AP Inter 2nd Year Botany Notes Chapter 5 మొక్కలలో శ్వాసక్రియ

Students can go through AP Inter 2nd Year Botany Notes 5th Lesson మొక్కలలో శ్వాసక్రియ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 5th Lesson మొక్కలలో శ్వాసక్రియ

→ మొక్కల దేహానికి శ్వాసక్రియ శక్తిని అందిస్తుంది. ఆహార ఆక్సీకరణ ద్వారా ఇది జరుగుతుంది.

→ శ్వాసక్రియ నందు ఆక్సీకరణం గావించబడే పదార్థాలను శ్వాసక్రియా పదార్ధాలు అంటారు.

→ ‘గ్లూకోజ్’ శ్వాసక్రియ మొక్క ముఖ్య అధస్ధ పదార్ధం.

→ శ్వాసక్రియా పదార్ధాల నందు ఉన్న శక్తి మొత్తం ఒకేసారి స్వేచ్ఛగా కణాన్ని చేరదు. ఇది రసాయనిక శక్తియైన ATP గా బంధించబడుతుంది.

→ జీవి తన యొక్క వివిధ శక్తి అవసరాలకు ఈ బంధించిన ATP ని వినియోగించుకుంటుంది.

AP Inter 2nd Year Botany Notes Chapter 5 మొక్కలలో శ్వాసక్రియ

→ మొక్కలలో శ్వాసక్రియ రెండు విధానాలలో జరుగుతుంది.

  1. పత్రరంధ్రాలు మరియు వాయువుల వినిమయం
  2. కణశ్వాసక్రియ

→ కణశ్వాసక్రియలో రెండు రకాలు కలవు (i) వాయు శ్వాసక్రియ (ii) అవాయు శ్వాసక్రియ

→ ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను ‘వాయుశ్వాసక్రియ’ అంటారు.
ఉదా: గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం.

→ ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను ‘అవాయు శ్వాసక్రియ’ అంటారు. ఉదా: కిణ్వన ప్రక్రియ

→ గ్లైకాలసిస్:

  1. జీవులన్నింటిలో శ్వాసక్రియ యొక్క మొదటి దశ గ్లైకాలసిస్ .
  2. ఇది కణాలలోని కణద్రవ్యంలో జరుగుతుంది.
  3. గ్లైకాలసిస్ లో గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం జరిగి శక్తి విడుదలవుతుంది. [IPE]
  4. గ్లైకాలసిస్ లో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెంది 2 అణువుల పైరూవిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది.

AP Inter 2nd Year Botany Notes Chapter 5 మొక్కలలో శ్వాసక్రియ
→ క్రెబ్స్ వలయం:

  1. క్రెబ్స్ వలయం అనేది వాయుసహిత జీవులన్నీంటిలో శక్తిని ఉత్పత్తి చేసే చర్యల వలయం.
  2. ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది.
  3. ఎసిటైల్ కో-ఎన్జైమ్ (Co.A) ఆక్సీకరణం చెంది CO2 మరియు H2O లను ఏర్పరుస్తుంది.
  4. అంతేకాకుండా ADP అధికశక్తి ఉండే ATP గా మారుతుంది. [IPE]

AP Inter 2nd Year Botany Notes Chapter 4 ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ

Students can go through AP Inter 2nd Year Botany Notes 4th Lesson ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 4th Lesson ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ

→ ఆకుపచ్చని మొక్కలు ‘కిరణజన్య సంయోగ క్రియను’ జరుపుతాయి.

→ ఈ చర్యనందు పత్రాలు, పత్ర రంధ్రాల ద్వారా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి.

→ కిరణజన్య సంయోగక్రియ నందు మొక్కలు కాంతిశక్తిని వినియోగించుకొని, కార్బోహైడ్రేట్లను సంశ్లేషణ చేస్తాయి.

→ భూమిపై ఉన్న అన్ని జీవరాశులు ప్రత్యక్షంగా (లేదా) పరోక్షంగా మొక్కలపై ఆధారపడతాయి.

→ కిరణజన్య సంయోగక్రియ సమస్త జీవరాశులకు ఆహరాన్ని మరియు దానితో పాటుగా వాతావరణంలోని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది.

→ పత్రాల యందు ఉన్న పత్రాంతర కణాలలోని హరితరేణువులు CO2 స్థాపనకు ముఖ్య ఆధారం.

→ హరిత రేణువుల యందు Chl ‘a’, Chl ‘b’, జాంధోఫిల్ మరియు కెరోటినాయిడ్స్ అనే ‘వర్ణద్రవ్యాలు’ ఉంటాయి.

→ Chl ‘a’ నందు (i) PSI (ii) PSII అనే రెండు కాంతి వ్యవస్థలు ఉంటాయి.

→ కాంతి రసాయన చర్య నందు విడుదలైన ATP మరియు NADPH శక్తిని ‘స్వాంగీకరణ శక్తి’ అంటారు.

AP Inter 2nd Year Botany Notes Chapter 4 ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ

→ ఈ స్వాంగీకరణ శక్తి నిష్కాంత చర్యలో కార్బోహైడ్రేట్స్ల సంశ్లేషణలో వినియోగించుకోబడుతుంది.

→ హరితరేణువు యొక్క ఆవర్ణిక నందు ‘నిష్కాంతి చర్య’ జరుగుతుంది.

→ నిష్కాంతి చర్యనందు ఏర్పడిన మొదటి అధస్ధ పదార్ధం ఆధారంగా రెండు మార్గాలను గుర్తించారు.

→ అవి (i) కాల్విన్ వలయం (C3 వలయం) (ii) హచ్ మరియు స్లాక్ వలయం (C4 వలయం). [IPE)

→ కాల్విన్ వలయం నందు కార్బాక్సిలేషన్, క్షయకరణం మరియు పునరుత్పత్తి ఉంటాయి.

→ కాల్విన్ వలయంలో మొదటగా ఏర్పడే స్థిర ఉత్పన్న పదార్ధం PGA (ఇది C3 పదార్ధం).

→ C4 వలయం రెండు కిరణజన్య సంయోగ క్రియా కణాలలో జరుగుతుంది. అవి పత్రాంతర కణాలు మరియు పుంజతొడుగు కణాలు.

→ ‘హచ్ మరియు స్లాక్ ‘ మార్గం యొక్క మొదటి స్థిర ఉత్పన్న పదార్ధం OAA ( ఇది C4 పదార్ధం).

AP Inter 2nd Year Botany Notes Chapter 3 ఎన్జైమ్లు

Students can go through AP Inter 2nd Year Botany Notes 3rd Lesson ఎన్జైమ్లు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 3rd Lesson ఎన్జైమ్లు

→ ఎన్జైమ్స్ అనేవి ప్రోటీనులు. ఇవి కణం యొక్క జీవ రసాయన చర్యలను ఉత్తేజితం చేస్తాయి.

→ దాదాపుగా అన్ని ఎన్జైమ్లు ప్రోటీనులే.

→ కొన్ని కేంద్రక ఆమ్లాలైన రైబోజోమ్లు ఎంజైమ్లుగా ప్రవర్తిస్తాయి.

→ హాలో ఎంజైమ్స్ యొక్క ప్రోటీన్ భాగాన్ని ‘అపోఎంజైమ్’ అని మరియు ప్రోటినేతర భాగాన్ని ‘సహకారకం’ అని అంటారు. [IPE]

→ సహ-కారకాలు మూడు రకాలు (a) ప్రోస్థటిక్ సముహం (b) సహ – ఎంజైమ్లు (c) లోహ అయాన్లు [IPE]

→ ఎన్జైమ్ల యొక్క ఉత్తేజస్ధానం నందు ‘పదార్థం ఇమడ గలిగే నొక్కు’ నందు పదార్థం ఇముడుతుంది.

→ ఎన్జైమ్లు వాటి యొక్క ఉత్తేజస్థానం నుంచి అధిక రేటు చర్యలను ఉత్ప్రేరితం చేస్తాయి.

AP Inter 2nd Year Botany Notes Chapter 3 ఎన్జైమ్లు

→ ఎన్ఎమ్లు అధిక ఉష్ణోగ్రత (40°C కంటే ఎక్కువ) వద్ద దెబ్బతింటాయి.

→ సల్ఫర్ బుగ్గలు వద్ద పెరిగే జీవుల నుంచి వేరు చేసిన ఎంజైమ్లు, అధిక ఉష్ణోగ్రతల ( 80°-90°C)వద్ద ఉత్ప్రేరకశక్తిని కలిగి ఉంటాయి.

→ అటువంటి ఎంజైమ్లు ఉష్ణ స్థిరత్వాన్ని చూపడం వంటి ముఖ్యలక్షణాన్ని కల్గి ఉంటాయి.

→ ఎన్జైమ్ క్రియాశీలతను నిలుపుదల చేసే రసాయనాలను ‘ఎంజైమ్ నిరోధకాలు’ అంటారు. [IPE]

→ అవి మూడు రకాలు (a) పోటిపడే నిరోధకం (b)పోటిపడని నిరోధకం (c) ఫీడ్బాక్ నిరోధకం

AP Inter 2nd Year Botany Notes Chapter 2 ఖనిజ పోషణ

Students can go through AP Inter 2nd Year Botany Notes 2nd Lesson ఖనిజ పోషణ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 2nd Lesson ఖనిజ పోషణ

→ మొక్కలు వివిధ రకాల ఖనిజాలను భూమి మరియు వాతావరణం నుండి శోషించుకొని పంపిణీ మరియు జీవక్రియలు జరుపుటను ‘ఖనిజపోషణ’ అంటారు.

→ మొక్కలకు ‘గాలి నుంచి అకర్బనఖనిజ పోషకాలు’ లభిస్తాయి.

→ ‘పెద్ద మొత్తంలో ‘ అవసరమయ్యే మూలకాలను ‘స్థూలపోషకాలు’ అంటారు.

→ ‘చిన్న మొత్తంలో’ అవసరమయ్యే మూలకాలను ‘సూక్ష్మపోషకాలు’ అంటారు.

→ ఈ మూలకాలు అనేవి ‘కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు క్రొవ్వుల సమ్మేళనాలు’.

→ మొక్కలు ఖనిజాలను నిష్క్రియా (లేదా) సక్రియా పద్ధతిలో వేర్ల ద్వారా శోషిస్తాయి.

AP Inter 2nd Year Botany Notes Chapter 2 ఖనిజ పోషణ

→ ఈ ఖనిజాలు ‘దారువు’ ద్వారా మొక్కలోని అన్ని భాగాలకు చేరతాయి.

→ మొక్కల జీవనానికి ‘నత్రజని’ ‘అత్యంత ఆవశ్యకమైన మూలకం’, కాని మొక్కలు వాతావరణ నత్రజనిని నేరుగా వినియోగించుకోలేవు.

→ నత్రజని స్ధాపన: ఈ విధానంలో ‘వాతావరణ నత్రజని’, ‘అమ్మోనియాగా మారుతుంది’.
N2 + 8H+ + 8e + 16ATP → 2NH3 + H2 + 16ADP + 16Pi

→ నత్రజని స్థాపనలో నైట్రోజన్ ఎంజైము ముఖ్యపాత్రను పోషిస్తుంది.

→ నైట్రోజన్ ఎంజైమ్ దిశగా జరిగే ఆక్సిజన్ రవాణాను లెగ్ హీమోగ్లోబిన్ అనే రసాయనం నియంత్రిస్తుంది.

→ వేరుబుడిపె ఏర్పడటం: [IPE]

  1. అతిధేయి ‘లెగ్యూమ్ వేర్లు’ చక్కెర మరియు అమైనో ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఇవి’ రైజోబియాను’ ఆకర్షిస్తాయి.
  2. ఇవి రెట్టింపై మూలకేశకణాల బాహ్య చర్మమునకు అతుక్కొని, వల్కలం వరకు వెళతాయి.
  3. ‘బ్యాక్టీరియాలు’ వేరు వల్కలంలో బుడిపెను ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాయి.

AP Inter 2nd Year Botany Notes Chapter 2 ఖనిజ పోషణ

→ మొక్కలో అమైనో ఆమ్లాల సంశ్లేషణలోని రెండు దశలు: [IPE]

  1. క్షయీకరణ అమైనేషన్ట్రా
  2. న్స్ అమైనేషన్

AP Inter 2nd Year Botany Notes Chapter 1 మొక్కలలో రవాణా

Students can go through AP Inter 2nd Year Botany Notes 1st Lesson మొక్కలలో రవాణా will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 1st Lesson మొక్కలలో రవాణా

1. మొక్కలు యొక్క ‘రవాణా వ్యవస్థ’లో నీటి రవాణా, ద్రావితాల రవాణా మరియు ఆహారం మొక్కలో ఒక భాగం నుంచి వేరొక భాగానికి రవాణా అవుతాయి.

2. మొక్కలు రెండు రకాల రవాణా కణజాలాన్ని కలిగి ఉంటాయి. [IPE]

  1. ‘దారునాళాలు’ వేరు నుంచి, నీటిని మరియు ద్రావితాలను గ్రహించి కాండం ద్వారా ప్రతాలకు రవాణా చేస్తాయి.
  2. ‘పోషక కణజాలం’ అనునది పత్రాలలో తయారైన ఆహారాన్ని మిగిలిన భాగాలకు రవాణా చేస్తుంది. [IPE]

3. ‘స్ధానాంతరణ’ లో ఎక్కువ దూరంలో ఉన్న పదార్థాల రవాణా అనునది దారువు మరియు పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. [IPE]

AP Inter 2nd Year Botany Notes Chapter 1 మొక్కలలో రవాణా

4. కణాల వెలుపలికి మరియు లోపలికి పదార్థాల రవాణా ఈ క్రింది మూడు రకాలుగా జరుగుతుంది.

  1. విసరణ
  2. సులభతర విసరణ
  3. సక్రియా రవాణ [IPE]

5. ‘విసరణ’ అనగా అధిక గాఢత ప్రదేశం నుంచి, తక్కువ గాఢత ప్రదేశమునకు ద్రావితా రేణువుల కదలిక.ఇది ఒక నిష్క్రియాత్మక(శక్తి వాడబడదు) రవాణా. ఇది గాఢత ప్రవణతతో పాటు జరుగుతుంది. [IPE]

6. ‘సులభతర విసరణ’ అనేది ఒక నిష్క్రియాత్మక శోషణ. ఇందులో ద్రావిత రేణువులు ఒక త్వచం ద్వారా గాఢతా ప్రవణతకు దిగువలో రవాణా చెందుతాయి. [IPE]

7. ‘ద్రవాభిసరణ’ అనగా ద్రావిత అణువులు తక్కువ గాఢత ద్రావణం నుంచి అధిక గాఢత ద్రావణం వైపుకు అర్ధపారగమ్య త్వచం ద్వారా చలించడం. [IPE]

8. ‘కణద్రవ్య సంకోచం’లో కణంలోని జీవ పదార్ధం ‘నీరు మరియు స్ఫీతం’ ను కోల్పోయి ముడుచుకుపోతుంది. [IPE]

9. ‘నిపానం’అనేది ఒక ప్రత్యేక విసరణ పద్ధతి. ‘నీరు’ విత్తనాల ద్వారా నిపానం చెందుతుంది. [IPE]

10. నీటి శక్మం (yw) అనగా నీరు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతమునకు ప్రయాణించే సామర్ధ్యాన్ని కొలిచే ప్రమాణం. [IPE]

AP Inter 2nd Year Botany Notes Chapter 1 మొక్కలలో రవాణా

11. ‘అపోప్లాస్ట్ నీటి చలనం’ లో మొక్కలో నీటి రవాణా ఎటువంటి కణత్వచాన్ని దాటదు.

12. ‘సింప్లాస్ట్ నీటి చలనం’ లో మొక్కలో నీటి రవాణా అనేది కణత్వచాలను దాటుతూ జరుగుతుంది.

13. బాష్పోత్సేకం అంటే మొక్క యొక్క వాయుగత భాగాల నుంచి నీరు ‘ఆవిరి రూపం’లో బయటకుపోవడం. [IPE]
దాని యొక్క ఉపయోగాలు మరియు నిరుపయోగాలు దృష్ట్యా ‘బాష్పోత్సేకం ఆవశ్యకమైన అనర్ధం’ అంటారు. [IPE]

14. ‘బిందుస్రావం’ అంటే మొక్కలో అధికంగా ఉన్న నీరు పత్రాల కొనల నుంచి బిందువుల రూపంలో బయటకు కోల్పోవటం. [IPE]

15. పెద్ద వృక్షాలలో ‘ద్రవ్యోద్గమం’ అనేది గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా, బాష్పోత్సేకకర్షణ వలన ఏర్పడుతుంది. [IPE]