AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

Students get through AP Inter 2nd Year Botany Important Questions 13th Lesson ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 13th Lesson ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
కనిపించని ఆకలి (hidden hunger )అంటే ఏమిటి? [AP MAY-19]
జవాబు:
‘కనిపించని ఆకలి’ అనగా ప్రజలకు ప్రోటీన్లు, విటమిన్ల వంటి ‘సూక్ష్మమూలకాల ఆవశ్యకత’ ఉండుట. దీని అర్ధం ప్రజలకు సంపూర్ణంగా సరిపడా పోషకాహరం అందుబాటులో లేకపోవడం.

ప్రశ్న 2.
భారతదేశంలో అభివృద్ధి పరచిన పాక్షిక వామన (semi – dwarf) వరి రకాలను తెల్పండి. [AP MAR-20]
జవాబు:
‘జయా’ మరియు ‘రత్న’

AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

ప్రశ్న 3.
భారతదేశంలోకి ప్రవేశపెట్టిన అధిక దిగుబడి, వ్యాధినిరోధకత కలిగిన గోధుమ రకాలలోని రెండు ఉదాహరణలను ఇవ్వండి.
జవాబు:
సోనాలికా మరియు కళ్యాణ్ సోనా.

ప్రశ్న 4.
SCP ఉత్పత్తికి ఉపయోగించే శిలీంధ్రాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి. [AP MAR-18]
జవాబు:

  1. కాండిడా యూటిలిస్ (టోర్యులా ఈస్ట్)
  2. శాఖరోమైసిస్ సెరివిసియో (బేకర్స్ ఈస్ట్)

ప్రశ్న 5.
‘జీవపదార్థం కలయిక’ (Protoplat Fusion) నుంచి ఏర్పడే మొక్కలను శాకీయ సంకరాలు అని ఎందుకు అంటారు? [AP MAR-15,17,19][AP,TS MAY-17]
జవాబు:

  1. ఒక వాంఛనీయ లక్షణం ఉన్న రెండు విభిన్న రకాల మొక్కల నుంచి వివిక్తం చేసిన జీవపదార్థాలను సంయోగం చేయడం ద్వారా ఏర్పడిన సరికొత్త తరహా మొక్కలను ‘శాకీయ సంకరాలు’ అంటారు.
  2. ఈ ప్రక్రియను ‘శాకీయ సంకరణం’ అంటారు. వీటిలో ఎటువంటి లైంగిక కణాల కలయిక జరగదు. కావున ఈ మొక్కలను ‘శాకీయ సంకరాలు’ అని అంటారు.

ప్రశ్న 6.
‘జీవపదార్థ కలయిక’ అంటే ఏమిటి?
జవాబు:
జీవపదార్థ కలయిక: సంకర జీవపదార్థాలను పొందుట కొరకు రెండు విభిన్న రకాల మొక్కల నుంచి వివిక్తం చేసిన జీవపదార్థాలను సంయోగం చేయడాన్నే జీవపదార్థ కలయిక అంటారు.

ప్రశ్న 7.
శాశ్వత కణజాలలతో పోల్చినపుడు విభాజ్య కణజాలాలను వర్ధనం చేయడం చాలా తేలిక ఎందువల్ల?
జవాబు:

  1. వైరస్ వ్యాధి సోకిన మొక్కల విభాజ్య కణజాలలో వైరస్ అనేది ఉండదు.
  2. విభాజ్య కణజాలలో పెరుగుదల త్వరితంగా ఉంటుంది.
  3. ఎందుకంటే శాశ్వత కణజాలాల కంటే వీటిలో కణవిభజన త్వరితంగా, అధికంగా జరుగుతుంది.

ప్రశ్న 8.
స్పైరులినా నుంచి తయారు చేసే ప్రోటీన్లను ఏకకణ ప్రోటీన్లని ఎందుకు అంటారు?
జవాబు:

  1. స్పైరులినా, ఒక ఏకకణయుత శైవలం.
  2. ఇది అధిక ప్రోటీన్లను లవణాలు, క్రొవ్వు, పిండి పదార్థాలు, విటమిన్లను కలిగి ఉన్నది.
  3. కావున దీని నుండి తయారు చేసే ప్రోటీన్లను ఏకకణ ప్రోటీన్లు అని అంటారు.

ప్రశ్న 9.
ఒక మనిషికి పప్పుధాన్యాల (Pulses) అలర్జీ ఉండడంతో, అతనికి ప్రతిరోజు ఒక స్పైరులినా మాత్ర వాడమని సలహా ఇచ్చారు. ఈ సలహాకు గల కారణాలను ఇవ్వండి.
జవాబు:

  1. పప్పు ధాన్యాలు అధిక ప్రోటీనులను కలిగి ఉంటాయి. కాని కొందరికి అలర్జీని కలిగించవచ్చు.
  2. స్పైరులినా అధిక ప్రోటీనులు, లవణాలు, క్రొవ్వు, పిండి పదార్థాలు మరియు విటమిన్లను కలిగిన ఒక మంచి
    ఆహారం .
  3. కావున అలర్జీతో బాధపడే మనిషికి స్పైరులినా మాత్రవాడటం వలన ప్రోటీన్స్తో పాటు అన్ని పోషకాలు అందుతాయి.

ప్రశ్న 10.
సూక్ష్మ వ్యాప్తి (Micro propagation)ద్వారా ఏర్పడే మొక్కలను ‘క్లోన్’ అనడం తప్పా? వివరించండి.
జవాబు:
కాదు.

  1. సూక్ష్మవ్యాప్తి కూడా ఒక రకమైన శాకీయ ప్రత్యుత్పత్తి.
  2. వీటి ద్వారా ఏర్పడిన జీవులు జన్యుపరంగా తల్లి లేదా మూలాధార మొక్కను పోలి ఉంటాయి. అందుచేత వీటిని ‘సోమాక్లోన్లు’ అంటారు.

ప్రశ్న 11.
శాకీయ సంకరం(Somatic hybrid) అనేది సంకరం ( hybrid) తో ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:

  1. శాకీయ సంకరం, రెండు వివిక్తం చేసిన జీవపదార్థాల కలయిక ద్వారా సంకర మొక్కలను అభివృద్ధి చేసే ప్రక్రియ.
  2. సంకరం, జన్యుపరంగా వేరుగా ఉండే రెండుజన్యువుల మధ్య సంకరణ జరిపే ప్రక్రియ.
  3. శాకీయ సంకరం అనునది శాకీయ ప్రత్యుత్పత్తి వలన ఏర్పడుతుంది. సంకరం అనేది లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఏర్పడుతుంది.

ప్రశ్న 12.
విపుంసీకరణ అంటే ఏమిటి? ఎప్పుడు, ఎందుకు దీనిని జరుపుతారు?
జవాబు:

  1. ద్విలింగ పుష్పం నుండి మొగ్గ దశలోనే కేశరాలను వేరు చేసే ప్రక్రియనే ‘పుంసీకరణ’ అంటారు.
  2. ‘సంకరణం’లో ఎంచుకున్న మొక్కల ‘పరాగ సంపర్కం’ కొరకు ‘స్వపరాగ సంపర్కం’ జరగకుండా నివారించుటకు జరుపుతారు.

ప్రశ్న 13.
మొక్కల సంకరణ కార్యక్రమంలోని రెండు ముఖ్యమైన అవరోధాలను చర్చించండి.
జవాబు:

  1. ‘మొక్కల సంకరణ’ కార్యక్రమం అనేది అధిక సమయం, ఖర్చు మరియు అధిక శ్రమతో కూడిన ప్రక్రియ.
  2. ఇది మేలైన పునఃసంయోజకాల ఎంపిక మరియు పరీక్షించడంలో అవరోధాలకు కారణమవుతుంది.

ప్రశ్న 14.
డా.ఎమ్.ఎస్. స్వామినాథన్ గారి రెండు ముఖ్యమైన సేవలను తెలపండి.
జవాబు:

  1. ‘హరిత విప్లవం’ ద్వారా మెక్సికన్ గోధుమ రకాలను భారతదేశంలోకి ప్రవేశపెట్టారు.
  2. తక్కువ సమయంలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు సువాసన భరిత బాస్మతి రకాలను ఉత్పత్తి చేసారు.
  3. మొదటిసారిగా ‘ప్రయోగశాల నుంచి భూమిపైకి” (Lab -to- land), ఆహార భద్రత మరియు అనేక పర్యావరణ కార్యక్రమాలను ప్రారంభించారు.
  4. క్రాప్ కాఫెటిరియా (Crop Cafeteria), క్రాప్ షెడ్యూలింగ్ (Crop Scheduling), జన్యుపరంగా దిగుబడిని అభివృద్ధి చేయడం, సస్యాలలోని నాణ్యత వాటి భావాలను అభివృద్ధి పరిచారు.

ప్రశ్న 15.
చక్కటి దిగుబడి కోసం చెరకులోని ఏ రెండు జాతుల మధ్య సంకరణం జరిపారు?
జవాబు:
శఖారమ్ బార్బెర్రి మరియు శఖారమ్ అఫిసినారమ్ల మధ్య అధిక దిగుబడి నిచ్చే చెరకు కొరకు సంకరణం జరిపారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

ప్రశ్న 16.
టోటిపొటెన్సీ మరియు ఎక్స్ప్లాంట్లను నిర్వచించండి.
జవాబు:

  1. టోటిపొటెన్సీ: ఒక కణం తన సామర్ధ్యంతో పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందడాన్ని టోటిపొటెన్సీ అంటారు.
  2. ఎక్స్ప్లాంట్: మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకుని పరీక్ష నాళికలో సూక్ష్మజీవరహిత స్థితిలో ప్రత్యేక పోషక వర్ధనంలో పూర్తి మొక్కగా పొందడానికి ఉపయోగించే భాగాన్ని ‘ఎక్స్టెంట్’ అంటారు.

ప్రశ్న 17.
సూక్ష్మవ్యాప్తి మరియు సోమాక్లోను నిర్వచించండి.
జవాబు:

  1. సూక్ష్మవ్యాప్తి: చాలా తక్కువ సమయంలో, పరిమితమైన ప్రదేశంలో, ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేసే పద్ధతిని ‘సూక్ష్మవ్యాప్తి’ అంటారు.
  2. సోమాక్లోన్: కణజాల వర్ధనం ద్వారా జన్యుపరంగా మూలాధర మొక్కను పోలి ఉండే మొక్కలను ‘సోమాక్లోన్లు’
    అంటారు.

ప్రశ్న 18.
బీజపదార్ధ సేకరణ అంటే ఏమిటి? [TS MAR-15]
జవాబు:
బీజపదార్ధ సేకరణ: మొక్కలు (లేదా) విత్తనాల పూర్తి సేకరణలో అన్ని రకాల యుగ్మ వికల్పాలకు సంబంధించి అన్ని జన్యువులు ఉంటే దానిని ‘బీజపదార్ధ సేకరణ’ అంటారు.

ప్రశ్న 19.
బయోఫోర్టిఫికేషన్ అంటే ఏమిటి?
జవాబు:
1) బయోఫోర్టిఫికేషన్: ఇది ఒక ప్రజనన విధానం. దీని ద్వారా అధిక స్థాయి విటమిన్లు మరియు ఖనిజలవణాలు (లేదా) అధికస్థాయి ప్రోటీన్లు (లేదా) అధికస్థాయి క్రొవ్వులను సమాజ ఆరోగ్యస్థితిని పెంపొందించడం కొరకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది.

2) ఉదా:

  • గోధుమ రకం – అట్లాస్ 66, అధిక ప్రోటీన్ యుతమైనది.
  • బంగారు వరి – B-కెరోటిన్ అధికంగా కలిగిన రకం.
    విటమిన్ A పుష్టిగా ఉన్న కారెట్లు, విటమిన్ C పుష్టిగా ఉన్న కాకర.

ప్రశ్న 20.
‘వైరస్ లేని మొక్కలను’ తయారు చేయడానికి మొక్కలోని ఏ భాగం చక్కగా సరిపోతుంది? ఎందువల్ల? [TSM-16]
జవాబు:
1) అగ్ర మరియు గ్రీవ విభాజ్య కణజాలాలు వైరస్ రహితంగా ఉంటాయి.
2) కారణం: ఆ భాగాలు యందు కణవిభజన ఉత్తేజంగా వుంటుంది. కావున ఆ భాగాలు వైరస్ సంక్రమణకు గురికావు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
బీజపదార్థ సేకకరణ అంటే ఏమిటి? దాని వల్ల ఉపయోగాల ఏమిటి?
జవాబు:
బీజపదార్థ సేకకరణ: మొక్కలు లేదా విత్తనాల పూర్తి సేకరణలో అన్ని రకాల యుగ్మ వికల్పాలకు సంబంధించి అన్ని జన్యువులు ఉంటే దానిని ‘బీజపదార్థ సేకరణ’ అంటారు.
ఉపయోగాలు:

  1. అంతరించిపోతున్న జాతుల యొక్క మొక్క పదార్థాలను సేకరించి భద్రపరచవచ్చును.
  2. వర్ధనాల ద్వారా ఏర్పడిన ‘సోమాక్లోన్ల’ వైవిధ్యాలను భద్రపరచవచ్చును.
  3. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే ప్రక్రియ అయిన కణజాలవర్ధనం ద్వారా యాంటిబయోటిక్లను ఉత్పత్తి చేయవచ్చును.
  4. అధిక సమయం నిల్వ ఉండటం వలన సామర్థ్యాన్ని కోల్పొయే విత్తనాలను, దీని ద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చును.
  5. వ్యాధి నిరోధకత కల్గిన మొక్కలను భద్రపరచవచ్చు మరియు పెంచవచ్చును.
  6. కణజాల వర్ధనం పద్ధతిలో ఏర్పడిన అనేక జాతులను నిల్వ చేసుకోవచ్చును. మనకు అవసరమున్నంత కాలం వాటిని అదే స్థితిలో భద్రపరచుకోవచ్చును.

ప్రశ్న 2.
గోధుమలో వృద్ధి పరచబడిన ఏ లక్షణాలు భారతదేశం హరితవిప్లవాన్ని సాధించడానికి సహాయపడినవో పేర్కొనండి.
జవాబు:

  1. మొక్కల ప్రజనన సాంకేతిక విధానంతో అనూహ్యంగా పెరిగిన ఆహార ఉత్పత్తినే ‘హరిత విప్లవం’ అంటారు.
  2. 1960-2000 మధ్యకాలంలో గోధుమ ఉత్పత్తి ” 11 మిలియన్ ” టన్నుల నుంచి ’75 మిలియన్ టన్నులకు’ పెరిగింది.
  3. అధిక దిగుబడి మరియు వ్యాధి నిరోధకతను చూపే ‘సోనాలికా ‘ మరియు ‘కళ్యాణ్ సోనా’ రకాలను భారతదేశంలోని గోధుమ పండించే అన్ని ప్రదేశాలలో ప్రవేశపెట్టారు.
  4. అధిక దిగుబడి మరియు వ్యాధినిరోధకత అనే లక్షణాలు వృద్ధిపరచబడిన గోధుమను భారతదేశంలో ప్రవేశపెట్టడం ద్వారా ‘హరితవిప్లవం’ సాధించటం జరిగింది.

ప్రశ్న 3.
మొక్కలలో కీటకాలు, చీడల వ్యాధులను నిరోధించే కొన్ని ముఖ్య లక్షణాలను సూచించండి.
జవాబు:

  1. అతిధేయి సస్య మొక్కలలో కీటక ప్రతిరోధకత అనేది స్వరూపాత్మక, జీవరసాయన లేదా శరీర ధర్మశాస్త్ర లక్షణాల వల్ల కలగవచ్చు.
  2. చాలా మొక్కలలోని కీటక, చీడల నిరోధకత అనేది పత్రాలపై ఉండే కేశాలు ద్వారా కలుగుతుంది.
    ఉదా: పత్తిలో ‘జస్సిడ్’లకు నిరోధకత, గోధుమలో ధాన్యపత్రపురుగుకు నిరోధకత.
  3. గోధుమలో గట్టి కాండాలు ‘కాండ సాప్లై’కు నిరోధకతను కల్గి ఉంటాయి.
  4. నున్నటి ఆకులు మరియు మకరందంలేని పత్తి రకాలు, కాయతొలిచే పురుగు (బోల్వార్మ్స్)ను ఆకర్షించలేవు.
  5. అధిక ఆస్పార్టిక్ ఆమ్లం, తక్కువ నత్రజని మరియు తక్కువ చక్కెర శాతం వల్ల మొక్కజొన్నలో కాండం తొలిచే పరుగులకు ప్రతిరోధకతను చూపుతుంది.

ప్రశ్న 4.
వర్ధన యానకాన్ని (పోషక యానకం) సాధారణంగా “ఎక్కువ సారవంతమైన ప్రయోగశాల మృత్తిక” అని సూచించవచ్చు. ఈ వాక్యాన్ని సమర్థించండి.
జవాబు:

  1. వర్ధన యానకం అనేక ఆవశ్యక పోషకాల, కర్బన మూలం సుక్రోజ్, కర్బనేతర లవణాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, వృద్ధి నియంత్రకాలు మొదలైన పదార్థాల సముదాయం.
  2. ఈ పోషకాలన్నింటిని, pH 5.6 to 6.0. మధ్యలో శుద్ధజలంతో కలిపి ఉంచుతారు.
  3. వృద్ధి కారకాలు లేనటువంటి వృద్ధి యానకాన్ని బేసల్ యానకం అంటారు.
  4. వృద్ధి నియంత్రకాలైన ఆక్సిన్లు, సైటోకైనిన్లు మొదలైన వాటిని యానకానికి సరఫరా చేయటం ద్వారా కణజాల వర్ధన ప్రక్రియ ద్వారా పూర్తిస్థాయి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చును.
  5. కావున వర్ధన యానకాన్ని “ఎక్కువ సారవంతమైన ప్రయోగశాల మృత్తిక ” అని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
కణజాల వర్ధనం ద్వారా పెంపొందే మొక్కలు “తల్లి మొక్క ద్వారా ఏర్పడే క్లోన్లు” ఈ మొక్కల ఉపయోగాల గురించి చర్చించండి.
కణజాల వర్ధనం ద్వారా పెంపొందే మొక్కలు జన్యుపరంగా తల్లి యొక్క లేదా మూలాధార మొక్కను పోలి ఉంటాయి. అందుకే వీటిని ‘సోమాక్లోన్’ లు అంటారు. వీటిని తక్కువ సమయంలో తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొత్తంగా ఉత్పత్తి చేయవచ్చు.
ఉపయోగాలు:

  1. ఈ క్లోన్లు ఆర్థికపరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
  2. వీటిని వేగంగా, గుర్తించదగిన విధంగా మరియు సమయానికి అనుగుణంగా అభివృద్ధి పరచవచ్చు.
  3. టామాటో, అరటి, ఆపిల్, టేకు, యూకలిప్టస్ మరియు వెదురు మొక్కలను వాణిజ్యపరంగా ఉపయోగపడేలా ఉత్పత్తి చేస్తారు.

ప్రశ్న 6.
భారతదేశం లాంటి భౌగోళికంగా విస్తారంగా ఉండే దేశంలో కొత్త మొక్క రకాల పరీక్షకు సంబంధించిన ప్రాముఖ్యతను చర్చించండి.
జవాబు:

  1. వాతావరణం ద్వారా ఏర్పడిన కొత్త మొక్కలు పర్యావరణ పీడనంకు అనుగుణంగా ఉంటూ అధిక దిగుబడి, నాణ్యత, వ్యాధినిరోధకత, చీడనిరోధకత గలవిగా పరీక్షించబడుతాయి.
  2. మొదటగా వీటి విశ్లేషణ పరిశోధనా క్షేత్రాలలో జరుగుతుంది. ఆదర్శమైన ఎరువు వాడకం, నీటి పారుదల, ఇతర సస్య నిర్వహణ పద్ధతుల ద్వారా ‘నిర్వహణ సమర్థతను’ భద్రపరుస్తాయి.
  3. తరువాత ఈ పదార్థాలను రైతుల పొలాలలో కనీసం మూడు ఋతువులలో వివిధ ప్రదేశాలలో, సాధారణంగా పెరిగే వాతావరణ మండలాలో పరీక్షిస్తారు.
  4. ఈ పదార్థాలను సాగుబడి చేసే ఉత్తమమైన స్థానికసస్యంతో సూచనగా పోల్చి చూసి విశ్లేషిస్తారు.
  5. అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల అభివృద్ధి వలన పంట విలువ మరియు వ్యాపారం పెరుగుతుంది
  6. ఇది గ్రామీణ సంపదను పెంచి ఆర్థికపరంగా అభివృద్ధిని పెంపొందిస్తుంది. రసాయనాల మితవాడకం వలన కాలుష్య నివారణ జరుగుతుంది.
  7. వివిధ రకాల వాతావరణంలో పెరిగే మొక్కలు తెలుస్తాయి.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

ప్రశ్న 7.
బయోఫోర్టిఫైడ్(biofortified) సస్యాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఇవి సమాజానికి ఎటువంటి లాభాలను సమకూరుస్తాయి?
జవాబు:
బయోఫోర్టిఫైడ్ సస్యాలకు కొన్ని ఉదాహరణలు మరియు సమాజానికి వాటి వలన కలిగే లాభాలు:

  1. అట్లాస్ 66-a గోధుమరకం. ఇది అధిక ప్రోటీన్ యుతమైనది.
  2. మొక్కజొన్న సంకర రకాలు. ఇవి అమైనో ఆమ్లాలను రెండింతలు అధికంగా కలిగి ఉంటాయి.
  3. బంగారు వరి. ఇది B-కెరోటిన్ ను కలిగి వుంటుంది.
  4. విటమిన్ -A అధికంగా కల క్యారెట్, స్పినాచ్ – గుమ్మడి IARI – అభివృద్ధి పరచినవి
  5. విటమిన్ -C అధికంగా కల కాకర, ఆవాలు, టమాటా IARI – అభివృద్ధి పరచినవి.
  6. ఇనుము మరియు కాల్షియం పుష్టిగా ఉన్న స్పినాచ్ మరియు బతువ IARI – అభివృద్ధి పరచినవి.
  7. ప్రోటీన్ పుష్టిగా ఉన్న చిక్కుళ్ళు (వెడల్పురకం, లాబ్, ఫ్రెంచ్) మరియు తోట బటానీ IARI – అభివృద్ధి పరచినవి.

ప్రశ్న 8.
ఉత్పరివర్తనాలు అనేవి మొక్కల ప్రజననంలో చాలా ఉపయోగకరమైనవి. ఒక ఉదాహరణతో, ఈ వాక్యాన్ని సమర్థించండి.
జవాబు:
1) ఉత్పరివర్తనం:జన్యుపరంగా సంభవించే హఠాత్తు పరిణామాన్ని ‘ఉత్పరివర్తనం’ అంటారు.

2) ఉత్పరివర్తన ప్రజననం:మొక్కలలో వాంఛనీయ ఉత్పరివర్తనాలను ప్రవేశపెట్టి, వాటిని వినియోగిస్తూ, వీలైన రకాలను తయారు చేయడమే ఉత్పరివర్తన ప్రజననం.

3) రసాయనాలను లేదా వికిరణాల ద్వారా ప్రేరిత కృత్రిమ ఉత్పరివర్తనాలను సృష్టించిన వాంఛనీయ లక్షణాలు ఉన్న మొక్కలను ప్రజననం మూలంగా ఉపయోగించవచ్చు.

4) ఉదా 1: పెసలులో పసుపు పచ్చ మొజాయిక్ వైరస్ మరియు బూడిద తెగులు వ్యాధులకు వ్యాధి నిరోధకత అనేది ప్రేరిత ఉత్పరివర్తనాల ద్వారా ఏర్పడింది.
ఉదా 2: పసుపుపచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధి నిరోధకతను వన్యజాతి మొక్క నుంచి బదిలీ చేయడం ద్వారా బెండ మొక్కలో (ఎబల్మాస్కస్ ఎస్కులెంటస్) ‘పరభ్రని క్రాంతి’ అనే కొత్త రకం ఏర్పడింది.

5) అధిక దిగుబడి రకాలలో ప్రేరిత నిరోధకత ఉన్న జన్యువులు ప్రవేశపెట్టడం వలన ఏర్పడిన కొత్తరకాలు రెండు లక్షణాలను కలిగి ఉంటాయి.

ప్రశ్న 9.
ఆహార ఉత్పత్తిలో మనకు స్వయం సమృద్ధిగా చేసిన సాంకేతిక పరిజ్ఞానం గురించి క్లుప్తంగా చర్చించండి.
జవాబు:

  1. ఆహార ఉత్పత్తిలో మనకు స్వయం సమృద్ధిగా చేసిన సాంకేతిక పరిజ్ఞానం ‘మొక్కల ప్రజననం’.
  2. మొక్కల ప్రజననం యొక్క ముఖ్య ఉద్దేశం అధిక దిగుబడి, పొట్టి రకం, త్వరిత పక్వ దశ, సస్య నిర్వహణ చర్యలకు వీలుగా స్పందించుట, ఎరువులు & సేంద్రియం, పురుగు మరియు కీటక నిరోధకత, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను సృష్టించుట.
  3. ఈ స్వయం సమృద్ధి ఉత్పరివర్తన ప్రజననం, సంకరణం, (శాకీయ సంకరణం) కణజాలవర్ధనం, r-DNA పునః సంయోజనం, సాంకేతిక మరియు బయోఫోర్టిఫికేషన్ ద్వారా సాధించబడుతుంది.

ప్రశ్న 10.
SCP ఏకకణ ప్రోటీన్లపై లఘుటీక వ్రాయండి.
జవాబు:

  1. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా, వారి అవసరానికి సరిపడా ఆహార ఉత్పత్తి అనేది ప్రస్తుత వ్యవసాయ పద్ధతుల ద్వారా జరగడం లేదు.
  2. 25% కంటే అధిక జనాభా ‘ఆకలి’ మరియు ‘పౌష్టికలోపం’ గల ఆహారంతో బాధపడుతున్నారు.
  3. మానవులకు మరియు జంతువుల పోషణకు కావలసిన ప్రోటీన్ మూలానికి ప్రత్యామ్నాయం ఏకకణ ప్రోటీన్ల ఉత్పత్తి (SCP).
  4. SCP మానవులకు మరియు జంతువుల పోషణకు కావలసిన ప్రోటీన్లు ఏకకణ ప్రోటీన్ల ద్వారా ఉత్పత్తియైన సూక్ష్మజీవి ‘స్పైరులినా’ తో భర్తీ చేయబడుతున్నాయి.
  5. శైవలాలు, శిలింధ్రాలు & బాక్టీరియాలు SCP ఉత్పత్తికి వినియోగిస్తున్నారు.
  6. స్పైరులినా వంటి సూక్ష్మజీవులను సులువుగా ఎండుగడ్డి, మొలాసిస్, జంతువుల ఎరువులు మరియు మురుగు నీటిపై కూడా పెద్ద మొత్తంలో పారిశ్రామికంగా పెంచవచ్చును.
  7. దీనిని ఆహరంగా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, క్రొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు విటమిన్ల ను అధికంగా కలిగి వుంటుంది.
  8. ఇటువంటి వాటి వాడకం ద్వారా వాతావరణ కాలుష్యం కూడా తగ్గిపోతుంది.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మీరు మొక్కల ప్రజనన విభాగంలో పనిచేసే ఒక వృక్షశాస్త్రవేత్త, ఒక కొత్త రకాన్ని విడుదల చేసే క్రమంలో మీరు పాటించే వివిధ దశలను గురించి వివరించండి. [AP,TS MAR-18][ TS MAR-17,16] [AP MAY-17]
జవాబు:
కొత్త జన్యురక పంటను విడుదల సమయంలో ముఖ్యమైన దశలు:

  1. వైవిధ్యశీలత సేకరణ
  2. విశ్లేషణ మరియు జనకుల ఎంపిక
  3. ఎంపిక చేసిన జనకుల మధ్య సంకర సంకరణం
  4. వరణం మరియు మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం
  5. పరీక్షించడం, విడుదల మరియు కొత్త సాగురకాల వ్యాపారీకరణ.

1) వైవిధ్యశీలత సేకరణ:

  • ఏ ప్రజనన కార్యక్రమంలోనైనా ‘జన్యు వైవిధ్యశీలత’ అనేది చాలా ముఖ్యమైనది.
  • సస్యమొక్కలకు ముందు నుంచి ఉన్న వన్య సంబంధీకుల నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది.
  • వివిధ వన్యరకాలను, జాతులను వాటి ద్వారా సాగుచేసే సంబంధీకులను సేకరించడం మరియు భద్రపరచడం అనేది వృక్ష జనాభాలో లభించే జన్యువులను గుర్తించి ఉపయోగించుకోవడానికి అవసరమయ్యే కార్యక్రమం.
  • ఈ మొత్తం సేకరణలో మొక్కలు (లేదా) విత్తనాలు వివిధ రకాల యుగ్మ వికల్పాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఒక నమూనా సస్యంలో ఉంటే దానిని ‘బీజపదార్ధ సేకరణ’ అంటారు.

2) విశ్లేషణ మరియు జనకుల ఎంపిక:

  • బీజపదార్ధాన్ని సరియైన రీతిలో విశ్లేషించడం ద్వారా ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కలను గుర్తించవచ్చు.
  • ఎంపిక చేసిన మొక్కలను వృద్ధి చేసి సంకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు.
  • శుద్ధ వంశ క్రమాల్ని స్వపరాగ సంపర్కం ద్వారా సృష్టించవచ్చును.

3) ఎంపిక చేసిన జనకుల మధ్య సంకర సంకరణం:

  • అన్ని వాంఛనీయ జన్యు లక్షణాలు సంకరణం చేయగా వివిధ రకాల జనక మొక్కలు ఏర్పడతాయి.
  • సంకర సంకరణం అనేది అధిక సమయం మరియు శ్రమతో కూడిన ప్రక్రియ.
  • అంతేకాకుండా అన్ని సంకరణాలలో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉండాలని లేదు. సాధారణంగా కొన్ని వందల నుంచి వేల సంకరణాలు జరిపితే ఒక దానిలో మాత్రమే వాంఛనీయ లక్షణాల కలయిక కనిపిస్తుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

4) వరణం మరియు మేలైన పునః సంయోజకాలను పరీక్షించడం:

  • సంకర మొక్కలలో వాంఛనీయ లక్షణాలు ఉన్న మొక్కలను ఎంచుకోవడం జరుగుతుంది.
  • సంతతి మొక్కలు రెండు జనకుల కన్నా మేలైనవిగా ఏర్పడతాయి.
  • ఈ మొక్కలను అనేక తరాలు ఆత్మపరాగ సంపర్కం జరపడంతో అవి సమయుగ్మజస్థాయికి చేరుకుంటాయి.
  • సంతాన మొక్కలలో లక్షణాల పృథక్కరణ జరగకుండా చూస్తారు.

5) పరీక్షించడం, విడుదల మరియు కొత్త సాగు రకాల వ్యాపారీకరణ:

  • కొత్త క్రమాలను అధిక దిగుబడి మరియు వ్యాధినిరోధకత కోసం విశ్లేషిస్తారు.
  • ఈ విశ్లేషణ అనేది పరిశోధనా క్షేత్రాలలో సాగు చేయడం ద్వారా జరుగుతుంది.
  • సంకర క్రమాల మొక్క పరీక్ష అనేది రైతు క్షేత్రంలో విశ్లేషణ తరువాత నిర్వహిస్తారు.
  • పరీక్షించబడిన పదార్ధం యొక్క విశ్లేషణ అనేది సాధారణం. అక్కడ సాగుబడి చేసే మంచి సస్య దిగుబడితో పోలుస్తారు.
  • పరీక్షించబడిన పదార్ధం యొక్క విడుదల, సేకరణ మరియు ధృవీకరణ తరువాత జరుగుతుంది.

ప్రశ్న 2.
కణజాల వర్ధనం అనే సాంకేతిక విజ్ఞానం గురించి వివరించండి. సాంప్రదాయ పద్ధతిలో మొక్కల ప్రజననం, సస్యాభివృద్ధి కార్యక్రమాల కంటే కణజాల వర్ధనం వల్ల వచ్చే లాభాలు ఏమిటి? [AP MAY-22][ AP MAR-20,19,17,16,15][TS MAY-17][TS MAR-15,19,20]
జవాబు:
I) కణజాల వర్ధనం: ఈ విధానంలో కణాలు, కణజాలం మరియు అంగాల, పెరుగుదల, వర్ధనం అనేది పరస్థానిక వర్ధనం ద్వారా జరుగుతుంది. దీనినే కణజాల వర్ధనం అంటారు.

మొక్కల కణజాల వర్ధన ప్రక్రియ:

  1. పోషక వర్ధన యానకం తయారి
  2. ఎక్స్ ప్లాంట్ యొక్క అంతర్నివేశనం
  3. వర్ధన యానకాన్ని సూక్ష్మజీవి రహితంగా చేయడం
  4. పెరుగుదల కొరకు ఇంక్యుబేషన్
  5. ఎక్స్ప్లాంట్స్ తయారి
  6. పిల్ల మొక్కలను కుండీలకు మార్చి బాహ్యపరిసరాలకు అలవాటు చేయడం

1) పోషక వర్ధన యానకం తయారి: ఈ యానకం కర్బన మూలాన్ని అంటే సూక్రోజ్, కర్బనేతర లవణాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు వృద్ధి నియంత్రకాలైన ఆక్సిన్లు, సైటోకైనిన్లు మొదలైన వాటిని కలిగి ఉండాలి.

2) వర్ధన యానకాన్ని సూక్ష్మజీవి రహితంగా చేయడం: వృద్ధి యానకం పోషకాలతో పుష్టిగా ఉండటం వల్ల అది సూక్ష్మజీవుల పెరుగుదలను ఆకర్షిస్తుంది. కావున యానకమును సూక్ష్మజీవరహితం చేయాలి. దీనిని ‘ఆటోక్లేవ్’ లో 15 పౌండ్ల పీడనం, 121°C వద్ద 15 నిమిషాలు ఉంచి చెయ్యాలి.

3) ఎక్స్టెంట్ తయారి: మొక్క లోని జీవం వున్న ఏ భాగానైన్నా అంటే కాండం, వేర్లు మొదలైన వాటిని ఇన్నా క్యూలమ్ తీసుకోవడాన్ని ‘ఎక్స్ప్లాంట్’ అంటారు.

4) ఎక్స్టెంట్ అంతర్నివేశనం: ఎక్స్టెంట్ను సూక్ష్మజీవిరహిత వర్ధన యానకంలోనికి ప్రవేశపెట్టటాన్ని అంతర్నివేశన అంటారు. ఇది పూర్తిగా అసంక్రామిక వాతావరణమైన ‘మినార్ గాలి – గది’ లో జరుపుతారు.

5) పెరుగుదల కొరకు ఇంక్యుబేషన్:

  • వర్ధనాలు 3 నుంచి 4 వారాలు ఇంక్యుబేట్ చేయాలి. ఈ సమయంలో కణాలు పోషక పదార్ధాలను గ్రహించి, పెరిగి అనేక సమవిభజనలు చెందుతాయి. అవయవ విభేదనం చెందని కణాల సమూహన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనినే ‘కాలస్’ అంటారు.
  • ఆక్సిన్లు మరియు సైటోకైనిన్లు వర్ధన యానకానికి అందించాలి. కాలస్ వేర్లు (లేదా) కాండాలను ఏర్పరుస్తుంది.
    ఈ ప్రక్రియను అవయవోత్పత్తి అంటారు.
  •  ఎక్స్ ప్లాంట్ పిండోత్పత్తి ద్వారా పిండ కాలస్ గా మారి పిండాభాలను ఏర్పరుస్తుంది.
  • ఈ పిండాభాలు శాకీయ కణాల నుంచి ఏర్పడటం వల్ల వీటినే శాఖీయ పిండాలు’ అంటారు.

6) పిల్ల మొక్కలను బాహ్య పరిసరాలకు కుండీల ద్వారా అలవాటు చేయడం: అవయవోత్పత్తి (లేదా) శాకీయవోత్పత్తి ద్వారా ఏర్పడిన మొక్కలను బాహ్య వాతావరణానికి కుండీల ద్వారా పరిచయం చేయటం.

II) కణజాల వర్ధనం యొక్క ఉపయోగాలు:

  • తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో మొక్కల ఉత్పత్తి.
  • కాండ-కొనల వర్ధనం ద్వారా వైరస్ వ్యాధులను తట్టుకొనగలిగే మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.
  • విత్తన రహిత మొక్కలను అధికోత్పత్తి చేయవచ్చు.
  • కణజాల వర్ధనం ద్వారా స్త్రీ మొక్కలను ఎన్నుకొని ఉత్పత్తి చేయవచ్చును.
  • లైంగిక సంకరణ జరగని మొక్కలలో శాకీయ సంకరాలను, కణజాల వర్ధనం ద్వారా పొందవచ్చు
  • కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తి అయిన ఔషధ మొక్కలు పారిశ్రామికంగా మరియు ఔషధపరంగా అధిక విలువ ఉన్న ఉత్పన్నాలు.

కణజాల వర్ధన విధి విధానం
AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు 1

ప్రశ్న 3.
ఆధునిక పద్ధతులలో మొక్కల ప్రజననం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ‘ఆహార కొరత’ను పోగొట్టవచ్చు. ఈ వాక్యంపై స్పందిస్తూ సరైన ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
అవును. ఆధునిక పద్ధతులలో మొక్కల ప్రజననం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరతను పొగొట్టవచ్చు. మొక్కల ప్రజననం, వ్యాధి కారకాలను, కీటకాలు, చీడలకు వ్యాధి నిరోధకత చూపే కొత్త రకాల సృష్టికి ఉపయోగిస్తారు. ఇది ఆహార దిగుబడిని పెంచుతుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

  1. మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి ప్రతినిరోధకత: అనేక రకాల శిలీంధ్రాలు, బాక్టీరియమ్లు, వైరస్లు వ్యాధిజనకాల వల్లసాగుబడి చేసే సస్య జాతులు దిగుబడి తగ్గిపోతుంది.
  2. ఇటువంటి పరిస్థితులలో ప్రజననం ద్వారా సాగు చేసే రకాలలో వ్యాధి ప్రతిరోధకతను అభివృద్ధి చేయడం ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచవచ్చు.
  3. ప్రజననం విధానంను సాంకేతిక పరిజ్ఞానంలో లేదా ఉత్పరివర్తనాలతో సాగించవచ్చు.
  4. సాంకేతిక పరిజ్ఞానంలో సాంప్రదాయ ప్రజనన పద్ధతులైన వరణం మరియు సంకరణం ద్వారా శిలీంధ్రాలు, బాక్టీరియమ్లు మరియు వైరస్ వ్యాధులకు వ్యాధి ప్రతిరోధకతను చూపే కొన్ని సస్య రకాలను అభివృద్ధి చేసారు.

వాటి వివరాలు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు 2
ఉత్పరివర్తన ప్రజననం: మొక్కలలో వాంఛనీయ ఉత్పరివర్తనాలను ప్రవేశపెట్టి, వాటిని వినియోగిస్తూ, మేలైన రకాలను ఉత్పత్తి చేయడమే ఉత్పరివర్తన ప్రజననం.

ఉదా: పసుపు పచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధి నిరోధకతను వన్యజాతి మొక్క నుండి బదిలీ చేయడం ద్వారా బెండమొక్కలో (ఎబుల్ మాస్కస్ ఎస్కులెంటస్ ) ‘పర్భని క్రాంతి’ అనే ఒక కొత్త రకం ఏర్పడింది.

2) మొక్కల ప్రజననం ద్వారా కీటకాలు, చీడల ప్రతిరోధకత అభివృద్ధి: సస్య మొక్కలు మరియు సస్య ఉత్పత్తులు ఎక్కువ మొత్తంలో నాశనం కావడానికి మరొక ముఖ్యమైన కారణం కీటకాలు, చీడల వ్యాధి సంక్రమణ. అతిధేయి సస్య మొక్కల కీటక ప్రతిరోధకత అనేది స్వరూపాత్మక, జీవరసాయన లేదా శరీర ధర్మశాస్త్ర లక్షణాల వల్ల కలుగుతుంది.
చాలా మొక్కలలోని కీటక, చీడల నిరోధకత అనేది పత్రాలపై ఉండే కేశాలు వలన కలుగుతుంది.

ఉదా: పత్తిలో ‘జస్సిడ్’ మరియు గోధుమలో ‘ధాన్యపత్ర పురుగు’ నున్నటి ఆకులు మరియు మకరందం లేని పత్తి రకాలు ‘కాయంతో లేచి పురుగు’ బోల్ వార్మ్స్ ను ఆకర్షించలేవు.

అధిక ఆస్పార్టిక్ ఆమ్లం, తక్కువ నత్రజని మరియు తక్కువ చక్కెర శాతం వల్ల మొక్కజొన్నతో కాండం తొలిచే పురుగులకు ప్రతిరోధకత చూపుతుంది.
వాటి వివరాలు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు 3

3) మొక్కల ప్రజననం ద్వారా పెరిగే ఆహార నాణ్యత: ప్రపంచంలో దారిద్య్రరేఖకు దిగువన ఎక్కువ జనాభా ఆహార కొరతతో, సూక్ష్మ మూలకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, లోపాలతో లేదా “కనిపించని ఆకలి”తో బాధపడుతున్నారు. దీనికి కారణం వారు వీటిని ఖరీదు చేసే స్థితిలో లేరు.

దీనికి గాను బయోఫోర్టిఫికేషన్ అనే ప్రజననం ద్వారా సస్యాలలో విటమిన్లు, లవణాల స్థాయిలను అధికం చేయడం లేదా అధిక ప్రోటీన్, ఆరోగ్యవంతమైన కొవ్వు వంటి అంశాల ద్వారా సమాజ ఆరోగ్య స్థితిని పెంపొందించడం జరుగుతున్నది.

ఉదా: గోధుమ రకం – అట్లాస్ 66, అధిక ప్రోటీన్ %
వరి రకం- బంగారు వరి, బీటా కెరోటీన్, ఐరన్ ఫోర్టిఫైడ్
విటమిన్ ‘A’ పుష్టిగా ఉన్న క్యారెట్లు, స్పినాచ్, గుమ్మడి
” విటమిన్ ‘C’ పుష్టిగా ఉన్న కాకర, బతువ, ఆవాలు, టోమాటో
ఇనుము, కాల్షియం పుష్టిగా ఉన్న స్పినాచ్, బతువ
ప్రోటీన్ పుష్టిగా ఉన్న చిక్కుళ్ళు.
అమైనో ఆమ్లాలు పుష్టిగా ఉన్న మొక్కజొన్న
పైవన్నీ కూడా ‘ఆహారోత్పత్తిని’ అధికం చేసే ఆధునిక ప్రజనన పద్ధతులు.

ప్రశ్న 4.
మొక్కల సూక్ష్మ వ్యాప్తి, అభివృద్ధి కోసం వృక్ష కణపు టోటీపొటెన్సీ లక్షణం ఏవిధంగా ఉపయోగపడుతుందో చర్చించండి.
జవాబు:
సూక్ష్మ వ్యాప్తి అనగా తక్కువ సమయంలో, పరిమిత ప్రదేశంలో, ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయటం.
ఏదైనా ఒక కణం పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందగలిగే శక్తిని ‘టోటిపొటెన్సీ’ అంటారు.
పై రెండు అంశాలు ‘కణజాల వర్ధనం’ అనే సాంకేతిక ప్రక్రియలో కనిపిస్తాయి.
I) కణజాల వర్ధనం: ఈ విధానంలో కణాలు, కణజాలం మరియు అంగాల, పెరుగుదల, వర్ధనం అనేది పరస్థానిక వర్ధనం ద్వారా జరుగుతుంది. దీనినే కణజాల వర్ధనం అంటారు.
మొక్కల కణజాల వర్ధన ప్రక్రియ:

  1. పోషక వర్ధన యానకం తయారి
  2. ఎక్స్టెంట్ యొక్క అంతర్నివేశనం
  3. వర్ధన యానకాన్ని సూక్ష్మజీవి రహితంగా చేయడం
  4. పెరుగుదల కొరకు ఇంక్యుబేషన్
  5. ఎక్స్ప్లాంట్స్ తయారి
  6. పిల్ల మొక్కలను కుండీలకు మార్చి బాహ్యపరిసరాలకు అలవాటు చేయడం

1) పోషక వర్ధన యానకం తయారి: ఈ యానకం కర్బన మూలాన్ని అంటే సూక్రోజ్, కర్బనేతర లవణాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు వృద్ధి నియంత్రకాలైన ఆక్సిన్లు, సైటోకైనిన్లు మొదలైన వాటిని కలిగి ఉండాలి.

2) వర్ధన యానకాన్ని సూక్ష్మజీవి రహితంగా చేయడం: వృద్ధి యానకం పోషకాలతో పుష్టిగా ఉండటం వల్ల అది సూక్ష్మజీవుల పెరుగుదలను ఆకర్షిస్తుంది. కావున యానకమును సూక్ష్మజీవరహితం చేయాలి. దీనిని ‘ఆటోక్లేవ్’ లో 15 పౌండ్ల పీడనం, 121°C వద్ద 15 నిమిషాలు ఉంచి చెయ్యాలి.

3) ఎక్స్ ప్లాంట్ తయారి: మొక్క యొక్క జీవం వున్న ఏ భాగానైన్నా అంటే కాండం, వేర్లు మొదలైనవి వాటిని తీసుకుని ఇన్నా క్యూలమ్ తీసుకోవడాన్ని ఎక్స్ ప్లాంట్ అంటారు.

4) ఎక్స్ ప్లాంట్ అంతర్నివేశనం: ఎక్స్ ప్లాంట్ను సూక్ష్మ జీవి రహిత వర్ధన యానకంలోనికి ప్రవేశపెట్టటాన్ని అంతర్నివేశన అంటారు. ఇది పూర్తిగా అసంక్రామిక వాతావరణమైన ‘లామినార్ – గాలి గది’ లో జరుపుతారు.

5. పెరుగుదల కొరకు ఇంక్యుబేషన్:

  • వర్ధనాలు 3 నుంచి 4 వారాలు ఇంక్యుబేట్ చేయాలి. ఈ సమయంలో కణాలు పోషక పదార్ధాలను గ్రహించి, పెరిగి అనేక సమవిభజనలు చెందుతాయి. అవయవ విభేదనం చెందని కణాల సమూహన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనినే ‘కాలస్’ అంటారు.
  • ఆక్సిన్లు మరియు సైటోకైనిన్లు వర్ధన యానకానికి అందించాలి. కాలస్ వేర్లు (లేదా) కాండాలను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను అవయవోత్పత్తి అంటారు.
  • ఎక్స్ ప్లాంట్ పిండోత్పత్తి ద్వారా పిండ కాలస్ గా మారి పిండాభాలను ఏర్పరుస్తుంది.
  • ఈ పిండాభాలు శాకీయ కణాల నుంచి ఏర్పడటం వల్ల వీటినే ‘శాఖీయ పిండాలు’ అంటారు.

6) పిల్ల మొక్కలను బాహ్య పరిసరాలకు కుండీల ద్వారా అలవాటు చేయడం: అవయవోత్పత్తి (లేదా) శాకీయవోత్పత్తి ద్వారా ఏర్పడిన మొక్కలను బాహ్య వాతావరణానికి కుండీల ద్వారా పరిచయం చేయటం.

II) కణజాల వర్ధనం యొక్క ఉపయోగాలు:

  • తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో మొక్కల ఉత్పత్తి.
  • కాండ-కొనల వర్ధనం ద్వారా వైరస్ వ్యాధులను తట్టుకొనగలిగే మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. (iii)విత్తన రహిత మొక్కల అధికోత్పత్తి .
  • కణజాల వర్ధనం ద్వారా స్త్రీ మొక్కలను ఎన్నుకొని ఉత్పత్తి చేయవచ్చును.
  • లైంగిక సంకరణ జరగని మొక్కలలో శాకీయ సంకరాలను కణజాల వర్ధనం ద్వారా పొందవచ్చు.
  • కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తి అయిన ఔషధ మొక్కలు పారిశ్రామికంగా మరియు ఔషధ పరంగా హెచ్చు విలువ ఉండే ఉత్పన్నాలు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

ప్రశ్న 5.
ఆహార ఉత్పత్తిల పెరుగుదల కోసం ఉపయోగించే మూడు పద్ధతులు ఏమిటి? ప్రతి పద్ధతి ముఖ్య లక్షణాలు, లాభాలు, నష్టాల గురించి చర్చించండి.
జవాబు:
ఆహార ఉత్పత్తుల పెరుగుదల కోసం ఉపయోగించే మూడు ముఖ్య పద్ధతులు

  1. ఉత్పరివర్తన ప్రజననం
  2. కణజాల వర్ధనం
  3. r-DNA సాంకేతికత (లేదా) జన్యుపునఃసంయోజక సాంకేతికత

1) ఉత్పరివర్తన ప్రజననం: మొక్కలలో వాంఛనీయ ఉత్పరివర్తనాలను ప్రవేశపెట్టి, వాటిని వినియోగిస్తూ, మేలైన రకాలను ఉత్పత్తి చేయడమే ఉత్పరివర్తన ప్రజననం.
లక్షణాలు:

  1. జనక రకాలలో లేని కొత్త లక్షణాన్ని సృష్టించడం
  2. ప్రజననం ద్వారా సాగు చేసే రకాలలో వ్యాధి ప్రతిరోధకతను అభివృద్ధి చేయడం.
  3. ఆహార నాణ్యతను పెంచడం

లాభాలు:

  1. ప్రజననం నీటి ప్రతిబలానికి నిరోధకత కలిగిన అనేక దిగుబడి రకాలను అభివృద్ధికి దారి తీసింది.
  2. వ్యాధులకు వ్యాధి నిరోధకత అనేది ‘ప్రేరిత ఉత్పరివర్తనాల’ ద్వారా ఏర్పడింది.
  3. ప్రజననం ద్వారా పోషణలో నాణ్యతను పెంచటం జరిగింది.
    ఉదా: విటమిన్ ఎ అధికంగా ఉన్న క్యారేట్, స్పినాచ్.

నష్టాలు:

  1. వ్యాధి ప్రతిరోధకత జన్యువుల పరిమితి సంఖ్య వల్ల అడ్డంకులు.
  2. నిరోధకత లక్షణాలు చూపించనప్పటికి, వాటి దిగుబడి మాత్రం తక్కువ.
  3. కొన్ని సందర్భాలలో జన్యురూపాంతరంలో ప్రాణాంతకమైన మార్పులు ఏర్పడి జీవి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

2) కణజాలవర్ధనం: ఎక్స్ ప్లాంట్ మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకొని, దానిని పరీక్షనాళికలో ప్రవేశపెట్టి సూక్ష్మజీవరహిత పరిస్థితులలో ప్రత్యేక పోషకాహార యానకంపై ప్రవేశపెట్టి, సంపూర్ణ మొక్కలుగా పునరుత్పత్తి చేయడాన్ని ‘కణజాల వర్ధనం’ అంటారు.
లక్ష్యాలు:

  1. తక్కువ సమయంలో, పరిమితమైన ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయడం.
  2. ఆర్థిక, వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించడం.
  3. వ్యాధిగ్రస్త మొక్కల నుంచి ఆరోగ్యకరమైన మొక్కలను పొందటం.

లాభాలు:

  1. శాకీయ సంకరణం వాంఛనీయ లక్షణాలను ప్రవేశపెట్టడాన్ని సులభతరం చేస్తుంది.
  2. సాంకేతిక పరిజ్ఞానంతో అవసరానికి తగినట్లు, చురుకుగా మరియు సమర్థవంతమైన ఫలితాలను పొందవచ్చు.
  3. సూక్ష్మవ్యాప్తి పద్ధతి ద్వారా ఆర్థిక ప్రాముఖ్యం కలిగిన టమాట, అరటి, ఆపిల్, టేకు, యూకలిప్టస్ మరియు వెదురు మొక్కలను వాణిజ్యపరంగా ఉపయోగపడేలా ఉత్పత్తి చేసారు.

నష్టాలు:

  1. సూక్ష్మ వ్యాప్తి ద్వారా ఏర్పడే జీవులను ‘సోమాక్లోన్లు’ అంటారు. వీటిలో జన్యు పదార్థం సంయోగం జరగదు. క్లోన్లలో ఒకే రకం జన్యు పదార్థం ఉంటుంది.
  2. పర్యావరణ కారకాలకు, సంక్రమితాలకు మరియు చీడలకు ప్రతికూల పరిస్థితులని ఏర్పరచటం.
  3. సూక్ష్మజీవరహిత పరిస్థితులను కల్పించడం ఖరీదుతో కూడినది.

r-DNA సాంకేతికత: జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులను తయారుచేయు విధానాన్ని పునఃసంయోజక విధానం లేదా ‘జన్యు ఇంజనీరింగ్’ అంటారు.

లక్ష్యాలు:

  1. లైంగిక ప్రత్యుత్పత్తి వైవిధ్యాలను, జన్యుపునస్సంయోజనాలను, కొన్ని జీవులకే కాకుండా జీవసమూహాలకు కూడా కల్పించడం.
  2. వాంఛనీయ జన్యువులతోపాటు అవాంఛనీయ జన్యువులను ప్రవేశింప చేయకుండా ఉండటం.
  3. జన్యుపదార్థాలలో రసాయన మార్పులు, సూక్ష్మజీవనాశకాలు, వాక్సిన్లు, ఎన్ఎమ్ల పెద్ద ఎత్తున తయారి.

లాభాలు:

  1. పరస్థానికంగా జరిగే ఫలదీకరణం, (టెస్ట్ ట్యూబ్ బేబి) పరీక్షనాళికలో పిల్లలు ఏర్పడే పద్ధతి.
  2. జన్యుసంశ్లేషణ దాని వాడుక, DNA వాక్సిన్ తయారీ, లోపం గల జన్యువును సరిచేయడం, వ్యాధి గుర్తింపు పద్ధతులు, వ్యవసాయ పంట మొక్కల అభివృద్ధి, వ్యర్ధపదార్థాల శుద్ధి మరియు శక్తి ఉత్పాదన.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

నష్టాలు:

  1. అధిక ఖర్చుతో కూడినది. ఖరీదైన ప్రయోగశాలల సదుపాయం.
  2. జన్యుపరంగా రూపాంతరం చెందిన మొక్కల వలన సాధారణ జాతులు అంతరించిపోవడం.

Leave a Comment