AP Inter 2nd Year Zoology Notes Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం

→ ‘జీర్ణక్రియ’ అనగా సంక్లిష్టమైన, శోషించలేనటువంటి ఆహారపదార్ధాలను సరళమైన, శోషించగలిగే ఆహార పదార్ధాలుగా మార్చే క్రియ.

→ ‘శోషణం’ అనగా నీరు మరియు జీర్ణమైన ఆహారం ఆహారనాళం గోడలను చేరి అక్కడి నుండి రక్తంలోకి కలవడం.

→ జీర్ణక్రియ ‘యాంత్రిక మరియు జీవరసాయన’ అనే రెండు ప్రక్రియల ద్వారా జరుగుతుంది.

→ ‘జీర్ణక్రియ వ్యవస్థ’ ఆహారనాళం మరియు దాని అనుబంధ గ్రంధులను కలిగి ఉంటుంది.

→ జీర్ణగ్రంధులు: లాలాజల గ్రంధులు, జఠర గ్రంధులు, కాలేయం, క్లోమం మరియు ఆంత్ర గ్రంధులు.

AP Inter 2nd Year Zoology Notes Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

→ చిన్నపేగు ఆహారనాళంలో అతి పెద్ద భాగం. జీర్ణక్రియలో ఎక్కువ భాగం చిన్నపేగు నందే జరుగుతుంది.

→ ఆహారం నందు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు క్రొవ్వులు ఆవశ్యక పదార్ధాలు.

→ శరీరానికి కార్బోహైడ్రేట్లు శక్తిని, ప్రోటీన్లు నిర్మాణాన్ని మరియు కొవ్వులు నిల్వశక్తిని అందిస్తాయి.

→ నాలుక టూత్ బ్రష్ వలే పని చేస్తుంది. దంతం నిలువుకోతలోని ముఖ్య భాగాలు కిరీటం, గ్రీవం, మూలం [IPE]

→ జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమై, ఆమ్లయుతంగా ఉన్న ఆహారాన్ని ‘కైమ్’ అంటారు. [IPE]

AP Inter 2nd Year Zoology Notes Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

→ కాలేయం దేహంలో కల్లా పెద్ద గ్రంధి, ఇది పైత్యరసాన్ని స్రవిస్తుంది. [IPE]

→ పైత్యరసం లిపిడ్లు (కొవ్వులు) ను జీర్ణం చేయడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. [IPE]

→ పైత్యరస లవణాలు క్రొవ్వుల ఎమల్సీకరణలో సహాయపడతాయి. పైత్యరసం లైపేజ్లను ఉత్తేజ పరుస్తుంది. [IPE]

Leave a Comment