AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

Students get through AP Inter 2nd Year Botany Important Questions 6th Lesson మొక్క పెరుగుదల, అభివృద్ధి which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 6th Lesson మొక్క పెరుగుదల, అభివృద్ధి

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ప్లాస్టిసిటిని నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. ప్లాస్టిసిటీ : మొక్కలు వాతావరణానికి (లేదా) జీవిత దశలకు అనుక్రియగా భిన్న రకాల నిర్మాణాలను ఏర్పరచడానికి అవలంబించే వివిధ పద్ధతుల సామర్ధ్యం.
  2. ఉదా: పత్తి మరియు కొత్తిమీరలలో కనిపించే భిన్న పత్రోత్పత్తి.

ప్రశ్న 2.
మొక్కలలో జిబ్బరెల్లిన్లను గుర్తించడానికి ఆధారంగా ఏర్పడ్డ వ్యాధి ఏమిటి? ఈ వ్యాధిని కలగచేసే వ్యాధి జనక శిలీంధ్రం పేరు తెలపండి.
జవాబు:

  1. బకనే వ్యాధి. ఇది వరినారులో వచ్చేది.
  2. జిబ్బరెల్లా ప్యూజికోరై అనే శిలీంధ్రం వలన ఈ వ్యాధి కలుగుతుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

ప్రశ్న 3.
అగ్రాధిక్యత అంటే ఏమిటి? దాన్ని కలగజేసే పెరుగుదల హార్మోన్ పేరు తెలపండి.
జవాబు:

  1. అగ్రాధిక్యత: పార్శ్వ మొగ్గల పెరుగుదలను నిరోధించే కొన మొగ్గ పెరుగుదలను అగ్రాధిక్యత అంటారు.
  2. అగ్రాధిక్యతను కలుగజేసే హార్మోను ‘ఆక్సిను’.

ప్రశ్న 4.
బోల్డింగ్ అంటే ఏమిటి? బోల్టింగ్ను ఏ హార్మోన్ కలగచేస్తుంది? [TS MAY-22] [TS MAY-17]
జవాబు:

  1. బోల్టింగ్ :పుష్పోత్పత్తికి ముందు కణుపు మాధ్యమాలు పొడవు పెరిగే స్థితినే బోల్టింగ్ అంటారు.
  2. జిబ్బరెల్లిన్లు బోల్టింగ్ను కలుగజేస్తాయి.

ప్రశ్న 5.
శ్వాసక్రియ క్లైమాక్టిక్ నిర్వచించండి. దానికి సంబంధించిన PGR పేరు తెలపండి.
జవాబు:

  1. శ్వాసక్రియ క్లైమాక్టిక్ :ఫలాలు పక్వం చెందేటప్పుడు శ్వాసక్రియా రేటులో జరిగే పెంపునే శ్వాసక్రియ క్లైమాక్ఆక్
    అంటారు.
  2. ఇథలీన్ వలన ఇది జరుగుతుంది.

ప్రశ్న 6.
ఎథెఫాన్ అంటే ఏమిటి ? వ్యవసాయరంగ కృషిలో దాని పాత్రను రాయండి.
జవాబు:

  1. ఎథెఫాన్ అనేది, ఇథలీన్ కు విరివిగా వాడబడే మూలపదార్ధం.
  2. దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి, దిగుబడిని పెంచుతుంది.
  3. ఎథెఫాన్ టోమాటోలు మరియు ఆపిల్ ఫలాలు తొందరగా పక్వానికి రావడానికి మరియు పుష్పాలు, ఫలాలు రాలిపోయేటట్లు ప్రేరేపిస్తుంది.

ప్రశ్న 7.
PGR లలో దేన్ని ప్రతిబల హార్మోన్ అంటారు? ఎందుకు?
జవాబు:

  1. ABA (అబ్సిసిక్ ఆమ్లం) ను ‘ప్రతిబల హర్మోన్’ అంటారు.
  2. ఎందుకనగా ఇది బాహ్యచర్మంలోని పత్రరంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపించి, మొక్కలలో అనేక రకాల ప్రతిబలాలకు సహనశీలతను పెంచుతుంది.

ప్రశ్న 8.
వెర్నలైజేషన్ గురించి మీరు ఏమి తెలుసుకొన్నారు? దాని ప్రాముఖ్యతను రాయండి.
జవాబు:

  1. వెర్నలైజేషన్ అనేది ఒక ప్రక్రియ. ఇది మొక్కలలో శీతల అభిచర్య జరిపి అవి త్వరగా పుష్పించేలా చేస్తాయి.
  2. ప్రాముఖ్యత: పెరుగుదల కాలంలో అమూల్యమైన ప్రత్యుత్పత్తి అభివృద్ధిని నిరోధించి తద్వారా మొక్కలకు అవి పరిపక్వత చెందడానికి కావలసినంత సమయాన్ని లభించేటట్లు చేస్తుంది.

ప్రశ్న 9.
క్విసెన్స్, సుప్తావస్థను నిర్వచించండి. [AP MAR-15]
జవాబు:

  1. క్విసెన్స్: బాహ్య వాతావరణ పరిస్థితులు బాగా పొడిగా (లేదా) వేడిగా (లేదా) చల్లగా వుంటే విత్తన అంకురం అనేది ఆలస్యం అవుతుంది. దాని వలన మొలకెత్తుట విఫలమవుతుంది. ఈ పరిస్థితినే క్విసెన్స్ అంటారు.
  2. సుప్తావస్థ: విత్తనాలు అంకురించడానికి అనువుగా ఉన్న పరిస్థితులలో కూడా విత్తనాలు కొన్ని అంతరపరిస్ధితుల వలన అంకురించవు. ఈ పరిస్థితినే సుప్తావస్థ అంటారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వ్యవసాయం/ఉద్యానవన కృషిలో ఆక్సిన్ల అనువర్తనాలను గురించి రాయండి. [TS MAR-20,22][AP MAR-17,22]

  1. ఆక్సిన్లు ప్రభావవంతమైన పెరుగుదల హర్మోన్లు. ఇవి మొక్క యొక్క కాండం అగ్రభాగాలనుంచి ఉత్పత్తి అవుతాయి.
  2. కాండచ్ఛేదాల నుంచి వేర్లు ఏర్పడతాయి. దీనిని మొక్కల పెరుగుదల కోసం ఉద్యానవన కృషిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
  3. ఆక్సిన్లు టమోటా మొక్క నందు ఫలాల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
  4. ‘ఆక్సిన్లు’ ఫలాలు ప్రధమ దశలో రాలిపోకుండా నిరోధిస్తాయి.
  5. ‘ఆక్సిన్లు’ దారు విభేదనాలను నియంత్రించి, పెరుగుదలకు సహాయపడతాయి.
  6. 2,4–D, ఆక్సిన్లను పచ్చిక బయళ్ళ తయారీకి వాడతారు.
  7. ప్రకాండ కొనలను తొలగిస్తే దాని ఫలితంగా పార్శపు మొగ్గల పెరుగుదల జరుగుతుంది. ఈ పద్ధతిని తేయాకు పంటకు మరియు కంచెను ఏర్పరచడంలో విరివిగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 2.
మొక్కలలో జిబ్బరెల్లిన్ల శరీరధర్మ సంబంధ అనుక్రియలను రాయండి. [AP MAR-19][TS MAR-15]
జవాబు:

  1. జిబ్బరెల్లిన్లు పెరుగుదల హర్మోనులు. ఇవి ఫలాలు పక్వాన్ని, కాండం పెరుగుదల, పుష్పించటం మరియు ఆగిపోవటం, లింగ నిర్ధారణ, ఎన్ఎమ్ల ప్రేరణ, పత్రాలు మరియు ఫలాలు వార్ధక్యాన్ని ప్రేరేపిస్తాయి.
  2. జిబ్బరెల్లిన్లను GA1, GA2, GA3 మొదలైన పేర్లతో పిలుస్తారు.
  3. GA ద్వారా ‘కోనిఫెర్స్’లో పరిపక్వ దశను ప్రేరేపించుట వలన విత్తనాల ఉత్పత్తి త్వరగా జరుగుతుంది.
  4. GA ను సారాయి పరిశ్రమలో ‘మాల్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి’ ఉపయోగిస్తారు.
  5. ‘జిబ్బరెల్లిన్స్’ అక్షం యొక్క పొడవును పెంచుతాయి. కావున ద్రాక్ష ఫలాల కాడలు పెంచడానికి దీన్ని వాడతారు.
  6. ‘జిబ్బరెల్లిన్స్’ ఆపిల్ లాంటి ఫలాలు పొడవు పెరిగి, ఆకారం మెరుగుపర్చుకోవడానికి సహాయపడతాయి.
  7. ఇవి వార్ధక్యాన్ని ఆలస్యపరుస్తాయి. ఈ విధంగా ఫలాలు వృక్షం పైనే ఎక్కువ కాలం ఉండి, మార్కెట్ కాలం పొడిగించుకోవడానికి జిబ్బరెల్లిన్లు దోహదపడతాయి.
  8. చెరకు కాండాలపై జిబ్బరెల్లిన్ ను చల్లితే, కాండం పొడవు పెరిగి, పంట దిగుబడి ఎకరానికి 20 టన్నుల వరకు వస్తుంది.
  9. జిబ్బరెల్లిన్లు బీట్, కాబేజీల లో బోల్టింగ్ (కణుపు మాధ్యమాలు పెరగడం) ను ప్రేరేపిస్తాయి.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

ప్రశ్న 3.
మొక్కలలో సైటోకైనిన్ల శరీరధర్మ సంబంధ ప్రభావాలను ఏవైనా నాలుగింటిని రాయండి. [APMAR-18][APMAY-17] [TS M-19]
జవాబు:

  1. సైటోకైనిన్లు ఒక రకమైన పెరుగుదల హర్మోనులు. ఇవి మొక్క వేర్ల కణవిభజనను ప్రేరేపిస్తాయి.
  2. కొత్త పత్రాలు, పత్రాలలో హరితరేణువులు ఏర్పడటానికి ఇవి సహయపడతాయి.
  3. ఇవి పార్శ్వ ప్రకాండ పెరుగుదల మరియు అబ్బురపు ప్రకాండ తయారీకి తోడ్పడతాయి.
  4. పత్ర వార్ధక్యాన్ని ఆలస్యపరచే పోషకాల రవాణాను ప్రేరేపిస్తాయి.
  5. ఇవి అగ్రాధిక్యతను అధిగమించుటకు సహయపడి పార్శ్వ ప్రకాండ పెరుగుదలను ప్రేరేపించి, మొక్క పొదలా (లేదా) గుబురుగా పెరుగుటకు సహాయపడుతుంది.
  6. సహజ సైటోకైనిన్లు చురుకుగా ఉంటూ కణ విభజన జరిగే ప్రాంతాలలో సంశ్లేషణ చెందుతాయి.
    ఉదా: వేరుకొనలు, ప్రకాండం మొగ్గలు, లేతఫలాలు.

ప్రశ్న 4.
మొక్కలలో ఎథిలీన్ నియంత్రించే శరీరధర్మ సంబంధ ప్రక్రియలను తెలపండి? [TS MAY-17][AP MAR-15,20]
జవాబు:

  1. ఎథిలీన్ అనేది సరళమైన వాయువు రూపంలో ఉండే మొక్కల పెరుగుదలను నియంత్రించే హర్మోను.
  2. ద్విదళబీజ నారు మొక్కలలో కొక్కేం లాంటి అగ్రం తయారీలపై ఎథిలీన్ ప్రభావం ఉంటుంది.
  3. ఎథిలీన్ హర్మోన్ వార్ధక్యాన్ని మరియు పత్రాలు, పుష్పాలు రాలిపోవడాన్ని ప్రేరేపిస్తుంది.
  4. ఫలాల పక్వతలో ఎథిలీన్ అధిక ప్రభావాన్ని చూపిస్తుంది.
  5. ఎథిలీన్ హర్మోన్ శ్వాసక్రియ వేగం రేటును పెంచుతుంది. దీనినే ‘శ్వాసక్రియా క్లైమాక్టిక్’ అంటారు.
  6. ఎథిలీన్ హర్మోన్ విత్తనాలు మరియు మొగ్గల సుప్తావస్థను పోగొడుతుంది.
  7. ఎథిలీన్ హర్మోన్ వేరుశనగ విత్తనాలు మరియు బంగాళదుంపల్లో మొలకలు ఏర్పడటానికి ప్రేరేపిస్తుంది.
  8. ఎథిలీన్ నీటి మొక్కలలో పత్రవృంతం చురుకుగా పొడవు పెరిగేటట్లు మరియు కణుపు మాధ్యమం పెరిగేటట్లు ప్రేరేపిస్తుంది.
  9. ఎథిలీన్ వేరు పెరుగుదలను మరియు మూలకేశం తయారీలను కూడా ప్రేరేపిస్తుంది.
  10. ఎథిలీన్ అనాసలో పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది మరియు ఫలాలు అన్నీ ఒకే సారి పక్వానికి వచ్చేలా చేస్తుంది.
  11. ఎథిలీన్ మామిడిలో పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది.
  12. కావున ఎథిలీన్ వ్యవసాయరంగం నందు విరివిగా ఉపయోగించబడుతున్న PGR.

ప్రశ్న 5.
విత్తన సుప్తావస్థ మీద లఘుటీక రాయండి. [TS MAR-17]
జవాబు:

  1. విత్తన సుప్తావస్థ : అంకురించలేని పరిస్థితి (లేదా) విత్తన అంకురం ఆలస్యమవటాన్ని విత్తన సుప్తావస్థ అంటారు.
  2. ఇది బాహ్య (లేదా) అంతరకారకాల వలన జరగవచ్చును.
  3. నీటిని (లేదా) ఆక్సిజన్ను పీల్చుకోలేని గట్టిబీజకవచాలు వలన విత్తనాలు సుప్తావస్థలో ఉండవచ్చు.
  4. టమాటా లాంటి విత్తనాలు, లైకోపేన్ అనే రసాయనాన్ని కల్గిఉంటాయి. ఇది విత్తన అంకురణను నిరోధిస్తుంది.
  5. పాలీగోనమ్ విత్తనాలు కొన్ని వారాలు నుంచి నెలలు వరకు తక్కువ ఉష్ణోగ్రత మరియు తేమ పరిస్థితులకు బహిర్గతమయ్యే వరకు అంకురించలేవు.
  6. ఇటువంటి సుప్తావస్థ విత్తనాలను స్ట్రాటిఫికేషన్ (లేదా) ‘పూర్వశీతల అభిచర్య’ వంటి వాటి ద్వారా మెరుగుపరచవచ్చు.
  7. విత్తనాలను తడి ఇసుక మరియు పీట్లలో పొరలుగా పెట్టి, శీతాకాలంలో వదిలి వేయడాన్ని “స్ట్రాటిఫికేషన్” అంటారు.

ప్రశ్న 6.
మిమ్మల్ని అడిగితే, ఈ కింది వాటికోసం ఏ మొక్క పెరుగుదల నియంత్రకాలను ఉపయోగిస్తారు?
a) కొమ్మలో వేర్లని ప్రేరేపించడం
b) ఫలం తొందరగా పక్వానికి రావడానికి
c) పత్ర వార్ధక్యాన్ని ఆలస్య పరచడం
d) గ్రీవపు మొగ్గల్లో పెరుగుదలను ప్రేరేపించడం
e) రోజెట్టీ మొక్కలో బోల్టింగ్
f) పత్రాలలో పత్రరంధ్రాలు వెనువెంటనే మూసుకోవడానికి
g) అగ్రాధిక్యతను పోగొట్టడానికి
h) ద్విదళ బీజ కలుపు మొక్కలను చంపడానికి
జవాబు:
a) IBA, NAA వంటి ఆక్సిన్లు
b) ఎథిలీన్
c) సైటోకైనిన్
d) సైటోకైనిన్
e) జిబ్బరెల్లిన్లు
f) అబ్సిసిక్ ఆమ్లం
g) సైటోక్రెనిన్
h) 2,4 D(ఆక్సిన్)

ప్రశ్న 7.
క్లుప్తంగా వర్ణించండి.
a) సిగ్మాయిడ్ పెరుగుదల వక్రరేఖ
b) పరమ, సాపేక్ష పెరుగుదల రేటులు
జవాబు:
a) సిగ్మాయిడ్ పెరుగుదల వక్రరేఖ:సిగ్మాయిడ్ పెరగుదల వక్రరేఖ అనేది సహజ వాతావరణంలో పెరిగే అన్ని జీవుల ప్రధాన లక్షణం. కణాలు, కణజాలం మరియు మొక్కల యొక్క అన్ని భాగాలలో ఇది చాలా సంక్లిష్టం.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 1
ఘాతాంక పెరుగుదలను ఈ కింది సమీకరణం ద్వారా సూచిస్తారు.
W1 = W0 ert
W1 = చివరి పరిమాణం (బరువు, ఎత్తు, సంఖ్య మొ॥)
W0 = ప్రారంభ కాలంలో మొదటి పరిమాణం
r= పెరుగుదల రేటు
t = పెరుగుదల కాలం
e = సహజ సంవర్గాల ఆధారం
ఇక్కడ ‘r’ అనేది సాపేక్ష పెరుగుదల రేటు. కొత్త మొక్క ‘పదార్థాన్ని ఉత్పత్తి చేసే సామర్ధ్య కొలతకు’ సంకేతంగా దీనిని పేర్కొంటారు. ఈ సమీకరణం ద్వారా W అనే చివరి ఘనపరిమాణం, W0 అనే మొదటి పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అని తెలుస్తుంది.

b) (i) పరమ పెరుగుదల రేటు:ఒక ప్రమాణ కాలంలోని మొత్తం పెరుగుదలకు సంబంధించిన కొలతలు, పోలికలను ‘పరమ పెరుగుదల రేటు’ అంటారు. ఒక ప్రమాణ కాలంలో ఇవ్వబడ్డ వ్యవస్థలోని పెరుగుదలను సాధారణ ఆధారాల ద్వారా వ్యక్తీకరిస్తారు.
(ii) సాపేక్ష పెరుగుదల రేటు ఒక ప్రమాణం వద్ద, మొదటి పరిమితిలను ‘సాపేక్ష పెరుగుదల రేటు’ అంటారు.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 2

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
పెరుగుదల, విభేదనం, అభివృద్ధి, నిర్విభేదనం, పునర్విభేదనం, నిర్ధారిత పెరుగుదల, విభాజ్య కణజాలం, పెరుగుదల రేటులను నిర్వచించండి.
జవాబు:
పెరుగుదల: ఒక జీవి లేదా దాని భాగాలు లేదా ఒక విడి కణం పరిమాణంలో జరిగే తిరిగి పొందలేనటువంటి శాశ్వత పెంపును ‘పెరుగుదల’ అంటారు.

విభేదనం: వేరు,ప్రకాండ అగ్ర విభాజ్యకణజాలాలు, మరియు విభాజ్య కణావళిల కణకవచాలలోగాని, జీవపదార్థంలోగాని కొంచెంగాగాని లేదా ఎక్కువగా గాని జరిగే నిర్మాణాత్మక మార్పును ‘విభేదనం’ అంటారు.

అభివృద్ధి: విత్తనం అమర్చడం నుండి వార్థక్యం లేదా జీర్ణత వరకు జీవి జీవిత చక్రంలో జరిగే మార్పులనే ‘అభివృద్ధి’ అంటారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

నిర్విభేదనం: విభేదనం చెందిన సజీవ కణాలు కోల్పోయిన విభజన శక్తిని తిరిగి పొందటాన్ని ‘నిర్విభేదనం’ అంటారు.

పునర్విభేదనం: నిర్విభేదనం చెందిన కణజాలాలు తిరిగి విభజనశక్తిని కోల్పోయి విశిష్ట విధులను నిర్వర్తించడానికి వీలుగా పరిపక్వమవడాన్ని ‘పునర్విభేదనం’ అంటారు.

నిర్ధారిత పెరుగుదల: ఒక జీవి యొక్క అంగాలు లేదా కొంత భాగం పరిమాణం వరకు పెరిగి పెరుగుదలను నిలుపు చేయుటను ‘నిర్ధారిత పెరుగుదల’ అంటారు.

విభాజ్యకణజాలాలు: వేరు కొనలు మరియు కాండ అగ్రభాగాలలో, నిరంతరంగా ఉత్తేజంగా విభజన చెందే కణాలను ‘విభాజ్యకణజాలాలు’ అంటారు.

పెరుగుదల రేటు: ప్రమాణకాలంలో జరిగే పెరుగుదలను ‘పెరుగుదల రేటు’ అంటారు.

ప్రశ్న 2.
క్లుప్తంగా నిర్వచించండి
a) అంకగణిత పెరుగుదల
b)జ్యామితీయ పెరుగుదల
c) సిగ్మాయిడ్ పెరుగుదల వక్రరేఖ
d) పరమ, సాపేక్ష పెరుగుదల రేటులు
జవాబు:
a) అంకగణిత పెరుగుదల: అంకగణిత పెరుగదలలో కణసమవిభజన జరిగాక ఏర్పడ్డ కణాలలో ఒక కణం మాత్రం నిరంతరంగా విభజన చెందుతుంది, మిగిలిన కణాలు విభేదనం చెంది పరిపక్వమవుతాయి.
ఉదా: ఒక స్థిరమైన రేటు వద్ద ఒక వేరు దైర్ఘ్యవృద్ధిని తీసుకొని పొడవుకు, కాలానికి మధ్యగా రేఖను గీసినపుడు వక్రరేఖ ఏర్పడుతుంది. దీనిని ఈక్రింది విధంగా సూచించవచ్చు.
Lt= L0 + rt
Lt = t కాలం వద్ద పొడవు
L0 = 0 కాలం వద్ద పొడవు
r = పెరుగుదల రేటు/ ఒక ప్రమాణ కాలంలో జరిగే ధైర్ఘ్యవృద్ధి

AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 3
(a) అంకగణితం
(b) జ్యామితీయ పెరుగుదల
(c) పిండం అభివృద్ధి సమయంలో అంకగణిత, జ్యామితీయ పెరుగుదలను చూపే దశలు

b) జ్యామితీయ పెరుగుదల: కణవిభజన జరిగిన తరువాత ఏర్పడే రెండు పిల్లకణాలు విభజన శక్తిని నిరంతరాయంగా కలిగి ఉంటాయి.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 4

c) సిగ్మాయిడ్ పెరుగుదల వక్రరేఖ:జ్యామితీయ పెరుగుదలకు రేఖా చిత్రాన్ని గీసినపుడు ‘సంక్లిష్ట సిగ్మాయిడ్ వక్రరేఖ’ లేదా ‘S-ఆకార వక్రరేఖ’ ఏర్పడుతుంది. ఇది 3 దశలలో జరుగుతుంది.

  1. మంద దశ: కణాల సంఖ్య తక్కువగా ఉండటం వలన పెరుగుదల ప్రారంభంలో నెమ్మదిగా జరుగుతుంది.
  2. ఘాతాంక దశ లేదా సంవర్గదశ: ఈ దశలో పెరుగుదల ఎక్కువగాను, వేగంగాను జరుగుతుంది. కణవిభజన జరిగి ఏర్పడిన పిల్లకణాలు విభజన శక్తిని నిరంతరాయంగా
    కలిగి ఉంటాయి.
  3. పూర్తిగా ఆగిపోయే దశఃపోషకాల సరఫరా నియంత్రించ బడినపుడు క్రమేణా పెరుగుదల తగ్గిపోయి, పూర్తిగా ఆగిపోయే దశను చేరుతుంది.

d) సంపూర్ణ లేదా పరమ మరియు సాపేక్ష పెరుగుదల రేటు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 5

  1. పరమ లేదా సంపూర్ణ పెరుగుదల రేటు: ఒక ప్రమాణ కాలంలోని మొత్తం పెరుగుదలకు సంబంధించిన కొలతలు మరియు పోలికలను ‘పరమ లేదా సంపూర్ణ పెరుగుదల ‘ అంటారు.
  2. సాపేక్ష పెరుగుదల రేటు: ఒక ప్రమాణ కాలంలో వ్యవస్థలోని పెరుగుదలను సాధారణ సూత్రాల ద్వారా కనుగొనవచ్చు.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 6

ప్రశ్న 3.
మొక్కలోని ఐదు సహజ పెరుగుదల నియంత్రకాల జాబితాను తెలపండి. అందులో ఒకదాని ఆవిష్కరణ, వ్యవసాయ ఉద్యానవన కృషిలో వినియోగం, శరీరధర్మసంబంధ విధులను గురించి రాయండి.
జవాబు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 7

Leave a Comment