AP Inter 1st Year Telugu Question Paper March 2023

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers and AP Inter 1st Year Telugu Question Paper March 2023 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Question Paper March 2023

Time : 3 Hours
Max. Marks : 100

సూచన : ప్రశ్న పత్రము ప్రకారము సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒక దానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1) జనులు నుతింపఁగా …………………. సూరినుతుండగు నీకు నర్హమే.

2) ఇల్లో, ముంగిలియో, …………………… కటువిచ్చేయండ లింగమా !

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) మేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న పూర్వపు ‘తెలుగోడి’ వైభవాన్ని వివరించండి.
2) కుబేరుడు రావణునికి చేసిన హితబోధను వివరించండి.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) హాస్యం అంటే ఏమిటో తెలిపి సోదాహరణంగా వివరించండి.
2) యార్లగడ్డ తెలియజేసిన ఏవేని నాలుగు ముఖ్యమైన పదాలను వివరించండి.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1) ‘కుంకుడాకు కథలోని సామాజిక, ఆర్థిక అంతరాలను వివరించండి.
2) ‘అంపకం’ ఆధారంగా తండ్రి, కూతుళ్ల అనుబంధాన్ని వివరించండి.
3) ఊతకర్ర కథలో రచయితను ఆకర్షించిన తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించండి.
4) ‘సౌందర్యం’ కథ ద్వారా మనుషుల స్వభావాలను వివరించండి.

V. క్రింది వాటిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. దీనికిట్టి దురవస్థ వాటిల్లె నీడ్యచరిత
2. ధర్మము వహించు జనుండు కృతార్థుఁడెయ్యెడన్
3. అధికార ముద్రికలంతరించె
4. సవతి బిడ్డలపోరు మనకేలా !

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానములు రాయండి. (2 × 3 = 6)

1) సహదేవుడెట్టివాడు ?
2) తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి.
3) వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలుపండి.
4) రావణుడు ఏ విధంగా కైలాసానికి వెళ్ళాడు ?

VII. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) అసహజత్వం వల్ల కలిగే హాస్యాన్ని గురించి తెల్పండి.
2) కందుకూరి రచనలను తెల్పండి.
3) ‘ప్రాడిజీల’ ను గురించి వివరించండి.
4) మాటతీరు అంటే ఏమిటో వివరించండి.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు /రచయితలు) (2 × 3 = 6)

1) కంకంటి పాపరాజు రచనలను, కవితా శైలిని తెలపండి.
2) శ్రీరంగం నారాయణబాబును గురించి రాయండి.
3) మునిమాణిక్యం నరసింహారావును గురించి రాయండి.
4) యస్వీ భుజంగరాయ శర్మ జీవిత విశేషాలను తెలుపండి.

IX. క్రింది వానిలో ఒక దానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1) మీ ఇంటర్మీడియట్ చదువు గురించి తల్లిదండ్రులకు లేఖ రాయండి.
2) ఇంటర్ పబ్లిక్ పరీక్షల సమయంలో విద్యుత్ కోత నివారణ గురించి సంబంధిత అధికారికి లేఖ రాయండి.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి సంధి పేరు, సూత్రము వ్రాయండి. (4 × 3 = 12)

1) మహాత్మ
2) దేహోద్ధతి
3) అదేమి
4) ఆత్మైక
5) అత్యంత
6) నోరెత్తి
7) సూడిదవెట్టిన
8) నీయనుజులు

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) తల్లిదండ్రులు
2) ధర్మహాని
3) అసత్యము
5) ముల్లోకములు
6) వేటకుక్కలు
7) దశాననుండు
4) కమ్మని కలము
8) ప్రకృతి రంగము

XII. ఈ క్రింది పదాలలో ఐదింటికి పద దోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1) వుడుత
2) ఎనక
3) బేదం
4) శబ్దం
5) స్మశానం
6 ద్రుశ్యం
7) కౄరుడు
8) వున్నది
9) ఎంకమ్మ
10) సివుడు

XIII. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1) Speak kind and sweet words.
2) Ramayana was written by Valmiki.
3) A friend in need is a friend indeed.
4) The earth revolves around the Sun.
5) Amaravathi is the capital of Andhra Pradesh.

XIV. ఈ క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

మన జానపద కళల్లో ఒకానొక విశిష్టమైన కళారూపం తోలు బొమ్మలాట. ఇది క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే చాలా ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. తెల్లటి వస్త్రాన్ని తెరగా అమర్చి, దానిపై దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శిస్తారు. ఈ తోలు బొమ్మలు ఆంధ్రదేశంలోని ప్రాచీన ఓడరేవుల ద్వారా భారతీయులతో పాటు విదేశాలకు వెళ్ళాయి. నేడు పాశ్చాత్య దేశాలలో గొప్పగా చెప్పుకొనే ఛాయా ప్రదర్శనలకు ఈ తోలు బొమ్మలే మూలం. మనదేశంలో ఈ ఆటలో భారత, రామాయణ కథలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఈ ఆటలోని అల్లాటప్పగాడు, బంగారక్క, జట్టుపోలిగాడు, కేతిగాడు వంటి హాస్య పాత్రలు గ్రామీణుల మనసుల పై విశేషమైన ముద్రవేశాయి. వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచే ఇటువంటి కళారూపాలను కాపాడుకోవడం మన ప్రస్తుత కర్తవ్యం.

ప్రశ్నలు :
1. తోలుబొమ్మలాటలో ఏ కథలు ఎక్కువగా ప్రదర్శిస్తారు ?
2. తోలుబొమ్మలాటలు ఎప్పటి నుండి ప్రచారంలో ఉన్నాయి ?
3. విదేశాలలోని ఛాయా ప్రదర్శనకు మూలమేది ?
4. మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి ?
5. తోలు బొమ్మలాటలోని హాస్యపాత్రలేవి ?

XV. ఈ క్రింది వాటిలో ఐందింటికి ఏకవాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1) పాంచాల రాజకుమార్తె ఎవరు ?
2) తిన్నని గ్రామం పేరేమిటి ?
3) పాపరాజు రాసిన యక్షగానం పేరేమిటి ?
4) జాషువా బిరుదులేవి ?
5) విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్పూర్తినిచ్చిన గేయం ఏది ?
6) మానవ రూపం దాల్చిందేమిటి ?
7) సారమేయ రూపాన ఉన్నదెవరు ?
8) ధూర్జటి అంటే అర్థమేమిటి ?

XVI. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1) ‘కాంతంకథలు’ రాసిందెవరు ?
2) ‘ఆంధ్ర షెల్లీ’ అని ఎవరిని అంటారు ?
3) కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెల్పండి.
4) పాల్కురికి సోమనాథుడు ఏ కవితా ప్రక్రియను ఆదరించాడు ?
5) త్యాగరాజస్వామి ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి ?
6) మొత్తం లోకాలు ఎన్ని ?
7) రాయలవారి సాహితీ భవనం పేరు తెల్పండి.
8) ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?

Leave a Comment