AP Inter 2nd Year Telugu Model Paper Set 4 with Solutions

Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 4 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 2nd Year Telugu Model Paper Set 4 with Solutions

గమనిక : ప్రశ్నాపత్రం ప్రకారం సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. ‘తడయక పుట్టిననాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ
బడితి; నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ !
నుడువులు వేయు నింకేల ? యిప్పాటి నోములు దొల్లి
కడఁగి నోఁచితినీ గాకేమి’ యనుచును గందె డెందమున’.
జవాబు:
ప్రతిపదార్థం :
పుట్టిననాఁడు + అ = పుట్టిననాడే
తడయక = వెంటనే
తల్లిచేన్ = తల్లి అయిన మేనకచేత
తండ్రిచేన్ = తండ్రి అయిన విశ్వామిత్రునిచేత
విడువఁబడితిన్ = వదలివేయబడ్డాను.
ఇప్పుడు = ఇప్పుడు
పతి చేతను = భర్తచేత కూడా
విడువబడియెదన్ + ఒక్కొ = వదలివేయబడతానో ఏమో
నుడువులు వేయున్ = వేయి మాటలు
ఇంకన్ + ఏల =
ఈ + పాటి = ఇటువంటి ఫలితాన్ని ఇచ్చే
నోములు = నోములు
తొల్లి = పూర్వం
కడఁగి = పూనుకొని
నోచితిని = నోచాను
కాక + ఏమి = కాబోల
అనుచును = అంటూ
డెందమునన్ = హృదయంలో
కందెన్ = ఎంతో దుఃఖించింది.

తాత్పర్యం : పుట్టిననాడే వెంటనే తల్లిదండ్రులచేత విడిచివేయబడ్డాను. ఇప్పుడు భర్తచేతకూడా విడువబడతాను కాబోలు. ఇక వేయిమాటలెందుకు ? పూర్వం నేను ఇటువంటి ఫలితాలను ఇచ్చే అరకొర నోములే నోచాను కాబోలు అని శకుంతల మనసులో బాధపడింది.

2. ఉరుతరాటవిలోన మహోగ్రతపము
వాయుదేవుని గుఱియించి వరుసఁ జేసి
యంజనాదేవి· గనియె నన్నర్థతోడ
నర్కజుని మంత్రి హనుమంతుఁడండ్రు నన్ను
జవాబు:
ప్రతిపదార్థం :
అంజనాదేవి = అంజనాదేవి
ఉరుతరాటవిలోనన్;
ఉరుతర + అటవిలోనన్ = గొప్ప అడవిలో
మహోగ్రతపమున్ = గొప్ప భయంకరమైన తపస్సును
అర్థితోడన్ = భక్తితో
వాయుదేవుని గుఱియించి = వాయుదేవుని గురించి
వరుసన్ + చేసి = చాలాకాలం చేసి
నన్నున్ = నన్ను
కనియెన్ = పుత్రునిగా కన్నది
అర్కజుని మంత్రిన్ = (నేను) సుగ్రీవునికి మంత్రిని
నన్నున్ = నన్ను
హనుమంతుడు = హనుమంతుడు
అండ్రు = అంటారు.

తాత్పర్యం : అంజనాదేవి గొప్ప అరణ్యములో వాయుదేవుడిని గురించి చాలాకాలం భక్తితో గొప్ప తపస్సును చేసి నన్ను పుత్రునిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని. నన్ను ‘హనుమంతుడు’ అని పిలుస్తారు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. శాంతి కాంక్ష పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే కావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు రాయబారిగా వెళ్ళిన భట్టు పలికిన శాంతి వచనాలను వర్ణించబడ్డాయి. కలిసి ఉంటే కలిగే మేలు, యుద్ధం వల్ల కలిగే కీడులను కవి హృద్యంగా వర్ణించాడు.

నలగామరాజుకు ప్రశంస : భట్టు గుర్రం మీద వచ్చి నలగామరాజు కొలువులో ప్రవేశించాడు. రాజు ఎదుట నిలిచి నమస్కరించాడు. రాజును ఇట్లా ప్రశంసించాడు. ఓ రాజా ! నీవు రాజులలో కెల్లా గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజవేశ్యలను రంజింప జేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. ధైర్యంలో మేరు పర్వతాన్ని జయించినవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుడవు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు నిలయమైన వాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్ద కుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు, వైభవంలో దేవేంద్రుడవు.

యుద్ధానికి సిద్ధం : రాయబారం కోసం మలిదేవరాజు మీ దగ్గరకు పంపించిన అలరాజును అల్లుడని కూడా చూడకుండా చంపివేశారు.. దానితో మలిదేవరాజు ఎంతో కోపించాడు. తన తమ్ములు, బంధువులు, వీరులు అయిన నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఖరదూషణులు మొదలైన రాక్షసులు సంహరించబడిన శ్రీశైల ప్రాంతంలో – గొప్పదైన పవిత్రమైన కార్యమపురిలో సైన్యంతో తన పరాక్రమాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు.

రాజనీతి : ఓ రాజా ! అలరాజుతోపాటే వీరమరణం పొందాలని వీరులైన నాయకులు ఎంతో ఆవేశంతో ఉన్నప్పటికీ రాజనీతిని పాటించిన మలిదేవరాజు నన్ను మీ దగ్గరకు రాయబారిగా పంపించాడు. పగను పెంపొందించే ‘దుష్టులేకానీ అణచివేసే నిపుణులు ఈ భూమిమీద లేరు. కనుక మీ తమ్ముడైన నరసింహరాజును మలిదేవరాజు దగ్గరకు రాయబారిగా పంపించండి. ఇరువురూ ఒక్కటై ఈ పగను నశింపజేయండి. పల్నాడు మొత్తాన్ని ఎదురులేకుండా కలిసిమెలసి ఏలండి. కనుక మలిదేవునితో సఖ్యత కోసం నరసింగరాజును పంపించు అని భట్టు రాజుకు సూచించాడు.

పోరునష్టం : భూమిమీద ఎప్పుడైనా ఎక్క డైనా యుద్ధం మంచిది కాదు. పగలు పెరిగితే దేశం నాశనమైపోతుంది. ఎంతోమంది ప్రజలు మరణిస్తారు. మిగిలినవారు భయంతో పారిపోతారు. ధనాగారం ఖాళీ అవుతుంది. సైన్యానికి కూడా యుద్ధం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. జీతగాళ్ళు ఎదురు తిరుగుతారు. తమ జీతపు బకాయిల కోసం పట్టుబడతారు. రాజు, బంటు అనే తేడాలు ఉండవు. సేవకులు చెప్పిన మాట వినరు.

అదను కనిపెట్టిన శత్రువులు రాజ్యాన్ని ఆక్రమింఛజూస్తారు. శత్రువుల కదలికలు కనిపెట్టడం కష్టమౌతుంది. మీలో మీరే కొట్లాడుకుంటే చూసేవారికి చులకన అవుతారు. శత్రువులు మీ రహస్యాలను పసిగడతారు. దుష్టులు మీ పక్కన చేరి చెప్పుడు మాటలతో పగను ఇంతకింత పెంచి పోషిస్తారు. పగవల్ల ఐకమత్యం నశిస్తుంది. బలం, భాగ్యం రెండూ నశిస్తాయి. కీర్తి, పరాక్రమం కూడా నశిస్తాయి. రాజ్యం సర్వనాశనమౌతుంది. అన్నీ క్షీణించాక దేశం శత్రురాజుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.

పారతంత్ర్యం : యుద్ధం వల్ల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతకవలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను గురించి పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించిన పక్షులలాగా బతకాలి. పాములవాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దుల వాడు ముకుతాడు పొడిచి పొగరు అణచిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా: స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి.

2. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా ! పాఠం ద్వారా కవి వివరించిన వరకట్న దురాచారాన్ని విశ్లేషించండి.
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్చే వ్రాయబడింది. ఇది మహిళలపై జరుగుతున్న గృహహింసలు, స్త్రీల వరకట్నపు చావులపై స్పందన. ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే కొత్త పెళ్ళికూతురు వరకట్న దురాచారానికి బలి అయింది. ఆ విషాద సంఘటనే ఈ పాటకు ప్రేరణ అయింది.

దేశంలో ఆడదాని కన్నా అడవిలో చెట్టుకు ఎక్కువ విలువనిస్తున్నారు. ఆడ పిల్లలకు పెళ్ళి చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. వరకట్న దురాచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. కట్న పిశాచాలు జీవనం సాగిస్తున్న ఈ నరకంలాంటి సంఘంలో రాక్షసత్వం రాజ్యమేలుతుంది. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారుతున్నది. అడిగినంత కట్నం ఇవ్వలేదని, ఇచ్చినా లాంఛనాలు, అదనపు కట్నాలు ఆశించి అత్తింటివారు సాధింపులు పెడుతున్నారు. కొందరు దుర్భుద్ధితో కట్నం కోసం ఇంటికి వచ్చిన నవవధువులను కడతేర్చి ఇంకో పెళ్ళికి సిద్ధం చేస్తున్నారు. అత్త ఒకింటి కోడలే నన్న జ్ఞానం లేకుండా ఆడపిల్లలతో ఆటలాడుకుంటున్నారు..

పిశాచాల వంటి అత్తమామల ఆనందం కోసం నవ వధువులు ఆత్మ బలిదానాలు చేయవలసివస్తుంది. స్త్రీల జీవననాదం ఆర్తనాదమయ్యింది. వారి కళ్ళలో నీరు సెలయేరులై పారుతున్నాయి. స్త్రీలంతా ఈ వరకట్న దురాచారంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయాలి. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు. మంచి మనసుతో ఆలోచన చేసి నవ వధువుల ఆత్మహత్యలను ఆపవలసి వుంది.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. పూర్వం తెలుగువారి ఆటలను గురించి వివరించండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వముల నుండి గ్రహించబడినది. ఈ వ్యానం ప్రాచీన కాలంలో తెలుగువారి సంస్కృతిలో భాగమైన ఆటలు, వేడుకలను గురించి చక్కగా వివరిస్తుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయటమే ఈ వ్యాసంలోని విషయం.

ఆంగ్లేయులకు క్రికెట్ మొదలగు ఆటలున్నట్లు తెలుగువారికి జాతీయ క్రీడలు తక్కువ. వయసు వచ్చిన యువజనులు ఆడు ఆటలు చాలా అరుదు. మన ప్రబంధాలలో బాలబాలికలు ఆడు ఆటలు వర్ణించబడ్డాయి. మనదేశంలోని బాలబాలికలు ఏడెనిమిది సంవత్సరముల వయస్సు వచ్చేవరకు కలిసిమెలిసి ఆడుకునేవారు. ఆంగ్ల విద్యావిధానం వలన ఆ ఆటలు మూలనపడ్డాయి. అందువలన ప్రబంధాలలోని ఆటలు ఎలా ఆడేవారో ఎవరికి తెలియదు. ఈ ఆటలను గురించి అయ్యలరాజు నారాయణామాత్యుడు తన ‘హంస వింశతి’ కావ్యంలో వివరించాడు.

తెలుగు నేలపై ఆడు ఆటలలో కొన్ని ఇంటిలోను కొన్ని ఇంటి వెలుపల మరికొన్ని ఇంట్లోను, బయటను ఆడుకొనే ఆటలున్నాయి. అచ్చనగళ్ళు కేవలం బాలికల క్రీడ. కోతికొమ్మచ్చి బాలుర ఆట. కుందికట్టు, కంబాలాట, పుట్టచెండు, దాగుడుమూతలు మొదలగునవి బాల బాలికలు ఇద్దరూ ఆడే ఆటలు. ఈ ఆటలతోపాటు పాటలు కూడా ఉంటాయి. ఒకే ఆట వేరువేరు తెలుగు ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుచుకునేవారు. కోతికొమ్మచ్చిని; క్రోత క్రోతులని, కందికట్టుకు కుందికాళ్ళని కుందెనగిరి అని, కుందెన గుడి అని వ్యవహరించేవారు.

2. తెలుగులో వచ్చిన జాతీయోద్యమ కవిత్వాన్ని వివరించండి.
జవాబు:
‘జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలు’ గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.
సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని ‘జాతీయోద్యమం’ అంటారు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు పలురూపాలలో జరిగాయి. తెలుగు నేలపై జాతీయోద్యమ ప్రభావం వందేమాతర ఉద్యమ ప్రచారానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రాంతానికి వచ్చిన నాటి నుండి ప్రారంభమయింది. ఆయన ఆంగ్ల ఉపన్యాసాలకు తెలుగు అనువాదంగా
“భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”
ఇది వందేమాతరం గురించి రాసింది కాదు. బ్రిటీషువారి దోపిడీని ప్రజలకు తెలియజేయటానికి వ్రాసింది. చిలకమర్తి కవితల స్ఫూర్తితో సామ్రాజ్యవాదుల దోపిడీ మీద, భారత ప్రజలు అనుభవిస్తున్న దారిద్ర్యం మీద తెలుగు కవులు పద్యాలు గేయాలు వ్రాశారు. చెన్నాప్రగడ భానుమూర్తి ‘డ్రెయిను’ సిద్ధాంతం గురించి, చిదంబరరావు మితవాద రాజకీయాలను గురించి వ్రాశారు.
“మేలుకొనుమీ భరత పుత్రుడ
మేలుకొనుమీ సుజన పుత్రుడు
ఇలా మితవాద, వందేమాతరం, హోంరూల్ ఉద్యమాల మీద కవితలు వెల్లువలా వచ్చాయి.
సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, శాశనోల్లంఘనం వంటి గాంధీ పోరాట రూపాలన్నీ తెలుగు పాటలు గాను గేయాలుగాను, కవితలుగాను వెలువడ్డాయి. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, ఖిలాఫత్ ఉద్యమం మీద, రాట్నం మీద, మద్యపాన నిషేధం మీద తెలుగు కవుల పద్యాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి.
జలియన్ వాలాబాగ్ ఉదంతానికి బ్రిటీషువారు డయ్యరును అభినందించినపుడు
“దయ్యమునకు నిముడు
అలడయ్యరు అధముడని గరిమెళ్ళ
పశుబలమునకు భక్తుండొకడు బడాయి ఓ” డయ్యరు
………… అని చిల్లరిగె శ్రీనివాసరావు విమర్శల వర్షం కురిపించారు. “మా కొద్దీ తెల్లదొరతనం”, జాతీయోద్యమ తెలుగు కవితలలో ప్రజాదరణను పొందింది.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)

1. ‘గవేషణ’ నాటిక సారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతన్ని యమలోకం తీసుకొని వెళుతుంటారు. మానవుడు తానింకా బ్రతికే ఉన్నానని ఎంత వాదించినా. వినకుండా మృత్యుదూతలు న్యాయమూర్తికి అప్పగిస్తారు. న్యాయమూర్తి అతని జీవితపు కాగితాన్ని పరిశీలించి ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రహిస్తాడు. తిరిగి భూలోకం వెళ్ళిపో ఇంకా 5 సంవత్సరాల ఆయష్షు ఉందని చెప్తాడు ధర్మమూర్తి. తిరిగి భూలోకం చేరుకున్న మానవునికి తన శరీరం కనబడలేదు. అప్పటికే బంధువులు కళేబరాన్ని దహనం చేశారు. ఈ శరీరం లేని ఆత్మతో ఎలా జీవించాలో అర్థం కాక తిరిగి ధర్మమూర్తి దగ్గరకు వెళదామని నిర్ణయించుకుంటాడు. తిరిగి మరో ప్రపంచపు సొరంగాల దగ్గరకు వెళతాడు. అక్కడ ఒక నవ్వు వినబడుతుంది. ఎవరు -ఎందుకు . నవ్వుతున్నావని మానవుడు ఆ నవ్విన వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఎందుకొచ్చావని తిరిగి మానవుణ్ణి నవ్విన వ్యక్తి ప్రశ్నించగా తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తాడు. నవ్విన వ్యక్తి సానుభూతితో మానవునికి సహాయం చేయాలనుకుంటాడు. న్యాయమూర్తి దర్శనం కలిగిస్తాడు. ధర్మదేవత తిరిగి వచ్చిన మానవునికి పూర్ణ ఆయుర్ధాయం కలిగేలా వరం ఇస్తుంది.

జన్మరాహిత్యాన్ని ఇవ్వలేను. కాని తిరిగి ఏదైనా శరీరంలో ప్రవేశించి బ్రతకమంటుంది. కాని మానవుడు తన 35 ఏళ్ళ జీవితంలో ఎలా ఉన్నాడో అలా ఉండే శరీరం ఎక్కడ లభిస్తుంది అని బాధపడతాడు. దేవతల మీద నమ్మకం లేకపోయినా ఫర్వాలేదు కాని మానవత్వం పై నమ్మకాన్ని వదులుకోవద్దని అయినా దేవతల వల్ల జరిగిన పొరపాటుని నేనే ధర్మదేవతను క్షమించమని కోరుతున్నానని మానవుని చేతులు పట్టుకుంటుంది. ఈ అల్ప మానవులు దేవతలను క్షమించటమా అంతమాట అనవద్దని మానవుడు తిరిగి భూలోకానికి వెళ్ళిపోతానని సెలవు తీసుకుంటాడు. తనకు తనలాగా బ్రతికే అవకాశం లేనప్పుడు ఏ బ్రతుకైతేనేం ? అని కొత్త జీవితాన్ని ప్రారంభించాలను కుంటాడు. తనని ఓ అమ్మ కడుపులో పడేయమని ప్రార్థిస్తాడు. నేను తిరిగి సృష్టించలేనని ధర్మదేవత భూలోకంలో ఇప్పుడే ఒక అమ్మాయి ప్రసవించింది. శిశువు మృతుడయ్యాడు. ఆ శిశువులో నీ ఆత్మని ప్రవేశపెట్టుకో. నీకు పూర్ణ ఆయుర్ధాయం ఇస్తున్నానని చెప్పింది. మానవుడు ఆ వైద్యశాల చేరుకొని శిశువు శరీరంలో ప్రవేశించాడు. అంతవరకు అష్టకష్టాలు పడ్డ వైద్యులు శిశువు క్యారు మనడంతో ఊపిరి పీల్చుకున్నారు. మృత శిశువని ఏడ్చిన తల్లి ఆనందంతో బిడ్డను చూసుకుంది.

2. ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు కళ్ళను సత్యం తెరిపించిన విధానం వివరించండి.
జవాబు:
డాక్టర్ సుదర్శన్ ప్రముఖ నేత్రవైద్యుడు. జయపురం రాజావారికి నేత్రవైద్యం చేయడానికి జయపురం బయలుదేరాడు సుదర్శన్. అసిస్టెంట్ డాక్టర్ సత్యం తోడుగా ప్రయాణ మయ్యాడు. తనకు కొంతవరకైనా విద్యను నేర్పితే సహాయంగా ఉండే వాడినని ఎంతగానో ప్రాధేయపడతాడు సత్యం. తన వారసులకు తప్ప ఇతరులకు ఆ వైద్య విద్యలో నైపుణ్యాన్ని తెలియజేయడానికి ఇష్టపడడు డాక్టర్ సుదర్శన్.

రైలులో ప్రయాణిస్తూ కిటికీ తీయమని సత్యానికి చెప్పాడు సుదర్శన్. కిటికీలో నుండి నిప్పురవ్వలు కంట్లోపడి ఏదో మంటగా ఉందని అరుస్తాడు సుదర్శన్. బ్యాగ్ లో చుక్కల మందు వెయ్యమంటాడు. ఆ మందు వేసినా కళ్ళ మంట తగ్గలేదు. గట్టిగా అరుస్తూ తనకేమీ కనబడటం లేదని అంటాడు సుదర్శన్. విద్యంతా తన సొత్తు అని అహంకారంతో అహంభావానికి లోనయ్యాను. భగవంతుడు తగిన శిక్ష వేసాడని బాధపడతాడు సుదర్శన్.

నా విద్యంతా ఎవరికి కావాలి ? నాకే ప్రయోజనం లేదు. శాశ్వతంగా గుడ్డివాడిని అయ్యాను అని బాధపడ్డాడు. జీవితాంతం కళ్ళులేని బ్రతుకేనా అని భార్య బాధపడింది.

సత్యం డాక్టర్ గారిని క్షమించమని అడిగి, ఆపరేషన్ చేస్తానని అంటాడు. “నువ్వా నాకు ఆపరేషన్ ఎలా చేస్తావు ? మీకేం భయంలేదు నన్ను నమ్మండి. మీకు కళ్ళు బాగుచేస్తానని ఆపరేషన్ చేశాడు. సుదర్శన్ ఆశ్చర్యపోతూ సత్యం ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు.

ఒకసారి; నర్సు వేషంలో ఒకసారి సుదర్శన్ చేసే ఆపరేషన్ చూసి నేర్చుకుంటాడు. ఆ విధంగా తెలియకుండా నేర్చు కున్నందుకు క్షమించమని డాక్టరుని మన్నించమంటాడు. అలాగైనా నేర్చుకున్న విద్యతో తిరిగి డాక్టర్కు చూపునిచ్చినందుకు సత్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు సుదర్శన్. సత్యాన్ని ధన్యుడని ప్రజాసేవ సార్థకమవుతుందని .. కొనియాడతాడు. పోయిన కళ్ళతో పాటు అజ్ఞానంగా, స్వార్థంగా విద్యను దాచిపెట్టిన తనకు మనోనేత్రం కూడా తెరిపించాడు సత్యం అని సంతోషిస్తాడు.

3. ‘ఆశ ఖరీదు అణా’లో తాత పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
ఆశ ఖరీదు అణాలో తాత ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి. 33 సంవత్సరాలు సర్కారీ నౌకరీ చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఏదో చాలీచాలని పింఛను వస్తుంది. సంసారం చూస్తే గంపెడు. తొమ్మిదిమంది పిల్లలు. వారిలో ఇద్దరి అబ్బాయిలకు వివాహాలు అయినా నిరుద్యోగులుగా ఉంటారు. నలుగురు వివాహానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పిల్లల చదువులకు స్తోమత లేదు. కాలక్షేపంగా కొత్తగా వచ్చిన యువకునితో బాతాఖానీ వేస్తాడు.

తాతగార్ని చూస్తే ఒక రకంగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా ఏవో సమస్యలు ఉంటాయి. సమస్యలతో నిద్రరాక మేడపైకి వెడతాడు. ఇంకా నిద్రపోలేదా తాతగారు అని అడగ్గానే నువ్వు ఎందుకు నిద్రపోలేదు నిద్రలో హాయిగా ఉంటుంది మెలకువలోనే భయాలు, బెంగలూ అని తనకున్న దిగుళ్ళను తెలియజేస్తాడు. యువకుని ఉద్యోగ వివరాలు అడిగి ఉద్యోగం చేయక పోవడమే మంచిదని తెలియజేస్తాడు. ఈ మాయాలోకంలో ఉద్యోగం లేకుండా ఉంటేనే నయం. ఏ పనైనా కష్టపడితే ఫలితం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల లేని బ్రతుకు. చాలీచాలని జీతం అని తన అనుభవాలను తెలియజేస్తాడు. ఇప్పుడు విచారిస్తున్నారా ? అని “యువకుడు అడిగితే తన జీవితంలో విచారం అనే పదం లేదని జరిగిన అనుభవాన్ని చెప్పానని అంటాడు తాత.

లాటరీ వేశాం ఓడిపోయాం అని ఆలోచనతోనే ఉంటాడు తాత, ఏదో ఒక సమస్యతో జీవితంపై ఆశలు పోగొట్టుకున్న కృష్ణవేణి, యువకుడు, ఇందిరా, లక్ష్మీల అన్నయ్యలను చూసి బ్రతుకులో ఉండే ఆనందాన్ని చూడమని ధైర్యం చెప్తాడు. లోకంలో ఉండే మంచినీ, మమతల్నీ చిత్రాలుగా గీయమంటాడు. బ్రతుకులో మాధుర్యాన్ని పొందమని వాళ్ళలో నూతన చైతన్యం కలిగిస్తాడు. ఎవరికి వారే జీవితాన్ని చాలించాలని రోడ్డుమీదకు వచ్చిన వారందరిలో ఆశలు కలిగించి నూతన జీవితాలను ప్రారంభించమని తన అనుభవాలను జతచేసిన వారిలో ధైర్యాన్ని కలిగిస్తాడు. అందరికి తలా ఓ గ్లాసు కాఫీ తాగించి వారిలో నూతనోత్సాహం కలిగిస్తాడు తాత.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

4. ‘గవేషణ’ నాటికలో న్యాయమూర్తికి, మరణించిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణను తెల్పండి.
జవాబు:
మరణించిన మానవుని ఆత్మను మరో ప్రపంచపు న్యాయస్థానానికి చేర్చారు మృత్యు దూతలు. అక్కడ రక్షకభటులు ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి సమక్షంలో హాజరు పరిచారు ఆ మానవుణ్ణి. న్యాయమూర్తి వయస్సులేని, నేత్రాలు లేని ఒక స్త్రీ మూర్తి. ఎదురుగా ఉన్న మానవున్ని ఉద్దేశించి “నాకు కళ్ళు లేవు అయినా చూడగలను. భూలోకంలో నీకింకా ఐదు సంవత్సరాల ఆయుర్ధాయం ఉంది. మా కార్యాలయంలో ఉన్న చిన్న ఉద్యోగి తప్పు లెక్కవల్ల మృత్యుదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు” అని అనగా “మీరు ధర్మప్రభువులు దేవతల పొరపాటువల్ల మానవులు బాధ పడుతున్నారు నేను బ్రతికున్నట్టా ? చనిపోయినట్టా ? .ఈ సందేహం నన్ను బాధిస్తోంది” అని మానవుడు ప్రశ్నించాడు.

“మృత్యురాజ్యపు చట్ట ప్రకారం నీవు మృతి చెందావు. కనుకనే మా మృత్యుదూతలు నీ శరీరం నుండి ఆత్మను తొలగించారు. నీ కాగితాలు తెప్పించి పై అధికారులతో నీ విషయమై వాదించాను. ఇక్కడ వ్యవస్థలో ఏదో పొరపాటు జరిగిందనే అందరూ అనుకుంటున్నారు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయదలిచాను. నువ్వింక భూలోకానికి వెళ్ళిపోవచ్చు. జరిగిన పొరపాటుకు సిగ్గు పడుతున్నాను” అని న్యాయమూర్తి అన్నాడు. భగవంతుడు కూడా నీకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఉంటాడని అన్నాడు న్యాయమూర్తి. మీరు ధర్మదేవతను చూడలేదా అన్నాడు మానవుడు. భగవంతుడు కూడా ధర్మానికి అతీతుడు అయినా ఈ చర్చ అవసరం అని న్యాయమూర్తి సభ చాలించాడు.

పల్లెటూల్లో మానవుని ఆత్మను దిగవిడిచారు మృత్యుదూతలు. తన శరీరం కనిపించక ఆ మానవుని ఆత్మ అల్లాడిపోయింది. తిరిగి మరో ప్రపంచంలో తన శరీరం గురించి అడగడానికి నిశ్చయించుకుంది ఆత్మ. మరో ప్రపంచపు గోడల దగ్గర తచ్చాడుతున్న ఆత్మను అక్కడ ఒక భటుడు చూస్తాడు. ఆ ఆత్మ వివరాలడిగి సాయం చేయదలచి న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళతాడు. తిరిగి ఎందుకొచ్చావని న్యాయమూర్తి మానవుని ఆత్మను ప్రశ్నించాడు. ధర్మదేవత నా జీవితం ప్రసాదించినా నా శరీరాన్ని నా బంధువులు దహనం చేశారు. ఏ చెట్టు కొమ్మనో పట్టుకొని వేలాడలేను. నిన్న రాత్రంతా చాలా యాతనపడ్డాను. గబ్బిలం శరీరంలో ప్రవేశించాను. కాని గబ్బిలం బ్రతుకు దుర్భరం అనిపించింది.

ఒక కప్పలో ప్రవేశించాను కాని బావిలో కప్ప జీవితం ఉక్కిరిబిక్కిరి అనిపించింది. మీరిచ్చిన ఐదేళ్ళు మీరే తీసుకోండి అని మానవుడు న్యాయదేవతకు విన్నవించుకున్నాడు. కొత్త జీవితం ప్రారంభిస్తావా ? అని అడిగాడు న్యాయమూర్తి తిరిగి భూలోకానికి ప్రయాణమయ్యాడు. మృత్యుదూతలు తిరిగి మానవుణ్ణి పల్లెటూరికి తీసుకొనివెళ్ళారు. కాని అప్పటికే బంధువులు అతని శరీరాన్ని దహనం చేశారు. ఇంకా ఐదు సంవత్సరాలు ఆత్మకి శరీరం లేకుండా ఎలా జీవించాలో అర్థం కాలేదు. మళ్ళీ ధర్మదేవత దర్శనం అయితే బాగుండుననిపించింది. కాని ఈ లోకంలో ఉన్నతాధికారుల దర్శనం కావాలంటే ఎన్నెన్నో తిప్పలు పడాలి. ఇంక ఆ లోకంలో అధికారులు దర్శనం అంటే మాటలా ? ఇదేమిటీ ఉపద్రవం ? అని బాధపడ్డాడు మానవుడు. అయినా ఎక్కడో ఎవరో చేసిన పొరపాటుకి తానెందుకు బాధపడాలి ? మరల తన శరీరాన్ని తిరిగి ఇప్పించమని న్యాయమూర్తికి ఫిర్యాదు చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు.

జీవన్మరణాల మధ్య అల్లాడుతున్న ఆత్మగా మిగిలిపోయానే అని దుఃఖిస్తూ మరో ప్రపంచం దగ్గరకు చేరుకుంది ఆత్మ. ఆ మానవుని దీనావస్థతో న్యాయమూర్తీ అన్న పిలుపుకి ఒక వ్యక్తి నవ్వు వినబడింది. ఆ నవ్విన వ్యక్తి ఎవరవయ్యా నీవు అనగా ఇంకా 5 ఏళ్ళు ఆయుర్ధాయం ఉన్న ఆత్మను అని సమాధానం ఇచ్చాడు మానవుడు.. సరే నీకేం సాయం కావాలి అన్నాడు నవ్విన వ్యక్తి. న్యాయమూర్తి చేసేది లేక మానవునికి పూర్ణ ఆయుష్షుని ఇచ్చాడు.

ఐదేళ్ళ కాలపరిమితినీ తొలగిస్తూ నీ ఇష్టం వచ్చిన శరీరంలో ప్రవేశించి బ్రతక మంటాడు. న్యాయమూర్తి. నన్ను జన్మదుఃఖపు చెర విడిపించండి అని వేడుకుంటాడు మానవుడు. తనకు జన్మరాహిత్యం గాని సృష్టించడంగాని తెలియవని అశక్తుడనని అంటాడు దేవతలే తమ అశక్తతను మానవుని దగ్గర తెలియజేస్తుంటే ఏమనాలో అర్థం కాలేదు మానవునికి. జరిగిందేదో జరిగింది ఏదో ఒక బ్రతుకు, ఎలాగో ఒక లాగా బ్రతుకుతాను భూలోకానికి వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తాను. నేను మీ చేతిలో ఆటవస్తువును. మీరు మరొకరిచేతిలో ఆటవస్తువులు. ఇది అంతం లేనిది అంటాడు మానవుడు. ఇదే సృష్టి రహస్యం అని తెలియజేస్తాడు న్యాయమూర్తి.

దేవతల్లోను మానవులపైనా నాకు నమ్మకం పోతోందని మానవుడంటే దేవతలపై నమ్మకం లేకపోయినా మానవులపై, మానవత్వంపై విశ్వాసం సడలనీయకు అని న్యాయమూర్తి అంటూ జరిగిన మా పొరపాటుకు క్షమించమని మానవుణ్ణి కోరుకుంటాడు. ఇక భూలోకంలో ఒక స్త్రీ అప్పుడే ప్రసవించిన శిశువును చూపిస్తాడు. ఆ మృతశిశువు శరీరంలో ప్రవేశిస్తాడు మానవుడు. అంతవరకు ఆరాటపడ్డ డాక్టర్లు, చనిపోయిన శిశువుని చూసి బోరుమన్న తల్లి తిరిగి శిశువు క్యారుమనడంతో ఆనందిస్తారు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.

1. ఒక సూనృత వాక్యము మేలు సూడగన్.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది.
సందర్భం : ఈ మాటలు సత్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దుష్యంతునితో శకుంతల పలికిన సందర్భంలోనిది.
భావం : నూరుగురు కుమారుల కంటే ఒక్క సత్యవాక్యము మేలైనది అని భావం. వ్యాఖ్య : నూరు చేదుడు బావులు కంటే ఒక దిగుడు బావి మేలు. అటువంటి నూరు దిగుడు బావులకన్నా ఒక్క గొప్ప యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకన్నా గుణవంతుడైన ఒక్క కుమారుడు మేలు. అటువంటి నూరుగురు కుమారులు కన్నా ఒక్క సత్యవాక్యం మేలైనది.

2. కౌరవులెల్ల గతిచెడి పడినట్టి కష్టముల్ వినమె !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు కలహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ భట్టు నలగామరాజుతో పలికిన సందర్భంలోనిది.
భావము : పూర్వం యుద్ధం వల్ల కౌరవులంతా నాశనమై పడిన కష్టాలను విన్నాం కదా ! అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా! అన్నదమ్ములైన మీరు ఇరువురూ కలసిమెలసి ఉంటే ఎంతో లాభం. గొప్పకీర్తి సాధించవచ్చు. యుద్ధం వల్ల అంతా నష్టమే జరుగుతుంది. పూర్వం కౌరవులంతా యుద్ధం వల్ల నాశనమై పడిన కష్టాలను విన్నాం కదా ! అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

3. వసుధా స్థలి వర్థిల్లు బ్రహ్మ కల్పముల్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవయిత్రి మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ లోనిది. పాఠ్యభాగము హనుమత్సందేశము.
సందర్భము : హనుమంతుడు తనకు చేసిన ఉపకారానికి బదులుగా, సీత హనుమంతుడిని చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదించి దీవిస్తూ హనుమంతునితో పలికిన పలుకులివి.
భావం : శ్రీరాముని యోగక్షేమాలను తెలియజేస్తూ, భర్త శ్రీరాముని రత్నపుటుంగరాన్ని తెచ్చి యిచ్చిన హనుమంతుడిని వాత్సల్యంతో ఈ భూమి మీద మరణం లేకుండా చిరకాలం బ్రహ్మకల్పముల పర్యంతము జీవించుమని సీత దీవెనలిచ్చినదని భావం.

4. అమ్మతనం ముందు అమ్మక తనం ఓడిపోతుంది.-
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా॥ ‘అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ప్రపంచీకరణ విషబీజాలు మన సంస్కృతీ సంప్రదాయాలపై ఎలా ప్రభావం చూపిస్తున్నదో కవి తెలియజేసిన సందర్భంలోనిది.
భావము :: ప్రపంచీకరణ ప్రభావం నుండి మనల్ని మనం కాపాడుకోవలసిన సమయం వచ్చింది. మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను మనం నిలబెట్టుకోవాలి. అప్పుడే అమ్మతనం ముందు అమ్మకం తనం ఓడిపోతుందని ఇందలి భావం.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

1. భట్టు నలగామ రాజును ఏమని స్తుతించాడు ?
జవాబు:
మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజు కొలువులోకి ప్రవేశించాడు. రాజు ఎదుట వినయంగా నిలబడి నమస్కరించాడు. నలగామరాజును ఇట్లా స్తుతించాడు.
ఓ రాజా ! నీవు రాజులందరిలో గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజ వేశ్యలను రంజింపచేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. దానగుణంలో గొప్పవాడివి. మేరు పర్వతాన్ని తలదన్నే ధైర్యం కలవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుని, వంటివాడివి. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు · నిలయమైనవాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్దకుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు. వైభవంలో దేవేంద్రుడవు అంటూ భట్టు నలగామరాజును స్తుతించాడు.

2. మొల్లను గురించి వ్రాయండి.
జవాబు:
తేనె నోట్లో వేసుకుంటే తియ్యగా అనిపించే విధంగా తేట మాటలతో తెలుగులో రామాయణం రాసిన గొప్ప కవయిత్రి మొల్ల. మొల్ల రామాయణము తెలుగులో బహుళ ప్రజాదరణను పొందింది. ఈమె పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. కాలం క్రీ.శ. 16వ శతాబ్ది. తండ్రి ఆతుకూరి కేసన.
ఈమె గోపవరపు శ్రీకంఠమల్లేశుని వరప్రసాదంతో కవిత్వం నేర్చుకొంది. మొల్ల తన రామాయణాన్ని శ్రీరామునికే అంకితం చేసిన ధన్యజీవి, కవయిత్రి మొల్ల.

3. కన్యక తండ్రికి, రాజుకు మధ్య జరిగిన సంభాషణ వ్రాయండి.
జవాబు:
గొప్ప అందగత్తె అయిన కన్యక ఒక సెట్టి కూతురు. తన చెలికత్తెలతో దైవపూజ కోసం రాచవీధులలో వెడుతున్న కన్యకను రాజు చెరపట్టబోయాడు. వెనుక వస్తున్న కన్యక తండ్రి అయిన సెట్టి రాజుకు నమస్కరించి ఇట్లా అన్నాడు.

“రాజా ! నువ్వు ఈ రాజ్యాన్ని పాలించే ప్రభువువు. కనుక నా కూతుర్ని బలవంతంగా పొందవలసిన అవసరం నీకు లేదు. ఆమె కూడా నీ సొత్తే కదా ! నీ వంటి మహారాజు సెట్టిని అయిన నా కూతుర్ని కోరడం కంటే మా జాతికి కీర్తి ఏముంటుంది ? దయతో నా మాట మన్నించండి.

మాకు కులధర్మం ఒకటి ఉన్నది. మా కులం పెద్దలు, బంధువులూ మెచ్చేటట్లు మీరు కూడా ఆ ధర్మాన్ని పాటించండి. అగ్నిసాక్షిగా నా కూతుర్ని పెళ్ళాడండి. అదే మాకు ఎంతో గౌరవాన్నిస్తుంది. మీకు కానుకలు ఏమి కావాలో చెప్పండి. తెచ్చి ఇస్తాను. మీరు నా కూతుర్ని పెళ్ళాడితే మా జాతి ధర్మం నిలబడుతుంది” అని సెట్టి రాజుతో అన్నాడు.

సెట్టి మాటలకు రాజు ఎగతాళిగా నవ్వి ఇట్లా అన్నాడు. “రాజ్యాన్ని పాలించే ప్రభువును నేను. సెట్టివైన నువ్వు నాకు ధర్మం నేర్పుతావా ? అసలు రాజు అనుకున్నదే ధర్మం. రాజు చెప్పిందే శాస్త్రం. రాజులకు గాంధర్వ వివాహ పద్ధతి అందరూ ఆమోదించిన ఆచారమే కదా ! కనుక ఆలస్యం వద్దు. బాధపడవద్దు. ఇవాళ, రేపో అంటూ గడువు పెట్టవద్దు. ఇష్టమైతే నీ కూతుర్ని ఇచ్చి పెళ్ళి చెయ్యి. లేకపోతే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో ! డేగ పిట్టను పట్టుకుంటే విడిచిపెడుతుందా ? అలాగే నేను నీ కూతురిని విడిచిపెడతానా ? ఆమె తిరిగి నీ ఇంటికి రాదు. నువ్వు ఇస్తానన్న కానుకలు ఇక్కడికే తీసుకొనిరా. అప్పటివరకూ నేను ఇక్కడే ఉంటాను అని రాజు అన్నాడు.

అపుడు సెట్టి “రాజా ! దైవకార్యం తరువాత కదా రాచకార్యం. కనుక ముందు వీరభద్రుని దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి వస్తాను” అన్నాడు. అపుడు రాజు సరే! పదా ! నేను కూడా నీతోనే వస్తాను. దేవాలయంలోనే అగ్నిసాక్షిగా కన్యకను అందు కుంటాను, అని చెప్పి రాజు తాను కూడా దేవాలయానికి బయలుదేరాడు.

4. కలేకూరి ప్రసాద్ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి ?.
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్్చ రచించబడింది. ఇది స్త్రీలపై జరుగుతున్న వరకట్న దురాచారం కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందన.
ఈ దేశంలో స్త్రీ జాతికన్నా అడవిలో పుట్టిన చెట్టుకే విలువ ఎక్కువ. స్త్రీకి స్త్రీయే త్రువు అవుతుంది. స్త్రీలలో నవచైతన్యం రావాలి. కట్నకానుకల కోసం పీడించే ఈ సమాజాన్ని స్త్రీలే మార్చుకోవాలి. స్త్రీ, పురుష వివక్షత లేకుండా అందరూ సమానమనే భావన రావాలి. ఇంటికి వచ్చిన నవవధువును మాటలతో, చేతలతో వేధించే ఆడపడుచులు తమకు కూడా · అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితే ఎదురౌతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోడలి బ్రతుకులో నిప్పులుపోసే అత్తగారు తన కూతురికి కూడా అత్తవారింట్లో ఇలాంటి బాధలే కలుగుతాయేమోనన్న ఆలోచన రావాలి. స్త్రీ జాతి అంతా తమని తాము సంస్కరించుకోవాలి. నవవధువులను . అత్తమామలు, ఆడపడుచులు రాక్షసుల వలే పీడిస్తున్నారని, ఈ దుస్థితి బావితరాలకుండకూడదని, జాతి ఏకమై తమకు తాము చేసుకుంటున్న ద్రోహాన్ని ఎదిరించాలని కలేకూరి ప్రసాద్ ఆశించాడు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. ధనుర్విద్య, కత్తిసాము, గుర్రపుస్వారీ మొదలైన వాటిని గురించి వ్రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వ సంపుటం నుండి గ్రహించబడింది.
ఆంధ్రదేశాన ధనుర్విద్య, కత్తిసాము, బాణవిద్య, గుర్రపుస్వారీ వంటి యుద్ధ విద్యలను అన్ని వర్ణముల వారు నేర్చుకొనేవారు. ముఖ్యంగా క్షత్రియులు, శూద్రులకు ఈ విద్యలు తప్పనిసరి. పాలక వంశాలకు చెందినవారు, విలు విద్య, కుంతాయుధ, కత్తిసాము, గుర్రపుస్వారీ మొదలగు వానిని నేర్చేవారు. శూద్రులతో పాటు బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, వైశ్యులు గజ అశ్వ విద్యలలో ఆరితేరినవారన్నట్లు శాసనాలు తెలుపు తున్నాయి. స్త్రీలు కూడా ఈ విద్యలను నేర్చినట్లు శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయ నగరానికి వచ్చిన ‘పేయస్’ అనే విదేశీయాత్రికుడు వ్రాశాడు. రాజమహేంద్రవరాన్ని పాలించిన వీరభద్రారెడ్డి సోదరుడు దొడ్డారెడ్డి గుర్రపుస్వారీలో ఉద్దండుడట. ఒకే వేటులో ఆరుముక్కలుగా నరకగలిగిన కత్తియుద్ధ నిపుణులున్నారని చరిత్ర చెప్తుంది.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

2. స్ఫూర్తి శ్రీ సాహిత్య కృషిని తెల్పండి.
జవాబు:
అర్థ విపరిణామము అను పాఠ్యభాగం స్ఫూర్తి శ్రీ చే రచించబడిన తెలుగు భాషా చరిత్రలోని అర్థప్రకరణం నుండి గ్రహించబడింది. వీరు శాస్త్ర గ్రంథాలను సరళతరం చేసి తెలుగు జాతికి అందించారు. స్ఫూర్తిశ్రీ అసలు పేరు తోకల భాస్కరరావు. స్ఫూర్తిశ్రీ జనవరి 5, 1928న కాకినాడలో వీరాయమ్మ, బుచ్చిరాజులకు జన్మించారు. కాకినాడ పిఠాపురం రాజావారి విద్యా సంస్థలలో పాఠశాల కళాశాల చదువును పూర్తిచేసి ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి బి.ఏ ఆనర్స్ చేశారు.

స్ఫూర్తిశ్రీ రచనలు : భోజుని సరస్వతీ కంఠాభరణానికి తెలుగు వ్యాఖ్యానం మూడు భాగాలు, జయదేవుని చంద్రాలోక సమున్మేషణానికి తెలుగులో అర్థవివరణము. క్షేమేంద్రుని ఔచిత్య సంప్రదాయానికి చారిత్రక సమీక్ష, బాల పౌఢ వ్యాకరణాల వ్యాఖ్య, తెలుగు భాషా చరిత్రను వ్రాశారు. ఇవేకాక స్ఫూర్తిశ్రీ ‘స్ఫూర్తిశ్రీ వ్యాసావళి’ అను పేర రెండు సాహితీ సంపుటాలను రచించారు. వీరి సరళ సులభమైన గ్రంథాలను చదివి విద్యావంతులైన వారెందరో తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. తెలుగు భాషను సులభతరం చేసి విశేష కృషిచేసిన సాహితీ వేత్త స్ఫూర్తిశ్రీ.

3. రావూరి భరద్వాజ పెళ్ళి సంబంధ వృత్తాంతాన్ని తెల్పండి.
జవాబు:
‘నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్తం రూపం.
భరద్వాజకు కులాల పట్టింపు లేదని, ఎక్కడబడితే అక్కడే తింటాడని, ఆస్తిపాస్తులేవీ లేవని, ఏ ఉద్యోగము లేదని, ఏ పనీ చేతగాదని పిల్లను ఇచ్చి పెళ్ళి చేయటానికి ఎవరూ మందుకు రాలేదు. ఆయనకు కూడా అలానే అన్పించింది. అదే సమయంలో కృష్ణాజిల్లా తోటరావులపాడు గ్రామానికి చెందిన మేడూరి మల్లయ్య తన కుమారై ‘కాంతాన్ని’ భరద్వాజకు ఇవ్వటానికి ముందుకొచ్చారు. ఆయనకు పెళ్ళి కాదేమోనన్న భయంతో భరద్వాజ మేనమామ మల్లయ్యగారికి చాలా అబద్ధాలు చెప్పారు. అవన్నీ అబద్ధాలని మల్లయ్యగారికి భరద్వాజ చెప్పుకున్నాడు. ఆయన మాటలలోని నిజాయితీని గ్రహించి మల్లయ్యగారు నిజం చెప్పిన వారికి పిడికెడు మెతుకులు దొరకుతాయి. మీకో పిడికెడు దొరికితే సగం మీరు తిని మిగిలిన సగం నా కూతురుకు పెడతారన్న నమ్మకం నాకున్నదని జవాబిచ్చారు.

భరద్వాజ గారు పిల్లను కూడా 1948 మే 28న రాత్రి పెళ్ళిలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే చూశారు. పెళ్ళి అయింది. వంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా కాంతం భరద్వాజ యింటికి వచ్చింది. కాని మూడు సంవత్సరాలు గడవక ముందే ఆమె భరద్వాజ గారి దరిద్రత వలన నిరాభరణ సుందరిగా మారిపోయింది. ఆగష్టు 1, 1986న కాంతం గారు కాలం చేశారు.

4. బలిజేపల్లి స్వరాజ్య కాంక్షను తెల్పండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం ‘త్రిపురనేని మధుసూదనరావు’ గారిచే రచించబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” అను గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం. జాతీయోద్యమ కాలంలో తెలుగు సాహిత్యంలో రచనలు చేయని కవులు లేరంటే లేరు. వారిలో చిలకమర్తి, చన్నా ప్రగడ భానుమూర్తి, బలిజేపల్లి వార్లు ముఖ్యులు.
“వడకు నూలు వలువలు నేసి
చేతివృత్తులు లేవదీసి
కల్లు సారా లెల్లరోసి
జైళ్ళలో కెళ్ళివద్దాం”
అని స్వరాజ్య ఉద్యమానికి ప్రజా సంఘాలను ఉసిగొలిపారు. ఆంగ్లేయుల పాఠశాలలను పాడు పెట్టమని, వారి కోర్టులను కూలదోయమని, సీమ గుడ్డలను చింపివేసి స్వదేశీ బట్టలను . ధరించమని, అందుకోసం జైలుకైనా వెళ్ళాలని స్వరాజ్య కాంక్షను బలిజేపల్లి వారు ప్రజలలో రేకెత్తించారు.

VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. శకుంతలను పెంచిన తండ్రి ఎవరు ?
జవాబు:
కణ్వ మహర్షి

2. రాయబారానికి వచ్చి వధించబడినది ఎవరు ?
జవాబు:
అలరాజు.

3. మొల్ల రామాయణం ఎవరికి అంకితమివ్వబడింది ?
జవాబు:
శ్రీరామచంద్రునికి.

4. కన్యకను అగ్ని సాక్షిగా వివాహం చేసుకోమన్నది ఎవరు ?
జవాబు:
కన్యక తండ్రి అయిన సెట్టి.

5. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా ! గేయ రచయిత ఎవరు ?
జవాబు:
కలేకూరి ప్రసాద్.

6. సాహితీ సంచార యోధునిగా పేరు పొందిన వారెవరు ?
జవాబు:
అద్దేపల్లి రామమోహన్ రావు.

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 =6)

1. ఆంగ్లేయుల జాతీయ క్రీడ ఏది ?
జవాబు:
క్రికెట్.

2. మాఘకవి రచించిన గ్రంథము పేరేమిటి ?
జవాబు:
శిశుపాల వధ.

3. భరద్వాజ రచించిన సినీరంగ సంబంధ నవల ఏది ?
జవాబు:
పాకుడురాళ్ళు.

4. హోంరూల్ ఉద్యమాన్ని నడిపిందెవరు ?
జవాబు:
అనిబిసెంట్, తిలక్

5. ఊరక కృతుల్ రచయింపుటయన్న శక్యమె
జవాబు:
పెద్దన కవి మాట.

6. దానమున కెవడు పాత్రుడు.
జవాబు:
పేదవాడు.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ఇది ఎవరి మాట ?
1. మీరు మంచి విద్యార్థులు – దీనిలో సర్వనామం ఏది ?
జవాబు:
మీరు అనే పదం సర్వనామం.

2. అవ్యయానికి ఉదాహరణను వ్రాయండి.
జవాబు:
ఓహో, ఆహా.

3. తిరుపతి గొప్ప యాత్రాస్థలము – దీనిలో విశేషణాన్ని గుర్తించండి.
జవాబు:
గొప్ప అను పదం దీనిలోని విశేషణం.

4. తెలుగులో భాషాభాగాలు ఎన్ని ? అవి ఏవి ?
జవాబు:
భాషాభాగాలు తెలుగులో 5. నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము.

5. క్రియ అంటే ఏమిటి ?
జవాబు:
పనిని చూపించే పదాన్ని క్రియ అంటాము.

XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. వాక్యానికి ఉండే లక్షణాలేమిటి ?
జవాబు:
యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి.

2. సామాన్య వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గాంధీజీ మనకు స్వాతంత్య్రం తెచ్చాడు.

3. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు ఇది ఏ రకమైన వాక్యం ?
జవాబు:
సంక్లిష్ట వాక్యం.

4. రెండు సమ ప్రాధాన్యత గల వాక్యాలు కలసి ఒక వాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం ?
జవాబు:
సంయుక్త వాక్యం.

5. వాక్యాలు ఎన్ని రకాలు ? అవి ఏవి ?
జవాబు:
వాక్యాలు 3 రకాలు. అవి : సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం.

XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. ఉత్పలమాల
జవాబు:
ఉత్పలమాల: ఉత్పలమాల అంటే కలువపూల మాల అని అర్థం. ఈ పద్యం నడక అంత సుకుమారంగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు.
లక్షణాలు : ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు పాదాల కంటె ఎక్కువ పాదాలు రాస్తే దానిని ‘ఉత్పలమాలిక’ అంటారు). ప్రతి పాదంలోను వరుసగా ‘భ, ర, . న, భ, భ, ర, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలోను మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, 10వ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. అంటే నాలుగు పాదాల ప్రాసాక్షరాలలో ఒకే హల్లు ఉంటుంది.
AP Inter 2nd Year Telugu Model Paper Set 4 with Solutions 1
యతి మైత్రి : 1 – 10 అక్షరాలైన ‘వి – వి’ లకు యతి పాటించబడింది.
ప్రాసాక్షరం : ‘ద్య’ అనే సంయుక్తాక్షరం ప్రాసగా ఉంది.

2. ఆటవెలది
జవాబు:
ఆటవెలది : ఆటవెలది ఉపజాతి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్ర గణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోను 1 -4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనియమం లేదు. ప్రాసయతిని పాటించవచ్చును.
AP Inter 2nd Year Telugu Model Paper Set 4 with Solutions 2
పై ఉదాహరణలో మొదటి పాదంలో మొదట 3 సూర్య గణాలూ, తరువాత రెండు ఇంద్ర గణాలూ వచ్చాయి. రెండో పాదంలో ఐదూ సూర్య గణాతలు వచ్చాయి. కాబట్టి ఇది ఆటవెలది పద్యం.
యతి మైత్రి మొదటి పాదంలో ‘ఉ’ అనే అచ్చుకు, నాలుగో గణం మొదటి అక్షరం ‘నొ” లో గల ‘ఒ’ అనే అచ్చుకు చెల్లింది. రెండో పాదంలో 1-4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లలేదు. కాబట్టి ప్రాసయతిని కవి పాటించాడు. 1వ గణం ప్రాసాక్షరమైన ‘డ’, నాలుగో గణం ప్రాసాక్షరమైన ‘డ’ లకు ప్రాసయతి సరిపోయింది. (చూడ – జాడ)

3. ద్విపద
జవాబు:
ద్విపద: ద్విపద ఛందస్సు దేశి కవిత్వానికి చెందినది. ‘ద్వి-పద’ అంటే రెండు పాదాలు అని అర్థం. అంటే దీనిలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి. ప్రతి పాదంలో మూడు ఇంద్ర గణాలు, తరువాత ఒక సూర్యగణం ఉంటాయి. 1-3 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీద్విపద అని అంటారు. శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను ‘మంజరీ ద్విపద’లో రాశాడు.
AP Inter 2nd Year Telugu Model Paper Set 4 with Solutions 3
యతి మైత్రి : మొదటి పాదంలో ‘తు .దు’ లకు పాటించబడింది.
రెండో పాదంలో ‘వ – వా’ లకు పాటించబడింది.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1. ఇంద్ర గణాలు ఏవి ?
జవాబు:
నల, నగ, సల, భ, ర, త.

2. శార్దూలంలో గణాలేవి ?
జవాబు:
మ, స, జ, స, త, త, గ.

3. మత్తేభంలో యతిస్థాన మెంత ?
జవాబు:
14వ అక్షరము.

4. ముత్యాలసరంలో నాల్గవ పాదంలో ఎన్ని మాత్రలుంటాయి ?
జవాబు:
7 నుండి 14 మాత్రల వరకు ఉంటాయి.

5. ప్రాస అంటే ఏమిటి ?
జవాబు:
పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాసాక్షర మంటారు.

XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. అంత్యానుప్రాస
జవాబు:
అంత్యానుప్రాస: అంత్య’ అంటే చివర అని అర్థం. పాదం చివరలో లేదా పదం చివరలో అనుప్రాస ఉన్నట్లైతే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు.
1. ఆ లలన గట్టె ఱోలన్
లీలన్, నవనీత చౌర్య లీలున్, ప్రియ వా
గ్జాలున్ బరి విస్మిత గో
పాలున్, ముక్తా లలామ ఫాలున్, బాలున్
పై పద్యంలో అంత్యానుప్రాసను గమనించవచ్చు.

2. పొలాల నన్నీ
హలాల దున్నీ
ఇలా తలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ …
ఈ పాఠ్య పుస్తకంలోని శ్రీనాథుడు రచించిన ద్విపదలో అంత్యానుప్రాస చోటు చేసుకుంది గమనించగలరు.
అరుగు భూపతి పుత్ర
అంచిత గాత్ర
వీరకామ నరేంద్ర
విభవ దేవేంద్ర

2. ఉత్ప్రేక్ష
జవాబు:
ఉత్ప్రేక్ష: ఊహ ప్రధానంగా గలది ఉత్ప్రేక్ష. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లైతే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది.
ఉదాహరణ :
1. ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని నుండి వెలువడిన ధూమమని తలచెదను. ఇక్కడ చీకటి నలుపు. దృష్టి నిరోధకం. పొగ నలుపు. దృష్టి నిరోధకం. కాబట్టి ఈ సమాన ధర్మాలవల్ల కవి చీకటిని పొగలాగా ఊహించుకొన్నాడు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.
2. ఆ ఏనుగు నడగొండయో అన్నట్లుంది.
3. ఆమె ముఖము పద్మమేమో – అను వాటిల్లో కూడా ఉత్ప్రేక్షాలంకారం ఉంది.

3. అర్థాంతరన్యాసము
జవాబు:
అర్థాంతరన్యాసము: సామాన్యాన్ని విశేషంతో గాని, విశేషాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్పినట్లయితే అది అర్థాంతరన్యాసాలంకారం.
ఉదాహరణకు
‘హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదు’ ఈ వాక్యాన్ని పరిశీలించండి.
హనుమంతుడు సహజంగా వానరం. అతడు సముద్రాన్ని లంఘించడం ఆశ్చర్యం గొలిపే విషయం. కాబట్టి ఇది విశేషం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు ఈ వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇది సామాన్యం.
పైన తెలిపిన విశేషాన్ని సామాన్య వాక్యం చేత సమర్థిస్తే అది అర్థాంతర న్యాసాలంకారం.
మరో ఉదాహరణ చూద్దాం.
ఈ పాఠ్య పుస్తకంలోని నన్నయ పాఠ్యభాగంలో క్రింది పద్యాన్ని గమనించండి.
ఏల యెఱుకలేని యితరుల యట్ల నీ
వెఱుగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి
యేనని దీని నెఱుఁగరిన్ దొరులని
తప్పఁ బలుకనగునె ధార్మికులకు
శకుంతల దుష్యంతునితో అంటున్నది – ‘అన్నీ బాగా తెలిసి కూడా నేనెవరో తెలియదని ఇతరుల వలె ఎందుకు మాట్లాడుతావు ? ఇతరులకు తెలియదనే మిషతో ధర్మాత్ములైనవారు అసత్యం పలుకవచ్చునా ?’ ఇక్కడ గొప్పవాడైన దుష్యంతుడు శకుంతల ఎవరో తెలియదని అబద్ధమాడడం విశేషం. ధర్మాత్ములు అబద్ధాలు ఆడకూడదు అనేది సాధారణ లోక ధర్మం. ఇది సామాన్యం.

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. సంసార సాగరం దీనిలో అలంకారం ఏది ?
జవాబు:
రూపకాలంకారం.

2. శబ్దాలంకారమంటే ?
జవాబు:
శబ్దం ప్రధానంగా గల అలంకారం శబ్దాలంకారం.

3. చుక్కలు తలపూవులుగా పద్యంలో ఉన్న అలంకారం.
జవాబు:
అతిశయోక్తి.

4. విష్ణు రోజిష్ణు సహిష్ణు కృష్ణు – లోని అలంకారం ఏది ?
జవాబు:
వృత్త్యనుప్రాసాలంకారం.

5. వలె, పోలె, అట్లు, అలాగే పదాలనేమంటారు ?
జవాబు:
ఉపమావాచకములంటారు.

6. ఉపమేయమంటే ఏమిటి ?
జవాబు:
వర్ణింపబడే వస్తువు ఉపమేయం.

AP Inter 2nd Year Telugu Model Paper Set 3 with Solutions

XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగడానికి మూలకారకుడు డా॥ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్. భారతరత్నగా, భారత క్షిపణి పితామహుడుగా, దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన అబ్దుల్ కలామ్. విద్యార్థి దశలో సగటు విద్యార్థి. మంచి అలవాట్లతో, కచ్చితమైన క్రమశిక్షణను పాటించడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు. తల్లిదండ్రులనే కాక, స్త్రీలను, గురువులను ఇతర పెద్దలను గౌరవించాడు. తాను ముస్లిం మతానికి చెందిన వాడైనా హిందూ, క్రైస్తవ, సిక్కు వంటి సర్వమతాలను ఆదరించిన లౌకికవాది. పుస్తకాలను అమితంగా ఇష్టపడే అబ్దుల్ కలామ్ ఎన్నో గ్రంథాలను రచించాడు. ప్రతి విద్యార్థి కలలు కని, వాటిని సాకారం చేసుకోవాలని; చిన్న చిన్న లక్ష్యాలు నేరమని విద్యార్థులకు సందేశమిచ్చాడు. వీరి జన్మదినమైన అక్టోబరు 15వ తేదీని ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
జవాబు:
డా|| ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత క్షిపణి పితామహుడు. మనదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగటానికి ఆయనే కారకుడు. రాష్ట్రపతిగా దేశ విలువలను కాపాడారు. మంచి అలవాట్లతో క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం తెలిసివారు. గొప్ప లౌకికవాది. ఆయనకు పుస్తకమంటే ఇష్టం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు కలాం. వీరి జన్మదినం అక్టోబరు 15, ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

Leave a Comment