AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 5b ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకొనే నివారణా చర్యలను తెలపండి. STDs? [ AP MAR-17,18] [TS MAR-19]
జవాబు:
STDs నియంత్రణ చర్యలు:

  1. అపరిచితులతో మరియు అనేక మంది భాగస్వాములతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండకూడదు.
  2. సంపర్క సమయంలో తొడుగులను తప్పక వినియోగించాలి.
  3. లైంగిక సంపర్క వ్యాధులను ప్రాధమిక దశలో గుర్తించడంలో నిష్ణాతుడైన వైద్యుణ్ణి సంప్రదించాలి.
  4. వ్యాధి సంక్రమించినట్లయితే సంపూర్ణ చికిత్సను పొందాలి.

ప్రశ్న 2.
జనాభా విస్ఫోటనానికి రెండు కారణాలు తెల్పండి. జవాబు: భారతదేశంలో జనాభా విస్ఫోటనానికి గల కారణాలు [TS MAR-15] [TS MAY-19]
జవాబు:

  1. పెరిగిన ఆరోగ్య సంరక్షణ వసతులు మరియు మెరుగైన జీవనస్ధితులు
  2. మరణ రేటు తగ్గుదల
  3. మాతృ మరణ రేటు తగ్గుదల (MMR)
  4. శిశుమరణ రేటు తగ్గుదల (IMR)

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం
ప్రశ్న 3.
MTP అనేది నిజానికి జనాభా నియంత్రణకై ఉద్దేశించబడింది కాదు. అయినా భారత ప్రభుత్వం ఎందుకని చట్టబద్ధం MTPని చేసింది? [AP MAR-19]
జవాబు:
MTP అనగా ‘వైద్యపరంగా గర్భాన్ని తీసివేయడం’.
MTP దుర్వినియోగం కాకుండా భారత ప్రభుత్వం దీనికి ఈ క్రింది సందర్భాలలో మాత్రమే MTP తప్పనిసరి అనే చట్ట బద్ధతను కలిగించింది.

  1. అరక్షిత సంపర్కం మరియు గర్భ నిరోధక సాధన విఫలం.
  2. అత్యాచారం వలన ఏర్పడిన గర్భం.
  3. తల్లికి గాని, పిండానికి గాని (లేదా) ఇద్దరికీ అపాయం ఉన్నప్పుడు.

ప్రశ్న 4.
‘ఉల్బద్రవ పరీక్ష’ (ఆమ్నియోసెంటిసిస్) అంటే ఏమిటి ? ఉల్బద్రవ పరీక్ష ద్వారా కనుక్కొనే రెండు అవక్రమాల పేర్లను పేర్కొనండి. [AP MAY-19] [ TS MAR-18,20][ AP MAR-20,17,16]
జవాబు:

  1. ఉల్బద్రవ పరీక్ష: ఉల్బద్రవ పరీక్ష అనేది గర్భస్థ శిశువులో జన్యు లోపాలను కనుక్కొనే రోగ నిర్ధారక విధానం.
  2. ఈ పరీక్ష వలన గుర్తించబడే అపస్థితులు
    (i) డౌన్స్ సిండ్రోమ్
    (ii) ఎడ్వర్డ్స్ సిండ్రోమ్
    (iii) టర్నర్ మరియు క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్లు
  3. ఈ పరీక్ష నందు ఉల్బద్రవంను స్వీకరించి, పిండ కణాలను పరీక్షిస్తారు.
  4. కాని, ఈ పరీక్షను శిశువు లింగనిర్ధారణ కొరకు తప్పుగా వినియోగిస్తున్నారు.

ప్రశ్న 5.
క్షీరోత్పాదక రుతుస్రావ నిరోధక పద్ధతి వల్ల కలిగే లాభాలను పేర్కొనండి. [AP MAR-19,22]
జవాబు:
క్షీరోత్పాదక వల్ల రుతుచక్రం ఆగిపోవడం:

  1. ఎంత కాలం వరకు తల్లి బిడ్డకు తన రొమ్ము పాలు పడుతుందో, ఆ కాలంలో అండోత్సర్గం జరగదు. దీని వలన గర్భం దాల్చే అవకాశం తక్కువగా ఉండటం వలన ఇది ఒకరకమైన సహజ గర్భనిరోధక పద్ధతి.
  2. బిడ్డకు తల్లి పాలు పట్టటం వలన విశిష్టమైన రోగనిరోధకత మరియు అలర్జీల నుంచి రక్షణ ఏర్పడతాయి.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవుల్లో సాధారణంగా వచ్చే లైంగిక సంపర్క వ్యాధులను సంక్షిప్తంగా వివరించండి. [ TS MAR-16]
జవాబు:
మానవులలో సాధారణంగా వచ్చే లైంగిక సంబంధ వ్యాధులు:

  1. గనేరియా – నైసెరియా గనేరియా అనే బాక్టీరియా వలన కలుగుతుంది.
  2. సిఫిలిస్ – ట్రైపోనియా పాల్లిడిమ్ అనే బాక్టీరియా వలన కలుగుతుంది.
  3. జననాంగ కంతులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ – హ్యుమన్ పాపిల్లోమా అనే వైరస్ వలన కలుగుతుంది.
  4. జననాంగ హెర్పెస్ – హెర్పెస్ సింప్లెక్స్ అనే వైరస్ వలన కలుగుతుంది.
  5. ట్రైకోమోనియాసిస్ – ట్రైకోమోనాస్ వెజినాలిస్ ప్రోటోజోవన్ అనే పరాన్న జీవి వలన కలుగుతుంది.
  6. క్లామిడియాసిస్ – క్లామిడియో ట్రోకోమాటిస్ బాక్టీరియా వలన కలుగుతుంది.
  7. హెపటైటిస్-B – హెపటైటిస్ B వైరస్ (HBV) వలన కలుగుతుంది.
  8. HIV/AIDS – మానవ రోగనిరోధక లోప వైరస్ HIV వలన కలుగుతుంది.

ప్రశ్న 2.
గర్భనిరోధక శస్త్రచికిత్స పద్ధతులను విశదీకరించండి. [TS MAY-22]
జవాబు:
గర్భనిరోధక శస్త్రచికిత్స పద్ధతులు: ఈ పద్ధతులను పురుషులలో వంధ్యీకరణ విధానాన్ని ‘వేసెక్టమీ’ అని, స్త్రీలలో ‘ట్యూబెక్టమీ’ అని అంటారు.
1) వేసెక్టమీ: ముష్కగోణి మీద చిన్నగాటు చేసి రెండు వైపులా ఉన్న శుక్రవాహికలను కత్తిరించి చివరలను ముడివేసి వాటిని యధాస్థానంలో ఉంచి గాటుని మూసివేస్తారు. దీని వలన శుక్రకణాలు శుక్రాశయంలోకి రావడం నివారించబడుతుంది. వేసక్టమీ చేయించుకున్న పురుషుల శుక్రంలో శుక్రకణాలు ఉండవు.

2) ట్యూబెక్టమీ: స్త్రీలలో పొత్తికడుపుకు ఇరువైపులా గాటును ఏర్పరుస్తారు. గర్భాశయంలో ఉండే ఫాలోపియన్ నాళాలను ఇరువైపులా కత్తిరించి, చివరలను ముడి వేయడం జరుగుతుంది. దీని వలన అండాలు ఫాలోపియన్ నాళాలలోకి ప్రవేశించలేవు. కావున గర్భదారణ జరగదు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

ప్రశ్న 3.
కింది వాటిలో రెండింటికి లఘుటీకలను రాయండి.
a) IVF
b) ICSI
c) IUDs
జవాబు:
(a) IVF-బాహ్య ఫలదీకరణం: స్త్రీ దేహ సారూప్య పరిస్థితులు కలిపించి అండాన్ని శుక్రకణాలతో బయట ఫలదీకరింపజేసి ఎనిమిది కణాలు బ్లాస్టోమీయర్ల దశవరకు పిండాభివృద్ధిని జరిపే ప్రక్రియను ‘శరీర బాహ్యఫలదీకరణం’ అంటారు. ఈ రకంగా ఏర్పడిన పిండాన్ని ‘తల్లి గర్భంలోనికి’ ప్రవేశపెడతారు.
ఈ ప్రక్రియను సాధారణంగా ‘టెస్ట్ ట్యూబి బేబి’ (పరీక్షనాళికా శిశువు) విధానం అంటారు. ‘శుక్రకణాలు’మరియు ‘అండం’ భార్య, భర్తలు లేదా దాతల నుంచి స్వీకరిస్తారు.

ఈ రకంగా ఏర్పడిన పిండాన్ని తల్లిగర్భంలోనికి (లేదా) అరువు తల్లి (సర్వోగేట్) గర్భంలోనికి ప్రవేశపెడతారు.

(b) ICSI: ఈ ప్రక్రియ నందు కణజీవ ద్రవ్యంలోనికి శుక్రకణాలను నేరుగా ప్రవేశపెట్టి ‘పిండాన్ని’ ఏర్పరుస్తారు. శుక్రకణోత్పత్తి తక్కువగా ఉన్న వారికి ఈ పద్ధతిని వినియోగిస్తారు. పిండాన్ని గర్భాశయంలోనికి మారుస్తారు.

(c) IUDs: గర్భాశయంతర సాధనాలు:
ఈ సాధనాలు వైద్యులు (లేదా) శిక్షణ పొందిన నర్సులు ప్రవేశపెడతారు. ఈ క్రింది పేర్కొన్నవి ‘వినియోగంలో ఉన్న IUD

  • లిప్సెస్లూప్ (ఔషధరహితం)
  • రాగిని విడుదల చేసే IUD
  • హార్మోనులను విడుదల చేసే IUD

IUD నుంచి విడుదలైన రాగిఅయాన్లు శుక్రకణాలను భక్షిస్తాయి మరియు శుక్రకణాల కదలికలను, జీవన సామర్ధ్యాన్ని మరియు ఫలదీకరణ సామర్ధ్యాన్ని అణచివేస్తాయి.

ప్రశ్న 4.
సంతానసాఫల్యత లేని దంపతులు సంతానాన్ని పొందడానికి సహాయపడే పద్దతులను కొన్నింటిని తెల్పండి.
జవాబు:
సంతానసాఫల్యత లేని దంపతులకు సహాయపడే పద్ధతులు: పెద్ద సంఖ్యలో దంపతులు పిల్లలను కనలేని పరిస్ధితులలో ఉన్నారు. దీనికి కారణం శారీరక, జన్యుపర వ్యాధులు, మాదక ద్రవ్యాలు, రోగనిరోధక మరియు మానసిక పరిస్థితులు. సమస్య అనేది భర్త లేదా భార్య ఇద్దరిలోను ఉండవచ్చు. దీనికిగాను ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ‘ప్రత్యుత్పత్తి సహాయక సాంకేతికత’ పద్ధతులు అని అంటారు.

1) శరీర బాహ్య ఫలదీకరణం (IVF): దంపతుల నుండి అండాన్ని మరియు శుక్రకణాలను సేకరించి ప్రయోగశాలలో ‘ఫలదీకరణం’ జరుపుతారు. ప్రయోగశాలనందు పిండం ‘8 కణాల బ్లాస్టోమియర్ల’ దశ వరకు అభివృద్ధి చెందుతుంది. ఈ పిండాన్ని గర్భాశయం నందు ప్రవేశపెడతారు. కొన్ని సందర్భాలలో శుక్రకణాలు మరియు అండాలు దాతలనుంచి సేకరిస్తారు. మరియు అవసరాన్ని బట్టి పిండాన్ని మరొక స్త్రీ (అరువు తల్లి) గర్భంలోకి ప్రవేశపెడతారు.

2) ఫాలోపియన్ నాళాంతర సంయుక్తబీజ బదిలీ (ZIFT): ఈ పద్ధతి నందు అండాన్ని సేకరించి, బాహ్య ఫలదీకరణం జరిపిస్తారు. ఈ రకంగా ఏర్పడిన ‘పిండాన్ని’ తిరిగి స్త్రీ యొక్క ఫాలోపియన్ నాళాలలోకి తరువాత అభివృద్ధికై ప్రవేశపెడతారు.

3) ఫాలోపియన్ నాళాంతర సంయుక్తబీజ బదిలి (GIFT): కొన్నిసందర్భాలలో భార్య అండాలను ఉత్పత్తి చేయలేదు. అటువంటి సందర్భంలో దాత నుంచి అండాన్ని సేకరించి గ్రహీత ఫాలోఫియన్ నాళంలోకి తరువాత అభివృద్ధికై ప్రవేశపెడతారు.

4) కణజీవ ద్రవ్యంలోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం (ICSI): ఈ పద్ధతి నందు ప్రయోగశాలలో శుక్రకణాలను నేరుగా అండకణ ద్రవ్యంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తరువాత ‘పిండాన్ని’ గర్భాశయంలోనికి ప్రవేశపెడతారు.

5) కృత్రిమ శుక్ర నివేషణం (AI) : పురుష భాగస్వామికి స్త్రీ ప్రత్యుత్పత్తి మార్గంలోకి శుక్రకణాలను నేరుగా ప్రవేశపెట్ట లేనపుడు మరియు శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నపుడు ఈ పద్ధతి ద్వారా శుక్రాన్ని సేకరించి గర్భాశయంలోనికి కృత్రిమంగా ప్రవేశపెడతారు.

ప్రశ్న 5.
పాఠశాలల్లో లైంగిక విద్య అవసరమా? ఎందుకు? [TS MAY-22]
జవాబు:
1) పాఠశాలల యందు లైంగిక విద్యను బోధించుట అనేది చాలా ఆవశ్యకమైన అంశం. ఎందుకనగా ఈ దశయందు పిల్లల లైంగిక అవయవాలలో జరుగుతున్న మార్పులను గురించి తెలుసుకొనుట వలన వారు మానసికంగా మరియు శారీరకంగా ధృడంగా ఉండి ఎటువంటి అఘాత్యాలకు గురికారు.

2) ప్రత్యుత్పత్తి అవయవాలను గురించి, కౌమారదశ మరియు అనుబంధ మార్పులను గురించి, పిల్లలకు సరియైన సమాచారాన్ని ఇవ్వటం వలన, విద్యార్థులు లైంగిక పరిశభ్రత మరియు సురక్షితను గురించి అవగాహన కలిగి ఉంటారు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

3) లైంగిక సంబంధ వ్యాధులను గురించి విద్యార్థులకు తెలియజేయటం వలన వారు అవగాహన కలిగి ఉంటారు.

4) కావున విద్యార్ధులకు లైంగిక విద్యను బోధించుట వలన వారికి శరీరంలో జరిగే మార్పులను గురించి అవగాహన కలుగుతుంది మరియు వారు ఎటువంటి అఘాత్యాలకు, అత్యాచారాలకు లోనుకారు. ‘లైంగిక దుర్వినియోగం మరియు ‘ లైంగిక సంబంధ నేరాలకు’ నియంత్రణ ఏర్పడుతుంది.

Leave a Comment