TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

Telangana SCERT 7th Class Telugu Guide Answers Telangana ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి Textbook Questions and Answers.

TS 7th Class Telugu Guide Upavachakam 2nd Lesson రుద్రమదేవి

పాఠం ఉద్దేశం :

అబలలు, సబలలు కాదు అని తెలుపుతూ, వనితలు వీరవనితలుగా నిలబడతారని ఋజువు చేసింది. వీరనారిగా, ధైర్యసాహసాలు ప్రదర్శించి, చరిత్రలో రాణి రుద్రమ ధ్రువతారగా ఎలా నిలిచిందో తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠం నేపథ్యం :

మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం తెలుపుతూ రుద్రమ తన పరిపాలన ఎలా కొనసాగించింది ? రాజ్య ప్రతిష్ఠను ఎలా నిలబెట్టినది అనే విషయాలు తెలియజేయటమే ఈ పాఠం నేపథ్యం.

పాఠం ప్రత్యేకత :

తెలంగాణను పాలించిన కాకతీయుల వంశ చరిత్ర
రుద్రమదేవి జననం – పట్టాభిషేక వివరాలు
కాకతీయ రాజ్య సుస్థిరత్వం
రుద్రమదేవి పాలనా విధానం
మరణం

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రుద్రమదేవి రాణి కావడానికి కారణమేమి?
జవాబు.
కాకతీయులవంశం వాడైన మహాదేవరాజు కుమారుడు గణపతిదేవుడు. అతడు క్రీ.శ. 1198 నుండి 1266 వరకు పరిపాలించాడు. ఇతనికి పుత్రసంతానం లేదు. పుత్రసంతానం కోసం నారమ్మ, పేరమ్మలను కూడా పెండ్లి చేసుకున్నా ప్రయోజనం లేదు. కూతురైన రుద్రమదేవినే పురుష సంతానంగా పెంచుకున్నాడు. యుద్ధవిద్యలు నేర్చి రాజ్యపట్టాభిషేకం చేశాడు. అలా రుద్రమదేవి రాణి అయింది.

ప్రశ్న 2.
“ఓ నటశిఖామణీ! కుటుంబాన్ని కూడా వీధి నాటకంగా చేయకు?” అని రుద్రమ వీధి నాటకం వారిని హెచ్చరించడంలో ఆంతర్యం ఏమిటి?
జవాబు.
ఇరువురు దంపతులు వీధి నాటకాలు వేసుకొని పొట్ట పోసుకునేవారు. ఆ నాటకంలో స్త్రీ పాత్రను ఎవరు వేయాలన్న అంశంపై గొడవ జరిగింది. కాదంటే కాదని వారి వాదనలు జరిగాయి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రుద్రమ “వీధి నాటకాలు సందేశాన్నిచ్చేవి. భార్యాభర్తల సంభాషణ గోప్యంగా ఉండాలి.

కానీ వీరిరువురు వీధిలో అందరిముందు గొడవపడి కుటుంబంలోని విషయాన్ని వీధిలో చర్చిస్తున్నారు. గోప్యంగా ఉంచవలసిన విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు” అనుకుంది. రుద్రమ ఆ కుటుంబాన్ని వీధినాటకం చేయవద్దని చెప్పింది.

ప్రశ్న 3.
మహిళలు సబలలు. అబలలు కాదు అని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
రుద్రమదేవి తన సైన్యంలో మహిళా సైనిక దళాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనేలా చేసింది. గూఢచారులుగా మంచి అవగాహనతో పనిచేశారు. స్వయంగా రుద్రమ స్త్రీ అయినప్పటికీ హరిహరదేవుడు, మురారిదేవుడు, దేవరాజు వంటి వీరులను ఓడించి రాజ్యాన్ని సుస్థిరం చేసింది. ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజారంజకంగా పాలించి మొదటి రాణిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇంకా చరిత్రలో ఝాన్సీలక్ష్మీబాయి, కనపర్తి వరలక్ష్మమ్మ, సరోజినీనాయుడు, సావిత్రీబాయిలాంటి స్వాతంత్ర్య వీరులను చూసే మహిళలు సబలలే అనక తప్పదు.

ప్రశ్న 4.
కాకతీయుల రాజ్య సరిహద్దులను తెల్పండి.
జవాబు.
కాకతీయుల సామ్రాజ్యం తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన బీదరు, ఉత్తరాన సింహాచలం, దక్షిణాన కంచివరకు విస్తరించి ఉంది.

ప్రశ్న 5.
రుద్రమ అవసాన దశను గురించి రాయండి.
జవాబు.
రుద్రమ తర్వాత ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుని రాజుగా ప్రకటించింది. యుద్ధవిద్యలు నేర్పింది. తనవెంట తిప్పుతూ దేశం, ప్రజ, ధర్మం, పరిపాలన అనే అంశాలను కూలంకషంగా నేర్పింది. గణపతిదేవుని వలే తను కూడా ప్రతాపరుద్రుని పట్టాభిషేకం చేసింది. తన బతుకంతా ప్రజలకోసమే అర్పించిన వీరనారి క్రీ.శ. 1289 లో నల్గొండజిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్ను మూసింది.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రుద్రమదేవి బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు.
రుద్రమదేవి గణపతిదేవుడు, సోమాంబ దంపతులకు క్రీ.శ.1220 సం॥లో జన్మించింది. తండ్రికి పుత్రసంతానం లేకపోవడంతో పురుషుని వలె పెరిగింది. శివదేవయ్య శిక్షణలో యుద్ధ విద్యలు నేర్చి ధీరవనిత అయింది. రాజనీతి, న్యాయ, రాజ్యపాలన, అర్థశాస్త్రాలలో సుశిక్షితురాలయింది. మేనమామ జాయపసేనాని నాట్యశాస్త్రాన్ని, కొంకణభట్టు సంగీతసాహిత్యాలను, వివిధ కళలలోను శిక్షణ ఇచ్చాడు.

తండ్రితో పాటు కొలువుకూటంలో పురుషవేషంలో కూర్చొని రాజ్యపాలనలోని మెళకువలు గ్రహించింది. ఇతర రాజుల వ్యవహారాలలో ఎట్లా దృష్టి పెట్టాలో అవగాహన చేసుకున్నది. శక్తియుక్తులలో పురుషులతో సమానమైన ప్రతిభ సాధించింది. గణపతిదేవుడు రుద్రమను వీరభద్రునికిచ్చి వివాహం చేశాడు.

ప్రశ్న 2.
తెలంగాణలో అధికంగా చెరువులు ఉండడానికి కారణాలు రాయండి.
జవాబు.
తెలంగాణా ప్రాంతంలో పెద్దపెద్ద చెరువులున్నవి. నదులు దగ్గరలో లేకపోవడంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు, వారి సామంతులు పెద్దపెద్ద చెరువులు తవ్వించారు. హిందూధర్మంలో చెప్పినట్లుగా ఏడురకాల ధర్మకార్యాల్లో ఒకదానిని తప్పక ఆచరించారు. మొదటి ప్రోలరాజు కేసరి సముద్రం, రెండవ బేతరాజు సెట్టి సముద్రం, రేచర్ల రుద్రారెడ్డి పాకాల చెరువులను తవ్వించారు. పాకాల చెరువు చాలా పెద్దది. గణపతి దేవుడు నెల్లూరు, ఏలూరు మున్నగు స్థలాల్లో చెరువులు నిర్మించాడు.

కాకతీయ చక్రవర్తులు చెరువులపై చూపించే శ్రద్ధ వారి సామంతులకు మంత్రులకు ఆదర్శప్రాయమైంది. కాబట్టే తెలంగాణలో చెరువులు ఎక్కువైనాయి. ఈ చెరువుల నుండి పొలాలకు నీరు సరఫరా చేయడానికి పెద్ద కాలవలను తవ్వించారు. రుద్రమదేవి వాటికి మరమ్మతులు చేయించి ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయడంలో చాలా శ్రద్ధ వహించింది.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

ప్రశ్న 3.
రుద్రమదేవి సర్వకులాలను సమానంగా చూసేది అనడానికి గల కారణాలను తెల్పండి.
జవాబు.
రుద్రమదేవి సర్వకులాలను సమానంగా చూసేది. మతసామరస్యం కలిగి ఉండేది. రాణి సైన్యంలో క్షత్రియులు, రెడ్లు, కాపులు, కమ్మవారు, పద్మనాయక వెలమలు, కాయస్థులు వారు వీరు అని కాకుండా అన్ని కులాలవారు ఉండేవారు. వారివారి శక్తి సామర్థ్యాలను బట్టి తగిన గౌరవం, హోదా లభించేవి. సామంతులను రాణి గౌరవించేది. శత్రువులను శిక్షించేది. ఓడిన రాజుల పరిహారంలో మూడువంతుల పైకాన్ని పంచేది. సర్వమతసహనాన్ని ప్రదర్శించింది. శివదేవయ్యను ప్రధానమంత్రిగా నియమించి సవ్యమైన పాలన చేసింది.

పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులుగా, స్థలాలుగా విభజించింది. నాడులకు అమాత్యులను, ప్రగడలను నియమించింది. స్థలాలకు స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకరులను నియమించింది. ‘స్థలం’లో 60 వరకు గ్రామాలుండేవి. వాటి నిర్వహణకు అయ్యవార్లు, కరణం, పెద్దకాపు, తలారి, పురోహితుడు వంటి పన్నెండుమంది గ్రామసేవకులుండేవారు. ఇలాంటి అన్ని హోదాలలోను అన్ని కులాలవారిని, అన్ని మతాలవారిని నియమించేది.

ప్రశ్న 4.
రుద్రమదేవిని గురించి సంక్షిప్తంగా మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు.
తెలంగాణను పాలించిన కాకతీయుల వంశస్థుడైన గణపతిదేవుడు, సోమాంబలకు క్రీ.శ. 1220లో జన్మించింది రుద్రమదేవి. యుద్ధవిద్యలు నేర్చుకొని తండ్రి తర్వాత రాణి అయింది. వీరభద్రారెడ్డిని పెళ్ళిచేసుకొని ముగ్గురు ఆడపిల్లలకు తల్లి అయింది. భర్త మరణించినా కృంగిపోకుండా తేరుకొని యువరాజుగా ప్రజల బాగోగులను చూస్తూ పాలన సాగించింది. తాను రాణిగా ఉండడం ఇష్టం లేక తిరగబడ్డ సామంతులపై దండెత్తి వారి సంస్థానాలను స్వాధీనం చేసుకున్నది.

ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను చేపట్టినది. ప్రజలను తన కన్నబిడ్డలవలే చూసుకునేది. శత్రువులకు సింహంలా, మిత్రులకు శ్రేయోభిలాషులకు అన్నపూర్ణగా కనిపించేది. తనకు పురుష సంతానం లేకపోవడంతో పెద్దకుమార్తె కుమారుడైన ప్రతాపరుద్రుని రాజును చేసింది. క్రీ.శ. 1289లో నల్గొండజిల్లా చందుపట్ల వద్ద కన్నుమూసింది.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

I. అవగాహన – ప్రతిస్పందన:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

గణపతిదేవ చక్రవర్తి, సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీ. శ. 1220 సంవత్సరంలో జన్మించింది. గణపతిదేవుడు పుత్ర సంతానం కొరకు నారమ్మ, పేరమ్మలను కూడా పెండ్లి చేసుకున్నాడు. కాని మగ సంతానం కలుగనందున రుద్రమనే పురుష సంతానంగా పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే యుద్ధ విద్యలను నేర్పించాడు.

యుద్ధ విద్యలను నేర్చుకున్నప్పుడు శిక్షణా స్థలాన్ని యుద్ధరంగంగా భావించుకుని వ్యూహాలు, ప్రతి వ్యూహాలను అమలు చేసేది రుద్రమ. యుద్ధ విద్యలతో పాటు రాజనీతి, న్యాయ, రాజ్యపాలన, అర్థశాస్త్రాల్లో సుశిక్షితురాలయింది. శివదేవయ్య శిక్షణలో ఆరితేరిన ధీరవనిత అయింది. మేనమామ జాయపసేనాని నాట్యశాస్త్రాన్ని, కొంకణభట్టు సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళలలో శిక్షణ నిచ్చాడు. ఫలితంగా రుద్రమదేవి సర్వశక్తిమంతురాలుగా ఎదిగింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
రుద్రమదేవి తల్లిదండ్రులెవరు ?
జవాబు.
గణపతిదేవ చక్రవర్తి, సోమాంబ దంపతులు.

ప్రశ్న 2.
మగపిల్లల కోసం గణపతిదేవుడు ఎవరిని పెండ్లాడాడు ?
జవాబు.
నారమ్మ, పేరమ్మలను

ప్రశ్న 3.
రుద్రమ వేటిలో సుశిక్షితురాలయింది ?
జవాబు.
యుద్ధ విద్యలతో పాటు రాజనీతి, న్యాయ, రాజ్యపాలన, అర్ధశాస్త్రాలలో

ప్రశ్న 4.
శిక్షణా స్థలాన్ని రుద్రమదేవి దేనిగా భావించేది ?
జవాబు.
యుద్ధ రంగంగా

ప్రశ్న 5.
ఎవరెవరి శిక్షణలో రుద్రమదేవి సర్వశక్తిమంతురాలుగా ఎదిగింది ?
జవాబు.
శివదేవయ్య, జాయపసేనాని, కొంకణభట్టుల

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

రుద్రమదేవి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేది. దానధర్మాలు చేసేది. శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి కళలను పోషించినట్లు చరిత్ర మనకు చెబుతున్నది. వర్తకం, వ్యవసాయం ఆమె పాలనలో అభివృద్ధి చెందాయి. ఓరుగల్లు కోట, రామప్పగుడి, వేయిస్తంభాల గుడి రాణి కాలంలో వైభవంతో వెలుగొందాయి. పాకాల, లక్నవరం, రామప్ప తటాకాల పూడిక తీయించి ప్రజావసరాలకు తగ్గకుండా నీరు నిల్వచేసి ఉంచారు. చారులను నియమించి ఏమరుపాటు లేక ప్రజలను పాలించిన ఘనత రాణి రుద్రమదేవికే చెల్లింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాణి ఏ కళలను పోషించింది ?
జవాబు.
శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం.

ప్రశ్న 2.
ఆమె పాలనలో ఏవి అభివృద్ధి చెందాయి ?
జవాబు.
వర్తకం, వ్యవసాయం

ప్రశ్న 3.
రాణి కాలంలో ఏవి వైభవంతో వెలుగొందాయి ?
జవాబు.
ఓరుగల్లు కోట, రామప్ప గుడి, వేయి స్తంభాల గుడి

ప్రశ్న 4.
రుద్రమదేవి కాలంలో ప్రజావసరాలు తీర్చే తటాకాలేవి ?
జవాబు.
పాకాల, లక్నవరం, రామప్ప తటాకాలు

ప్రశ్న 5.
‘చారులు’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
రహస్యంగా సమాచారాన్ని అందించేవారు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

3. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం రుద్రమదేవితోనే రుజువైంది. దానికి నిదర్శనంగా ఆమె తన సైన్యంలో ప్రత్యేక మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది. యుద్ధాలలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేలా శిక్షణలు ఇప్పించింది. ఆమె చేసిన విజయ యాత్రలలో, ఆమెపై శత్రురాజులు దండెత్తిన సమయంలో వీరు పోషించిన పాత్ర అమోఘం. పటిష్ట గూఢచార వ్యవస్థ ఏర్పాటు చేసింది. సైన్యం రెండు రకాలుగా ఉండేది. ఒక మూల సైన్యం. అంటే రుద్రమదేవి సైన్యం. రెండవది సామంతులు పోషించి, రాజు కోరినప్పుడు పంపించే సైన్యం.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
రుద్రమదేవి ఏది రుజువు చేసింది ?
జవాబు.
మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం.

ప్రశ్న 2.
ఆమె తన సైన్యంలో ప్రత్యేకంగా ఏ దళాన్ని ఏర్పాటు చేసింది ?
జవాబు.
మహిళా సైనిక దళాన్ని

ప్రశ్న 3.
రాణి ఏ వ్యవస్థను ఏర్పాటు చేసింది ?
జవాబు.
గూఢచార వ్యవస్థ

ప్రశ్న 4.
మూల సైన్యం అంటే ?
జవాబు.
రుద్రమదేవి సైన్యం

ప్రశ్న 5.
రెండవ సైన్యం ఎవరు పోషించేవారు ?
జవాబు.
సామంతులు

4. కింది పేరా చదవండి. దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు. కాకతి వంశ మూలపురుషుడు వెన్నరాజు కాకతీయులలో ప్రసిద్ధి చెందిన మొదటిరాజు ఇతడు. ఆ వంశంవాడైన మహాదేవరాజు కుమారుడు గణపతిదేవుడు క్రీ.శ. 1198 నుండి 1262 వరకు సుదీర్ఘకాలం పాలించాడు. ఇతనికి పుత్రసంతానం లేనందున కూతురైన రుద్రమదేవి క్రీ.శ. 1262 నుండి 1289 వరకు పాలించింది. అట్లా దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
కాకతీయ వంశంలో మొట్టమొదటి రాజు పేరేమి ?
జవాబు.
వెన్నరాజు

ప్రశ్న 2.
మహాదేవరాజు కుమారుడు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పాలించాడు ?
జవాబు.
క్రీ.శ. 1198 నుండి క్రీ.శ. 1262 వరకు

ప్రశ్న 3.
దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తి ఎవరు ?
జవాబు.
రుద్రమదేవి

ప్రశ్న 4.
రుద్రమదేవి ఎవరి పుత్రిక ?
జవాబు.
గణపతిదేవుని పుత్రిక

ప్రశ్న 5.
కాకతీయుల వంశం పేరేమి ?
జవాబు.
కాకతి వంశం

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

5. ఈ క్రింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువులున్నవి. నదులు దగ్గరలో లేకపోవటంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. పెద్ద ఉద్యోగులు, ధర్మబుద్ధి గల అనేకమంది ఈ పనికి పూనుకొనేవారు. చెరువులు తవ్వించటం, ఏడురకాల ధర్మకార్యాల్లో ఒకటిగా హిందూధర్మం పేర్కొన్నది. మొదటి ప్రోలరాజు ‘కేసరి సముద్రం’ అనే చెరువు తవ్వించాడు. రెండవ బేతరాజు ‘సెట్టి సముద్రం’ అనే చెరువు నేర్పరచారు. గణపతిదేవుడు నెల్లూరు, ఏలూరు మున్నగు స్థలాలలో చెరువులను నిర్మించారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పెద్ద పెద్ద చెరువులు ఎక్కడ ఉన్నవి ?
జవాబు.
తెలంగాణ ప్రాంతంలో

ప్రశ్న 2.
హిందూధర్మం ఏమి పేర్కొన్నది ?
జవాబు.
చెరువులు తవ్వించడం ఏడు రకాల ధర్మాల్లో ఒకటని పేర్కొన్నది.

ప్రశ్న 3.
కేసరి సముద్రం అనే చెరువును ఎవరు తవ్వించారు ?
జవాబు.
మొదటి ప్రోలరాజు

ప్రశ్న 4.
రెండవ బేతరాజు ఏ చెరువును ఏర్పరచారు ?
జవాబు.
‘సెట్టి సముద్రం’

ప్రశ్న 5.
గణపతిదేవుడు చెరువులను ఎక్కడెక్కడ నిర్మించారు ?
జవాబు.
నెల్లూరు, ఏలూరు మున్నగు స్థలాలలో

6. కింది గద్యం చదవండి. ఐదు ప్రశ్నలు రూపొందించండి.

తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు. కాకతి వంశ మూలపురుషుడు వెన్నరాజు. ఈ వంశంలోని మహాదేవరాజు కుమారుడు గణపతిదేవుడు. క్రీ.శ. 1198 నుండి 1260 వరకు సుదీర్ఘ కాలం పాలించాడు. ఇతనికి పుత్ర సంతానం లేనందున కూతురైన, రుద్రమదేవి క్రీ.శ. 1262 నుండి 1289 వరకు పాలించింది. అట్లా దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తి ఎవరు ?
జవాబు.
రుద్రమదేవి

ప్రశ్న 2.
వెన్నరాజు ఎవరు ?
జవాబు.
కాకతి వంశ మూలపురుషుడు

ప్రశ్న 3.
గణపతిదేవుని తండ్రి పేరు ఏమిటి ?
జవాబు.
మహాదేవరాజు

ప్రశ్న 4.
రుద్రమదేవి పరిపాలనా కాలం ఏది ?
జవాబు.
క్రీ.శ. 1262 నుండి 1289

ప్రశ్న 5.
పై పేరాకు తగిన శీర్షిక సూచించండి.
జవాబు.
రుద్రమదేవి – మొదటి మహిళా చక్రవర్తి.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

7. కింది పేరా చదువండి. ఐదు ప్రశ్నలు రూపొందించండి.

తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువులున్నవి. నదులు దగ్గరలో లేకపోవటంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. పెద్ద ఉద్యోగులు, ధర్మబుద్ధి గల అనేకమంది ఈ పనికి పూనుకున్నారు. చెరువులు తవ్వించటం, ఏడు రకాల ధర్మకార్యాల్లో ఒకటిగా చెప్పబడింది. మొదటి ప్రోలరాజు ‘కేసరి సముద్రం’ అనే చెరువును తవ్వించాడు. రెండవ బేతరాజు ‘సెట్టి సముద్రం’ అనే చెరువును ఏర్పరచారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పై పేరాలో చర్చించబడ్డ అంశం ఏది ?
జవాబు.
చెరువుల తవ్వకం

ప్రశ్న 2.
ఏడు ధర్మకార్యాలలో ఒకటిగా దేనిని చెప్పారు ?
జవాబు.
చెరువులు తవ్వించటం

ప్రశ్న 3.
చెఱువులు ఎందుకు త్రవ్వించారు ?
జవాబు.
నదులు దగ్గరలో లేకపోవటంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు.

ప్రశ్న 4.
సెట్టి సముద్రం చెఱువును ఎవరు త్రవ్వించారు ?
జవాబు.
రెండవ బేతరాజు

ప్రశ్న 5.
మొదటి ప్రోలరాజు తవ్వించిన చెఱువు ఏది ?
జవాబు.
‘కేసరి సముద్రం’

8. క్రింది గద్యభాగం చదివి, దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.

రుద్రమదేవి వీరభద్రులకు – ముమ్మడాంబ, వీరరుద్రమ, రుయ్యమ్మ అనే పుత్రికలు పుట్టారు. మగసంతానం లేనందున గణపతిదేవుడు కొంచెం కలత చెందాడు. ఇటు గణపతిదేవుణ్ణి వృద్ధాప్యం వెంటాడుతుంటే అటు దుర్వ్యసనాలకు లోనై అనారోగ్యానికి గురైన రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రభూపతి మరణించాడు. ఈ సంఘటన రుద్రమకు అశనిపాతం వంటిది.

కానీ ఆమె చెక్కుచెదరలేదు. మేనమామ జాయపసేనాని వెంటరాగా భర్త కర్మకాండ విధియుక్తంగా నిర్వహించింది. తండ్రికి తలకొరివి పెట్టడానికి కూతురుకు కూడా హక్కు ఉందని, కాదన్న అందరినీ నిలదీసి ముమ్మడాంబతో చితికి నిప్పుపెట్టించిన ధైర్యశాలి రుద్రమ. ఆమె వాగ్దాటిముందు ఛాందస రాజబంధు బృందం ఎవరూ నోరెత్తలేదు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
గణపతిదేవుడు ఎందుకు కలత చెందాడు?
జవాబు.
మగసంతానం లేకపోవడంతో గణపతిదేవుడు కలత చెందాడు.

ప్రశ్న 2.
రుద్రమదేవి భర్త ఎవరు?
జవాబు.
రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రభూపతి.

ప్రశ్న 3.
చితికి నిప్పు పెట్టినదెవరు?
జవాబు.
చితికి నిప్పు పెట్టినది ముమ్మడాంబ.

ప్రశ్న 4.
రుద్రమకు ఎంతమంది సంతానం?
జవాబు.
రుద్రమకు ముగ్గురు సంతానం.

ప్రశ్న 5.
వీరభద్రభూపతి అనారోగ్యానికి కారణమేమిటి?
జవాబు.
వీరభద్రభూపతి అనారోగ్యానికి కారణం దుర్వ్యసనాలు.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

9. క్రింది గద్యభాగం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

రుద్రమదేవి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేది. దానధర్మాలు చేసేది. శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం సాహిత్యం వంటి కళలను పోషించినట్లు చరిత్ర మనకు చెబుతున్నది. వర్తకం, వ్యవసాయం ఆమె పాలనలో అభివృద్ధి చెందాయి. ఓరుగల్లుకోట, రామప్పగుడి, వేయిస్తంభాలగుడి రాణి కాలంలో వైభవంతో వెలుగొందాయి. పాకాల, లక్నవరం, రామప్ప తటాకాల పూడిక తీయించి ప్రజావసరాలకు తగ్గకుండా నీరు నిల్వచేసి ఉంచారు.

చారులను నియమించి ఏమరుపాటులేక ప్రజలను పాలించిన ఘనత రాణి రుద్రమదేవికే చెల్లింది. ఎవరైనా వచ్చి తనకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటే ఆమె వెంటనే విచారించి వారికి న్యాయం చేసింది. సత్రాలు నెలకొల్పింది. గ్రామాలు దానంచేసి ఆ గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు ఉచిత వసతిగృహాలు, ఆరోగ్యశాలలు ప్రసూతిశాలలు నడిపేలా ఏర్పాటు చేసింది. దారి పొడవునా చెట్లు నాటించింది. దేవాలయాలు కట్టించింది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
రుద్రమ ప్రజలను ఎలా చూసుకునేది?
జవాబు.
రుద్రమ ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేది.

ప్రశ్న 2.
పేరాలో చెప్పిన కళల పేర్లు రాయండి.
జవాబు.
పేరాలో చెప్పిన కళలు శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం.

ప్రశ్న 3.
రుద్రమకాలంలో పూడిక తీసిన చెరువులేవి?
జవాబు.
రుద్రమకాలంలో పూడిక తీసిన చెరువులు పాకాల, లక్నవరం, రామప్ప చెరువులు.

ప్రశ్న 4.
గ్రామాల ఆదాయంతో ఏమి చేశారు?
జవాబు.
గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, వసతిగృహాలు, ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు నడిపేవారు.

ప్రశ్న 5.
రుద్రమ పాలనలో ఏవేవి అభివృద్ధి చెందాయి?
జవాబు.
రుద్రమపాలనలో వర్తకం, వ్యవసాయం అభివృద్ధి చెందాయి.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

10. క్రింది గద్యభాగం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

‘పాకాల చెరువు’ గణపతిదేవుని కాలంలో రేచర్ల రుద్రారెడ్డిచే నిర్మించబడింది. అది చాలా పెద్ద చెరువు. చెరువులపై కాకతీయ చక్రవర్తులకు ఉన్న శ్రద్ధ వారి సామంతులకు, మంత్రులకు ఆదర్శప్రాయమైంది. కనుక తెలంగాణ నిండా అనేక చెరువులు వెలిశాయి. ఈ చెరువుల నుండి పొలాలకు నీరు సరఫరా చేయడానికి పెద్ద కాల్వలు తవ్వించారు. రుద్రమదేవి వీటన్నిటికి మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయడంలో చాలా శ్రద్ధ వహించింది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పాకాల చెరువును ఎవరు నిర్మించారు?
జవాబు.
పాకాల చెరువు గణపతిదేవుని కాలంలో రేచర్ల రుద్రారెడ్డి నిర్మించాడు.

ప్రశ్న 2.
ఏది చాలా పెద్ద చెరువు?
జవాబు.
పాకాల చెరువు చాలా పెద్ద చెరువు.

ప్రశ్న 3.
తెలంగాణలో అధిక చెరువులుండడానికి కారణమేమి?
జవాబు.
కాకతీయ చక్రవర్తులతో పాటు సామంతులు, మంత్రులు ఎందరో చెరువులు తవ్వించడం వల్ల తెలంగాణలో చెరువులు అధికం.

ప్రశ్న 4.
పెద్ద కాల్వల ఉపయోగమేమి?
జవాబు.
చెరువుల నుండి పొలాలకు నీటిని సరఫరా చేయుటకు పెద్ద కాల్వలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 5.
కాల్వల మరమ్మతులు చేసిన దెవరు?
జవాబు.
కాల్వలను మరమ్మతు చేయించింది రుద్రమదేవి.

TS 7th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson రుద్రమదేవి

రుద్రమదేవి పాలనాదక్షత :

కాకతి వంశ మూలపురుషుడు వెన్నరాజు. కాకతీయ వంశం వాడైన మహాదేవరాజు కుమారుడు గణపతిదేవుడు. ఇతడు క్రీ.శ. 1198 నుండి 1262 వరకు పాలించాడు. తరువాత గణపతిదేవుని కూతురైన రుద్రమదేవి క్రీ.శ. 1262 నుండి 1289 వరకు పాలించింది. రుద్రమ యుద్ధవిద్యలను నేర్చుకునేటప్పుడు రాజనీతి, న్యాయ, రాజ్యపాలన, అర్థశాస్త్రాల్లో సుశిక్షితురాలు అయ్యింది.

రుద్రమదేవికి రాజ్య పట్టాభిషేకం జరిగింది. రుద్రమదేవి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేది. ఆమె సర్వమత సహనాన్ని ప్రదర్శించింది. దానధర్మాలు చేసేది. పటిష్ట గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసింది. రుద్రమ గణపతిదేవుని కాలంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని మరింత సుస్థిరపరచింది.

తన బతుకంతా ప్రజలకోసమే అర్పించిన వీరనారి క్రీ.శ. 1289లో నల్లగొండజిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూసింది. ఎందరో విదేశీయాత్రికులు రుద్రమ పాలనా విధానాన్ని ప్రశంసించారు.

Leave a Comment