AP Inter 2nd Year Zoology Notes Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

→ అంతస్రావక వ్యవస్థ దేహంయందు రసాయనాలను సమన్వయ పరిచే వ్యవస్థ. దీనియందు అంతస్రావక గ్రంధులు, వాటి హార్మోనులు మరియు వాటి యొక్క చర్యా విధానాలు ఉంటాయి.

→ అంతస్రావక గ్రంధులు హార్మోనులను స్రవిస్తాయి.

→ హార్మోనులు అనేది రసాయిన వాహకాలు, ఇవి నేరుగా రక్తంలోకి విడుదల చేయబడతాయి.

→ హార్మోనులు దేహం యందు నిర్మాణాత్మక మరియు శరీరధార్మిక మార్పులను కలుగజేస్తాయి.

AP Inter 2nd Year Zoology Notes Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

→ పిట్యూరి గ్రంధి ఇతర గ్రంధుల యొక్క క్రియలను నియంత్రిస్తుంది. కావున దీనిని ప్రధాన గ్రంధి అంటారు.

→ ‘ఆక్రోమెగాలి’ అనేది హార్మోనులు అపస్థితి పిట్యూటరి గ్రంధి పెరుగుదల హార్మోను అధికంగా స్రవించటం వలన ఈ అపస్థితి ఏర్పడుతుంది.

→ ‘వాసోప్రెస్సిన్’ యొక్క అల్పస్రావం వలన ‘డయాబెటిస్ ఇన్సిపిడస్’ అనే అపసవ్యత ఏర్పడుతుంది.

→ ‘ఇన్సులిన్’ యొక్క అల్పోత్పత్తి కారణంగా ‘డయాబెటిస్ మెల్లిటస్’ అనే అపసవ్యత ఏర్పడుతుంది.

→ ‘ఇన్సులిన్ షాక్’ అనేది ఇన్సులిన్ యొక్క అధికస్రావం వలన కలుగుతుంది. [IPE]

→ ‘ఎఫినెఫ్రిన్’ మరియు ‘నార్ఎపినెఫ్రిన్’ (లేదా) ‘నార్ ఎడ్రి నాలిన్’ హార్మోనులను ‘పోరాట’ (లేదా) ‘పలాయన’ హార్మోనులు అంటారు. [IPE]

→ హైపోథైరాయిడిజమ్ అనే అపస్థితి థైరాయిడ్ హార్మోనులైన T, & T, ఉత్పత్తి తగ్గినపుడు ఏర్పడుతుంది. [IPE]

→ హైపర్ థైరాయిడిజమ్ అనే అపస్థితి థైరాయిడ్ హార్మోనులైన T, & T ఉత్పత్తి అధికమైనపుడు ఏర్పడుతుంది. [IPE]

AP Inter 2nd Year Zoology Notes Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

→ థైరాయిడ్ ప్రేరక హార్మోన్ (TSH) థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణ మరియు విడుదలకు తోడ్పడుతుంది. [IPE]

→ ‘అడిసన్స్ వ్యాధి’, అడ్రినల్ వల్కలం స్రవించే గ్లూకోకార్టికాయిడ్ల అల్పోత్పత్తి వలన కలుగుతుంది. [IPE]

→ కుషింగ్స్ సిండ్రోమ్ అపస్థితి అడ్రినల్ వల్కలం స్రవించే కార్టిసాల్ (లేదా) ఇతర గ్లూకోకార్టికాయిడ్ల అధికోత్పత్తి వలన కలుగుతుంది. [IPE]

Leave a Comment