మహాబలం’ అని ఈ పాఠం తెలియచేస్తుంది.
నేనివి చేయగలనా?