AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

Students can go through AP Inter 1st Year Botany Notes 1st Lesson జీవ ప్రపంచం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 1st Lesson జీవ ప్రపంచం

→ మొక్కల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే ‘వృక్షశాస్త్రం’.

→ ‘జీవప్రపంచం’ అన్ని రకాల జీవులు అనగా అతి సూక్ష్మజీవులైన శైవలాలు, శిలీంధ్రాల నుండి అతిపెద్ద జీవులైన కోనిఫెరస్, రెడ్ుడ్ చెట్ల వరకు అన్నింటిని కల్గి ఉంటుంది.

→ జీవం ఉన్న జీవుల లక్షణాలు: జననం, పెరుగుదల, ప్రత్యుత్పత్తి, పర్యావరణ పరిస్థితులను గ్రహించే సామర్ధ్యం, స్వయం ప్రతిపత్తి, జీవక్రియలు, పరిణామం, వార్ధక్యం మరియు మరణం.

→ వివిధ రకాల జీవుల జీవన విధానంలో ఉండే వైవిధ్యాన్ని ‘జీవవైవిధ్యం’ అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

→ ‘వర్గీకరణ శాస్త్రం’ జీవుల యొక్క గుర్తింపు, నామీకరణం మరియు వర్గీకరణను గురించి తెలియజేస్తుంది.

→ ICBN అనగా అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి.

→ ప్రతి జీవిని వాటి యొక్క పోలికలు మరియు భేదాలు ఆధారంగా గుర్తించి, రెండు పదాలు ఉన్న శాస్త్రీయ నామంతో నామీకరణం చేస్తారు. ఆ రెండు పదాలు ప్రజాతి నామం, జాతి నామం.

→ మొక్కలు మరియు జంతువుల యొక్క వర్గీకరణ అధ్యయనం వ్యవసాయశాఖ, అటవీశాఖ మరియు పరిశ్రమల యందు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జీవ వనరులు మరియు జీవవైవిధ్యం తెలుసుకొనుటకు ఉపయోగపడును. [IPE]

→ మొక్కల యొక్క జీవ నమూనాలు ‘ఉద్యానవనశాఖల’ యందు లభ్యమవుతాయి. [IPE]

→ హెర్బెరియాలు మరియు మ్యూజియంలు చనిపోయిన లేదా నిల్వ చేయబడిన నమూనాలను కలిగి ఉంటాయి. [IPE]

→ ‘కీ’ అనేది వర్గీకరణశాస్త్ర సహాయకం. దీని సహాయంతో మొక్కలు మరియు జంతువులను వాటి యొక్క పోలికలు మరియు వ్యత్యాసాల ఆధారంగా గుర్తించవచ్చును.

→ కట్లెట్: ‘కీ’లో విరుద్ధ లక్షణాలతో జంటలుగా ఉండే వ్యాఖ్యలను ‘కప్లెట్’ అంటారు. [IPE]

→ లీడ్: ‘కీ’లోని ప్రతి వ్యాఖ్యను ‘లీడ్’ అంటారు. [IPE]

→ జాతి అనునది వర్గీకరణ యొక్క మౌలిక ప్రమాణం. [IPE]

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

→ ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసం, విస్తరణల సమాచారం, మొక్కల జాబితాను ఒక క్రమ పద్ధతిలో కలిగి ఉన్న పుస్తకమును ఫ్లోరా అంటారు. [IPE]

→ తక్షణ సంప్రదింపు కోసం వాడే చిన్న పుస్తకమును మ్యానుయల్ అంటారు. [IPE]

→ ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన సమాచారాన్ని కలిగి ఉన్న పుస్తకమును మోనోగ్రాఫ్ అంటారు. [IPE]

→ పెరుగుదల: ద్రవ్యరాశి మరియు పరిమాణంలోని వృద్ధిని ‘ పెరుగుదల’ అంటారు.

Leave a Comment