AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

Students get through AP Inter 1st Year Zoology Important Questions 8th Lesson జీవావరణం – పర్యావరణం which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Zoology Important Questions 8th Lesson జీవావరణం – పర్యావరణం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
జీవావరణాన్ని దాని శాఖలను నిర్వచించండి.
జవాబు:
1. జీవావరణం అనగా జీవులకు, పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయు శాస్త్రం.

2. జీవావరణ శాఖలు:

  1. ఆటకాలజీ:ఒక జాతికి మరియు వాటి పరిసరాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేశాస్త్రాన్ని ఆటకాలజీ
    అంటారు.
  2. సెనెకాలజీ: జీవావరణ సమాజాల నిర్మాణం, అభివృద్ధి మరియు విస్తరణను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెనెకాలజీ అంటారు.

ప్రశ్న 2.
జీవావరణ జనాభా అంటే ఏమిటి?
జవాబు:

  1. జీవావరణ జనాభా అనగా ఒక నిర్ధిష్టకాలంలో, నిర్ధిష్ట ఆవాసంలో నివశించే ‘ఒకేజాతికి చెందిన జీవుల జనాభా’.
  2. ఉదా: కట్ల జనాభాలో ఒక నిర్ధిష్ట సమయంలో ఒక చెరువు నందు నివశించే ‘కట్లా కట్లా’ జాతి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం
ప్రశ్న 3.
జీవ సమాజాన్ని నిర్వచించండి.
జవాబు:

  1. జీవ సమాజం అనేది ఒక నిర్ధిష్ట ప్రదేశంలో ఉండే ‘వివిధ జీవ జాతుల సమూహం’.
    జీవ సమాజంలో ఆధిక్యత ప్రదర్శించే జనాభా ఒకటి ఉంటుంది మరియు ఆ జీవ సమాజాన్ని ఆ పేరుతో పిలుస్తారు.
  2. ఉదా: హిమాలయా ప్రాంతంలో ఉన్న దేవదారు వృక్షజాతి సమాజం

ప్రశ్న 4.
జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటి? [TS M-18]
జవాబు:

  1. ‘జీవావరణ వ్యవస్థ’ అనునది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. దీనిలోని సమూహ జీవులు తమలో తాము మరియు చుట్టూ ఉన్న పరిసరాలతో అంతర చర్యలు జరుపుతాయి. ఫలితంగా వాటి మధ్య శక్తి వినిమయం జరిగి ఒక నిర్దిష్టమైన పోషక నిర్మాణ వ్యవస్థ ఏర్పడును.
  2. ఉదా: చెరువులు, సరస్సులు

ప్రశ్న 5.
జీవావరణ వ్యవస్థ, జీవమండలం మధ్య వ్యత్యాసాన్ని చూపండి.
జవాబు:

  1. జీవావరణ వ్యవస్థ అనునది జీవసమాజం యొక్క క్రియాత్మక ప్రమాణం. ఇది సాధారణంగా చిన్న ప్రాంతాన్ని కల్గి ఉంటుంది.
    ఉదా: ఎక్వేరియం, సరస్సు మొదలగునవి.
  2. జీవమండలం అనేది మొక్కలు మరియు జంతువులకు సంబంధించిన అతి పెద్ద సమూహం. ఇది విశాల ప్రాంతాన్ని కల్గి ఉంటుంది.
    ఉదా: ఎడారులు, వర్షారణ్యాలు, టండ్రాలు.

ప్రశ్న 6.
జీవమండలం అంటే ఏమిటి, మీరు చదివిన ఏవైనా రెండు జీవ మండలాల పేర్లు రాయండి.
జవాబు:

  1. జీవమండలం అనేది మొక్కలు మరియు జంతువులకు సంబంధించిన అతి పెద్ద సమూహం. ఇది విశాల ప్రాంతాన్ని కల్గి ఉంటుంది.
  2. ఉదా 1: ఎడారులు, వర్షారణ్యాలు, టండ్రాలు.
  3. ఉదా 2: జలజీవమండలాలు: వీటిలో మంచినీటి మరియు సముద్ర జీవమండలాలు ఉంటాయి.

ప్రశ్న 7.
జీవగోళం అంటే ఏమిటి?
జవాబు:

  1. భూమండలంలోని ‘అన్ని రకాల’ ఆవాస ప్రాంతాలని సంయుక్తంగా కలిగి ఉన్న ప్రదేశాన్ని జీవగోళం (బయోస్ఫియర్) అంటారు.
  2. ఇది అనేక వేల కిలోమీటర్ల ఎత్తులో ఆకాశంలోకి మరియు కొన్ని మీటర్ల లోతులో భూ ఉపరితలానికి మరియు సముద్రంలోని కొంత లోతు వరకు విస్తరించి ఉంటుంది.

ప్రశ్న 8.
ఒక జీవి ఆవాసం, నిచేల మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
ఆవాసం

  1. ఆవాసం అనగా ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నివసించే ప్రాంతం.
  2. ఇది ఒక వ్యక్తి యొక్క చిరునామా వంటిది.
  3. ఉదా: సరస్సు లేదా చెరువులోని చేప ఆవాసం

నిచే

  1. నిచే అనగా ఆవరణ వ్యవస్థలో జీవి యొక్క క్రియాత్మక పాత్ర
  2. ఇది ఒక వ్యక్తి యొక్క వృత్తి వంటిది. ఉదా: రోజా మొక్కల ఉత్పత్తిదారులు

ప్రశ్న 9.
జీవ సమాజంలో కంటే జనాభాలో జన్యుసారూపం గల జీవులు అధికంగా ఉంటాయి. వివరించండి.
జవాబు:

  1. జనాభా అంటే, ఒకే జాతి, ఒకేరకమైన జన్యువులను కలిగిన జీవుల సమూహం.
    కావున జనాభాలో జన్యుసారూప్యత కల జీవులే ఎక్కువగా వుంటాయి.
  2. సమాజం అంటే ఒక నిర్ధిష్ట ప్రాంతంలో భిన్న జన్యువులు కల కొన్ని జాతి జనాభాల సమూహం. కావున సమాజంలోని జన్యుసారూప్యత గల జీవులు తక్కువగా ఉంటాయి.

ప్రశ్న 10.
అంటార్కిటిక్ జలాలలోని చేపలు తమ జీవద్రవాలను గడ్డకట్టకుండా ఏ విధంగా చూసుకుంటాయి?
జవాబు:
అంటార్కిటిక్ జలాలలో నివసించే చేపలు తమ జీవ ద్రవాలు గడ్డకట్ట కుండా చూసుకోగలవు.

  1. 4°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనగా గడ్డకట్టలేని లోతైన ప్రాంతంలో ఇవి ఉంటాయి.
  2. జీవక్రియా రేటులను తగ్గించుకొనుట ద్వారా ఆక్సిజన్ వినియోగతను తగ్గించుకుంటాయి.
  3. గడ్డకట్టనివ్వకుండా ఉంచే నిరోధిక ప్రోటీనులైన గ్లైకోప్రోటోన్ (AFGP) లను ఉత్పత్తి చేసుకుంటాయి. ఇవి దేహం నందు మంచుగడ్డలు ఏర్పడకుండా చేసి, దేహద్రవ్యాలు గడ్డకట్టకుండా చేస్తాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 11.
ఎత్తైన పర్వాతాలను ఎక్కినపుడు మీ శరీరం ఆల్టిట్యూడ్ సిక్నెస్ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది?
జవాబు:

  1. ఎత్తైన ఆల్టిట్యూడ్స్ అనగా ఎత్తైన పర్వతాలలో, వాతావరణ పీడనం తక్కువగా ఉండటం వల్ల ‘ఆక్సిజన్ లభ్యత తక్కువగా” ఉంటుంది.
  2. ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచడం మరియు శ్వాసక్రియ రేటును పెంచటం ద్వారా శరీరం ‘తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేస్తుంది.

ప్రశ్న 12.
జంతువుల వర్ణకాలపై కాంతి ప్రభావం ఏమిటి?
జవాబు:

  1. కాంతి చర్మం రంగుపై ప్రభావం చూపుతుంది. తక్కువ కాంతిలో నివసించే జంతువులు లేత రంగులో, ఎక్కువ కాంతిలో నివసించే జంతువులు ముదురు రంగులో ఉంటాయి.
  2. ప్రోటియస్ ఆంగ్యూనస్ చర్మం గుహల్లో ఉన్నపుడు లేత రంగులో ఉంటుంది. దీన్ని కాంతికి గురి చేస్తే కొంత సమయానికి చర్మం ముదురు రంగులోకి మారుతుంది.

ప్రశ్న 13.
కాంతి గతి క్రమం(Phototaxis) మరియు కాంతి అనుగమనం (Photokinesis) మధ్య భేదాలను తెల్పండి [TS M-19]
జవాబు:
1. కాంతి గతిక్రమం: జీవుల కదలిక కాంతికి అనుగుణంగా లేదా కాంతికి వ్యతిరేకంగా ఉందా అని తెలియజేసే దాన్ని కాంతి గతిక్రమం అంటారు. ఉదా: యూగ్లీనా ధనాత్మక అనుక్రియను ప్రదర్శిస్తుంది. ఇది కాంతికి అనుగుణంగా కదులుతుంది. బొద్దింక ఋణాత్మక అనుక్రియను ప్రదర్శిస్తుంది. ఇది కాంతికి వ్యతిరేక దిశలో కదులుతుంది.

2. కాంతి అనుగమనం: జీవుల నిర్ధిష్ఠ చలనంపై కాంతి కలుగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటారు. ఉదా: పిన్నోధీలిన్ మసెలో పీత (మాక్యులేటస్) డింభకాల చలనం, కాంతి తీవ్రత వలన వేగవంతమవుతుంది.

ప్రశ్న 14.
సర్కేడియన్ లయలు అంటే ఏమిటి? [TS MAY-22][TS M-15]
జవాబు:

  1. 24 గంటలు కాలచక్రంలో ఏర్పడే జీవలయలను ‘సర్కేడియన్ లయలు’ అంటారు.
  2. నిర్ధిష్ట క్రమ అంతరాలలో పునరుప్పాదనం జరిపే ప్రవర్తనా కృత్యాలను ‘జీవలయలు’ అంటారు.

ప్రశ్న 15.
కాంతి ఆవర్తిత్వం అంటే ఏమిటి?
జవాబు:

  1. కాంతి వ్యవధికి అనుగుణంగా జీవులు చూపే స్పందనను ను కాంతి ఆవర్తిత్వం (లేదా) కాంతి కాలావధి అంటారు.
  2. ఉదా: శీతాకాలంలో పక్షుల వలస, సైబీరియాలో పక్షులు అధిక సూర్యకాంతి కొరకు దక్షిణ దిశకు వలస వస్తాయి. కారణం: సైబీరియాలో ఆహారం మరియు ప్రత్యుత్పత్తి కొరకు కాంతి లభించే సమయం తక్కువ.

ప్రశ్న 16.
ఫోటోపీరియడ్ – కాంతి వ్యవధి మరియు సందిగ్ధ కాంతి కాలం ఫోటోపీరియడ్ ల మధ్య భేదాలను వ్రాయండి?
జవాబు:

  1. కాంతి వ్యవధి అనేది ఒక రోజులో లభించే కాంతి కాలం.
  2. సందిగ్ధ కాంతికాలం అనగా వివిధ ఋతువులలో జీవులలో కలిగే సంఘటనలు ప్రేరపించడానికి అవసరమయ్యే కాంతి వ్యవధి.

ప్రశ్న 17.
కొన్ని UV కిరణాల వల్ల మనం పొందే లాభాలు తెలపండి. [TS M-16,20][IPE-14]
జవాబు:

  1. UV కిరణాలు జంతువుల దేహం పై గల సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.
  2. UV కిరణాలు చర్మంలో గల స్టిరాల్స్ను విటమిన్ D గా మారుస్తాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 18.
భ్రమణ రూప విక్రియ అంటే ఏమిటి? డాఫ్నియాలో దాని ప్రాముఖ్యం వివరించండి? [APM-19,22][TS May-17]
జవాబు:

  1. భ్రమణ రూప విక్రియ:జీవులలో స్వరూపపరంగా ఋతువులలో వచ్చే చక్రీయ మార్పులను భ్రమణ రూప విక్రియ అంటారు. ఉదా: డాఫ్నియా (వాటర్ ప్లీ).
  2. ప్రాముఖ్యం:డాఫ్నియాలో నీటి సాంద్రతకు అనుగుణంగా మార్పు చెందుట అనేది ఒక అనుకూలనం. శీతాకాలం నందు తలగుండ్రంగా ఉంటుంది. వసంతకాలంలో తల పడగ లాగా పెరగటం ప్రారంభిస్తుంది. వేసవి కాలం వచ్చేసరికి పూర్తి పడగలాగా మారుతుంది. శరదృతువులో దాని పరిమాణం తగ్గడం ప్రారంభిస్తుంది. శీతాకాలనికి తల మళ్లీ గుండ్రంగా మారుతుంది.

ప్రశ్న 19.
నియంత్రకాలు అంటే ఏమిటి?
జవాబు:

  1. నియంత్రకాలు అనేవి జీవులు. ఈ జీవులు నిరంతరం దేహ ఉష్ణోగ్రతను మరియు ద్రవాభిసరణ గాఢతలను స్థిరంగా ఉంచుకుంటాయి. అవి శరీర మరియు ధార్మిక చర్యల ద్వారా సమస్థితిని స్థాపిస్తాయి.
  2. ఉదా: పక్షులు మరియు క్షీరదాలు.

ప్రశ్న 20.
ద్రవాభిసరణ అనువర్తకాలు అంటే ఏమిటి?
జవాబు:

  1. ద్రవాభిసరణ అనువర్తకాలు అనేవి జీవులు. ఇవి వాటి యొక్క దేహ ఉష్ణోగ్రతను పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా మార్చుకుంటాయి. ఉదా: అకశేరుకాలు మరియు నిమ్నస్థాయి సకశేరుకాలు.
  2. జలచర అనురూపకాలు తమ శరీర ద్రవాభిసరణగాఢతను పరిసర ప్రాంత నీటికి అనుగుణంగా మార్చుకుంటాయి.

ప్రశ్న 21.
సహభోజకత్వాన్ని నిర్వచించండి? [AP May-17]
జవాబు:

  1. సహభోజకత్వం అనగా రెండు భిన్న జాతుల మధ్య ఏర్పడే సన్నిహిత సంబంధం. ఇందులో ఒకజీవి లాభం పొందుతుంది. మరో జీవికి ఎటువంటి ప్రభావం ఉండదు.
  2. ఉదా: తిమింగలం వీపుపై ఉండే బర్నాకిలోలు లాభం పొందుతాయి. కాని తిమింగలం ఎలాంటి లాభం పొందదు.

ప్రశ్న 22.
అన్యోన్యాశ్రయ సహజీవనాన్ని నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి? [AP M-15][ TS M-17]
జవాబు:

  1. అన్యోన్యాశ్రయ సహజీవనం రెండు భిన్న జాతుల మధ్య ఏర్పడే సంబంధం. దీనిలో రెండు జాతుల జీవులు లాభం పొందుతాయి.
  2. ఉదా: తేనేటీగలు మరియు పుష్పించే మొక్కలు తేనేటీగలు తేనేను, పుప్పోడి రేణువులను గ్రహిస్తాయి; మొక్కలకు పరాగ సంపర్కం జరుగుతుంది.

ప్రశ్న 23.
ఎమెన్సాలిజమ్ అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:

  1. ఎమెన్సాలిజమ్: ఎమెన్సాలిజమ్ రెండు భిన్న జాతుల మధ్య ఏర్పడే ఒకరకమైన సంబంధం. దీనిలో ఒకజీవి నష్టపోతుంది. మరో జీవికి ఎటువంటి ప్రభావం ఉండదు. ఉదా: మొక్కలపై ఉండే ఐబెక్స్ మరియు వీవిల్స్.
  2. ఐబెక్స్ అనునవి మొక్కల ఆకులపై ఆధారపడి జీవిస్తాయి. వీవిల్స్ అనునవి మొక్కల ఆకులకు అతుక్కొని ఉంటాయి.కావున ఆకులతో పాటు వీవిల్స్ను కూడా తీసుకొనబడతాయి. ఆవిధంగా వీవిల్స్కు హాని జరుగుతుంది కాని ఐబెక్స్ కు కాదు.

ప్రశ్న 24.
జాత్యంతర పోటీ అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:

  1. జాత్యాంతర పోటీ అనేది భిన్న జాతుల మధ్య ఒకే రకమైన వనరు కోసం జరిగే పోటీ .
    ఉదా: ఫ్లెమింగో మరియు చేపలు. ఈ రెండూ ఒకే రకమైన జంతు ప్లవకాల ఆహారం కోసం పోటీ పడతాయి.
  2. ఒక జాతి జీవి ఆహార సేకరణలో అధిక సామర్ధ్యాన్ని కలిగి ఉంటే, రెండవ జాతి జీవి నశిస్తుంది.

ప్రశ్న 25.
కమొఫ్లేజ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:

  1. కమొఫ్లేజ్ అనేది ఒక అనుకూలనం . ఇందులో కొన్ని జంతువులు మరియు కీటకాలు వాటి రంగును పరిసరాలతో కలిసిపోయే విధంగా మార్చుకుంటాయి. కొన్ని సహజంగానే పరిసరాలకు అనుగుణంగా రంగును కలిగి ఉంటాయి. ఉదా: కెమిలీయాన్, పత్రకీటకాలు, చిలకలు.
  2. ప్రాముఖ్యత: జీవులు కమొప్లేజ్ను ప్రదర్శించడం వల్ల పరభక్షకాల నుండి రక్షించుకోబడతాయి.

ప్రశ్న 26.
గాసె సూత్రం అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు అన్వయించవచ్చు?
జవాబు:

  1. గాసె సూత్రం: ఒకే రకమైన వనరు కోసం పోటి పడే రెండు జాతులు ఎక్కువ కాలం కలిసి ఉండలేవు. ఈ పోటీలో కాలక్రమేణా బలహీన జాతులు నశించిపోతాయి.
  2. వనరులు తక్కువగా ఉన్నపుడు మాత్రమే ‘గాసె సూత్రం’ అన్వయించబడుతుంది.

ప్రశ్న 27.
మైకోరైజాలో ఉండే సహవాసం ఏమిటి?
జవాబు:

  1. మైకోరైజాలో అన్యోన్యాశ్రయ సహజీవనం కనిపిస్తుంది. ఇందులో రెండు జీవులూ లాభం పొందుతాయి.
  2. ఉదా: శిలీంధ్రాలు మరియు మొక్కలు. శిలీంధ్రాలు నేల నుంచి ఆవశ్యక పోషక పదార్ధాల శోషణ కోసం మొక్కలకు సహాయపడతాయి. మొక్కలు శిలీంధ్రాలకు శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్లను అందిస్తాయి.

ప్రశ్న 28.
స్థిరజల మరియు ప్రవాహజల ఆవాసాల మధ్య భేదాలను తెల్పండి? [AP M-18]
జవాబు:

  1. స్థిరజలఆవాసం:నీరు నిలకడగా ఉండే చెరువులు, సరస్సులు మరియు జలాశయాలను స్థిరజల ఆవాసాలు అంటారు.
  2. ప్రవాహజల ఆవాసం: నీటిప్రవాహం ఉండే కాలువలు మరియు నదులను ప్రవాహజల ఆవాసాలు అని అంటారు.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం 1

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 29.
నీటి ఆవరణ వ్యవస్థలో ప్రతీకరణ మండలము అంటే ఏమిటి?
జవాబు:

  1. ప్రతీకరణ మండలము (పరిహర మండలం): వేలాంచల మండలాన్ని మరియు ప్రొఫండల్ మండలాన్ని వేరు చేసే ఊహజనిత రేఖను ‘పరిహర మండలం’ అని అంటారు.
  2. పరిహర మండలంలో, కిరణజన్య సంయోగ క్రియా రేటు శ్వాసక్రియా రేటుకి సమానంగా ఉంటుంది.

ప్రశ్న 30.
వృక్ష ప్లవకాలు మరియు జంతుప్లవకాలు మధ్య భేదాలను రాయండి?
జవాబు:

  1. నీటిలో తేలియాడుతూ పత్రహరితాన్ని కలిగిన సూక్ష్మజీవులను వృక్షప్లవకాలు అంటారు. ఉదా: డయాటమ్స్ ఆకుపచ్చ శైవలాలు, యూగ్లీనాయిడ్స్ మరియు డైనోప్లాజెల్లేట్స్.
  2. నీటిలో తేలియాడుతూ పత్రహరితాన్ని లేనటువంటి సూక్ష్మజీవులను జంతుప్లవకాలు అంటారు. ఉదా: వాటర్ ప్లీస్, కోటిఫర్లు మరియు ఆస్ట్రకాడ్స్.

ప్రశ్న 31.
న్యూస్టాన్ మరియు నెక్టాన్ల మధ్య భేదాలను తెల్పండి?
జవాబు:

  1. న్యూస్టాన్: ‘గాలీ నీరు’ కలిసేచోట నివసించే జంతువులను ‘న్యూస్టాన్’ అంటారు.
    ఉదా1: వాటర్ స్పైడర్స్ బీటిల్స్ మరియు వాటర్ బగ్స్ (నీటి ఉపరితలం పై నివశిస్తాయి) ఉదా2: దోమడింభకాలు (నీటి ఉపరితలం దిగువన నివశిస్తాయి)
  2. నెక్టాన్: నీటిలో ఈదగలిగే జీవులను ‘నెక్టాన్లు’ అంటారు.
    ఉదా: చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు.

ప్రశ్న 32.
పెరిఫైటాన్ అంటే ఏమిటి?
జవాబు:

  1. నీటి మొక్కల పై (లేదా) వాటిని అంటి పెట్టుకొని ఉండే జలచర మొక్కలను ‘పెరిఫైటాన్’ అంటారు.
  2. ఉదా: బ్రయోజోవన్స్, టర్బల్గేరియన్స్, హైడ్రాలు, డింభకాలు.

ప్రశ్న 33.
మానవ నిర్మిత జీవావరణ వ్యవస్థలకు మూడు ఉదాహరణలు ఇవ్వండి? [AP M-17]
జవాబు:
మానవ నిర్మిత కృత్రిమ జీవావరణ వ్యవస్థలు

  1. పంట భూమి జీవావర్ణం
  2. జలసంవర్ధన చెరువులు
  3. ఎక్వేరియం

ప్రశ్న 34.
ద్రవాభిసరణ పోషణ అంటే ఏమిటి?
జవాబు:

  1. జీవులు తమ శరీర త్వచాల ద్వారా ‘ ముందుగానే జీర్ణమై ఉన్న ఆహారాన్ని’ చుట్టు ప్రక్కల నుంచి గ్రహించే పోషణ విధానాన్ని ద్రవాభిసరణ పోషణ అని అంటారు.
  2. ఉదా: శిలీంధ్రాలు తమ ఎంజైముల ద్వారా ‘చనిపోయిన మరియు వ్యర్ధ పదార్ధాలను విచ్ఛిన్నం చేసి’ ఆ తరువాత శోషిస్తాయి.

ప్రశ్న 35.
విక్షాళన ప్రక్రియను వివరించండి?
జవాబు:
విక్షాళన ప్రక్రియ అంటే నీటిలో కరిగే అకర్బన పోషక పదార్థాలు నేలలోకి చేరి ‘లభ్యంకాని లవణ అవక్షేపాలు’ గా విక్షేపం చెందటం.

ప్రశ్న 36.
PAR అంటే ఏమిటి?
జవాబు:

  1. PAR అనగా మొక్కలు కిరణజన్యసంయోగ క్రియ కోసం వినియోగించుకునే క్రియాశీలక సూర్యకాంతి వికిరణం. మొక్కలు 2-10% PAR ను మాత్రమే గ్రహిస్తాయి
  2. పతన సౌర వికిరణంలో PAR శాతం 50% కంటే తక్కువ

ప్రశ్న 37.
పతన సౌర వికిరణంలో PAR శాతం ఎంత?
జవాబు:
పతన సౌర వికిరణంలో PAR శాతం 50% కంటే తక్కువ.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 38.
ఎంట్రోపీని నిర్వచించండి?
జవాబు:
ఎంట్రోపీ అంటే ‘పనికిరాని శక్తి’.
ఒక వ్యవస్థ శక్తి మార్పిడికి లోనయ్యే ప్రక్రియలో కొంత శక్తిని ‘ఉష్ణశక్తి రూపంలో నష్టపోతుంది’. అలా నష్టపోయే
శక్తినే ఎంట్రోపీ అంటారు.

ప్రశ్న 39.
స్టాండింగ్ క్రాప్ అంటే ఏమిటి?
జవాబు:

  1. ఒక నిర్ణీత కాలంలో ప్రతి పోషక స్థాయిలో ఉండే నిర్ణీత జీవ ద్రవ్యరాశిని ‘స్టాండింగ్ క్రాప్ ‘ అంటారు.
  2. దీనిని ప్రామాణిక వైశాల్యంలో ఉండే జంతుజాలం యొక్క సంఖ్య ద్వారా కొలుస్తారు.

ప్రశ్న 40.
GPP, NPP పదాలను వివరించండి?
జవాబు:

  1. GPP అనగా స్థూల ప్రాధమిక ఉత్పాదకత . ఇది కిరణజన్యసంయోగ క్రియలో కర్బన పదార్ధ ఉత్పత్తి రేటు.
  2. NPP అనగా మిగులు ప్రాధమిక ఉత్పాదకత స్థూల ప్రాధమిక ఉత్పాదకత నుంచి శ్వాసక్రియలో (R) కోల్పోయినది. సూత్రం: NPP = GPP- R

ప్రశ్న 41.
నిటారు,తిరగబడిన జీవావరణ పిరమిడ్ల మధ్య తేడా తెలపండి?
జవాబు:

  1. జీవావరణ పిరమిడ్లలో, ‘సంఖ్య, జీవద్రవ్యరాశి, శక్తి’ అనేవి ఎక్కువ పోషకస్థాయి నుంచి తక్కువ పోషకస్థాయికి తగ్గితే వాటిని నిటారు పిరమిడ్లు అంటారు. ఉదా: శక్తి పిరమిడ్
  2. జీవావరణ పిరమిడ్లలో ‘సంఖ్య, జీవద్రవ్యరాశి, శక్తి’ అనే తక్కువ పోషక స్థాయి నుంచి ఎక్కువ పోషకస్థాయికి పెరిగితే వాటిని తల్లకిందులు పిరమిడ్ అంటారు . ఉదా: పరాన్న జీవుల ఆహారపు గొలుసులో ‘సంఖ్యా పిరమిడ్’.

ప్రశ్న 42.
లిట్టర్ మరియు డేట్రిటన్ల మధ్య భేదాలు తెల్పండి?
జవాబు:

  1. లిట్టర్:ఇది సహజంగా రాలిన ఆకులు మరియు విరిగిన కొమ్మల సమూహం.
  2. డెట్రిటస్: చనిపోయిన జంతువులు, కుళ్ళిన ఆకులు మరియు జంతువుల విసర్జనలతో కుళ్లి ఏర్పడిన హ్యుమస్.

ప్రశ్న 43.
ప్రాధమిక మరియు ద్వితీయ ఉత్పాదికత మధ్య భేదాలను తెల్పండి?
జవాబు:

  1. నిర్ణీత కాలంలో నిర్ణీత వైశాల్యంలో మొక్కల కిరణజన్యసంయోగ క్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన జీవద్రవ్యరాశి లేదా కర్బన పదార్ధాన్ని ‘ప్రాధమిక ఉత్పాదకత ‘ అంటారు.
  2. ఉత్పత్తిదారుల నుండి గ్రహించిన పదార్థాల నుంచి వినియోగదారులు కొత్తగా కర్బన పదార్థాలను ఏర్పరచే రేటును ‘ద్వితీయ ఉత్పాదకత ‘ అంటారు.

ప్రశ్న 44.
ఆమ్ల వర్షాలకు కారకాలైన వాయు కాలుష్యాలు ఏమిటి? [AP M-16]
జవాబు:

  1. సల్ఫర్ డైఆక్సైడ్ (SO2) మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ (NO2) లు ఆమ్ల వర్షాలకు కారణమయ్యే ప్రధాన వాయుకాలుష్యాలు.
  2. ఆమ్ల వర్షాల కారణంగా సరస్సులు, కాలువలు ఆమ్లయుతంగా మారతాయి. భవనాలు మరియు చరిత్ర కట్టడాలు బీటలు వారి శిధిలమవుతాయి.

ప్రశ్న 45.
BOD అంటే ఏమిటి? [AP M-18]
జవాబు:

  1. BOD అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఇది మురుగు నీటికాలువలో వున్న కాలుష్య స్థాయిని సూచిస్తుంది.
  2. మురుగు నీటిలో నిర్ధిష్ట ఉష్ణోగ్రత కాల వ్యవధిలో, సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావలసిన వాయు సహిత జీవులకు అవసరమయ్యే ఆక్సిజన్ స్థాయిని BOD సూచిస్తుంది.

ప్రశ్న 46.
జీవావర్ధనం అంటే ఏమిటి? [AP M-20]
జవాబు:

  1. నీటి ఆహార గొలుసులో కాలుష్యం’ఒక ఉన్నత పోషకస్థాయిలో పెరుగుతూ పోతే దాన్ని ‘జీవా వర్ధనం’ అంటారు.
  2. ఉదా: DDT గాఢత నీటిలో 0.003 ppb ఇది జీవావర్ధనం ద్వారా చేపలు తినే పక్షుల ద్వారా 5 ppm కు చేరింది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 47.
ఆసుపత్రులలో భస్మీకరణ యంత్రాలను ఎందుకు వాడతారు?
జవాబు:

  1. ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలలో క్రిమిసంహరిణులు, రసాయనాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. భస్మీకరణకు ముందే వీటిని శుద్ధి చేయాలి లేనిచో ఇవి చుట్టు ప్రక్కల కాలుష్యాన్ని కలిగిస్తాయి.
  2. భస్మీకరణ యంత్రాలను ఆసుపత్రులలో వ్యర్థాలను తొలగించడానికి వాడతారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
అంతర వాతావరణం వల్ల కలిగే లాభాల దృష్ట్యా ‘అనుకారులు క్రమతాకారులుగా ఎందుకు పరిణామం చెందలేదు’ అని ఎందుకు అడుగుతాం?
జవాబు:

  1. రెండు ముఖ్య సమూహాలైన పక్షులు మరియు క్షీరదాలు మాత్రమే క్రమతాకారులుగా పరిణామం చెందాయి. మిగిలిన సమూహాలు అనుకారులుగానే ఉండిపోయాయి.
  2. జంతువులలో అధికంగా ఉన్నవి జలచర జీవులే. వీటికి ఉష్ణోగ్రత నియంత్రణ కొరకు ద్రవాభిసరణ నియంత్రణ అవసరం.
  3. భూచర జీవులలో ఉష్ణోగ్రత నియంత్రణ మాత్రం తప్పనిసరి. ఉభయచరాలు కొంత వరకు జలచరాలే.
  4. సరీసృపాలు ఉష్ణోగ్రత మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో నివసించే గలిగే జీవులు. ఇవి అధిక ఉష్ణోగ్రతను అధిగమించటానికి పారిపోవటం లేదా దాక్కోవటం చేస్తాయి.
  5. చిన్న జీవులలో ఉష్ణనియంత్రణ అనేది చాలా ఖరీదైంది.
  6. చిన్న జీవులలో సాపేక్ష ఉపరితల వైశాల్యం ఎక్కువ కావున అవి దేహం నుంచి ఉష్ణాన్ని త్వరగా కోల్పోతాయి.
  7. స్థిర ఉష్ణోగ్రత కొరకు ఆ జీవులు ఎక్కువ శక్తి ఖర్చు చేయాల్సి వస్తుంది.
  8. ఒక వేళ ఒత్తిడితో కూడిన బాహ్యపరిస్థితులు స్థానికమైనా లేదా కొద్ది కాలం మాత్రమే ఉన్నప్పుడు, జీవులు వలసపోవడము లేదా తక్కువ జీవక్రియా రేటును చూపించడం చేస్తాయి.
  9. ఈ విధంగా కొన్ని జాతులు వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా కొంత మేర నియంత్రణ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాయి. అలా చేయలేకపోయినవి అనురూపకాలుగా ఉండిపోయాయి.

ప్రశ్న 2.
మంచులో దీర్ఘకాలం కూరుకుపోయిన వారిని పునరుద్ధరించడం సాధ్యమేనా? వివరించండి
జవాబు:

  1. మంచు నందు కూరుకుపోయి వ్యక్తి ‘శీతలస్పృహలేమికి’ గురి అవుతారు. శీతల నీటిలో ఉన్నంత వరకు వారు కోమానందే ఉంటారు.
  2. ఉష్ణోగ్రతను నిదానంగా కనిష్ఠ ప్రభావ ఉష్ణోగ్రత నుంచి గరిష్ఠ ప్రభావ ఉష్ణోగ్రత వరకు పెంచుతువుంటే ఆ వ్యక్తి యొక్క జీవక్రియలు ప్రారంభమై బ్రతికే అవకాశాలు కొన్ని సందర్భాలలో మాత్రమే ఉంటాయి.
  3. జీవన చర్యల నిలుపుదల అనేది నిమ్నస్థాయి జలచర జీవులలో సాధ్యపడుతుంది. కాని వాయు శ్వాసక్రియ జరిపే జీవులలో సాధ్యపడదు.

ప్రశ్న 3.
గ్రీష్మకాల స్తరీభవనం అంటే ఏమిటి వివరించండి. [TS M-20][TS May-17] [AP M-18,20]
జవాబు:
గ్రీష్మకాల స్తరీభవనం: గ్రీష్మకాలం నందు సమశీతోష్ణ సరస్సులలో మూడు నీటి పొరలు ఏర్పడటాన్ని గ్రీష్మకాల స్తరీభవనం అంటారు.
గ్రీష్మకాలం నందు సరస్సులలో ఉష్ణోగ్రత 25°C వరకు పెరుగుతుంది. అపుడు నీటి వలయాలు ఏర్పడి, తద్వారా మూడు పొరలు ఏర్పడతాయి. అది

  1. ఎపిలిమ్నియాన్
  2. మెటాలిమ్నియాన్
  3. హైపోలిమ్నియాన్

1. ఎపిలిమ్నియాన్: ఉష్ణోగ్రత 21°C నుండి 25°C మధ్యలో ఉండి, ఉపరితలం వెచ్చగా, ఆక్సిజన్లో నిండి ఉన్న. పొరను ‘ఎపిలిమ్నియాన్’ అంటారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

2. మెటాలిమ్నియాన్ ఎపిలిమ్నియాన్ దిగువ పొరను ధర్మోక్లైన్ (లేదా) ‘మెటాలిమ్నియాన్’ అంటారు ఇక్కడ ఉష్ణోగ్రత మీటరుకు 1°C చొప్పున తగ్గుతూ ఉంటుంది.

3. హైపోలిమ్నియాన్: 7°C ఉష్ణోగ్రత ఉన్న అడుగు పొరను ‘హైపోలిమ్నియాన్’ అంటారు. ఇక్కడ నీరు నిలకడగా, చల్లగా, అధిక పోషణ మరియు కిరణజన్య సంయోగక్రియ ఉండనందున తక్కువ ఆక్సిజన్తో ఉంటుంది.

  • గ్రీష్మకాల స్ధరీభవనం ‘శరదృతువు తారుమారు’ను అనుసరిస్తుంది.
  • శరదృతువులో ఉపరితల నీటి ఉష్ణోగ్రత 4°C కు పడిపోతుంది.
  • 4°Cకు నీటి ఉష్ణోగ్రత చేరగానే నీటి భారం పెరుగుతుంది, పైపొర కిందకు కుంగుతుంది. అధిక పోషకాలు ఉన్న అడుగుభాగం ఉపపరితలంకు చేరుతుంది. ఈ విధమైన ప్రసరణను ‘శరదృతువు తారుమారు ‘ అంటారు.
  • ఈ ‘శరదృతువు తారుమారు’ వలన సరస్సునందు సమ ఉష్ణోగ్రత పోషకాల సమ సరఫరా మరియు ఆక్సిజన్ సమం అనేది జరుగుతుంది.

ప్రశ్న 4.
సరస్సులలో స్తరీభవనం ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
సరస్సులలో స్తరీభవనం ప్రాముఖ్యం:

  1. సమశీతోష్ణ ప్రాంతాలతో రుతువుల మార్పువలన ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు నీటిలో ఉష్ణస్తరాలను ఏర్పరుస్తాయి. ఈ విధానాన్ని ఉష్ణస్తరీభవనం అంటారు.
  2. నీరు 4°C వద్ద గరిష్ట సాంద్రతను కల్గివుంటుంది. వేసవికాలం నందు ఉపరితల నీటి యొక్క ఉష్ణోగ్రత 25°C
    వరకు పెరుగుతుంది.
  3. నీటి పై పొరను ఎపిలిమ్నియాన్, మధ్యపొరను మోటాలిమ్నియాన్, ఆఖరి పొరను హైపోలిమ్నియాన్ అంటారు.
  4. శరదృతువు నందు ఉపరితల నీటి ఉష్ణోగ్రత 4°C కు పడిపోతుంది. నీరు బరువుగా ఉండి అడుగు భాగంకు చేరుతుంది. పోషక పదార్థాలతో కల అడుగు భాగం ఉపరితలం చేరుతుంది. ఈ రకమైన నీటి ప్రసరణను ‘శరదృతువు తారుమారు’ అంటారు.
  5. శీతాకాలం నందు ఉపరితల నీటి ఉష్ణోగ్రత 4°C కు పడిపోయి మంచుగా మారుతుంది. ఈ మంచు దిగువన నీరు ఉంటుంది. అటువంటి నీటిలో నివశించే జీవులు ఆక్సిజన్ వినియోగం రేటును, జీవక్రియారేటును తగ్గించుకొని శీతాకాలం నందు మనుగడ సాగిస్తాయి.
  6. వసంత కాలంలో మంచు నీరుగా మారి క్రిందుకు కుంగి అడుగుభాగాన ఉన్న పోషక పదార్ధాలు పొరను పైకి తీసుకువస్తుంది. దీనినే ‘వసంత ఋతు తారుమారు’ అంటారు.
  7. ఈ విధమైన స్తరీ భవనాలు’ మరియు ‘తారుమారులు’ వలన ఆక్సిజన్ మరియు పోషక పదార్థాల తిరిగి పంపిణి చేయుట జరిగి జీవులు అన్ని దశల యందు మనుగడను సాగించగల్గుతున్నాయి.

ప్రశ్న 5.
వాస్ట్ హాఫ్ సూత్రాన్ని వివరించండి
జవాబు:

  1. వాన్ట్ హాఫ్ సూత్రం ప్రకారం ప్రతి 10°C ల ఉష్ణోగ్రత పెరుగుదల వలన జీవి యొక్క జీవక్రియా రేటు రెట్టింపవుతుంది.
  2. ఇదే విలోమంగా, ప్రతి 10°C ల ఉష్ణోగ్రత తగ్గుదల వలన జీవ క్రియా రేటు సగమవుతుంది.
  3. జీవ క్రియా రేటు మీద ఉష్ణోగ్రత చూపే ప్రభావాన్ని ఉష్ణోగ్రతా కోఎఫిషియంట్ Q10 తో సూచిస్తారు.
  4. Q10 అనేది X°C వద్ద చర్యారేటు మరియు (X-10°C) వద్ద చర్యారేటు ల మధ్య నిష్పత్తి.
  5. జీవించే జీవులలో Q10 విలువ సుమారు 2.0. అంటే జీవక్రియా రేటు ప్రతి 10°C ఉష్ణోగ్రతకు రెట్టింపవుతుంది.

ప్రశ్న 6.
ఉష్ణోగ్రతా మార్పులను క్షీరదాలు సహించినట్టు సరీసృపాలు సహించలేవు. అవి ఎడారిలో సార్థక జీవనానికి పరిస్థితులకు అనుగుణంగా ఏవిధంగా మార్పు చేసుకొంటాయి?
జవాబు:

  1. సరీసృపాలు శీతలరక్త జంతువులు ఉదా: మొసళ్ళు,బల్లులు
  2. వాటి దేహం ఉష్ణోగ్రతలను పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా కొంత వరకు మార్చుకుంటూ స్థిరంగా ఉంచుకుంటాయి.
  3. ఉష్ణోగ్రత తగ్గినపుడు సూర్యరశ్మి సోకేటట్లు బయటకి వస్తాయి.
  4. ఉష్ణోగ్రత పెరిగినపుడు నీడలోకి (లేదా) బోరియలలోకి చేరుకుంటాయి.
  5. ఎడారి బల్లులు ఉష్ణోగ్రత తగ్గినపుడు, సూర్యరశ్మి తాకేటట్లుగా ఉంటాయి.
  6. పరిసరాల ఉష్ణోగ్రతలు వాటి శరీర ఉష్ణోగ్రత కన్నా అధికమైనపుడు అవి నీడలోకి లేదా బోరియలలోకి చేరుకుంటాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 7.
భౌమ్య జీవులు నిర్జలీకరణ ప్రమాదాల నుంచి ఏవిధంగా రక్షించుకొంటాయి? [TS MAY-22]
జవాబు:

  1. దేహానికి నీరు ఎంతో అవసరమైన పదార్థం.
  2. కావున ఏవిధమైన నీటి తగ్గుదల అయినా దేహ నిర్జలీకరణకు దారితీసి ఆ జీవి మరణించేలా చేస్తుంది.
  3. జంతువులు నీటి సంరక్షణ కొరకు అనేక అనుకూలాలను చేసుకుని వుంటాయి.
  4. కొన్ని ఎడారి జీవులు నిర్జలీకరణను నిరోధించేందుకు రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి.
  5. సరీసృపాల చర్మం పొడిగా, పొలుసు యుతంగా ఉండి నీటి వృధాను అరికడుతుంది.
  6. పక్షుల చర్మం కూడా పొడిగా వుండి నీటిని కోల్పోవటాన్ని అరికడుతుంది.
  7. కీటకాలు (ఆర్థ్రోపోడ్స్) నీటిని అరికట్టుటకు అవభాసినిని కల్గివుంటాయి.
  8. పై జీవ సముహలు అన్ని విసర్జక పదార్ధాన్ని ‘యూరిక్ ఆమ్లం’ రూపంలో విడుదల చేస్తాయి.

ప్రశ్న 8.
సముద్ర జంతువులు అధిక గాఢత జలానికి ఏ విధంగా అనుకూలనం ఏర్పరచుకొంటాయి?
జవాబు:

  1. సముద్రపు నీటిలో లవణ గాఢత, దేహ ద్రవ్యాల గాఢతతో పోల్చినపుడు ఎక్కువగా వుంటుంది.
  2. కావున సముద్ర జంతువుల దేహం నుంచి నీరు నిరంతరంగా బాహ్యుద్రవాభిసరణ ద్వారా వెలుపలికి వెళుతుంది.
  3. ఈ సమస్యను అధిగమించేందుకు, సముద్రపు చేపలలో ఎగ్లామేరూలార్ మూత్రపిండాలు తక్కువ సంఖ్యలో వృక్క ప్రమాణాలు కలిగినవి ఉంటాయి. వీటివల్ల మూత్రం ద్వారా నీటి నష్టాన్ని తగ్గించవచ్చు.
    నష్టపోయిన నీటిని భర్తి చేసేందుకు తిరిగి నీటిని త్రాగడం చేస్తుంది. దీనివల్ల ఉప్పు శాతం పెరుగుతుంది. ఈ అధిక ఉప్పును తగ్గించుటకు మొప్పల యందు లవణాన్ని స్రవించే కణాలు ఉంటాయి.
  4. అనేక సముద్రజీవులలో ఆహరంతో పాటుగా లవణం కూడా దేహంలోకి చేరుతుంది.
  5. ఈ లవణాలను తొలగించుటకు, సీగల్స్ మరియు పెంగ్విన్లలో లవణాలను స్రవించే కణాలు ముక్కు ద్వారా లవణ బొట్లను విడుదల చేస్తాయి.
  6. సముద్ర తాబేళ్ళు మరియు క్రొకొడైల్స్ నందు ఈ లవణగ్రంధులు నేత్రాల వద్ద ఉండి లవణ బొట్లను విడుదల చేస్తాయి.
  7. మృదులాస్థి చేపలు తమ కణజాలలో యూరియాను నిల్వవుంచుకుని, దేహ సమతుల్యతను సముద్రపు నీటితో సమం చేసుకుంటాయి.

ప్రశ్న 9.
స్వాదుజల జీవుల అనుకూలనాల రకాలను తెలపండి.
జవాబు:
మంచినీటి జీవులు అంతర ద్రవాభిసరణకు అనుగుణంగా అనేక అనుకూలనాలను కల్గి ఉంటాయి. మంచి నీటిలో ద్రవాభిసరణ పీడనం, జంతు దేహంలోని ద్రవాలలో ద్రవాభిసరణ పీడనం కన్నా తక్కువ. కావున నీరు అంతర ద్రవాభిసరణ ద్వారా దేహంలోకి ప్రవేశిస్తుంది.
మంచినీటి జీవుల అనుకూలనాలు:

  1. మంచినీటి ప్రోటోజోవా జీవులు సంకోచరిక్తికల ద్వారా అధిక నీటిని దేహం వెలుపలికి విడుదల చేస్తాయి.
  2. మంచినీటి చేపలలో బాగా అభివృద్ధి చెందిన రక్తకేశనాళికా గుచ్ఛ మూత్రపిండాల మూత్రం ద్వారా అధిక నీటిని బయటకు విడుదల చేస్తాయి.
  3. వేసవికాలం నందు అధికంగా కుంటలు ఎండిపోతాయి. దీన్ని అధిగమించుటకు ప్రోటోజోవా జీవులు ‘కోశీభవనాన్ని’ అభివృద్ధి చేసుకుంటాయి.
  4. మంచినీటి స్పంజికలు జెమ్యూల్స్ను ఏర్పరుచుకొని, వేసవికాలంలో మనుగడ సాగిస్తాయి.
  5. ‘ఆఫ్రికన్ ఊపరితిత్తి చేప’ వేసవికాలంలో మనుగడ కోసం జిగట పదార్ధ కోశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 10.
మంచినీటి, సముద్రనీటి జీవనానికి జంతువులు ఏ విధంగా అనుకూలనాలను కల్గి ఉంటాయో పోల్చండి. [TS M-16]
జవాబు:
మంచినీటి జీవుల అనుకూలనాలు:

  1. మంచినీటి జీవులు అంతర ద్రవాభిసరణలో పాల్గొంటాయి.
  2. మంచినీటి జీవులు రక్తకేశనాళికాగుచ్ఛ మూత్రపిండాల ద్వారా అధిక నీటిని దేహం నుంచి మూత్రం రూపంలో తొలగిస్తాయి.
  3. మంచినీటి స్పంజికలు జెమ్యూల్స్ను ఏర్పరుచుకొని, వేసవికాలంలో మూత్రం రూపంలో తొలగిస్తాయి.
  4. ఆఫ్రికన్ ఊపిరితిత్తిచేప వేసవికాలంలో మనుగడ కోసం జిగట పదార్ధకోశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.

సముద్ర జీవుల అనుకూలనాలు:

  1. సముద్రపు నీటిలో లవణ గాఢత దేహద్రవ్యాల గాఢత కంటే ఎక్కువ కావున, సముద్రపు జీవులు దేహం నుంచి నిరంతరం బాహ్య. ద్రవాభిసరణ ద్వారా నీరు బయటకు వెళుతుంది.
  2. సముద్రపు జీవులలో వృక్క ప్రమాణాలు తక్కువగా నున్న రక్తకేశ నాళికాగుచ్ఛరహిత మూత్రపిండాలు మరియు లవణాలను స్రవించే క్లోరైడ్ కణాలు మొప్పలలో ఉన్నాయి.
  3. సాగర పక్షులు మరియు పెంగ్విన్స్ నాసికానాళాల నుంచి లవణద్రవం చుక్కలుగా విడుదల చేస్తాయి.
  4. షార్క్ చేపలు యూరియా మరియు ట్రైమిధైలో అమైన్ ఆక్సైడ్లను నిల్వఉంచుకొని దేహద్రవ్యాలను సాగర నీటితో సమంగా చేస్తాయి.

ప్రశ్న 11.
యూరిహేలైన్, స్టీనోహేలైన్ జంతువుల మధ్య తేడాలను వివరించండి. [TS MAY-22]
జవాబు:
1. యూరిహెలైన్ లేదా వ్యాపిత లవణీయ జంతువులు అధిక లవణీయత మార్పులను తట్టుకోవడానికి అనుకూలనాలను కలిగి ఉంటాయి.
ఉదా: సాల్మన్, హిల్సా వంటి ఉప్పునీటి కయ్య చేపలు, చిన్న చిన్న మంచి నీటి అలలు మరియు పెద్ద పెద్ద ఉప్పు నీటి అలలను తట్టుకుంటాయి. వలస చేపలు సముద్రం నుంచి మంచినీటి ఆవాసాల్లోకి ప్రజననం కొరకు వెళ్ళతాయి.

2. స్టీనో హెలైన్ (లేదా) మిత లవణీయత జంతువులు: ఇవి లవణీయత వ్యత్యాసాలను తట్టుకోలేవు.
ఉదా: సముద్రపు చేపలను మంచినీటిలో ఉంచినపుడు మరియు మంచినీటి చేపలను సముద్రపు నీటిలో ఉంచినపుడు అవి లవణీయత వ్యత్యాసాలను తట్టుకోలేక చనిపోతాయి.

ప్రశ్న 12.
అధిక ఎత్తు గల హిమాలయ ప్రాంతాలలో నివసించే అనేక తెగలలో మైదానాలలోనివసించేవారిలో కంటే సాధారణంగా ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ మోతాదు అధికంగా ఉంటుంది. వివరించండి.
జవాబు:

  1. టిబెట్కు దగ్గరగా అనగా ‘రోహంతాంగ్ మనాలీ’ మరియు ‘మానస సరోవరం’ వంటి ఎత్తైన ప్రాంతాలలో నివసించే సాధారణ ప్రజలు ‘ఆల్టిట్యూడ్ సిక్ నెస్’ కు లోనవుతారు.
  2. దీని లక్షణాలు: నాసియా, అలసట మరియు హృదయ స్పందనలో అనూహ్య మార్పులు అనేవి దీనికి కారణం ఎత్తైన వాతావరణంలో తక్కువ ఆక్సిజన్ మరియు తక్కువ పీడనం ఉండటం.
  3. కొన్ని వేల సంవత్సరాల నుంచి నివశిస్తున్న కొన్ని తెగల ప్రజలు, దీనికి అలవాటు పడి, ఆల్టిట్యూడ్ సిక్నెస్ కు లోనుకారు.
  4. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచడం మరియు శ్వాసక్రియా రేటును పెంచడం ద్వారా వారి శరీరం తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేస్తుంది.

ప్రశ్న 13.
ఒక మామిడి చెట్టుకు, దానిపై పెరిగే ఆర్కిడ్ మొక్క మధ్య పరస్పర చర్యను వివరించండి.
జవాబు:

  1. మామిడి మరియు ఆర్కిడ్ మధ్య ఉండే ప్రత్యేక అంతర బంధాన్ని ‘సహభోజకత్వం’ అంటారు.
  2. ఆర్కిడ్ అనేది ఎపిఫైట్ మొక్క ఇది మామిడి చెట్టు పెద్ద కొమ్మలపై ఉండటం వల్ల, సూర్యరశ్మిని పొందుతుంది.
  3. దీని వల్ల మామిడి చెట్టు నష్టపోదు, లాభపడదు.
  4. ఆర్కిడ్, మామిడి చెట్టుకు అతిధిగా సహభోజకంగా ఉంటుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 14.
జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో ‘పరజీవ భక్షణ’ ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివరించండి.
జవాబు:
1. సమాజంలో జాతుల వైవిధ్యాన్ని నిర్వహించుటలో పరభక్షికాలు తోడ్పడతాయి. భోజ్యజాతుల మధ్య పోటీ తీవ్రత సాంద్రతను తగ్గించుట ద్వారా ఇది సాధ్యపడుతుంది.
ఉదా: అమెరికా, పసిఫిక్ తీరప్రాంతాలలోని ‘రాతిమయ అలల’ మధ్య సమూహాలు.

2. సముద్ర నక్షత్రం పిసాస్టర్ ఒక ముఖ్యమైన పరభక్షజీవి . ఒక క్షేత్ర పరిశోధనలో సముద్ర నక్షత్రాలన్నింటిని రాతి మయ ప్రాంతం నుంచి తొలిగించారు. దీని వలన ఒక నిర్దిష్ట సమయం (ఒక సంవత్సరం) తరువాత 10 జాతుల కంటే ఎక్కువ భోజ్యజీవులు అంతరించిపోయాయి.

3. పరభక్ష జీవి లేకపోవటం వల్ల జీవుల మధ్య జాత్యంతర తీవ్ర పోటీతత్వం పెరిగి, 10 కంటే ఎక్కువ జాతులు పోటీ మధ్య మనుగడ సాగించ లేక అంతరించిపోయాయి.

4. పరభక్ష జీవి ఉన్నట్లయితే అది అన్ని రకాల ఆహరజీవులను సమానంగా భుజించి వాటి సంఖ్యను సమన్వయపరిచేది. దాని వలన అన్ని రకాల ఆహారజీవుల జాతులు మనుగడ సాగించగలిగేవి.

ప్రశ్న 15.
వినాశాకార కీటకాల జీవనియంత్రణ పద్ధతి వెనుక ఉన్న జీవ సూత్రం ఏమిటి?
జవాబు:

  1. వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులను ఆహారజీవి జనాభాలను నియంత్రించే ‘భక్షకజీవుల సామర్ధ్యాన్ని’ ఆధారంగా వినియోగిస్తారు.
  2. దీనిలో ఉన్న ముఖ్య సూత్రం ‘ పరభక్ష కత్వం’.
  3. పరభక్షి ఆహార స్థాయిల ద్వారా ‘శక్తి ప్రసరణను నియంత్రణలో ఉంచుతాయి’.
  4. పరభక్షిలేని సమయంలో ఆహారజీవులు అధిక జనాభా సాంద్రతకు చేరుకోవడం వల్ల జీవావరణ వ్యవస్థలో అస్థిరత్వం వస్తుంది.
  5. పరభక్షక జీవులు ద్వారా జీవనియంత్రణకు ఉదాహరణ కనుగొనుటకు ఆకులు, ముల్లులు లేని నిర్మాణం కలిగిన పియర్ కాక్టస్ మొక్కలను 1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు.
  6. అది వేగంగా పెరిగి మిలియన్ల హెక్టార్ల భూమిని అస్త్యవస్థ పరిచింది.
  7. చివరికి అపాయకరంగా వ్యాపిస్తున్న కాక్టస్ను నియంత్రించడానికి, కాక్టస్ను ఆహారంగా తీసుకునే పరభక్షి (మిడతను) ప్రవేశపెట్టారు.
  8. ఈ విధంగా పరజీవ భక్షక జీవులు నియంత్రణకారులుగా పని చేస్తాయి.

ప్రశ్న 16.
పోటీ బహిష్కరణను చర్చించండి?
జవాబు:
1. పోటీ బహిష్కరణ: జాతుల మధ్య ఉండే పోటీ అనేది ‘పోటీ తత్వ విడుదల’ అనే సిద్ధాంతం ద్వారా చెప్పవచ్చు. పోటీ పడే రెండు జాతులలో ఒక జాతి జీవులను ఆ ప్రాంతం నుంచి తొలగించటం ద్వారా వేరే జాతి జీవులు వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అనగా పెరుగుదలను తగ్గించే జీవులను విడుదల చేయడం జరుగుతుంది.

2. చిన్న ప్రాంతానికి మాత్రమే విస్తరించిన ఒక జాతి పోటీతత్వ విడుదలకు లోనయినపుడు నాటికీయంగా అవి వాటి విస్తరణను పెంచుకుంటాయి.
ఉదా: బెలానస్ అనేది స్కాట్లాండ్లోని సాగరరాతి అలల ప్రాంతాన్ని అధిగమిస్తుంది. ప్రయోగాత్మకంగా బెలానస్ ను తొలిగించినపుడు చిన్న బర్నాకిల్ కెటధామలస్ దాని జనాభాను బాగా వృద్ధి చేసుకుంది.
సాధారణంగా మాంసాహారుల కంటే శాకాహారజీవులు మరియు మొక్కలు ఎక్కువగా ఈ ప్రభావానికి గురి అవుతాయి.

ప్రశ్న 17.
పరాన్నజీవుల అననుకూలనాల మీద సంక్షిప్త వ్యాఖ్య రాయండి.
జవాబు:
పరాన్న జీవనం విజయవంతంగా ఉండటానికి పరాన్న జీవులు ప్రత్యేకమైన ‘అనుకూలనాలను’ ఏర్పరచుకొన్నాయి.
అవి

  1. జ్ఞానావయవాలు కోల్పోవడం. అతిథేయిలో ఉన్నపుడు వాటి అవసరం ఎక్కువగా ఉండదు.
  2. చూషకాలు మరియు కొక్కేల అభివృద్ధి. వీటి ద్వారా అతిధేయి దేహభాగాలను అంటి పెట్టుకోవచ్చు.
    ఉదా: బద్దెపురుగు, లివర్ ఫ్లూక్
  3. జీర్ణవ్యవస్థనను కోల్పోవడం. ఉదా: బద్దెపురుగు
  4. అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటం ఉదా: బద్దెపురుగు
  5. అధిక మొత్తంలో గ్రుడ్లును విడుదల చేయటం వలన కొంత వరకైన అతిధేయిలోనికి ప్రవేశిస్తాయి
    ఉదా: రౌండ్వార్మ్స్, వార్మ్స్.
  6. పరాన్నజీవుల ‘సంక్లిష్టమైన జీవన చరిత్రలు’ పరాన్న జీవనాన్ని అతిథేయికి చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాయి. ఉదా: మలేరియా పరాన్న జీవికి రెండు అతిధేయిలు కలవు. అవి మనిషి మరియు దోమ.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 18.
గుడ్లకోశ పరాన్నజీవనం గురించి సోదాహరణంగా వివరించండి?
జవాబు:

  1. గుడ్లకోశ పరాన్న జీవనం: కోయిల వంటి పక్షులు గూటిని నిర్మించుకోలేవు. ఇవి తమ గుడ్లను, కాకి గూటిలో పెడతాయి. కోయిల గుడ్లు, కాకి గుడ్లకన్నా ముందుగా పొదగబడతాయి.
  2. కోయిల పిల్లలు కాకి గుడ్లను గూటి నుండి బయటకు నెడతాయి. మొదట్లో వాటి రంగు మరియు కూత కాకి వలే వుంటుంది. కావున కాకులు వాటిని తమ పిల్లలుగా భావిస్తాయి.
  3. కోయిల పిల్లలు కూతలోమార్పు వచ్చేంత వరకు కాకి ఆ పిల్లలకు ఆహారం పెట్టి పోషిస్తుంది. ఈ రకంగా కోయిల పిల్లలు కాకి పై పరాన్న జీవనాన్ని సాగించే విధానాన్ని ‘గుడ్లకోశ పరాన్నజీవనం’ అంటారు.
  4. ఈ రకమైన ఉదాహరణే యూరోపియా కూకూ మరియు పిచ్చుక మధ్య కనిపిస్తుంది.

ప్రశ్న 19.
పరజీవ భక్షక జీవులు జీవనియంత్రణకారులుగా ఎలా పని చేస్తాయి?
జవాబు:
1. పరభక్షకా జీవులు జీవనియంత్రణకారులు: ఆహార జీవులు మరియు పరభక్షాల మధ్య అంతర చర్యలలో అనేక ఆహారజీవులు మరియు పరభక్షకాల మధ్య సహసంబంధం ఏర్పడుతుంది. 19 వ శతాబ్దంలో పియర్ కాక్టస్ మొక్కను ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఇది వేగంగా మిలియన్ల హెక్టార్లలో వృద్ధిచెందింది.

2. అపాయకారంగా వ్యాపిస్తున్న కాక్టస్ను నియంత్రించడానికి ఎకాక్ట్స్ జీవియైన ‘మాత్’ (మిడతలు) ను అతిథేయిలోనికి ప్రవేశపెట్టారు. ఈ రకమైన ఆహరజీవి నియంత్రించే భక్షకజీవుల సామర్ధ్యాన్ని ఆధారంగా చేసుకొని, వ్యవసాయ చీడల నియంత్రణలలో జీవ నియంత్రణ పద్ధతులను వినియోగిస్తున్నారు.

ప్రశ్న 20.
జీవావరణ వ్యవస్ధ నిర్మాణం, విధులను వివరించండి
జవాబు:

  1. జీవావరణ వ్యవస్థ జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. దీనిలోని జీవులు ఒక వైపు తమలో తాము, మరోవైపు పరిసరాలతోను అంతర చర్యలు జరుపుతుంటాయి.
  2. ఈ అంతరచర్యల ఫలితంగా వాటి మధ్య శక్తి ప్రసరణ జరిగి ఒక నిర్ధిష్టమైన పోషకనిర్మాణవ్యవస్థ ఏర్పడుతుంది.
  3. నిర్మాణపరంగా జీవావరణవ్యవస్థ పరిమాణం చిన్న సరస్సు నుండి పెద్ద పెద్ద అరణ్యాలు లేదా సముద్రాల వరకుకూడా విస్తరిస్తుంది.
  4. జీవావరణ వ్యవస్థ పెద్దది మరియు సంక్లిష్టం కావుట వలన సౌకర్యం కోసం దానిని సహజ జీవావరణవ్యవస్థ, మరియు కృత్రిమ జీవావరణ వ్యవస్థ అని విభజించారు.
  5. సహజ జీవావరణ వ్యవస్థలో జలజీవావరణ వ్యవస్థ మరియు భూచర జీవావరణ వ్యవస్థలు ఉన్నాయి.
  6. కృత్రిమజీవావరణ వ్యవస్థలో పలు రకాలైన ఉప విభాగాలు ఉన్నాయి.
  7. జీవావరణ వ్యవస్థ పోషక నిర్మాణం మరియు వాటి విధులను రేఖీయ చిత్రాలలో వ్యక్తపరిస్తే అవి పిరమిడ్ రూపంలో కనిపిస్తాయి.
  8. క్రియాత్మకంగా ఈ వ్యవస్థ నిర్జీవ కారకాల ద్వారా జీవ కారకాలు శక్తిని ఉత్పత్తి చేసి, వ్యవస్థలోని అన్ని అంశాలకు అందిస్తాయి.

ప్రశ్న 21.
వివిధ రకాల జల జీవావరణ వ్యవస్థలను వివరించండి?
జవాబు:
జలజీవావరణ వ్యవస్థ: నీటి లవణీయత ఆధారంగా జల జీవావరణ వ్యవస్థలను మూడు రకాలుగా విభజించారు. అవి సముద్రనీటి, నదీముఖ ద్వారా మరియు మంచినీటి జీవావరణ వ్యవస్థ.
1. సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ:జల జీవావరణ వ్యవస్థలన్నింటిలోకి ఇది చాలా పెద్దది. ఇది అత్యంత స్థిరమైన జీవావరణ వ్యవస్థ.

2. నదీముఖ ద్వారా జీవావరణ వ్యవస్థ: నదీముఖం అనేది నది మరియు సముద్రం కలిసే ప్రాంతం. దీని లవణత ఋతువులు మరియు అలలపై ఆధారపడి వుంటుంది. వానాకాలం నందు నదీముఖ ద్వారాల లవణీయత తక్కువ స్ధాయిలో వుంటుంది. వేసవికాలంలో ఇది అధికంగా వుంటుంది. నదీముఖ ద్వారా జీవులు లవణీయత హెచ్చు తగ్గులను తట్టుకుంటాయి.

3. మంచినీటి జీవావరణ వ్యవస్థ: ఇది అతి చిన్న జీవావరణవ్యవస్థ . దీనిలో నదులు, చెరువులు, సరస్సులు ఉంటాయి. ఇది మరల స్థిరజల జీవావరణ వ్యవస్థ మరియు ప్రవాహ జల జీవావరణ వ్యవస్థగా విభజింపబడింది.

స్థిరజల జీవావరణ వ్యవస్థలో చెరువులు, జలాశయాలు, సరస్సులు ఉంటాయి. ప్రవాహ జలజీవా వరణ వ్యవస్థలో నదులు మరియు కాలువలు ఉంటాయి.
మంచినీటి జీవావరణ వ్యవస్థలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఆమ్నాలజీ’ అంటారు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 22.
వివిధ రకాల భౌమ్య జీవావరణ వ్యవస్థలను వివరించండి.
జవాబు:
భూమిపై ఉన్న జీవావరణ వ్యవస్థలను భూచర జీవావరణ వ్యవస్థలని అంటారు. అవి అరణ్య పచ్చిక బయలు మరియు ఎడారి జీవావరణ వ్యవస్థలు
1. అరణ్య జీవావరణ వ్యవస్థ: భారతదేశంలో రెండు ప్రధానమైన అరణ్యాలు కలువు
(a) వర్షాధార ఉష్ణమండలం అడవులు (b) ఆకురాల్చే ఉష్ణమండల అడవులు

2. పచ్చిక బయలు జీవావరణ వ్యవస్థ:ఇవి హిమాలయ ప్రాంతాలలో కలవు పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో విశాల మైన ఇసుక నేల మరియు ఉప్పు నేల ప్రాంతాలను ఇవి ఆవరించి ఉన్నాయి.

3. ఎడారి జీవావరణ వ్యవస్ధలు:ఒక సంవత్సరానికి 25 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం గల ప్రాంతాలను-ఎడారులు అంటారు. వీటిలో ప్రత్యేకమైన మొక్కలు మరియు జంతువులు ఉంటాయి. ఎడారులు రెండు రకాలు. ఉష్ణఎడారులు మరియు శీతల ఎడారులు. రాజస్ధాన్ లో ఉన్న ఎడారి ఉష్ణ ఎడారి, లడక్ లో ఉన్న ఎడారి శీతల ఎడారి.

ప్రశ్న 23.
మహాసముద్రాలలో అల్ప ఉద్పాదకతకు ముఖ్య కారణాన్ని చర్చించండి.
జవాబు:

  1. ప్రాథమిక ఉత్పాదకత: మొక్కల కిరణజ్యసంయోగక్రియ ద్వారా నిర్ణీత కాలంలో నిర్ధిష్టమైన వైశాల్యంలో ఉత్పత్తి చేసిన కర్బన పదార్థాన్ని (లేదా) జీవద్రవ్యరాశి మొత్తాన్ని ప్రాథమిక ఉత్పాదకత అంటారు.
  2. సముద్రం యొక్క ఫోటిక్ మండలము సాధారణంగా 10 నుండి 100 మీటర్ల లోతు వరకు కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యే సూర్యరశ్మిని కలిగి ఉంటుంది.
  3. ఈ మండలము యందు ద్వితీయ మరియు తృతీయ ఉత్పాదకత మాత్రమే జరుగుతుంది.
  4. సముద్రాలలో నికర ప్రాథమిక ఉత్పాదకత తక్కువ అగుటకు కారణం సముద్ర ఉపరితల వైశాల్యం ఎక్కువ మరియు ఉత్పత్తిదారులు తక్కువగా ఉండటం. దీని వలన నికర ప్రాథమిక ఉత్పాదకత రేటు తగ్గుతుంది.

ప్రశ్న 24.
పూతికాహార జీవులు, డెట్రిటివోర్లు, ఖనిజీకరణ జీవులను వివరించండి.
జవాబు:
1. పూతికాహరులు: ఈ జీవులు చనిపోయిన మరియు వ్యర్ధపదార్ధాలను విచ్ఛిన్నం చేసి వాటి నుంచి శక్తి మరియు పోషక పదార్ధాలను గ్రహిస్తాయి. ఉదా: శిలింధ్రాలు మరియు బాక్టీరియాలు

2. డెట్రిటివోర్లు: ఇవి కుళ్ళిన వాటిని ఆహరంగా తీసుకుంటాయి. ఇవి కుళ్ళిన పదార్థాలను చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఉదా: వానపాము

3. ఖనిజీకరణ జీవులు: ఇవి విచ్ఛిన్నం చెందుతున్న కుళ్ళిన పదార్థాలను హ్యుమి ఫికేషన్ మరియు ఖనిజీకరణం చేస్తాయి. హ్యుమిఫికేషన్ ద్వారా హ్యుమస్ ఏర్పడుతుంది. సూక్ష్మజీవుల చర్యలకు ఇది అధిక నిరోధకతను చూపుతుంది. ఇది పోషకాల నిల్వగా పనిచేస్తుంది. ఇది మరల నిదానంగా కొన్ని సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం ప్రారంభించి అకర్బన పోషకాలను విడుదల చేస్తుంది. ఈ విధానాన్ని ఖనిజీకరణ అంటారు.

ప్రశ్న 25.
విచ్ఛిన్నతను నిర్వచించి, దాని ప్రక్రియ, ఉత్పత్తులను తెలపండి.
జవాబు:
1. విచ్ఛిన్నత: డెట్రిటస్ మరియు స్థూల కర్బన అణువులు వాతావరణ మరియు రసాయన చర్యల వలన సూక్ష్మ అణువులైన CO2, H2O మరియు పోషకాలుగా విచ్ఛిన్నమవుటను విచ్ఛిన్నత అంటారు.
ఈ విచ్ఛిన్న ప్రక్రియ ఆక్సిజన్ ఆధారిత ప్రక్రియ. విచ్ఛిన్న ప్రక్రియ రేటును నియంత్రించే అంశాలు:
(i) డెట్రిటిస్ యొక్క రసాయనిక విచ్ఛిన్నం (ii) వాతావరణ కారకాలు

2. డెట్రిటస్ లిగ్నిన్ మరియు కైటిన్లను అధికంగా కలిగి వుంటే విచ్ఛిన్న ప్రక్రియా రేటు నెమ్మదిగా వుంటుంది. విచ్ఛిన్న ప్రక్రియా రేటు డెట్రిటస్ నందు నత్రజని మరియు నీటిలో కరిగే పదార్థాలు (చక్కెర) ఉన్నపుడు అధికంగా వుంటుంది.

3. విచ్ఛిన్న ప్రక్రియ వాతావరణ కారకాలైన ఉష్ణోగ్రత మరియు నేల తేమల నియంత్రణలో వుంటుంది. వెచ్చని మరియు తేమ వాతావరణం విచ్ఛిన్న ప్రక్రియకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత మరియు అవాయుశ్వాసక్రియ వాతావరణ విచ్ఛిన్న ప్రక్రియను నిరోధిస్తుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 26.
DFC గురించి రాసి, భౌమ్య జీవావరణ వ్యవస్థలో దాని ప్రాముఖ్యాన్ని వివరించండి. [AP,TS-18]
జవాబు:

  1. DFC అనేది డెట్రిటస్ ఆహారపు గొలుసు. ధౌమ్య జీవావరణ వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన ఆహరపు గొలుసు.
  2. డెట్రిటస్ కుళ్ళిన ఆకులు, చనిపోయిన దేహాలు మరియు జంతువుల మలవిసర్జనల నుంచి ఏర్పడుతుంది.
  3. డెట్రిటస్ పరపోషక విచ్ఛిన్నకారులను కలిగి ఉంటాయి. ఉదా: శిలీంధ్రాలు మరియు బాక్టీరియా.
  4. డెట్రిటస్ నాశనం ద్వారా ఇవి శక్తిని మరియు పోషకాలను పొందుతాయి.
  5. ఈ జీవులను పూతికాహరులు అంటారు.
  6. పూతికాహరులు కొన్ని ఎంజైములను స్రవించి వాటి ద్వారా డెట్రిటస్ ను శోషణకు అనువుగా వుండే చిన్న పదార్ధాలుగా విడగొడతాయి.
  7. డెట్రిటిస్ ఆహరపు గొలుసు ఈ క్రింది విధంగా ఉంటుంది.
    (i) డెట్రిటస్ – వానపాములు – కప్పలు – పాములు.
    (ii) చనిపోయిన జీవులు – ఈగలు, మాగట్స్ – కప్పలు- పాములు.

ప్రశ్న 27.
ప్రాధమిక ఉత్పాదకత అంటే ఏమిటి? దానిని ప్రభావితం చేసే కారకాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. జీవద్రవ్యరాశి ఉత్పత్తి రేటును ఉత్పాదకత అంటారు.
  2. ఇది ప్రాధమిక ఉత్పాదకత మరియు ద్వితీయ ఉత్పాదకత అని విభజించబడింది.
  3. ‘కిరణజన్య సంయోగ క్రియ’ ద్వారా, నిర్ణీత కాలంలో, నిర్ధిష్టమైన వైశాల్యంలో, ఉత్పత్తి చేసిన జీవద్రవ్యరాశి మొత్తాన్ని ‘ప్రాధమిక ఉత్పాదకత’ అంటారు.
  4. ప్రాధమిక ఉత్పాదకతను స్థూల ప్రాధమిక ఉత్పాదకత (GPP) మరియు నికర ప్రాధమిక ఉత్పాదకత (NPP)అని విభజించవచ్చు.
  5. స్థూల ప్రాధమిక ఉత్పాదకత: కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన మొత్తం సేంద్రీయ కర్బన పదార్థమే GPP. ఇందులో సగటున 20-25% శ్వాసక్రియలో వినియోగించుకోబడుతుంది. మబ్బులు మరియు కాలుష్యం GPP పై ప్రభావాన్ని చూపుతాయి.
  6. స్థూల ప్రాధమిక ఉత్పాదకత నుంచి శ్వాసక్రియలో కోల్పోయినది తీసివేయగా మిగిలిన దాన్ని నికర ప్రాధమిక ఉత్పాదకత (NPP) అంటారు. NPP = GPP- శ్వాసక్రియలో కోల్పోయినది.
  7. నికర ప్రాధమిక ఉత్పాదకత అంటే శాకాహరులు మరియు విచ్ఛిన్నకారులు వినియోగించుకోవడానికి అందుబాటులో ఉన్న జీవ ద్రవ్యరాశి.

ప్రశ్న 28.
జీవావరణ పిరమిడ్లను నిర్వచించి, సంఖ్యా పిరమిడ్లు, జీవరాశి పిరమిడ్లను సోదాహరణంగా వివరించండి. [TS M-19]
జవాబు:

  1. జీవావరణ పిరమిడ్: జీవావరణ వ్యవస్థ పోషక నిర్మాణం మరియు వాటి విధులను రేఖీయ చిత్రాలలో వ్యక్తపరిస్తే అవి పిరమిడ్ రూపంలో కనిపిస్తాయి.
  2. ఈ పిరమిడ్లను మొదటిసారిగా తెలియచేసినవారు ఎల్టన్. కావున వీటిని ‘ఎల్టోనియన్ పిరమిడ్లు’ అంటారు.
  3. ప్రతి పిరమిడ్ యొక్క ‘ఆధారం’లో ఉత్పత్తి దారులు (లేదా మొదటి పోషకస్థాయి) ఉంటాయి.
  4. పిరమిడ్ ‘శిఖర భాగం’ లో ఉన్నతస్థాయి ‘వినియోగదారులు’ ఉంటాయి.
  5. ‘ఉత్పత్తిదారులు’ శాఖహారుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. శాఖాహరులు, మాంసాహరుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అదే విధంగా జీవద్రవ్యరాశి మరియు శక్తి ఎక్కువ స్థాయిలో కంటే తక్కువస్థాయిలోనే అధికంగా ఉంటుంది.
  6. ‘శక్తి, జీవద్రవ్యరాశి (లేదా) సంఖ్యా’ అనేవి అన్ని పోషకస్థాయిలలోను ఉంటాయి.
  7. పిరమిడ్ల రకాలు:(i) సంఖ్యా పిరమిడ్ (ii) జీవద్రవ్యరాశి పిరమిడ్ (iii) శక్తి పిరమిడ్
  8. సంఖ్యా పిరమిడ్: గడ్డిభూముల ఆవరణవ్యవస్థ సంఖ్యా పిరమిడ్ లో ‘ప్రాధమిక వినియోగదారుల’ సంఖ్య ‘ప్రాధమిక ఉత్పత్తిదారుల సంఖ్య’ కంటే తక్కువ. మరియు తృతీయ వినియోగదారుల సంఖ్య చాలా చాలా తక్కువ.
  9. జీవద్రవ్యరాశి పిరమిడ్: సాధారణంగా ఈ పిరమిడ్ నిటారుగా ఉంటుంది. కాని సాగరంలోని ‘ద్రవ్యరాశి పిరమిడ్’ మాత్రం తలక్రిందులుగా ఉంటుంది. కారణం చేపల ద్రవ్యరాశి ‘వృక్షప్లవకాల ద్రవ్యరాశి’ కంటే ఎక్కువగా ఉండటమే.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 29.
స్ట్రాటోస్పియర్లో ఓజోన్ క్షీణత వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి? [AP M-19,20][IPE-14]
జవాబు:

  • ఓజోన్ పోర క్షీణత చాలా పెద్దదయితే అది ఓజోన్ రంధ్రాన్ని ఏర్పరిచే దిశగా మారుతుంది.
  • ఓజోన్ పోర చాలా పలుచగా మారితే అది UV కిరణాల ప్రభావాన్ని పూర్తిగా నిరోధించలేదు.
  • అప్పుడు తక్కువ తరంగ దైర్ఘ్యం గల UV కిరణాలు (UV-B) భూవాతావరణాన్ని చేరుతాయి.

ఓజోన్ పొరక్షీణత వలన కలిగే దుష్ప్రభావాలు:

  1. UV కిరణాలు DNAని దెబ్బతీసి అనేక హానికర ఉత్పరివర్తనాలకు దారితీస్తాయి.
  2. ఇవి చర్మం ముడతలు పడటం చర్మ కణాలు దెబ్బతినడం మరియు చర్మ క్యాన్సర్ల వంటి వాటిని కలిగిస్తాయి
  3. UV-B కిరణాల అధిక మోతాదు ‘కార్నియాకు’ మంటను కలిగిస్తాయి.
  4. ఇది స్లోబ్లైండ్ నెస్ మరియు కాటరాక్ట్ కు దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో కార్నియాని శాశ్వతంగా దెబ్బతీయవచ్చు.

ప్రశ్న 30.
‘హరితగృహ ప్రభావం’ గురించి రాయండి. [AP M-20] [AP Mar, May-17] [IPE-14]
జవాబు:
హరిత గృహ ప్రభావం: భూ ఉపరితలం మరియు వాతావరణమును సహజంగా వేడెక్కించే దృగ్విషయమును ‘హరితగృహ ప్రభావం’ అంటారు.

  1. సూర్యకాంతి వాతావరణం యొక్క బాహ్యపొరను చేరగానే కొంత వికిరణాన్ని శోషిస్తుంది.
  2. దాదాపు పావు వంతు సౌరవికిరణం, మేఘాలు మరియు వాయువుల ద్వారా వెనక్కి పరావర్తనం చెందుతుంది. సగ భాగం మాత్రమే సౌరవికిరణం ద్వారా భూమి ఉపరితలాన్ని చేరి భూమిని వేడెక్కిస్తుంది.
  3. అప్పుడు కొద్ది స్థాయిలో వేడి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది. హరితగృహ వాయువులైన CO2 మరియు మిధేన్ ఉండటం వలన అధిక శాతం వికిరణాలు మరల భూ ఉపరితలాన్ని చేరుతాయి.
  4. దీని వలన భూఉపరితలం మరల మరోసారి వేడేక్కుతుంది. ఈ ప్రభావాన్ని హరితగృహ ప్రభావం అంటారు.

ప్రశ్న 31.
కింది వాటిని క్లుప్తంగా చర్చించండి: (a) హరిత గృహ వాయువులు (b) శబ్ద కాలుష్యం (c) సేంద్రియ వ్యవసాయం (d) మున్సిపల్ ఘన వ్యర్థాలు.
జవాబు:
(a) హరిత గృహ వాయువులు: CO2 మరియు మిథేన్ వాయువులను హరితగృహ వాయువులు అంటారు. ఒక హరిత గృహంలో వలె ఈ వాయువులు కాంతిని మాత్రమే భూమి నుంచి వెళ్ళనిస్తాయి, వేడిని మాత్రంకాదు. దీనివలన భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది.

(b) శబ్ధ కాలుష్యం: ధ్వనిని డెసిబల్స్లో కొలుస్తారు. మనిషి చెవులు0-180 dB వరకు మాత్రమే వినగలుగుతాయి. 120dB కంటే ఎక్కువగా వున్న ఏ శబ్దమైన శబ్దకాలుష్యంగా గుర్తించాలి శబ్దకాలుష్యం వలన వినికిడి లోపం ఆత్రుత,నిద్రలేమి, హృదయస్పందన రేటు, B.P మొదలైనవి పెరుగును. అధిక శబ్దం కర్ణభేరిని నాశనం చేస్తుంది.

(c) సేంద్రియ వ్యవసాయం: ఇది ఒక ‘శూన్య వ్యర్ధ ప్రక్రియ’. ఇందులో పలు వ్యర్ధ పదార్థాల పునఃచక్రీయం అనేది సమర్ధవంతంగా జరుగుతుంది.

  • దీనివల్ల వనరుల వినియోగం గరిష్టం అవుతుంది. తద్వారా ఉత్పాదకత సామర్ధ్యం పెరుగుతుంది.
  • ‘R.C.దాగర్ ‘ అనే శాస్త్రవేత్త తేనేటీగల పెంపకం, పాడిపశువుల నిర్వహణ, నీటి సంరక్షణ, కంపోస్టింగ్ మరియు వ్యవసాయాన్ని ఒక గొలుసు ప్రక్రియలా చేశాడు.
  • ఇందులో పంట వ్యర్ధాలు మరియు పశువుల వ్యర్ధాలను సహజ ఎరువుగా వినియోగిస్తారు.
  • బయోగ్యాస్ను శక్తి అవసరాలకు వినియోగించుకుంటున్నారు.

(d) మున్సిపల్ ఘనవ్యర్ధాలు:

  • నగరాలు మరియు పట్టణాలలో ఉన్న ఇళ్ళు ఆఫీసులు, సంస్థలు, షాపులు, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు నుంచి వచ్చే ఘన వ్యర్ధాల ను మున్సిపల్ ‘ఘన వ్యర్ధాలు’ అంటారు.
  • ఇవి సాధారణంగా కాగితాలు, ఆహర వ్యర్థాలు, ప్లాస్టిక్, రబ్బర్, గాజు లోహలు, తోలు, బట్టలు మొదలైనవి. ఈ వ్యర్ధాల మొత్తాన్ని తగులబెట్టడం ద్వారా తగ్గించవచ్చు. ఈ వ్యర్థాలను పునఃచక్రీయం చేసి ‘క్షయం చెందే వ్యర్ధాలు’ మరియు ‘క్షయం చెందని వ్యర్థాలు’ గా విభజించవచ్చు.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 32.
భూతాప కారణాలను, ప్రభావాలను చర్చించండి భూతాపాన్ని నియంత్రించడానికి ఏ చర్యలు చేపట్టాలి? [TS M-15] [AP M-15,16]
జవాబు:
1. భూతాపము: వాతావరణంలో ఉష్ణోగ్రత సాధారణస్థాయి కన్నా అధికంగా ఉంటే దాన్ని భూతాపము అంటారు. ఇది హరిత గృహ వాయువుల విడుదల అధికమగుట వలన సంభవిస్తుంది.

2. భూతాపకారకాలు:
(a) భూతాపానికి ముఖ్యమైన వాయు కాలుష్య కారకం CO2.

(b) CO2 విడుదలకు కారకాలు:

  1. శిలాజ ఇంధనాల అసంపూర్తి దహనం
  2. వాహనాల నుంచి వెలువడే పొగ
  3. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే పొగ
  4. విద్యుత్ కర్మాగారాల నుంచి వెలువడే పొగ
  5. అడవుల దహనం

3. భూతాప ప్రభావాలు:

  1. వాతావరణ మార్పులు
  2. ఎలనినో ప్రభావం
  3. ధ్రువప్రాంతాలలోని మంచు కరగడం, కాలక్రమేణా సముద్రమట్టం పెరిగి, తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం

4. నియంత్రణా పద్ధతులు:
(i) శిలాజ ఇంధనాల వాడకం తగ్గింపు
(ii) శక్తి వినియోగ సామర్ధ్యత పెంపు
(iii) అడవుల నరికివేత ఆపి, మొక్కలు పెంచడం
(iv) మానవుల జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం
(V) క్యోటో ప్రోటోకాల్: భూతాపం ప్రమాదం నుంచి భూమిని కాపాడుటకు 191 దేశాలు ‘క్యోటో ప్రోటోకాల్ తీర్మానం’ పై సంతకాలు చేసాయి. దాని ప్రకారం, హరితగృహ వాయువుల విడుదల ను 1990 స్థాయికి తగ్గించాలి.

ప్రశ్న 33.
కింది వాటిని క్లుప్తంగా విమర్శనాత్మక వివరణ ఇవ్వండి: (a) యూట్రోఫికేషన్ (b) జీవ అవర్థనం (c) భూగర్భ జల క్షీణత, వాటి పరిపుష్ఠతకు మార్గాలు
జవాబు:
(a) యూట్రోఫికేషన్:

  • నీటిలో పోషక పదార్ధాలు పెరిగిపోవడం వల్ల సరస్సులో ఏర్పడే సహజమైన వార్థక్యాన్ని ‘యూట్రోఫికేషన్’అంటారు.
  • కొత్తగా ఏర్పడిన సరస్సులలో నీరు చల్లగా, తేటగా మరియు శైవలాలతో ఉంటుంది.
  • కాలక్రమంలో కాలువల ద్వారా నైట్రేట్స్ మరియు ఫాస్పేట్స్ సరస్సులలోకి చేరతాయి.
  • నీటి శైవలాలు, మొక్కలు మరియు జంతువులు సరస్సులలోకి వచ్చి చేరతాయి.
  • కొన్ని శతాబ్దాల తరువాత సిల్ట్ మరియు కర్బన వ్యర్థాలు వచ్చి పేరుకు పోవటం వలన సరస్సులోని నీరు నెమ్మదిగా వేడిగా మారుతుంది. ఋరదలో పెరిగే మొక్కలు వస్తాయి. నిదానంగా సరస్సు ఎండిపోయి నేల బయటకు వస్తుంది. ఇలా జరగటానికి సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది.
  • మానవుల ప్రవేశం వలన (కాలుష్యకాల వల్ల) యూట్రోఫికేషన్ త్వరితంగా జరుగుతుంది.
  • గతశతాబ్ద కాలంలో మురుగు, వ్యవసాయ మరియు పారిశ్రమిక వ్యర్థాల వల్ల సరస్సులు యూట్రొఫికేషన్కు అధికంగా గురి అవుతున్నాయి.

(b) జీవ ఆవర్ధనం:

  • ఉత్పత్తిదారుల స్థాయి నుంచి వినియోగదారులస్థాయి వరకు కాలుష్యకాల గాఢత మరియు చేరికను నిదానంగా పెరుగుటను ‘జీవావర్ధనం’ అంటారు.
  • DDT మరియు పాదరసం కాలుష్యం విషయంలో ఈ దృగ్విషయం బాగా తెలుస్తుంది.
  • నీటిలో DDTగాఢత 0.003 ppb. ఇది ఉత్పత్తి దారులు, ప్రాధమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు మరియు అక్కడి నుంచి చేపలు తినే పక్షుల వరకు చేరే సరికి 5 ppm గాఢతకు పెరుగుతుంది.
  • ఈ అధిక DDT గాఢత వలన సంభవించే నష్టాలు.
    (i) కాల్షియం జీవక్రియలో అసమానతలు ఏర్పడతాయి.
    ఉదా: పలుచని గుడ్డు పెంకు మరియు పరిపూర్ణంగా తయారుకాని గుడ్డు పెంకు పగులుట.
    (ii) పక్షుల జానాభా తగ్గిపోవుట.

(c) భూగర్భ జల క్షీణత:
భూగర్భ జల క్షీణత కారకాలు:

  1. కాలానుగుణంగా వర్షాలు లేకపోవటం
  2. పొడవైన వేసవికాలం
  3. పంపుసెట్ల ద్వారా మోతాదుకి మించి నీటి వాడకం

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

భూగర్భ జల క్షీణత వలన దుష్ప్రభావాలు:

  1. బావులు ఎండిపోవడం
  2. కాలువలు మరియు సరస్సులలో నీరు తగ్గుట.
  3. నీటి నాణ్యత తగ్గుట

భూగర్భ జలాల పరిపుష్టతకు మార్గాలు:

  1. వర్షపు నీటి నిల్వకొరకు మరియు ‘తిరిగి వినియోగం కొరకు’ ఉపయోగపడే బావుల నిర్మాణం.
  2. ప్రతి గ్రామం మరియు పట్టణం నందు వ్యర్ధనీటిని ‘శుభ్రం చేసే ప్లాంట్’ ల నిర్మాణం.
  3. మొక్కల పెంపకం ద్వారా నీటిని ఒడిసి పట్టడం.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఉష్ణోగ్రత ఒక జీవావరణ కారకం అనే విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
ఉష్ణోగ్రత ఒక జీవావరణ కారకం:
ఉష్ణోగ్రత అనేది వేడి తీవ్రత యొక్క కొలమానం. ‘ఉష్ణోగ్రత’ భూమి మీద భూమధ్య రేఖనుండి ధ్రువాల వరకు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. నీటిలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది.
1. సరస్సులలో ఉష్ణోగ్రత ఉష్ణస్తరీభవనం: సమశీతోష్ణ సరస్సులలో ఉష్ణోగ్రతలో మార్పులు అనేకం

2. గ్రీష్మకాల స్తరీభవనం:

  • వేసవికాలంనందు ఉపరితలనీటి ఉష్ణోగ్రత 25°C వరకు పెరుగుతుంది.
  • నీటి ఉపరితల పొరను ఎపిలిమ్నియాన్ అంటారు.
  • మధ్య పొరను ధర్మోక్లైన్ లేదా మెటాలిమ్నియాన్ అంటారు.
  • లోతుకు వెళ్ళే కొద్ది మీటరుకు 1°C చొప్పన ఉష్ణోగ్రత తగ్గుతుంది.
  • అడుగు పొరను హైపోలిమ్నియాన్ అంటారు. అక్కడ నీరు చల్లగా, నిలకడగా, తక్కువ ఆక్సిజన్ ను కలిగివుంటుంది.

3. శరదృతువు తారుమారు:

  • శరదృతువునందు నీటి ఉపరితల పొర 4°C వరకు చల్లబడుతుంది. 4°C వద్ద నీరు చాలా బరువుగా ఉంటుంది.
  • ఉపరితల నీరు బరువుగా మారి లోపలకి మునుగుతుంది. అడుగు భాగాన ఉన్న నీరు పైకి వస్తుంది. ఈ
  • విధమైన ప్రసరణను ‘శరదృతువు తారుమారు’ అంటారు.

4. శీతాకాల స్తరీభవనం:

  • శీతాకాలంనందు నీటి ఉపరితల ఉష్ణోగ్రత 0°C చేరి నీరు గడ్డ కడుతుంది.
  • ఉపరితలం అడుగున నీరు వుంటుంది.
  • ఈ పరిస్ధితులలో జీవులు వాటి జీవక్రియా రేటులను తగ్గించుకుంటాయి మరియు ఆక్సిజన్ను తక్కువగా వినియోగించుకొని మనుగడ సాగిస్తాయి.

5. వసంతరుతువు తారుమారు:

  • నీటి ఉపరితలం 4°C వరకు వేడెక్కుతుంది. సాంద్రత అధికంగా గల నీరు క్రిందకు వెళ్ళి అడుగున ఉన్న
  • పోషకపదార్ధాల నీటిని పైకి తీసుకు వస్తుంది. దీన్ని వసంతఋతు తారుమారు అంటారు.
  • సమశీతోష్ణ సరస్సులలో ఉష్ణోగ్రత ‘నీటిని తారుమారు’ చేస్తూ ఆక్సిజన్ మరియు పోషకాలను జీవులకు అందిస్తుంది.

6. జీవప్రభావాలు:

  • యూరిధర్మల్: కొన్ని జీవులు అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. వాటిని మూరిధర్మల్ జీవులు అంటారు ఉదా: పక్షులు మరియు క్షీరదాలు.
  • స్టీనోధర్మల్:కొన్ని జీవులు ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులను తట్టుకోలేవు. వాటిని స్టీనోధర్మల్ జీవులు అంటారు. ఉదా: చేపలు, కోరల్స్

7. జీవక్రియ:

  • ‘ఉష్ణోగ్రత’ ఎంజైముల చర్యలను మారుస్తుంది.
  • యుక్తతమ ఉష్ణోగ్రత వద్ద జీవుల జీవక్రియలు పతాక స్థాయిలో ఉంటాయి.
  • కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత తగ్గితే జంతువులు మనుగడ సాగించ లేవు.
  • అవి స్పృహలేమి లోకి వెళతాయి. ఉదా: శీతల స్పృహలేమి

8. వాన్టఫ్ సూత్రం: ప్రతి 10°C ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియా రేటు రెట్టింపు అవుతుంది.

  • Q10 = X(X-10°C)
  • Q10 = ఉష్ణోగ్రత గుణకం
  • Q10 విలువ 2.0 వుంటే దాని అర్ధం జీవక్రియా రేటు రెట్టింపు ఉన్నట్లు

9. భ్రమణ రూప విక్రియః ఋతువులను బట్టి వచ్చే ఉష్ణోగ్రత మార్పులు డాఫ్నియా, వాటర్ లాంటి జీవులలో స్వరూప మార్పులను కలుగజేస్తాయి.

  • శీతాకాలంలో డాఫ్నియా తల గుండ్రంగా ఉంటుంది.
  • వసంతకాలంలో హెల్మెట్లా పెరుగుతుంది.
  • వేసవికాలంలో హెల్మెట్ పెద్దగా మారుతుంది.
  • శరదృతువులో హెల్మెట్ నిదానంగా తగ్గుతుంది.
  • శీతాకాలానికి తల మళ్లీ గుండ్రంగా మారుతుంది.
  • భ్రమణ రూపవిక్రియ నీటి సాంద్రతలో ఉష్ణోగ్రత వలన కలిగే మార్పులకు అనుగుణంగా వచ్చే అనుకూలనం. కావున ఈ జీవి నీటిలో తేలికగా ఈదగలుగుతుంది.

10. ప్రవర్తన అనుకూలన: సరీసృపాలు శీతాకాలంలో ఉష్ణోగ్రత కోసం సూర్యరశ్మి సోకేటట్టుగా బయటికి వస్తాయి. వేసవి కాలంలో అధిక వేడిని తట్టుకోవటానికి బొరియాలలోకి వెళ్ళిపోతాయి.

11. స్వరూప అనుకూలనాలు: చలిప్రాంతాలలో నివశించే జంతువులు దేహచర్మానికి కింద మందమైన కొవ్వుపొర (బ్లబ్బర్)ను కలిగి ఉంటాయి.

12. బెర్గెమాన్ నియమం: శీతల ప్రాంతాలలో నివశించే జీవుల దేహాలు స్థిరోష్ణజీవుల దేహవైశాల్యాన్ని కన్నా పెద్దదిగా ఉంటాయి. ఇదే ‘బెర్గ్మన్ నియమం’ దేహం పెద్దది కల జీవులకు ఉపరితలం తక్కువగా ఉంటుంది. కావున ఉష్ణనష్టం తక్కువగా ఉంటుంది.

13. ఎలెన్స్ నియమం: శీతల ప్రాంతాలలో ఉండే క్షీరదాలు చిన్న చెవి దొప్పలు కలిగి ఉంటాయి. వీటికి వ్యతిరేకంగా ఉష్ణప్రాంతాలలో ఉండే జీవుల చెవి దొప్పలు పెద్దవిగా వుంటాయి. దీనినే ‘ఎలెన్స్ నియమం’ అంటారు. ఉదా: నక్కల చిన్న చెవి దొప్పల వలన వాటికి జరిగే ఉష్ణోగ్రత నష్టం చాలా తక్కువ.

14. శరీరధర్మ అనుకూలనాలు: అన్నిజీవులు స్థిర దేహ ఉష్ణోగ్రతను మరియు స్ధిర శరీర ద్రవ్యాల గాఢతను కలిగి ఉంటాయి.

15. నియంత్రకాలు: పక్షులు మరియు క్షీరదాలు హోమిస్టాసిస్ అనగా ఉష్ణ నియంత్రణ మరియు ద్రవాభిసరణ క్రమతను కలిగి ఉంటాయి. ఉదా:వేసవికాలంలో చెమట ఎక్కువ పట్టుట, శీతాకాలంలో వణుకు పుట్టుట.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

16. అనురూపణ: అనేక జంతువులలో దేహం యొక్క స్థిర ఉష్ణోగ్రత, పరిసర ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతుంది. ఉదా: అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు మరియు సరీసృపాలు. ఒంటె పాక్షిక అనురూపకం.

17. వలస: అధిక ఒత్తిడి కల వాతావరణం నుంచి తప్పించుకొనుటకు జంతువులు ఆహారం మరియు ప్రత్యుత్పత్తి కొరకు అన్వేషణ సాగిస్తూ ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంకు వలస వెళతాయి.
ఉదా: సైబీరియా పక్షులు, ఆఫ్రికా క్రూర బీస్ట్లు

18. తక్కువ జీవ క్రియారేటు:కొన్ని జీవులు మందమైన కవచాలు కలిగిన సిద్ధబీజాలను ప్రతికూల పరిస్థితుల యందు ఏర్పరుస్తాయి. ఉదా: బాక్టీరియా, శీలీంధ్రాలు మరియు నిమ్నస్థాయి మొక్కలు.
ఉన్నత జీవులు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి వేసవి కాలం నందు ‘గ్రీష్మకాల సుప్తావస్త’ లోకి మరియు శీతాకాలం నందు ‘శీతాకాల సుప్తావస్త’లోకి వెళతాయి.

19. డయాపాస్:కొన్ని జంతువులు ప్రతికూల పరిస్థితుల్లో, వాటి పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేస్తాయి. ఉదా: కీటకాలు మరియు చేపల పిండాలు

ప్రశ్న 2.
నీరు జీవావరణంలో ఒక కారకం అనే విషయాన్ని సవివరంగా రాయండి. [AP MAY-22]
జవాబు:
నీరు ఒక జీవావరణ కారకం:
1. నీరు: నీరు ఒక ముఖ్యమైన జీవావరణ కారకం. ఇది సమస్త జీవుల జీవనశైలిపై ప్రభావం చూపుతుంది. నీటి లవణగాఢత సముద్రపు నీటిలో చాలా ఎక్కువ మరియు మంచినీటిలో చాలా తక్కువ.

2. వ్యాపిత లవణీయత: కొన్ని జంతువులు ఎక్కువ మేర లవణీయతలను తట్టుకోగలుగుతాయి. వీటిని వ్యాపిత లవణీయత జీవులు అంటారు. ఉదా: నదీముఖ ద్వారా జంతువులు.

3. మిత లవణీయత: కొన్ని జంతువులు లవణీయత మార్పులను తట్టుకోలేవు. వాటిని మిత లవణీయత జీవులు అంటారు. ఉదా: మంచినీటి చేపలు మరియు ఉప్పునీటి చేపలు

4. మంచినీటి ఆవాసాల్లో అనుకూలనాలు: దేహద్రవాలలో లవణ గాఢత బయట ఉండే మంచి నీటి కంటే అధికంగా వుంటుంది. కావున కొన్ని జీవులు అంతర ద్రవాభిసరణ ద్వారా నీటిని వెలుపలికి పంపుతాయి.

  1. ప్రోటోజోవాన్లు సంకోచరిక్తికలను కలిగి ఉంటాయి.
  2. మంచినీటి చేపలు పెద్ద రక్తకేశనాళికాగుచ్చ మూత్రపిండాలను కలిగి ఉంటాయి. ఇవి నీటితో పాటుగా లవణాలను కోల్పోతాయి.
  3. చేపలు లవణాలను శోషించే క్లోరైడ్ కణాలను మొప్పలు కలిగి ఉంటాయి.
  4. వేసవి నందు చెరువులు ఎండిపోతాయి. కావున వేసవి నందు మనుగడ కొరకు జరిగే అనుకూలనాలు.
    (a) ప్రోటోజోవాన్లు కోశీభవన ప్రక్రియను ప్రదర్శిస్తాయి.
    (b) స్పంజికలు జెమూల్స్ను ఏర్పరుస్తాయి.
    (c) ప్రోటాప్టిరస్ చేపలు కోశాన్ని ఏర్పచుకుంటాయి.

5. సముద్ర ఆవాసాల్లో అనుకూలనాలు: సముద్ర జీవుల దేహ ద్రవాల కంటే, సముద్రపు నీటి లవణ గాఢత అధికంగా ఉంటుంది. కావున వీటిలో బాహ్య ద్రవాభిసరణ ద్వారా ‘నిర్జలీకరణను నియంత్రించడం’ జరుగుతుంది.

  1. చేపలు తక్కువ వృక్క ప్రమాణాలు, రక్తకేశనాళికాగుచ్ఛ రహిత మూత్రపిండాలను కలిగి ఉంటాయి.
  2. ఇవి నీటిని తాగుతాయి. కావున ‘లవణం’ దేహం లోపల పేరుకుంటుంది.
  3. మొప్పలలో గల లవణాన్ని స్రవించే క్లోరైడ్ కణాల ద్వారా అధిక లవణాన్ని అవి బయటకు పంపుతాయి.
  4. సీగల్స్ మరియు పెంగ్విన్లు ముక్కు ద్వారా లవణ ద్రవంను చుక్కలుగా విడుదల చేస్తాయి.
  5. తాబేళ్లు మరియు క్రొకడైల్స్ కంటికి సమీపంలో లవణాన్ని స్రవించే గ్రంధులను కలిగి ఉంటాయి.
  6. షార్క్ చేపలు ‘యూరియ మరియు TMO’ ని తమ కణజాలాల యందు కలిగి లవణ గాఢతను సమంచేస్తాయి.

6. ఉప్పునీటి కయ్యలు అనుకూలనాలు: నదీముఖ ద్వారాల వద్ద కల జంతువులు అయిన సాల్మన్, హిల్సా మరియు ఎంగ్విల్లా వంటి జీవులు నీటి లవణీయతను బట్టి తమ మూత్రపిండాలలో మార్పులు చేసుకుంటాయి. పరిస్థితిని బట్టి క్లోరైడ్ కణాల శోషణ లేదా లవణాన్ని విసర్జించుట చేస్తాయి.

7. భౌమ్య అనుకూలనాలు: ఎడారులు చాలా కొద్ది మొత్తంలో మాత్రమే నీటిని కలిగి ఉంటాయి. ‘కంగారు ఎలుకలు’ జీవక్రియా నీటిని తమ నీటి అవసరాలకు సరిపడా వినియోగించుకుంటాయి. నీటి ఎద్దడిని నివారించుటకు ‘గాఢ మూత్రాన్ని’ విడుదల చేస్తాయి.

ప్రశ్న 3.
సరస్సుని జీవావరణ వ్యవస్థగా వివరిస్తూ, అందులో వివిధ మండలాలను జీవ సంఘటకాలను సోదాహరణంగా వివరించండి. [TS M-15,17]
జవాబు:
(A) సరస్సు జీవావరణ వ్యవస్థ: సరస్సులు నిశ్చలమైన నీటిని కలిగి ఉండి భూమిపై ఉండే పెద్ద స్థిర జలప్రాంతాలు. ఇవి సంవత్సరమంతా నీటిని కలిగి ఉంటాయి. సరస్సులు జీవావరణ వ్యవస్థ యొక్క అన్ని విధులను నిర్వర్తిస్తాయి. ఆ విధులు: కిరణజన్య సంయోగ క్రియ, స్వయం షోషకాలను ఆహరంగా తీసుకునే పరషోషకాలు, విచ్ఛిన్నం, ఖనిజీకరణ, లవణాల పునః చక్రం మరియు లవణాల ప్రసరణ మొదలైనవి.
లోతైన నీటి సరస్సులలో మూడు నిర్ధిష్ట ప్రాంతాలు ఉంటాయి. అవి
I. వేలాంచల మండలం II. లిమ్నెటిక్ మండలం III. ప్రొఫండల్ మండలం

I. వేలాంచల మండలం: ఇది సరస్సు యొక్క ‘లోతు తక్కువగా ఉన్న భాగం’ మరియు ఇది తీరానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో కాంతి అడుగు భాగం వరకు ప్రసరిస్తుంది. కావున దీన్ని యూఫోటిక్ (మంచి కాంతివంతమైన ప్రాంతం) అంటారు. ఇక్కడ మొక్కలు అధికంగా వుంటాయి. కావున కిరణజన్య సంయోగ క్రియా రేటు అధికం. ఆక్సిజన్ సమృద్ధిగా వుంటుంది.

II. లిమ్నెటిక్ మండలం: ఇది సరస్సు మధ్యలో ఉండే పెద్దదైన ప్రాంతం మరియు ఇది తీరానికి దూరంగా ఉండే ప్రాంతం. ఇది అడుగు భాగాన్ని ఎక్కడా తాకదు. కాంతి నిలువుగా సమర్ధవంతంగా లోపలికి చొరబడగలిగే ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఇక్కడ కిరణజన్య సంయోగ రేటు, శ్వాసక్రియా రేటుతో సమానంగా ఉంటుంది.

III.ప్రొఫండల్ మండలం: ఇది లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం. ఇక్కడ కాంతి ఉండదు. కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఆక్సిజన్ ను తక్కువ స్థాయిలో కలిగి వుంటుంది.
కాంతి పరహర మండలం అనునది లిమ్నెటిక్ మండలాన్ని మరియు ప్రోఫండల్ మండలాన్ని వేరు చేస్తుంది.

(B) సరస్సు యొక్క జీవ వృక్షం:
I. వేలాంచల మండల యొక్క జీవవృక్షం:
(a) ఫ్లోరా-మొక్కలు – ఉదాహరణలు.

  1. నీటిలో స్వేచ్ఛగా తేలియాడుతున్న నీటి మొక్కలు – పిస్టియా, లెమ్నా, సాల్వీనియా
  2. వేళ్ళు కలిగి, తేలియాడుతున్న పత్రాలు కలిగిన నీటి మొక్కలు – నింఫియా, విక్టోరియారిజీయా
  3. లోతుగా నీటిలో పూర్తిగా మునిగిన నీటి మొక్కలు – హైడ్రిల్లా, యూట్రిక్యులేరియా
  4. నీటిలో మునిగిన వేళ్ళు కలిగి హైడ్రోఫైట్స్ – వాల్సినేరియా
  5. ఉభయచర మొక్కలు (వేళ్ళునీటి అడుగున, మొక్క ఉపరితలంపై) – సాజిట్టేరియా, టైఫా
  6. వృక్ష ప్లవకాలు – డయాటమ్స్, ఆకుపచ్చ శైవలాలు

(b) ఫౌనా-జంతువులు – ఉదాహరణలు.

  1. జంతుప్లవకాలు (వాటర్ ప్లీస్) – డాఫ్నీయా, రోటిఫిర్లు, ఆస్ట్రకాడ్స్
  2. న్యూస్టాన్- ఎపిన్యూస్టాన్ (నీటి ఉపరితలంలో నివసించేవి) – వాటర్ బగ్స్, బీటిల్స్
  3. న్యూస్టాన్ – హైపోన్యూస్టాన్ (గాలి నీరు కలిసేచోట ఉండేవి) – దోమ డింభకాలు
  4. నెక్టాన్ (నీటిలో ఈదుతూ జీవించేవి) – చేపలు, పాములు
  5. పెరిఫైటాన్ (మొక్కలను అంటిపెట్టుకొని ఉండేవి) – హైడ్రా, డింభకాలు
  6. బెన్డోస్ (అడుగు భాగంలో ఉండేవి) – ఎర్రిటి అనెటిడ్లు, క్రీచేపలు

II. లిమ్నెటిక్ మండలంలోని జీవం:

  • దీనియందు వృక్ష ప్లవకాలు, జంతుప్లవకాలు మరియు నెక్టాన్లు ఉంటాయి.
  • వృక్ష ప్లవకాలు: యూగ్లినాయడ్స్, డయాటమ్స్, ఆకుపచ్చని శైవలాలు.
  • జంతు ప్లవకాలు:కోపిపోడ్స్
  • నెక్టాన్: చేపలు, కప్పలు, నీటి సర్పాలు

III. ప్రొఫండల్ మండలంలోని జీవం:ఇవి అన్నీ తక్కువ ఆక్సిజన్తో నివసించగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. దీనియందు విచ్ఛిన్నకారులు కైరొనామిడ్ డింభకాలు, ఫాంటమ్ డింభకాలు (చావోబోరస్), క్లామ్స్ మొదలైనవి ఉంటాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 4.
జీవావరణ వ్యవస్థలో కనిపించే వివిధ ఆహార గొలుసులను వివరించండి. [AP,TS M-16] [AP M-17,18 19] [TS MAY-22][TS M-19]
జవాబు:
భూమిపై గల అన్ని ఆవరణ వ్యవస్థల శక్తికి మూలాధారం సూర్యుడు మాత్రమే జీవావరణ వ్యవస్థయందు అనేక ఆహార స్థాయిలు ఉంటాయి. వాటినే ‘పోషకస్థాయిలు’ అంటారు.

  • ఒక పోషకస్థాయి జీవులకు ఒకే రకమైన శక్తి వనరు మరియు ఒకే విధమయిన శక్తి వినిమయ సోపానాలు ఉంటాయి. సాధారణంగా 3 నుండి 5 పోషక స్థాయిలు ఉంటాయి.
  • ఒక జీవి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించవచ్చు. ఉదా: పిచ్చుక
  • ఆహారశక్తి ఎప్పుడూ కింది పోషక స్థాయి నుంచి పై పోషకస్థాయికి బదిలీ చేయబడుతుంది.
  • ఆహారశక్తి మార్గాన్ని నిలువుగా తీసుకుంటే అనుఘటకాలు ఒకదానితో మరొకటి గొలుసులాగా వుంటాయి. కావున దీనిని ‘ఆహార గొలుసు’ అంటారు.
  • ఆహార గొలుసు సాధారణంగా విచ్ఛిన్నకారులతో ముగుస్తుంది.

ఆహారగొలుసులోని రకాలు:

  1. మేసే జీవుల ఆహార గొలుసు
  2. పరాన్న జీవుల ఆహార గొలుసు
  3. డెట్రైటస్ ఆహార గొలుసు

1. మేసే జీవుల ఆహార గొలుసు: దీనినే పరభక్ష ఆహార గొలుసు అనికూడా అంటారు. ప్రధమ పోషకస్థాయి పచ్చని మొక్కలతో (ఉత్పత్తిదారులు) ప్రారంభమవుతుంది. ద్వితీయ పోషకస్థాయి శాకాహరులుతో వుంటుంది. మూడు నాలుగు మరియు ఐదు స్ధాయిలలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ మాంసాహారులు ఉంటాయి.
ఉదా:

  1. గులాబి పొద → ఏఫిడ్లు → సాలెపురుగులు → చిన్న పక్షులు → డేగ
  2. గడ్డి → మిడత → కప్ప → పాము → డేగ
  3. గడ్డి →మేక →మనిషి
  4. మొక్కలు →గొంగళిపురుగు → బల్లి → పాము
  5. గడ్డి →జింక→ పులి

2. పరాన్న జీవుల ఆహార గొలుసు: దీనియందు, ఆహార శక్తి పెద్ద జీవులనుంచి చిన్న జీవులకు బదిలీ చేయబడుతుంది. మొదటి పోషకస్థాయి వృక్షాలచే ఆక్రమించబడుతుంది. ఇవి అనేక పక్షులకు, సరీసృపాలకు మరియు క్షీరదాలకు ఆవాసాన్ని మరియు ఆహారాన్ని అందిస్తాయి. ఈ జీవులు ద్వితీయ పోషకస్థాయిని ఏర్పరుస్తాయి. ఇందులోని ప్రతి జీవి అనేక బాహ్య మరియు అంతః పరాన్న జీవులకు ఆతిధ్యమిస్తాయి
ఉదా: వృక్షాలు→పక్షులు, బల్లులు, క్షీరదాలు పరాన్న జీవులు

3. డెట్రైటస్ ఆహార గొలుసు: డెట్రైటస్ అంటే ఆకుల యొక్క మృత కర్బన పదార్థాలు కళేబరాలు మరియు జంతువుల విసర్జితాలు. ఈ ఆహర గొలుసు డెట్రైటస్ తో ప్రారంభమవుతుంది. డెట్రైటస్ పూతికాహరులను కలిగి ఉంటాయి, ఇవి ఎంజైములను స్రవించి డెట్రైటస్ శోషణకు అనుగుణమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. డెట్రైటస్ నుండి వాన పాములు, ఈగలు మరియు మాగట్స్ అనేవి ద్వితీయ పోషకస్థాయిని ఏర్పరుస్తాయి.
ఉదా: డెట్రైటస్ →వానపాములు →కప్పలు →పాములు→ డేగలు

ఆహార జాలకం: ఆహార గొలుసులన్నీ సరళంగా విడివిడిగా ఉండే గొలుసులు కావు. ఇవి ఒక దానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆహారపు సంబంధాలు అన్నీ కలిసి ఒక జాలకాన్ని ఏర్పరుస్తాయి. దానినే ఆహార జాలకం అంటారు. ఆహారపు సంబంధాలు సామాన్యమైనవి కావు . సర్వభక్షకాలు ఈ గొలుసును ముగిస్తాయి. ఉదా: మానవుడు, ఎలుగుబంటి, కాకి.
AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం 2
AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం 3

ప్రశ్న 5.
జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని వివరించండి. [AP M-15]
జవాబు:
జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ:

  1. భూమిపై గల అన్ని ఆవరణ వ్యవస్థల శక్తికి మూలాధారం సూర్యుడు మాత్రమే .
  2. మొక్కలు సౌరశక్తిని గ్రహించి ఆవరణవ్యవస్థలోని వివిధ రకాల జీవులకు అందిస్తాయి.
  3. సూర్యరశ్మిలో 50% కంటే తక్కువ భాగం మాత్రమే క్రియాశీల కిరణజన్య సంయోగక్రియకు (PAR) ఉపయోగపడుతుంది.
  4. మొక్కలు 2 % నుండి 10% PARను మాత్రమే గ్రహిస్తాయి. ఈ కొద్ది శక్తి ‘మొత్తం జీవప్రపంచాన్ని’ నిలబెడుతుంది.
  5. అన్ని పరపోషకాలు ఆహారం కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాని ఉత్పత్తిదారులపై ఆధారపడతాయి.
  6. ఉష్ణగతిక శాస్త్రంలో మొదటి సూత్రం శక్తి నిత్యత్వసూత్రం ప్రకారం ‘శక్తి సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు’. శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చబడుతుంది. భూమికి చేరే శక్తిని, ఉష్ణవికిరణం రూపంలో భూమి నుంచే పోయే శక్తితో సమము చేయవచ్చును. శక్తి బదిలీ జీవావరణ వ్యవస్థలో జీవనాధారానికి చాలా అవసరం. దీనికి నిరంతర శక్తి ప్రసరణ అవసరం.
  7. ఉష్ణగతిక శాస్త్రం రెండవ సూత్రం ప్రకారం ‘ప్రతి స్థాయి నందు శక్తి నష్టం జరుగుతుంది. ఈ శక్తి నష్టం అనేది ‘అందుబాటులో లేని’ ఉష్ణశక్తి రూపంలో ఉంటుంది. దీనినే ఎంట్రోపి అంటారు’. అనగా పనికిమాలిన శక్తి. ఆహారగొలుసు ద్వారా శక్తి బదిలీ చేయబడుతుంది. దీనినే శక్తి ప్రసరణ అంటారు. ‘అందుబాటులో ఉండే శక్తి వరస క్రమం’ పోషకస్థాయిలలో క్రమేణా తగ్గుతుంది.
  8. జీవి చనిపోయిన తరువాత, విచ్ఛిన్నకారులకు అది శక్తి వనరుగా ఉపయోగపడుతుంది.
  9. ప్రతి పోషకస్థాయిలో నిర్ణీత జీవపదార్ధ ద్రవ్యరాశి ఉంటుంది. దీనినే ‘స్టాండింగ్ క్రాప్’ అంటారు. స్టాండింగ్ క్రాప్ అంటే జీవ ద్రవ్యరాశి. జీవద్రవ్యరాశిని స్వచ్ఛమైన లేదా పొడి బరువు ద్వారా ప్రకటిస్తారు. పొడి బరువు చాలా ఖచ్ఛితమైంది.
  10. 10% సూత్రాన్ని లిండేమన్ ప్రతిపాదించాడు. దీని ప్రకారం, శక్తి బదిలీ చెందేటప్పుడు 10% శక్తి పోషకస్థాయిలో నిల్వ ఉంటుంది.
    AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం 4
  11. మిగిలిన శక్తి జీవక్రియలలో అంటే శ్వాసక్రియలో వినియోగించుకోబడుతుంది.
  12. జీవావరణ వ్యవస్థ సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి లిండేమన్ 10% సూత్రం విరివిగా ఉపయోగించే ప్రధాన ప్రమాణం.
    ఉదా: ఒక మొక్కలో నికర ప్రాధమిక ఉత్పాదకత లోకం 100kJ, అయితే ‘శాకాహరుల్లో జీవద్రవ్యరాశి 10kJ మాత్రమే. మాంసాహారులు 1kJ మాత్రమే పొందుతాయి.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 6.
ముఖ్యమైన వాయు కాలుష్యకాలను తెలిపి, మానవులపై వాటి ప్రభావాలను గురించి రాయండి. [TS M-20][AP M-17], [TS May-17][AP,TS-18]
జవాబు:
వాయు కాలుష్యం: వాతావరణంలోని గాలి సహజంగా కాకుండా, మానవులకు మరియు మొక్కలకు హని కలిగించే విధంగా ఉంటే అటువంటి గాలిని ‘కలుషిత వాయువు (లేదా) వాయు కాలుష్యం’ అంటారు. కాలుష్యాన్ని కలిగించే కారకాలను కాలుష్యకాలు అంటారు.
ప్రధాన గాలి కాలుష్యకాలు:

  1. కార్బన్్మనాక్సైడ్ (CO)
  2. కార్బన్ డై ఆక్సైడ్ (CO2)
  3. సల్ఫర్ డై ఆక్సైడ్(SO2)
  4. నైట్రోజన్ ఆక్సైడ్ (NO)
  5. రేణురూప పదార్థాలు
  6. శబ్ద కాలుష్యం

1. కార్బన్మౌనాక్సైడ్ (CO): అసంపూర్తిగా దహనం చెందిన శిలాజ ఇంధనాల నుంచి ఇది ఉత్పత్తి అవుతుంది. వనరులు: వాహనాల నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ, పవర్ ప్లాంట్స్ విడుదల చేసే ఉద్గారాలు, అడవులు తగలబడటం, వంట చెరకు తగలబెట్టడం మొదలైనవి.

హానికర ప్రభావాలు:

  1. హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో ఉండటం వలన హీమోగ్లోబిన్లో ఆక్సిజన్ రవాణా తక్కువ అవుతుంది.
  2. CO తక్కువ గాఢతలో ‘తలనొప్పి’ మరియు ‘మసక బారిన’ దృష్టిని కలుగజేస్తుంది.
  3. CO అధిక గాఢతలో కోమాకు దారి తీసి చివరికి మరణం సంభవిస్తుంది.

2. కార్బన్ డై ఆక్సైడ్(CO2): జీవుల శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి అవుతుంది. కాని మొక్కలు CO2 ను కిరణజన్య సంయోగ క్రియలో వినియోగించుకుంటాయి.
హానికర ప్రభావాలు:

  1. CO2 గాఢత స్థాయి సాధారణ స్థాయి కంటే పెరిగినపుడు భూతాపాన్ని కలిగిస్తుంది.
  2. భూతాపం మానవుల జీవనం పై అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది.

3. సల్ఫర్ డై ఆక్సైడ్(SO2): ఇది శిలాజ ఇంధనాన్ని మండించడం ద్వారా, సల్ఫర్ నుండి ఖనిజాన్ని కరిగించడం ద్వారా మరియు లోహాల ప్రగలనం ద్వారా ఉత్పత్తి అవుతుంది.
హానికర ప్రభావాలు:

  1. అధిక సాంద్రత వల్ల శ్వాస సంబంధ సమస్యలైన ఆస్తమా, ఉబ్బసం మరియు హృదయ సంబంధ సమస్యలు అధికమవుతాయి.
  2. భవనాలు మరియు చారిత్రక కట్టడాలు పగుళ్ళు మరియు శిధిలావస్థకు చేరటం.

4. నైట్రోజన్ ఆక్సైడ్లు (NO, N2O, NO2): ఇవి ప్రధానంగా ఆటో మొబైల్ ఉద్గారకాలు. హానికర ప్రభావాలు:

  1. నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు SO2 రెండూ కలిసి ఆమ్లల వర్షాలను కురిపిస్తాయి.
  2. ఆమ్లాల వర్షాలు నీటి నిల్వలను ఆమ్లయుతం చేస్తాయి మరియు పంటలను, భవనాలను మరియు ప్రసిద్ధ కట్టడాలను (తాజ్మహల్ వంటి వాటిని పాడు చేస్తాయి.

నైట్రోజన్ డై ఆక్సైడ్, హైడ్రో కార్బన్లు మరియు సూర్యకాంతితో కలిసి కాంతి రసాయన పొగమంచును ఏర్పరుస్తుంది.

  1. దీని వలన ఆకుల పై మచ్చలు ఏర్పడటం
  2. కిరణజన్య సంయోగక్రియ తగ్గటం
  3. పంట దిగుబడి తగ్గడం వంటివి జరుగుతాయి.
    నైట్రోజన్ ఆక్సైడ్ లు ద్వితీయస్థాయి కాలుష్య కారకాలతో కలిసి PAN ను ఏర్పరుస్తాయి.
    ఇది కళ్ళకు తీవ్రమైన మంటను కలుగుజేస్తుంది.

5. ఎరోసాల్స్ (రేణురూప పదార్థాలు): ఎరోసాల్స్ అనేవి కొల్లాయడల్ రేణువులు. ఇవి వాయువుల్లో విక్షేపణం చెంది ఉంటాయి. ఇవి శిలాజ ఇంధనాన్ని మండించడం, ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఏర్పడే బూడిద, సిమెంట్ కర్మాగారాలు, ఆస్బెస్టాస్ ప్లాంట్స్ మొదలైన వాటి ద్వారా ఏర్పడతాయి.

హానికర ప్రభావాలు: ఊపిరితిత్తుల విధి నెమ్మదించడం, ఆస్తమాను కలిగించడం, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలున్నవారు త్వరగా చనిపోవటం, దీర్ఘకాల బ్రాంకైటిస్, లయ తప్పిన హృదయ స్పందనలు మొదలగునవి కలుగుతాయి.

6. శబ్దకాలుష్యం: ఆవశ్యకం కాని, వినటానికి అనువుకాని పెద్ద శబ్దాలు (120dB పైగా) శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తాయి. హానికర ప్రభావాలు: బాగా పెద్ద శబ్దాలు (150 dB కంటే ఎక్కువ)చెవుల కర్ణభేరిని దెబ్బతీస్తాయి మరియు శాశ్వత వినికిడి లోపాన్ని కలుగజేస్తాయి. శబ్దం వినికిడి అలసటను, ఆతురతను, నిద్రలేమిని మరియు ఒత్తిడిని కలుగజేస్తుంది.

ప్రశ్న 7.
జల కాలుష్యానికి కారణాలు వివరించి, దాని నివారణ పద్ధతులను సూచించండి.
జవాబు:
I. జలకాలుష్యకారకాలు:

  1. గృహసంబంధ మురుగు
  2. పారిశ్రామిక వ్యర్థాలు
  3. ఉష్ణకాలుష్యం.

1. గృహసంబంధ మురుగు: మానవుల మరియు జంతువుల విసర్జితాలు, డిటర్జెంట్స్ మరియు వ్యర్ధ ఆహారం మొదలైనవి. ఇవన్నీ మంచినీటి చెరువులు, నదులు, కాలువలు మరియు సముద్రాలలో కలుస్తాయి.
నిబంధనల ప్రకారం నీటిలోకి విడుదల కాక ముందే శుద్ధీకరణ జరగాలి.
శుద్ధీకరణలో ఘన పదార్థాలను సులభంగా తొలగించవచ్చు. గృహసంబంధ మురుగు ప్రాధమికంగా జీవక్షయ కర్బన పదార్ధాలను కలిగి ఉంటుంది. ఇది బాక్టీరియా మరియు సూక్ష్మజీవుల ద్వారా క్షయమవుతుంది.
కాని నైట్రేట్లు, ఫాస్పేట్లు, హానికర లోహాలు మరియు సేంద్రియ పదార్ధాలను తొలగించడం సులువు కాదు.

(i) B.O.D: BOD అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. మురుగులో జీవక్షయ పదార్ధాలను కొలవడానికి ఒక సూచిక. ఆక్సిజన్ డిమాండ్ను 5 రోజులకు (BOD5) లేదా ఏడు రోజులకు (BOD7). వినియోగించుకొనే అవధి ఆధారంగా కొలుస్తారు. సూక్ష్మ జీవులు చాలా ఎక్కువ ఆక్సిజన్ను వినియోగిస్తాయి. చేపలు మరియు నీటి జంతువులు ఆక్సిజన్ తగ్గిపోవడం వల్లన చనిపోవడం జరుగుతుంది.

(ii) శైవల మంజరులు: అధిక స్థాయిలో ఉండే పోషకాలు ప్లవక శైవలాల పెరుగుదలను మరింత ఎక్కువగా చేస్తాయి. నీరు పచ్చరంగులో ఉండే స్థితిని శైవల మంజరులు అంటారు. ఈ శైవల మంజరులు ఎక్కువ ఆక్సిజన్ ను వినియోగించుకొని నీటి నాణ్యతను తగ్గిస్తాయి. దీనివలన చేపలు మరియు నీటి జంతువులు చనిపోతాయి. మురుగులో ఉండే బాక్టీరియా వలన అతిసారం, టైఫాయిడ్, పచ్చకామెర్లు, కలరా మొదలైన వ్యాధులు ప్రబలుతాయి.

2. పారిశ్రామిక వ్యర్ధాలు: ఇది అకర్బన మరియు కర్బన కాలుష్యకాలైన నూనెలు, గ్రీజ్లు, లోహ వ్యర్ధాలు అవలంబిత ఘనపదార్ధాలను కలిగి ఉంటాయి. వీటిలో చాలా వరకు క్షయం చెందనివే. కర్బన వ్యర్థాలు BOD మరియు CODను పెంచుతాయి.
(i) జీవ ఆవర్ధనం: ‘విష పదార్థాల గాఢత స్థాయి’ ప్రతి అనుక్రమ పోషకస్థాయిలలో పెరుగుతుంది.
ఉదా: DDT. నీటిలో దీని గాఢత 0.03 ppb. ఇది స్వయం పోషకాల ద్వారా శోషణ చెంది అక్కడి నుంచి వినియోగదారులకు చేరుతుంది. చివరిస్థాయి వినియోగాదారులు (చేపలను తినే పక్షులు) 5 pp ని కలిగి ఉంటాయి. DDT గుడ్డు పెంకుని పలుచగా మారుస్తుంది. కావున గుడ్డు పెంకు పగిలి పిండాలు చనిపోతాయి. తద్వారా పక్షుల జనాభా తగ్గిపోతుంది.

AP Inter 1st Year Zoology Important Questions Chapter 8 జీవావరణం – పర్యావరణం

(ii) యూట్రోఫికేషన్: నీటిలో పోషకపదార్ధాలు పెరిగిపోవడం వలన సరస్సులో ఏర్పడే సహజ వార్ధక్యాన్ని ‘యూట్రోఫికేషన్’ అంటారు.
పోషకాల చేరిక వలన సరస్సులలో జీవులు పెరుగుతుంటాయి.
కొంతకాలం తరువాత డెబ్రిస్ మరియు కర్బన పదార్థాలు సరస్సులోతుకు చేరి అడుగు భాగంలో పేరుకుపోతాయి. సరస్సులో బురద పెరిగి, వేళ్ళు ఉన్న మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. చివరగా సరస్సులు నేలగా మారతాయి. మానవుల కారణంగా, త్వరిత యూట్రోఫికేషన్ జరిగి చాలా సరస్సులు కనిపించకుండా పోతున్నాయి.

3. ఉష్ణకాలుష్యం: ధర్మల్ విద్యుత్ కేంద్రాలు మరియు కర్మాగారాలు బాయిలర్స్ చల్లబరిచేందుకు నీటిని వినియోగిస్తారు తిరిగి వేడి నీటిని నదులు మరియు ఇతర నీటి ప్రాంతాలలో విడుదల చేస్తారు. స్టీనో ధర్మల్ జీవులు ఉష్ణోగ్రత పెరుగుదలను అస్సలు తట్టుకోలేక వెంటనే చనిపోతాయి.

II. నీటి కాలుష్యాన్ని నివారించుటకు ప్రమాణాలు:

  1. మురుగునీటిని నీటి వనరులలోనికి విడుదల చేయుటకు ముందే శుద్ధీకరణ ట్యాంకుల ద్వారా శుద్ధిచేయాలి.
  2. వ్యర్ధాలను కూడా శుద్ధిచేసిన తరువాతే నీటి వనరులలోకి వదలాలి.
  3. రసాయనపురుగు మందుల కాలుష్యాన్ని నివారించుటకు తక్కువ గాఢత కల రసాయనాలను, జీవక్షయ రసాయనాలను మరియు జీవ పురుగు మందుల వాడకాన్ని ప్రోత్సహించాలి.
  4. వేడి నీటిని శీతలీకరణకు పంపిన తరువాతే నీటి ప్రాంతాలలోకి విడుదల చెయ్యాలి.
  5. ఇకోసాన్ మరుగు దొడ్లు (పొడిసేంద్రియ మరుగుదొడ్లు) ను ఎక్కువగా వినియోగంలోకి తేవాలి. ఎందుకంటే మానవ విసర్జితాలను పునఃచక్రియం చేయడం వలన రసాయన ఎరువుల వాడకం మరియు నీటి వినియోగం తగ్గుతాయి.

Leave a Comment