AP Inter 2nd Year Zoology Notes Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

→ శ్వాసక్రియ దేహానికి శక్తిని అందిస్తుంది. ఇది ఆహారపదార్థాల ఆక్సీకరణ ద్వారా జరుగుతుంది.

→ శ్వాసక్రియలో జరిగే ప్రక్రియలు:

  1. శ్వాసించడం
  2. వాయువుల వినిమయం
  3. వాయువుల రవాణా
  4. O2 మరియు CO2 ల వినిమయం
  5. కణాల ద్వారా O2 వినియోగం.

→ శ్వాసించడం అంటే వాయువుల బదిలీని గరిష్టంగా చేసే ప్రక్రియ.

AP Inter 2nd Year Zoology Notes Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

→ శ్వాసించడం రెండు దశలను కలిగి ఉంటుంది.: (i) ఉచ్ఛ్వాసం (ii) నిశ్వాసం

→ పరిసరాల గాలిని ఊపిరితిత్తులు లోపలికి తీసుకోవడాన్ని ‘ఉచ్ఛ్వాసం’ అంటారు.

→ వాయుకోశాలలోని గాలిని బయటకు విడుదల చేసే ప్రక్రియను ‘నిశ్వాసం’ అంటారు.

→ ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస క్రియలను ‘మజ్జాముఖం’ నియంత్రిస్తుంది.

→ ఆక్సిజన్ రవాణా: ఊపిరితిత్తుల నుండి కణజాలాలాకు ఆక్సిజన్ రవాణా అనునది 97% RBC మరియు ద్వారా 3% కరిగిన స్థితిలో ఉన్న ప్లాస్మా ద్వారా జరుగుతుంది.

→ CO2 రవాణా ఈ క్రింది పద్ధతులలో జరుగుతుంది: [IPE]

  1. 7% CO2, H2O తో కలిసి కార్బోనిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది.
  2. 23% CO2, హీమోగ్లోబిన్ తో కలిసి కార్బోఎమైనో సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. :
  3. 70% CO2 నీటి తో కలిసి బైకార్బోనేట్స్ను ఏర్పరుస్తుంది.

AP Inter 2nd Year Zoology Notes Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

→ శ్వాస వ్యవస్థ యొక్క రుగ్మతలు: [IPE]

  1. ఉబ్బస వ్యాధి
  2. బ్రాంకైటిస్
  3. ఎంఫైసీమా
  4. న్యూమోనియా

Leave a Comment