Telangana SCERT 7th Class Telugu Guide Telangana 10th Lesson సీత ఇష్టాలు Textbook Questions and Answers.
TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి. (TextBook Page No.92)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
బొమ్మలో బుర్రకథ చెప్పుటకు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ప్రశ్న 2.
వారు ఏం చేస్తున్నారు ?
జవాబు.
వారు తంబుర పట్టుకొని బుర్రకథ చెప్తున్నారు.
ప్రశ్న 3.
ఇట్లాంటి ప్రదర్శనను మీరు ఎపుడైనా చూశారా ? దీనిని ఏమంటారు ?
జవాబు.
ఇట్లాంటి ప్రదర్శన నేను మా అమ్మమ్మ వారి ఊరిలో చూసాను. దీనినే బుర్రకథ అని అంటారు.
I. ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.96)
ప్రశ్న 1.
“కొత్తవింత – పాత రోత సామెత ఏ ఏ సందర్భాలలో వాడుతారు?
జవాబు.
కొత్త వస్తువులూ, కొత్త పద్ధతులు, కొత్త విషయాలు ఆకర్షించినట్లుగా పాత వస్తువులూ, పాత పద్ధతులూ, పాత విషయాలు అకర్షింపవు. పాతది అసహ్యంగా కనిపిస్తుంది. వస్తువు యొక్క గొప్పతనం కంటే కొత్తదనమే బాగా ఆకర్షిస్తుందని తెలియజేయు సందర్భంలో ఈ సామెతను వాడుతారు.
ప్రశ్న 2.
ఆడపిల్లలను కొంతమంది తల్లిదండ్రులు చదివించకపోవడానికి కారణాలేమిటి ? మిత్రులతో చర్చించండి.
జవాబు.
కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని-
-
- ఎప్పటికైనా పెళ్ళిచేసి పంపించాల్సిందే కదా అని,
- ఆడపిల్లలు ఇంటిపనులకే పరిమితం అనే వింత ఆలోచన.
- కూలిపనికి పంపించవచ్చునని,
- ఆడపిల్లలకు బయట రక్షణ ఉండదని,
- ఆర్థిక భారం.
II. ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.98)
ప్రశ్న 1.
ఆడపిల్లలు ఇంటివద్ద ఏయే పనులు చేస్తూ తమ ఇష్టాలు కోల్పోతున్నారు ? చర్చించండి.
జవాబు.
ఆడపిల్లలు ఇంటివద్ద అనేక రకాల పనులను చేస్తున్నారు. ఇంటిపని, వంటపని, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం వంటి పనులు చేస్తున్నారు. దీంతో తమకిష్టమైన చదువును, ఆటలను కోల్పోతున్నారు.
ప్రశ్న 2.
సీతను దాచిన తల్లి మనసు ఎటువంటిది ? దీనిపై మాట్లాడండి.
జవాబు.
సీతను దాచిన తల్లి మనసు చాలా విచిత్రమైనది. చదువును చెప్పించడానికి ఇష్టంలేనిది. సంస్కారవంతమైన భావాలు లేని మహిళగా కనిపించుచున్నది.
ప్రశ్న 3.
స్త్రీ గొప్పదనమేమిటి ?
జవాబు.
స్త్రీలు సర్వశక్తి సంపన్నులు. కార్యసాధకులు. భూదేవికి ఉన్నంత ఓర్పు వారికి ఉంటుంది. సహనమూర్తులు. మహిళ త్యాగానికి, ఔదార్యానికి మారుపేరుగా నిలుస్తుంది.
III. ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.98)
ప్రశ్న 1.
టీచర్ ఆదర్శ మహిళల గురించి సీత తల్లికి ఎందుకు చెప్పి ఉంటుంది ?
జవాబు.
టీచర్ సీత తల్లికి ఆదర్శ మహిళలను గురించి చెప్పింది. ఈ రకంగా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సీత ఇష్టాలను తెలుసుకొని బడిలో చేర్పిస్తుందని. ఉన్నత చదువులు చదివించడానికి ఆమెకు అవకాశం కల్పిస్తారని భావించింది.
ప్రశ్న 2.
చదువుకున్నవాళ్ళు ఎట్లా ఆలోచించాలని సీత ఇష్టాల ద్వారా తెలుసుకున్నారు ?
జవాబు.
చదువుకున్నవాళ్ళు వివేకంతో ఆలోచించాలి. సామాజిక దృక్పథం కలిగి ఉండాలి. సామాజిక బాధ్యతను విస్మరించకుండా ఉండాలి. చదువుతో ఉన్నత శిఖరాలను పొందవచ్చునని తెలుసుకోవాలి.
ప్రశ్న 3.
సీత ఇష్టాలు తెలుసుకున్నారుకదా ! సీత వలె అమ్మాయిలు ఎట్లాంటి ఇష్టాలు కలిగి ఉండాలి ?
జవాబు.
సీతవలె అమ్మాయిలు దూరదృష్టితో ఆలోచించాలి. ప్రగతివైపు సాగాలి. చక్కగా ఉన్నత చదువులు చదవాలి. రాజ్యాధికారాన్ని పొందాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలి.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.
ప్రశ్న 1.
ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే, ఎందుకు ? కారణాలు చెప్పండి.
జవాబు.
ఆడవాళ్ళలో ఎంతోమంది చదువుకున్నవారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినవారు, రాజ్యాలు పాలించినవారూ ఉన్నారు. రాణి రుద్రమదేవి, ఇందిరాగాంధీ, ఝాన్సీలక్ష్మీబాయి, దుర్గాబాయిదేశ్ముఖ్, సరోజినీనాయుడు వంటి గొప్ప నాయికామణులు ఉన్నారు. మమతాబెనర్జీ, జయలలిత, మాయావతి, షీలాదీక్షిత్ వంటి మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రతిభాపాటిల్ వంటి స్త్రీ రాష్ట్రపతులున్నారు. ముఖ్యంగా స్త్రీలు బిడ్డలను కనిపెంచుతున్నారు, స్త్రీలలో ఎందరో ప్రొఫెసర్లు, అంతరిక్ష యాత్రికులు, శాస్త్రకోవిదులు ఉన్నారు. సోనియాగాంధీ వంటి పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. కాబట్టి స్త్రీలు కూడా గొప్పవారే.
ప్రశ్న 2.
శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీ ఉపాధ్యాయులను గురించి మాట్లాడండి.
జవాబు.
మా ఉన్నత పాఠశాలలో ‘గౌరి’ అనే తెలుగు టీచరూ ‘పార్వతి’గారు అనే లెక్కలు టీచర్ స్త్రీలు ఉన్నారు. వారు మాకు చక్కగా పాఠాలు బోధిస్తారు. మా తెలుగు టీచర్ మాకు భారత, భాగవత, రామాయణ కథలు చెపుతారు. మాకు తెలుగు భాషపై మంచి ఇష్టం కలిగించారు.
ఇక మా లెక్కల టీచరు పార్వతిగారు, లెక్కలు చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యేలా చెపుతారు. రోజూ సాయంత్రం అదనంగా క్లాసు తీసుకొని, అక్కడే మాచే ఇంటిపని లెక్కలు అన్నీ చేయిస్తారు. ఈ ఇద్దరు టీచర్లు అంటే మా పిల్లలందరికీ చాలా ఇష్టం.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
ప్రశ్న 1.
“కొత్త వింత – పాత రోత” అనే అర్థం వచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయి ?
జవాబు.
పాండవులూ, కౌరవుల కథ, నలమహారాజు కథ, సీతమ్మ ఇష్టాలు వంటి కథలు పాతకథలయిపోయాయి. కాబట్టి కొత్త కథ చెప్పమని రాజు, కృష్ణవేణి అక్కను అడిగాడు. అప్పుడు రోజా. “పాతంటే రోతగా వుందా ! అని రాజును ప్రశ్నించింది.
ప్రశ్న 2.
పాఠంలో మీకు నవ్వు పుట్టించిన అంశాలు రాయండి.
జవాబు.
- రాజు రోజాను ‘కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అట్లా అరుస్తావ్’ అన్నపుడు నవ్వు వచ్చింది.
- రాజు “ఆలస్యం అమృతం విషం” అంటే అదేనేమో అన్నాడు. అప్పుడు రోజా నువ్వు నోరు మూస్తావా ? ముయ్యవా అంటుంది. అప్పుడు కూడా నవ్వు వచ్చింది.
- రాజు తాను “26 లెటర్సూ ABCD” లాంటివి చదివానని తన చదువు గురించి గొప్ప చెప్పినపుడు నవ్వు వచ్చింది.
కింది పేరా చదివి కింది పట్టికను పూరించండి.
1940 ప్రాంతంలో తెలంగాణలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీల క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్రమహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసింది. వితంతువుల కోసం వసతిగృహాలు ఏర్పాటుచేసింది. అనేకమంది రచయితలు, రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి మొదలైన వాళ్ళు సంఘసంస్కరణకు కృషిచేశారు. అఘోరనాథ చటోపాధ్యాయ గారి భార్య వరదసుందరీదేవి నాంపల్లిలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది. ఈమె సరోజిని నాయుడు తల్లి.
జవాబు.
సంఘ సంస్కర్తలు | రచయిత్రులు | సంస్థలు |
రత్నదేశాయి సుమిత్రాదేవిఈశ్వరీబాయిసంగం లక్ష్మీబాయివరద సుందరీ దేవి |
రత్నదేశాయ్ | సోదరీ సమాజం ఆంధ్ర యువతీ మండలిలేడీ హైదరీక్లబ్ |
III. స్వీయరచన
ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని తెల్పండి.
జవాబు.
శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధి కోసం – బడికి రాని బడి ఈడు పిల్లల ఇంటికి వెళ్ళి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆదర్శ మహిళల గురించి చెప్పి వాళ్ళను తన మాటలతో ప్రభావితుల్ని చేసింది. పిల్లలు బడికి వచ్చేలా చేసింది.
ఆ) ‘బుర్రకథ’ ప్రదర్శన విధానం గురించి రాయండి.
జవాబు.
బుర్రకథ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. బుర్రకథలో మొదట “భారతమాతకు జయము దిగ్విజయమూ” ……… అని ప్రార్ధించారు.
“చదువుల నిచ్చు సరస్వతి తల్లీ – చల్లగ చూడమ్మా
సిరులనిచ్చెడి శ్రీ మహాలక్ష్మీ – కరుణ చూపవమ్మా
శత్రు వినాశము చేసెడి దుర్గా – జయము నీయమ్మా ……….” అని వేడుకొన్నారు.
ఇ) పాఠాన్ని ఆధారంగా చేసుకొని ఆడపిల్లల పరిస్థితులను గురించి రాయండి.
జవాబు.
పూర్వము తల్లిదండ్రులు ఆడపిల్లలను శ్రద్ధగా బడికి పంపేవారు కాదు. ఆడపిల్లలకు ఉన్నత చదువులు అవసరంలేదని ఆనాడు భావించేవారు. ఆడపిల్లలను బడికి పంపండని టీచర్లు వచ్చి అడిగితే, తల్లిదండ్రులు తమ పిల్లల్ని కనబడకుండా దాచేవారు. కాని ఈ పాఠంలో సీతవలె చదివి మంచి ఉద్యోగాలు చేసి, పిల్లల చదువుల కోసం, స్త్రీలకు మేలు చేయడం కోసం స్త్రీలు శ్రమించాలి. అందుకు తల్లిదండ్రులు స్త్రీలకు చేయూతనివ్వాలి.
ఈ) “పెద్దలు పనికి – పిల్లలు బడికి” అనే నినాదాన్ని గురించి రాయండి.
జవాబు.
“బాలల చదువు – చరితకు వెలుగు” అన్నారు పెద్దలు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 5 సంవత్సరాల వయస్సుగల బాలబాలికలకు ప్రాథమిక హక్కుగా సంక్రమింప చేశారు.
ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
“సీత ఇష్టాలు” కథను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
రామాపురం అనే పల్లెటూర్లో శివయ్య, గౌరమ్మ అనే దంపతులకు కుమార్తె సీత. సీతను బడికి పంపించాలనుకుంటుండగా వారికి మరొక ఇద్దరు సంతానం పుడతారు. దానితో వారు ఆ ఆలోచన విరమించుకొని సీతను ఇంటివద్దే ఉంచుతారు. అమ్మ, నాన్న పనికి వెళితే సీత తమ్ముడిని, చెల్లెల్ని ఆడిస్తూ ఇంటిదగ్గరే ఉంటుంది.
వాళ్ళ ఊరికి వచ్చిన శ్రావణి టీచరు బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి రావటం లేదో తెలుసుకుంటూ సీత వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఆడపిల్లలు చదువుకోవడం ఎంత అవసరమో, ఆదర్శ మహిళల గురించి చెప్పి సీత తల్లిదండ్రులను ప్రభావితుల్ని చేసింది.
సీతను చదువుకునేందుకు శ్రావణి వెంట పంపిస్తారు. సీత మంచి తెలివితేటలు కలదై బాగా చదువుకుంటుంది.’ ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి, తను మాత్రం హాయిగా ఉండాలి అనుకోలేదు సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టర్గానో, నాయకురాలుగానో ఈ సమాజానికి సేవచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. పిల్లల చదువుకోసం, స్త్రీలకు మేలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నది సీత.
IV. సృజనాత్మకత / ప్రశంస:
ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని తెలిపే “నినాదాలు” రాయండి.
జవాబు.
- ఆడపిల్ల పుట్టింది – అదృష్టం పట్టింది
- ఆడపిల్లే కావాలి – సౌభాగ్యం వర్థిల్లాలి
- ఆడపిల్లే మాకు యోగ్యం – ఆమే అత్తింటి సౌభాగ్యం
- ఆడపిల్ల ఆ ఇంటి మహాలక్ష్మి
V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాలు చదువండి. ఎవరెవరిని ఏమంటారో రాయండి.
అ) మండలంలో అభివృద్ధి పనులను నిర్వహించే అధికారి – ______________
జవాబు.
మండల అభివృద్ధి అధికారి
ఆ) నాయకత్వం వహించేవారు – ______________
జవాబు.
నాయకుడు
ఇ) ఉపన్యాసం ఇచ్చేవారు – ______________
జవాబు.
వక్త
ఈ) హరికథ చెప్పేవారు – ______________
జవాబు.
హరిదాసు
ఉ) శిక్షణను ఇచ్చేవారు – ______________
జవాబు.
శిక్షకుడు
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పదాలలో సమాపక, అసమాపక క్రియాబేధాలు గుర్తించండి. మరికొన్ని అసమాపక, సమాపక క్రియలు రాయండి.
అ) వెళ్ళి, వచ్చి, తెంపి, తిని, చూసి
తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు, రాశాడు.
ఆ) రాధ బజారుకు వెళ్ళి, పూలు తెచ్చింది.
జవాబు.
వెళ్ళి – అసమాపక క్రియ
తెచ్చింది – సమాపక క్రియ
ఇ) మా చెల్లి హోటల్కు వచ్చి, అన్నం తినింది.
జవాబు.
వచ్చి = అసమాపక క్రియ
తినింది = సమాపక క్రియ
ఈ) రాము కొమ్మలను తెంపి, పూలు తెచ్చాడు.
జవాబు.
తెంపి = అసమాపక క్రియ
తెచ్చాడు = సమాపక క్రియ
(సమాపక, అసమాపక క్రియలను ఉపయోగించి వాక్యాలు రాయండి.)
2. ఈ కింది వాక్యాలలో ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, విధ్యర్థక వాక్యాలను గుర్తించండి. అవసరమైన చోట తగిన విరామ చిహ్నాలను ఉంచండి.
అ) దెబ్బ ఎట్లా తగిలింది
జవాబు.
దెబ్బ ఎట్లా తగిలింది ?
ఆ) అమ్మో ఎంత పెద్ద పామో
జవాబు.
అమ్మో ! ఎంత పెద్ద పామో !
ఇ) తప్పకుండా ఇంటిపని పూర్తిచేయాలి
జవాబు.
తప్పకుండా ఇంటిపని పూర్తిచేయాలి.
ఈ) నాన్న కొనిచ్చిన సైకిలు ఎంత బాగుందో
జవాబు.
నాన్న కొనిచ్చిన సైకిలు ఎంత బాగుందో !
ఉ) పండుగ నాటికి గుడిని అలంకరించండి
జవాబు.
పండుగ నాటికి గుడిని అలంకరించండి.
ఊ) మీది ఏ ఊరు
జవాబు.
మీది ఏ ఊరు ?
ప్రాజెక్టు పని:
మీ ప్రాంతంలోని కళారూపాలను గురించి తెలుసుకొని, మీకు నచ్చిన కళారూపాన్ని గురించి రాసి నివేదికను మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
మేము తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకు వాసులం. మేము కపిలేశ్వరపురం ఉన్నత పాఠశాలలో చదువుతున్నాం. మా గ్రామంలో SBPK సత్యనారాయణరావుగారు అనే జమీందారు గారు ఉండేవారు.
ఆయనకు ‘హరికథ’ అనే కళారూపం అంటే చాలా ఇష్టం. మా గ్రామంలో హరికథను చెప్పడం నేర్పే పాఠశాలను ఆయన స్థాపించారు. ఇక్కడ వందలకొద్దీ హరికథా గాయనీగాయకులు తయారయ్యారు. ఇంకా అవుతున్నారు.
ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు వంటి ప్రసిద్ధ హరికథకులు ఆంధ్రదేశంలో పుట్టారు. వారు మన తెలుగువారికి రామాయణ భారత భాగవత కథలను పరిచయం చేశారు. ‘హరికథ’, సంగీత, సాహిత్య, నృత్యకళారూపం. హరిదాసులు, మెడలో దండవేసుకొని, చేతిలో చిడతలు తీసుకొని హార్మనీ, ఫిడేలు, మద్దెల్ల సహకారంతో హరికథను చెపుతారు.
TS 7th Class Telugu 10th Lesson Important Questions సీత ఇష్టాలు
II. స్వీయరచన
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
‘బుర్రకథ’ ప్రక్రియ గూర్చి రాయండి.
జవాబు.
జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన, గేయ రూపంలో కథను చెపుతూ, అభినయిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తారు. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలకపాత్ర పోషించింది. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది.
ప్రశ్న 2.
నీకు తెల్సిన కొందరు ఆదర్శ మహిళల పేర్లు రాయండి.
జవాబు.
రాణి రుద్రమదేవి, సరోజని నాయుడు, సంగం లక్ష్మీబాయి, బండారు అచ్చమాంబ, కల్పన చావ్లా, సునీతా విలియమ్స్, ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రీబాయి, ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా, రాణి శంకరమ్మ, మలాలా, ఆరుట్ల కమలాదేవి మొదలైన మహిళలు ఆదర్శ మహిళలుగా నిలిచారు.
ప్రశ్న 3.
ఉత్తమ ఉపాధ్యాయులు ఎలా ఉంటారు ?
జవాబు.
“ఉపాధ్యాయుడు ఇస్తాడు. విద్యార్థి స్వీకరిస్తాడు. ఇవ్వడానికంటూ అతని వద్ద కొంత ఉండాలి. స్వీకరించడానికి ఇతడు సిద్ధంగా ఉండాలి” అంటారు స్వామి వివేకానంద. బడి అమ్మ ఒడి అయినపుడే విద్యార్థి ఎదుగుదలకు అది తోడ్పడుతుంది. బడిలోని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విద్యార్థులలో ఆసక్తిని కలిగించేవిగా ఉంటాయి. పాఠాలు మాత్రమే చెప్పేవారు కేవలం ఉపాధ్యాయులు. పాఠాలలోని అంతరార్థాన్ని, సందేశాన్ని గుర్తించి, విద్యార్థులు గుర్తు పెట్టుకొనే విధంగా చేసేవారు, ఉత్తమ లేదా ఆదర్శ ఉపాధ్యాయులు. మంచి మంచి కథలు, సూక్తులు ఆటపాటలతో బడిపిల్లలని తమ సొంత బిడ్డల్లాగా భావిస్తారు ఉత్తమ ఉపాధ్యాయులు.
IV. భాషాంశాలు:
పదజాలం:
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
సీత =
ఇంతి, యువతి, ముదిత, పడతి
ప్రశ్న 2.
తల్లి =
జవాబు.
అమ్మ, మాత, జనని
ప్రశ్న 3.
సీత =
జవాబు.
జానకి, మైథిలి, వైదేహి
ప్రశ్న 4.
శత్రువు =
జవాబు.
వైరి, రిపు, శాత్రవుడు, విరోధి
ప్రశ్న 5.
పైడి =
జవాబు.
బంగారం, పసిడి, కనకం
ప్రశ్న 6.
లక్ష్మి =
జవాబు.
రమ, పద్మ, ఇందిర, శ్రీ
ప్రశ్న 7.
బడి =
జవాబు.
పాఠశాల, విద్యాలయం
ప్రశ్న 8.
భర్త =
జవాబు.
పతి, నాథుడు, మగడు
ప్రశ్న 9.
భార్య =
జవాబు.
సతి, పత్ని, అర్ధాంగి, పెండ్లాము, ఇల్లాలు
ప్రశ్న 10.
పుణ్య =
జవాబు.
సుకృతం, శ్రేయం, ధర్మం
ప్రశ్న 11.
స్నేహం =
జవాబు.
ప్రేమ, ప్రియం, మైత్రి, నెయ్యం
ప్రశ్న 12.
ప్రేమ =
జవాబు.
అనురక్తి, ప్రణయం, అనురాగం
ప్రశ్న 13.
ಇಲ್ಲು =
జవాబు.
గృహం, సదనం, భవనం
ప్రశ్న 14.
పాపం =
జవాబు.
దురితం, అఘం, దోషం, కలుషం
ప్రశ్న 15.
నిజం =
జవాబు.
సత్యం, సూనృతం
ప్రశ్న 16.
అమృతం =
జవాబు.
సుధ, పీయూషం
ప్రశ్న 17.
కూలి =
జవాబు.
భీతి, వేతనం, భరణం
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
కథ – కత
స్త్రీ – ఇంతి
విద్య – విద్దె, వియ
దంపతి – జంపతి (ఆలుమగలు)
ప్రశ్న – పన్నము
కష్టం – కసటు
పుణ్యం – పున్నెము
ఉపాధ్యాయుడు – ఒజ్జ
ముగ్గ – ముద్దు
వృద్ది – వడ్డి
త్యాగము – చాగము
శ్రీ – సిరి
లక్ష్మి – లచ్చి
నానార్థాలు:
ప్రశ్న 1.
ఉపాధ్యాయుడు =
జవాబు.
చదువు చెప్పేవాడు, పురోహితుడు, వేదము చెప్పువాడు
ప్రశ్న 2.
లక్ష్మి =
జవాబు.
శ్రీదేవి, సిరి, మెట్ట తామర
ప్రశ్న 3.
శ్రీ =
జవాబు.
లక్ష్మి, సాలిపురుగు, సంపద, విషం
ప్రశ్న 4.
అమృతం =
జవాబు.
సుధ, నేయి, పాలు
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
శిక్షణ =
జవాబు.
శిక్షణ = తర్ఫీదు
ప్రణాళికాబద్ధమైన శిక్షణతో విద్య నేర్వాలి.
ప్రశ్న 2.
ఇష్టం =
జవాబు.
ఇష్టం = ప్రియమైనది
చదువును కష్టంతో గాక ఇష్టంతో చదవాలి.
ప్రశ్న 3.
ప్రోత్సాహం =
జవాబు.
ప్రోత్సాహం = వెన్నుతట్టు
స్త్రీలను ప్రోత్సహిస్తే వారు అన్ని రంగాలలో రాణిస్తారు.
వ్యాకరణాంశాలు:
సమాసపదం | విగ్రహ వాక్యం | సమాసం పేరు |
సీత ఇష్టాలు | సీత యొక్క ఇష్టాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
నలమహారాజు | నలుడు అనుపేరు గల మహారాజు | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
తొలి సంతానం | తొలిదైన సంతానం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
తల్లిదండ్రుల | తల్లియును, తండ్రియును | ద్వంద్వ సమాసం |
మహాపాపం | గొప్పదైన పాపం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
1. సంయుక్త వాక్యంగా మార్చండి.
ప్రశ్న 1.
దీపాలు వెలిగించారు. వెలుగులు విరజిమ్ముతున్నాయి.
జవాబు.
దీపాలు వెలిగించారు కాబట్టి వెలుగులు విరజిమ్ముతున్నాయి.
ప్రశ్న 2.
ప్రేక్షకులు వచ్చారు. బుర్రకథ ఆరంభించలేదు.
జవాబు.
ప్రేక్షకులు వచ్చారు అయినా బుర్రకథ ఆరంభించలేదు.
2. భాషాభాగాలు గుర్తించండి.
ప్రశ్న 1.
నామవాచకానికి ఉదాహరణలు రాయండి.
జవాబు.
రాముడు, సీత
ప్రశ్న 2.
విశేషణానికి ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు.
నల్లని, వేగంగా, తియ్యగా
ప్రశ్న 3.
అవ్యయం అనగానేమి ?
జవాబు.
లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు చేరని పదం.
మీకు తెలుసా ?
మలాలా
బాలికలు చదువరాదని విధించిన ఆజ్ఞను ఉల్లంఘించింది…
ధైర్యసాహసాలు ప్రదర్శించి బడికెళ్ళింది….
చదువుకోవడానికి తనకున్న హక్కును
లాక్కోవడానికి మీరెవరని ప్రశ్నించింది…
తాలిబన్ల ఉగ్రవాద చర్యలకు ఎదురొడ్డి నిలిచింది…
అచంచల ధైర్యసాహసాలతో తనపేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ బాలిక మలాలా యూసఫ్ జాయ్. 1997 జూలై 12న పాకిస్థాన్లో జన్మించిన మలాలా ప్రపంచం గర్వించే సాహస బాలికగా పేరు తెచ్చుకుంది. “సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నామీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నాయెదురుగా నిలిచినా అతణ్ణి నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరీసాలే నాకు ఆదర్శం” అని గర్వంగా చాటింది. అత్యుత్తమ ఔదార్యానికి నిలువెత్తు నిదర్శనమై నిలిచింది. సత్యార్థి కైలాశ్ ప్రకాశ్ (బాలల హక్కులకోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడు) తో కలిసి 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి నందుకొన్నది.
కఠిన పదాలకు అర్థాలు:
నిరంతరం = ఎల్లప్పుడు
మేలు = మంచి
అలవోక = తేలిక
ముగ్గులు = సంతోషించిన వాళ్ళు
తుది = చివర
జన్మ = పుట్టుక
భానుడు = సూర్యుడు
వీనుల విందుగా = చెవులకింప
అభ్యున్నతి = అభివృద్ధి, మేలు
పాఠం ఉద్దేశం:
ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అట్లే జానపద కళారూపాలపట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని, “బుర్రకథ” వంటి కళారూపాల వలన ప్రయోజనాలున్నాయని తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
జానపద కళారూపాలలో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంతపాడేవాళ్ళు ఉంటారు. వచన, గేయరూపంలో కథను చెపుతూ, అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారు.
ప్రవేశిక:
గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో బాలికలను ఇంటికే పరిమితం చేసి, విద్యకు దూరం చేస్తున్నారు. బాలికలను పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సాయపడటానికి, వ్యవసాయ కూలీ పనులకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. చదువుకోవాలనే కోరిక వీరికీ ఉంటుంది. ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని, ముందడుగు వేస్తారు.
నేనివి చేయగలనా?