AP Inter 2nd Year Zoology Notes Chapter 7 జీవ పరిణామం

Students can go through AP Inter 2nd Year Zoology Notes 7th Lesson జీవ పరిణామం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes 7th Lesson జీవ పరిణామం

→ ‘జీవ’ అంటే జీవం ఉన్న ప్రాణులు, పరిణామం అంటే ‘విచ్చుకోవడం’

→ ‘జీవపరిణామం’ అంటే జీవి సామన్యస్థాయి నుంచి అధిక సంక్లిష్ట స్థాయికి అభివృద్ధి చెందడానికి జరిగే నిరంతర ప్రక్రియ.

→ డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలు:

  1. అత్యధిక ఫలనశక్తి
  2. మనుగడ కోసం పోరాటం
  3. వైవిధ్యాలు మరియు అనువంశికత
  4. యోగ్యతమాల సార్ధక జీవనం (లేదా) ప్రకృతి వరణం
  5. జాతుల ఉత్పత్తి

→ జీవ జన్యు సిద్ధాంతం: ఒక జీవి జీవిత చరిత్ర ఆ జీవి వర్గవికాస చరిత్రను పునరావృతం చేస్తుంది.

→ అటావిజం: అభివృద్ధి చెందిన దశలో అవశేషావయవాలు ఆకస్మికంగా పునరావృతమయ్యే విధానాన్ని అటావిజం’ అంటారు. ఉదా:మానవుల శిశువు పుట్టుకతోనే తోకను కలిగి ఉండటం.

AP Inter 2nd Year Zoology Notes Chapter 7 జీవ పరిణామం

→ జన్యుభారం: జనాభా హానికరమైన జన్యువులు ఉండటాన్ని ‘జన్యుభారం’ అంటారు.

→ నిర్మాణసామ్య అవయవాలు: నిర్మాణం మరియు ఆవిర్భావంలో సామ్యముండి, విధులతో సామ్య చూపనటువంటి అవయవాలను ‘నిర్మాణ సామ్య అవయవాలు’ అంటారు ఉదా: తిమంగలం తెడ్డు, పక్షి రెక్కలు, మానవుడి చేయి. [IPE]

→ క్రియాసామ్య అవయవాలు: నిర్మాణం మరియు ఏర్పడే విధానంలో తేడాలున్నప్పటికీ ఒకే రకమైన విధిని నిర్వర్తించే అంగాలను ‘క్రియాసామ్య అంగాలు’ అంటారు. ఉదా: సీతాకోక చిలుక రెక్కలు, పక్షిరెక్కలు. [IPE]

→ ఉత్పరివర్తనాలు: జీవులలో హఠాత్తుగా, యాదృచ్ఛికంగా కలిగే అనువంశికత మార్పులను ‘ఉత్పరివర్తనాలు’ అంటారు. [IPE]

Leave a Comment