TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 10th Lesson బాలనాగమ్మ Textbook Questions and Answers.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి. (TextBook Page No. 94)

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ 1

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు ? ఏం జరుగుతున్నది ?
జవాబు.
బొమ్మలో ఒక బాలుడు, ఒక సీసా నుంచి బయటికి వచ్చిన భూతం ఉన్నారు.

ప్రశ్న 2.
బొమ్మ ద్వారా కథను ఊహించండి.
జవాబు.
ఒక బాలుడు బంతి ఆట ఆడుతున్నాడు. బంతి ముళ్ళ కంపలో పడింది. బాలుడు బంతి కోసం వెళ్ళాడు. బంతి కనిపించింది. బంతి పక్కనే అందమైన సీసా కనిపించింది. ఆ సీసా కూడా తీసుకున్నాడు. సీసాలో ఏముందో చూద్దామని మూత తీశాడు. భయంకరమైన ఆకారంతో ఒక భూతం సీసాలో నుంచి బయటికి వచ్చింది. బాలుడు తన తెలివితేటలు ఉపయోగించి భూతం నుంచి తప్పించుకున్నాడు.

ప్రశ్న 3.
ఇటువంటి కథలు మీకు తెలుసా ? వీటిని ఏమంటారు ?
జవాబు.
ఇటువంటి కథలు నాకు తెలుసు. వీటిని జానపద కథలు అంటారు.

ప్రశ్న 4.
మన తెలంగాణ ప్రాంతంలోని జానపద కథలు మీకేమైనా తెలుసా ? ఏమిటవి ?
జవాబు.
మన తెలంగాణ ప్రాంతంలోని జానపద కథలు నాకు తెలుసు. అవి : కవలపిల్లల కథ, చిన్ననత్తి, పెద్దనత్తి కథ.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 96)

ప్రశ్న 1.
‘కంటికి రెప్పలా కాపాడుకోవడం’ అంటే ఏమనుకుంటున్నారు?
జవాబు.
‘కంటికి రెప్పలా కాపాడుకోవడం’ అంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా రక్షించుకోవడం అని అనుకుంటున్నాను.

ప్రశ్న 2.
‘మాట నిలబెట్టుకోవడం’ అనే మాటను ఎలా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
‘మాట నిలబెట్టుకోవడం’ అనే మాటను చెప్పిన మాటలను ఆచరణలో చూపడమని అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 3.
‘తల్లిదండ్రులు లేని పిల్లలు’ ఎట్లా ఆగమైపోతారు ?
జవాబు.
తల్లిదండ్రులు లేని పిల్లలు సరైన ఆలనాపాలనా లేక ఆగమైపోతారు.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 99)

ప్రశ్న 1.
కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు ?
జవాబు.
కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటారు. వాళ్ళకు ఏ మాత్రం బాధ కలిగినా తట్టుకోలేరు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా వదిలేసి పిల్లలను దగ్గరకు తీసుకొని లాలిస్తారు.

ప్రశ్న 2.
ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ?
జవాబు.
ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే అనుకున్న పనులు నెరవేరవు. అసమర్థుల బలహీనతలను అవతలి వారు గ్రహించి వారిని లోబరచుకుంటారు.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 101)

ప్రశ్న 1.
పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి?
జవాబు.
పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఇతరుల మాయలో పడిపోతాం. వాళ్ళు మనల్ని తేలికగా మోసం చేస్తారు. అప్పుడు లేనిపోని కష్టాలు వచ్చి పడతాయి.

ప్రశ్న 2.
మాయల ఫకీరు బాలనాగమ్మను ఎత్తుకుపోయిన సంఘటన వల్ల మీకు ఇతర కథలలోని ఇట్లాంటి సంఘటనలు గుర్తుకువస్తున్నాయా ? చెప్పండి.
జవాబు.
మాయల ఫకీరు బాలనాగమ్మను ఎత్తుకుపోయిన సంఘటన వల్ల నాకు రామాయణం కథలోని రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంఘటన గుర్తుకు వస్తున్నది. బాలనాగమ్మను సీతగాను, మాయల ఫకీరు రావణాసురునిగాను పోల్చుకోవచ్చు.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 103)

ప్రశ్న 1.
‘కర్కోటకుడు’ అంటే ఎట్లా ఉంటాడని అనుకుంటున్నావు ?
జవాబు.
‘కర్కోటకుడు’ అంటే కఠినమైన మనస్సు కలవాడని అనుకుంటున్నాను. వాడిలో జాలి, దయ అనేవి ఉండవు. అవసరమొస్తే ఎదుటివారిని చంపడానికి కూడా వెనుకాడడు.

ప్రశ్న 2.
దుర్మార్గుల వల్ల ఎట్లాంటి నష్టాలుంటాయని భావిస్తున్నావు ?
జవాబు.
దుర్మార్గులు క్రూరంగా ప్రవర్తిస్తారు. ఎదుటివారిని అనేక రకాల హింసిస్తారు. జాలి, దయ అనేవి వారిలో ఉండవు. స్వార్థం కోసం ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. కాబట్టి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టాలుంటాయని భావిస్తున్నాను.

ప్రశ్న 3.
గండభేరుండ పక్షులు బాలవద్దిరాజుకు సహాయం చేశాయి కదా ! అట్లాగే మనం కూడా ఇతరులకు ఎందుకు సహాయం
చేయాలి ?
జవాబు. ఎంతటివానికైనా ఎప్పుడో ఒకప్పుడు ఆపద రావచ్చు. అన్నివేళల తన బలం, తన తెలివితేటలే పని చేయవు. ఒక్కొక్కసారి ఇతరుల సహాయం కూడా అవసరం రావచ్చు. ప్రాణాలు కోల్పోయిన బాలవద్దిరాజును గండభేరుండ పక్షి సంజీవని పుల్లదెచ్చి బతికించింది. అలాగే మనం కూడా ఇతరులకు ఏ ఆపద వచ్చినా సహాయం చేయాలి.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
‘బాలనాగమ్మ’ కథను విన్నారు కదా ! ఈ కథలో మీకు ఆసక్తి కలిగించిన సంఘటన ఏదో చెప్పండి.
జవాబు.
మాయల ఫకీరు ప్రాణమంతా చిలుకలోనే ఉన్నదన్న విషయాన్ని బాలవద్దిరాజు తన తల్లి బాలనాగమ్మ ద్వారా తెలుసుకున్నాడు. తరువాత అతడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చిలుకను చేజిక్కించుకొని, మాయల ఫకీరును చంపిన సంఘటన నాకు ఆసక్తిని కలిగించింది.

ప్రశ్న 2.
మీకు తెలిసిన జానపద కథను చెప్పండి.
జవాబు.
అనగనగా ఒక గ్రామంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు కింద గుడిసెలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ గవ్వలు అమ్ముకుంటూ జీవిస్తూండేది. ఒక కుర్రవాడు చెట్టు కింద బాగా తడిసి నిలబడి ఉంటే లోపలికి రమ్మని పిలిచింది. అవ్వ కుర్రవానికి బువ్వ పెట్టింది. తరువాత అతను వెళ్ళేటప్పుడు తన దగ్గర ఒక మహిమ గల ఉంగరం ఉందని, అది మనం కోరిన రెండు కోరికలను తీరుస్తుందని, కాని స్వార్థానికి మాత్రం వాడకూడదని చెప్పి ఇచ్చింది. ఆ కుర్రవాడు ఆ దేశపు రాజకుమారుడు.

ఒకసారి రాజ్యంలో అతివృష్టి ఏర్పడింది. పంటలన్నీ కొట్టుకుపోయాయి. కరవు వచ్చింది. ప్రజలంతా ఆకలితో చనిపోతున్నారు. రాజకుమారుడికి వెంటనే తన వద్దనున్న ఉంగరం గుర్తుకు వచ్చింది. దానిని ప్రజలకు సహాయం చేయమని కోరాడు. వెంటనే సంవత్సరానికి సరిపడే ఆహారధాన్యాలు ప్రత్యక్షమయ్యాయి.

కొన్నాళ్ళకు రాజకుమారుడికి అవ్వ మరణించిందని తెలిసింది. వెంటనే అవ్వ చిరకాలం కనిపించేలా చేయాలనిపించింది. వెంటనే అవ్వను చంద్రబింబంలో కనిపించేలా చేయమని కోరాడు. అప్పటి నుంచి అవ్వ చంద్రుడిలో కనిపిస్తూ ఉంటుంది.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. కింది జాతీయాలను పాఠంలో ఏ సందర్భంలో ఉపయోగించారో రాయండి.

అ) అల్లారుముద్దుగా : ______________
జవాబు.
అల్లారుముద్దుగా : మిక్కిలి గారాబంగా
లక్ష్మీదేవమ్మ తన కుమార్తెలను మిక్కిలి గారాబంగా పెంచిందని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగించబడింది.

ఆ) కడుపుల పెట్టుకొని : ______________
జవాబు.
కడుపుల పెట్టుకొని : ఏ మాత్రం ఇబ్బంది లేకుండా రక్షించడం
కాపాడుట : లక్ష్మీదేవమ్మ తనభర్తతో పిల్లలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పెంచమని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగించబడింది.

ఇ) చిలుకపలుకులు : ______________
జవాబు.
చిలుకపలుకులు : ముద్దుమాటలు
మాణిక్యాలదేవి నవాంభోజరాజుతో సవతి పిల్లలను కంటికి పాపల్లాగ చూసుకుంటానంటూ ముద్దుపలుకులు పలికిందని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగించబడింది.

ఈ) కాలం చేయుట : ______________
జవాబు.
కాలం చేయుట : మరణించుట
మరుగుమందు వికటించి నవాంభోజరాజు మరణించాడనే విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగించబడింది.

ఉ) ఆరునూరైనా : ______________
జవాబు.
ఆరునూరైనా : ఏది ఏమైనా, ఏ విధంగానైనా
ఏది ఏమైనా అమ్మను నాయనను మాయల ఫకీర్ బంధం నుండి విడిపించి తీసుకువస్తానని బాలవద్దిరాజు పలికిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగించబడింది.

2. పాఠం ఆధారంగా ఎవరు ఎటువంటివారో కింది పట్టికలో రాయండి.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ 2

జవాబు.

పాత్రలు పాత్రల స్వభావం తెలిపే పదాలు
అ. నవాంభోజరాజు ఇచ్చిన మాట మరచిపోడు. తన పిల్లలను కంటికి రెప్పలా చూసుకొనేవాడు.
ఆ. బాలనాగమ్మ ప్రాణం పోయినా యిష్టం లేని పని చేయదు. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు గ్రహించినట్టిది.
ఇ. మాయల ఫకీరు కర్కోటకుడు, మంత్రశక్తి కలవాడు.
ఈ. బాలవద్దిరాజు ఏ విద్యనైనా చూస్తుండగనే నేర్చుకొనే శక్తి పుట్టుకతోనే వచ్చినవాడు. మాయల ఫకీరును చంపి, తల్లిదండ్రులను రక్షించినవాడు.
ఉ. గండభేరుండ పక్షి సంజీవని పుల్ల తెచ్చి, బాలవద్దిరాజును బతికించింది.
ఊ. లక్ష్మీదేవమ్మ పిల్లలను అల్లారుముద్దుగ పెంచింది. పిల్లలను కడుపులో పెట్టుకొని కాపాడుమని భర్తను కోరినట్టిది.
ఋ. మాణిక్యాలదేవి లక్ష్మీదేవమ్మ పిల్లలను కష్టాలు పెట్టింది. మరుగుమందు పెట్టి భర్తను వశపరచుకున్నది.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. నవాంభోజరాజు మారుమనువుకు ఒప్పుకోలేదు కదా ! ఐనా బంధువులు, మంత్రులు మొదలైనవారు ఏమని నచ్చజెప్పి ఒప్పించి ఉంటారు ?
జవాబు.
నవాంభోజరాజు పిల్లలను కంటికి రెప్పలాగ కాపాడుకుంటూ పగలు, రాత్రి వాళ్ళతోనే గడుపుతున్నాడు. రాజ్యం, రాచరికం మరిచిపోయాడు. అందువల్ల పరిపాలన సరిగాలేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. రాజుగారు మళ్ళీ పెండ్లి చేసుకుంటే పిల్లలను ఆమె చూసుకుంటుంది. రాజుగారు రాజ్యపరిపాలన చూసుకుంటారు. ఈ ఆలోచనతో బంధువులు, మంత్రులు మొదలైనవారు నవాంభోజ రాజుకు నచ్చజెప్పి మారుమనువుకు ఒప్పించి ఉంటారు.

ఆ. అడవిలో దిక్కులేని పక్షుల తీరుగ తిరుగుతున్న లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు ఇంటికి తీసుకొని పోయాడు కదా ! అతడు ఆ పిల్లలను ఇంటికి తీసుకొనిపోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించి రాయండి.
జవాబు.
లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు తన ఇంటికి తీసుకొనిపోకపోతే మాణిక్యాలదేవి ఆ పిల్లలను ఇంకా హింసించి ఉండేది. ఏదోవిధంగా తండ్రి నుండి దూరం చేసేది. చివరికి వారిని చంపించి ఉండేది.

ఇ. బాలవద్దిరాజుకు కట్టెసాము, కత్తిసాము, విలువిద్య మొదలైన విద్యలు వస్తాయి కదా ! మీకు చదువుతోపాటు ఏయే విద్యలు వస్తాయి ? అందులో మీకు బాగా ఇష్టమైన విద్య ఏది ?
జవాబు.
మాకు చదువుతో పాటు నృత్యం, చిత్రకళ, సంగీతం, కరాటే, స్విమ్మింగ్ మొదలైన విద్యలు వస్తాయి. అందులో నాకు బాగా ఇష్టమైన విద్య చిత్రకళ.

ఈ. బాలవద్దిరాజు సప్తసముద్రాలు దాటి మాయల ఫకీరు ప్రాణాలున్న చిలుకను పట్టుకున్నాడు కదా ! ఆ చిలుకను దొరికిన చోటనే చంపకుండా ఫకీరు దగ్గరకు ఎందుకు తీసుకొనిపోయి ఉంటాడో రాయండి.
జవాబు.
బాలవద్దిరాజు తనకు దొరికిన చోటనే చిలుకను చంపితే మాయల ఫకీరు మరణిస్తాడు. అప్పుడు తన తల్లిని తండ్రిని మాయల ఫకీరు ఎక్కడ బంధించి ఉంచిందీ బాలవద్దిరాజుకు తెలియదు. తన తల్లిదండ్రులను, బంధువులను, సైన్యాన్ని బతికించుకున్న తరువాత మాయల ఫకీరును చంపాలనుకున్నాడు. అందువల్ల మాయల ఫకీరు ప్రాణాలు చిలుకలో ఉన్నవని తెలుసుకున్న బాలవద్దిరాజు చిలుకను దొరికిన చోటనే చంపలేదు. ఫకీరు దగ్గరకు తీసుకొనిపోయి తన కార్యం నెరవేరిన తరువాత చిలుకను చంపాడు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
బాలనాగమ్మ కథను సొంతమాటల్లో రాయండి.
జవాబు.
బాలనాగమ్మ తల్లి లక్ష్మీదేవమ్మ, తండ్రి నవాంభోజరాజు, భర్త కార్యవర్ధిరాజు, కుమారుడు బాలవద్దిరాజు, నాగళ్ళపూడి అనే రాజ్యంలో మాయల ఫకీరు ఒకడు ఉన్నాడు. అతడు బాలనాగమ్మను తన మాయలతో మోసం చేసి తీసుకొని వెళ్ళి తన కోటలో బంధించాడు.

ఒకనాడు బాలవద్దిరాజు ఎంతో శ్రమపడి మాయల ఫకీరు కోటలోకి వెళ్ళి తన తల్లిని కలుసుకున్నాడు. ఆమె ద్వారా ఫకీరు ప్రాణాలు వజ్రాల చిలుకలో ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆ చిలుక ఉన్న ప్రాంతానికి వెళ్ళి దాన్ని తీసుకొని సరాసరి మాయల ఫకీరు కోటకు వచ్చాడు. ఫకీరు భయపడిపోయి కాళ్ళ బేరానికి వచ్చాడు. అప్పుడు బాలవద్దిరాజు తన తల్లిని విడిచిపెట్టమన్నాడు. తండ్రినీ, బంధువులను, సైన్యాన్ని బతికించమన్నాడు. ఫకీరు బాలవద్దిరాజు చెప్పినవన్నీ చేశాడు.

ఆఖరున “నీవంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం” అని పలికి బాలవద్దిరాజు ఆ వజ్రాల చిలుక మెడ విరిచేశాడు. మాయల ఫకీరు బొబ్బలు పెట్టుకుంటూ, గిలగిల కొట్టుకుంటూ మరణించాడు. బాలవద్దిరాజు అందరిని తీసుకొని తన రాజ్యానికి వెళ్ళాడు.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

IV. సృజనాత్మకత/ప్రశంస.

“సాయంత్రం గండభేరుండపక్షులు రాంగనే ……………..” అనే పేరా నుంచి చివరివరకు పాఠం చదువండి. దీని ఆధారంగా గండభేరుండపక్ష్మి, బాలవద్దిరాజు, మాయల ఫకీరుల మధ్య జరిగిన సంభాషణలను ఊహించి, రాయండి.
జవాబు.

సంభాషణ

గండభేరుండ పక్షి : బాలవద్దిరాజా ! నీవు ఎవరు ? నీ కథ ఏమిటి ? చెప్పు.
బాలవద్దిరాజు : నేను బాలనాగమ్మ కొడుకును. మా అమ్మను మాయల ఫకీరు తీసుకువెళ్ళి బంధించాడు. అతని ప్రాణాలు ఒక చిలుకలో ఉన్నాయట. నేను ఆ చిలుకను తీసుకురావడానికి జీవిగడ్డ వెళ్తున్నాను.
గండభేరుండ పక్షి : ఓహెూ ! అలాగా ! నీకేం భయం లేదు. జీవిగడ్డ నాకు తెలుసు. నీవు నా రెక్కల మీద కూర్చో. నిన్ను తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తా.
బాలవద్దిరాజు : అట్లాగే. (జీవిగడ్డ చేరి చిలుకను పట్టుకొన్నాడు. సరాసరి మాయల ఫకీర్ కోటకు వెళ్ళాడు)
మాయల ఫకీర్ : అబ్బా ! చలిజ్వరం ! చలిజ్వరం. ఎవరో వచ్చినట్లున్నారే. ఎవరా వచ్చింది ?
బాలవద్దిరాజు : నేను బాలవద్దిరాజును.
మాయల ఫకీర్ : నా చిలుక నీ దగ్గరికి ఎట్లా వచ్చింది ? నాకు ఇవ్వు, లేకపోతే చంపుతా. (అని చెయ్యెత్తాడు.)
బాలవద్దిరాజు : ఇదిగో, చిలుక రెక్క విరిచేస్తున్నా చూడు.
మాయల ఫకీర్ : కాలితో తంతాను.
బాలవద్దిరాజు : ఇదిగో చిలుక కాలు విరిచేస్తున్నా చూడు.
మాయల ఫకీర్ : నాయనా ! నా ప్రాణం తీయకు. నీవు చెప్పినట్లు చేస్తా.
బాలవద్దిరాజు : అయితే, మా తల్లిని విడిచిపెట్టు. తండ్రినీ, బంధువులను, సైన్యాన్ని బతికించు.
మాయల ఫకీర్ : అట్లాగే … అన్నీ నీవు చెప్పినట్లే చేశా.
బాలవద్దిరాజు : నీవంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం. ఇదిగో చిలుకమెడ విరిచేస్తున్నా చూడు.
మాయల ఫకీర్ : వాయ్యో, వామ్మో, అబ్బో! (గిల గిల కొట్టుకుంటూ ప్రాణం విడిచాడు)

V. పదజాల వినియోగం.

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను ఖాళీలలో రాయండి.

అ. కొడుకు పుట్టినందుకు సంతోషపడ్డారు. కాని అతడు ప్రయోజకుడు కానందుకు ______________.
జవాబు.
దుఃఖించారు.

ఆ. సుఖము కోరుకుంటే దేన్నీ సాధించలేము. కాని ______________తో దేన్నైనా సాధించవచ్చు.
జవాబు.
కష్టం

ఇ. మంచివాళ్ళు మేలు చేయాలని చూస్తే, చెడ్డవాళ్ళు ______________ చేయాలని చూస్తారు.
జవాబు.
కీడు

ఈ. సీత జాడ తెలియక విషాదంలో ఉన్న రాముడికి ఆమె జాడ చెప్పి హనుమంతుడు ______________ కలిగించాడు.
జవాబు.
ఆనందం

ఉ. దుర్మార్గుల వల్ల సమాజానికి చెడు జరుగుతుంది. అయితే గొప్పవాళ్ళ వల్ల సమాజానికి ______________ జరుగుతుంది.
జవాబు.
మంచి

2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను రాయండి.

ఉదా : కొంతమంది చిన్నతనం నుండే యోగాసనాలు సాధన చేస్తారు.
జవాబు.
అభ్యాసం

అ. మా బడి మా ఇంటికి తూర్పు దిక్కున ఉన్నది.
జవాబు.
దిశన

ఆ. మా తాత పులిహోర ఆరగించాడు.
జవాబు.
భుజించాడు

ఇ. అప్పు కట్టలేదని రాజయ్య భూమిని బ్యాంక్వాళ్ళు జప్తు చేశారు.
జవాబు.
జప్తి

ఈ. ప్రజల సేవకై తపించిన రాజులు చరిత్రకెక్కారు.
జవాబు.
ప్రభువు

ఉ. నా శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తున్నాను.
జవాబు.
తల

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

3. కింది జాతీయాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) అల్లారుముద్దుగా = ______________
జవాబు.
మేము మా చెల్లెలిని అల్లారుముద్దుగా చూసుకుంటాం.

ఆ) చిలుకపలుకులు = ______________
జవాబు.
కొందరు పలికే చిలుకపలుకులు వినడానికి బాగానే ఉంటాయి.

ఇ) ఆరునూరైనా = ______________
జవాబు.
ఆరునూరైనా మూర్ఖులను మార్చలేము.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.

అ) తల్లిదండ్రులు = ______________
జవాబు.
తల్లియు, తండ్రియు

ఆ) తోడునీడలు = ______________
జవాబు.
(ఇది ద్వంద్వ సమాస పదం కాదు) నీడ వలె తోడులు (తోడు, నీడ అనకూడదు)

ఇ) భీమార్జునులు = ______________
జవాబు.
భీముడును, అర్జునుడును

ఈ) కాయగూరలు = ______________
జవాబు.
కాయము, కూరయు

ఉ) ఆటపాటలు = ______________
జవాబు.
ఆటయు, పాటయు

కలిపి రాయడం:

1. కింది వాటిని పరిశీలించండి.

1. వారు + ఉండిరి = వారుండిరి
2. ఎవరికి + ఎంత = ఎవరికెంత
3. ఇంక + ఒకరు = ఇంకొకరు
పై ఉదాహరణల్లో రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం గమనించారు కదా ! ఇట్లా రాయడాన్ని కలిపిరాయడం అంటారు. దీనికే ‘సంధి’ అని పేరు.

2. కింది పదాలను కలిపి రాయండి.

ఉదా : సెలవు + ఇచ్చి = సెలవిచ్చి

అ. మీరు + ఎవరు = ______________
జవాబు.
మీరెవరు

ఆ. పది + ఇంతలు = ______________
జవాబు.
పదింతలు

ఇ. ఏది + ఐనా = ______________
జవాబు.
ఏదైనా

ఈ. పట్టిన + అంత = ______________
జవాబు.
పట్టినంత

ప్రాజెక్టు పని:

గ్రంథాలయం నుంచి గాని, వార్తాపత్రికల నుంచి గాని ఏదైనా జానపద కథను సేకరించి, నివేదిక రాసి తరగతిలో చెప్పండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

TS 6th Class Telugu 10th Lesson Important Questions బాలనాగమ్మ

III. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
మీకు తెలిసిన ఒక కథను రాయండి.
జవాబు.
అనగనగా ఒక అడవిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళే కాని మంచి తెలివైనవారు. ఒకసారి ఆ అడవి పై నుండి రాక్షసుడు ఒకడు ప్రయాణిస్తూ నరమాంసం వాసన పట్టి ఆగాడు. రామయ్య దంపతులను చూసి తిందామని దగ్గరకు వచ్చాడు. రాక్షసుణ్ణి చూడగానే రామయ్య దంపతులకు భయమేసినా బయటకు కనబడనీయకుండా నిం.సాది.గా ఉన్నారు. రామయ్య రాక్షసుణ్ణి చూసి కూడా పట్టించుకోనట్లు ఉన్నాడు. రాక్షసునికి కోపం వచ్చింది. బిగ్గరగా కేకల. పెడుతూ మీదకు వచ్చాడు. అయినా భయపడని రామయ్యను చూసి, “నన్ను చూసి కూడా ఎలా ధైర్యంగా ఉండగల్గుతున్నావ”ని అడిగాడు.

అందుకు రామయ్య “నీలాంటి రాక్షసుడే నా దగ్గర ఉన్నాడు. ఒకప్పుడు నీలాగే నన్ను బెదిరించాలనుకున్నాడు. కాని నేనే వాణ్ణి నా అద్దంలో బంధించాను” అని అన్నాడు. రాక్షసుడు నమ్మకపోవడంతో తన చేతి సంచీలోని అద్దాన్ని చూపాడు. ఆ అద్దంలో తన ముఖాన్నే చూసుకొని వేరొక రాక్షసుడిగా భావించి, తనను బంధించవద్దని ప్రార్థించాడు. అందుకు బదులుగా నీవేమి చెప్పినా చేస్తానని రాక్షసుడు రామయ్యతో చెప్పాడు. ఆనాటి నుండి రాక్షసుడు ఆ దంపతులకు పనిమనిషిగా అన్ని పనులు చేస్తున్నాడు. అపాయంలో ఉన్నప్పుడు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారికి ఎలాంటి భయం లేదు.

ప్రశ్న 2.
వృద్ధులైన తల్లిదండ్రులను బిడ్డలు ఎలా చూసుకోవాలో వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

జోగిపేట,
x x x x x.

ప్రియమిత్రుడు రాంబాబుకు,

ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. ముఖ్యంగా వ్రాయునది ఏమనగా – ఇటీవల ఎక్కడ చూసినా (పేపర్లో, టీవీల్లో) పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను వీధిలోకి నెట్టేసిన పిల్లలు అని, వృద్ధాశ్రమాల్లోకి పంపిన కొడుకులు అని చదువుతున్నాం, వింటున్నాం. కనికరం లేదా వాళ్ళకు ? కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల బిడ్డల తీరు ఇంతేనా ? పశువుకన్నా హీనంగా ప్రవర్తిస్తున్న వీరిని చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. రేపు వీళ్ళ పిల్లలు వీళ్ళని ఇలాగే చూసినపుడు గాని వీళ్ళకు బుద్ధిరాదు. వీళ్ళకూ ముసలితనం రాదా ? వీళ్ళ పిల్లలు కూడా వీరిని వీధిలోకి నెట్టేస్తేగాని మార్పు రాదా? ఇలాంటి వార్తలు వింటుంటే చాలా బాధగా ఉంది మిత్రమా ! అయ్యో పాపం అనిపిస్తుంది. ప్రభుత్వం గాని, మనసున్న పెద్దవాళ్ళు గాని వాళ్ళని ఆదరించాలి. చేతనయిన సాయం అందరం చేయాలి.

నీవు ఏం చేస్తున్నావు ? పరీక్షలకు బాగా ప్రిపేరవుతున్నావా ? ఉంటాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
డి. ప్రవీణ్.

చిరునామా :
జి. రాంబాబు,
S/o సుబ్బారావు,
జగద్గిరినగర్,
రంగారెడ్డి జిల్లా.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

IV. భాషాంశాలు.

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
రాత్రి – రాతిరి
రాజ్ఞి – రాణి
అటవి – అడవి
భిక్ష – బిచ్చము
శంఖము – సంకు
ముక్తా – ముత్తెము
పట్టణము -పట్నము
శక్తి – సత్తి
సముద్రం – సంద్రం
బంధువు – బందుగు
నిద్ర – నిదుర
కథ – కత
మంత్రము – మంతరము
విభూతి – విబూది
ప్రాణము – పానము
విద్య – విద్దె
సంతోషం – సంతసం
పక్షి – పక్కి

నానార్థాలు:

ప్రశ్న 1.
భర్త = ______________
జవాబు.
భర్త = మగడు, యజమాని

ప్రశ్న 2.
మాత = ______________
జవాబు.
మాత = తల్లి, గోవు, భూమి

ప్రశ్న 3.
రాజు = ______________
జవాబు.
రాజు = ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

వ్యాకరణాంశాలు:

ప్రశ్న 1.
శిరస్సు వంచి, నమస్కరించారు. ఏ వాక్యం ?
జవాబు.
సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 2.
మా తాత పులిహోర ఆరగించాడు – వ్యతిరేకార్థం.
జవాబు.
మా తాత పులిహోర ఆరగించలేదు.

ప్రశ్న 3.
ప్రజల సేవకై తపించిన రాజులు చరిత్రకెక్కారు. గీత గీసిన పదం ఏ వచనం ?
జవాబు.
బహువచనం

ప్రశ్న 4.
ఊష్మాలు ఏవి ?
జవాబు.
శ, ష, స, హ లు

ప్రశ్న 5.
ఈ, ౠ, ఏ, ఓ అనునవి
జవాబు.
దీర్ఘాలు

ప్రశ్న 6.
జం, రథం, బలం, పండు వీనిలో సరళంతో మొదలయ్యే పదాలేవి ?
జవాబు.
గజం, బలం

ప్రశ్న 7.
కమల, రవి, చెట్టు, గిరి, గిరిజ – వీనిలో స్త్రీలింగాలేవి ?
జవాబు.
కమల, గిరిజ

ప్రశ్న 8.
కథ, భోజరాజు, ఫకీరు, ఆఖరు – వీనిలో మహా ప్రాణాక్షరాలేవి ?
జవాబు.
థ – భో – ఫ – ఖ.

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

పదాలు – అర్థాలు:

I. మున్నూరు = మూడు వందలు
ఆమడ = ఎనిమిది మైళ్ళ దూరం
ఆరగించు = తిను
కాన్పు = ప్రసవం
పెనిమిటి = మగడు, భర్త
మారుమనువు = పెండ్లి
రాచరికం = రాజభావం, దొరతనం
జమాబంది = భూమిశిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు
తాకీదు = ఆజ్ఞా పత్రిక

II. పాదుషా = ప్రభువు, రాజు
అరుసుకున్నడు = తెలుసుకున్నాడు
వశపరచుకొను = లోబరుచుకొను
జప్తు = సొత్తును బలవంతంగా పట్టుకొనుట
వికటించు = గిట్టకపోవు
కాలంజేసిండు = చనిపోయాడు, మరణించాడు.
జరూర్ = తప్పకుండా
తలారి = కావలికాచు, దొరతనపు బంటు
అంజనం = కాటుక, ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య
మగువ = స్త్రీ
ఫకీరు = భిక్షకుడు, మహమ్మదీయులలో బైరాగి
అపురూపం = అపూర్వం

III. గీరలు = గీతలు
ఎకాయెకి = ఒక్కమారుగా
దండు = సేన, సైన్యం
విషాదం = దుఃఖం
అల్లారుముద్దుగ = మిక్కిలి గారాబంగా
ఈడు = వయస్సు
ఏండ్లు = సంవత్సరాలు
ఆరునూరైనా = ఏది ఏమైనా, ఏ విధంగానైనా
మనువాడుట = పెండ్లి చేసికొనుట

IV. కర్కోటకుడు = కఠినమైనవాడు, కర్కోటకుడనే పేరు గల సర్పం
రెండు వందలు
మున్నూరు = మూడు వందలు
నన్నూరు = నాలుగు వందలు
ఐదునూర్లు = ఐదు వందలు
దొంతి = వరుస
పంజరం = గూడు
చంద్రహాసం = కత్తి (ఒక ప్రత్యేకమైన ఖడ్గం)
సంజీవని = చచ్చినవారిని బ్రతికించు మందు
కత = కథ
చానా = చాలా

TS 6th Class Telugu Guide 10th Lesson బాలనాగమ్మ

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

జానపద కథలను విని లేదా చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారు. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధిచెందిన జానపద కథలున్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ ‘బాలనాగమ్మ కథ’. ఈ అద్భుత కథ అ జానపద కళారూపాల్లో ప్రదర్శింపబడి ప్రజల మనస్సుల్లో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

ప్రవేశిక:

కథలలో జానపద కథలు ప్రత్యేకమైనవి. మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహసకథనాలు ఈ కథలను నడిపిస్తాయి. అందుకే పిల్లలు ఆ కథలంటే చెవి కోసుకుంటారు. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహసకథ ఇది. ఆ జానపద కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నేనివి చేయగలనా?

  • నాకు తెలిసిన ఒక జానపద కథను సొంతమాటల్లో చెప్పగలను. – అవును/ కాదు
  • పాఠం ఆధారంగా పాత్రల స్వభావాన్ని గురించి పట్టికలో రాయగలను. – అవును/ కాదు
  • బాలనాగమ్మ కథను సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • పాఠం ఆధారంగా సంభాషణలు రాయగలను. – అవును/ కాదు

Leave a Comment