TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 9th Lesson చీమలబారు Textbook Questions and Answers.

TS 6th Class Telugu 9th Lesson Questions and Answers Telangana చీమలబారు

బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి. (TextBook page No. 84)

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు 1

ప్రశ్నలు జవాబులు:

ప్రశ్న 1.
బొమ్మలో ఏమి జరుగుతున్నది ?
జవాబు.
బొమ్మలో ప్రయాణికులు బస్సును ఎక్కుతున్నారు.

ప్రశ్న 2.
ప్రయాణికులు బస్సును ఎట్లా ఎక్కుతున్నారు ?
జవాబు.
ప్రయాణికులు ఒకరివెంట ఒకరు వరుసలో నిలబడి క్రమశిక్షణ పాటిస్తూ బస్సును ఎక్కుతున్నారు.

ప్రశ్న 3.
మన చుట్టూ నివసిస్తున్న ఏయే ప్రాణులు ఇట్లాంటి క్రమశిక్షణను కలిగి ఉంటాయి ?
జవాబు.
మన చుట్టూ నివసిస్తున్న ప్రాణులలో చీమలు ఇట్లాంటి క్రమశిక్షణను కలిగి ఉంటాయి.

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 87)

ప్రశ్న 1.
చీమల విషయంలో ‘కడు దుర్గమమైన బ్రతుకుబాట మీది’ అని కవి ఎందుకన్నాడో చెప్పండి.
జవాబు.
చీమలకు పండించే భూములు లేవు. కళ్ళానికి ఒక్కొక్క గింజ చొప్పున ఏరుకుంటే అవే అనేక గింజలవుతాయి. పొలాలన్నీ తిరిగి తిరిగి ఎంతో కష్టపడి అవి ఈ ధాన్యపు గింజలను సంపాదిస్తాయి. ఆ ధాన్యాన్ని పొదుపు చేసి భద్రపరుస్తాయన్న మాట. అందువల్ల చీమలది ‘కడు దుర్గమమైన బ్రతుకు బాట’ అని కవి అన్నాడు.

ప్రశ్న 2.
పొదుపు పాటిస్తే దారిద్ర్యం ఉండదని కవి అన్నాడు కదా! మనం ఏయే విషయాల్లో పొదుపు పాటించాలి?
జవాబు.
మనం ధనం, నీరు, విద్యుత్తు, గ్యాస్, ఆహార పదార్థాలు మొదలైన విషయాల్లో పొదుపు పాటించాలి.

ప్రశ్న 3.
మనిషి బతకడానికి ఏయే విద్యలు నేర్చుకుంటున్నాడో ఆలోచించి చెప్పండి.
జవాబు.
మనిషి బతకడానికి వృత్తి విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య, శాస్త్ర విద్య, వ్యవసాయ విద్య మొదలైన విద్యలు నేర్చుకుంటున్నాడు.

ఆలోచించండి – చెప్పండి. (TextBook page No. 87)

ప్రశ్న 1.
చీమల విషయంలో ‘కడు దుర్గమమైన బ్రతుకుబాట మీది’ అని కవి ఎందుకన్నాడో చెప్పండి.
జవాబు.
చీమలకు పండించే భూములు లేవు. కళ్ళానికి ఒక్కొక్క గింజ చొప్పున ఏరుకుంటే అవే అనేక గింజలవుతాయి. పొలాలన్నీ తిరిగి తిరిగి ఎంతో కష్టపడి అవి ఈ ధాన్యపు గింజలను సంపాదిస్తాయి. ఆ ధాన్యాన్ని పొదుపు చేసి భద్రపరుస్తాయన్న మాట. అందువల్ల చీమలది ‘కడు దుర్గమమైన బ్రతుకు బాట’ అని కవి అన్నాడు.

ప్రశ్న 2.
పొదుపు పాటిస్తే దారిద్ర్యం ఉండదని కవి అన్నాడు కదా! మనం ఏయే విషయాల్లో పొదుపు పాటించాలి?
జవాబు.
మనం ధనం, నీరు, విద్యుత్తు, గ్యాస్, ఆహార పదార్థాలు మొదలైన విషయాల్లో పొదుపు పాటించాలి.

ప్రశ్న 3.
మనిషి బతకడానికి ఏయే విద్యలు నేర్చుకుంటున్నాడో ఆలోచించి చెప్పండి.
జవాబు.
మనిషి బతకడానికి వృత్తి విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య, శాస్త్ర విద్య, వ్యవసాయ విద్య మొదలైన విద్యలు నేర్చుకుంటున్నాడు.

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
పాఠం చదివారు కదా ! ఈ కవితను కవి ఎందుకు రాసి ఉండవచ్చు?
జవాబు.
చీమల నుండి పొదుపు, క్రమశిక్షణతో కూడిన నడక, వివేకమూ నేర్చుకోవడానికి ఈ కవితను రాసి ఉండవచ్చు.

ప్రశ్న 2.
చీమల క్రమశిక్షణను తెలుసుకున్నారు కదా ! క్రమశిక్షణను పాటించే విషయంలో మనిషి తీరు ఎట్లా ఉంటున్నదో చెప్పండి.
జవాబు.
క్రమశిక్షణను పాటించే విషయంలో మనిషి తీరు చీమల తీరు కంటె భిన్నంగా ఉంటున్నది. క్రమశిక్షణను పాటించాలని ఎదుటివారికి నీతులు చెబుతారు కాని తాము మటుకు ఆచరించరు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
పాఠం చదివి చీమల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను వెతికి రాయండి.
జవాబు.

  1. బారుగట్టి
  2. ఓరిమి
  3. ఇంగితజ్ఞులు
  4. కట్టుదిట్టము
  5. ప్రాలుమాలి తిరుగరు
  6. దుర్గమమైన బ్రతుకుబాట
  7. వివేకం
  8. పొదుపు
  9. శిక్షణ
  10. ఘనులు

ప్రశ్న 2.
కింది కవితను చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఎగిరే పక్షుల్లో ఐక్యత ఉందోయ్
సాగే చీమల్లో ఐక్యత ఉందోయ్
కోకిల గానంలో మాధుర్యం ఉందోయ్
నెమలి నాట్యంలో ఆనందం ఉందోయ్
ప్రకృతిలో ఎక్కడ చూసిన
అందం ఉందోయ్, ఆనందం ఉందోయ్

అ. పై కవిత ప్రకారం చీమల గొప్పతనం ఏమిటి ?
జవాబు.
చీమల గొప్పతనం క్రమశిక్షణ, ఐక్యత.

ఆ. పక్షుల గొప్పదనం ఏమిటి?
జవాబు.
పక్షుల గొప్పదనం ఐక్యం.

ఇ. కోకిల గానం ఎట్లా ఉంటుంది ?
జవాబు.
కోకిల గానం మాధుర్యంగా ఉంటుంది.

ఈ.
ప్రకృతిని ఎందుకు కాపాడాలి ?
జవాబు.
ప్రకృతిలో అందం, ఆనందం ఉన్నందున దాన్ని కాపాడాలి.

ఉ. ఈ కవితకు శీర్షికను పెట్టండి.
జవాబు.
ఈ కవితకు శీర్షిక : ‘ప్రకృతి’

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

3. గేయం ఆధారంగా కింది వాక్యాల్లో ఒప్పును (✓) తో, తప్పును (✗)తో గుర్తించండి.

అ. చీమలు చాలా సోమరులు. ( )
జవాబు.

ఆ. చీమలకు క్రమశిక్షణ ఎక్కువ. ( )
జవాబు.

ఇ. పొదుపు చేయడం చీమల నుంచి నేర్చుకోవాలి. ( )
జవాబు.

ఈ. చీమలకు ముందుచూపు ఉండదు. ( )
జవాబు.

ఉ. చీమలనేత చీమలన్నింటినీ నడిపిస్తాడు. ( )
జవాబు.

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. చీమలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలేవి ?
జవాబు.
చీమలను చూసి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. పనీపాటా లేకుండా సోమరితనంగా తిరుగకూడదు. పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఐకమత్యంగా ఉండాలి. మంచి నడవడి నేర్చుకోవాలి. కష్టపడేతత్త్వం అలవాటు చేసుకోవాలి.

ఆ. “కోటి విద్యలు కూటికొరకే కదా !” – ఈ వాక్యాన్ని విశ్లేషించి రాయండి.
జవాబు.
మనం ఎన్నో రకాల చదువులు చదువుతాం. చదువుకొన్న తరువాత ఆ చదువును బట్టి తగిన ఉద్యోగాన్ని సంపాదిస్తాం. ఆ జీతంతో జీవిస్తాం. విద్య వల్ల జ్ఞానం సంపాదిస్తాం. దానితో బ్రతికే విధానం, డబ్బు సంపాదించే తెలివి వస్తాయి. కాబట్టి ఎంత చదువుకున్నా, ఎన్ని పరీక్షలు పాసయినా, ఏ ఉద్యోగం చేసినా అవన్నీ డబ్బు సంపాదించి, ఆ డబ్బుతో పొట్ట పోషించుకోవడం కోసమే అని గ్రహించాలి అంటే “కోటి విద్యలు కూటి కొరకే కదా!”.

ఇ. ఏ పనీ లేకుండా వృథాగా తిరగడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి ?
జవాబు.
ఏ పనీ లేకుండా వృథాగా తిరగడం వల్ల సోమరితనం పెరుగుతుంది. క్రమశిక్షణ తప్పుతుంది. లోకంలో అందరూ చిన్నచూపు చూస్తారు. ఎవరూ దగ్గరికి చేరనీయరు. జీవితం చుక్కాని లేని నావ వలె తయారవుతుంది.

ఈ. పొట్లపల్లి రామారావు గురించి రాయండి.
జవాబు.
పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, ‘మహత్కాంక్ష, జీవితం (ఖండికలు), పగ మున్నగు రచనలు చేశాడు. ఈయన రచించిన ‘జైలు’ కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది.

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. చీమలబారు కవితా సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
చీమలు బారుకట్టి, ఒకదాని వెంట మరొకటి ఓపికగా పోతాయి. వాటికి నాయకుడు లేకపోయినా కట్టుదిట్టంగా, క్రమశిక్షణతో నడుస్తాయి. చీమలు పనీపాటలు లేకుండా సోమరితనంతో ఎప్పుడూ తిరుగవు. అవి తమకు కావలసిన ధాన్యాన్ని పొదుపుగా దాచుకుంటాయి. ముందురోజుకు అవసరమనే వివేకం కలిగి, పొదుపు చేసుకోవడం అనే గుణాన్ని చీమలు పాటిస్తాయి. చీమలకున్న తెలివితేటలు, పొదుపు, క్రమశిక్షణ మనిషికి గనుక ఉంటే అసలు అనేది ఉండదు.

చీమలు ఎవరివద్దనూ చదువకుండానే వివేకమూ, పొదుపూ నేర్చుకున్నాయి. మనుషులు ఎన్ని చదువులు చదివినా ఆ చదువులన్నీ కూటి కోసమే. వాళ్ళు ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో పోతారు. కళ్ళముందు తిరిగే చీమల వంటి గొప్పవారిని చూసి నేర్చుకోరు.

(లేదా)
ఆ. చీమలు మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి ?
జవాబు.
చీమలు మానవాళికి ఇచ్చే సందేశం :

  1. క్రమశిక్షణతో మెలగాలి.
  2. సోమరితనం పనికిరాదు.
  3. పొదుపుచేయడం నేర్చుకోవాలి.
  4. తెలివితేటలతో మెలగాలి.
  5. వివేకమూ, పొదుపూ నేర్చుకుంటే మనుషులకు దరిద్రం ఉండదు.
  6. ముందుచూపు కలిగి ఉండాలి.
  7. కష్టపడేతత్త్వం కలిగి ఉండాలి.
  8. స్వార్థబుద్ధి పనికిరాదు.
  9. ఐకమత్యంతో మెలగాలి.
  10. సమతాభావం ఉండాలి.

IV. సృజనాత్మకత /ప్రశంస.

చీమలబారు కవితలో చీమల ప్రత్యేకతలు తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీరు గమనించిన పక్షుల్లోని ప్రత్యేకతలను కవిత / గేయరూపంలో రాయండి.
జవాబు.

కవిత

ప్రకృతిలో ఎక్కడ చూసిన
అందం ఉందోయ్, ఆనందం, ఉందోయ్
ఎగిరే పక్షుల్లో ఐక్యత ఉందోయ్
ప్రతి పక్షిలో ఒక ప్రత్యేకత ఉందోయ్
కోకిల గానంలో మాధుర్యం ఉందోయ్
నెమలి నాట్యంలో ఆనందం ఉందోయ్
హంసలో పాలను నీళ్ళను వేరుచేసే గుణముందోయ్
పావురం శాంతికి ప్రతీకోయ్
చిలుక ముద్దు పలుకులకు మూలమోయ్.

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

అ. ఈ సీమ సీతాఫలాలకు ప్రసిద్ధి.
జవాబు.
సీమ = ప్రదేశం

ఆ. కృష్ణుని అల్లరి చేష్టలకు విసిగి గోపికలు కయ్యానికి దిగారు.
జవాబు.
కయ్యం = కొట్లాట, గొడవ

ఇ. ప్రార్థన సమయంలో విద్యార్థులు బారుకట్టి నిలబడ్డారు.
జవాబు.
బారుకట్టి = వరుసకట్టి

ఈ. నల్లరేగడి మాన్యాలలో పంటలు బాగా పండుతాయి.
జవాబు.
మాన్యాలు = భూములు (గౌరవించి ఇచ్చిన భూములు)

ఉ. ఓరిమి ఉంటే దేనినైనా సాధించగలం.
జవాబు.
ఓరిమి = ఓర

2. కింది పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ. ఘనులు
ఆ. పోకడ
ఇ. ఎగుమతి
ఈ. వివేకం
ఉ. కొల్లలు
ఊ. ఇంగితజ్ఞులు
జవాబు.
అ. ఘనులు : కొందరు ఎప్పుడూ ఇతరులను విమర్శించడంలో ఘనులు.
ఆ. పోకడ : వాన రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు.
ఇ. ఎగుమతి : మన రాష్ట్రం నుండి మామిడిపండ్లు విదేశాలకు ఎగుమతి చేస్తారు.
ఈ. వివేకం : వివేకవంతుని అందరూ మెచ్చుకుంటారు.
ఉ. కొల్లలు : సముద్రంలో చేపలు కొల్లలుగా దొరుకుతాయి.
ఊ. ఇంగితజ్ఞులు : ఇంగితజ్ఞులు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు.

3. కింది పట్టిక క్రింద ప్రకృతి పదాలకు వికృతి పదాలను పట్టికలో వెతికి రాయండి.

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు 2

జవాబు.
అ. విద్య – విద్దె
ఆ. చిత్రం – చిత్తరువు
ఇ. మాన్యం – మన్నెం

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

VI. భాషను గురించి తెలుసుకుందాం.

సమాసం:

కింది వాక్యాలు చదువండి.

అ. మాకు దేశభక్తి ఉన్నది.
ఆ. సురేశ్ వేసుకున్నది తెల్లచొక్క.
ఇ. లక్ష్మీపతి దయ నాపై ఉన్నది.
ఈ. ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు.
ఉ. పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది.
ఊ. మాధవునికి పది ఎకరాల పొలం ఉన్నది.

పై వాక్యాల్లో గీత గీసిన పదాల అర్థాలను గమనించండి.

దేశభక్తి లక్ష్మీపతి – ధేశమునందు భక్తి
లక్ష్మిపతి – లక్ష్మి యొక్క పతి
తెల్లచొక్క – తెల్లనైన చొక్క
గురుదక్షిణ – గురువు కొరకు దక్షిణ
కూరగాయలు – (కూర మరియు కాయ) కూరయు, కాయయు
పది ఎకరాలు – పది సంఖ్య గల ఎకరాలు

పై పదాల్లో వేరువేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా ! ఈ విధంగా అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తపదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు.
సమాసంలో మొదటి పదాన్ని ‘పూర్వపదం’ అని, రెండవ పదాన్ని ‘ఉత్తరపదం’ అనీ అంటారు. సమాసంలో ఉండే పదాల, అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు (పేర్లు) ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాం.

ద్వంద్వ సమాసం :

కింది వాక్యాన్ని పరిశీలించండి.

“గురుశిష్యుల బంధం చాలా గొప్పది.”

ఈ వాక్యంలో గురుశిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు, శిష్యుడు అని. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇందులో గురువు, శిష్యుడు ఇద్దరూ ముఖ్యులే. ఇట్లా రెండుకాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యం గల పదాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వసమాసం అంటారు.

1. కింది పేరాను చదివి అందులోని ద్వంద్వసమాస పదాలను గుర్తించి రాయండి.

ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. ఇతరుల కష్టసుఖాలు తెలిసినవారు. ఎవరు వచ్చి అడిగినా, వారి కలిమిలేములను గురించి ఆలోచించకుండా తమకున్నంతలో దానధర్మాలు చేసేవారు. ఇట్లా జీవిస్తూ అందరి ప్రేమాభిమానాలు చూరగొన్నారు. మంచి కీర్తిప్రతిష్టలు పొందారు.
జవాబు.

  1. అన్నదమ్ములు
  2. కష్టసుఖాలు
  3. కలిమిలేములు
  4. ప్రేమాభిమానాలు
  5. కీర్తిప్రతిష్ఠలు

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
మీ పరిసరాలలోని జంతువులను, పక్షులను, కీటకాలను గమనించి వాటి ప్రత్యేకతలను పట్టిక రూపంలో రాయండి.

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు 3

జవాబు.

ప్రాణి చేసే పని / ప్రత్యేకత
ఉదా : తేనెటీగ పూల నుంచి తేనెను సేకరిస్తుంది.
1. బాతు బురద నీటిని వడబోస్తుంది. అందులోని పురుగులను తింటుంది.
2. లకుముకి పిట్ట రమ్మంటూ నీటిలో దూసుకువెళ్ళి చేపలను పట్టుకుంటుంది.
3. ఏనుగు పెద్ద పెద్ద దుంగలను లాగడానికి పనికి వస్తుంది.
4. గద్ద పాములను చంపేస్తుంది.
5. కుక్క ఇంటిని కాపలా కాస్తుంది.
6. కొంగ నీటిలోని చేపలను తింటుంది.
7. బల్లి కీటకాలను, పురుగులను తింటుంది.
8. పిచ్చుక గింజలను కొరికి చిన్నచిన్న కీటకాలను పట్టుకొని తింటుంది.

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

TS 6th Class Telugu 9th Lesson Important Questions చీమలబారు

III. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 2.
‘పొదుపులేని జీవితం దుర్భరం’ అవుతుందనే విషయాన్ని తెలుపుతూ కథ రాయండి.
జవాబు.

పొదుపు

రామాపురం అనే గ్రామంలో నాగేశ్వరరావు అనే ఒక మంచి వ్యక్తి ఉండేవారు. ఆయనది మంచి కుటుంబం. భార్య, కుమారుడు, కోడలు అతని కుటుంబ సభ్యులు. కోడలు ఉన్న ఇంటి నుండి రావడం వల్ల కష్టం అంటే తెలియదు, ప్రతిదీ దుబారా చేయడం ఆమెకు అలవాటు. అన్నం తిన్నా, సగం తిని, సగం పారేసేది. చిరుతిండ్లు, అనవసరంగా వస్తువులు కొనడం వంటి పనులు చేసేది. ఈ కాలంలోనే కోడలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బారసాల కార్యక్రమం భారీగా చేయమన్నా చేయలేదని మామగారిని పిసినారిగా భావించింది.

కాలం గడుస్తుండగా కోడలు హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చేర్చారు. పెద్ద వైద్యం చేస్తేగాని తేరుకోలేదు. బాగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మామగారే దగ్గరుండి అన్నీ చూసుకోవడంతో కోడలు సుస్తీ తగ్గింది. ఇంటికి తేగానే పిసినారి మామ తనకోసం ఇంత ఖర్చుపెట్టడం చూసి ఆశ్చర్యానికి గురైంది కోడలు. కాని మామగారు కోడలితో “అమ్మా నేను పిసినారిని కాదు. అనవసరపు భేషజాలకు వెళ్ళే గుణమున్న నీకు పొదుపు పాటించే నేను పిసినారిగా కనిపించాను. ఆ రోజే నేను కూడా దుబారాగా ఉన్నట్లయితే, ఈ రోజు మనం డబ్బు కోసం ఇతరుల వద్ద చేయి జాచాల్సి వచ్చేది. అవసరాలకు మించి ఏది వాడినా అది దుబారా అవుతుంది. అందుకే ‘పొదుపు లేని జీవితం దుర్భరం’ అని పెద్దలు అంటారు” అని చెప్పగా కోడలు సిగ్గుతో తలదించుకుంది. మరెప్పుడూ దుబారా చేయలేదు.

ప్రశ్న 1.
“క్రమశిక్షణతో జీవించడమే నిజమైన జీవితం” అంటూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

సీతాఫల్ మండి,
X X X X X.

ప్రియమిత్రుడు ప్రవీణ్ కు,

ఇక్కడ మేమంతా క్షేమం. మీరంతా క్షేమమని తలుస్తాను. ముఖ్యంగా రాయునది ఇటీవల మా పాఠశాలలో వక్తృత్వపు పోటీలు నిర్వహించారు. అంశం – క్రమశిక్షణతో జీవించడమే నిజమైన జీవితం. దీనిపై విద్యార్థులు చక్కగా మాట్లాడారు. నేను కూడా కొంత ప్రయత్నించాను. చివరలో ఉపాధ్యాయులు మంచి విషయాలు చెప్పారు. ఏమిటంటే – చీకట్లో ఉన్నవాడికి ‘వెలుగు’ దారి చూపినట్లు, క్రమశిక్షణ ఉన్నవాడికి జీవితం ప్రకాశవంతంగా ఉంటుందనీ, చుక్కానీ లేని నావ వలె క్రమశిక్షణ లేని జీవితం దిక్కు తోచదని చెప్పారు. చిన్ననాటి నుండే ఎవరైతే మంచి నడవడికతో ఉంటారో వారు ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయరని వారే నిజమైన జీవితం గడుపుతున్నారు అని తెలుసుకున్నాను. ఇప్పుడు నాలో ఒక నూతన శక్తి వచ్చినట్లు ఉంది.

అట్లాగే మీ పాఠశాలలో జరిగిన ఏదైనా కార్యక్రమం గూర్చి వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
డి. ప్రవీణ్,
S/o సుబ్బారావు, కుర్మేడు,
నల్లగొండ.

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

IV. భాషాంశాలు.

పర్యాయపదాలు:

ప్రశ్న 1.
లేమి = ___________
జవాబు.
పేదరికం, దారిద్య్రం

ప్రశ్న 2.
పాలుమాలు = ___________
జవాబు.
బద్దకించి, సోమరితనం

నానార్థాలు:

ప్రశ్న 1.
తీరు = ___________
జవాబు.
చక్కన, విధం

ప్రశ్న 2.
ఓరిమి = ___________
జవాబు.
ఓపిక, ఓర్పు

ప్రశ్న 3.
శిక్షణ = ___________
జవాబు.
బోధన, నేర్చుట

ప్రశ్న 4.
కయ్యం = ___________
జవాబు.
కొట్లాట, గొడవ

ప్రశ్న 5.
కట్టు = ___________
జవాబు.
వస్త్రధారణ, నిర్బంధం, విధించు

ప్రశ్న 6.
వ్యవసాయం = ___________
జవాబు.
కృషి, ప్రయత్నం, పరిశ్రమ

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

కింది వాటిని గుర్తించండి.

ప్రశ్న 1.
కచటతపలు ( )
అ) సరళాలు
ఆ) పరుషాలు
ఇ) అచ్చులు
ఈ) ఊష్మాలు
జవాబు.
ఆ) పరుషాలు

ప్రశ్న 2.
నపుంసక లింగం ( )
అ) రాణి
ఆ) రాజు
ఇ) సింహం
ఈ) సేవకుడు
జవాబు.
ఇ) సింహం

ప్రశ్న 3.
అవ్యయం ( )
అ) అయితే
ఆ) అమ్మ
ఇ) చదివి
ఈ) అతడు
జవాబు.
అ) అయితే

ప్రశ్న 4.
విశేషణం ( )
అ) నేను
ఆ) వద్దు
ఇ) వచ్చెను
ఈ) తెలుపు
జవాబు.
ఈ) తెలుపు

ప్రశ్న 5.
సరిత బడికి వెళ్ళి, వచ్చింది. ( )
అ) సంయుక్త వాక్యం
ఆ) సంక్లిష్ట వాక్యం
ఇ) వ్యతిరేకార్థక వాక్యం
ఈ) ఏదీకాదు
జవాబు.
ఆ) సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 6.
అసమాపక క్రియ ( )
అ) వచ్చెను
ఆ) వెళ్ళరు
ఇ) కూడదు
ఈ) చూసి
జవాబు.
ఈ) చూసి

ప్రశ్న 7.
ద్విత్వము (  )
అ) అమ్మ
ఆ) వజ్రం
ఇ) సూర్య
ఈ) ధరణి
జవాబు.
అ) అమ్మ

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

సూచన : కింది పదాలు చదువండి. ఒక వరుసలో సంబంధం లేని పదానికి ‘O’ చుట్టండి.
ఉదా :
అ) పులి
ఆ) ఏనుగు
ఇ) చీమ
ఈ) సింహం
జవాబు.
ఇ) చీమ

ప్రశ్న 1.
అ) కాకి
ఆ) ఎలుక
ఇ) పావురం
ఈ) నెమలి
జవాబు.
ఆ) ఎలుక

ప్రశ్న 2.
అ) మేఘాలు –
ఆ) భూమి
ఇ) ఆకాశ
ఈ) సూర్యుడు
జవాబు.
ఆ) భూమి

ప్రశ్న 3.
అ) ఎరుపు
ఆ)నలుపు
ఇ) తెలుపు
ఈ) పులుపు
జవాబు.
ఈ) పులుపు

ప్రశ్న 4.
అ) ఈగలు
ఆ) దోమలు
ఇ) తేనెటీగలు
ఈ) చీమలు
జవాబు.
ఈ) చీమలు

ప్రశ్న 5.
అ) బావి
ఆ) పొలం
ఇ) చెరువు
ఈ) నది
జవాబు.
ఆ) పొలం

జతపరుచడం:

సూచన : కింది పదాలను చదువండి. సరైన అర్థాలతో జతపరుచండి.

1. కయ్యం అ) గుంపు
2. కలిమి ఆ) ఇతరుల మనస్సులలోని అభిప్రాయాలు తెలుసుకోగల్గడం
3. సహనం ఇ) పోట్లాట
4. ఘనులు ఈ) వరుసలు
5. బారులు ఉ) సోమరితనం
6. సమూహం ఊ) సంపద
7. ఇంగితజ్ఞానం ఋ) ఓరు
8. పాలుమాలి ౠ) గొప్పవారు

జవాబు.
1. ఇ
2. ఊ
3. ఋ
4. ౠ
5. ఈ
6. అ
7. ఆ
8. ఉ

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

ఖాళీలను పూరించుట:

సూచన : కింద తెల్పిన పదాలను ఖాళీలలో సరైనచోట రాయండి.
(పొలములు, సీమ, గింజ, లేములు, ఓరిమి)

ప్రశ్న 1.
ఓ చిన్న చీమలారా ఏ ___________ కు మీరేగేదరు.
జవాబు.
సీమ

ప్రశ్న 2.
ఒకరివెనుక ఒకరు మిగుల ___________ తో పోయెదరు.
జవాబు.
ఓరిమి

ప్రశ్న 3.
కళ్ళముకొక ___________ యైన కావే కొల్లలు కొల్లలు.
జవాబు.
గింజ

ప్రశ్న 4.
ఏయే ___________ తిరిగి ఈ ధాన్యము గూర్చితిరి.
జవాబు.
పొలములు

ప్రశ్న 5.
ఈ శిక్షణ మనిషికున్న ఇక ___________ ఎక్కడివి.
జవాబు.
లేములు

వ్యతిరేకపదాలు:

చిన్న x పెద్ద
వెనుక x ముందు
వివేకము x అవివేకము
తుద x మొదలు

సంధులు:

మీరేగెదరు = మీరు + ఏగెదరు – ఉత్వసంధి
ఎవరోయి = ఎవరు + ఓయి – ఉత్వసంధి
తిరగరహెూ = తిరగరు + అహెూ – ఉత్వసంధి
మాకైనను = మాకు + ఐనను – ఉత్వసంధి
కోటి విద్యలైన = కోటి విద్యలు + ఐన – ఉత్వసంధి
మనిషికున్న = మనిషికి + ఉన్న – ఇత్వ సంధి
ఏమేమొ = ఏమి + ఏమొ – ఇత్వ సంధి
గింజయైన = గింజ + ఐన – యడాగమం
ఎవరిళ్ళకు = ఎవరి + ఇళ్ళకు – ఇత్వసంధి

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

గేయాలు – అర్థాలు – భావాలు:

I. ఓహెూ ! మీరెక్కడికి
ఓ చిన్నచీమలారా
ఏ సీమకు మీరేగెద
రీతీరున బారుగట్టి ?

ఎక్కడికి, ఎక్కడికి?
ఈ సమూహమెక్కడికి ?
కయ్యానిక, వియ్యానిక
అయ్యారె! మీరేగుట ?

ఒకరి వెనుక ఒకరు మిగుల
ఓరిమితో పోయెదరు
ఎవరోయి మిము నడిపెడి
ఇంగితజ్ఞు లింతఘనులు

యెవరో ఒక నేతలేక
ఇంత కట్టు దిట్టముగా
మనుషులమే నడువలేము
మరి మీపోకడ చిత్రము

పనిపాటలు లేక మీరు
ప్రాలుమాలి తిరగరహెూ !
యెక్కడికి ఈ ధాన్యము ?
యెవరిళ్ళకు ఈ యెగుమతి ?

అర్థాలు :

సీమ = ప్రాంతం
ఏగెదరు = వెళ్ళెదరు
తీరు = చక్కన, విధం
బారు = వరుస
బారుకట్టి = వరుస కట్టి
కయ్యం = కొట్లాట
వియ్యం = పెండ్లి (వైవాహిక సంబంధం)
ఓరిమి = ఓపిక, ఓర్పు
ఇంగితజ్ఞులు = ఇతరుల మనస్సులలోని అభిప్రాయాలు తెలుసుకోగలిగినవారు
ఘనులు = గొప్పవార
నేత = నాయకుడు
కట్టుదిట్టముగా = క్రమమైన పద్ధతిలో, వరుసలో
పోకడ = పోయే విధానం
చిత్రం = ఆశ్చర్యం
ప్రాలుమాలి = బద్దకించి, సోమరితనం

భావం:
ఓహో! చిన్న చీమల్లారా ! ఇంత చక్కగ వరుసకట్టి మీరు ఎక్కడికి పోతున్నారు ? కొట్లాటకి పోతున్నారా ? లేక పెండ్లికి పోతున్నారా ?

ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికతో పోతున్నారు. ఇంత వరుసగా మిమ్మల్ని నడిపే తెలివిగల గొప్పవారు ఎవరో ?

ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మేమే ఇంత సమర్థంగా నడువలేము. అట్లాంటిది మీరు ఇంత చక్కగ, క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా చిత్రంగా ఉన్నది. (కవి ఇందులో చీమల నడతను అద్భుతంగా వర్ణించాడు.)

పనీ పాటలు లేకుండా సోమరితనంతో మీరెప్పుడూ తిరుగరు. ఈ ధాన్యమంతా ఎక్కడికి తీసుకొనిపోతున్నారు? ఎవరిండ్లకు ఎగుమతి చేస్తున్నారు ?

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

II.
మడిమాన్యము, లేదు మీకు
మరి ధాన్యము సమకూర్తురు.
కళ్ళముకొక గింజయైన
కావే కొల్లలు కొల్లలు.

ఏయే పొలములు తిరిగి
ఈ ధాన్యము గూర్చితిరి !
యెవడు చూపె కడుదుర్గమ
మైన బ్రతుకు బాట మీకు ?
ఈ వివేక మీ పొదవు
యెటనేర్చితిరో కాని
ఈ శిక్షణ మనిషికున్న
ఇక లేములు యెక్కడివి ?

యెవరివద్ద చదవకనె
ఈ విద్దెటు నేర్చితిరి
కోటివిద్యలైన తుదకు
కూటికె కద మాకైనను.

యేమేమొ నేర్వదలచి
యెటకో పోయెదము
కండ్లముందు యెపుడు తిరుగు
ఘనుల కానలేము గదా !

అర్ధాలు:

మడిమాన్యములు = కానుకగా ఇచ్చిన భూములు, పొలాలు
సమకూర్చుట = ఒకచోటుకి చేర్చడం
కళ్ళము = ధాన్యము నూర్చే చోటు
కొల్లలు = లెక్కలేనన్ని
కూర్చితిరి = పోగుచేశారు.
దుర్గమము = పోవడానికి కష్టమైనది
వివేకము = తెలివితేటలు
పొదుపు = దాచి ఉంచుట
శిక్షణ = బోధన, నేర్చుట
లేమి = పేదరికం, దారిద్ర్యం
విద్దె = విద్య
తుదకు = చివరకు
కూడు = ఆహారం
నేర్వదలచి = నేర్చుకోదలచి
ఘనులు = గొప్పవారు
కానలేము = చూడలేము

భావం:
పంటలు పండించే భూములా మీకు లేవు. అయినా మీరు ధాన్యం సమకూరుస్తారు. కళ్ళానికి (కల్లానికి) ఒక గింజ ఏరుకున్నా అవే మీకు అనేక గింజలవుతాయి.

పొలాలన్నీ తిరిగి తిరిగి మీరు ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తారు. ఇట్లాంటి కష్టమైన బతుకుబాట మీకు ఎవరు నేర్పారు? (చీమలు ధాన్యాన్ని పొదుపుచేసి భద్రపరుస్తాయి. ఇటువంటి గుణాన్ని మానవులూ నేర్చుకోవాలని కవి భావన.)

ఈ తెలివితేటలు, ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారోగాని ఇట్లాంటి క్రమశిక్షణ మనిషికి గనుక ఉంటే దారిద్ర్యం అసలే ఉండదుకదా !
ఎక్కడా చదువకుండానే ఈ విద్య మీరెట్లా నేర్చారు? మేమెన్ని చదువులు చదివినా ఆ చదువులన్ని ఈ కూటికోసమే కదా !

ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో పోతాము. కాని కండ్లముందు తిరిగే మీవంటి గొప్పవారిని చూసి నేర్చుకోం కదా ! (అంటే మనం చీమలని తేలిగ్గా తీసు కుంటాం. కాని చీమల నుంచి మనం నేర్చుకునేది చాలా ఉందని కవి భావన.)

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠ్యభాగం ‘గేయ కవిత’ అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ‘ఆత్మవేదన” కవితాసంపుటి లోనిది.

కవి పరిచయం:

పాఠ్యభాగ రచయిత : పొట్లపల్లి రామారావు.
కాలం : 1917 – 2001 మధ్యకాలంలోనివాడు.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం.
రచనలు : ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం (ఖండికలు), పగ మున్నగు రచనలు.
ప్రసిద్ధి చెందిన రచన : ‘జైలు’ కథల సంపుటి.
రచనా శైలి : వాడుక భాషలో, సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది.

ప్రవేశిక:

సృష్టిలోని ప్రాణులు విలక్షణమైన నైపుణ్యాలను కలిగి ఉంటాయి. కొన్ని వేగంగా పరుగెత్తుతాయి. కొన్ని ఆకాశంలో ఎగురుతాయి. కొన్ని పాడుతాయి. కొన్ని నాట్యం చేస్తాయి. కొన్ని నివాసాలు ఏర్పరచుకోవడంలో, ఆహారం సేకరించుకోవడంలో ప్రత్యేకతలను కనబరుస్తాయి. ఏ ప్రాణి కూడా సోమరితనంతో ఉండదు. నిశితంగా పరిశీలిస్తే మనిషి వాటి నుండి నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో కనిపిస్తాయి. చిన్న ప్రాణులైన చీమలు ఎంత కష్టపడతాయో, ఎంత క్రమశిక్షణతో మెలుగుతాయో తెలుసుకోవడానికి ఈ పాఠం చదువండి.

సారాంశం:

ఓహో! చిన్న చీమల్లారా ! ఇంత చక్కగ వరుసకట్టి మీరు ఎక్కడికి పోతున్నారు ? కొట్లాటకి పోతున్నారా ? లేక పెండ్లికి పోతున్నారా ?
ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికతో పోతున్నారు. ఇంత వరుసగా మిమ్మల్ని నడిపే తెలివిగల గొప్పవారు ఎవరో ?

ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మేమే ఇంత సమర్థంగా నడువలేము. అట్లాంటిది మీరు ఇంత చక్కగ, క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా చిత్రంగా ఉన్నది. (కవి ఇందులో చీమల నడతను అద్భుతంగా వర్ణించాడు.)

పనీ పాటలు లేకుండా సోమరితనంతో మీరెప్పుడూ తిరుగరు. ఈ ధాన్యమంతా ఎక్కడికి తీసుకొనిపోతున్నారు? ఎవరిండ్లకు ఎగుమతి చేస్తున్నారు ?

పంటలు పండించే భూములా మీకు లేవు. అయినా మీరు ధాన్యం సమకూరుస్తారు. కళ్ళానికి (కల్లానికి) ఒక గింజ ఏరుకున్నా అవే మీకు అనేక గింజలవుతాయి.

పొలాలన్నీ తిరిగి తిరిగి మీరు ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తారు. ఇట్లాంటి కష్టమైన బతుకుబాట మీకు ఎవరు నేర్పారు ? (చీమలు ధాన్యాన్ని పొదుపుచేసి భద్రపరుస్తాయి. ఇటువంటి గుణాన్ని మానవులూ నేర్చుకోవాలని కవి భావన.) ఈ తెలివితేటలు, ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారోగాని ఇట్లాంటి క్రమశిక్షణ మనిషికి గనుక ఉంటే దారిద్య్రం అసలే ఉండదు కదా !
ఎక్కడా చదువకుండానే ఈ విద్య మీరెట్లా నేర్చారు ? మేమెన్ని చదువులు చదివినా ఆ చదువులన్ని ఈ కూటికోసమే కదా ! ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో పోతాము. కాని కండ్లముందు తిరిగే మీవంటి గొప్పవారిని చూసి నేర్చుకోం కదా ! (అంటే మనం చీమలని తేలిగ్గా తీసుకుంటాం. కాని చీమల నుంచి మనం నేర్చుకునేది చాలా ఉందని కవి భావన.)

TS 6th Class Telugu Guide 9th Lesson చీమలబారు

నేనివి చేయగలనా?

  • చీమలబారు కవిత రాయడంలో కవి ఉద్దేశం చెప్పగలను. – అవును/ కాదు
  • వచనకవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలను. – అవును/ కాదు
  • కవితా సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • పాఠం ఆధారం చేసుకొని గేయాన్ని రాయగలను. – అవును/ కాదు

Leave a Comment