AP Inter 1st Year Botany Important Questions Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

Students get through AP Inter 1st Year Botany Important Questions 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Botany Important Questions 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
‘బోటనీ’ అనే పదం ఏ విధంగా వాడుకలోకి వచ్చిందో వివరించండి. [AP M-19]
జవాబు:
బోటనీ ‘బౌస్సికీన్’ అనేపదం నుంచి ఏర్పడింది. దీని అర్ధం ‘పశువుల మేత’ .
కాలక్రమంలో ‘బౌస్సికీన్’ నుండి బోటానే అనే పదం, దీని నుండి బోటనీ అనే పదం వాడుకలోకి వచ్చింది.

ప్రశ్న 2.
పరాశరుడు రచించిన పుస్తకాల పేర్లు తెలిపి వాటిలోని ముఖ్యాంశాలను వివరించండి.? [AP M-17,20]
జవాబు:
పరాశరుడు రచించిన పుస్తకాలు ‘కృషిపరాశరం’ మరియు ‘వృక్షాయుర్వేదం’

  1. ‘కృషిపరాశరం’ పుస్తకం ‘వ్యవసాయం’ మరియు ‘కలుపు మొక్కల’ ను గురించి తెలియజేస్తుంది.
  2. ‘వృక్షాయుర్వేదం’ పుస్తకం అడవుల గురించి మరియు ఔషధ మొక్కలను గురించి వివరిస్తుంది.

AP Inter 1st Year Botany Important Questions Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం
ప్రశ్న 3.
‘వృక్షశాస్త్ర పిత’ అని ఎవరిని అంటారు? అతను రచించిన గ్రంథం ఏది? [TS M-18] [AP &TS M-16]
జవాబు:

  1. ‘థియోఫ్రాస్టస్’ ను వృక్షశాస్త్రపిత అని అంటారు.
  2. ఇతడు రచించిన గ్రంథం ‘ది హిస్టోరియాప్లాంటారమ్’.

ప్రశ్న 4.
‘హెర్బలిస్టులు’ అంటే ఎవరు? వారు రచించిన గ్రంథాలేవి?
జవాబు:
ఔషధ మొక్కలను గుర్తించి వాటిని సాంకేతికంగా వర్ణించే శాస్త్రవేత్తలనే ‘హెర్బలిస్టులు’ అంటారు. వీరు రచించిన గ్రంధం ‘హెర్బల్స్’.

ప్రశ్న 5.
వృక్ష వర్గీకరణ శాస్త్రాభివృద్ధికి కెరొలస్ వాన్ లిన్నేయస్ చేసిన కృషి ఏమిటి?
జవాబు:

  1. కారోలస్ వాన్ లిన్నేయస్’ అనే శాస్త్రవేత ద్వినామీకరణ విధానాన్ని వాడుకలోకి తీసుకువచ్చాడు.
  2. ఇతడు ‘లైంగిక వర్గీకరణ వ్యవస్థ’ని ప్రతిపాదించాడు.

ప్రశ్న 6.
మెండలు ‘జన్యుశాస్త్రపిత’గా ఎందుకు పరిగణిస్తున్నారు? [TS M-17]
జవాబు:
1866 వ సంవత్సరంలో మెండల్, బఠాణి మొక్కలపై సంకరణ ప్రయోగాలు జరిపి, అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టాడు. కావున మెండల్ను ‘జన్యు శాస్త్రపిత’గా పరిగణిస్తారు.

ప్రశ్న 7.
కణాన్ని కనుక్కొన్నదెవరు? ఆయన రచించిన పుస్తకం ఏమిటి? [TS May-17,22]
జవాబు:

  1. ‘రాబర్ట్ హుక్’ కణాన్ని కనుగొన్నాడు.
  2. ఇతను రచించిన పుస్తకం ‘మైక్రోగ్రాఫియా’.

ప్రశ్న 8.
పురా వృక్షశాస్త్రం అంటే ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి? [APM-17,22][TS M-15,17,20.]
జవాబు:

  1. మొక్కల శిలాజాల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పురావృక్షశాస్త్రం’ అని అంటారు.
  2. ఇది మొక్కలలో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 9.
హరితసహిత స్వయం పోషక థాలోఫైట్లు, హరిత రహిత పరపోషక థాలోఫైట్లకు సంబంధించిన వృక్షశాస్త్ర విభాగాలను తెల్పండి?
జవాబు:

  1. శైవలశాస్త్రం(ఫైకాలజీ): ఇది హరితసహిత, స్వయంపోషక థాలోఫైట్లును (శైవలాలు) అధ్యయనం చేస్తుంది.
  2. శిలింధ్ర శాస్త్రం (మైకాలజీ): ఇది హరిత రహిత, పరపోషక థాలోఫైట్లును (శిలింధ్రం) అధ్యయనం చేస్తుంది.

AP Inter 1st Year Botany Important Questions Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

ప్రశ్న 10.
లైకెన్లలో సహజీవనం చేసే మొక్కల సముదాయాలు ఏవి? లైకెన్ల అధ్యయనాన్ని ఏమంటారు?
జవాబు:

  1. లైకెన్లలో సహజీవనం చేసే మొక్కల సముదాయాలు ‘శైవలాలు మరియు శిలీంధ్రాలు’.
  2. లైకెన్ల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ‘లైకెనాలజీ’ అంటారు.

ప్రశ్న 11.
ఏ మొక్కల సముదాయాన్ని నాళికాకణజాలయుత పుష్పించని మొక్కలు అంటారు? వీటి అధ్యయనానికి సంబంధించిన వృక్షశాస్త్ర శాఖ పేరేమిటి? [TS M-19] [APM-18]
జవాబు:

  1. టెరిడోఫైటా మొక్కల సముదాయాన్ని నాళికా కణజాలయుత పుష్పించని మొక్కలు అంటారు.
  2. వీటి అధ్యయనానికి సంబంధించిన వృక్షశాస్త్ర శాఖ పేరు ‘టెరిడాలజి’ .

ప్రశ్న 12.
ఏ మొక్కల సముదాయాన్ని వృక్ష రాజ్యపు ఉభయచరాలు అని అంటారు? వాటిని అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు? [TS M-22]
జవాబు:

  1. బ్రయోఫైటా మొక్కలను వృక్షరాజ్యపు ఉభయచరాలు అని అంటారు.
  2. వీటిని అధ్యయనం చేసే విభాగాన్ని ‘బ్రయాలజి’ అంటారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వ్యవసాయ, ఉద్యానవన, ఔషధపరంగా వృక్షశాస్త్ర పరిధిని క్లుప్తంగా వర్ణించండి.
జవాబు:
1. వ్యవసాయ మరియు ఉద్యానవనపరంగా వృక్షశాస్త్ర సంబంధం:

  • సంకరణ ప్రయోగాలు, జన్యుఇంజనీరింగ్ మరియు మొక్కలు ప్రజనన సాంకేతికత వంటి ఎంతో ఉపయోగకరమైన పద్ధతుల ద్వారా అధిక దిగుబడినిచ్చే పంట రకాలైన వరి, గోధుమ, బంతిలు వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
  • వృక్ష శరీర ధర్మ శాస్త్ర పరిజ్ఞానం మొక్కల పెరుగుదలకు సంబంధించిన హార్మోనులు వాటి పని తీరును వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖల అభివృద్ధికి సహాయపడుతుంది.
  • వృక్ష వ్యాధి శాస్త్ర పరిజ్ఞానం మొక్కలలో వచ్చే అనేక వ్యాధుల నివారణ మరియు నిర్మూలన గురించి తెలియజేస్తుంది.

2. వృక్షశాస్త్రం మరియు వైద్యశాస్త్రంకు ఉన్న అనుబంధం:

  • వేప, ఆర్నికా, బెల్లడోనా, సింకోనా, దత్తూర, రావుల్ఫియా, తులసి, మొదలయిన ఔషధ విలువలు ఉన్న మొక్కలు పరిజ్ఞానం, మానవుల ఆరోగ్యరక్షణ కోసం ఉపయోగించుకోవడంలో దోహాదపడుతుంది. ఈ పరిజ్ఞానం ఆయుర్వేదం మరియు హోమియోపతి వైద్యంకు దారితీసింది.
  • యాంటీబయాటిక్లైన పెన్సిలిన్, జీవకీటకనాశినిలు ఉత్పత్తి ఆయా పదార్థాలనిచ్చే మొక్కల అధ్యయనం వల్ల సాధ్యమయింది.

AP Inter 1st Year Botany Important Questions Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

ప్రశ్న 2.
వృక్షశరీర ధర్మ శాస్త్రాన్ని ఉదాహరణగా తీసుకొని వృక్షశాస్త్ర పరిధిని వివరించండి.
జవాబు:

  1. వృక్ష శరీర ధర్మశాస్త్రం, మొక్కల పోషణలో ఖనిజ లవణాల పాత్రను తెలుసుకొనుటకు సహాయపడుతుంది.
  2. వృక్ష శరీర ధర్మశాస్త్రం ఖనిజలవణాల లోపం మరియు రసాయన ఎరువుల వినియోగంను తెలుసుకొనుటకు సహాయపడుతుంది.
  3. మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధిలో హార్మోనుల పాత్రను తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది.
  4. వృక్షశరీర ధర్మశాస్త్రం కలుపు మొక్కల నివారణ మరియు విత్తన స్థుప్తావస్తను విచ్ఛిన్నం చేయుటకు కావలసిన జీవనాశాకాలను గురించి తెలియచేస్తుంది.
  5. కాండపు ఖండికలలో వేళ్ళను ప్రేరేపించి శాఖీయ ఉత్పత్తిని ఆపిల్, అరటి మరియు పుచ్చకాయలాంటి పళ్ళు ఆకుకూరల నిల్వ కాలం పెంచటం వంటివి వృక్షశరీర ధర్మశాస్త్రం మొక్క ఇతర ఉపయోగాలు.

ప్రశ్న 3.
వృక్ష స్వరూప శాస్త్రంలోని వివిధ శాఖలు, వాటి లక్షణాలను రాయండి.
జవాబు:
స్వరూపశాస్త్రం మొక్కల యొక్క వివిధ భాగాల అధ్యయన మరియు వర్ణన గురించి తెలియజేస్తుంది. ఇది మొక్కల వర్గీకరణకు ప్రాధమిక ఆధారం. దీన్ని రెండుగా విభజించవచ్చు.
a) బాహ్యస్వరూపశాస్త్రం: ఇది మొక్కల యొక్క బాహ్య స్వరూపాలైన వేర్లు, కాండం, పత్రాలు, పుష్పాలు, ఫలాలు మరియు విత్తనాలను గురించి అధ్యయనం చేసి వర్ణిస్తుంది.

b) అంతరస్వరూప శాస్త్రం: మొక్కల వివిధ భాగాల అంతర్నిర్మాణాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం

  1. కణజాల శాస్త్రం మొక్కలొని వివిధ కణజాలాలను అధ్యయనం చేసే శాస్త్రం
  2. అంతర్నిర్మాణ శాస్త్రం మొక్క యందలి వేరు, కాండం, పత్రం, పుష్పంలోని అంతర్నిర్మాణలను అధ్యయనం చేసే శాస్త్రం.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వృక్షశాస్త్రంలోని వివిధ శాఖల పరిధిని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
1. వ్యవసాయ శాఖయందు వృక్షశాస్త్ర పరిధి:

  • హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడిని సాధించి తక్కువ వనరులు మరియు అధిక జనాభా సమస్యను పరిష్కరించవచ్చు.
  • వరి, గోధుమ, మొక్కజొన్న మరియు చెరకు మొదలైన పంట మొక్కలలో సంకరణ రకాలను అభివృద్ధి పరచుటకు మొక్కల ప్రజననం యొక్క నూతన సాంకేతికతలు సహాయపడతాయి.
  • నేల మరియు నీరు రసాయన ఎరువుల వాడకం వలన కలుషితమవుతున్నాయి. దీన్ని జీవ ఎరువులను వినియోగించుట ద్వారా నివారించవచ్చును.
  • పంటల సాగు మానవుల నాగరికత ఆవిర్భావాన్ని తెలియజేస్తుంది.

2. ఉద్యానవనశాఖ యందు వృక్షశాస్త్రపరిధి:

  • సంకరణాలు మరియు జన్యు సాంకేతికత ప్రయోగాల ద్వారా ఉద్యానవనశాఖ పురోగతిని సాధించగలుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయు విధానాన్ని ‘సూక్ష్మవ్యాప్తి’ అంటారు.
  • ఇది కణజాల మరియు వర్ధనం ప్రయోగాల ద్వారా సులువు అవుతుంది.

AP Inter 1st Year Botany Important Questions Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

3. వైద్యరంగంలో వృక్షశాస్త్ర పరిధి:

  • ఔషధమొక్కలైన ఆర్నికా, సింకోనా, వేప, దత్తూర, తులసి, రావుల్ఫియా, కలబంద వంటి వాటి విత్తనాల అధ్యయనం మానవ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతుంది.
  • సూక్ష్మ జీవనాశక పదార్థాలైన పెన్సిలిన్, జీవకీటక నాశినిలు, ఏకకణ ప్రోటీనులు మొదలగు వాటిని మొక్కల అధ్యయనం ద్వారా తయారు చేయవచ్చు.

4. వృక్షశరీర ధర్మ శాస్త్రంలో వృక్షశాస్త్ర పరిధి:

  • సంకరణం మరియు జన్యు సాంకేతికత ప్రయోగాలు అనుబంధ శాఖలు వ్యవసాయం, అటవీశాఖ, ఉద్యానవనశాఖ, మరియు పుష్పోత్తి శాఖలను మెరుగుపరిచాయి.
  • పంట మొక్కలైన వరి, గోధుమ, మొక్కజొన్న చెరకులలో కొత్త వంగడాలను ఏర్పరచడానికి కొత్త ప్రజనన పద్ధతులు ఉపయోగపడతాయి.
  • వృక్ష వ్యాధిశాస్త్రం అనేక మొక్క వ్యాధులను నివారించుటకు మరియు నిర్మూలించుటకు సహాయపడుతుంది.

5. పరిశ్రమల యందు వృక్షశాస్త్ర పరిధి:

  • వృక్షశాస్త్రం ద్వారా వస్త్ర, కాగిత, ఆయుర్వేద, పంచదార పరిశ్రమలు అభివృద్ధి చెందినవి.
  • టేకు, కాఫీ, టీ, రబ్బర్, సుగంధ ద్రవ్యాలు వంటి వాణిజ్య పంటల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.
  • పెట్రోల్, గ్యాసోలిన్, కోక్ వంటి ఇంధనాలను శిలాజాల మొక్కల నుండి తయారు చేస్తారు.
  • జాట్రోపా మరియు పొంగామియాల వంటి పెట్రో మొక్కల నుండి జీవ ఇంధనమును తయారు చేస్తారు.

6. వాతావరణంలో వృక్షశాస్త్ర పరిధి:

  • ఎక్కువగా మొక్కలను నాటుట మరియు పెంచుట ద్వారా హరిత గృహాప్రభావాన్ని నివారించవచ్చు.
  • పూతికాహారుల ద్వారా పోషక పదార్థాల పునశ్చక్రీయం, అజోల్లా, నాస్టాక్, అనబీనా వంటి జీవ ఎరువులను రసాయన ఎరువుల వల్ల కలిగే మృత్తిక, నీటి కాలుష్యాలను అరికట్టడం కోసం వాడతారు.

7. ఇతర ఉపయోగాలు:

  • క్లోరెల్లా లాంటి శైవలాలను అంతరిక్ష పరిశోధనలో వ్యోగాముల ఆహారంగా ఉపయోగించడం, చాలా సముద్రపు కలుపు మొక్కల నుంచి అయోడిన్, అగార్-అగార్ తయారు చేయడం లాంటివి ప్రస్తుత అవసరాల కోసం సమకాలీన ప్రపంచంలో వృక్షశాస్త్రానికి ఉన్న అవకాశాలను సూచిస్తాయి.

Leave a Comment