TS 7th Class Telugu Grammar Questions and Answers

Telangana SCERT 7th Class Telugu Study Material Telangana Pdf తెలుగు వ్యాకరణం Questions and Answers.

TS 7th Class Telugu Grammar Questions and Answers

వ్యాకరణం – ముఖ్యాంశాలు:

I. 1) ధ్వని అంటే చప్పుడు, శబ్దం.
2) భాషాధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టిక వర్ణమాల లేక అక్షరమాల.
3) ‘అ’ అనేది ఒక అక్షరం. ఇందులో ఒక ధ్వని ఉంది.
4) ‘మ’ లో రెండు ధ్వనులున్నాయి. మ్ + అ = మ
5) ‘మ్మ’ లో మూడు ధ్వనులున్నాయి. మ్ + మ్ + అ : మ్మ
6) ‘మ్య’లో మూడు ధ్వనులున్నాయి. మ్ + య్ + అ = మ
7) ష్ట్రలో నాలుగు ధ్వనులున్నాయి. ష్ + ట్ + ర్ + అ = ష్ట్ర
8) అ, ఆ, ఇ, ఈ మొదలైన ఒక ధ్వనిని తెలిపే అక్షరాలను అచ్చులు అంటారు. ‘అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ’ లు అచ్చులు.
9) ‘మ’ వంటి రెండు ధ్వనులున్న అక్షరాలు హల్లులు. (‘మ్’ అనేది హల్లు, ‘అ’ అనే అచ్చుతో కలిసింది.
1. క ఖ గ ఘ ఙ / 2. చ ఛ జ ఝ ఞ / 3. ట ఠ డ ఢ ణ / 4. త థ ద ధ న / 5. ప ఫ బ భ మ 6. య ర ల వ / శ ష స హ | ళ క్ష ఱ అనేవి హల్లులు.
10) ఒకే హల్లు రెండుసార్లు వచ్చి అచ్చుతో కలిసిన దాన్ని ద్విత్వాక్షరం అంటారు.
ఉదా : ‘మ్మ’
11) ఒక హల్లు మరో హల్లుతో చేరి అచ్చు కలిస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు.
ఉదా : ‘మ్య’.
12) రెండు కంటె ఎక్కువ హల్లులు ఒక అచ్చుతో కలిస్తే సంక్లిష్టాక్షరం అంటారు.
ఉదా : ష్ట్ర
13) ‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలను ఐదు వర్గములుగా విభజించారు.
క ఖ గ ఘ ఙ – క వర్గం
చ ఛ జ ఝ ఞ – చ వర్గం
ట ఠ డ ఢ ణ – ట వర్గం
త థ ద ధ న – త వర్గం
ప ఫ బ భ మ – ప వర్గం
14) ‘c, o, ః’ (అరసున్న, సున్న, విసర్గ) ఉభయాక్షరాలు. ఇవి అచ్చుల పక్కన హల్లుల పక్కన కూడా చేరతాయి.
15) అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని రెండు విధాలు.
16) ఒక మాత్ర (అంటే రెప్పపాటు) కాలంలో పలికేవి హ్రస్వాలు – అ ఇ ఉ ఋ ఎ ఒ
17) రెండు మాత్రల కాలంలో పలికేవి దీర్ఘాలు – ఆ ఈ ఊ ౠ ఏ ఐ ఓ ఔ

TS 7th Class Telugu Grammar Questions and Answers

18) ఉచ్చారణను బట్టి హల్లుల విభాగాలు :
1. కఠినంగా పలికే ధ్వనులు పరుషాలు = క చ ట త
2. సరళంగా పలికే ధ్వనులు సరళాలు = గ జ డ ద బ
3. ప్రతి వర్గంలోని 2, 4 అక్షరాలకు వర్గయుక్కులు అని పేరు. “ఖ ఘ ఛ ఝ ప్రాణాలనీ పేరు. తక్కిన హల్లులు అల్ప ప్రాణాలు.
4. ప్రతి వర్గంలోని ఐదవ అక్షరాలకు అనునాసికాలు అని పేరు. “జ ఞ ణ న మ”
5. య ర ల వ లకు అంతస్థులు అని పేరు.
6. శ ష స హ లకు ఊష్మములు అని పేరు.

II. 1) పేరును తెలిపే పదం నామవాచకం.
2) పేరుకు బదులుగా వాడే పదం సర్వనామం.
3) నామ వాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం.
4) పనిని తెలిపే మాట క్రియ.
5) లింగ విభక్తి వచనముల వల్ల ఏ మార్పూ పొందని పదం అవ్యయం.
పై ఐదింటిని భాషాభాగాలు అంటారు.

6) క్రియ కలిగి ఉన్నా, లేకున్నా, ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలు సామాన్య వాక్యాలు.
ఉదా : 1) రాముడు అన్నం తిన్నాడు.
2) నందుడు మంచి బాలుడు.

7) ఒక సమాపక క్రియ, ఒకటిగాని, అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్న వాక్యాలను సంక్లిష్ట వాక్యాలు అంటారు.
ఉదా : మాధవి బాగా చదివి, ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ;
సుజిత్ బజారుకి వెళ్ళి, కూరగాయలు కొన్నాడు;
మాధురి తోటకు వెళ్ళి పువ్వులు కోసింది.

8) రెండు సమాన ప్రాధాన్యమున్న వాక్యాలను కలపడం వల్ల ఏర్పడేవి సంయుక్త వాక్యాలు.
ఉదా : 1) కల్పన పాడుతుంది, నాట్యం చేస్తుంది.
2) అతడు నటుడు, రచయిత.

TS 7th Class Telugu Grammar Questions and Answers

సంధులు

III. 1) రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం సంధి. రెండు స్వరాల కలయిక సంధి. రామ, అయ్య అనే పదాలు కలిసి రామయ్య అనే పదం ఏర్పడడం సంధి.
2) కలిసినపప్పుడు జరిగే మార్పు సంధికార్యం.
3) మొదటి పదంలో చివరి అక్షరంలోని స్వరాన్ని పూర్వస్వరం అంటారు.
4) రెండవ పదంలోని మొదటి అక్షరాన్ని పరస్వరం అంటారు.
రామ + అయ్యలో ‘మ’ పూర్వస్వరం అయ్యలో ‘అ’ పరస్వరం.

IV. అత్వసంధి:

1) ‘అత్వం’ అంటే హ్రస్వమైన ‘అ’
2) మొదటి పదంలోని చివరి స్వరమైన ‘అ’, రెండవ పదంలోని మొదటి స్వరంతో కలిసినప్పుడు ఏర్పడేది అత్వసంధి.
సూత్రం : అత్తునకు సంధి బహుళము.
ఉదా : రామ + అయ్య = రామయ్య ;
చిన్న + అమ్మ = చిన్నమ్మ ;
చింత + ఆకు = చింతాకు

V. ఇత్వసంధి:

1) ఇత్వం అంటే హ్రస్వమైన ‘ఇ’
2) మొదటి పదంలోని చివరి స్వరమైన ‘ఇ’ రెండవ పదం మొదట ఉన్న స్వరంతో కలిసినపుడు ఏర్పడేది ఇత్వసంధి.
సూత్రం : ఏమ్యాదులలో ఇత్తునకు సంధి వైకల్పికముగా అవుతుంది.
ఉదా : ఏమి + అంటివి = ఏమంటివి ;
ఏమి + అది = ఏమది
3) రెండు పదాల మధ్య సంధి జరుగక పోతే పూర్వపరస్వరాల మధ్య ‘య్’ అనునది ఆగమంగా వస్తుంది.
ఉదా : మా + అమ్మ = మాయమ్మ
4) ఇలా సంధి జరుగవచ్చు. జరగకుండా ఉండవచ్చు అన్న నియమానికి వైకల్పికం అని పేరు.

VI. ఉత్వసంధి:

1) ఉత్వం అంటే హ్రస్వమైన ‘ఉ’
2) హ్రస్వ ఉకారానికి అచ్చు కలిసినపుడు ‘ఉ’ లోపించి పరస్వరం కనిపిస్తుంది. ఇదే ఉత్వసంధి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
ఉదా : అతడు + అడిగాడు = అతడడిగాడు ;
మనము + ఉన్నాము = మనమున్నాము
వారు + అంతా = వారంతా

VII. సవర్ణదీర్ఘ సంధి :

1) సవర్ణాలంటే ఒకేరకమైన అక్షరాలు.
2) మొదటి పదం చివర, రెండవ పదం మొదట ఒకే రకమైన అచ్చులుంటే అటువంటి దీర్ఘమే వస్తుంది.
సూత్రం : అ ఇ ఉ ఋలకు సవర్ణమైన అచ్చులు పరంగా ఉంటే వాని దీర్ఘము ఏకాదేశముగా వచ్చును.
అ/ ఆ + అ/ ఆ = ఆ / ఇ / ఈ + ఇ / ఈ = ఈ / ఉ / ఊ + ఉ / ఊ – ఊ | ఋ | ౠ + ఋ | ౠ = ౠ
ఉదా : రామ + ఆలయం = రామాలయం ; మహా + ఆత్మ = మహాత్మ ; గౌరీ + ఈశ = గౌరీశ.

TS 7th Class Telugu Grammar Questions and Answers

సమాసాలు

కింది వాక్యాలు చదువండి.
అ. మాకు దేశభక్తి ఉన్నది. ఆ. సురేశ్ వేసుకున్నది తెల్లచొక్క
ఇ. లక్ష్మీపతి దయ నాపై ఉన్నది.
ఈ. ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు.
ఉ. పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది.
ఊ. మాధవునికి పది ఎకరాల పొలం ఉన్నది.

పై వాక్యాల్లో గీతగీసిన పదాల అర్థాలను గమనించండి.
దేశభక్తి – దేశమునందు భక్తి
తెల్లచొక్క – తెల్లనైన చొక్క
లక్ష్మీపతి – లక్ష్మియొక్క పతి
గురుదక్షిణ – గురువుకొరకు దక్షిణ
కూరగాయలు – కూర మరియు కాయ
పది ఎకరాలు – పది సంఖ్యగల ఎకరాలు

పై పదాల్లో వేరేరు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా !
ఈ విధంగా అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తపదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు.

సమాసంలో మొదటి పదాన్ని – పూర్వపదం’ అని, రెండవ పదాన్ని – ఉత్తరపదం’ అనీ అంటారు. సమాసంలో ఉండే పదాల, అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు (పేర్లు) ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాం.

VIII. ద్వంద్వ సమాసం :

కింది వాక్యాన్ని పరిశీలించండి.
“గురుశిష్యుల బంధం చాలా గొప్పది”.
ఈ వాక్యంలో గురుశిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు, శిష్యుడు అని. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇందులో గురువు, శిష్యుడు ఇద్దరూ ముఖ్యులే. ఇట్లా రెండుకాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యంగల పదాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వసమాసం అంటారు.
ఉదా : అన్నదమ్ములు, తల్లిదండ్రులు, సీతారాములు, కూరగాయలు

IX. ద్విగు సమాసం :

సమాసంలోని మొదటి పదం సంఖ్య (అంకె)ను తెలియజేస్తే అది ద్విగు సమాసం.
ఉదా : మూడు కన్నులు – మూడు సంఖ్య గల కన్నులు
పంచపాండవులు – ఐదు సంఖ్యగల పాండవులు
దశదిశలు – పది సంఖ్యగల దిక్కులు
నవరాత్రులు – తొమ్మిది సంఖ్యగల రాత్రులు

TS 7th Class Telugu Grammar Questions and Answers

విభక్తి ప్రత్యయాలు:

X. 1) వాక్యాలలోని పదాల మధ్య సంబంధాన్ని సూచించే అక్షరాలను లేక పదాలను విభక్తి ప్రత్యయాలు అంటారు.
2) కింది వాక్యాలను గమనించండి.
అ) భారత్ ఆరు వికెట్లతో కప్ గెలిచింది.
ఆ) సమాజంలో అవసరమున్నవాళ్లకు సేవచేయడమే సమాజసేవ.
ఇ) అనారోగ్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ) లంక సింహాలు తోక ముడిచాయి.
ఉ) సచిన్ గురించి నీకు తెలిసిన విషయాలు ఏమిటి.

పై వాక్యాల్లో గీతగీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి.
ఉదా : భారత్ ఆరు వికెట్ల కప్ గెలిచింది.

ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా అనిపిస్తుంది. ‘ఆరువికెట్ల కప్’ అనేది ఉండదు. ఇప్పుడు ‘తో” అనే ప్రత్యయం ఉపయోగించి చదవండి. ‘భారత్ ఆరు వికెట్లతోకప్ గెలిచింది’. ఇలా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను లేదా పదాలను “విభక్తులు’ అంటారు.

ప్రత్యయాలు

 విభక్తులు

అ. డు, ము, వు లు  ప్రథమా విభక్తి
ఆ. ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి  ద్వితీయా విభక్తి
ఇ. చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్)  తృతీయా విభక్తి
ఈ. కొఱకు(న్),కై  చతుర్థీ విభక్తి
ఉ. వలన(న్), కంటె(న్), పట్టి  పంచమీ విభక్తి
ఊ. కి(న్), కు(న్), యొక్క లో(న్), లోపల(న్)  షష్ఠీ విభక్తి
ఎ. అందు(న్), న(న్)  సప్తమీ విభక్తి
ఏ, ఓ, ఓరి, ఓయి, ఓసి  సంబోధన ప్రథమా విభక్తి

 

Leave a Comment