AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత

Students get through AP Inter 2nd Year Botany Important Questions 9th Lesson అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 9th Lesson అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
F1 సంతతికి చెందిన మొక్కను సమయగ్మజ అంతర్గత లక్షణాలు గలిగిన మొక్కతో సంకరణము చేయడాన్ని ఏమంటారు? దీని ఉపయోగం ఏమిటి? [TS MAR-17, 15]
జవాబు:

  1. అటువంటి సంకకరణాన్ని ‘పరీక్షాసంకరణం’ అంటారు.
  2. మొక్క యొక్క ‘జన్యురూపాన్ని’ కనుగొనుటకు ఈ సంకరణాన్ని చేస్తారు.

ప్రశ్న 2.
మెండల్ ఎన్నుకొన్న లక్షణాలు ఒకే క్రోమోసోమ్పై ఉన్నచో, మెండల్ అనువంశికత సూత్రాలు భిన్నంగా ఉండునని మీరు ఊహించగలరా?
జవాబు:
అవును. ఎందుకంటే జన్యులక్షణాలు ఒకే క్రోమోసోమ్ పై ఉండి ఉంటే అవి స్వతంత్ర జన్యువ్యూహన చెందవు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత

ప్రశ్న 3.
క్రోమోసోమ్ అనువంశికత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? [TS MAR-20,22][AP MAR-17,19,22]
జవాబు:
సట్టన్ మరియు బొవెరి.

ప్రశ్న 4.
నిజప్రజననం (True breeding)ను నిర్వచించండి. దాని ప్రాముఖ్యతను తెలపండి. [TS MAY-22]
జవాబు:

  1. నిజప్రజననం: నిరంతరంగా జరిగే స్వపరాగ సంపర్కాన్ని ‘నిజప్రజననం’ అంటారు.
  2. ప్రాముఖ్యత: ఇది స్థిరంగా లక్షణాల అనువంశికతను సంక్రమింపజేయటం మరియు అనేక తరాల వరకు బహిర్గతం చేయడం చేస్తుంది.

ప్రశ్న 5.
జన్యురూపం మరియు దృశ్యరూపం అనే పదాలను వివరించండి. (TS MAR-18,22] [AP,TS MAY-17][AP MAR-16]
జవాబు:

  1. జన్యురూపం: జీవి యొక్క జన్యు లక్షణాలను తెలియజేయటాన్ని ‘జన్యురూపం’ అంటారు . [APMAY-19]
  2. దృశ్యరూపం: జీవి యొక్క భౌతిక లేదా బాహ్యస్వరూపం గురించి తెలియజేయటాన్ని ‘దృశ్యరూపం’ అంటారు.

ప్రశ్న 6.
బిందు ఉత్పరివర్తనాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణనివ్వండి. [TS MAR-19]
జవాబు:

  1. ఉత్పరివర్తనాలు అనేవి DNAలోని ఒక జత క్షారాల మార్పుల వలన కలుగుతాయి.
    వీటిని ‘బిందు ఉత్పరివర్తనాలు’ అంటారు.
  2. ఉదా: సికెల్ సెల్ ఎనిమీయా

ప్రశ్న 7.
ఒక వ్యక్తి కొన్ని లక్షణాల లేదా కారకాల అనువంశికతను అధ్యయనం చేయడానికి సంకర ప్రయోగాలను చేయతల పెట్టినాడు. అతడు ఈ ప్రయోగాలకు ఏ లక్షణాలు ఉన్న జీవులను పరిగణనలోకి తీసుకోవాలి?
జవాబు:

  1. జీవి ఎన్నుకొన్న లక్షణాలు కలిగి, జన్యుపరంగా విభిన్నంగా ఉండాలి.
  2. జీవిజీవిత కాలం చిన్నదిగా ఉండాలి.
  3. జీవి ద్విలింగయుతమై ఉండాలి.
  4. జీవి స్వపరాగ సంపర్కం మరియు పరపరాగ సంపర్కం జరిపేదిగా ఉండాలి.
  5. జీవి సంతతులు ఎక్కువ సంఖ్యలో ఏర్పడాలి.
  6. ఇవి స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండాలి.
  7. వీటిని పెంచడం మరియు సంకరణం చేయడం చాలా సులువుగా ఉండాలి.

ప్రశ్న 8.
F1 తరం మొక్కల ఉత్పత్తికై సమయుగ్మజ పొడవు మొక్కను మరియు సమసమయుగ్మజ పొట్టి మొక్కను మెండల్ సంకరణం చేశాడు. కాని F2 తరం మొక్కల ఉత్పత్తికై కేవలం F1 తరం మొక్కలలో స్వపరాగ సంపర్కం నిర్వహించాడు. ఎందుకు?
జవాబు:

  1. పరపరాగసంపర్కం నిరంతరంగా జరగడం వలన ‘విషమయుగ్మజ స్థితి’ ఏర్పడుతుంది. దీని వలన దిగుబడి తగ్గుతుంది.
  2. F తరం సంకర మొక్కలు ‘సమయుగ్మజస్థితిని కోల్పోకుండా ఉండటం కొరకు’ వాటిని స్వపరాగ సంపర్కం నిర్వహించాడు.

ప్రశ్న 9.
ఒక జన్యువు యుగ్మవికల్పాలు ఏవిధంగా పరస్పర వైరుధ్యతను చూపుతాయి? దీని ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:

  1. ఒక జత యుగ్మవికల్పాలు సమజాతీయ క్రోమోజోములపై ఒక లక్షణాన్ని ప్రాతినిధ్యం వహిస్తాయి.
  2. విషమయుగ్మజ జన్యువులు ఒకదానితో ఒకటి విభేదాన్ని చూపుతాయి. వీటిలో ఒకటి బహిర్గతం మరొకటి అంతర్గతం.
  3. బహిర్గత జన్యువు తరువాత తరం నందు బహిర్గతమవుతుంది. అంతర్గత జన్యువు తిరిగి అణచిబడి ఉంటుంది.
  4. DNA సంకేతాలు విభిన్న లక్షణాలను ఒకతరం నుండి వేరొక తరాన్ని అందిస్తాయి.

ప్రశ్న 10.
ఒక జన్యుశాస్త్రవేత్త ఎరుపు పుష్పాలు గల మొక్కను తెలుపు పుష్పాలు గల మొక్కతో సంకరణం చేసినపుడు ఎరుపు పుష్పాలు గల మొక్కలే F1 తరంలో ఏర్పడ్డాయి. ఈ తరం మొక్కలను స్వపరాగసంపర్కము చేసినపుడు ఎరుపు మరియు తెలుపు రంగు పుష్పాలు 3:1 నిష్పత్తిలో ఏర్పడ్డాయి. దీనిని జనకుల దృశ్యరూపంగా RR, rr సంకేతాలను ఉపయోగించి వివరించండి.
జవాబు:

  1. ఒక జత విరుద్ధ లక్షణాలకు సంకేతాలుగా పని చేసే జన్యువులను ‘యుగ్మ వికల్పాలు’ అంటారు.
  2. సమయుగ్మజ స్థితిలో ఇవి సమస్థితిలో ఉంటాయి.
  3. బహిర్గత లక్షణానికి పెద్ద అక్షరం(Capital letter) మరియు అంతర్గత లక్షణానికి చిన్న (small letter)అక్షరంగా ఉపయోగించాలి.
  4. RR అక్షరాలు జన్యుపరంగా ఎరుపు రంగు పుష్పాలను సూచిస్తాయి.
  5. rr అక్షరాలు జన్యుపరంగా తెలుపు రంగు పుష్పాలను సూచిస్తాయి.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత 1
    F1 తరంను స్వపరాగ సంపర్కం జరపగా
    F1 సంకరణం Rr x Rr

AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత

ప్రశ్న 11.
బటానీ మొక్కలోని ముడతలు పడిన విత్తనాలు గల దృశ్యరూపం యొక్క జన్యు స్వభావం ఏమిటి? [APMAR-15,20]
జవాబు:
దృశ్యరూపంగా ముడతలు కల బటానీ గింజ యొక్క జన్యురకం ‘Tr’.

ప్రశ్న 12.
ఈ క్రింది సంకరణాల ద్వారా ఏర్పడే సంతతుల దృశ్యరూప నిష్పత్తులను తెలుపుతూ ప్రతి సంకరణం పేరును సూచించండి.
a) Aa x aa
b) AA × aa
c) Aa × Aa
d) Aa × AA [ TS M-16]
జవాబు:
a) 1:1
b) 2:0
c) 3:1
d) 1:0

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మెండల్ ఏక సంకర సంకరణ ప్రయోగంలోని F2 సంతతిలో దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులు ఒకే రకంగా ఉన్నచో, ఈ ప్రయోగం ద్వారా యుగ్మ వికల్పాల స్వభావమును ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు. మీ సమాధానాన్ని హేతుబద్ధంగా నిరూపించండి.
జవాబు:
ఈ ప్రయోగం యుగ్మవికల్పాల అసంపూర్ణ బహిర్గతత్వాన్ని తెలియజేస్తుంది. దీని వలన మధ్యస్థ ఫలాలు ఏర్పడినాయి.
RR (ఎరుపు) ను rr (తెలుపు) తో సంకరణం జరిపినపుడు
AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత 2
ఈ సంకరణంలో రెండు రంగుల యుగ్మ వికల్పాల అసంపూర్ణ బహిర్గతత్వం వలన మధ్యస్థరంగు గులాబి ఏర్పడినది.
F2 తరం – F1 తరాల స్వపరాగ సంపర్కం
AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత 3
ఈ సంకరణలో జన్యురూప మరియు దృశ్యరూప నిష్పత్తులు రెండు సమానం.

ప్రశ్న 2.
సంకరణ ప్రయోగాల కొరకు ‘మెండల్’ బటానీ మొక్కను ఎన్నుకోవడంలో గల ప్రయోజనాలు ఏమిటి? [TS MAY-22][TS M-19,20][AP MAR-18][AP, TS MAR-17]
జవాబు:
మెండల్ తన సంకరణ ప్రయోగాల కోసం తోటబటాని మొక్కను ఎన్నుకోవడంలో గల ప్రాధాన్యతలు:

  1. బటానీ మొక్క స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది.
  2. దీనిని పెంచడం మరియు సంకరణ చేయడం సులభం.
  3. దీనిలో పురుష, స్త్రీ భాగాలు కలిగిన ద్విలింగ పుష్పాలు ఉంటాయి.
  4. దీనిలో స్వయం ఫలదీకరణ జరపడం సులభం.
  5. దీని జీవితకాలం చిన్నది మరియు ఎక్కువ సంఖ్యలో సంతతులను ఏర్పరుస్తుంది.
  6. దీనియందు క్రోమోసోమ్ల సంఖ్య తక్కువ.
  7. సాధారణ ప్రయోగశాల పరిస్థితులలోనూ ప్రయోగాలను నిర్వహించవచ్చును.

ప్రశ్న 3.
ఈ క్రింది వాటి మధ్య గల భేదాలను తెలపండి: [AP MAR-20].
a) బహిర్గతత్వం మరియు అంతర్గతత్వం
b) సమయుగ్మజం మరియు విషమయుగ్మజం
c) ఏకసంకరణ మరియు ద్విసంకరణం
జవాబు:
a) F1 తరం నందు వ్యక్తమయ్యే లక్షణాలను ‘బహిర్గతత్వ లక్షణాలు’ అని మరియు వ్యక్తమవకుండా ఉన్న లక్షణాలను ‘అంతర్గత లక్షణాలు’ అని అంటారు.

b) ఒక జీవి ఒకే లక్షణానికి రెండు సమాన జన్యువులను కలిగి ఉండటాన్ని సమయుగ్మజం అంటారు.
ఒక జీవి ఒకే లక్షణానికి రెండు వేరువేరు జన్యువులను కలిగి ఉండటాన్ని విషమయుగ్మజం అంటారు.

ఏక సంకర సంకరణము : ఒకే లక్షణములో భేదం చూపే రెండు జీవుల మధ్య జరిగే సంకరణాన్ని ‘ఏకసంకర సంకరణము’ అంటారు.
ద్విసంకరణం: రెండు లక్షణాలలో భేదం కలిగి ఉన్న జనక మొక్కల మధ్య జరిగిన సంకరణం.

ప్రశ్న 4.
బహిర్గతత్వ సిద్ధాంతాన్ని ఏకసంకర సంకరణము ద్వారా వివరించండి. [AP MAY-17,19][AP MAR-15,19]
జవాబు:
ఏక సంకర సంకరణము: ఒకే లక్షణములో భేదం చూపే రెండు జీవుల మధ్య జరిగే సంకరణాన్ని ‘ఏకసంకర సంకరణము’ అంటారు. మెండల్ సంకరణ ప్రయోగాలలో పొడవు మరియు పొట్టి బటానీ మొక్కల మధ్య సంకరణ ద్వారా ఒక జన్యువు యొక్క అనువంశికతను అధ్యయనం చేసాడు. ఏకసంకర సంకరణము ద్వారా బహిర్గతత్వ సిద్ధాంతాన్ని గమనించారు.

బహిర్గతత్వ సిద్ధాంతము :

  1. లక్షణాలను నియంత్రించే విలక్షణమైన ప్రమాణాలను కారకాలు అంటారు.
  2. కారకాలు జతలుగా ఉంటాయి.
  3. ఒక లక్షణానికి సంబంధించిన జంతు వ్యతిరేక కారకాలలో ఒక కారకం (బహిర్గతంగా) మరొక దానిపై (అంతర్గతంగా) బహిర్గతత్వాన్ని ప్రదర్శిస్తుంది.
  4. బహిర్గత్వ సిద్ధాంతాన్ని ఉపయోగించే ఏకసంకరణలోని F1 తరం మరియు F2 తరం యొక్క ఒకే ఒక జనకతరం లక్షణాలబహిర్గతతాన్ని వివరించవచ్చు. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి F2 తరంలో ఏర్పడిన 3:1 నిష్పత్తిని వివరించవచ్చు.

ప్రశ్న 5.
పరీక్షా సంకరణమును నిర్వచించి పట్టిక ద్వారా తెలపండి [TS MAY-22][AP MAY-22][TS MAR-16]
జవాబు:

  1. F1 తరాన్ని, అంతర్గత లక్షణాలు ఉన్న జనక తరంతో సంకరణ జరిపితే దానిని పరీక్షా సంకరణం అంటారు.
  2. ఒక జనకం సమయుగ్మజమా లేదా విషమయుగ్మజమా అనేది తెలుసుకొనుటకు ఈ సంకరణాన్ని వినియోగిస్తారు.
  3. ఏక సంకర సంకరణము యొక్క దృశ్యరూప నిష్పత్తి 1:1.
  4. ద్విసంకర సంకరణము యొక్క దృశ్యరూప నిష్పత్తి 1:1:1:1.

ప్రశ్న 6.
ఒక లోకస్ వద్ద సమయుగ్మజత చూపు ఆడ మరియు విషమయుగ్మజత చూపు మగ జీవుల మధ్యసంకరణం చేసినచో మొదటి సంతతి తరంలో వచ్చే దృశ్యరూప లక్షణాలను పున్నేట్ చతురస్రం ద్వారా వివరించండి.
జవాబు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత 4
సమయుగ్మజ పొడవు : విషమయుగ్మజ పొడవు= 1:1

  1. జన్యురూప నిష్పత్తి 1:1
  2. అన్ని మొక్కలు దృశ్యరూపంగా బహిర్గత్వంను చూపుతున్నాయి.
  3. అంతర్గతజీవులు ఏర్పడలేదు.
  4. దీనినే ‘పరీక్షా సంకరణం’ అంటారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత

ప్రశ్న 7.
పసుపు విత్తనాలు కలిగిన పొడవైన మొక్కను (TtYy) ఆకుపచ్చ విత్తనాలు కలిగిన పొడవైన మొక్కతో (Ttyy) సంకరణము చేసినచో సంతతిలో కన్పించు కింది దృశ్యరూప నిష్పత్తిలను తెలపండి.
(a) పొడవు మరియు ఆకుపచ్చ
(b) పొట్టి మరియు ఆకుపచ్చ
జవాబు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత 5
దృశ్యరూప నిష్పత్తులు:
(i) పొడవు మరియు ఆకుపచ్చ =3/8
(ii) పొట్టి మరియు ఆకుపచ్చ =1/8

ప్రశ్న 8.
ఈ క్రింది పదాలను ఉదాహరణల ద్వారా వివరించండి. (ఎ) సహబహిర్గతత్వం (బి) అసంపూర్ణ బహిర్గతత్వం [TS MAY-22]
జవాబు:
ఎ) సహబహిర్గతత్వం: ఈ సిద్ధాంతం ప్రకారం రెండు జన్యువులు సమానంగా బహిర్గతత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. రెండు జన్యువుల యొక్క లక్షణాలు తరువాత తరంలో బాగా బహిర్గతమవుతాయి. కావున F, తరంలో, జనకతరం మొక్కలు రెండు పునరుత్పత్తిలను చూపిస్తాయి.
ఉదా : మానవులలో ABO రకం రక్తం గ్రూప్ ను నిర్ధారించే వివిధ రకాల ఎర్రరక్తకణాలను కలిగి ఉంటుంది.

బి) అసంపూర్ణ బహిర్గతత్వం: ఈ సిద్ధాంతం ప్రకారం జన్యువులు అటుపూర్తి బహిర్గతత్వంగా గాని (లేదా) పూర్తి అంతర్గత్వంగా గాని ఉండవు.
ఉదా: డాగ్ ఫ్లవర్ (స్నాప్ డ్రాగన్ (లేదా) ఆంటిరైనమతి) మొక్కలోని పుష్పం యొక్క రంగు అనువంశికత అసంపూర్ణ బహిర్గతత్వాన్ని తెలియచేస్తుంది.

ప్రశ్న 9.
క్రోమోసోమ్ మరియు జన్యు ఉత్పరివర్తనాలను క్లుప్తంగా వివరించండి. [TS MAY-22]
జవాబు:
1) క్రోమోసోమ్ల ఉత్పరివర్తనాలు: క్రోమోసోమ్ల యొక్క సంఖ్య (లేదా) నిర్మాణంలో కలిగే మార్పులను క్రోమోసోమ్ల ఉత్పరివర్తనాలు అంటారు.

  • DNA లో కొంత భాగంను కోల్పోవడం (లేదా) అదనంగా చేర్చడం వలన క్రోమోసోమ్లలో మార్పులు ఏర్పడతాయి.
  • క్రోమోసోమ్లలోని మార్పులు ఫలితంగా అసాధారణాలు (లేదా) విపథనాలు ఏర్పడతాయి.
  • ఉదా: ఇది సాధారణంగా క్యాన్సర్ కణాల్లో కనిపిస్తుంది.

2) జన్యు ఉత్పరివర్తనాలు:

  • DNA లోని ఒక జతక్షారాల మార్పుల వలన ఏర్పడే ఉత్పరివర్తనాలను జన్యుఉత్పరి వర్తనాలు అంటారు.
  • దీనినే బిందు ఉత్పరివర్తనాలు అని కూడా అంటారు.
  • ఉదా: మానవులలో సికెల్సెల్ అనేమియా

ప్రశ్న 10.
జన్యువులు క్రోమోసోమ్లపై ఉండునను విషయాన్ని ఎలా తెలపగలం?
జవాబు:
1) మోర్గాన్ పసుపు వర్ణదేహం, తెలుపు కళ్ళుగల స్త్రీ ఈగలను, గోధుమ వర్ణదేహం, ఎరుపు కళ్లు గల ఈగలతో సంకరణం చేసాడు.

2) రెండు జన్యువులు స్వతంత్రంగా పృథక్కరణ చెందకపోవడాన్ని, F, తరంలో 9:3:3:1 కంటే భిన్నమైన నిష్పత్తిని గమనించాడు.

3) ద్విసంకర సంకరణలో రెండు జన్యువులు ఒకే క్రోమోసోమ్ పైన ఉన్నప్పుడు, జనకాలలోని జన్యువుల కలయిక అనుపాతం జనకేతరులు జన్యువుల కంటే అధికంగా ఉంటుంది అని గుర్తించాడు.

4) మోర్గాన్ ప్రకారం దీనికి కారణం జన్యువుల భౌతికంగా దగ్గరగా ఉండడం లేదా రెండు జన్యువుల సహలగ్నతను ప్రదర్శించడం. దీనినే సహలగ్నత అంటారు.

5) జనకేతరుల తరం యొక్క జన్యువుల కలయికను ‘పునఃస్సంయోజనం’ అంటారు.

6) మోర్గాన్, జన్యువులు సమూహంగా ఒకే క్రోమోసోమ్ పై ఉన్నప్పుడు కొన్ని జన్యువులు చాలా దగ్గరగా సహలగ్నం చెంది ఉండటం మరియు కొన్ని దూరంగా వదులుగా సహలగ్నం చెంది ఉండటం గమనించాడు.

7) ఆల్ఫ్రెడ్ స్టర్టెవాంట్ ఒకే క్రోమోసోమ్లోని జన్యువుల జతల మధ్య పునఃస్సంయోజన పౌనఃపున్యాన్ని ఉపయోగించి క్రోమోసోమ్లో జన్యువుల మధ్య దూరాన్ని, జన్యువుల స్థానాన్ని తెలుసుకొన్నాడు.

ప్రశ్న 11.
ఎరుపు పుష్పాలు ఉన్న మొక్కను తెలుపు పుష్పాలు ఉన్న మొక్కతో సంకరణం చేసినచో, F1 తరంలో గులాబి రంగు పుష్పాలు ఏర్పడ్డాయి. ఈ అనువంశికతను వివరించండి.
జవాబు:

  1. ఎరుపు పసుపు పుష్పాల స్పష్టమైన కలయిక వలన గులాబి పుష్పాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే అసంపూర్ణ బహిర్గతత్వము వలన మాధ్యమిక వ్యక్తీకరణ అనగా గులాబి వర్ణం ఏర్పడినది.
  2. బహిర్గత ఎరుపు వర్ణం, పసుపు వర్ణంపై పూర్తిగా బహిర్గత్వాన్ని ప్రదర్శించలేదు. దీని వలన వేరే వర్ణం గులాబి ఏర్పడినది.
  3. ఎరుపు యుగ్మ వికల్పాలు లేదా పసుపు యుగ్మ వికల్పాల యొక్క అసంపూర్ణ బహిర్గతత్వం వలన మాధ్యమిక వ్యక్తీకరణ జరిగింది.
  4. కావున రెండు వర్గాలు ఎరుపు మరియు పసుపుల మిశ్రమం వలన గులాబి వర్ణం ఏర్పడినది.

ప్రశ్న 12.
పృథక్కరణ సిద్ధాంతం మరియు స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాలను నిర్వచించండి.
జవాబు:
a) పృథక్కరణ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం “ఒక జన్యువు యొక్క రెండు యుగ్మ వికల్పాలు కలిసి విషమయుగ్మజ స్థితిలో ఉన్నపుడు కలిసిపోవు, కాని క్షయకరణం చెందినపుడు సంయోగ బీజాలు ఏర్పడేటపుడు పృధక్కరణ చెందుతాయి”.

b) స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలలో భిన్నంగా ఉన్న మొక్కల మధ్య సంకరణం జరిగినపుడు, ఒక జత లక్షణాలు మరొక జత లక్షణాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పృధక్కరణ చెందుతాయి.
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అనేది ద్విసంకరణ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ఇది మెండల్ ప్రతిపాదించిన రెండవ నియమం.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత

ప్రశ్న 13.
బటానీ మొక్కలో పొడవు లోణము, పొట్టి లక్షణముపై బహిర్గతత్వం చూపుతుంది. ఊదారంగు పుష్పాలు తెల్లని పుష్పాల పై బహిర్గతత్వం చూపుతాయి. ఒక పొడవు, ఊదారంగు పుష్పాలు గల మొక్కకు, ఒక పొట్టి, తెలుపు రంగు పుష్పాలు గల మొక్కకు మధ్య పరాగ సంపర్కము జరిపినచో కింది సంఖ్యలో వివిధ దృశ్యరూపాలు ఏర్పడినవి.
పొడవు, ఊదా రంగు = 138
పొడవు, తెలుపు= 132
పొట్టి, ఊదా రంగు = 136
పొట్టి, తెలుపు= 128
పై దృశ్యరూపాల ఆధారంగా వాటి జనకుల మరియు సంతతుల జన్యు రూపాలను తెలపండి.
జవాబు:
బటానీ మొక్కలో పొడవు మరియు ఊదారంగు లక్షణాలు, పొట్టి మరియు తెలుపు రంగు పై బహిర్గత లక్షణాన్ని ప్రదర్శిస్తాయి.
పొడవు మరియు ఊదారంగు పుష్పాల మొక్కలను పొట్టి మరియు తెలుపు పుష్పాల మొక్కలతో సంకరణం జరిపినపుడు
AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత 6
దృశ్యనిష్పత్తి 1:1:1:1
దీనినే ‘ద్విసంకరణ పృథక్కరణ నిష్పత్తి’ అంటారు.

ప్రశ్న 14.
జన్యు సంబంధం విషయాల పరంగా క్రోమోసోమ్లు, జన్యువులు ఏ విధంగా సారుప్యతను చూపుతాయి?
జవాబు:

  1. క్రోమోజోమ్లు, DNA మరియు హిస్టోన్ ప్రోటీన్లను కలిగిన క్రోమాటిన్తో నిర్మితమై ఉంటాయి.
  2. DNA ఒక పొడవైన పోచ, ఇవి అనేక న్యూక్లియోటైడ్ జాతులతో అనుసంధానమై ఉంటుంది.
  3. జన్యువులు DNA యొక్క నిర్మాణాలు, ఇవి ప్రోటీన్లను ఏర్పరచే సంకేతాలను కలిగి ఉంటాయి.
  4. జన్యుపరమైన అధ్యయనాల ఆధారంగా క్రోమోజోమ్లు మరియు జన్యువులు సారూప్యతను కలిగి ఉంటాయి.

ప్రశ్న 5.
అసంపూర్ణ బహిర్గతత్వం, సహబహిర్గతత్వాల మధ్య విభేదాలను ఉదాహరణల సహాయంతో రాయండి.
జవాబు:
అసంపూర్ణ బహిర్గతత్వం

  1. ఈ సిద్ధాంతం ప్రకారం జన్యువులు అటుపూర్తి బహిర్గతత్వంగా గాని (లేదా) పూర్తి అంతర్గత్వంగా గాని ఉండవు.
  2. ఉదా: డాగ్ ఫ్లవర్ (స్నాప్ డ్రాగన్ (లేదా) ఆంటిరైనమతి) మొక్కలోని పుష్పం యొక్క రంగు అనువంశికత అసంపూర్ణ బహిర్గతత్వాన్ని తెలియచేస్తుంది.

సహబహిర్గత

  1. ఈ సిద్ధాంతం ప్రకారం రెండు జన్యువులు సమానంగా బహిర్గతత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. రెండు జన్యువుల యొక్క లక్షణాలు తరువాత తరంలో బాగా బహిర్గతమవుతాయి. కావున F1 తరంలో, జనకతరం మొక్కలు రెండు పునరుత్పత్తిలను చూపిస్తాయి.
  2. ఉదా: మానవులలో ABO రకం రక్తం గ్రూప్ను నిర్ధారించే వివిధ రకాల ఎర్రరక్తకణాలను కలిగి ఉంటుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఒక మొక్క పొడవు లక్షనం, పొట్టి లక్షణంపై బహిర్గతత్వమును మరియు ఎరుపు రంగు పుష్పాలు, తెలుపు రంగు పుష్పాలపై బహిర్గతత్వంను చూపుతాయి. జనకుల స్థాయి నుండి F2 తరం వరకు ద్విసంకరణ ప్రయోగమును చేసి ప్రామాణిక ద్విసంకర నిష్పత్తిని తెలపండి? ఒకవేళ పైన తెలిపిన రెండు జన్యువులు పరస్పర చర్యలను చూపినచో విలువలలో మార్పులు వస్తాయని మీరు భావిస్తారా తెలపండి.
జవాబు:
జనక తరం:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత 7
F1 తరం TtRr- Tall Red
F2 తరం Tt Rr × TtRr
ఏర్పడే సంయోగబీజాలు TR, Tr, tR, tr
AP Inter 2nd Year Botany Important Questions Chapter 9 అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత 8
దృశ్యరూప ద్విసంకర నిష్పత్తి = 9:3:3:1
జన్యురూప నిష్పత్తి = 1:2:2:4:1:2:1:2:1
పైన తెలిపిన రెండు జన్యువులు పరస్పర చర్యలను చూపినచో వాటి విలువలలో మార్పులు ఏర్పడతాయి.

Leave a Comment