TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 6th Lesson ప్రేరణ Textbook Questions and Answers.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

చదువండి – ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.54)

ప్రజ్ఞ చాలా తెలివికలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ప్రతీదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకున్నది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది ?
జవాబు.
విమానం గాల్లో ఎలా ఎగురుతుంది ? అని అడిగి ఉంటుంది.

ప్రశ్న 2.
శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు ?
జవాబు.
శాస్త్రవేత్త ప్రజ్ఞను అభినందించి, విమాన సూత్రాలు చెప్పి ఉంటాడు.

ప్రశ్న 3.
ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా! మీరేం కావాలనుకుంటున్నారు ? ఇందుకోసం మీరేం చేస్తారు ?
జవాబు.
నేను కలెక్టరు కావాలి అని అనుకుంటున్నాను. ఇప్పటి నుండే దానికై ప్రణాళిక తయారుచేసి అమలుపరుస్తాను.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.56)

ప్రశ్న 1.
‘నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు’ అంటే మీకేమైంది?
జవాబు.
మానవుడు కార్యసాధకుడు. అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేయగల సమర్థుడు మానవుడు. నీవు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనడం ద్వారా మానవునకు సాధించాలనే పట్టుదల ఉంటే, ఎంతటి దుస్సాధ్యమైన పనినైనా కూడా సుసాధ్యం చేయగలడని అర్థం అయింది.

ప్రశ్న 2.
మీరు మీ కుటుంబసభ్యులకెప్పుడైనా సహాయం చేశారా ? ఏ సందర్భంలో ఏం చేశారు ?
జవాబు.
నేను నా కుటుంబ సభ్యులకు ఎన్నో పర్యాయాలు సహాయం చేశాను. ముఖ్యంగా అనేకసార్లు ఇంటిలోనికి అవసరమయిన సరుకులు తెచ్చాను. వివిధరకాల బిల్లులు నేనే చెల్లించేవాడను.

ప్రశ్న 3.
కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనేవి విజయాన్నిస్తాయి కదా ! వీటి పై మీ అభిప్రాయమేమిటి ?
జవాబు.
నిజమే. మానవుడికి ఏదైనా ఒక పనిని సాధించాలనే కోరిక, దానిపై విశ్వాసం ఉండాలి. ఆశ కూడా అంతకుమించి ఉండాలి. ఈ మూడింటికలయికతో అసాధ్యమైన పని కూడా ఫలిస్తుంది. మంచి విజయం లభిస్తుంది.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.58)

ప్రశ్న 1.
మీ జీవిత లక్ష్యం ఏమిటి ? అది సాధించడానికి ఏం చేస్తారు?
జవాబు.
జీవశాస్త్రంలో గొప్ప శాస్త్రవేత్త కావాలనేదే నా లక్ష్యం. దీనిని సాధించడానికి నిరంతరం కృషి చేస్తాను. వివిధ గ్రంథాలయాలను సందర్శిస్తాను. పెద్దలను కలుస్తాను. వారందరి సహకారం తీసుకుంటాను. రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతాను. ఉన్నత లక్ష్యాలను సాధిస్తాను.

ప్రశ్న 2.
‘తనను తాను తెలుసుకోవడం’ అంటే మీకేమర్థమైంది ?
జవాబు.
మనం ఎదుటివారి లోపాలను, ఎత్తి చూపడం కాదు, ముందుగా తన గురించి, తన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే అతను ముందుకు వెళ్ళగలుగుతాడు. ముందుగా మానవుడు తన గురించి తాను తెలుసుకొని ఆత్మావలోకనం చేసుకోవాలి.

ప్రశ్న 3.
మిమ్మల్ని మీ ఉపాధ్యాయులెట్లా ప్రోత్సహిస్తారో చెప్పండి.
జవాబు.
నేను ఎప్పుడైనా బాగా చదివినప్పుడు, మంచి విషయాలను ప్రారంభించినప్పుడు ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తాడు. మరింత కృషి చేసి మరిన్ని విజయాలు పొందాలని ప్రోత్సహిస్తారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని దీవిస్తారు.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No.60)

ప్రశ్న 1.
‘స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ’ అని కలాం అనడంలో
జవాబు.
గతంలో పేద విద్యార్థులు చదువుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి సమయంలో ప్రభుత్వం లేదా దాత స్కాలర్షిప్పులు ఇచ్చేవారు. కలాం ఉన్నత విద్యను అభ్యసించడానికి స్కాలర్షిప్పే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ప్రశ్న 2.
‘దారిచూపే దీపం’ అనే మాటను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు ?
జవాబు.
ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మార్గాన్ని చూపించే వ్యక్తిని గూర్చి ప్రశంసించాల్సిన సందర్భంలో ఈ పదాన్ని వాడుతారు.

ప్రశ్న 3.
ప్రొఫెసర్ కలాంను ముందువరుసలో కూర్చోమన్నాడు. కదా ! కలాం స్థానంలో మీరుంటే ఏవిధంగా అనుభూతి చెందేవారు ?
జవాబు.
కలాం స్థానంలో నేనుంటే మిక్కిలి ఆనందించేవాడిని. విద్యాభివృద్ధిలో సాధించిన ప్రగతికి తగిన గుర్తింపు వచ్చినందుకు, పెద్దల మన్నన పొందినందుకు సంతోషిస్తాను.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.
ప్రేరణ అని ‘పాఠం’ పేరు వినగానే మీకేమనిపించింది ?
జవాబు.
ప్రేరణ అని పాఠం పేరు వినగానే ఈ పాఠానికి ఈ పేరు సరియైనదిగా అనిపించింది. ఎందుకనగా ప్రజ్ఞ అనే బాలిక చిన్నతనం నుండే పరిశీలనా దృష్టిని అలవరచుకొని విద్యా వైజ్ఞానిక శాస్త్రాలకు సంబంధించిన విషయాలపై అవగాహన ఏర్పరచుకొని పెద్దల ద్వారా తనకు గల సందేహాలను నివృత్తి చేసుకొనుట అనే ప్రేరణ ద్వారా ఆమె తన కోరిక తీర్చుకోగలిగింది అని నాకనిపించింది.

ప్రశ్న 2.
అబ్దుల్ కలామ్ చదువుకున్న రోజుల్లోని విద్యా విధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి.
జవాబు.
అబ్దుల్ కలామ్ చదువుకునే రోజుల్లో విద్యా విధానం చాలా కష్టతరం అయినది. చదువు ధనంతో కూడినది అయినా పట్టుదల, కృషి కల విద్యార్థులు ఉపకార వేతనం ద్వారా ఉన్నత విద్యను సాధించవచ్చు అనే విషయం మనకు అర్థం అయింది. ఎందుకనగా అబ్దుల్ కలామ్ చాలా పేదకుటుంబంలో జన్మించినా తన లక్ష్యాన్ని సాధించటం కష్టమైనా ““కృషితో నాస్తి దుర్భిక్షం” అన్నట్లు అహోరాత్రులు శ్రమించి సుసాధ్యం చేసుకొని తన లక్ష్యాన్ని అధిగమించాడు అని నేను నా మిత్రులతో చర్చించాను.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

1. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాలను పూర్తిగా రాయండి.

అ) కలామ్ తత్వశాస్త్ర గ్రంథాలు చదవడం
జవాబు.
నేను సెంట్ జోసెఫ్ నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాడిని. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.

ఆ) విజయానికి సూత్రాలు మూడు
జవాబు.
నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవితగమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు, జీవితంలో విజయం పొందడానికీ ఫలితాలు సాధించడానికీ నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశ పెట్టుకోవడమూ”ను.

ఇ) సోదరి సహాయం
జవాబు.
ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను గానీ అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యిరూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు కుదవబెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి.

ఈ) ప్రొఫెసర్ పక్కన కూర్చొని ఫోటో దిగడం
జవాబు.
ఎమ్.ఐ.టి కి సంబంధించి నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. నేను మూడో వరుసలో నిల్చున్నాను. ‘రా నాతో పాటు ముందు కూర్చో’ అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. ‘నువ్వు నా బెస్ట్ స్టూడెంటివి. ‘నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

2. కింది పేరా చదువండి. తప్పు, ఒప్పులను గుర్తించండి.

భారత జాతీయోద్యమ నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో జన్మించాడు. సహాయనిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్త్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

అ. బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు.
జవాబు.

ఆ. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి.
జవాబు.

ఇ. బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు.
జవాబు.

ఈ. బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్రోద్యమ కాంక్ష ఉంది.
జవాబు.

ఉ. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయనాయకుడు.
జవాబు.

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని’ అనగా ఏ వ్యక్తి అయినా మొదట తనను తాను అర్థం చేసుకోవాలి. అనగా తనను గురించి తాను తెలుసుకోవాలి. ఎవరైతే మొదట తనను గురించి తాను పూర్తిగా తెలుసుకోగలడో అటువంటివాడు ఇతరుల్ని అర్థం చేసుకోగలడు. అనగా ఇతరుల మనోభావాలను బాగా చదివి విజ్ఞానం సంపాదించుకోగలడు, కాబట్టి ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని అని చెప్పవచ్చు.

ఆ) ‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి ?
జవాబు.
జీవితంలో విజయం పొందటానికి ఫలితాలు సాధించడానికి మనం మూడు అంశాల మీద పట్టు సాధించాలి. అవి

  1. కోరిక : మనలో ఏదో సాధించాలి అనే ఆశే కోరిక. కోరికను నెరవేర్చుకోవాలని గట్టిగా ఆకాంక్షించాలి.
  2. నమ్మకం : మనకేదైతే కోరిక ఉందో అది తప్పక సాధించాలని మనపై మనం నమ్మకం కలిగించుకోవాలి.
  3. ఆశపెట్టుకోవడం : మనలో పుట్టిన కోరికను ఆత్మవిశ్వాసంతో కృషిచేసి అది తప్పక జరిగి తీరుతుందనే ప్రగాఢ విశ్వాసమే ఆశపెట్టుకోవడం. చివరకు నెరవేర్చుకోవడం. అందుకే మనం ఈ అంశాలు మూడింటిని సాధించుకోవాలి.

ఇ) ‘తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తిపరచడమే !’ ఈ ‘మాటలు ఎవరినుద్దేశించినవి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
పై మాటలు కలామ్ తమ ప్రొఫెసర్లను ఉద్దేశించి వ్రాసినవి. ఆయన ఎమ్.ఐ.టి విద్యాభ్యాసంలో కలాం ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కే.ఏ.వి. పండలై, ప్రొఫెసర్ నరసింగరావుగార్లు వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరచిన పునాదిపైనే కలాం సాంకేతిక ప్రతిభ ఆధారపడి ఉన్నదని భావించాను. అందుకే విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్య, ప్రోత్సాహాలతో వృద్ధిపరిచి అకుంఠిత సంకల్పంతో సంతృప్తిపరచడం ద్వారా కలామ్ ఆశయాన్ని నెరవేర్చేలా తోడ్పడ్డారు.

ఈ) ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తి చేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు ?
జవాబు.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తిచేసే సమయంలో కలాం స్థానంలో నేనుంటే నా తల్లిదండ్రులు ధనవంతులైనా, ఉపకార వేతనముతో చదవడము నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకనగా ఒక ఉత్తమ విద్యార్థి స్థానం నాకు అందుతుంది కనుక ఆ పాఠశాలలో గౌరవము కూడా ఏర్పడుతుంది. స్వయంశక్తితో విద్యను అభ్యసించిన సంతృప్తి కూడా నాకు కలుగుతుంది. అది నా తల్లిదండ్రులను కూడా సంతోషపరుస్తుంది. కాబట్టి నేను కూడా రాత్రింబవళ్ళు శ్రమించి నా పనిని పూర్తిచేస్తాను.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడు ? మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అబ్దుల్ కలామ్ చాలా పేద కుటుంబంలో జన్మించాడు. జీవితంలో విజయం పొందడానికి మూడు అంశాల మీద పట్టు సాధించాలని నమ్మాడు. అవి ‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’.
పాఠశాల చదువు తరువాత ఉన్నత చదువులకోసం ఇంగ్లీషు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సోదరి అందించిన ఆర్థిక సహాయంతో కాలేజీలో చదువు మొదలుపెట్టాడు. ఆర్థికస్తోమత లేకపోవడంతో స్కాలర్షిప్ పొంది చదవాలని కృతనిశ్చయుడయ్యాడు.

ప్రొఫెసర్ శ్రీనివాసరావుగారు ఇచ్చిన పనిని 3 రోజులలో రాత్రింబవళ్ళు కష్టపడి సాధించి స్కాలర్షిప్ పొందాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసి బెంగళూర్లోని “హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్” లో ట్రైనీగా చేరాడు. రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీ వెళ్ళి ఉన్నత పదవిని అధిరోహించాడు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి “భారతరత్న బిరుదు పొందిన శాస్త్రవేత్త, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్”.
(లేదా)

ఆ) కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అబ్దుల్ కలామ్ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి రామనాథపురం హైస్కూల్లో చదివాడు. ఆయనకు చిన్నప్పటి నుండి ఆకాశపు రహస్యాలు తెలుసుకొని, పక్షుల్లా ప్రయాణం చేయాలని తన జీవితంలో ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని కోరుకున్నాడు. 1950లో ఇంటర్మీడియట్ చదవడానికి ట్రిచీ సెంట్ జోసఫ్ కాలేజీలో చేరాడు. సెంట్ జోసఫ్ కాలేజీలో డిగ్రీ చదివాడు. ఇంగ్లీషు సాహిత్యంపై మక్కువ పెంచుకొని అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాడు. డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నాడు. మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేసి ఎంపిక అయ్యాడు.

అక్కడ ఆయనను ఎమ్.ఐ.టి లో అధికంగా ఆకర్షించినది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన 2 పాత విమానయంత్రాలు. వాటిపట్ల అతడు ఆకర్షితుడై వాటి దగ్గరే చాలాసేపు కూర్చొని, పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న తన ఆకాంక్షని ఆరాధిస్తూ గడిపేవారు. ఆయన ప్రతిభకు మెరుగులు దిద్ది ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారు ముగ్గురు ఉపాధ్యాయులు. ఎమ్.ఐ.టి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ స్పాండర్ వీడ్కోలు సమావేశంలో కలామ్న ఎంతో మెచ్చుకున్నారు.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

IV. సృజనాత్మకత / ప్రశంస:

అ) కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా ! అలాగే మీరు కూడా మీ కోరికను చిన్నకవిత రూపంలో రాయండి.
జవాబు.
గురువుగారు వచ్చారు
జ్ఞానాన్నే పంచారు
చిక్కు చిక్కు ప్రశ్నలతో చిత్తమందు
జ్ఞాన జ్యోతిని వెలిగే
హితబోధన చేశారు
అక్షర సత్యాలన్నీ
అలవోకగా తాను చెప్పి
తెలుగుభాష గొప్పతనం
తేటతెల్లం చేశారు
(అందుకే నేను కూడా భవిష్యత్లో భాషోపాధ్యాయుడు నౌతాను.)

(లేదా)

ఆ) ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెబుతారు ? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు.

ఏకపాత్రాభినయం

నేనే అబ్దుల్ కలాం అయితే ఆయనలాగా మూడు అంశాల మీద పట్టు సాధిస్తాను. అవి కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం. లక్ష్యసిద్ధికి పేదరికం అడ్డురాదని నమ్ముతాను. ఆ మార్గంలోనే కృషి చేస్తాను, అబ్దుల్ కలామ్గారిలాగానే విరామం ఎరుగని కృషితో కొద్ది సమయంలోనే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాను.

విద్యార్థులారా మీరు కూడా చిన్నప్పటి నుండి కూడా ఒక లక్ష్యాన్ని మీ ఆశయంగా పెట్టుకొని జీవించండి. భావి భారత పౌరులుగా మీరు రాబోయే కాలంలో ఎంతమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప శాస్త్రవేత్తలు అవుతారో ! మీరు మీ లక్ష్యాలను సాధించుకొని దేశ పురోభివృద్ధికి మీవంతు సాయాన్ని అందించండి. ఇదే నేను మీకు ఇవ్వదలచుకున్న
సందేశము.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

V. పదజాల వినియోగం:

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
జవాబు.
ఔత్సాహికుడు = ఉత్సాహవంతుడు

ఆ) జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జవాబు.
జిజ్ఞాస = కోరిక (తపన)

ఇ) సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష.
జవాబు.
ఆకాంక్ష = కోరిక

ఈ) అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
జవాబు.
వాగ్దానం = మాట ఇవ్వటం

2. ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.
జవాబు.
ఉదా : ఏరోనాటికల్ ఇంజనీర్
భౌతికశాస్త్రం
విజ్ఞానశాస్త్రం
ఎమ్.ఐ.టి. ప్రోగ్రామ్
ఎమ్.ఐ.టి. ఫోటోగ్రాఫ్
ఓవరాలింగ్లు
పిస్టన్
టర్బయిన్ ఇంజన్లు డైనమిక్స్

3. కింది వాక్యాలలో సమానార్థకాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.

అ) ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో · ఇష్టం.
జవాబు.
నింగి = ఆకాశం

ఆ) భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి. అదే వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. అట్టి ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు.
భూమి – ధరణి – వసుధ

ఇ) ఆయనకు సుమారు ముప్ఫై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలైంది. ఏడాదికి దాదాపు రెండులక్షలు సంపాదిస్తున్నాడు.
జవాబు.
ఏళ్ళు – సంవత్సరం – ఏడాది

ఈ) కిరణ్కు కలెక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమించాడు. పరీక్ష ఫలితాలు రాగానే తన వాంఛ నెరవేరిందని సంతోషించాడు.
జవాబు.
కోరిక – ఆకాంక్ష – వాంఛ

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది పదాలను విడదీయండి. సంధులను గుర్తించండి.

అ) మొదలయ్యింది = __________ + __________
జవాబు.
మొదలు + అయింది (ఉకారసంధి)

ఆ) మేల్కొల్పాడంటే = __________ + __________
జవాబు.
మేలు + కొల్పాడంటే (ఉత్వసంధి)

ఇ) ఉంటుందని = __________ + __________
జవాబు.
ఉంటుంది + అని (ఉత్వసంధి)

ఈ) నాకిప్పటికీ = __________ + __________
జవాబు.
నాకు + ఇప్పటికీ (ఉత్వసంధి)

ఉ) నైపుణ్యముందో = __________ + __________
జవాబు.
నైపుణ్యము + ఉందో (ఉత్వసంధి)

2. కింది వాక్యాలు చదువండి. గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో గుర్తించండి, రాయండి.

ఉదా : అ) ఆదిత్య మంచి బాలుడు.
జవాబు.
(ప్రథమా విభక్తి)

ఆ) సూర్యనారాయణశాస్త్రిగారితో నడిచాను.
జవాబు.
(తృతీయా విభక్తి)

ఇ) ఆయనను ఒప్పించలేకపోయాను.
జవాబు.
(ద్వితీయా విభక్తి)

ఈ) ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి.
జవాబు.
(చతుర్థీ విభక్తి)

ఉ) గురువుల యొక్క ప్రభావం కలాంపై బాగా ఉంది.
జవాబు.
(షష్ఠీ విభక్తి)

ఊ) చెరువులయందు ఉన్న తామరలు సౌందర్యాన్నిస్తాయి.
జవాబు.
(సప్తమీ విభక్తి)

ఋ) ఓ బాలలారా ! కలలు కనండి.
జవాబు.
(సంబోధనా ప్రథమా విభక్తి)

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

ప్రాజెక్టు పని:

అ) మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెట్లా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుగొన్నారో వివరాలు సేకరించి నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.

నాకు నచ్చిన శాస్త్రవేత్త

నాకు నచ్చిన శాస్త్రవేత్త సునీతా విలియమ్స్. ఈమె భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. సునీతా విలియమ్స్ పూర్తిపేరు సునీతా పాండ్యకృష్ణ. ఈమె 1965లో సెప్టెంబర్ 19వ తేదీన జన్మించింది. ఈమెకు బాల్యము నుండి అంతరిక్ష యాత్ర చేయాలని ఆకాంక్ష. ఈమె అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. 1998లో ‘NASA’ చేత ఎంపిక కాబడి 2007లో భారతదేశంలో పర్యటించిన ఈమె అనేక అంతరిక్ష పరిశోధనలు చేసి అంతరిక్షంలో అత్యధిక సమయాన్ని గడిపిన తొలి మహిళ.

గుజరాత్లో గల జులాసన్ స్వగ్రామంలో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించింది. విశ్వప్రతిభ అవార్డు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డను పొందినది. 2007 అక్టోబర్ 4వ తేదీన “అమెరికన్ ఎంబసీ”లో ప్రసంగించింది. తర్వాత భారత ప్రధానితో సమావేశం కూడా జరిపింది.

2008లో ‘NASA’ డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలను నిర్వహించిన అంతరిక్ష పరిశోధకురాలు సునీతా పాండ్యకృష్ణ.

(లేదా)

ఆ) వివిధ శాస్త్రవేత్తల గురించి పత్రికల్లో వచ్చిన అంశాలను సేకరించి, నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
శాస్త్రవేత్తల గురించి పత్రికలలో వచ్చిన అంశాలు :

  1. నికోలస్ కోపర్నికస్ – పాలపుంత నక్షత్రమండలం మన విశ్వమని చెప్పాడు.
  2. క్లాడియస్ టోలమీ – భూమిని కేంద్రంగా విశ్వం నమునాను సృష్టించాడు.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

TS 7th Class Telugu 6th Lesson Important Questions ప్రేరణ

I. అవగాహన – ప్రతిస్పందన:

అపరిచిత గద్యాలు:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మానవులకు విద్యయే సౌందర్యం. విద్యయే దాచుకున్న ధనం. చదువే కీర్తిని, సుఖాన్ని కలిగిస్తుంది. విద్యయే గురువులకు గురువు వంటిది. విదేశాలకు వెళ్ళినపుడు విద్యయే బంధువు. చదువే మరొక కన్ను. రాజసభలలో విద్యకే గౌరవం లభించింది కానీ ధనానికి కాదు. ఇటువంటి శ్రేష్ఠమైన విద్య లేనివాడు వింత పశువు !

ప్రశ్నలు:

ప్రశ్న 1.
విదేశాలలో విద్య ఎటువంటిది ?
జవాబు.
బంధువు

ప్రశ్న 2.
విద్య లేని వాడు ఎలాంటివాడు ?
జవాబు.
వింత పశువు

ప్రశ్న 3.
రాజసభలలో దేనికి గౌరవం లభిస్తుంది ?
జవాబు.
విద్యకే

ప్రశ్న 4.
గురువులకే గురువు వంటిది ఏది ?
జవాబు.
విద్య

ప్రశ్న 5.
‘కన్ను’ పర్యాయపదాలు రాయండి.
జవాబు.
నేత్రం, నయనం, చక్షువు

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“ప్రార్థించే పెదవుల కన్నా సాయంచేసే చేతులు మిన్న” – అన్న మాటను అక్షరాలా నిజం చేసిన సన్న్యాసిని మదర్ థెరీసా, అల్బేనియా దేశానికి చెందిన థెరీసా అసలుపేరు ఆగ్నస్ గోన్షా బొజాక్షువా. 1910 ఆగస్టు 26న జన్మించిన ఆగ్నస్ బాల్యం నుండి సేవాపరాయణత్వం కల్గిన కరుణామయిగా విశ్వఖ్యాతిని ఆర్జించింది. భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలందించింది. అంతర్జాతీయ కీర్తి పొందిన మదర్ థెరీసా మానవసేవలకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి, 1980లో భారతరత్న పురస్కారాలు లభించాయి. మదర్ 1997 సెప్టెంబర్ 5న పరమపదించినా సేవాతత్పరతకు చిరునామాగా, ఆత్మీయ అరుణతారగా ప్రకాశిస్తూనే ఉన్నది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
మదర్ ఏ మాటను నిజం చేసింది ?
జవాబు.
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.

ప్రశ్న 2.
థెరీసా అసలు పేరు ఏమి ?
జవాబు.
ఆగ్నస్ గోన్షా బొజాక్షువా

ప్రశ్న 3.
మదర్ ఏ సంస్థను స్థాపించింది ?
జవాబు.
మిషనరీ ఆఫ్ చారిటీస్

ప్రశ్న 4.
నోబెల్ శాంతి బహుమతి ఏ సం॥ మదర్ పొందారు ?
జవాబు.
1979లో

ప్రశ్న 5.
మదర్ ఎప్పుడు పరమపదించారు ?
జవాబు.
5-9-1997న

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

II. స్వీయరచన:

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)

ప్రశ్న 1.
“తనను తాను తెలుసుకున్న వాడే వివేకి” ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
మనం ఎదుటివారి లోపాలను, ఎత్తి చూపడం కాదు, ముందుగా తన గురించి, తన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే అతను ముందుకు వెళ్ళగలుగుతాడు. ముందుగా మానవుడు తన గురించి తాను తెలుసుకొని ఆత్మావలోకనం చేసుకోవాలి అని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
A.P.J. అబ్దుల్ కలాం స్వభావం గురించి వ్రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో, ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞానజిజ్ఞాసతో నవతరానికి ప్రేరణగా ఉన్నారు.

ప్రశ్న 3.
‘ప్రేరణ’ పాఠం ఆధారంగా అబ్దుల్ కలాం ఆశయాలను తెల్పండి.
జవాబు.
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది. డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలాం ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పట్టుదలతో, క్రమశిక్షణతో, జ్ఞానజిజ్ఞాసతో కష్టాన్ని ఇష్టపడి ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా తన సేవలను, ఈ జాతికి అందించాడు. చిన్ననాటి నుండి ఆకాశపు రహస్యాలపై ఆసక్తి పెంచుకొని, ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించాలని కలలు కని, సాకారం చేసుకొన్న సాధకుడు కలాం.

ఇంజనీరింగ్ చదువుతున్న కాలంలో డబ్బు అవసరమైతే సోదరి బంగారు గాజులు కుదవబెట్టి ఇచ్చినప్పుడు కలాం మానసిక స్థితిని గమనిస్తే నేటి విద్యార్థులకు మార్గదర్శకుడిగా, ఆదర్శప్రాయుడిగా నిలుస్తారు. కలాం తన ఆశయ సాధనలో చూపిన కఠోర శ్రమ భావితరాల వారికి కొత్త దారిని చూపుతుంది.

ప్రశ్న 4.
బీదవాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బును దేనికొరకు ఎక్కువగా ఖర్చు చేస్తారు ? ఎందుకు ?
జవాబు.
బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ధూమపానం (బీడి, సిగిరెట్), మద్యపానం (సారా మొ॥) మొదలైన అనారోగ్యాన్ని కలిగించే మత్తు పదార్థాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉదయం నుండి కష్టపడి పని చేసిన కష్టజీవుల శ్రమకు తగిన ప్రతిఫలం ఉండదు, కడుపులు నిండవు. కుటుంబం గడపడం కష్టంగా మారుతుంది. ఆ బాధలను మరచిపోవడం కోసం చౌకగా దొరికే ఈ వ్యసనాలకు బానిసలౌతారు.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)

ప్రశ్న 1.
‘ఉన్నతమైన లక్ష్యం సాధించడానికి సాధారణ కుటుంబ నేపథ్యం అడ్డు రాదు’ దీనిని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
సాధారణ బాలుడైన కలాం ఆకాశంలో ఎగరాలన్న కోరికను సాకారం చేసుకొన్న విధానమెట్టిది ?
(లేదా)
‘ప్రేరణ’ పాఠం ఆధారంగా అబ్దుల్ కలాం జీవిత విశేషాలు తెల్పండి.
జవాబు.
అబ్ధుల్ కలామ్ చాలా పేద కుటుంబంలో జన్మించాడు. జీవితంలో విజయం పొందడానికి మూడు అంశాల మీద పట్టు సాధించాలని నమ్మాడు. అవి ‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’.
పాఠశాల చదువు తరువాత ఉన్నత చదువులకోసం ఇంగ్లీషు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సోదరి అందించిన ఆర్థిక సహాయంతో కాలేజీలో చదువు మొదలుపెట్టాడు. ఆర్థికస్తోమత లేకపోవడంతో స్కాలర్షిప్ పొంది చదవాలని కృతనిశ్చయుడయ్యాడు.

ప్రొఫెసర్ శ్రీనివాసరావుగారు ఇచ్చిన పనిని 3 రోజులలో రాత్రింబవళ్ళు కష్టపడి సాధించి స్కాలర్షిప్ పొందాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసి బెంగళూర్ లోని “హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్” లో ట్రైనీగా చేరాడు. రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీ వెళ్ళి ఉన్నత పదవిని అధిరోహించాడు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి “భారతరత్న బిరుదు పొందిన శాస్త్రవేత్త, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్”.

ప్రశ్న 2.
“అబ్దుల్ కలాం గొప్పవాడు కావడానికి చదువే కారణం” సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“అబ్దుల్ కలాం విజయానికి ఉపాధ్యాయులే ప్రేరణ” అని ఎలా చెప్పగలవు ?
జవాబు. నేటి విద్యార్థి రేపటి గురువు. నేటి గురువు నిన్నటి విద్యార్థి. “సామాన్య కుటుంబంలో పుట్టినా, బాల్యంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలు వచ్చినా, మొక్కవోని దీక్షతో, ఆత్మ విశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాలి. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరాలని కలలు కనాలి. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. అప్పుడే భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్ననలు అందుకొని మహనీయుడిగా అందరికీ ప్రీతిపాత్రులం కాగలుగుతాం”. అలా చరిత్ర ప్రసిద్ధులైన వారిలో అబ్దుల్ కలాం ఒకరు.

కలాంకు తన 15 ఏళ్ళ వయసులోనే చదువు పట్ల, జీవితం పట్ల జిజ్ఞాస కలిగింది. ఆ సమయంలో కలాంకు ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శపథ నిర్దేశకుడు అయ్యాడు. “మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుండి కూడా ఎక్కువ నేర్చుకోగలడు” అన్న ఆయన మాటలు కలాంలోని జ్ఞానాన్ని వికసింపజేసింది”.

“జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి మూడు అంశాలపై పట్టు సాధించాలి. అవి “కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం” అని చెప్పిన సోలోమోన్ గురువు మాటలు కలాం చెవుల్లో మారుమ్రోగాయి. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు” అన్న ఆయన మాటలు కలాంలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ముందుకు నడిపాయి.

ఆంగ్ల సాహిత్యం పట్ల మక్కువతో కలాం టాల్స్టాయ్, స్కాట్ర్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచాడు. తత్వశాస్త్ర గ్రంథాలు చదివాడు. ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికీ ఆత్మసాక్షాత్కారానికి మార్గమని భావించాడు. తమ విద్యార్థుల జ్ఞానతృష్ణని తమ చైతన్యంతోనూ, అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తిపరిచే గురువులు ప్రొ॥ స్పాండర్, ప్రొ॥ K.A.V. పండలై, ప్రొ|| నరసింగరావు గార్లు కలాంలోని ఆలోచనలను తీర్చిదిద్దారు.

ముఖ్యంగా ప్రొ॥ స్పాండర్ “దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భావి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు” అన్న మాటలు కలాం తన చిరకాల స్వప్నం సాధించడానికి ధైర్యాన్ని కల్గించాయి. ఈ విధంగా ఆయన చదువు గొప్పవాడు కావడానికి కారణమైతే, మార్గ నిర్దేశానికి గురువులే ప్రేరణ అయ్యారు.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

ప్రశ్న 3.
కలాం “ఒక తత్వవేత్త” అని నీకు తెలిసిన విధానంలో వివరింపుము.
జవాబు.
సామాన్య కుటుంబంలో పుట్టిన కలాం పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞానజిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ.
విద్యార్థి దశ నుండి చదువుపై జిజ్ఞాస కలిగిన కలాంకు “బంగారానికి తావి” చేకూరినట్లు ఉపాధ్యాయులు, ప్రొఫెసర్ల మార్గదర్శక మాటలు బంగారు బాటలు వేశాయి.

కలాంపై ఎక్కువ ప్రభావం చూపిన ‘ఇయదురై సోలోమోన్’ ఉపాధ్యాయుడిగా కలాంకు నూతన జీవితాన్ని అందించాడు. “ఏది కావాలంటే అది కాగలననే నమ్మకాన్ని కలాంకు ఆయన ఇచ్చాడు. త్యాగనిరతి ద్వారా ఆనందించే కంచి పరమాచార్య అనుచరులైన ప్రొ॥ తోతత్రి అయ్యంగార్, ప్రొ॥ సూర్యనారాయణ శాస్త్రిగార్లు కలాన్ని ప్రభావితం చేశారు.

విద్యార్థి దశలోనే ఇంగ్లీషు సాహిత్యాన్ని అవపోసనపట్టిన కలాంపై టాల్స్టాయ్, స్కాట్పోర్టీల రచనలు ప్రభావం చూపాయి. పెద్దలకే అంతుపట్టని తత్వశాస్త్ర గ్రంథాలు అలవోకగా చదివిన కలాం ఒక తత్వవేత్తగా మనకు దర్శనమిస్తాడు. భౌతికశాస్త్రం పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. “సైన్సు ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికీ, ఆత్మ సాక్షాత్కారానికి మార్గం” అని కలాం తెల్సుకున్నాడు”. ‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం” అన్న తండ్రిమాటలు కలాంకు ఉత్తేజాన్ని కల్గించాయి.

ఇలా ఎన్నో విధాలుగా ప్రేరేపితుడైన కలాం పెద్దలలో చిన్నవాడిగా చిన్నవారికి స్పూర్తినిచ్చే పెద్దవాడిగా దర్శనమిస్తాడు. కనుక కలాం ఒక గొప్ప తత్వవేత్త అని భావిస్తున్నాను.

ప్రశ్న 4.
ప్రేరణ పాఠంలో మీకు నచ్చిన విషయాలు వివరించండి.
జవాబు.
రామనాథపురంలో ఉన్న కాలంలో కలాం, సోలోమోన్ అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది. ఆయన మాటలు కలాంను ఎంతో ఆలోచింపచేసేవి. ఆయన మాటల్లో ముఖ్యంగా “జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాలి. అవి “కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం”.

గురువుగా ఆయన తన శిష్యుణ్ణి తీర్చిదిద్దిన తీరు నాకు నచ్చింది. అలాగే చదువు నిమిత్తం వెయ్యి రూపాయలు అవసరమైనపుడు తండ్రికి తలకు మించిన భారం అని బాధపడుతున్న సమయంలో కలాం సోదరి తన బంగారు గాజులు కుదువబెట్టి సాయం చేసిన విషయం నన్ను కదిలించింది.

ప్రొ|| స్పాండర్ వీడ్కోలు సభలో కలాం పట్ల చూపిన అభిమానం ‘నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకు భవిష్యత్తులో.. మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది” అన్న మాటలు కలాంలో ఉత్తేజాన్ని కల్గించాయి. ఈ విషయాలు మాకు నచ్చినవి.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

III. సృజనాత్మకత:

ప్రశ్న 1.
డా॥ ఎ.పి.జె అబ్దుల్ కలాం గారిని స్మరిస్తూ, ఒక చిన్న కవిత (5, 6 వాక్యాలు) రాయండి.
జవాబు.

కవితా నీరాజనం – స్మృత్యంజలి

మహాశయా!

నిరుపేదగ నీవు పుట్టావు
ఆకాశానికే గురి పెట్టావు
కలలను ఎన్నో కన్నావు
వాటినన్నీ సాధించావు !

గురువుల నీడన మసిలావు
లోకానికే వెలుగును పంచావు.
బిరుదులు ఎన్నో చేరాయి
వాటికే వన్నెలు వచ్చాయి !!

– కంచిభొట్ల ఫణిరామలింగేశ్వర శర్మ

IV. భాషాంశాలు:

పదజాలం:

ప్రకృతి – వికృతి

1. ప్రజ్ఞా – పల్లె, పగ్గియ (గర్వోక్తి) శాస్త్రము
2. శాస్త్రము – చట్టము
3. దృష్టి – దిస్టి
4. ఉపాధ్యాయుడు – ಒಜ್ಜ
5. వృద్ధ – పెద్ద
6. విజ్ఞానము – విన్నాణము
7. శ్రమ – చుమ్మ
8. జ్ఞానం – గేనం
9. విద్య – విద్దె
10. దిశా – దెస
11. రత్నము – రతనము
12. కథ – కత
13. గౌరవం – గారవం
14. కష్టము – కసటు
15. కాంక్ష – కచ్చు
16. ఆకాశం – ఆకసం
17. త్యాగము – చాగము
18. శిష్యుడు – సిసువుడు
19. పక్షి – పక్కి
20. ఆసక్తి – ఆసత్తి
21. శక్తి – సత్తి
22. శూన్యం – సున్న
23. శుక్ర – చుక్క
24. రేఖా – రేక
25. లక్ష్యం – లెక్క

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

నానార్థాలు:

ప్రశ్న 1.
పెద్ద = __________, __________
జవాబు.
వృద్ధుడు, జ్యేష్ఠుడు, గొప్పవాడు.

ప్రశ్న 2.
విధి = __________, __________
జవాబు.
ధాత, కాలం, పని, ఆజ్ఞ

ప్రశ్న 3.
వార్త = __________, __________
జవాబు.
వృత్తాంతం, సమాచారం, నడత

ప్రశ్న 4.
రేఖ = __________, __________
జవాబు.
హస్తరేఖ, గీత, అదృష్టం, వరుస

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
కృతకృత్యుడు =
జవాబు.
కృతకృత్యుడు = సఫలుడు అగుట
కలాం తన ఆశయ సాధనలో కృతకృత్యుడు అయినాడు.

ప్రశ్న 2.
జ్ఞానతృష్ణ =
జవాబు.
జ్ఞానతృష్ణ = తెలివికై ఆరాటం
విద్యార్థులు తమ జ్ఞానతృష్ణను గురువుల ద్వారా వృద్ధి చేసుకోవాలి.

ప్రశ్న 3.
ఆత్మవిశ్వాసం =
జవాబు.
ఆత్మవిశ్వాసం = నమ్మకం
ఏ పనినైనా ఆత్మవిశ్వాసంతో చేయాలి.

వ్యాకరణాంశాలు:

అ) భాషాభాగాలు గుర్తించండి.

ప్రశ్న 1.
కిరణ్కు కలెక్టర్ కావాలని కోరిక.
జవాబు.
నామవాచకం

ప్రశ్న 2.
ఆయనకు సుమారు ముప్ఫై యేళ్ళు.
జవాబు.
సర్వనామం

ప్రశ్న 3.
ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి.
జవాబు.
క్రియ

ఆ) సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

ప్రశ్న 1.
సుస్మిత బాగా చదివింది. డాక్టరు అయింది.
జవాబు.
సుస్మిత బాగా చదివి, డాక్టరు అయింది.

ప్రశ్న 2.
కలాం రాత్రింబవళ్ళు శ్రమించాడు, అనుకున్నది సాధించాడు.
జవాబు.
కలాం రాత్రింబవళ్ళు శ్రమించి, అనుకున్నది సాధించాడు.

ఇ) సంయుక్త వాక్యంగా మార్చండి.

ప్రశ్న 1.
గురువులు ప్రోత్సహించారు. శిష్యుడు లక్ష్యం చేరుకున్నాడు.
జవాబు.
గురువులు ప్రోత్సహించారు కాబట్టి శిష్యుడు లక్ష్యం చేరుకున్నాడు.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

పదాలు – అర్థాలు:

I.

అర్థాలు :
జిజ్ఞాసి = తెలిసికోవాలనే కోరిక కలవాడు
మేల్కొను = ముందు జాగ్రత్తపడు
జీవితావకాశాలు = జీవితంలో వచ్చే అవకాశాలు
ప్రత్యామ్నాయాలు = బదులుగా చేసే పనులు
ఔత్సాహికుడు = ఉత్సాహం కలవాడు
ఆదర్శపథము = ఆదర్శ మార్గం
నిర్దేశకుడు = ఉపదేశించేవాడు ; చూపించేవాడు
ఉదార = గొప్పదైన
దృక్పథము = ఆలోచనా సరణి
అనుబంధం = సంబంధం
గురుశిష్యబంధము = గురుశిష్యుల సంబంధం
సాహచర్యం = కలిసి ఉండడం
జీవిత గమనం = జీవితం నడవడి
ప్రభావితం = ప్రభావము పడినది
పట్టు = ఊత
ఆశ పెట్టుకోవడం = కోరిక కలిగి ఉండడం
సంభవించాలని = జరగాలని ; కలగాలని
ఆకాంక్షించాలని = కోరాలని
ప్రగాఢంగా = మిక్కిలి అధికంగా
విశ్వసించాలి = నమ్మాలి
అమితాసక్తి (అమిత+ఆసక్తి) = అంతులేని ఆసక్తి
స్పృహ = ఇచ్ఛ, కోరిక
విధిని = భాగ్యమును (విధి రాతను)
దృఢ సంకల్పం = గట్టి లక్ష్యము
ఇనుమడించింది = రెట్టింపు అయ్యింది
ప్రొఫెషనల్ చదువులు = వృత్తి విద్యలు
క్లుప్తంగా = సంక్షిప్తంగా
అదృశ్యం = కనబడనిది
కష్టార్జితం (కష్ట + ఆర్జితం) = కష్టంతో సంపాదింపబడినది
కంచి పరమాచార్య = కంచిలో గల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ (శంకర మఠం అధ్యక్షులు)

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

II.

అర్థాలు :
అనుచరులు = సహాయకులు
త్యాగనిరతి = దానము చేయుటయందు మిక్కిలి ఆసక్తి
కేంపస్ = ప్రాంగణం
దృశ్యం = చూడదగినది
ఉద్వేగభరితుణ్ణి = కలతతో నిండినవాణ్ణి
మక్కువ = ప్రేమ
సర్వశ్రేష్ఠకృతుల్ని = అన్నింటికంటె గొప్ప కావ్యాల్ని
అంశము = విషయం
విజ్ఞానశాస్త్ర పథం = సైన్సు మార్గం
భవిష్య అవకాశాలు = రాబోయే కాలంలో వచ్చే అవకాశాలు
సమాచారం = వార్త
సబ్జెక్ట్ (Subject) = విషయం
సాంకేతిక విద్య = యాంత్రిక విద్య’
తలమానికం = శిరోరత్నం
దరఖాస్తు = అభ్యర్ధన పత్రం
ఎంపిక = ఎన్నుకొను
ప్రతిష్టాత్మక సంస్థ = పేరుపొందిన సంస్థ
తలకు మించిన విషయం = తన వల్ల కాని విషయం
తోడు నిలబడింది = సహాయంగా నిలబడింది. (సాయం చేసింది)
కుదువబెట్టి = తాకట్టుపెట్టి
ఆకాంక్ష = గాఢమైన కోరిక
చలింపచేశాయి = కదిలించాయి
స్కాలర్షిప్ = ఉపకార వేతనం (Scholar. ship)
మిన్నగా = అధికంగా
ఆరాధిస్తూ = పూజిస్తూ (గౌరవిస్తూ)
ఏరోనాటికల్ ఇంజనీరింగు = విమానాలను నడపడానికి సంబంధించిన ఇంజనీరింగు
లక్ష్యం = గురి
సాధ్యము = సిద్ధి
నేపథ్యం = తెరవెనుక విషయము (పూర్వరంగం)
వైఫల్యాలు = ప్రయత్నము జయప్రదం కాకుండా పోవడం, (Failures)
ఆశాభంగాలు = కోరిక భగ్నం కావడాలు
ఉత్తేజకరము = ప్రేరణను ఇచ్చేది
వివేకి = విచారణ చేయువాడు
ప్రయోజన శూన్యం = ఉపయోగం లేనిది
ప్రతిభ = తెలివి
వ్యక్తిత్వం = వ్యక్తికి సంబంధించిన స్వభావం
ఆశయము = అభిప్రాయం
జ్ఞానతృష్ణ = జ్ఞాన సంపాదనమందు ఆసక్తి
చైతన్యం = జ్ఞానం (తెలివి)
ఉవ్విళ్ళూరించే = మిక్కిలి ఆశించే ; (త్వరపడే)
వ్యత్యాసము = భేదం
నిశిత బోధన = మెఱుగు పెట్టబడిన బోధన
ఏరోనాటిక్స్ = వైమానిక సంబంధమైనది
తృష్ణ = పేరాశ
జాగరితం = మేల్కొనడం
మేధాగరిమ = గొప్ప తెలివి .
సమగ్రత = సంపూర్ణం
బలోపేతం = బలంతో కూడినది
సమీకరింపబడటం = ఒకటిగా చేయబడటం
ఏరోప్లేన్ = విమానం (Aeroplane)
సమగ్రవంతం = సంపూర్ణము కావడం
సహకరించారు = సాయం చేశారు
కోర్సు (Course) = పాఠ్య ప్రణాళిక
డిజైన్ (Design) = నమూనా, ప్రణాళిక (Design)
ప్రగతి = అభివృద్ధి

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

III.

అర్థాలు :
సమీక్షించి = పరామర్శించి
పురోగతి = ముందుకు నడచుట
నిరాశాజనకం = నిరాశను పుట్టించేది
సాకులు = వంకలు
వ్యవధి = మేర, ఎడమ
భాగ్యరేఖ = అదృష్ట రేఖ
నిమగ్నుడు = మునిగినవాడు
కావిలించుకొని = ఆలింగనం చేసుకొని
ప్రశంసాత్మకంగా = పొగడబడే విధంగా
వెన్నుతట్టు = ధైర్యము చెప్పు
నెడుతున్నాను = గెంటుతున్నాను
ఆసక్తి = ఆపేక్ష
మార్గదర్శి = మార్గాన్ని చూపేవాడు
మహామేధావి = గొప్ప తెలివి కలవాడు
వీడ్కోలు = పోవడానికి అంగీకారం తెల్పడం
ఇంజన్ ఓవర్ హాలింగ్ = ఇంజన్ను పరిశుభ్రం చేయడం
ప్రాక్టికల్స్ (Practicals) = ప్రయోగాలు
ఉద్వేగాన్ని = కలతచెందిన మనస్సును
పసిగట్టడం = సూచనగా తెలిసికొను
డైనమిక్స్ = ఇది ఫిజిక్స్లో ఒక భాగం
అంశాలు = విషయాలు
బోధపడ్డాయి = అర్థమయ్యాయి
గ్రాడ్యుయేట్ (Graduate) = పట్టభద్రుడు
చిరకాల స్వప్నం = చాలాకాలం నుండి ఉన్న కల
ఉపాధి అవకాశాలు = బ్రతుకు తెరువుకు దారులు
ఆధ్వర్యం = పెత్తనం
కాల్టర్లు (Call letters) = రమ్మని పిలిచే ఉత్తరాలు
కోరమాండల్ తీరం = భారతదేశానికి తూర్పు వైపున క్రింది భాగాన ఉన్న సముద్ర తీరాన్ని కోరమాండల్ తీరం అంటారు.
కోరమాండల్ తీరబాలుడు అంటే తూర్పు సముద్ర తూర్పు తీరాన పుట్టిన ‘కలాం’ .

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

పాఠం ఉద్దేశం:

ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది. ఆ మహానీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగుతుంది. తద్వారా భావిభారతపౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకొంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయచరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

కవి పరిచయం:

కవి : డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్. పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలామ్.
కాలం : ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు.
రచనలు : “ఒక విజేత ఆత్మకథ” (ఇగ్నీటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ ఆటోబయోగ్రఫీ)
బిరుదులు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న
విశేషాంశాలు : సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించారు. దేశ, విదేశాలలోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయనను గౌరవించాయి.
గ్రంథము : ఈ పాఠ్యభాగం డా॥ అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీతో కలిసి రాసిన “ఒక విజేత ఆత్మకథ”లోనిది.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

ప్రవేశిక :

ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలుకన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్యసాధన ఎట్లా జరిగిందో చూద్దాం.

పాఠ్యభాగ సారాంశం:

‘ప్రేరణ’ పాఠ్యభాగం అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలామ్ అరుణ్ తివారితో వ్రాసిన “ఒక విజేత ఆత్మకథ” నుండి గ్రహింపబడినది.
అబ్దుల్ కలామ్ తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో సాధారణ గ్రామీణ కుటుంబంలో జన్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టినా కూడా ఎంతో పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తమ సేవలను భారతజాతికి అందించారు.

కలామ్ తన పదిహేనేళ్ళ వయస్సులో రామనాథపురంలో చదువుతున్నప్పుడు ఇయదురై సోలోమోన్ అనే ఉపాధ్యాయుడు కలామ్కు ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు.
జీవితంలో విజయం సాధించాలంటే “కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం” అనే మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుందని ఆయన చెప్పిన మాటల ప్రభావంతో తన ఆకాశయాన కోరికను నెరవేర్చుకున్నారు.

ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో ఇంగ్లీషు సాహిత్యం పట్ల, తత్వశాస్త్రం పట్ల మక్కువ ఏర్పరచుకుని వాటిని చదివేవారు. ఆ సమయంలో భౌతిక శాస్త్రంపై అమితాసక్తిని పెంచుకున్నారు. సైన్స్ మానవహృదయ వీధుల్లోంచి సాగిపోతుందని, తనకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగా ఉంటుందని చెప్పారు.

ఎమ్.ఐ.టిలో ప్రవేశం తన తండ్రికి తలకుమించిన భారమయితే సోదరి బంగారు వస్తువులను కుదువపెట్టి సహాయం చేయడంతో చలించిపోయిన కలామ్ తన సోదరి సహకారాన్ని మరువకుండా కష్టపడి చదువుకుని స్కాలర్షిప్కు ఎంపికయ్యారు.
పక్షిలా విహరించాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ప్రొ. స్పాండర్, ప్రొ.కె.ఏ.వి. పండలై, ప్రొ. నరసింగరావు గారు అను అధ్యాపకుల ప్రతిభా సంపత్తిని ఆకళింపు చేసుకున్నారు.

ప్రొ. శ్రీనివాస్ అప్పగించిన ఏరోడైనమిక్ డిజైనింగ్ సకాలంలో పూర్తిచేసి ఆయన ప్రశంసలందుకున్నారు. తాను వ్రాసిన “మన విమానాన్ని మనమే తయారుచేసుకుందాం” అనే వ్యాసానికి ప్రఖ్యాత తమిళ సంపాదకుడు దివాన్ చేతుల మీదుగా మొదటి బహుమతిని అందుకున్నారు.

గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ హెచ్.ఎ.ఎల్ నుండి బయటకు రాగానే ఆయనకు లభించిన వైమానిక దళ ఉద్యోగం, రక్షణ మంత్రిత్వశాఖ ఉద్యోగం ఆయన తనజీవిత లక్ష్య సాధనలో ఏ విధంగా కృతకృత్యుడయ్యారో తెలుపుతాయి. “ఇతరుల్ని అర్థం చేసుకున్నవాని కన్నా, తనను తాను తెలుసుకున్న వాడే వివేకి” అన్న తండ్రి మాటలకు కలామ్ ఏ విధంగా ఉత్తేజితులై ఆచరించారనే దానికి ఆయనకు లభించిన ఖ్యాతే నిదర్శనం.

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ

నేనివి చేయగలనా?

TS 7th Class Telugu Guide 6th Lesson ప్రేరణ 1

Leave a Comment