TS 10th Class Telugu (S/L) Model Paper Set 3 with Solutions

Reviewing TS 10th Class Telugu Model Papers Set 3 (S/L) can help students identify areas where they need improvement.

TS SSC Telugu (S/L) Model Paper Set 3 with Solutions

పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

సమయం : 2 గం. 30 ని.లు
మార్కులు: 60

విద్యార్థులకు సూచనలు :

  1. జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
  2. పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.

అ) కింది పేరాను చదవండి. ప్రశ్నలను తయారు చేయండి. (5 × 1 = 5 మా.)

పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించాడు. అతని కొడుకు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు-అనే పేరు కూడా ఉంది. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు.

ఒకనాడు వాళ్ళిద్దరు నదీ తీరానికి పోయారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎరిగే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందుపడ్డది. గౌతముడు జాలితో, కింద పడ్డ హంసను ఒడిలోకి తీసుకొని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు.

ప్రశ్న 1.
………………………..
జవాబు:
శుద్ధోదనుని కుమారుడు ఎవరు ?

ప్రశ్న 2.
………………….
జవాబు:
గౌతమునికి గల మరొక పేరు ఏమిటి ?

TS 10th Class Telugu (S/L) Model Paper Set 3 with Solutions

ప్రశ్న 3.
………………….
జవాబు:
గౌతముడు ఎటువంటి సుగుణాలతో పెరిగాడు ?

ప్రశ్న 4.
………………….
జవాబు:
నదీ తీరానికి ఎవరెవరు వెళ్ళారు ?

ప్రశ్న 5.
………………….
జవాబు:
ఆకాశంలో ఎగిరే హంసలను బాణంతో కొట్టింది ఎవరు ?

ఆ) కింది పద్యాలలో ఒర పద్యానికి భావం రాయండి. (1 × 5 = 5 మా.)

6. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నింద సేయబోకుము, కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకు మయ్యకుమారా !
జవాబు:
కుమారా ! ఉపాధ్యాయుణ్ని ఎదిరించకు. నీకు రక్షణగా ఉన్న వ్యక్తిని నిందించకు. ఏదైనా పని చేస్తున్నప్పుడు నీ ఒక్కని ఆలోచనతో మాత్రమే చేయకు. మీ ఇంట్లో ఆచరించే ఆచారాన్ని ఎప్పుడూ విడువకుండా ఉండుము.

(లేదా)

నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే
జూచని వాఁడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ?
జవాబు:
కరుణ అనే సముద్రమే నిధిగా కలిగిన వాడా ! భద్రాచలంలో నివాసం ఉన్నవాడా ! దశరథ మహారాజు కుమారుడా ! శ్రీరామా ! తల్లిదండ్రులకు గొప్పవాడయ్యే ఒక కొడుకు ఉన్నా మంచిదే. అతడెలా ఉండాలంటే ఎవరి దగ్గర చేయి చాపుతూ బ్రతుకకూడదు. పదిమందికి దానం చేసే స్థితిలో ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. యుద్ధంలో వెన్ను చూపకూడదు. ఇలాంటి కొడుకే గొప్పవాడు.

ఇ) కింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 2 = 10 మా.)

‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని మహాకవి గురజాడ ఏ సందర్భంలో, అన్నాడో కానీ ఇప్పుడు మాత్రం మట్టి కూడా కనిపించని రీతిలో మనుషులు పెరిగిపోతున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండియా రెండవ స్థానంలో ఉన్నది. తిలక్ అనే కవి ‘అమెరికాలో డాలర్ల పంట, ఇండియాలో, పిల్లల పంట’ అని వ్యంగ్యం అన్నాడు. పూర్వపు రోజుల్లో ఎక్కువమంది సంతానం కలిగి ఉండడం సౌభాగ్యంగా భావించేవారు.

అట్లాగే సంతానంలో కొడుకు తప్పనిసరిగా ఉండాలనే భావన, కోరికలు కూడా జనాభాను పెంచుతున్నాయి. వీటికి తోడు ఆయా కులాల, మతాల విశ్వాసాలు, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత వంటివి కూడా జనాభా పెరగడానికి కారణాలవుతున్నాయి. ఇదే కాకుండా అనేక కారణాల వల్ల ఇతర దేశాల నుండి అక్రమంగా వలసవచ్చే వారితో కూడా జనాభా పెరుగుతున్నది. జనాభా పెరగడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది.

ఆహార కొరత, నీటి సమస్య, వసతి సమస్య, నిరుద్యోగ సమస్యలతో పాటు కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ప్రభుత్వ పథకాలు అందరికీ చేరవు. అశాంతి, అభద్రత, ఆందోళనలు పెరిగి దోపిడీకి దారి తీస్తాయి. హింసకు తావునిస్తాయి. చివరకు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. అందుకే జనాభాను నియంత్రించాలి. అందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు మరియు దేశంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ సమాజంలో చైతన్యం తీసుకురావాలి.

ప్రశ్న 7.
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అని ఎవరు అన్నారు ?
జవాబు:
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అని మహాకవి గురజాడ అన్నారు.

ప్రశ్న 8.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది ? భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ?
జవాబు:
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. భారతదేశం రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 9.
జనాభా పెరగడానికి కారణాలు అయ్యేవి ఏవి ?
జవాబు:
సంతానంలో కొడుకు ఉండాలనే భావన, ఆయా కులాల, మతాల విశ్వాసాలు, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత వంటివి జనాభా పెరగడానికి కారణాలవుతున్నాయి.

ప్రశ్న 10.
జనాభా పెరగడం వల్ల ఏం జరుగుతున్నది ?
జవాబు:
జనాభా పెరగటం వల్ల ఆహార కొరత నీటి సమస్య, వసతి సమస్య, నిరుద్యోగ సమస్యలతో పాటు కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి.

TS 10th Class Telugu (S/L) Model Paper Set 3 with Solutions

ప్రశ్న 11.
జనాభాను ఎందుకు నియంత్రించాలి ?
జవాబు:
జనాభా పెరుగుదల వల్ల అనేక సమస్యలు వస్తాయి. అశాంతి, అభద్రత, ఆందోళనలు పెరిగి దోపిడీకి దారి తీస్తాయి. హింసకు తావునిస్తాయి. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. అందుకే జనాభాను నియంత్రించాలి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (32 మార్కులు).

అ) కింది ప్రశ్నలకు 4 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. (4 × 4 = 16 మా.)

ప్రశ్న 12.
శ్రీకృష్ణుడు గోపబాలకులతో ఏమని చెప్పి పిల్చాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు గోపబాలకులతో “ఓ పిల్లలారా ! ఎండలో మాడిపోయారు. ఆకలితో ఉన్నారు. మరి చద్ది తినడానికి ఆలస్యమెందుకు ? ఇక్కడకు రండి. ఇది చక్కని చోటు. మన లేగదూడలు ఈ పక్కనే నీరు తాగి, పచ్చిగడ్డి మేస్తూ గుంపుగా తిరుగుతూ ఉంటే మనం ఎంతో సంతోషంగా చద్ది తిందాం” అని చెప్పి పిల్చాడు.

ప్రశ్న 13.
ఎటువంటి సేవకుడు భగవంతునికి ప్రియుడవుతాడు ?
జవాబు:
ఎప్పుడూ సత్యమునే పల్కేవాడు, చెడు ఆచారాలను పాటించనివాడు, ఔచిత్యాన్ని మరచిపోనివాడు, చెడు సంగతుల మార్గంలో ఉండనివాడు, భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడూ విడువనివాడు, కోరికలకు లోనుకానివాడు భగవంతునికి ప్రియమైన సేవకుడవుతాడు.

ప్రశ్న 14.
భాగ్యరెడ్డి వర్మను తిరుగులేని నాయకుడిగా చేసిన అంశాలేమిటి ?
జవాబు:
హిందూ మతం, హిందువులు తమ చరిత్రను లిఖిత బద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. అణగారిన వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు. ఏమీ ఆశించకుండా, తమ కోసం ఎప్పటికీ పని చేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసే వర్మ అచిరకాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొనగలిగాడు.

ప్రశ్న 15.
ఇల్లిందల సరస్వతీ దేవి గురించి రాయండి.
జవాబు:
ఇల్లిందల సరస్వతీ దేవి స్వాతంత్ర్యానికి పూర్వమే సృజనాత్మకత రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన ‘స్వర్ణకమలాలు’ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. తులసీదళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు. 1918 నుండి 1998 మధ్యకాలంలో జీవించారు.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి. (2 × 8 = 16 మా.)

ప్రశ్న 16.
శ్రీకృష్ణునితో కలిసి గోపబాలురు చల్ది ఏ విధంగా తిన్నారు ?
జవాబు:
శ్రీకృష్ణునితో కలిసి గోపబాలురు ఈ విధంగా చల్ది తిన్నారు. ఒకడు ఒక వేలు మడిచి ఊరగాయలు తింటూ ఇతరులకు నోరూరేలాగా చేస్తున్నాడు. ఇంకొకడు పక్కవాని కంచంలోని పదార్థాన్ని చటుక్కున మింగి, వాడు అడిగితే “నేను మింగలేదు. కావాలంటే చూడు” అని నోరు తెరిచి చూపిస్తున్నాడు. మరొకడు పందెం వేసుకొని అయిదారుగురి చద్దిని నోట్లోకి కుక్కుకొని తింటున్నాడు.

ఒకడేమో తన పదార్థాలన్నింటినీ అందరికీ వడ్డించి “స్నేహమంటే ఇదే” అంటూ బంతి భోజనం చేస్తున్నాడు. ఒకడు తన పక్కవానితో “అదిగో కృష్ణుని చూడు” అని చెప్పి మోసగించి అతని కంచంలోని మంచి పదార్థాన్ని అమాంతంగా తింటున్నాడు. ఒకడేమో నవ్వుతూ ఉన్నాడు. ఇంకొకడు నవ్విస్తున్నాడు. ఒకడు మాట్లాడుతున్నాడు. ఇంకొకడు సంతోషిస్తున్నాడు.

(లేదా)

కనపర్తి వర్ణించిన శ్రమజీవి ఔన్నత్యం సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
కనపర్తి వర్ణించిన శ్రమజీవి ఝాన్సీలక్ష్మీ కాదు. రుద్రమదేవి అంతకంటే కాదు. సమాజం గుర్తుంచుకొనే నాయకురాలు కాదు. ఒక సామాన్య జీవి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి, చీపురు, ఒక బుట్ట తీసుకుని వీధుల్లోకి వస్తుంది. ఆ వీధులన్నీ పరిశుభ్రంగా చిమ్ముతుంది. చెత్తనంతా పోగుచేసి బుట్టల్లోకి ఎత్తుకుని ఊరి చివర గుట్టగా వేస్తుంది. “వారానికి ఒకసారి తగులబెడుతుంది.

పర్యావరణ పరిరక్షణ చేయడమే ఆమె ధ్యేయం. ఈ పనిలో ఆమెకు తరతమ భేదాలు లేవు. తాను చేస్తున్న విద్యుక్త ధర్మ నిర్వహణలో ఎపుడూ మునిగితేలుతుంది. ఎప్పుడైతే ఒకరోజు రాకపోతే ఆ వీధులన్నీ కళావిహీనంగా, చెత్తాచెదారంతోను నిండియుంటాయి. అపుడు ఎందుకు రాలేదోనని ఎవరు విచారించరు. ఆమె కష్టసుఖాలను గురించి ఎవరు విచారించరు. సమ్మార్జన సేవతో తరిస్తున్న ఆమె ఔన్నత్యానికి వందనం ఆచరిస్తున్నానని రచయిత చెప్పుకున్నాడు.

ప్రశ్న 17.
పొడుపు కథల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వేదకాలం నుండి ప్రశ్నోత్తర రూపమైన విజ్ఞానం మన సంస్కృతిలో ఉద్భవించింది. ప్రశ్నోత్తర రూపమైన ఈ విజ్ఞానం ప్రధానంగా మనకు మహాభారత వన పర్వంలో యక్షరూపియైన ధర్మదేవ, ధర్మజుల సంభాషణలో కన్పిస్తుంది.

ఈ యక్ష ధర్మజుల సంవాదంలో ప్రకటితమైన మహావిజ్ఞావమే యక్షప్రశ్నలు. అందుకే ఈనాడు విడదీయరాని చిక్కును గూర్చి చెప్పవలసి వచ్చినపుడు ఇది యక్ష ప్రశ్న అని అంటుంటారు.

యక్ష ప్రశ్న అంటే గడ్డు సమస్య అని అర్థం. ఈ విధంగా ఎంతో పురాతనమైన ఈ ప్రశ్నోత్తర విధానం ఆయా కాలాల్లో ఆయా కవుల చేతుల్లో మెలగి జన బాహుళ్యంలో ప్రాచుర్యాన్ని పొంది, విద్వల్లోకంలో ప్రహేళికా రూపంలో, జనసామాన్యంలో పొడుపు కథా రూపంలో స్థిరపడింది.

ఈ పొదుపు కథలకే మారుకతలని మరొక పేరు కలదు. విస్తృతమైన విషయం సూత్రబద్ధం చేయబడి సూక్ష్మరూపంలో ఇమిడి ఉంటుంది. అందుకే ఈ పొడుపు కథకు ‘శాస్త్రం’ అని పేరు ఏర్పడింది.

(లేదా)

తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాల గురించి వివరించండి. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటానికి మీరేం చేస్తారు ?
జవాబు:
జాతి సంస్కృతినీ, నాగరికతనూ, ప్రజల వేషభాషలను బట్టి ఆచార వ్యవహారాలను తెలుసుకుంటున్నాము. వాకిట్లో ముగ్గూ, గడపలకు పసుపుకుంకుమలతో బొట్టూ, మామిడాకు బంతిపూలతో గుమ్మాలకు తోరణాలూ మున్నగునవి మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు. అంతేకాక మన హిందూ స్త్రీలకి ప్రత్యేకత ఉంది.

భక్తి శ్రద్ధలతో దీక్షతో నోములు, వ్రతాలు ఆచరించి ఒక విశిష్టమైన సంస్కృతికి అద్దం పట్టారు. నోములూ, వ్రతాలూ స్త్రీల జీవితంలో పరమ పవిత్రమైన కార్యాలు. అందులోనూ అతి ముఖ్య ఘట్టాలు ఉపవాసాలు. తెలుగువారి ఇళ్ళల్లో నిర్వహించే పండుగలు తెలుగువారి సంస్కృతీ, సంప్రదాయాలకు పతాకలు.

నేను పండుగలు, నోములు, వ్రతాల గురించి తెలుసుకుంటాను. ఈ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటాను. మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని వివరించే గ్రంథాలు చదువుతాను. తోటివారు అనుసరించేలా కృషి చేస్తాను. దైవభక్తిని, ఆధ్యాత్మికతను అలవరచుకొంటాను.

మన పూర్వీకుల గొప్పదనాన్ని, ఆ కాలంనాటి సంస్కృతీ సంప్రదాయాల గురించి పెద్దలనడిగి తెలుసుకుంటాను. లలితకళలు సంస్కృతి పరిరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. నేను కూడా నాకిష్టమైన లలితకళను అభ్యసిస్తాను. మన సంస్కృతీ సంప్రదాయాలను నేను పాటించడమే కాక ఇతరులు కూడా పాటించేలా ప్రోత్సహిస్తాను. మాతృభాషకు పెద్ద పీట వేస్తాను.

TS 10th Class Telugu (S/L) Model Paper Set 3 with Solutions

ఇ) సృజనాత్మకత (8 మార్కులు)

అ) కింది ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి. (1 × 8 = 8 మా.)

ప్రశ్న 18.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

పెద్దపల్లి,
X X X X X

ప్రియమైన అఖిలేషు,

నేను బాగా చదువుతున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ మధ్య నేను చిన్న సాహసం చేశాను. మా పాఠశాలలో నాతో చదివే జలజను ఒక దుర్మార్గుడు నిత్యం తన్ను ప్రేమించమని ఏడిపిస్తూ ఉండేవాడు. నేను వాడితో తగువు పెట్టుకొని వాడిని తన్నాను. పోలీసులకు వాణ్ణి అప్పగించాను.

మనం మనతోటి స్త్రీలను మన అక్కా చెల్లెళ్ళలా, మన తల్లుల్లా భావించి వారికి రక్షణగా నిలబడాలి. నిజానికి స్త్రీలు ఈ భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. స్త్రీల పట్ల అపచారం చేస్తే వారు నాశనం అవుతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు.

స్త్రీలకు ఎటువంటి అవమానం జరుగకుండా, మనం చూడాలి. తోటి స్త్రీలను కన్నతల్లుల్లా, మన సోదరీమణుల్లా చూడాలి. నేను చేసిన సాహసాన్ని నీవు తప్పక అభినందిస్తావని నమ్ముతున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
ఆర్యన్

చిరునామా :
ఎ. అఖిలేష్,
10వ తరగతి, జె.పి. హైస్కూల్,
ఆదిలాబాద్.

ప్రశ్న 19.
“సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలడం” అనే అంశంపై కరపత్రం తయారుచేయండి.
జవాబు:

మూఢనమ్మకాలను తరిమికొడదాం

‘మన సమాజంలో ఎంతో కాలంగా ఎన్నో దురాచారాలు, మూఢనమ్మకాలు పాతుకుపోయాయి. వాటిని మనం గుడ్డిగా నమ్మి పాటిస్తూ వస్తున్నాము. రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులుగారు వంటి సంఘసంస్కర్తలు, సతీ సహగమనము, భర్తపోయిన స్త్రీలకు అలంకారాలు తొలగించడం వంటి దురాచారాల నిర్మూలనకు కృషి చేసి, విజయం సాధించారు.

మన ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు విధవలకు తిరిగి వివాహాలు జరిపించారు. ఎన్నో మూఢాచారాలను వారు నిర్మూలించారు. దెయ్యాలు లేవని, భూతవైద్యం అంతా దగా అని వారు నిరూపించారు. సంఘంలో దెయ్యాలు, చేతబడులు, శకునాలు వంటి వాటిని నమ్ముతున్నారు. చేతబడులు చేశారని కొంతమందిని చంపేస్తున్నారు. శకునం మంచిదికాదని, ఆ రోజు తిథి మంచిది కాదని, పనులు ఆపేస్తున్నారు. ఇవన్నీ మూఢాచారాలు.

దెయ్యాలు లేవు. భగవంతుడు సృష్టించిన రోజులు, తిథులు అన్నీ మంచివే. ఎవరు శకునం వచ్చినా ఫర్వాలేదు. పిల్లి శకునం, వెధవముండ శకునం వంటి వాటిని పాటించనక్కరలేదు. అలాగే అంటరానితనాన్ని పాటించకూడదు. దేవుడి దృష్టిలో అంతా సమానమే. మూఢనమ్మకాలను తరిమికొట్టండి. మంచిని పాటించండి. పక్కవారిలో దైవాన్ని చూడండి. మతాలన్నీ మంచిని చెప్పేవే. నమ్మండి.

ఇట్లు,
మూఢ నమ్మకాల నిరోధక సంఘం,
తెలంగాణ రాష్ట్రం.

TS 10th Class Telugu (S/L) Model Paper Set 3 with Solutions

ప్రశ్న 20.
ఏదైనా ఒక పద్యం ఆధారంగా ఒక కథను రాయండి.
జవాబు:
పూర్వం గోదావరి నదీ తీరంలో సీతారామాపురం ఉంది. ఆ గ్రామంలో విశ్వనాథశాస్త్రి అనే కవి పండితున్నాడు. విశ్వనాథశాస్త్రి ఉపాధ్యాయుడు కావడానికి తగిన చదువు చదివి, పరీక్షలు పాసయ్యాడు. చక్కని ఉపన్యాసాలిచ్చేవాడు. స్వాగత పద్యాలు, పెళ్ళిళ్ళో ఆశీర్వచన పద్యాలు రాసేవాడు. అతడు సన్మాన పత్రం చాలా రాసేవాడు. కాని అతనికి ప్రభుత్వ ఉద్యోగం రాలేదు.

విశ్వనాథశాస్త్రికి ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు. ఏమంటే “స్థానిక ఎమ్మెల్యే సుబ్బారావు గారిని నమ్ముకుని ఆశ్రయిస్తే నీ దరిద్రం తీరిపోతుందని” అతని మాట ప్రకారం ఎమ్మెల్యేను ఆశ్రయించాడు. ఆ ఎమ్మెల్యే విశ్వనాధశాస్త్రి గారిని బాగా ఉపయోగించుకున్నాడు.

విశ్వనాథశాస్త్రికి మీటింగులలో ఎమ్మెల్యే సుబ్బారావు గారిని పొగడడం, ఆయనపై పద్యాలు, సన్మాన పత్రాలు రాయడం నిత్యకృత్యమైంది. కాని ఆర్థికంగా విశ్వనాథశాస్త్రికి ఉపయోగం లేకపోయింది. క్రమక్రమంగా విశ్వనాథశాస్త్రి కుటుంబ పరిస్థితులు మరింతగా క్షీణించాయి.

చివరకు భార్య సలహాతో విశ్వనాథశాస్త్రి భారత భాగవత పురాణాలు దేవాలయంలో చెప్పడం మొదలుపెట్టాడు. క్రమంగా భక్తులిచ్చే కానుకలతో విశ్వనాథశాస్త్రి దరిద్రం పోయింది.

క్రమక్రమంగా విశ్వనాథశాస్త్రి కుటుంబ పరిస్థితులు చక్కబడ్డాయి. అపుడు భార్య, విశ్వనాథశాస్త్రితో ఇలా అంది. “పదవుల్లో ఉన్నవారిని ఆశ్రయించడం కన్నా, దైవం పాదాలు పట్టుకోవడం మంచిది” అని. ఇప్పుడు పుణ్యం, పురుషార్థాలు రెండు కలిసి వచ్చాయి విశ్వనాథశాస్త్రికి.

పార్ట్ – B

సమయం : 30 ని.లు
మార్కులు : 20

సూచనలు :

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు నిర్దేశించిన స్థలంలో రాయాలి.
  2. పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ సమాధాన పత్రంతో జతపరచండి.

I. భాషాంశాలు (మార్కులు : 20 )

అ) పదజాలం : (10 మార్కులు)

కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. (2 × 1 = 2 మా.)

ప్రశ్న 1.
ఆపేక్ష : …………………………………………..
జవాబు:
ఆపేక్ష : ప్రతి విద్యార్థికి చదువుపై ఆపేక్ష ఉండాలి.

ప్రశ్న 2.
అపవాదు : ………………………..
జవాబు:
అపవాదు : క్రమశిక్షణలో ఉన్న విద్యార్థికి అపవాదు ఉండదు.

కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి (A/ B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (8 × 1 = 8 మా.)

ప్రశ్న 3.
ఓరిమి అనే పదానికి అర్థం
A) తీర్పు
B) ఓర్పు
C) నేర్పు
D) మార్పు
జవాబు:
B) ఓర్పు

ప్రశ్న 4.
కార్యము – అనే పదానికి అర్థం
A) గని
B) అని
C) పని
D) కని
జవాబు:
C) పని

ప్రశ్న 5.
శివుడు – అనే పదానికి పర్యాయపదాలు
A) ధూర్జటి, నటరాజు
B) నాట్యకత్తె, నటుడు
C) కేశవుడు, మాధవుడు
D) మన్మథుడు, మకరధ్వజుడు
జవాబు:
A) ధూర్జటి, నటరాజు

ప్రశ్న 6.
వ్రతము – అనే పదానికి నానార్థాలు
A) పథము, పందెము
B) వాము, రూపము
C) అందము, చందము
D) శపథము, నోము
జవాబు:
D) శపథము, నోము

ప్రశ్న 7.
ఘట్టము – అనే పదానికి వికృతి
A) ఒట్టు
B) గట్టు
C) పట్టు
D) భట్టు
జవాబు:
B) గట్టు

ప్రశ్న 8.
గుణము – అనే పదానికి వికృతి
A) కాన
B) ఘనము
C) వాన
D) గొనము
జవాబు:
D) గొనము

TS 10th Class Telugu (S/L) Model Paper Set 3 with Solutions

ప్రశ్న 9.
పరులు – ఈ పదానికి నానార్థాలు
A) ఇతరులు, శత్రువులు
B) పరోపకారులు, మత్యకారులు
C) వరులు, కురులు
D) కరులు, నికరులు
జవాబు:
A) ఇతరులు, శత్రువులు

ప్రశ్న 10.
భాస్కరుడు – అనే పదానికి వ్యుత్పత్తి
A) కాంతి లేనివాడు
B) చీకటి నిచ్చువాడు
C) కాంతిని పొందలేనివాడు
D) కాంతిని కలుగజేయువాడు
జవాబు:
D) కాంతిని కలుగజేయువాడు

ఆ) వ్యాకరణాంశాలు : (10 మార్కులు)

కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి (A/ B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)

ప్రశ్న 11.
అల్పుడెపుడు – ఈ పదంలో ఉన్న సంధి
A) యడాగమ సంధి
B) ఇత్వ సంధి
C) రుగాగమ సంధి
D) ఉత్వ సంధి
జవాబు:
D) ఉత్వ సంధి

ప్రశ్న 12.
మేఘుడు + ఒక – కలుప
A) మేఘుడాక
B) మేఘుడేక
C) మేఘుడొక
D) మేఘుడైక
జవాబు:
C) మేఘుడొక

ప్రశ్న 13.
వేరొకడు – విడదీస్తే పరపదంలో నున్న తొలి అచ్చు
A) ఉ
B) ఋ
C) ఏ
D) ఒ
జవాబు:
D) ఒ

ప్రశ్న 14.
పంచమీ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) గురుదక్షిణ
B) సత్యనిష్ఠ
C) దొంగభయము
D) నెలతాల్పు
జవాబు:
C) దొంగభయము

ప్రశ్న 15.
గోలకొండ దుర్గం నాలుగు మైళ్ళ వైశాల్యములో ఉండెను – ఈ వాక్యంలో ద్విగు సమాస పదం
A) గోలకొండ దుర్గం
B) వైశాల్యములో నుండెను
C) నాలుగు మైళ్ళు
D) మైళ్ళ వైశాల్యము
జవాబు:
C) నాలుగు మైళ్ళు

ప్రశ్న 16.
పద్మనాభుడు – ఏ సమాసం?
A) సప్తమీ తత్పురుషము
B) బహువ్రీహి
C) రూపకం
D) ఏదీకాదు
జవాబు:
B) బహువ్రీహి

ప్రశ్న 17.
నేను బడికి వెళ్ళాను. పాఠాలు వినలేదు. ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే
A) నేను బడికి వెళ్ళాను కాబట్టి పాఠాలు వినలేదు.
B) నేను బడికి వెళ్ళాను మరియు పాఠాలు వినలేదు.
C) నేను బడికి వెళ్ళాను కాని పాఠాలు వినలేదు.
D) పాఠాలు వినలేదు కాబట్టి నేను బడికి వెళ్ళాను.
జవాబు:
C) నేను బడికి వెళ్ళాను కాని పాఠాలు వినలేదు.

ప్రశ్న 18.
“నీవు ఎక్కడికి వెళ్ళావు ?” – మా అన్న నన్ను అడిగాడు. దీన్ని పరోక్ష వాక్యంగా మారిస్తే
A) నేను ఎక్కడికి వెళ్ళానని మా అన్న నన్ను ప్రశ్నించాడు.
B) నీవు ఎక్కడికి వెళ్ళావని మా అన్న నన్ను అడిగాడు.
C) వాడు ఎక్కడికి వెళ్ళాడని అన్న నన్ను అడిగాడు.
D) నీవు ఎక్కడికి వెళ్ళవద్దని మా అన్న నన్ను అడిగాడు.
జవాబు:
A) నేను ఎక్కడికి వెళ్ళానని మా అన్న నన్ను ప్రశ్నించాడు.

ప్రశ్న 19.
పాదుషాచే ఆంధ్రకవులు సత్కరింపబడిరి. దీనిని కర్తరి వాక్యంగా మారిస్తే
A) పాదుషా ఆంధ్ర కవులకు సత్కారం చేశాడు.
B) పాదుషా ఆంధ్ర కవులను సత్కరించాడు.
C) ఆంధ్ర కవులకు పాదుషాను సత్కారం చేశాడు.
D) పాదుషా ఆంధ్ర కవులు సత్కరింపబడ్డారు.
జవాబు:
B) పాదుషా ఆంధ్ర కవులను సత్కరించాడు.

ప్రశ్న 20.
పోతన రామునకు అంకితం ఇచ్చాడు. మానవులకు అంకితం ఇవ్వలేదు – దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే
A) మానవులకు అంకితం ఇవ్వలేదు కాబట్టి రామునకు అంకితం ఇచ్చాడు.
B) మానవులకు అంకితం ఇవ్వక పోతన రామునకు అంకితం ఇచ్చాడు.
C) రామునకు పోతన అంకితమిచ్చాడు. కాబట్టి మానవులకు అంకితం ఇవ్వలేదు.
D) మానవులకు అంకితం ఇవ్వలేదు అయినా పోతన రామునకు అంకితం ఇచ్చాడు.
జవాబు:
B) మానవులకు అంకితం ఇవ్వక పోతన రామునకు అంకితం ఇచ్చాడు.

Leave a Comment