Students get through AP Inter 1st Year Botany Important Questions 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ which are most likely to be asked in the exam.
AP Inter 1st Year Botany Important Questions 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ
Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
డయాటమ్లలో కణకవచ స్వభావం ఏది?
జవాబు:
- డయాటమ్లలో కణకవచములు రెండు పలుచని కర్పరాలతో ఒక దానిపై ఒకటి సబ్బు పెట్టి మూత వలె అమరి ఉంటాయి.
- పై కవచాన్ని ‘ఏపిధీకా’ అనియు క్రింది కవచాన్ని ‘హైపోధీకా’ అని అంటారు.
- కణకవచాలు సిలికాతో నిర్మితమై ఉండుట వల్ల అవి నాశనం చెందవు.
ప్రశ్న 2.
వైరాయిడ్లకూ, వైరస్లకూ ఉన్న తేడాలు ఏమిటి? [AP M-16, 17 IPE M-14][TSM-22]
జవాబు:
వైరాయిడ్స్
- వైరాయిడ్స్ కేవలం కేంద్రక ఆమ్లాన్ని కల్గి ఉంటాయి. ఇవి ప్రోటీన్ తొడుగును కలిగి ఉండవు.
- కేంద్రక ఆమ్లం కేవలం RNA మాత్రమే
- ఇవి మొక్కలకు మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి.
వైరస్
- వైరస్లు కేంద్రక ఆమ్లం మరియు ప్రోటిన్ తొడుగు రెండింటిని కల్గి ఉంటాయి.
- కేంద్రక ఆమ్లాలు RNA లేదా DNA
- వైరస్లు అన్ని రకాల జీవులకు వ్యాధిని కలుగజేస్తాయి.

ప్రశ్న 3.
ఫైకోబయాంట్, మైకోబయాంట్ అనే పదాలు వేటిని తెలియజేస్తాయి? [AP M-17] [TS M-18]
జవాబు:
‘లైకెన్లు’ శైవలాలు మరియు శిలీంధ్రాలతో సహజీవన సంబంధాన్ని కలిగి ఉంటాయి.
- లైకేన్లలోని శైవల భాగస్వామిని ‘ఫైకోబయాంట్’ తెలియజేస్తుంది.
- లైకేన్లలోని శిలీంధ్ర భాగస్వామిని ‘మైకోబయాంట్’ తెలియజేస్తుంది.
ప్రశ్న 4.
శైవల మంజరి (algal bloom), ఎరుపు అలలు (red tides) అనే పదాలు వేటిని సూచిస్తాయి?
జవాబు:
- శైవల మంజరి: నీటి కుంటలలో అధికంగా పెరిగే శైవలాలను ‘శైవల మంజరి’ అని అంటారు. ఉదా: నాస్టాక్, అనబీనా.
- ఎరుపు అలలు: గోనియాలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనోఫ్లాజెల్లేట్లు అతి త్వరితగతిన వృద్ధి చెందుతూ అవి నివసించే సముద్ర ప్రాంతం అంతా ఎరుపు రంగును కలుగచేస్తాయి. వీటినే ఎరుపు అలలు అని అంటారు.
ప్రశ్న 5.
పరిపోషిత బాక్టీరియమ్లకు గల రెండు ఆర్థిక ప్రాముఖ్యం గల ఉపయోగాలను తెలపండి? [TS M-16,20]
జవాబు:
పరపోషిత బాక్టీరియా ఆర్థిక ఉపయోగాలు:
- పాల నుండి పెరుగు తయారీ.
- జీవనాశక ఉత్పత్తి, మత్తుపానీయాల ఉత్పత్తి.
ప్రశ్న 6.
వ్యవసాయ భూములలో పంటల పెంపుదలకు సయనోబాక్టీరియమ్లను ఉపయోగించడంలో ఇమిడి ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? [AP M-19,15]
జవాబు:
సయనో బాక్టీరియాలైన నాస్టాక్, అనబీనాలో ‘నైట్రోజినేజ్’ అనే ఎంజైమ్ ఉంటుంది.
ఇది వాతావరణంలోని నత్రజనిని హెటిరోసిస్ట్ అనబడే ప్రత్యేకమైన కణాలలో స్థాపించి, నేలను సారవంతం చేస్తాయి.
ప్రశ్న 7.
మొక్కలు స్వయం పోషితాలు, పాక్షికంగా పరపోషితాలైన కొన్ని మొక్కలను తెలపండి.
జవాబు:
- ఆకుపచ్చని మొక్కలన్నీ స్వయంపోషితాలు. ఎందుకంటే అవి ఆహారాన్ని స్వయంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి.
- పాక్షిక పరపోషిత మొక్కలు: విస్కమ్ (పాక్షిక కాండ పరాన్న జీవి), కస్కుటా (పూర్తి కాండ పరాన్న జీవి), సైగా (పాక్షిక వేరు పరాన్న జీవి)
ప్రశ్న 8.
ఐదు రాజ్యాల వర్గీకరణను ఎవరు ప్రతిపాదించారు? ఈ వర్గీకరణలో నిజకేంద్రక జీవులు ఎన్ని రాజ్యాలలో ఉన్నాయి? [TS M-19]
జవాబు:
- R.H.విట్టాకర్ అనే శాస్త్రవేత్త ఐదు రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించాడు.
- ఈ వర్గీకరణలో నిజకేంద్రక జీవులు నాలుగు రాజ్యాలలో ఉన్నవి. అవి
ప్రొటిస్ట్గా, శిలింధ్రాలు, ప్లాంటే(మొక్కలు), ఏనిమేలియా(జంతువులు)
ప్రశ్న 9.
విట్టాకర్ వర్గీకరణలో పాటించిన ముఖ్యమైన ప్రాతిపదికలు ఏవి? [AP M-18,20,22][ TS M-15]
జవాబు:
విట్టాకర్ వర్గీకరణ ప్రాతిపదికలు: కణనిర్మాణము, థాలస్ సంవిధానము, పోషణ విధానం, ప్రత్యుత్పత్తి మరియు వర్గవికాస సంబంధాలు.
ప్రశ్న 10.
మైకోప్లాస్మా కలిగించే రెండు వ్యాధులను తెలపండి? [TS May-17,22]
జవాబు:
- మొక్కలలో మంత్రగత్తె చీపురు కట్ట అనే వ్యాధి.
- పశువులలో ప్లూరోనిమోనియా అనే వ్యాధి.
- మనుషులలో మైకో ప్లాస్మల్ యురిథ్రెటిస్ అనే వ్యాధి.
ప్రశ్న 11.
జిగురు బూజులంటే ఏమిటి? జిగురు బూజుల దృష్ట్యా ప్లాస్మోడియం అంటే ఏమిటో వివరించండి?
జవాబు:
- జిగురు బూజులంటే ప్రొటిస్టా రాజ్యానికి చెందిన పూతికాహార జీవులు.
- అనుకూల పరిస్థితుల యందు ఇవి ‘ప్లాస్మోడియమ్’ అనే సముచ్ఛయనంను ఏర్పరుస్తాయి.
- ఇవి పెరిగి కొన్ని అడుగుల దూరం వరకు విస్తరిస్తాయి.
- ఇవి తమ సిద్ధబీజాల కొనలయందు ఫలవంత దేహాలను కలిగి ఉంటాయి.
Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
యూగ్లినాయిడ్ల లక్షణాలు ఏవి? [TS M-20][AP,TS May-17,22][AP M-16,20]
జవాబు:
యూగ్లినాయిడ్ల లక్షణాలు:
- యూగ్లినాయిడ్ల రాజ్యం ‘ప్రోటిస్టా .
- ఇవి ఏకకణజీవులు. ఇవి కశాభాలను కల్గి ఉంటాయి.
- యూగ్లినాయిడ్లు ‘నిల్వ ఉన్న మంచి నీటిలో ఎక్కువగా పెరుగుతాయి.
- ఉదా: యూగ్లినా
- వీటి దేహం పెల్లికల్ అనే ప్రోటీన్ పొరతో కప్పబడి ఉంటుంది.
- ఇవి రెండు కశాభాలను కల్గి ఉంటాయి. ఒకటి పొట్టి మరొకటి పొడుగు.
- శరీరపూర్వ భాగాలలో సైటోస్టోం (కణంనోరు), సైటోఫారింక్స్, రిజర్వాయర్ అనే భాగాలు ఉంటాయి.
- రిజర్వాయర్ త్వచంపై స్టిగ్మా లేదా ‘కంటి చుక్క’ ఉంటుంది.
- ఇవి అనుదైర్ఘ్య ద్విధావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
- యూగ్లినాయిడ్లు స్వయం పోషకాలు, కాని సూర్యకాంతి లేనప్పుడు అవి చిన్న జీవులను భక్షించే పరపోషకాలు.
ప్రశ్న 2.
క్రైసోఫైట్ల ముఖ్య లక్షణాలు, ప్రాముఖ్యతలను తెలపండి? [TS M-17,22][ AP M-15,18][IPE Mar- 13]
జవాబు:
క్రైసోఫైట్ ముఖ్య లక్షణాలు: (క్రైసో బంగారం, ఫైటా=మొక్కలు)
- క్రైసోఫైట్ల రాజ్యం ‘ప్రొటిస్టా’.
- ఇవి శైవల సమూహ జీవులు.
- ఇవి మంచి నీరు మరియు సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి.
- ఉదా:డెస్మిడ్స్ క్రైసోఫైట్
- ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటూ, నీటిపై అచేతనంగా తేలుతూ, కిరణజన్యసంయోగ క్రియ జరిపే జీవులు.
- ఇవి సబ్బుపెట్టె వంటి ఆకారాన్ని కల్గి ఉంటాయి.
- క్రైసోఫైట్స్లో డయాటమ్లు మరియు బంగారపు శైవలాలు ఉంటాయి.
- డయాటమ్స్ గోడలు సిలికాతో నిర్మితమై ఉంటాయి.
- వీటి కణకవచంలో రెండు పెంకులు ఉంటాయి (i) పై పెంకు ఎఫిథీకా (ii) కింది పెంకు హైపోథీకా.
- ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తిని ద్విధావిచ్ఛిత్తి ద్వారా, లైంగిక ప్రత్యుత్పత్తిని సంయోగ బీజాల ద్వారా జరుపుకుంటాయి.
ఉపయోగాలు:
- వీటిని గ్లాసులను పాలిష్ చేయడానికి ఉపయోగిస్తారు.
- నూనెలు, ద్రవాల్ని వడగట్టడానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 3.
డైనోఫ్లాజెల్లేట్ గురించి క్లుప్తంగా తెలపండి. [AP M-17,19] [TS M-15,16,18,19,22]
జవాబు:
డైనోఫ్లాజెల్లేట్లు:
- డైనోఫ్లాజెల్లేట్ల రాజ్యం ‘ప్రోటిస్ట్గా’.
- వీటిలో ఎక్కువ శాతం కశాభాలు కల్గి ఉన్నవి నిజకేంద్రక జీవులు.
- ఇవి ఎక్కువగా సముద్రపు నీటిలో కనపడతాయి.
- ఉదా: మధ్యధరా సముద్రంలో కనిపించే గోనియాలాక్స్ లాంటి ఎరుపు డైనోఫ్లాజెల్లేట్లు
- వాటి కణాలలో ఉండే వర్ణ ద్రవ్యాలను బట్టి అవి విభిన్న రంగులలో కనిపిస్తాయి. ‘
- వీటి కణ కవచాల బాహ్యతలంపై ధృడమైన సెల్యులోజ్ పలకలుంటాయి.
- వీటికి రెండు కశాభాలుంటాయి. ఒకటి నిలువుగాను, రెండోవది అడ్డంగాను అమరి ఉంటాయి.
- వీటి కశాభాలు బొంగరంలాంటి చలనాలను చూపిస్తాయి. అందుకే వీటిని ‘విర్లింగ్ విప్లు’ అని కూడా అంటారు.
- వీటి కేంద్రకం సాంద్రీకరణ చెందిన క్రోమోజోమ్లను కల్గి ఉంటుంది.
- కేంద్రకంలో హిస్టోన్ ప్రోటీన్ లేకపోవడం వలన వీటిని ‘మీసోకారియన్’ అని అంటారు.
- నాక్టిల్యుకా లాంటి కొన్ని సముద్ర డైనోఫ్లాజెల్లేట్లు ‘జీవ సందీప్తి’ని ప్రదర్శిస్తాయి.
- డైనోఫ్లాజెల్లేట్స్ ద్వారా విడుదలయ్యే విషపదార్థాలు కొన్ని సూక్ష్మజీవులకు హాని కలిగిస్తాయి.
ప్రశ్న 4.
మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల పాత్రను గురించి వ్రాయండి. [IPE Mar-14]
జవాబు:
శిలీంధ్రాల వల్ల లాభాలు:
- ఈస్ట్ అనునది ఏకకణ శిలీంధ్రం. దీనిని వాణిజ్యపరంగా తయారు చేసే రొట్టె, బీర్ లలో ఉపయోగిస్తారు.
- పెనిసిలియం అనే శిలీంధ్రం నుండి ‘పెన్సిలిన్’ అనే సూక్ష్మజీవ నాశకాలను తయారు చేస్తారు.
- సాధారణంగా తినదగే శిలీంధ్రాలు: పుట్టగొడుగులు (అగారికస్), మోరెల్స్, ట్రపెల్స్, టోడ్ స్టూల్స్
శిలీంధ్రాల వల్ల నష్టాలు:
- కొన్ని శిలీంధ్రాలు మొక్కలకు వ్యాధులను కలుగచేస్తాయి.
- కొల్లెట్రోట్రెకమ్ అనే శిలీంధ్రం చెరుకులో ఎర్రకుళ్లు అనే వ్యాధిని కలుగచేస్తుంది.
- ‘పక్సీనియా’ గోధుమలో కుంకుమ తెగులును కలుగచేస్తుంది.
Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
మీరు చదివిన శిలీంధ్రాలలో వివిధ తరగతుల ముఖ్య లక్షణాలు తెలిపి, వాటిని పోల్చండి.
జవాబు:
ప్రశ్న 2.
మీరు చదివిన మొనీరాలోని వివిధ సముదాయాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
మొనిరా రాజ్యంలోని సముదాయాలు: ఆర్కిబాక్టీరియా, యూబాక్టీరియా, మైకోప్లాస్మా మరియు ఆక్టినోమెసిటీస్.
I. ఆర్కిబాక్టీరియా:
- ఇవి ప్రత్యేక మొనిరాజీవులు. ఇవి అధిక లవణయుత ప్రాంతాలు, వేడినీటి చలమలు మరియు బురద ప్రాంతాలలో నివశిస్తాయి.
- వీటి కణకవచం సూడోమ్యూరిన్తో నిర్మితమై ఉంటుంది.
- కణకవచం శాఖాయుత లిపిడ్ శృంఖలాలను కలిగి ఉండటం వలన అధిక వాతావరణ పరిస్థితులలో నివశించగల్గుతున్నాయి.
- వీటిలో మిథనోజెన్లు అనే బాక్టీరియాలు ఆవు మరియు గేదెలు వంటి వాటి జీర్ణాశయంలో జీవిస్తూ పేడ నుండి మీథేన్ గ్యాస్ ఉత్పత్తికి సహాయపడుతున్నాయి.
II. యూబాక్టీరియా:
- బాక్టీరియా జీవులు అంతటా వ్యాపించి ఉన్నాయి. వేడినీటి చలమలు, ఎడారులు, లోతైన సముద్రాలు మరియు మంచు వంటి అన్ని వాతావరణ పరిస్థితులలో నివశిస్తాయి.
- ఇవి పరాన్న జీవులుగా మరియు సహజీవులుగా జీవిస్తాయి.
- ఆకారం ఆధారంగా బాక్టీరియాలను గోళాకారం (కోకస్), దండాకారం (బాసిల్లస్), కామా ఆకారం (విబ్రియా) మరియు, సర్పిలాకరం (స్పైరిల్లమ్) గా వర్గీకరించారు.
- ధృడమైన వీటి కణకవచం మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్ అని పిలువబడే పెప్టిడోగైకాన్తో నిర్మితమైనది. 5. కణత్వచంలో ఉన్న ముడతలను ‘మీసోసోమ్’ లు అంటారు.
- వీటి జన్యుపదార్ధం ఎటువంటి కేంద్రకత్వచంతో ఆవరించబడకుండా నగ్నంగా ఉంటుంది.
- ఇతర కణాంగాలు ఉండవు, ‘రైబోసోమ్లు’ మాత్రమే ఉంటాయి.
- చలనసహిత బాక్టీరియాలు ఒకటి లేదా ఎక్కువ కశాభాలను కలిగి ఉంటాయి.
- పోషణ ఆధారంగా బాక్టీరీయాలు రెండు రకాలు (a) స్వయంపోషితాలు (b) పరపోషితాలు
- స్వయంపోషితాలు రెండు రకాలు
(i) కిరణజన్య సంయోగక్రియస్వయంపోషితాలు (ii) రసాయన సంశ్లేషణస్వయంపోషితాలు - పరపోషితాలు రెండు రకాలు: (i) పూతికాహారులు (విచ్ఛిన్నకారులు) (ii) పరాన్న జీవులు
- ఇవి ప్రధానంగా ద్విధావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి.
- లైంగిక ప్రత్యుత్పత్తి ఒక బాక్టీరియా నుండి వేరొక బాక్టీరియాకు జన్యుపదార్ధ మార్పిడి ద్వారా జరుగుతుంది.
III. మైకోప్లాస్మాలు:
- మైకోప్లాస్మాలు బహుళ రూపాలలో ఉండే కణకవచం లేని జీవులు.
- ఇవి జీవ కణాలన్నింటిలోనూ అతి చిన్నవి మరియు ఆక్సిజన్ లేని పరిస్థితులలో కూడా మనుగడను సాగిస్తాయి.
- మైకోప్లాస్మాలు మొక్కలకు మరియు జంతువులకు వ్యాధులను కలిగిస్తాయి.
- మొక్కల యందు ‘మంత్రగత్తె చీపురుకట్ట’ వంటి వ్యాధిని కలిగిస్తాయి.
- పశువులలో ‘పూరోనిమోనియా’ మరియు మనుషులలో ‘మైకో ప్లాస్మలయురిథ్రెటిస్’ వంటి వ్యాధులను కలిగిస్తాయి.
IV. ఆక్టినోమెసిటీస్:
- ఇవి శాఖాయుతమైన, తంతురూప బాక్టీరియాలు. వర్ధనాలలో కిరణకారపు సమూహాలను ఏర్పరుస్తాయి.
- కణకవచం ‘మైకోలిక్ ఆమ్లాన్ని’ కలిగి ఉంటుంది.
- ఇవి చాలావరకు ‘పూతికాహార జీవులు’ లేదా ‘విచ్ఛిన్నకారులు’
- మైకో బాక్టీరియా మరియు కార్ని బాక్టీరియాలు పరాన్న జీవులు
- కొన్ని బాక్టీరియాలైన స్ట్రెప్టోమైసిస్ ‘సూక్ష్మజీవనాశకాలను’ ఉత్పత్తి చేస్తాయి.
ప్రశ్న 3.
ప్రొటిస్టాలోని వివిధ సముదాయాల ముఖ్యలక్షణాలను సోదాహరణగా వ్రాయండి.
జవాబు:
ప్రొటీస్టాలోని వివిధ సముదాయాలు:యూగ్లినాయిడ్స్, క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లేట్స్, జిగురు’ బూజులు, ప్రోటోజోవన్లు,
I. యూగ్లినాయిడ్ లక్షణాలు:
- యూగ్లినాయిడ్ల రాజ్యం ‘ప్రోటిస్ట్గా’ .
- ఇవి ఏకకణజీవులు. ఇవి కశాభాలను కల్గి ఉంటాయి.
- యూగ్లినాయిడ్లు అధికంగా ‘నిల్వ ఉన్న మంచి నీటిలో ఎక్కువగా పెరుగుతాయి.
- ఉదా:యూగ్లినా
- వీటి దేహం పెల్లికల్ అనే ప్రోటీన్ పొరతో కప్పబడి ఉంటుంది.
- ఇవి రెండు కశాభాలను కల్గి ఉంటాయి. ఒకటి పొట్టి మరొకటి పొడుగు.
- శరీరపూర్వ భాగాలలో సైటోస్టోం (కణంనోరు), సైటోఫారింక్స్, రిజర్వాయర్ అనే భాగాలు ఉంటాయి.
- రిజర్వాయర్ త్వచంపై స్టిగ్మా లేదా ‘కంటి చుక్క’ ఉంటుంది.
- ఇవి అనుదైర్ఘ్య ద్విధావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
- యూగ్లినాయిడ్లు స్వయం పోషకాలు, కాని సూర్యకాంతి లేనప్పుడు అవి చిన్న జీవులను భక్షించే పరపోషకాలు.
II. క్రైసోఫైట్ ముఖ్య లక్షణాలు: (క్రైసో=బంగారం, ఫైటా=మొక్కలు)
- క్రైసోఫైట్ల రాజ్యం ‘ప్లాంటే’.
- ఇవి శైవల సమూహ జీవులు.
- ఇవి మంచి నీరు మరియు సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి. ఉదా:డెస్మిడ్స్
- ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటూ, నీటిపై అచేతనంగా తేలుతూ, కిరణజన్యసంయోగ క్రియ జరిపే జీవులు.
- ఇవి సబ్బుపెట్టె వంటి ఆకారాన్ని కల్గి ఉంటాయి.
- క్రైసోఫైట్స్లో డయాటమ్లు మరియు బంగారపు శైవలాలు ఉంటాయి.
- డయాటమ్స్ గోడలు సిలికాతో నిర్మితమై ఉంటాయి.
- వీటి కణకవచంలో రెండు పెంకులు ఉంటాయి (i) పై పెంకు ఎఫిథీకా (ii) కింది పెంకు హైపోథీకా.
- ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తిని ద్విధావిచ్ఛిత్తి ద్వారా, లైంగిక ప్రత్యుత్పత్తిని సంయోగ బీజాల ద్వారా జరుపుకుంటాయి.
ఉపయోగాలు:
- వీటిని గ్లాసులను పాలిష్ చేయడానికి ఉపయోగిస్తారు.
- నూనెలు, ద్రవాల్ని వడగట్టడానికి ఉపయోగిస్తారు.
III. డైనోఫ్లాజెల్లేట్లు:
- డైనోఫ్లాజెల్లేట్ల రాజ్యం ‘ప్రోటిస్ట్గా’.
- వీటిలో ఎక్కువ శాతం కశాభాలు కల్గిఉన్న ‘యుకరేట్లు’.
- ఇవి ఎక్కువగా సముద్రపు నీటిలో కనపడతాయి.
- ఉదా: మధ్యధరా సముద్రంలో కనిపించే గోనియాలాక్స్ లాంటి ఎరుపు డైనోఫ్లాజెల్లేట్లు
- వాటి కణాలలో ఉండే వర్ణ ద్రవ్యాలను బట్టి అవి విభిన్న రంగులలో కనిపిస్తాయి.
- వీటి కణ కవచాల బాహ్యతలంపై ధృడమైన సెల్యులోజ్ పలకలుంటాయి.
- వీటికి రెండు కశాభాలుంటాయి. ఒకటి నిలువుగాను, రెండోవది అడ్డంగాను అమరి ఉంటాయి.
- వీటి కశాభాలు బొంగరంలాంటి చలనాలను చూపిస్తాయి. అందుకే వీటిని ‘విర్లింగ్ విప్లు’ అని కూడా అంటారు.
- వీటి కేంద్రకం సాంద్రీకరణ చెందిన క్రోమోజోమ్లను కల్గి ఉంటుంది.
- కేంద్రకంలో హిస్టోన్ ప్రోటీన్ లేకపోవడం వలన వీటిని ‘మీసోకారియన్’ అని అంటారు.
- నాక్టిల్యుకా లాంటి కొన్ని సముద్ర డైనోఫ్లాజెల్లేట్లు ‘జీవ సందిప్తి’ని ప్రదర్శిస్తాయి.
- డైనోఫ్లాజెల్లేట్స్ ద్వారా విడుదలయ్యే విషపదార్థాలు కొన్ని సూక్ష్మజీవులకు హాని కలిగిస్తాయి.
IV. జిగురు బూజులు:
- జిగురు బూజులంటే ప్రొటిస్టా రాజ్యానికి చెందిన పూతికాహార జీవులు.
- అనుకూల పరిస్థితుల యందు ఇవి ‘ప్లాస్మోడియమ్’ అనే సముచ్ఛయనంను ఏర్పరుస్తాయి.
- ఇవి పెరిగి కొన్ని అడుగుల దూరం వరకు విస్తరిస్తాయి.
- ఇవి తమ సిద్ధబీజాల కొనలయందు ఫలవంత దేహాలను కలిగి ఉంటాయి.
V. ప్రోటోజోవన్లు:
- ప్రోటోజోవా జీవులన్నీ పరపోషితాలే. ఇవి పరభక్షితాలు లేదా పరాన్న జీవులుగా జీవిస్తాయి.
- వీటిని జంతువుల యొక్క పూర్వ బంధువులుగా భావిస్తారు.
- ఇవి కణకవచాన్ని కలిగి ఉండవు. వీటి జీవపదార్థం ప్లాస్మాత్వచంతో ఆవరించి ఉంటుంది.
- ప్రోటోజోవా యందు నాలుగు ప్రధాన సమూహాలు కలవు.
a) అమీబాయిడ్ ప్రోటోజోవన్లు:
- ఈ జీవులు మంచినీరు, సముద్రపు నీరు మరియు తడి నేలలో జీవిస్తాయి.
- ఇవి అమీబావలె మిధ్యాపాదాల సహాయంతో చలించి, ఆహారాన్ని సేకరిస్తాయి.
- సముద్ర జాతులు శరీర ఉపరితలం మీద సిలిక కలిగిన పెంకువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి.
- ఎంటమీబా లాంటి జీవులు పరాన్నజీవులు
b) కశాభాయుత ప్రోటోజోవన్లు:
- ఈ జీవులు స్వేచ్ఛగా గానీ (లేదా) పరాన్న జీవులుగా, కశాభాలను కలిగి ఉంటాయి.
- పరాన్న జీవులుగా ఉండే జీవులు నిద్రావ్యాధి (స్లీపింగ్ సిక్నెస్) ని కలిగిస్తాయి. ఉదా: ట్రిపానోసోమా
c) శైలికాయుత ప్రోటోజోవన్లు:
- ఇవి నీటి జీవులు, వేల సంఖ్యలో శైలికలను కలిగి ఉండటం వలన చురుకుగా చలిస్తాయి.
- వీటి కణం యొక్క ఉపరితలం వెలుపలికి తెరుచుకుని ఉంటుంది. ఉదా: పేరామిషీయం
d) స్పోరోజోవన్లు:
- దీని యందు భిన్న జీవులు ఉంటాయి ఇవి జీవితచక్రంలో సంక్రామక సిద్ధబీజం లాంటి దశలను కలిగి ఉంటాయి.
- ఉదా: మానవులలో మలేరియాను కలిగించే ప్లాస్మోడియమ్.