TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

Telangana SCERT 6th Class Telugu Study Material Telangana ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి Textbook Questions and Answers.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
“తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు” – విశ్లేషించండి.
జవాబు.
తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు. ఆట, పాట, భాష, యాస, ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి. రైతులు, వివిధ వృత్తులవారు ఒకరికొకరు సహకరించుకుంటూ బతికేవాళ్ళు. పల్లెల్లో ప్రజలంతా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఊరిమీది చెరువుతో, ఊరి కింది వాగుతో వారు సహజీవనం చేసేవారు. వివిధ కులాలవారు తమ వృత్తికి సంబంధించిన వస్తువులు తయారుచేసేవారు. వస్తుమార్పిడి జరిగేది. రైతు పండించిన పంటలో అందరికీ భాగం దక్కేది. పండుగలు, జాతరలు, పెండ్లిండ్లకు అన్ని వృత్తులవారి భాగస్వామ్యం ఉండేది. ప్రతి పండుగలో పాట ఒక భాగమైపోయేది. పాట లేని పండుగలు, వేడుకలు తెలంగాణలో లేనేలేవు.

ప్రశ్న 2.
‘కొత్త పండుగ’ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం – దీన్ని వివరించండి.
జవాబు.
“కొత్తంత పండుగ లేదు – అత్తంత ఆత్మ లేదు” – అన్నది తెలంగాణలో ఒక సామెత. పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ ‘కొత్త’. వడ్లను దంచి, కొత్తబియ్యం తీసి, వండి, పదిమందిని పిలిచి, కడుపునిండా భోజనం పెట్టి పంపడమే కొత్త పండుగ. ఏడాదిలో రెండుసార్లు పంటను తీస్తారు కాబట్టి కొత్త పండుగను రెండుసార్లు చేసుకుంటారు.
ఐదురకాల కూరలతో కుటుంబ సభ్యులేకాక ఇంటి చుట్టుపక్కల వాళ్లతో బంతికూర్చుండి విస్తరినిండా అన్నం పెట్టుకుని ‘అవ్వా తింటున్న, అక్కా తింటున్న, నాయినా తింటున్నా’ అనుకుంటూ పేరుపేరున అందరికీ చెప్పి మారన్నం పెట్టుకుని కడుపునిండ తినే ‘కొత్త పండుగ’ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం.

ప్రశ్న 3.
‘సాగువాటు’ గురించి రాయండి.
జవాబు.
“సాగువాటునాడు సాగకపోతే
సాలంతా ఆగిపోతది” అంటారు పెద్దలు.

సాగువాటు అంటే రైతు వ్యవసాయం పనులు మొదలుపెట్టేరోజన్నమాట. దీన్ని ఏరువాక (ఏరొంక) పండుగ అని కూడా అంటారు. రైతు వ్యవసాయం పని చేయని రోజంటూ ఉండదు. కాని సంవత్సరంలో ఒక మంచిరోజు చూసుకొని నాగలికట్టి నాలుగుసాళ్లు దున్ని పారతో నాలుగుసార్లు తవ్వి భూదేవతకు మొక్కుకుంటాడు. సాగువాటు అనేది రైతు జీవితంలో ఒక భాగంగా పల్లె సంస్కృతికి అద్దం పడుతుంది.

ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయ పద్ధతులు మారాయి. కాని ఇంతకుముందు రోజుల్లోనైతే సాగువాటు భక్తి శ్రద్ధలతో చేసుకునే శుభకార్యం.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

ప్రశ్న 4.
తెలంగాణ ‘ఆటపాటల’ గురించి రాయండి.
జవాబు.
పల్లెల్లో ఆటపాటలు విభిన్నంగా ఉండేవి. గోటీలు, చిర్రగోనె, కబడ్డి, గుడ్డిరాజు, ఓమనగుంటలు, గచ్చకాయలు, తొక్కుడుబిళ్ళ, పరమపదసోపానపటం, పచ్చీసు, అష్టాచెమ్మ, మట్టికుప్పలు, రేసు, కాశపుల్ల, దాల్దడి దస్సన్నపొడి వంటి ఆటలతో శారీరక దారుఢ్యమే కాదు మానసిక ఎదుగుదల ఉండేది. కలిసి ఆడటం వలన స్నేహం బలపడేది. జీవితంలో పోటీతత్వం పెరిగేది.

బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా, చప్పట్లు వంటి ఆటల్లో పాటలు కూడా ఉండేవి. పాటను ఆటను కలిపి లయబద్ధంగా ఆడిపాడటంలో సంగీతం, సాహిత్యాల్లో ప్రవేశం లభించేది. గ్రహణశక్తి పెరిగేది. పాటల ద్వారా మంచి విషయాలు, చరిత్ర తెలిసేది. ఆలోచనా పరిధి విస్తరించేది. తరం నుంచి తరానికి ఆచార వ్యవహారాలు తెలిసేవి. భాషాపరిజ్ఞానం అలవడేది.

ప్రశ్న 5.
‘కుటుంబ సంస్కృతి’ గురించి రాయండి.
జవాబు.
పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. ఇండ్లు పెద్దగా ఉండేవి. కొందరి ఇండ్లల్లో దేవుని అర్ర, మన్సాల (మొగసాల), గరిషె అర్ర, బంకులు, వంటిల్లు అని వేరువేరు గదులుండేవి. ధాన్యాన్ని నిలువ చేయటానికి గరిషె అర్రను ఉపయోగించేవారు. ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, నాయినమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, పెద్దనాయినలు, చిన్నాయినలు, అత్తమ్మలు, మామయ్యలు అందరు కలిసి ఒకేచోట ఉండేవారు. కుటుంబ పెద్దగా అవ్వనో నాయననో ఉండేవారు.

ఎవరు ఏంపని చెయ్యాలన్నది చెప్పేవారు. చిన్నపిల్లల్ని పొద్దంతా పట్టుకుని ఉండడానికి ఇంట్లో అవ్వనో తాతనో ఉండేవారు. వాళ్లు పిల్లలకు ఆటలు, కథలు, పాటలు నేర్పేవారు. రామాయణం, భారతం వంటి పురాణాల్లోని కథలతో నీతిబోధ చేసేవారు. తప్పు ఒప్పులను వివరించి చెప్పేవారు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

చదువడం – అవగాహన చేసుకోవడం.

I. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు. ఆట, పాట, భాష, యాస, ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి. రైతులు, వివిధ వృత్తులవారు ఒకరికొకరు సహకరించుకుంటూ బతికేవాళ్ళు. పల్లెల్లో ప్రజలంతా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఊరిమీది చెరువుతో, ఊరి కింది వాగుతో వారు సహజీవనం చేసేవారు. వివిధ కులాలవారు తమ వృత్తికి సంబంధించిన వస్తువులు తయారుచేసేవారు. వస్తుమార్పిడి జరిగేది. రైతు పండించిన పంటలో అందరికీ భాగం దక్కేది. పండుగలు, జాతరలు, పెండ్లిండ్లకు అన్ని వృత్తులవారి భాగస్వామ్యం ఉండేది. ప్రతి పండుగలో పాట ఒక భాగమైపోయేది. పాటలేని పండుగలు, వేడుకలు తెలంగాణలో లేనేలేవు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మలు ఏవి ?
జవాబు.
తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు.

ప్రశ్న 2.
ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నవి ఏవి ?
జవాబు.
ఆట, పాట, భాష, యాస ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నవి.

ప్రశ్న 3.
పల్లెల్లో ప్రజలంతా దేని మీద ఆధారపడి జీవించేవారు ?
జవాబు.
పల్లెల్లో ప్రజలంతా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు.

ప్రశ్న 4.
రైతు పండించిన పంటలో ఎవరికి భాగం ఉండేది ?
జవాబు.
రైతు పండించిన పంటలో ఆ పల్లె ప్రజలందరికీ భాగం ఉండేది.

ప్రశ్న 5.
పాట దేనిలో భాగమైపోయేది ?
జవాబు.
ప్రతి పండుగలో పాట భాగమై పోయేది.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

II. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చెరువు నీళ్లను పొలాలకు సమంగ పంచడానికి ‘పెద్ద నీరటికాడు’ ఉండేవాడు. ఇతడు తూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు. ఒక్కొక్క కాలువకు ఒక నీరటివాడు ఉండేవాడు. అతడు కాలువల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు. వీరిద్దరు కలిసి నీటిచుక్కను కూడా వృథా పోనీయకుండా పంటచేలకు ఉపయోగించేవారు. ‘పెద్దనీరటికాడు’ పదవి వంశపారంపర్యంగా వచ్చేది కాని చిన్ననీరటిగాళ్లను ఆయా పొలాల రైతులే నియమించుకునేవారు.

ఈ నీరటికాళ్ళు వడ్ల కల్లాలమీద రైతులదగ్గర వడ్లను ఎరంగా తీసుకునేవారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
‘పెద్దనీరటికాడు’ ఏమి చేసేవాడు ?
జవాబు.
‘పెద్దనీరటికాడు’ చెరువు నీళ్ళను కాలువలకు సమంగా పంచేవాడు.

ప్రశ్న 2.
కాలువల్లోని నీటిని పొలాలకు సమంగా పంచేవాడిని ఏమంటారు ?
జవాబు.
కాలువల్లోని నీటిని పొలాలకు సమంగా పంచేవాడిని ‘నీరటికాడు’ అంటారు.

ప్రశ్న 3.
చిన్ననీరటికాడు అంటే ఎవరు ?
జవాబు.
ఒక్కొక్క కాలువకు ఒక నీరటికాడు ఉంటాడు. అతనినే చిన్ననీరటికాడు అంటారు.

ప్రశ్న 4.
పెద్దనీరటికాడు, చిన్ననీరటికాడు కలిసి ఏమి చేసేవారు ?
జవాబు.
పెద్దనీరటికాడు, చిన్ననీరటికాడు కలిసి నీటిచుక్కను కూడా వృథా పోనీయకుండా పంటచేలకు ఉపయోగించేవారు.

ప్రశ్న 5.
వంశపారంపర్యంగా వచ్చే పదవి ఏది ?
జవాబు.
‘పెద్దనీరటికాడు’ పదవి వంశపారంపర్యంగా వచ్చేది.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

III. కింది పేరాను చదువండి. అయిదు ప్రశ్నలు తయారుచేయండి.

పల్లెల్లో ప్రజలు నాటకాలు, యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, చిందుబాగోతాలతో కాలక్షేపం చేసేవారు. వీటితో ప్రజలకు మంచి సందేశం అందేది. రాత్రంత మెలకువతో ఉండి నాటకాలు, బాగోతాలు చూసేవారు. ఎండకాలం వచ్చిందంటే చాలు ఏ చెట్టుకిందనో, కూలిన గోడలమధ్యనో బాగోతాలు ఆడేవారు. ఆ పాటలు విన్న పిల్లలు మరునాడు ఏ చూరుకిందనో అరుగులమీదనో అదే పాటలతో ఆటలను ఆడేవారు. ఇప్పుడు ఇంటింటా టీవీలు, సినిమాలు వచ్చాయి. టీవీల్లో అసభ్య సన్నివేశాలతో సీరియళ్లు వస్తున్నాయి. అవి మనుషుల్లో జుగుప్సను, దురాలోచనలను పెంచుతున్నాయి. కారణాలు ఏవైనా పల్లె సంస్కృతి కనుమరుగైపోతున్నది. ఆపదయిన, ఆనందమైనా సమష్టిగా పంచుకునే జనం ఎవరికివారుగ విడిపోతున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉన్నది.
జవాబు.
ప్రశ్నలు తయారుచేయుట :

  1. పల్లెల్లో ప్రజలు ఎట్లా కాలక్షేపం చేసేవారు ?
  2. బాగోతాలు ఏ కాలంలో ఆడేవారు ?
  3. బాగోతాలు చూసిన పిల్లలు ఏం చేసేవారు ?
  4. టీవీల్లో అసభ్య సన్నివేశాలు ఏమి పెంచుతున్నాయి ?
  5. ఇప్పుడు ఇంటింటా ఏమి వచ్చాయి ?

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

IV. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

“కొత్తంత పండుగ లేదు – అత్తంత ఆత్మ లేదు” – అన్నది తెలంగాణలో ఒక సామెత. పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ ‘కొత్త’. వడ్లను దంచి, కొత్తబియ్యం తీసి, వండి, పదిమందిని పిలిచి, కడుపునిండా భోజనం పెట్టి పంపడమే కొత్త పండుగ. ఏడాదిలో రెండుసార్లు పంటను తీస్తారు. కాబట్టి కొత్త పండుగను రెండుసార్లు చేసుకుంటారు.

యాసంగి కొత్తకు కూరగాయలు కరువు
వానకాలం కొత్తకు పచ్చటాకులు కరువు అంటారు.

యాసంగి పంట ఏప్రిల్, మే నెలల్లో చేతికి వస్తుంది కాబట్టి అప్పుడే కొత్తను పెట్టుకుంటారు. అప్పుడు నీళ్ళులేక కూరగాయలు దొరుకవు కాని మోదుగాకులు దొరికి పచ్చటి విస్తర్లకు కరువుండదు. వానకాలంలో కూరగాయలు దొరుకుతాయి. కాని పచ్చటి మోదుగు ఆకులు దొరకక విస్తరాకులకు కరువుంటుంది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
యాసంగి పంట ఏ నెలల్లో చేతికి వస్తుంది ?
జవాబు.
ఏప్రిల్, మే నెలలు

ప్రశ్న 2.
మోదుగాకులు దొరికే కాలంలో ఏమి దొరుకవు ?
జవాబు.
కూరగాయలు

ప్రశ్న 3.
మోదుగాకులు ఏ కాలంలో దొరుకవు ?
జవాబు.
వానకాలం

ప్రశ్న 4.
పదిమందిని పిలిచి భోజనం పెట్టే పండుగ ?
జవాబు.
కొత్త పండుగ

ప్రశ్న 5.
అత్తంత …………… లేదు.
జవాబు.
ఆత్మ

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

V. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఇప్పుడు కడుపునిండ తిండి దొరుకుతున్నది కాబట్టి ఆకలి విలువ, అన్నం విలువ మనకు తెలియడం లేదు కాని కడుపునిండ అన్నం దొరకని కాలంలో ప్రజలకు ‘కొత్త’ ఒక పెద్ద పండుగనే ఐదురకాల కూరలతో కుటుంబ సభ్యులేకాక ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో బంతికూర్చుండి విస్తరినిండా అన్నం పెట్టుకొని ‘అవ్వా తింటున్న, అక్కా తింటున్న, నాయినా తింటున్న’ అనుకుంటూ పేరు పేరున అందరికీ చెప్పి మారన్నం పెట్టుకుని కడుపునిండ తినే ‘కొత్త పండుగ’ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం.

కొందరైతే కొత్తనాడు తప్పకుండా చేపల పులుసు వండుకుంటారు. కుండను దేవుడిగా పూజించే సంస్కృతి కూడా తెలంగాణలో ఉన్నది. పండుగలకు, శుభకార్యాలకు ‘కూరాడు’ పేరుతో కుండను పూజిస్తారు. కొత్త ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మట్టికుండతో కూరాడును నిలుపుకుంటారు. ‘కొత్త’ నాడు ఈ కూరాడుకు ఒక ప్రత్యేకత ఉన్నది. కూరాడును కడిగి పూదిచ్చి బంతి పూలదండు కట్టి కొత్త అన్నాన్ని నైవేద్యం పెడుతారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
కడుపు నిండ తిండి దొరికినపుడు వేటి విలువ తెలియదు ?
జవాబు.
ఆకలి విలువ, అన్నం విలువ

ప్రశ్న 2.
తెలంగాణ సంస్కృతిలో భాగమైనది ?
జవాబు.
కొత్త పండుగ

ప్రశ్న 3.
కొత్తనాడు తప్పకుండ వండే వంట ఏది ?
జవాబు.
చేపల పులుసు

ప్రశ్న 4.
శుభకార్యాలకు ఏ పేరుతో కుండను పూజిస్తారు ?
జవాబు.
కూరాడు

ప్రశ్న 5.
కొత్త ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళినపుడు దేనిని నిలుపుతారు ?
జవాబు.
మట్టికుండతో కూరాడు

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

VI. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఆనాటి కాలంలో కులవృత్తులన్ని వ్యవసాయానికి అనుబంధంగా ఉండేవి. రైతుకు కావలసిన నాగండ్లను, గొర్రులను,ఇతర కర్ర పనిముట్లను వడ్రంగివాళ్ళు తయారుచేసి ఇచ్చేవారు. కర్రు, కొడవలి, పార, గడ్డపార, బండి కమ్ములు మొదలైన ఇనుప వస్తువులను కమ్మరివాళ్ళు తయారుచేసి ఇచ్చేవాళ్ళు. కుండ, గురిగి, పటువ, ఎసుల, కాగు, గూన వంటి మట్టి వస్తువులను కుమ్మరివాళ్ళు తయారుచేసి ఇచ్చేవాళ్ళు. బంగారు నగలను అవుసుల వాళ్ళు తయారుచేసేవారు.

మంగలివాళ్ళు సవరంపని చేస్తే; పద్మశాలివాళ్ళు బట్టలు నేసేవారు. మేదరివాళ్ళు, ఎరుకలవాళ్ళు తట్ట బుట్టలను అల్లేవారు. బట్టలను మేరవాళ్ళు కుట్టేవాళ్ళు. కోమటివాళ్ళు అందరికి కావలసిన ఇతర సరుకులను అమ్మేవారు. రైతులు వీళ్ళనుంచి తనకు కావలసిన వస్తువులను’ తీసుకొని పొలం దున్ని పంటను పండించేవారు. పండించిన పంటను అన్ని కులాల వారికి ‘ఎరం’ పేరుతో పంచేవారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యవసాయానికి అనుబంధంగా ఏవి ఉండేవి ?
జవాబు.
కులవృత్తులు

ప్రశ్న 2.
రైతుకు కావల్సిన నాగండ్లు మొదలైనవి ఎవరు తయారుచేస్తారు ?
జవాబు.
వడ్రంగివారు

ప్రశ్న 3.
బట్టలు నేసేదెవరు ?
జవాబు.
పద్మశాలివారు

ప్రశ్న 4.
మట్టి వస్తువులను తయారు చేసేదెవరు ?
జవాబు.
కుమ్మరివారు

ప్రశ్న 5.
పండించిన పంటను అన్ని కులాల వారికి ఏ పేరుతో పంచేవారు ?
జవాబు.
ఎరం

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

VII. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

పల్లెల్లో ఆటపాటలు విభిన్నంగా ఉండేవి. గోటీలు, చిర్రగోనె, కబడ్డి, గుడ్డిరాజు, ఓమనగుంటలు, గచ్చకాయలు, తొక్కుడుబిళ్ళ, పరమపద సోపాన పటం, పచ్చీసు, అష్టాచెమ్మ, మట్టికుప్పలు, రేసు, కాశెపుల్ల, దాల్దడి దస్సన్న పొడి వంటి ఆటలతో శారీరక దృఢత్వమే కాదు మానసిక ఎదుగుదల ఉండేది. కలిసి ఆడటం వలన స్నేహం బలపడేది. జీవితంలో పోటీతత్వం పెరిగేది. బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా, చప్పట్లు వంటి ఆటల్లో పాటలు కూడా ఉండేవి. పాటను ఆటను కలిపి లయబద్ధంగా ఆడి పాడటంలో సంగీతం, సాహిత్యాల్లో ప్రవేశం లభించేది. గ్రహణశక్తి పెరిగేది. పాటల ద్వారా మంచి విషయాలు, చరిత్ర తెలిసేది. ఆలోచనా పరిధి విస్తరించేది. తరం నుంచి తరానికి ఆచార వ్యవహారాలు తెలిసేవి. భాషా పరిజ్ఞానం అలవడేది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పల్లెలలోని ఆటల పేర్లు నాలుగు రాయండి.
జవాబు.
గోటీలు, చిర్రగోనె, కబడ్డి, గచ్చకాయలు, తొక్కుడుబిళ్ళ.

ప్రశ్న 2.
కలిసి ఆడటం వలన బలపడేది ఏది ?
జవాబు.
స్నేహం.

ప్రశ్న 3.
ఆటల్లో పాటలు ఉన్నవేవి ?
జవాబు.
బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా, చప్పట్లు.

ప్రశ్న 4.
పాటల ద్వారా ఏమి తెలుస్తుంది ?
జవాబు.
మంచి విషయాలు, చరిత్ర.

ప్రశ్న 5.
ఆటలతో శారీరక దృఢత్వంతో పాటు ఏది ఉంటుంది ?
జవాబు.
మానసిక ఎదుగుదల.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

సారాంశం:

తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు, ఆట, పాట, భాష, యాస ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి. రైతులు, వివిధ వృత్తులవారు ఒకరికొకరు సహకరించుకుంటూ బతికేవాళ్ళు. పండుగలు, జాతరలు, పెండ్లిండ్లకు అన్ని వృత్తులవారి భాగస్వామ్యం ఉండేది.

కొత్తపంట : పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ “కొత్త”. వడ్లను దంచి, కొత్త బియ్యం తీసి, వండి, పదిమందిని పిలిచి, కడుపునిండా భోజనం పెట్టి పంపడమే కొత్త పండుగ. ఇది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం.

సాగువాటు : సాగువాటు అంటే రైతు వ్యవసాయం పనులు మొదలు పెట్టేరోజు. దీన్ని ఏరువాక (ఏరొంక) పండుగ అని కూడా అంటారు. రైతు ఒక మంచిరోజు చూసుకొని నాగలి పట్టి నాలుగుసాళ్లు దున్ని, పారతో నాలుగుసార్లు తవ్వి భూదేవతకు మొక్కుకుంటాడు.

కులవృత్తులు : గ్రామాల్లో వస్తు మార్పిడి ఉండేది. ఎవరికివారు తమ తమ కులాలకు సంబంధించిన వస్తువులు తయారుచేసి, ఆ వస్తువులను ఇచ్చి తమకు అవసరమైన వాటిని తీసుకునేవారు. ఈ కులవృత్తులన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఉండేవి.

పాడి : ఊర్లో నాలుగు పాడి బర్రెలుంటే చల్ల, చమరు ఊరందరికీ పంచబడేది.

ఆటపాటలు : పల్లెల్లో ఆటపాటలు విభిన్నంగా ఉండేవి. కబడ్డి, తొక్కుడు బిళ్ళ, పచ్చీసు, అష్టాచెమ్మ వంటి ఆటలతో శారీరక దారుఢ్యమే కాదు మానసిక ఎదుగుదల ఉండేది. బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా, చప్పట్లు వంటి ఆటల్లో పాటలు కూడా ఉండేవి. పాటను ఆటను కలిపి లయబద్ధంగా ఆడిపాడడంలో సంగీతం సాహిత్యాల్లో ప్రవేశం లభించేది. T.S 6వ తరగతి

చెరువు : చెరువు పంటలకు నీరు అందించడమే కాదు ఆటపాటలకు కూడా చెరువే చిరునామ. గొలుసు చెరువులు తెలంగాణకు ఒక వరం. ఒక ఊరి చెరువు నుండి అలుగువారి మరో ఊరి చెరువు నిండేది.

లగ్గాలు, పండుగలు : ఊరిలో ఒకరింట్లో లగ్గం అయితే అందరికీ పని ఉండేది. లగ్గంలో జరగాల్సిన కార్యక్రమాలకు, పనులకు వాళ్ళు వచ్చి సహాయం చేసేవారు. పిల్లలు పుట్టినప్పుడు పురుళ్లు, పుట్టెంటికలు వంటి పండుగల్లో కూడ ఊరందరికి భాగస్వామ్యం ఉండేది.

కుటుంబ సంస్కృతి : పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. కుటుంబ పెద్దగా అవ్వనో, నాయననో ఉండేవారు. ఎవరు ఏం పని చెయ్యాలన్నది వారు చెప్పేవారు.

వినోదాలు : పల్లెల్లో ప్రజలు నాటకాలు, యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, చిందుబాగోతాలతో కాలక్షేపం చేసేవారు. వీటితో ప్రజలకు మంచి సందేశం అందేది.

Leave a Comment