TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 12th Lesson కాపాడుకుందాం Textbook Questions and Answers.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి. (TextBook Page No. 118)

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 1

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో తెరిచిన గొడుగు పట్టుకున్న వ్యక్తి ఉన్నాడు. సూర్యుడున్నాడు. నరికివేయబడిన చెట్లు, ఆకులు, కొమ్మలు ఉన్నాయి.

ప్రశ్న 2.
బొమ్మలోని వ్యక్తి ఏమి చేసి ఉండవచ్చు ?
జవాబు.
బొమ్మలోని వ్యక్తి గొడ్డలితో చెట్లను నరికి ఉండవచ్చు.

ప్రశ్న 3.
బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని మీరు అంగీకరిస్తారా ? ఎందుకు ?
జవాబు.
బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని నేను అంగీకరించను. ఎందుకంటే చెట్లు ప్రాణికోటికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి కాబట్టి.

ప్రశ్న 4.
ప్రకృతిని కాపాడాలంటే ఏమి చేయాలి ?
జవాబు.
చెట్లూచేమలను రక్షించుకోవాలి. వాటిని నరకకూడదు.

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 121)

ప్రశ్న 1.
“అడవి జంతువులు పల్లె బాట పట్టాయి” దీనికి గల కారణాలు చెప్పండి.
జవాబు.
మనిషి అడవులను కొట్టేస్తున్నాడు. జంతువులు ఉండాల్సిన అన్ని స్థలాల్లో మనిషే నివాసాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఇట్లా మనిషి అడవులను నాశనం చేయడం వల్ల అడవి జంతువులు పల్లెబాట పట్టాయి.

ప్రశ్న 2.
“చెరువులే గ్రామాలకు మూలాధారాలు” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
గ్రామాలకు చెరువులు కల్పతరువులు. అన్ని వృత్తులు కొనసాగడానికి చెరువులే ఆధారం. వ్యవసాయానికి ప్రధానమైన వనరు. గ్రామాలలో ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేది చెరువులే. పశుపక్ష్యాదులకు నిలయాలు కూడా చెరువులే. అందువల్ల “చెరువులే గ్రామాలకు మూలాధారాలు” అని నా అభిప్రాయం.

ప్రశ్న 3.
మనిషి ఆశే అనర్థాలకు కారణం. దీనిని సమర్థిస్తూ నాలుగు వాక్యాలను చెప్పండి.
జవాబు.
మనిషికి ఆశలు ఎక్కువై ప్రకృతిని పాడుజేస్తున్నాడు. కనీసం తన ఇంట్లో కూడా చెట్లు పెంచడం లేదు. నిర్దాక్షిణ్యంగా అడవులను నరికేస్తున్నాడు. చెరువులను ఆక్రమించి నివాసాలను ఏర్పరచుకుంటున్నాడు. ఇట్లాగే చేసుకుంటూ పోతే ఇంకా భయపడే కాలం వస్తుంది. కాబట్టి మనిషి ఆశే ఈ అనర్థాలకు కారణం అని చెప్పక తప్పదు.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 123)

ప్రశ్న 1.
“సెలవర్లు పక్షులకే కాక మానవులకు కూడా శాపం” ఎందుకో చెప్పండి.
జవాబు.
సెల్టవర్ల నుంచి వచ్చే తరంగశక్తిని తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నాయి. అట్లాగే జనం నివసించే ప్రాంతాల్లో సెల్టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆ తరంగశక్తి ప్రభావం మానవుల మీద పడుతుంది. అప్పుడు వారి ఆరోగ్యాలు క్షీణిస్తాయి. అందువల్ల “సెల్టవర్లు పక్షులకే కాక మానవులకు కూడా శాపం” అని కవి ఉద్దేశమై ఉంటుంది.

ప్రశ్న 2.
వివిధ రకాల పొగలను పీల్చడం వలన మానవుడు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు ?
జవాబు.
వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, సిగరెట్టు, బీడీల పొగ… ఇలా ఇంట్లోంచి బయట కాలుపెడే చాలు. ఏదో ఒక పొగ మనిషి శరీరంలోకి పోతూనే ఉంది. ఈ పొగలను పీల్చడం వల్ల మానవుడు క్షయ లాంటి రోగాలకు లోనై చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు.

ప్రశ్న 3.
శబ్దకాలుష్యం ఎన్ని విధాలుగా జరుగుతున్నది?
జవాబు.
ఇంట్లో టీ.వీ.ల సౌండు, రోడ్డు మీద వాహనాల చప్పుళ్ళు, పెద్ద పెద్ద కార్ఖానాల చప్పుళ్ళు, బోర్లు వేసేటప్పుడు వచ్చే చప్పుళ్ళు, డి.జె. సౌండ్స్ – ఇన్ని విధాలుగా శబ్దకాలుష్యం ఏర్పడుతున్నది.
స్వచ్ఛత మోరీ

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 125)

ప్రశ్న 1.
తేళ్ళు, పాములు భయంతో ఎందుకు అల్లాడుతున్నాయి?
జవాబు.
బావుల్లో నీళ్ళు లేవు. ఆ నీళ్ళ కోసం మిషన్లు భూమిలోకి దించుతున్నారు. దాంతోటి భూమి అదిరిపోతున్నది. అందువల్ల తేళ్ళు, పాములు భయంతో అల్లాడుతున్నాయి.

ప్రశ్న 2.
పర్యావరణ పరిరక్షణకై మీ పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు?
జవాబు.
పర్యావరణ పరిరక్షణకై మా పాఠశాలలో మొక్కలు నాటి పెంచుతాం. చెట్లను కాపాడుకుంటాం. పాఠశాల గదులలో, ఆవరణలో చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుతాం. రాలిన చెట్ల ఆకులను కాల్చకుండా భూమిలో కలిసేటట్లు చేస్తాం. చేత్తను ఎక్కడంటే అక్కడ పడవేయకుండా చెత్తకుండీల లోనే వేస్తాం. సైకిలునే వాహనంగా వాడుతాం.

ప్రశ్న 3.
చెరువులు, బావులు నీళ్లతో కళకళలాడడం కోసం ఊరి ప్రజలకు ఎట్లాంటి సలహాలను ఇస్తావు ?
జవాబు.
చెరువులు, బావులు రక్షించుకుంటే తమను తాము రక్షించుకున్నట్లే అని ప్రజలకు చెబుతాను. అందు కోసం నేలపై కురిసే వర్షపు నీటిని నిల్వచేయమని సలహా ఇస్తాను. వర్షాలు కురవాలంటే చెట్లను పెంచమని సలహా ఇస్తాను. గ్రామంలోనూ, ఇళ్ళ ల్లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోమని సలహా ఇస్తాను. ఇంటి చుట్టూ మొత్తం గచ్చు చేయకుండా కొంత నేలభాగం ఉండేటట్లు చూడమని సలహా ఇస్తాను. చెరువులు, బావులు నీళ్ళతో కళకళలాడడానికి కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకోమని సలహా ఇస్తాను.

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
ఈ పాఠం ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పండి.
జవాబు.
ఈ పాఠం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రకృతిని రక్షించుకోవాలని గ్రహించాను. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మమని గ్రహించాను.

ప్రశ్న 2.
“పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
“పర్యావరణం” అంటే పరిసరాల వాతావరణం. మన చుట్టూ ఉండే వాతావరణం. పర్యావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ పరిరక్షణ. చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు, బావులు, చెరువులు, ఏర్లు, పశుపక్ష్యాదులను కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవి లేకుంటే వర్షాలుండవు. వనరులు ఉండవు. కరవులు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి “పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” అని గ్రహించాలి.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం.

1. పాఠం చదివి కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి.

అ) పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోలేదటగదా ! అయితే ఈసారి ఎందుకు ఎండిపోయింది ?
జవాబు.
ఈ వాక్యం గోపాల్ తన అమ్మమ్మ అన్నమ్మతో పలికిన సందర్భంలోనిది.

ఆ) జనం మధ్యలో సెల్వర్లాయె. ఇక ఎట్లా బతుకుతయ్ ?
జవాబు.
ఈ వాక్యం అన్నమ్మ తన మనుమరాలు లక్ష్మితో పలికిన సందర్భంలోనిది.

ఇ) బావులు, నదులు ఇవన్నీ నీళ్లతోటి కళకళలాడితే నీళ్లకేం కష్టం
జవాబు.
ఈ వాక్యం లక్ష్మి తన సోదరుడు గోపాల్తో పలికిన సందర్భంలోనిది.

ఈ) తేళ్లు, పాములు భయంతోటి అల్లాడవట్టె.
జవాబు.
ఈ వాక్యం నర్సయ్య తన భార్య అన్నమ్మతో పలికిన సందర్భంలోనిది.

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

2. కింది పేరాను చదివి పట్టికను. పూరించండి.

నేను చెట్టును. మీకు తల్లివంటిదాన్ని. నన్ను నరికి కరువుకోరల్లో చిక్కుకోవద్దు. మానవుల్లారా ! అమ్మలాంటి నన్ను కోట్టకండి. కాసుల కోసం అమ్మకండి. పండ్లను, నీడను, ప్రాణవాయువులను ఇచ్చే త్యాగగుణం మాది. మీ కొరకై బతుకుతున్న మమ్ములను నరికే జాతి మీది. చేతనైతే మీ పుట్టినరోజున పది మొక్కలను నాటి నీరుపోసి
కాపాడండి. కానీ దయచేసి తుంచకండి.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 2

జవాబు.

చేయకూడనివి 1. చెట్లను నరకకూడదు.
2. కాసుల కోసం అమ్మకూడదు.
చేయవలసినవి 1. మొక్కలను నాటాలి.
2. నీరుపోసి పెంచాలి.
త్యాగజీవులు అందించేవి పండ్లు, నీడ, ప్రాణవాయువు.
శీర్షిక “మొక్కలను నాటండి” లేదా “వృక్షో రక్షతి రక్షితః”

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “చెరపకురా చెరువులను, చెడిపోతావు” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు.
సమాజానికి చెరువులు కల్పతరువులు, అన్ని వృత్తులు కొనసాగడానికి చెరువులే ఆధారం. వ్యవసాయానికి ప్రధానమైన వనరు. ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేది చెరువులే. పశుపక్ష్యాదులకు నిలయాలు కూడా చెరువులే. ఇంకా అనేక విధాల చెరువులు మనకు ఉపయోగపడతాయి. అటువంటి చెరువులను మనం నీళ్లతోటి కళకళలాడేటట్లు జాగ్రత్తగా కాపాడుకుంటే సుఖంగా జీవిస్తాం. లేదా చెరువులను నాశనం చేసినట్లయితే మనం కూడా చెడిపోతాం.

ఆ) “అడవులను నాశనం చేసుకుంటపోతే ఇంకా భయపడె కాలం వస్తది” అనడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు.
అడవులను నాశనం చేస్తుండబట్టే అడవి జంతువులకు ఆశ్రయం లేకుండా పోయింది. అవి అడవులను విడిచిపెట్టి గ్రామాల మీద పడుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్నాయి. అడవులు లేకుండా చేస్తున్నారు కాబట్టే వానకాలం వానలు రావడం లేదు. ఎండాకాలం ఎండలకు ఉండలేకపోతున్నాం. కాలం కాని కాలంలో వానలు వస్తున్నాయి. ఎండలు కాస్తున్నాయి. కాబట్టి అడవులను నాశనం చేసుకుంటపోతె ఇంకా భయపడే కాలం వస్తుంది.

ఇ) “మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” దీనితో మీరు ఏకీభవిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ?
జవాబు.
“మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” అనే దానితో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే
పొగతోటి కొన్ని జీవులు చచ్చిపోతున్నాయి. ఆ జీవుల్లో మనం కూడా ఉన్నాం. ఇంట్లో నుంచి బయట కాలుపెడితే చాలు. ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతునే ఉన్నది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, సిగిరెట్టు, బీడీల పొగ …. అన్నీ పొగలే కదా ! అందువల్ల మనం బతుకుతలేం, మిగతా జీవులను బతకనిస్తలేం.

ఈ) “వాకిళ్ళు కాంక్రీటు గచ్చులాయె” ఇది ఎటువంటి నష్టాలను కలిగిస్తుందో వివరించండి.
జవాబు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటి ముందు గచ్చు. ఇంటివెనుక గచ్చు. ఎక్కడా నేల కనిపించదు. వాకిళ్ళు కాంక్రీటు గచ్చులవడం వల్ల నీళ్ళు కాలువల్లోకి పోతున్నాయి. ఆ కాలువలు కూడా సిమెంటువే. అందువల్ల ఒక్క నీటి చుక్క కూడా భూమి లోపలికి ఇంకే అవకాశం లేదు. భూగర్భంలో నీరు నిలువలేక బావులన్నీ ఎండిపోతున్నాయి.

ఉ) మీ ప్రాంతంలో ప్రకృతిని ఎన్ని విధాలుగా నాశనం చేస్తున్నారో రాయండి.
జవాబు.
మా ప్రాంతంలో ప్రకృతిని అనేక విధాలుగా నాశనం చేస్తున్నారు. చెట్లు నరికేస్తున్నారు. చెరువులను ఆక్రమించి నివాసయోగ్యంగా మార్చుకుంటున్నారు. నదుల్లోకి వ్యర్థపదార్థాలను వదులుతున్నారు. పంటపొలాల్లో క్రిమిసంహారక మందులను వాడుతున్నారు. పరిశ్రమల పేరుతో శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం చేస్తున్నారు. పర్వతాలను పగులగొట్టి పర్యావరణానికి ముప్పు వాటిల్లేటట్లు చేస్తున్నారు.

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు” దీనిని విశ్లేషిస్తూ రాయండి.
జవాబు.
ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న పర్వతాలు, నదులు, చెరువులు, బావులు, కాలువలు, పక్షులు, పశువులు, మొక్కలు మొదలయినవి. వాటిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు. ప్రకృతి మనకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. మన ప్రకృతిని మనమే పాడుచేసుకుంటున్నాం. నదులు, చెరువుల నీటిని కలుషితం కాకుండా చూడాలి. మొక్కలను పెంచితే మనకు చల్లనిగాలి, నీడ దొరుకుతుంది. అడవులను నాశనం చేయరాదు. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కలుషితం కాకుండా చూడాలి. పంచభూతాలు విజృంభిస్తే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. భావితరాలకు నిలువ నీడ ఉండదు. కాబట్టి ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు.

(లేదా)
ప్రశ్న 2.
మానవులు, పక్షులు, పశువులు. . సుఖంగా జీవించాలంటే ప్రకృతి పట్ల మన ఆచరణ ఎట్లా వుండాలి ?
జవాబు.
మానవులు, పక్షులు, పశువులు మొదలైనవి సుఖంగా జీవించాలంటే మనం ప్రకృతిని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. అడవులను పెంచాలి. జంతువులను పోషించాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. భూగర్భజలాలు ఉండేటట్లు చూసుకోవాలి. బావులను పెంచాలి. చెరువులను నాశనం చేయకూడదు. నదులలోకి వ్యర్థపదార్థాలని వదలకూడదు. పక్షులకు నిలయమైన చెట్లను నరికివేయకూడదు. వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం లాంటివి లేకుండా చూసుకోవాలి. ప్రకృతిలోని సమతౌల్యాన్ని కాపాడాలి. అప్పుడు ప్రాణికోటి అంతా సుఖంగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తుంది.

IV. సృజనాత్మకత / ప్రశంస.

ప్రశ్న 1.
“పర్యావరణ పరిరక్షణ”లో అందరూ పాలుపంచుకోవాలని ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 3

ప్రశ్న 2.
కింది బొమ్మను చూడండి. బొమ్మ ఆధారంగా సంభాషణలు రాయండి.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 4

జవాబు.
చెట్టు : హాయ్, పిల్లల్లారా ! బాగున్నారా ?
పిల్లల : హాయ్, వృక్షమా ! బాగున్నాం. నీవెలా ఉన్నావు ?
చెట్టు : నేనూ బాగున్నాను. మీరు ఇటు వచ్చారేమిటి ?
పిల్లలు : మా ‘సార్’ నీ వల్ల చాలా ఉపయోగాలున్నాయని చెప్పారు. తెలుసుకుందామని వచ్చాం. చెబుతావా ?
చెట్టు : చెబుతా వినండి. నేను చల్లని నీడనిస్తాను. చల్లని గాలిని ఇస్తాను. అందరికి ఆశ్రయమిస్తాను.
పిల్లలు : అవి మాకు తెలుసు. ఇంకా మాకు పనికి వచ్చేవి ఏమి ఇస్తావు ?
చెట్టు : నేను ఆకులు, పూలు, పండ్లు ఇస్తాను. కాయగూరలు ఇస్తాను. దుస్తులకు అవసరమైనవి ఇస్తాను. తేనె మొదలైనవి మా నుండే మీకు లభిస్తాయి.
పిల్లలు : అట్లాగా ! ఇంకా నీవు మాకు ఏ విధంగా సహాయపడతావు ?
చెట్టు : నా కలప గుజ్జుతోటే కాగితాలు తయారుచేస్తారు. నా బెరడులో ఔషధ గుణాలున్నాయి. గృహాలకు అవసరమైన కలప ఇచ్చేది నేనే.
పిల్లలు : అట్లాగా !
చెట్టు : ఔను. నా వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నన్ను మీరు రక్షిస్తే మిమ్మల్ని నేను రక్షిస్తా.
పిల్లలు : తప్పకుండా చెట్లను రక్షించుకుంటాం. ఎన్నో విషయాలు తెలియజేశావు. కృతజ్ఞతలు. వెళ్ళి వస్తాం.

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

V. పదజాల వినియోగం.

1. కింది పదాలు చూడండి వీటికి అదే అర్థం వచ్చే పదాలను పాఠం ఆధారంగా రాయండి.

అ) తొందరగా = ______________
జవాబు.
తొందరగా = జల్ది

ఆ) దురాక్రమణ = ______________
జవాబు.
దురాక్రమణ = కబ్జా

ఇ) శబ్దాలు = ______________
జవాబు.
శబ్దాలు = చప్పుళ్ళు

ఈ) సంతోషం = ______________
జవాబు.
సంతోషం = సంబరం, ఆనందం

ఉ) కాలువలు = ______________
జవాబు.
కాలువలు = మోర్లు

ఊ) ఇంతకుముందు కాలం = ______________
జవాబు.
ఇంతకుముందు కాలం = వెనుకటి కాలం

ఋ) ప్రాణులు = ______________
జవాబు.
ప్రాణులు = జీవులు

ౠ) పిల్లవాళ్లు = ______________
జవాబు.
పిల్లవాళ్లు = పోరగాండ్లు

ఎ) వాహనాలు = ______________
జవాబు.
వాహనాలు = మోటార్లు

ఏ) వేగంగాపోవడం = ______________
జవాబు.
వేగంగాపోవడం = బుర్రుబుర్రున

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

2. కింది పదాలలో భిన్నమైన పదాన్ని గుర్తించి గీత గీయండి.

అ) పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క
జవాబు.
కుక్క

ఆ) బావులు, నదులు, సముద్రాలు, చెరువులు
జవాబు.
సముద్రాలు

ఇ) కారు, స్కూటర్, సైకిలు, లారీ
జవాబు.
సైకిలు

ఈ) బీడిపొగ, వాహనాల పొగ, సాంబ్రాణిపొగ, ఫ్యాక్టరీపొగ
జవాబు.
సాంబ్రాణిపొగ

3. కింది పట్టికను చదివి అందులోని ప్రకృతి – వికృతులను రాయండి.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 5

జవాబు.

ప్రకృతి – వికృతి

ఉదా : లక్ష్మి – లచ్చి
సింహం – సింగం
శబ్దం – సద్దు
రాత్రి – రాతిరి
అటవి – అడవి
భూమి – బువి
ఆశ – ఆస
సముద్రం – సంద్రం
శక్తి – సత్తి

4. పాఠంలో గల ఆంగ్లపదాలను వాటి అర్థాలను రాయండి.
ఉదా: డాక్టరు = వైద్యుడు
జవాబు.
టీవి = టెలివిజన్, దూరదర్శన్
సెల్ఫోన్ = సెల్యులర్ ఫోన్, మొబైల్ ఫోన్
ప్లాస్టిక్ = మృదువైన, రూపమిచ్చు శక్తి గల
ఫ్యాక్టరీ = కార్కానా
రోడ్డు = బాట, దారి
సౌండు = శబ్దం, ధ్వని
టవర్స్ = గోపురాలు
సిగ్నల్స్ = గురుతులు, సంకేతాలు
బోర్లు = అఖాతంలో అకస్మాత్తుగా ఏర్పడే అలలు
మోటార్లు = యంత్రశక్తితో నడిచే బండ్లు, మోటారుబండ్లు

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది ఖాళీలను విభక్తులతో పూరించండి. విభక్తుల పేర్లు రాయండి.

అ. రాజు సేనలతో వచ్చాడు.
జవాబు.
తృతీయా విభక్తి

ఆ. దొంగతనం చేయడం కంటే పేదవానిగా ఉండటం మేలు.
జవాబు.
పంచమీ విభక్తి

ఇ. వృద్ధులను ఆదరించాలి.
జవాబు.
ద్వితీయా విభక్తి

ఈ. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జవాబు.
చతుర్థీ విభక్తి

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

అ. కృష్ణార్జునులు = ______________
జవాబు.
విగ్రహవాక్యం – కృష్ణుడును, అర్జునుడును
సమాసం పేరు – ద్వంద్వ సమాసం

ఆ. శివకేశవులు = ______________
జవాబు.
విగ్రహవాక్యం – శివుడును, కేశవుడును
సమాసం పేరు – ద్వంద్వ సమాసం

ఇ. నిరాశానిస్పృహలు = ______________
జవాబు.
విగ్రహవాక్యం – నిరాశయు, నిస్పృహయు
సమాసం పేరు – ద్వంద్వ సమాసం

ఈ. భయాందోళనలు = ______________
జవాబు.
విగ్రహవాక్యం – భయమును, ఆందోళనయు
సమాసం పేరు – ద్వంద్వ సమాసం

ఉ. న్యాయాన్యాయాలు = ______________
జవాబు.
విగ్రహవాక్యం – న్యాయమును, అన్యాయమును
సమాసం పేరు – ద్వంద్వ సమాసం

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

3. కింది పదాలను విడదీసి రాయండి.

అ) నీవెక్కడ = ______________ + ______________
జవాబు.
నీవు + ఎక్కడ – ఉత్వసంధి

ఆ) లేకుంటె = ______________ + ______________
జవాబు.
లేక + ఉంటె – అత్వసంధి

ఇ) మరేమి = ______________ + ______________
జవాబు.
మరి + ఏమి – ఇత్వసంధి

ఈ) రామాలయం = ______________ + ______________
జవాబు.
రామ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి

4. కింది పదాలను కలిపి రాయండి.
అ) మేన + అత్త = ______________
జవాబు.
మేనత్త – అత్వసంధి

ఆ) మనసు + ఐన = ______________
జవాబు.
మనసైన – ఉత్వసంధి

ఇ) ఏమి + అంటివి = ______________
జవాబు.
ఏమంటివి – ఇత్వసంధి

ఈ) దేవ + ఇంద్రుడు = ______________
జవాబు.
దేవేంద్రుడు – గుణసంధి

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

5. కింది ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి. భాషాభాగాల పేర్లను రాయండి.

(అతను, కమ్మగా, కొబ్బరికాయ, వెళ్ళి, అబ్బా)
ఉదా : శంకర్ పామును చూసి అమ్మో ! అంటూ పరుగెత్తాడు. (అవ్యయం)

అ) రాధ గుడికి వెళ్ళి ______________ కొట్టింది.
జవాబు.
కొబ్బరికాయ – నామవాచకం

ఆ) అమ్మ చేసిన పాయసం ______________ ఉన్నది.
జవాబు.
కమ్మగా – విశేషణం

ఇ) గోపాలు డాక్టరే కాదు, ______________ యాక్టరు కూడా.
జవాబు.
అతను – సర్వనామం

ఈ) నవీన్ బాసరకు ______________ సరస్వతీ దేవిని దర్శించుకున్నాడు.
జవాబు.
వెళ్ళి – క్రియ

ఉ) రవి ఉరుకుతూ కిందపడి ______________! అని అరిచాడు.
జవాబు.
అబ్బా – అవ్యయం

ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
పర్యావరణానికి సంబంధించిన పాటలను, కవితలను లేదా గేయాలను సేకరించి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
మొక్కలు నాటితే మిక్కిలి లాభం
పాదులు చక్కగా చేద్దాము
మొక్కలు చక్కగా వేద్దాము
నీడను ఇచ్చి పళ్ళను ఇచ్చి
ప్రాణాలే నిలబెడతాయి
పచ్చదనాన్ని కలిగించి
పర్యావరణం రక్షిస్తాయి
ఎండవేడిని తగ్గించి
వర్షాలు కురిపిస్తాయి
వ్యాధుల పీడలు పోగొడతాయి.
కాలుష్యాన్ని అరికట్టి
– యం.వి.జి. ఆంజనేయులు

(లేదా)
ప్రశ్న 2.
అడవులు / పశువులు / పక్షులు / చెరువులు / నేలతల్లి / బావుల గొప్పతనాన్ని తెలిపే వ్యాసాలను సేకరించి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అడవులు సారవంతమైన మృత్తికలను పరిరక్షిస్తాయి. వర్షపాతాన్ని కలిగిస్తాయి. వరదలను, వాతావరణ కాలుష్యాన్ని అరికడతాయి. కలప, ఇతర ఉత్పత్తులను అందిస్తాయి. వందలాది రకాల జంతువులు తలదాచుకోవడానికి ఉపయోగపడతాయి. వంట చెరకులకు, ఇండ్ల సామానులకు ఉపయోగపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జాతిని అడవి తల్లి తన ఒడిలోని బిడ్డలా రక్షిస్తుంది.

కానీ కృతజ్ఞతగానీ, ముందుచూపుగానీ లేని మానవుడు అడవులను నాశనం చేసి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడని చెప్పక తప్పదు. ఇప్పటికైనా అడవుల ప్రాముఖ్యాన్ని గుర్తించి వాటి పెరుగుదలకు అందరూ దోహదపడటం మంచిది.

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

TS 6th Class Telugu 12th Lesson Important Questions కాపాడుకుందాం

III. సృజనాత్మకత /ప్రశంస.

ప్రశ్న 1.
“వృక్షోరక్షతి రక్షితః” అన్న విషయాన్ని తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

సోమవరం,
X X X X X.

ప్రియమిత్రుడు ఫణికి,

ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. ఇటీవల మా ఊరిలో “పచ్చని మొక్కలు అందరూ పెంచాలి” అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు మొక్కలు పంచారు. “పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు” అన్నారు పెద్దలు. మన చుట్టూ ఉన్న చెట్లూ చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై రక్షణ కవచమై నిలుస్తాయి.

వాటికి హాని చేయక, కాపాడుకోవడమే మన ధర్మం. కానీ మనిషి తన బాధ్యతను మరచిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. చెట్ల ద్వారా మనం పండ్లు, నీడ, ప్రాణవాయువు పొందుతున్నాము. వంట చెఱుకును పొందుతున్నాము. అందుకే కరుణశ్రీ ఇలా అన్నారు – “త్యాగ భావమునకు తరువులే గురువులు” అని. నీవు కూడా మొక్క నాటి, దాన్ని కాపాడు. ఉంటాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
డి. ప్రవీణ్.

చిరునామా :
కె. ఫణి,
S/o ప్రసాదరావు,
హయత్ నగర్, హైదరాబాద్.

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

IV. భాషాంశాలు:

నానార్థాలు:

ప్రశ్న 1.
ప్రకృతి =
జవాబు.
ప్రకృతి = మొదటి రూపు, ప్రత్యయము చేరక ముందున్న శబ్ద స్వరూపం, తల్లి, పరమాత్మ

పర్యాయపదాలు:

ప్రశ్న 1.
జల్దీ = ______________
జవాబు.
తొందరగా, త్వరగా

ప్రశ్న 2.
సల్ల = ______________
జవాబు.
మజ్జిగ, చల్ల

ప్రశ్న 3.
పెరుడు = ______________
జవాబు.
పెరడు, ఇంటి వెనుక దొడ్డి

ప్రశ్న 4.
జాగ = ______________
జవాబు.
స్థలం, చోటు

ప్రశ్న 5.
దోస్తు = ______________
జవాబు.
స్నేహితుడు, మిత్రుడు

ప్రశ్న 6.
మజా = ______________
జవాబు.
సంతోషం, సంబురం

ప్రశ్న 7.
దుంకు = ______________
జవాబు.
దూకు, దుముకు

ప్రశ్న 8.
స్వచ్ఛత = ______________
జవాబు.
నిర్మలం, శుభ్రం

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
ఆశ = ______________
జవాబు.
ఆశ = కోరిక
మనిషికి ఆశలు ఎక్కువై ప్రకృతిని పాడుచేస్తున్నాడు.

ప్రశ్న 2.
ఆశ్రయం = ______________
జవాబు.
ఆశ్రయం = నివాసం
అజ్ఞాతవాసంలో పాండవులు విరాటుని ఆశ్రయం పొందారు.

ప్రశ్న 3.
దర్శించు = ______________
జవాబు.
దర్శించు = చూడు
గోలకొండ కోట దర్శించ దగ్గ పర్యాటక ప్రాంతం.

వ్యాకరణాంశాలు:

కింది వానిలో సరైన దానిని గుర్తించండి.

ప్రశ్న 1.
ఏకవచనం ( )
అ) చెరువులు
ఆ) అడవులు
ఇ) నది
ఈ) కృష్ణార్జునులు
జవాబు.
ఇ) నది

ప్రశ్న 2.
ద్విత్వాక్షరం ( )
అ) ఆర్యా
ఆ) ఇంద్ర
ఇ) నేత్రం
ఈ) అమ్మ
జవాబు.
ఈ) అమ్మ

ప్రశ్న 3.
నపుంసక లింగం ( )
అ) రాముడు
ఆ) చెట్టు
ఇ) సీత
ఈ) ఫణి
జవాబు.
ఆ) చెట్టు

ప్రశ్న 4.
బహువచనం ( )
అ) మొక్కలు
ఆ) ఆలు
ఇ) తేలు
ఈ) తోలు
జవాబు.
అ) మొక్కలు

ప్రశ్న 5.
‘చెట్లు నరకాలి’ – వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.
జవాబు.
చెట్లు నరకకూడదు.

ప్రశ్న 6.
కింది వాటిలో సంబంధం లేనివి గుర్తించండి.

అ) భూమి, ఆకాశం, గాలి, కాలుష్యం
జవాబు.
కాలుష్యం

ఆ) మొక్క, మొక్కు, చెట్టు, వృక్షం
జవాబు.
మొక్కు

ఇ) చెఱువు, సరస్సు, కరవు, కొలను
జవాబు.
కరవు

ప్రశ్న 7.
మొక్కలు నాటి, నీరు పోయండి
జవాబు.
సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 8.
వీటిలో హ్రస్వంతో మొదలయ్యే మాటలేవి ? – ఏ వాక్యం ?
అ) అమ్మ, నాన్న
ఆ) అత్త, మామ
ఇ) అన్నా, వదిన
ఈ) అమ్మ, అత్త
జవాబు.
ఈ) అమ్మ, అత్త

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

పదాలు – అర్థాలు:

I. జల్ది = తొందరగా, త్వరగా
సల్ల = మజ్జిగ, చల్ల
పెరట్ల = పెరటిలో, ఇంటివెనుక దొడ్డిలో
గుడ్డెలుగులు (గుడ్డెలుగులు) = ఎలుగుబంటి పిల్లలు
అప్పాలు = అప్పచ్చులు, పిండివంటలు
జాగ = స్థలం, చోటు
దోస్తు = స్నేహితుడు, మిత్రుడు
కబ్జ = ఆక్రమణ

II. మజా = సంతోషం, సంబురం
సంబురం = ఆనందం
పోరగాండ్లు = పిల్లలు
దుంకు = దూకు, దుముకు

III. స్వచ్ఛత = నిర్మలం, కాలుష్యం లేనిది
మౌరీ = మురికినీరు పోయే గుంట
అల్లాడు = చలించు
సోయి = మంచి మనస్సు

పాఠం నేపథ్యం / ఉద్దేశం:

మన చుట్టూ ఉన్న చెట్లూచేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సంభాషణలు మన కళ్ళముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి.

ప్రవేశిక:

చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు మొదలైనవన్ని ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మరచిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. సంగతులన్నీ తెలుసుకోవాలని ఉందా ! అయితే ఈ పాఠం చదువండి.

TS 6th Class Telugu Guide 12th Lesson కాపాడుకుందాం

నేనివి చేయగలనా?

  • పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే అంశాన్ని సమర్థిస్తూ మాట్లాడగలను. – అవును/ కాదు
  • అపరిచితమైన పేరాను చదివి పట్టికను పూరించగలను. – అవును/ కాదు
  • ఇచ్చిన అంశాన్ని విశ్లేషిస్తూ రాయగలను. – అవును/ కాదు
  • ఇచ్చిన అంశానికి సంబంధించి పోస్టరు తయారుచేయగలను. – అవును/ కాదు

Leave a Comment