AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

Students get through AP Inter 1st Year Chemistry Important Questions 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Chemistry Important Questions 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వాతావరణం, జీవావరణం పదాలను వర్ణించండి. [Imp.Q]
జవాబు:
వాతావరణం:
భూమిచుట్టూ రక్షణాత్మకంగా ఉండే వాయు పొరను వాతావరణం అంటారు. జీవావరణం: జీవరాశులు అన్నింటిని అనగా మొక్కలు, జంతువులు, మానవులను ఉమ్మడిగా జీవావరణం అంటారు.

ప్రశ్న 2.
శిలావరణం, జలావరణం పదాలను వివరించండి. [Imp.Q]
జవాబు:
జలావరణం:

  1. మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, జలాశయాలు, నీటి కాలువలు, రిజర్వాయర్లు, ధృవప్రాంతంలోనిమంచు శిఖరాలు, భూగర్భజలాలను కలిపి జలావరణం అంటారు.
  2. భూమి ఉపరితలంపై 4/5th వంతు నీరు ఉన్నది. దీనిలో 97 శాతం సముద్రపు నీరు రూపంలో మిగిలిన మూడు శాతం ధృవాల వద్ద మంచు రూపంలో ఉండును.
  3. చాలా తక్కువ శాతం నీరు వ్యవసాయనికి, త్రాగునీటికి మరియు మానవ అవసరాలకు ఉపయోగపడును.

శిలావరణం:

  1. ఖనిజాలు, మట్టి (భూసారం)తో నిండి ఉన్న ఘనస్థితి, భూమి బాహ్య పొరను శిలావరణం అంటారు.
  2. భూమి లోపలి పొర ఖనిజాలతోనూ, మరియు అత్యంత లోపల పొర సహజ వాయువు మరియు పెట్రోలియంతో నిండి ఉంటుంది.

ప్రశ్న 3.
భూకాలుష్యం నిర్వచించండి.
జవాబు:
పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయపరమైన కలుషితకారిణిలు, రసాయన మరియు రేడియోధార్మిక కలుషితాల వలన ఏర్పడే కాలుష్యాన్ని భూకాలుష్యం అంటారు.

ప్రశ్న 4.
రసాయన ఆక్సిజన్ అవసరం (COD) అంటే ఏమిటి? [Imp. Q][IPE ‘14,14][AP,TS 16,17,18]
జవాబు:
రసాయన ఆక్సిజన్ అవసరం (COD):
కలుషితమైన నీటిలో కరిగి వుండే కర్బన రసాయనిక పదార్ధాలను పూర్తిగా ఆక్సీకరణం చెందించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని రసాయనిక ఆక్సిజన్ అవసరం (COD) అంటారు.

ప్రశ్న 5.
జీవ రసాయన ఆక్సిజన్ అవసరం (BOD) అంటే ఏమిటి? [AP 20][IPE ’14][AP,TS 16,17,18,19]
జవాబు:
జీవ రసాయన ఆక్సిజన్ అవసరం (BOD):
20°C వద్ద, 5 రోజుల కాలంలో, నీటిలోని సూక్ష్మజీవులు ఉపయోగించకునే ఆక్సిజన్ పరిమాణాన్ని జీవ రసాయనిక ఆక్సిజన్ అవసరం B.O.D అని అంటారు.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 6.
ట్రోపోవరణం, స్ట్రాటోవరణం అంటే ఏమిటి?
జవాబు:
ట్రోపోవరణం :
మానవులు, వారితో సహజీవనం చేసే ఇతర జీవులు మనుగడ సాధించే వాతావరణంలోని మిక్కిలి క్రింది ప్రదేశాన్ని ట్రోపోవరణం అంటారు.

స్ట్రాటోవరణం:
ట్రోపోవరణం పైన సముద్ర మట్టానికి 10 నుంచి 50 కి.మీ దూరంలో ఉన్న పొరను స్ట్రాటోవరణం అంటారు.

ప్రశ్న 7.
ట్రోపోవరణంలో ఉండే ప్రధాన కణస్థితి కాలుష్యాలను పేర్కొనండి.[AP 19]
జవాబు:
ట్రోపోవరణంలోని కణస్థితి కాలుష్యాలు: దుమ్ము, పలచని పొగమంచు, ధూమాలు, పొగ, స్మాగ్ మొదలైనవి.

ప్రశ్న 8.
కాలుష్య గాలిలో ఉండే నాలుగు వాయుస్థితి కాలుష్యాలను పేర్కొనండి.
జవాబు:
సల్ఫర్, నైట్రోజన్, కార్బన్ల ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, ఓజోన్ మొదలగునవి కాలుష్య గాలిలో ఉండే వాయుస్థితి కాలుష్యాలు.

ప్రశ్న 9.
గ్రీన్హౌస్ ఫలితం…….వాయువుల ద్వారా కలుగుతుంది. [Imp.Q][IPE ’14][TS 18][AP 20]
జవాబు:
గ్రీన్ హౌస్ ఫలితం CO2, CH4, O3, CFC(క్లోరో ఫ్లోరో కార్బన్)లు, నీటి ఆవిరి మొదలగు వాటి వలన కలుగుతుంది.

ప్రశ్న 10.
ఏ ఆక్సైడ్లు ఆమ్ల వర్షానికి కారణంగా ఉన్నాయి. దీని pH విలువ ఎంత? [TS 19][ Mar’13] [Imp.Q]
జవాబు:
నైట్రోజన్, సల్ఫర్ మరియు కార్బన్ల ఆక్సైడ్లు వర్షపు నీటిలో కలిసినపుడు ఆమ్ల వర్షం ఏర్పడును. ఆమ్ల వర్షం pH విలువ 5.6 కన్నా తక్కువగా ఉండును.

ప్రశ్న 11.
ఆమ్ల వర్షాలు నష్టదాయకం. ఎందువల్ల ? (లేదా) ఆమ్ల వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి. [May’13, Mar’11][TS 15,17,18][AP 16,18]
జవాబు:

  1. చారిత్రక కట్టడాల జీవితకాలం తగ్గిపోతుంది.
  2. నీటిలోని చేపల ఉత్పత్తి ఆమ్ల వర్షం కారణంగా తగ్గిపోతాయి.
  3. త్రాగునీరు కలుషితమగును.
  4. ఆమ్లవర్షం కారణంగా నేల pH తగ్గును. తద్వారా భూసారం తగ్గిపోతుంది.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 12.
పొగ, పలుచని పొగ అంటే ఏమిటి?
జవాబు:
పొగ:
కర్బన పదార్థాలను దహనం చెందించినపడు ఏర్పడే ఘనపదార్థకణాలు లేదా ఘన మరియు ద్రవ పదార్థ మిశ్రమ కణాలను పొగ అంటారు.

పలుచని పొగ:
గాలిలోని భాష్పాలు సంఘననం చెందుట వలన లేదా పిచికారీ ద్రవాల కణాల ద్వారా ఏర్పడు కణాలను పలుచని పొగ అంటారు.

ప్రశ్న 13.
సాంప్రదాయక స్మాగ్ అంటే ఏమిటి? దాని రసాయన స్వభావం ఏమిటి? (ఆక్సీకరణ/క్షయీకరణ) [Imp.Q]
జవాబు:
పొగ, మంచు మరియు సల్ఫర్ డైఆక్సైడ్ ల మిశ్రమాన్ని సాంప్రదాయక స్మాగ్ అంటారు. ఇది చల్లటి తేమ వాతావరణంలో ఉంటుంది. ఇది క్షయకరణ స్వభావం కలిగి ఉంటుంది. అందువలన దీనినే క్షయకరణ స్మాగ్ అంటారు.

ప్రశ్న 14.
కాంతి రసాయన స్మాగ్లోని సాధారణ అనుఘటకాలను తెలపండి. [AP 19][TS 16]
జవాబు:
కాంతి రసాయన స్మాగ్లోని సాధారణ అనుఘటకాలు: ఒజోన్, నైట్రిక్ ఆక్సైడ్, ఫార్మాల్డిహైడ్, ఎక్రోలిన్ మరియు ‘పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ (PAN)

ప్రశ్న 15.
PAN అంటే ఏమిటి? దీని ప్రభావం ఏమిటి? [AP 19][TS 17]
జవాబు:
పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ను PAN అంటారు. PAN శక్తివంతమైన కంటి ప్రకోపాలు కలిగించును.

ప్రశ్న 16.
స్ట్రాటోవరణంలో ఓజోను ఎలా ఏర్పడుతుంది.?
జవాబు:
స్ట్రాటోవరణంలో డైఆక్సిజన్ (O2) అణువులపై UV వికిరణాలు చర్య ద్వారా ఏర్పడిన క్రియాజన్యమే ఓజోను. అణు అక్సిజన్ను, UV వికిరణాలు, స్వేచ్ఛాస్థితిలో ఉండు ఆక్సిజన్ పరమాణువులు (O) గా వియోగిస్తాయి. ఈ ఆక్సిజన్ పరమాణువులు, అణు ఆక్సిజన్తో సంకలనం చెంది, ఓజోన్ న్ను ఏర్పరుస్తాయి.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 1

ప్రశ్న 17.
CF2 Cl2 ద్వారా ఓజోను తరుగుదల ప్రాప్తించే చర్యలో ఇమిడి ఉండే అంతర్గత రసాయన సమీకరణాలు తెలపండి. [Imp.Q]
జవాబు:
సూర్యరశ్మి సమక్షంలో క్లోరోఫ్లోరో కార్బన్లు (CFC’s) ఈ క్రింది విధంగా విఘటనం చెందును.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 2
ఈ శృంఖల చర్య వలన ఓజోను పొర క్షీణించును.

ప్రశ్న 18.
ఓజోను రంధ్రం అంటే ఏమిటి? దీనిని తొలిసారిగా ఎక్కడ గమనించారు?
జవాబు:
ఓజోన్ పొరలో క్షీణతను ఓజోన్ రంధ్రం అంటారు.
ఇది అంటార్కిటికాలోని దక్షిణ ధృవం వద్ద మొదట కనుగొనబడింది.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 19.
చల్లని శుద్ధ నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం తెలపండి?
జవాబు:
చల్లని శుద్ధ నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం సుమారుగా 10ppm.

ప్రశ్న 20.
శుద్ధనీరు, కలుషిత నీరు, వీటి BOD విలువలను తెలపండి. [TS 17]
జవాబు:
శుద్ధ నీటి BOD విలువ 5ppm కన్నా తక్కువగా ఉండును.
కలుషిత నీటి BOD విలువ 17ppm లేదా అంతకంటే అధికంగా ఉండును.

ప్రశ్న 21.
నీటిని కాలుష్యానికి గురిచేసే మూడు పారిశ్రామిక రసాయన పదార్థాలను తెలపండి. [AP 19]
జవాబు:
డిటర్జంట్లు, పెయింట్లు, కలుపు నివారుణులు, అద్దకాలు మరియు మందులు మొదలైనవి.

ప్రశ్న 22.
నీటి కాలుష్యానికి కారణమైన వ్యవసాయరంగ రసాయన పదార్థాలను తెలపండి.
జవాబు:
వ్యవసాయరంగ రసాయనాలైన రసాయన ఎరువులు, క్రిమిసంహారిణులు, కలుపు మొక్క నివారణులు మొదలగునవి నీటి కాలుష్యానికి కారణాలు.

ప్రశ్న 23.
పర్యావరణ విభాగాల పేర్లను తెలపండి?
జవాబు:

  1. వాతావరణం
  2. జలావరణం
  3. శిలావరణం
  4. జీవావరణం

ప్రశ్న 24.
పర్యావరణం ఎందుకు కలుషితమవుతుంది?
జవాబు:
పర్యావరణ కాలుష్యానికి కారణాలు:
జనాభా పెరుగుదల, సహజవనరుల తగ్గుదల, పట్టణీకరణం, పారిశ్రామికీకరణం, అడవుల నరికివేత.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 25.
పర్యావరణాన్ని కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవచ్చు?
జవాబు:
(i) చెట్లను పెంచడం (ii) అడవులను సంరక్షించుట (iii) శుభ్రత మరియు పచ్చదనంతో పరిసరాలను శుభ్రంగా వుంచుట.

ప్రశ్న 26.
కాలుష్య కారకం, మలినాలను నిర్వచించండి?
జవాబు:
కాలుష్య కారకం :
మనిషి చేసే పనుల ద్వారా కాని, ప్రకృతిలో జరిగిన మార్పుల వల్ల గాని పర్యావరణంలోకి ప్రవేశించి పర్యావరణానికి ప్రమాదం కలుగజేసే పదార్థాన్ని ‘కాలుష్యకారకం’ అంటారు.
ఉదా : ప్లాస్టిక్ వనరులు, DDT, SO2, CO, Pb, Hg…..

మలినం :
ప్రకృతిలో సహజంగా లభించని, మానవుల లేదా ప్రకృతి కార్యకలాపాల ద్వారా పరిసరాలలోకి విడుదల అవుతూ పర్యావరణానికి ప్రమాదం కలుగజేసే పదార్ధాన్ని మలినం అంటారు.
ఉదా : పరిశ్రమలోని వ్యర్థ ద్రవాలు, పెస్టిసైడ్లు.

ప్రశ్న 27.
గ్రాహకం, సింక్, రసాయనిక జాతులను నిర్వచించండి? [Mar’11, 13][AP 15,17,18][TS 16]
జవాబు:
గ్రాహకం :
కాలుష్యం ప్రభావానికి గురయ్యే మాధ్యమాన్ని ‘గ్రాహకం’ అంటారు.

సింక్ :
కాలుష్యాలతో చర్య జరిపే మాధ్యమాన్ని ‘సింక్’ అంటారు.

రసాయనిక జాతి :
కాలుష్యపు రసాయనిక సంయోగ స్థితి లేదా జాతిని, రసాయనిక జాతి అని అంటారు.

ప్రశ్న 28.
నీటిలో ఫ్లోరైడ్లు వుంటే ఏమవుతుంది?
జవాబు:
ఫ్లోరైడ్లు అధికంగా వుండే నీటిని త్రాగిన వారికి ‘ఫ్లోరోసిస్’ అనే వ్యాధి వస్తుంది. దీని వలన దంతాలు పసుపు రంగులోకి మారుట మరియు ఎముకల మందం తగ్గుట జరుగును.

మనం త్రాగేనీటిలో ఫ్లోరైడ్ల యొక్క గాఢత 3 ppm కన్నా ఎక్కువగా వుంటే నష్టదాయకం. శరీరంలోని కాల్షియంతో ఫ్లోరైడ్లు చర్య జరిపి CaF2ను ఏర్పరుస్తాయి.
Ca + F2 ⇒ CaF2.

ప్రశ్న 29.
భూమి ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది?
జవాబు:
భూమి తన మీద ప్రసరించిన 75% సూర్యకాంతిని గ్రహించి మిగిలిన ఉష్ణభాగాన్ని వాతావరణంలోకి తిప్పి పంపుతుంది. ఈ ఉష్ణశక్తిని వాతావరణంలోని CO2, CH4 O3, CFCs వంటి వాయువులు మరియు నీటి ఆవిరితో గ్రహిస్తాయి. దీన్ని మరల వాతావరణానికి పంపించి దాన్ని వేడెక్కెటట్లు చేస్తాయి. దీనివల్ల భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది.

ప్రశ్న 30.
ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడితే ఏమవుతుంది?
జవాబు:
సూర్యుని నుండి వచ్చే UV కిరణాలను ఓజోన్ పొర కాపాడుతుంది. ఓజోన్ పొరకు రంధ్రాలు పడటం వల్ల, సూర్యుని నుండి UV కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. దీని ఫలితాలు 1. చర్మ క్యాన్సర్ 2. కంటిలో శుక్లాలు 3. భూమిలో తేమ శాతం తగ్గడం 4. కిరణజన్య సంయోగక్రియపై ప్రభావం.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 31.
CFC ల వల్ల కలిగే నష్టాలేమిటి? [May’09]
CFC లు స్ట్రాటో ఆవరణంలోకి ప్రవేశించిన తరువాత, అవి CI స్వేచ్ఛా ప్రాతిపదికలుగా విఘటనం చెందుతాయి. దీనివల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడతాయి.
సూర్యుని నుండి వచ్చే UV కిరణాలు భూమిపై పడటం వల్ల చర్మ క్యాన్సర్, కంటిలో శుక్లాలు ఏర్పడును.

ప్రశ్న 32.
కార్బన్ మోనాక్సైడ్ గాలిలో పెరిగితే ఏమి జరుగుతుంది? [Mar’09]
జవాబు:
గాలిలో కార్బన్మౌనాక్సైడ్ పరిమాణాలు అధికంగా వుంటే, ఆ గాలిని పీల్చినపుడు కార్బన్ మోనాక్సైడ్ ఆక్సీహిమోగ్లోబిన్తో సంయోగం చెంది కార్బాక్సిహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం వివిధ భాగాలకు అందవలసిన ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యక్తికి తలతిరగడం లేదా కోమాలోకి వెళ్లిపోవడం జరుగును.

ప్రశ్న 33.
ఏవేని రెండు కలుషిత నీటి యొక్క ప్రభావాలను వ్రాయండి. [May 2011]
జవాబు:

  1. కలుషిత నీరు త్రాగుటకు పనికిరాదు.
  2. కలుషిత నీరు వలన కలరా, కామెర్లు, టైఫాయిడ్ వంటి జబ్బులు వచ్చును.
  3. కలుషిత నీరు జలచర జీవనాన్ని నాశనం చేయును.

ప్రశ్న 34.
కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఏవైనా రెండు ముఖ్యమైన సింక్ లను తెలియజేయండి. [Mar 2010]
జవాబు:
సముద్రపు నీరు, వృక్షజాతి.

ప్రశ్న 35.
యుట్రోఫికేషన్ అనగానేమి?
జవాబు:
నీటి వనరులైన సరస్సులు, చెరువులలోకి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం నుంచి కర్బన రసాయన పదార్ధాలు చేరితే, నీటి పోషక గుణం పెరిగిపోతుంది. ఇది శైవలాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. శైవలాల పెరుగుదల తరువాత సరస్సుల అడుగు భాగంలో వ్యర్థం, ఘనపదార్థంగా మారడం వల్ల చివరికి సరస్సులు ఎండిపోతాయి. దీనినే యుట్రోఫికేషన్ అంటారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
సింక్, COD, BOD, TLV పదాలను వివరించండి. [TS 16]
జవాబు:
సింక్ :
కాలుష్యాలతో చర్య జరిపే మాధ్యమాన్ని సింక్ అంటారు.

రసాయనిక ఆక్సిజన్ అవసరం(COD):
కలుషితమైన నీటిలో కరిగివుండే కర్బన రసాయనిక పదార్థాలను పూర్తిగా ఆక్సీకరణం చెందించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని (COD) అంటారు.

జీవరసాయన ఆక్సిజన్ అవసరం (BOD):
20°C వద్ద, 5 రోజుల కాలంలో, నీటిలోని సూక్ష్మజీవులు ఉపయోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని BOD అంటారు.

ఆరంభ అవధి విలువ(TLV) :
ఒక రోజులో ఒక వ్యక్తి 7-8 గంటల కాలం గాలిలోని విష పదార్థాలకు, లేదా కాలుష్యాలకు గురి అయినప్పుడు, వ్యక్తి ఆరోగ్యాన్ని భంగపరచడానికి అవసరమయ్యే పదార్థాల కనీసపు స్థాయిని ఆరంభ అవధి విలువ (TLV) అంటారు.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 2.
భూగోళం వేడెక్కడం ఎలా జరుగుతుంది? దీని ఫలితాలేమిటి? దీన్ని ఆపే విధానాలు వివరించండి . [May’13][TS 15][AP 17,18]
జవాబు:
CO2 మరియు నీటి ఆవిరి వాతావరణానికి చేరడం వలన భూ ఉపరితలం క్రమంగా వేడేక్కును. దీనినే హరిత మందిర ప్రభావం (లేదా) భూగోళం వేడెక్కుట అని అంటారు.

కారణాలు :
CO2, NO, N2O, CH4, O3 వంటి వాయువుల గాఢత పెరిగిన కొద్దీ, గ్రీన్ హౌస్ గ్లాసుల్లాగ లేదా మూసి వుంచిన కారు తలుపులు అద్దాల్లాగా పనిచేయును. ఫలితంగా తక్కువ తరంగదైర్ఘ్యం గల సూర్యకిరణాలు. మాత్రమే అంతరాళం నుంచి భూమి మీదకు వచ్చును. మరియు ఎక్కువ తరంగదైర్ఘ్య కిరణాలు (IR) భూమి నుంచి పైకిపోకుండా ఈ వాయువులు అడ్డుకుంటాయి. ఈ వాయువుల గాఢతలు ఎంత ఎక్కువైతే IR కిరణాలు అంత ఎక్కువగా భూమికి తిరిగి పంపబడటం జరిగి భూమి అంత ఎక్కువగా వేడెక్కుతుంది. ఈ IR కిరణాల బహిర్గమన నిరోధక ప్రభావం భూమి ఉపరితల ఉష్ణోగ్రతను పెంచుతుంది.

ఫలితాలు :

  1. పోలార్ ప్రాంతాల్లోని మంచు గడ్డలు కరిగి సముద్రాల్లోకి నీరు చేరును. దీనివల్ల సముద్ర మట్టం 90cm లు. వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, మియామీ, చైనాలోని షాంగై, భారత్లోని చెన్నై, గోవా వంటి పల్లపు ప్రాంతాలు మునిగిపోవచ్చు. లేదా వాటికి విపరీతమయిన నష్టం రావచ్చు.
  2. వాతావరణం ఎక్కువగా వేడెక్కడం వల్ల నీరు త్వరగా వేడెక్కి ఆవిరి అగును. అందువలన చెరువులు, నదులు, నీటిని కోల్పోవును. దీనివల్ల ఆమ్ల వర్షాలు, తుఫానులు, ఉప్పెనలు రావచ్చు.
  3. ఉపరితల నీరు ఆవిరైపోవడం వల్ల వ్యవసాయం విపరీతంగా ప్రభావితమవుతుంది. వ్యవసాయ పనులకు నీరు దొరకదు.

నివారణ :

  1. CO2 ను శోషించుకునే సింక్లు (మొక్కలు)అధికం చేయాలి.
  2. నీలి ఆకుపచ్చ ఆల్గే, సముద్రాల్లో పెరగడాన్ని తగ్గించాలి.

ప్రశ్న 3.
ఆమ్ల వర్షం ఏర్పడే విధానాన్ని తెలుపుతూ దానిలోని అంతర్గత రసాయన సమీకరణాలను వివరించండి.
జవాబు:
ఆమ్ల వర్షం:
నైట్రోజన్ మరియు సల్ఫర్ ఆక్సైడ్లు వాతావరణంలో అనేక రసాయన చర్యలకు లోనయి నైట్రిక్ ఆక్సైడ్ మరియు సల్ఫూరిక్ ఆమ్లం లను ఏర్పరుస్తాయి. వీటి pH విలువ 4 – 5.

ఆమ్ల వర్షం ఏర్పడే విధానం:
నైట్రోజన్ ఆక్సైడ్లు ఆక్సిజన్తో, ఓజోన్ తో కలిసి నైట్రోజన్ ఆక్సైడ్ను ఏర్పరచును. నైట్రోజన్ ఆక్సైడ్లు నీటితో కలిసి నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడును.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 3
ఈ ఆమ్లాలు నీటిలో కరిగి ఆమ్ల వర్షాలుగా భూమిని చేరుతాయి.

ప్రశ్న 4.
కాంతి రసాయన స్మాగ్ ఎలా ఏర్పడుతుంది? ఇది కలుగజేసే చెడు ప్రభావాలు ఏమిటి?
జవాబు:
ఆటోమొబైల్లు (రవాణా వాహనాలు) కర్మాగారాల నుంచి వెలువడే అసంతృప్త హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్ పై సూర్య కాంతి చర్యలో కాంతి రసాయన స్మాగ్ ఏర్పడును. ఈ చర్యలో NO, NO2గా ఆక్సీకరణంగా చెందును.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 4
నవజాత ఆక్సిజన్ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్తో చర్య జరిపి ఓజోన్ ను ఏర్పరచును.
O2(g) + O(g) → O3(g)
ఓజోన్ NO తో వేగంగా చర్య జరిగి NO2(g)ను ఏర్పరుచును.
NO(g) + O3(g) → NO2(g) + O2(g)

ఓజోన్ విషపూరితమైనది మరియు NO2, O3 లు రెండూ బలమైన ఆక్సీకరణులు. ఇవి కాలుష్య గాలిలో మండే చర్యకు గురికాకుండా మిగిలి ఉన్న హైడ్రోకార్బన్లతో చర్య జరిపి ఫార్మాల్డిహైడ్, ఎక్రోలిన్, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ (PAN).వంటి రసాయన పదార్థాలను ఏర్పరుస్తాయి.

చెడు ప్రభావాలు:

  1. కంటి ప్రకోపాలను ఏర్పరచును.
  2. ఇది దృష్టి సామర్థ్యాన్ని తగ్గించును మరియు రోడ్డు ట్రాఫిక్కు అంతరాయాన్ని కలిగించును.
  3. ఇది రబ్బరు బీటలు ఏర్పడుటకు, వృక్షజాతి జీవనం విస్తారంగా నష్ట పడటానికి దారి తీస్తుంది.

ప్రశ్న 5.
వాతావరణంలో ఓజోన్ పొర తరుగుదల ఎలా ఏర్పడుతుంది? ఈ ఓజోన్ పొర తరుగుదల ద్వారా ప్రాప్తించే హానికరమైన ప్రభావాలను పేర్కొనండి. [TS 16]
జవాబు:
స్ట్రాటోవరణంలో ఓజోన్ పొర CFC’s ల చేత క్షీణించబడి ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడును. దీనినే ఓజోన్ తరుగుదల అందురు.

ఓజోన్ పొర క్షీణతకు కారణం CFC’s, NO, Cl2 మరియు అగ్నిపర్వతాల నుంచి విడుదల అయిన వివిధ వాయువులు ఓజోన్ పొర తరుగుదలకు కారణం.

CFC’s లు శక్తివంతమైన U.V వికిరణాల చేత వియోగం చెందించబడి క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికను విడుదల చేస్తాయి.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 5

ఓజోన్ పొర రంధ్రాల ఫలితాలు:
ఓజోన్ వియోగం (రంధ్రాలు) చెందడం వల్ల ఎక్కువ U.V. కిరణాలు ట్రోపోస్పియర్ను చేరి క్రింది ఫలితాలు తెస్తాయి. 1. చర్మ క్యాన్సర్, 2. శుక్లాలు 3. భూమిలో తేమశాతం తగ్గించడం 4. కిరణజన్య సంయోగక్రియపై ప్రభావం.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 6.
హరిత రసాయన శాస్త్రం అనగానేమి? తగు ఉదాహరణలతో వివరించండి. [AP 17]
జవాబు:
రసాయన శాస్త్రం మరియు ఇతర శాస్త్ర విభాగాలను ఉపయోగించుకొని సాధ్యమైనంత వరకు పర్యావరణంలో కాలుష్యం రాకుండా చూడటం లేదా తగ్గించటం గురించి వివరించేదే హరిత రసాయన శాస్త్రం.

హరిత రసాయనశాస్త్రంలోని ముఖ్యభావనలు :

  1. సాధ్యమైనంత తక్కువగా రసాయనాలను ఉపయోగించడం.
  2. వీలైనంత తక్కువగా శక్తిని వినియోగించుకోవడం.
  3. తక్కువ స్థాయిలో వ్యర్థపదార్థాలు ఉండేటట్లు చూడడం.

ఉదా 1 :
ఈ మధ్యకాలంలో ప్రవేశించిన CFC బల్బుల వలన విద్యుచ్ఛక్తి బాగా ఆదా అవుతుంది.

ఉదా 2:
ఈ మధ్యకాలంలో బట్టలను బ్లీచింగ్ చేయటానికి బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తున్నారు. దీని వలన నీటి వినియోగం తగ్గుతుంది.

ఉదా 3:
బట్టల’ డ్రై క్లీనింగ్’ కొరకు ఇదివరకు టెట్రాక్లోరో ఈధేన్ను ఉపయోగించేవారు. ఇది భూజలాలను కాలుష్యపరుచును. ప్రస్తుతం దానికి బదులుగా ద్రవీకరించిన కార్బన్ డై ఆక్సైడ్ను తగిన డిటర్జెంట్తో వాడుతున్నారు. ఇది భూజలాలను అంతగా కాలుష్యపరచదు.

ఉదా 4:
ఈ రోజుల్లో వాహనాలను పర్యావరణ స్నేహకాలుగా తయారుచేస్తున్నారు.

Leave a Comment