AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం

Students get through AP Inter 1st Year Botany Important Questions 4th Lesson వృక్షరాజ్యం which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Botany Important Questions 4th Lesson వృక్షరాజ్యం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
శైవలాల వర్గీకరణకు ఆధారం ఏమిటి?
జవాబు:
శైవలాల వర్గీకరణకు ఆధారం: వర్ణ పదార్థాలు, నిల్వ ఆహార పదార్థాల రకాలు

ప్రశ్న 2.
లివర్వర్ట్, మాస్, ఫెర్న్, వివృతబీజ, అవృతబీజ మొక్కలలో క్షయకరణ విభజన ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
ఇచ్చిన వాటిలో క్షయకరణ విభజన వాటి జీవిత చక్రంలో సిద్ధబీజాశయాల నుండి సిద్ధబీజాలు ఏర్పడే సమయంలో జరుగుతుంది.

AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 3.
సంయుక్త సంయోగానికి, త్రి సంయోగానికి గల భేదం ఏమిటి?
జవాబు:
సంయుక్త సంయోగం

  1. ఇందులో ఒక పురుష సంయోగబీజం స్త్రీఅండాశయం లోకి విడుదలై అండంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని’ ఏర్పరుస్తుంది.
  2. ఇది నిజమైన ఫలదీకరణం

త్రి సంయోగం

  1. ఇందులో ద్వితీయ పురుష సంయోగబీజం ద్వయస్థితిక కేంద్రకంతో సంయోగం చెంది త్రయస్థితిక ప్రాధమిక ‘అంకురచ్ఛద కేంద్రకాన్ని’ ఏర్పరుస్తుంది.
  2. ఇది ద్విశాఖీయ ఫలదీకరణ

ప్రశ్న 4.
పురుష బీజాశయం, స్త్రీ బీజాశయానికి గల తేడా ఏమిటి?
జవాబు:
పురుష బీజాశయం

  1. పురుష బీజాశయం (ఆంథరీడియం) పురుష ప్రత్యుత్పత్తి అవయవం.
  2. ఇది ‘గద’ ఆకృతిలో ఉండును.
  3. ఇది అనేక పురుష బీజాలను ఉత్పత్తి చేయును.

స్త్రీ బీజాశయం

  1. స్త్రీ బీజాశయం (ఆర్కిగోనియం) స్త్రీ ప్రత్యుత్పత్తి స్త్రీ అవయవం.
  2. ఇది ‘కూజా’ ఆకృతిలో ఉండును.
  3. ఇది కేవలం ఒకే ఒక స్త్రీ బీజకణమును ఉత్పత్తి చేస్తుంది.

ప్రశ్న 5.
‘మాస్’ మొక్కల్లో గల రెండు సంయోగబీజద దశలు ఏవి? అవి వేటి నుంచి వృద్ధి చెందుతాయో తెలపండి.
జవాబు:

  1. మొక్కల్లో ఉండే రెండు సంయోగబీజద దశలు:
    (i) శైశవ దశ – ప్రధమ తంతువుదశ
    (ii) ప్రౌఢ పత్రదశ – సంయోగబీజదం
  2. ప్రధమ తంతువు సిద్ధబీజం నుండి మరియు సంయోగబీజదం ప్రధమ తంతువు నుండి ఏర్పడతాయి.

ప్రశ్న 6.
గోధుమవర్ణ, ఎరుపు వర్ణ శైవలాల్లో ఉన్న నిలవ ఆహార పదార్థాలను తెలపండి.
జవాబు:

  1. ఫియోఫైసీయే అనే గోధుమవర్ణ శైవలాల్లో నిల్వ ఆహారపదార్ధం ‘లామీనేరియా’ లేదా ‘మానిటాల్’
  2. రోడోఫైసీయే అనే ఎరుపువర్ణ శైవలాల్లో నిల్వ ఆహారపదార్ధం ‘ఫ్లోరిడియన్ స్టార్చ్’

ప్రశ్న 7.
గోధుమవర్ణ, ఎరుపు వర్ణ శైవలాల్లో ఆ రంగులకు కారణమైన పదార్థాల పేర్లు తెలపండి.
ప్రశ్న

  1. ఫియోఫైసీయే లో గోధుమ వర్ణమునకు కారకాలు: జాంధోఫిల్స్ మరియు ఫ్యూకోజాందిన్ అనే వర్ణద్రవ్యకాలు
  2. రోడోఫైసీ మొక్కలలో ఎరుపు వర్ణమునకు కారకాలు: -ఫైకోఎరిత్రిన్ అనే వర్ణద్రవ్యకం

ప్రశ్న 8.
బ్రయోఫైటా మొక్కల్లోని వివిధ శాకీయోత్పత్తి విధానాలను తెలపండి. [AP M-15]
జవాబు:
బ్రయోఫైటా మొక్కల్లోని వివిధ శాకీయోత్పత్తి విధానాలు: ముక్కలవడం, జెమ్మాలు ఏర్పడటం, మొగ్గలు ఏర్పడుట.

ప్రశ్న 9.
వివృతబీజాల్లో ఉన్న అండ కవచయుత స్థూల సిద్ధబీజాశయాన్ని ఏమంటారు? స్థూల సిద్ధబీజాశయం లోపల ఎన్ని స్త్రీ సంయోగ బీజదాలు ఏర్పడతాయి?
జవాబు:

  1. వివృత బీజాలలోని అండ కవచయుత స్థూల సిద్ధబీజాశయాన్ని ‘అండం’ అంటారు.
  2. స్థూల సిద్ధబీజాశయం లోపల ఒకే ఒక స్త్రీ సంయోగబీజదం ఏర్పడుతుంది.

AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 10.
వివృత బీజ మొక్కల్లో శిలీంధ్ర మూలాలు, ప్రవాళాల వేర్లు ఉండే మొక్కలను వరసలో తెలపండి.
జవాబు:

  1. ‘ఫైనస్ మొక్క’లో శిలీంధ్ర మూలాలు ఉంటాయి
  2. ‘సైకస్ మొక్కలో ప్రవాళాభ వేర్లు ఉంటాయి.

ప్రశ్న 11.
ఈ కింది వాటిలో ఏ నాలుగింటికైనా క్రోమోసోమ్ సంఖ్యా స్థితులను తెలపండి.
(a) మాస్- మొక్కలోని ప్రథమ తంతుకణం
(b) ద్విదళ బీజాల్లోని ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం
(c) మాస్ మొక్కలోని పత్రకణం
(d) ఫెర్న్ మొక్కలోని ప్రథమాంకురం
(e) మార్కాంషియాలోని జెమ్మాకణం
(f) ఏకదళ బీజ విభాజ్య కణం
(g) లివర్ వర్డ్ లోని స్త్రీబీజ కణం
(h) ఫెర్న్లోని సంయోగబీజం
జవాబు:
a) ఏకస్థితికం
b) త్రయస్ధితికం
c) ఏకస్థితికం
d) ఏకస్థితికం
e) ఏకస్థితికం
f) ద్వయస్ధితికం
g) ఏకస్థితికం
h) ద్వయస్థితికం

ప్రశ్న 12.
టెరిడోఫైటాలోని నాలుగు తరగతులను ఒకొక్క ఉదాహరణతో తెలపండి.
జవాబు:
తరగతి 1: సిలోప్సిడా ఉదా: సైలోటం
తరగతి 2: లైకాప్సిడా ఉదా: లైకోపోడియం, సెలాజినెల్లా
తరగతి 3: స్ఫినోప్సిడా ఉదా: ఈక్విజిటం
తరగతి 4: టెరోప్సిడా ఉదా: డ్రయోప్టెరిస్, టెరిస్, ఎడియాంటం

ప్రశ్న 13.
రాతి ఉపరితలంపై పెరిగే మొట్టమొదటి జీవులు ఏవి? ‘పీట్’ ను అందించే ‘మాస్’ మొక్క ప్రజాతి నామం ఏది?
జవాబు:

  1. రాతి ఉపరితలం పై పెరిగే మొట్టమొదటి జీవులు ‘మాస్ మొక్కలు మరియు లైకెన్లు’.
  2. పీట్ ను అందించే మాస్ మొక్క ప్రజాతి నామం ‘స్ఫాగ్నం’

ప్రశ్న 14.
సైకస్ లోని ఫెర్న్ లక్షణాలను తెల్పండి.
జవాబు:
సైకస్లోని ఫెర్న్ లక్షణాలు:

  1. లేత పత్రాలు ‘వలిత కిసలయ విన్యాసం’ను చూపుట.
  2. పత్ర వృంతాలను కప్పుతూ ‘రామెంటా’ గోధుమ వర్ణ కేశాలు ఉండుట.
  3. పురుష బీజకణాలు ‘బహుశైలికా యుతంగా ఉండుట.
  4. స్త్రీ బీజాశయంలో స్త్రీ బీజకణం ఏర్పడుట.

ప్రశ్న 15.
బ్రయోఫైటా మొక్కలను వృక్షరాజ్య ‘ఉభయచరాలు’ అని ఎందుకు అంటారు?
జవాబు:
బ్రయోఫైటా మొక్కలు తేమ గల ప్రదేశాలలో పెరుగుతూ, లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడడం వల్ల వీటిని “వృక్షరాజ్యపు ఉభయ చరాలు” అని అంటారు.

ప్రశ్న 16.
(a) ఏకద్వయస్థితిక, (b) ద్వయస్థితిక జీవిత చక్రాలను కల్గిన శైవలాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఏకద్వయస్ధితిక జీవిత చక్రమును ‘ఎక్ట్రోకార్పస్’ మరియు ‘లామినేరియా’ మొక్కలు ప్రదర్శిస్తాయి.
  2. ద్వయస్ధితిక జీవిత చక్రంను ‘ఫ్యూకస్’ మొక్క ప్రదర్శిస్తుంది.

ప్రశ్న 17.
ఏకకణ, సహనివేశ, తంతురూప శైవలాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. ఏకకణ శైవలం-క్లామిడోమోనాస్
  2. సహానివేశ శైవలం – వాల్వాక్స్
  3. తంతురూపశైవలం – స్పైరోగైరా

AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఎరుపువర్ణ, గోధుమవర్ణ శైవలాల మధ్య తేడాలను తెలపండి. [TS M-17,19,22] [AP M-16] [IPE-Mar-14]
జవాబు:

ఎరుపు వర్ణ శైవలాలు

  1. ఇవి రోడోఫైసి తరగతికి చెందినవి.
  2. r – ఫైకోఎరిథ్రిన్ అనే ఎరుపువర్ణ ద్రవ్యం వల్ల ఈ మొక్కలు ఎర్రగా ఉంటాయి.
  3. వీటిలోని ప్రధాన వర్ణ ద్రవ్యాలు
    క్లోరోఫిల్ a, d, ఫైకోఎరిథ్రిన్.
  4. వీటి ఆహారం ‘ఫ్లోరిడియన్ స్టార్చ్’ రూపంలో నిల్వ చేయబడుతుంది.
  5. వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది.
  6. లైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సంయోగబీజాల ద్వారా జరుగుతుంది.
    ఉదా: గ్రాసిలేరియా, జెలిడియం.

గోధుమ వర్ణ శైవలాలు

  1. ఇవి ఫియోఫైసి తరగతికి చెందినవి.
  2. జాంథోఫిల్లలు అనే వర్ణ ద్రవ్యం వల్ల ఇవి గోధుమ రంగులో ఉంటాయి.
  3. వీటిలోని ప్రధాన వర్ణ ద్రవ్యాలు క్లోరోఫిల్ a, c, కెరోటినాయిడ్లు మరియు జాంథోఫిల్లు
  4. వీటి ఆహారం లామినేరియన్ (లేదా) మానిటాల్ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది.
  5. వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికశాభయుత గమన సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది.
  6. లైంగిక ప్రత్యుత్పత్తి చలనసిద్ద సంయోగ బీజాల ద్వార జరుగుతుంది.
    ఉదా: ఎక్టోకార్పస్, లామినేరియా, ఫ్యూకస్

ప్రశ్న 2.
లివర్వర్డ్స్, మాస్ మొక్కల మధ్య తేడాలు తెలపండి. [AP Mar, May-17]
జవాబు:
లివర్వర్ట్స్

  1. లివర్ వర్ట్స్ మొక్కల దేహం ‘థాలస్’లాగ ఏర్పడుతుంది.
  2. లివర్వర్ట్స్ు ఉభయచరాలు
  3. వీటి సిద్ధబీజం’ పూర్తి పరాన్నజీవి’గా ఉంటూ సంయోగ బీజదంపై ఆధారపడుతుంది.
  4. వీటి సిద్ధబీజాలు చిన్నవిగా లేదా అంతరించి ఉంటాయి.
  5. సిద్ధబీజాల వ్యాప్తికి ‘ఇలేటర్లు’ సహాయపడతాయి.
    ఉదా: మార్కెంషియా

మాస్

  1. మాస్ మొక్కలు నిటారుగా మధ్యస్థ అక్షంపై సర్పిలాకరంలో అమర్చబడిన పత్రాలను కలిగి ఉంటాయి.
  2. ఇవి ఆదిమ నేల మొక్కలు
  3. వీటి సిద్ధబీజం ‘అల్ప పరాన్న జీవి’గా ఉంటూ సంయోగబీజదంపై ఆధారపడుతుంది.
  4. వీటి సిద్ధబీజాలు విస్తారంగా ఉంటాయి.
  5. సిద్ధబీజాలు వ్యాప్తికి పరిముఖ దంతాలు సహాయపడతాయి
    ఉదా: పాలిట్రెకమ్, స్పాగ్నం, ప్యునేరియా.

ప్రశ్న 3.
సమసిద్ధ బీజ, భిన్న సిద్ధబీజ టెరిడోఫైట్లు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి. [AP M-15, 18, 22] [IPE – 13]
జవాబు:

  1. సమసిద్ధ బీజ టెరిడోఫైట్లు: మొక్కలు ఒకే రకమైన సిద్ధబీజాలను ఏర్పరిస్తే వాటిని సమసిద్ధబీజాలు అంటారు. ఉదా: సైలోటమ్, లైకోపోడియం.
  2. భిన్న సిద్ధబీజ టెరిడోఫైట్లు: మొక్కలు రెండు రకాల సిద్ధ బీజాలను ఏర్పరిస్తే వాటిని భిన్నసిద్ధ బీజాలు అంటారు. ఉదా: సెలాజినెల్లా, సాల్వీనియా.

AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 4.
భిన్న సిద్ధబీజత అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యం గురించి క్లుప్తంగా వ్రాయండి. రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:
కొన్ని రకాలైన టెరిడోఫైటా మొక్కలు రెండు రకాల సిద్ధబీజాలను (స్థూల మరియు సూక్ష్మ సిద్ధబీజాలు) ఉత్పత్తి చేయడాన్ని ‘భిన్న సిద్ధబీజత’ అని అంటారు. ఉదా: సెలాజినెల్లా, సాల్వీనియా.

భిన్న సిద్ధబీజత ప్రాముఖ్యత:

  1. రెండు రకాల సిద్ధబీజాలు కనపడతాయి.
    సూక్ష్మసిద్ధబీజాలు: ఇవి అంకురించి పురుషసంయోగ బీజదం ఏర్పడుతుంది.
    స్థూల సిద్ధబీజాలు: ఇవి అంకురించి స్త్రీసంయోగ బీజదం ఏర్పడుతుంది.
  2. పురుష లైంగిక అవయవాన్ని అంథిరీడీయా అంటారు. ఇది పురుష బీజకణంను (అంథిరోజాయిడ్) విడుదల చేస్తుంది.
  3. స్త్రీ లైంగిక అవయవాన్ని ‘ఆర్కిగోనియా’ అంటారు. ఇది స్త్రీ బీజకణంను విడుదల చేస్తుంది.
  4. స్త్రీ బీజాశయంలో ఉన్న స్త్రీ బీజకణంతో చలన పురుష బీజం సంయోగం చెంది ‘సంయుక్త బీజం’ ఏర్పడుతుంది.
  5. స్త్రీ సంయోగ బీజదంలోనే సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది.
  6. ‘పూర్వగామి ఘట్టం’ విత్తనం ఏర్పడే స్థితిని సూచిస్తుంది.
  7. ఇది వాటి పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మెట్టు.

ప్రశ్న 5.
శైవలాలు, బ్రయోఫైటా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యాన్ని వివరించండి. [AP M-19][TS M-16]
జవాబు:
I. శైవలాల ఆర్థిక ప్రాముఖ్యత:

  1. భూమిపై జరిగే ‘కర్బన స్థాపనలో కనీసం సగభాగం శైవలాల ద్వారానే జరుగుతుంది.
  2. గోధుమవర్ణశైవలాలు ‘ఆల్జిన్’ అనే పదార్థంను ఉత్పత్తి చేస్తాయి. వీటిని వాణిజ్యపరంగా వాడుతున్నారు.
  3. ఎరుపువర్ణశైవలాలు ‘కెర్రాజీన్’ అనే పదార్థంను ఉత్పత్తి చేస్తాయి. వీటిని వాణిజ్యపరంగా వాడుతున్నారు.
  4. అగార్ను జెలిడియం నుండి, అయోడినను లామినేరియా నుండి సేకరిస్తారు.
  5. క్లోరెల్లా, స్పైరులినా అనే ఏకకణ శైవలాలను అంతరిక్ష యాత్రికులు అహారంగా వాడతారు.
  6. నీటిలో నివశించే జంతువులు తమ ఆహారం కొరకు ‘లామినేరియా, సర్గాసమ్ల మీద ఆధారపడతాయి.

II. బ్రయోఫైటాల ఆర్థిక ప్రాముఖ్యత:

  1. కొన్ని మాస్లు శాకాహారులైన క్షీరదాలకు, పక్షులకు, ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి
  2. స్ఫాగ్నం అనే మాస్ జాతులు ‘పీట్’ అనే ఇంధనాన్ని ఇస్తాయి.
  3. ఇవి మృత్తిక క్రమక్షయాన్ని నివారిస్తాయి.
  4. ఇవి మొక్కల అనుక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
  5. వీటికి నీటిని నిలుపుకొనే శక్తి ఉండుట వల్ల, జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో వీటిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
ఏకదళ, ద్విదళ బీజాలను ఏ విధంగా గుర్తిస్తారు?
జవాబు:
ఏకదళ బీజాలు

  1. వీటి విత్తనంలో ఒకే ఒక బీజదళం ఉంటుంది.
  2. ఇవి ‘పీచు వేరు వ్యవస్థ’ను కలిగి ఉండును
  3. పత్రాలు పృష్టోదరరాలు.
  4. పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం కనిపిస్తుంది.
  5. ద్వితీయ పెరుగుదల ఉంటుంది.
  6. నాళికా పుంజాలు వలయంలాగా అమరి ఉంటాయి. వివృతం.

ద్విదళ బీజాలు

  1. వీటి విత్తనంలో రెండు బీజదళాలు ఉంటాయి
  2. ఇవి ‘తల్లి వేరు వ్యవస్థ’ను కలిగి ఉండును.
  3. పత్రాలలో సమాంతర ఈనెలు కనిపిస్తాయి.
  4. పత్రాలు సమద్విపార్శ్యాలు.
  5. ద్వితీయ పెరుగుదల ఉండదు.
  6. నాళిక పుంజాలు చెల్లాచెదురుగా మరియు సంవృతంగా ఉంటాయి.

AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 7.
ప్రథమాంకురం గురించి క్లుప్తంగా వివరించండి. [ AP M-20]
జవాబు:
ప్రథమాంకురం:

  1. టెరిడోఫైట్ల సంయోగబీజద మొక్క దేహన్ని ‘ప్రథమాంకురం’ అంటారు.
  2. ఏకస్థితిక సిద్ధబీజం మొలకెత్తి ‘ప్రథమాంకురం’ ను ఇస్తుంది.
  3. ఇది హృదయాకృతిలో ఆకుపచ్చగా మరియు పృష్టోదరంలో ఒక నొక్కును కలిగి ఉంటుంది.
  4. ఏకకణయుత మూల తంతువులు ఉదర భాగంలో ఉంటాయి.
  5. ఇది నీడ, తేమ మరియు చల్లని ప్రాంతాలలో పెరుగుతుంది.
  6. ప్రథమాంకురం అడుగుభాగం పురుష సంయోగబీజదాలైన ఆంథరీడియంను కలిగి ఉంటుంది.
  7. స్త్రీ సంయోగబీజదాలు ఆర్కీగోనియంల నొక్కు దగ్గర ఉత్పత్తి అవుతాయి.
  8. ఆంధరీడియాలు శైలికాయుతాలు. స్థూలసిద్ధబీజాలను చేరుటకు వీటికి నీరు అవసరం.
  9. సంయుక్తబీజం పిండంగా అభివృద్ధి చెంది, ద్వయస్ధితిక సిద్ధబీజంగా స్త్రీ సంయోగ బీజదంలో ఏర్పడుతుంది.

ప్రశ్న 8.
ఈ కింది వాని పటాలు గీసి, భాగాలను గుర్తించండి.
(a) లివర్వర్ట్ స్త్రీ, పురుష థాలస్లు
(b) ఫ్యునేరియా మొక్క సంయోగ బీజదం, సిద్ధబీజదం
జవాబు:
AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం 1
AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం 2

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
‘ఆర్కిగోనియం’ను కలిగిన మూడు మొక్కల విభాగాలను తెలుపుతూ వాటిలో ఒకదాని జీవితచక్రం గురించి సంగ్రహంగా వివరించండి.
జవాబు:
ఆర్కిగోనియాలను కలిగిన మొక్కల విభాగాలు: బ్రయోఫైటా, టెరిడోఫైటా మరియు వివృతబీజాలు
మాస్ మొక్క జీవిత చక్రం ఫ్యూనేరియా (బ్రయోఫైటా ):

  1. వీటి జీవిత చక్రం రెండు దశలలో ఉంటుంది. అవి సంయోగబీజ దశ మరియు సిద్ధబీజదశ.
  2. సంయోగబీజ దశలో మరల రెండు దశలు ఉంటాయి. అవి ప్రథమాంకురం మరియు ప్రౌఢదశ
  3. ఏకస్థితిక సిద్ధబీజం మొలకెత్తి శైశవ దశలో ‘ప్రధమాంకురం’గా ఏర్పడుతుంది.
  4. ఇది ఆకుపచ్చని, ప్రాకుతూ పెరిగే శాఖాయుత మరియు తంతుయుత దశ.
  5. ఇది అనేక పార్శ్వ మొగ్గలను కలిగి ఉంటుంది.
  6. ప్రతిమొగ్గ నిటారుగా పెరిగే ప్రౌఢ పత్రయుత దశగా అభివృద్ధి చెందుతుంది. దీనిని సంయోగబీజదం అంటారు.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం 3
  7. శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది ముక్కలవడం, జెమ్మా మరియు మొగ్గతొడగడం ద్వారా జరుగుతుంది.
  8. వీటి లైంగిక అవయవాలు ఆంధరీడియా మరియు ఆర్మీగొనియాలు. ఈ రెండు ఒకే మొక్కలోని వేర్వేరు శాఖలపై అభివృద్ధి చెందుతాయి కావున ఇది ఏకలింగయుతం.
  9. ఆంధరీడియా గద ఆకారంలో ఉండి ఆంధిరోజాయిడ్స్ను ఉత్పత్తి చేస్తుంది.
  10. ఇవి శైలికాయుతాలై నీటిలో ఈదుతూ ఆర్కీ గౌని నందు చేరి అండంతో కలిసి ఫలదీకరణం జరుపుతాయి.
  11. ఫలదీకరణంలో ఏర్పడిన సంయుక్తబీజం ద్వయస్ధితికం.
  12. ఇది పిండంగా మారి స్త్రీ సంయోగబీజదంలో సిద్ధ బీజదంగా అభివృద్ధి చెందుతుంది.
  13. సిద్ధబీజదం మూడు భాగాలను కలిగి ఉంటుంది. అవి ప్రధాన అక్షం, వృంతం మరియు గుళిక.
  14. సంయోగజీజదం పై సిద్ధబీజదం పాక్షిక పరాన్న జీవనాన్ని గడుపుతుంది.
  15. సంయోగబీజదం నుండి ప్రధాన అక్షం నీటిని శోషిస్తుంది.
  16. ‘గుళిక’ పత్ర హరితయుత కణాలు కలిగి ఆహారాన్ని తయారు చేస్తుంది.
  17. ప్రతిసిద్ధబీజం మొలకెత్తి ఏకస్థితిక శైశవ ప్రధమాంకురమును ఏర్పరుస్తుంది.

AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 2.
వివృత బీజాల ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
వివృతబీజాలు ముఖ్యలక్షణాలు:

  1. వివృతబీజాలు విత్తనాలను కలిగిన నగ్న మొక్కలు విత్తనాలు ఫలదీకరణానంతరం ఫలకవచం లేకుండా నగ్నంగా ఉంటాయి.
  2. అండాలు అండాశయ గోడలతో ఆవరించబడకుండా నగ్నంగా ఉంటాయి.
  3. వివృతబీజాలు పిండయుతాలు, నాళికా కణజాల యుతాలు మరియు ఆర్కిగోనియమ్లను కలిగిన పుష్పించే మొక్కలు
  4. ఇవి మధ్య రకపు వృక్షాలు కాని సెక్వోయియ అనేవృక్షం అతి పొడవైన వృక్షం
  5. ‘గింగో”ను బ్రతికి ఉన్న శిలాజంగా పరిగణిస్తారు.
  6. తల్లివేరు వ్యవస్థ, పైనస్ వేళ్ళలో శిలీంధ్ర మూలాలు ఉంటాయి.
  7. సైకస్ లో సహాజీవనాన్ని ప్రదర్శించే ప్రవాళాభ వేర్లు నాస్టాక్ మరియు అనబీనా వంటి సయానో బాక్టీరియాలను కలిగి ఉంటాయి.
  8. సైకస్ లో కాండం శాఖారహితంగా మరియు పైనస్లో కాండం శాఖాయుతంగా ఉంటాయి.
  9. పత్రాలు సరళంగా లేదా సంయుక్తంగా ఉంటాయి.
  10. అంతర్నిర్మాణంలో కాండంలోనిజమైన ప్రసరణ స్ధంభం ఉంటుంది.
  11. కాండం మరియు వేరులలో ద్వితీయ వృద్ధి జరుగుతుంది.
  12. భిన్న సిద్ధ బీజత – సూక్ష్మ మరియు స్థూల సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది.
  13. అండాలు ఉన్న స్థూల సిద్ధబీజాశయ పత్రాలు కలిగిన శంఖును ‘స్త్రీస్ట్రోబిలస్ అంటారు.
  14. ఫలదీకరణం నాళసహిత సంయోగం’ పురుష సంయోగబీజాలు పరాగనాళం ద్వారా ప్రయాణిస్తాయి.
  15. ఫలదీకరణంలో ఏర్పడిన సంయుక్తబీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది.
  16. సూక్ష్మ సిద్ధబీజాశయ పత్రాలు సూక్ష్మసిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి.
  17. సూక్ష్మ సిద్ధబీజాలు అయిన పరాగరేణువులు సూక్ష్మ సిద్ధ బీజాశయంలో ఏర్పడతాయి.
  18. స్థూల సిద్ధబీజాలు స్థూల సిద్ధబీజాశయంలో ఏర్పడతాయి.
  19. అండాశయాలు స్థూలసిద్ధబీజాశయ పత్రాలలో ఏర్పడతాయి.
  20. అండాశయం అండద్వారంతో తెరుచుకుంటుంది. పరాగసంపర్కం ప్రత్యక్షం, వాయు పరాగసంపర్కం.
  21. ఫలదీకరణం నాళసహితం సంయోగం పురుష సంయోగ బీజాలు (లేదా) పరాగరేణువులు పరాగనాళం ద్వారా
    ప్రయాణిస్తాయి.
  22. సంయుక్తబీజం ఫలదీకరణం యొక్క ఉత్పత్తి ఇది పిండంగా మారుతుంది.
  23. స్త్రీ సంయోగబీజద దేహం అంకురచ్ఛదంగా ఏర్పడుతుంది.
  24. విత్తనాలు నగ్నం ఎటువంటి ఫలకవచంతో కప్పబడి ఉండవు.
  25. మొలకెత్తుట బాహ్యంగా ఉంటుంది. బహుపిండతను ప్రదర్శిస్తాయి.
  26. ప్రతి సిద్ధబీజం మొలకెత్తి ఏకస్థితిక శైశవ ప్రథామాంకురంను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 3.
టెరిడోఫైటా మొక్కల ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు:

  1. టెరిడోఫైటా మొక్కలు నాళికా కణజాలాలను కలిగి నేలమీద నివశించే మొక్కలలో మొట్టమొదటవి.
  2. ఇవి పిండయుత, ఆర్కిగోనియాలను కలిగిన నాళికాకణజాలయుత పుష్పించని మొక్కలు.
  3. ఇవి చల్లని, తేమ మరియు నీడ గల ప్రాంతాలలో నివశిస్తాయి.
  4. ఇవి మృత్తికను బంధించి ఉంచుతాయి. అలంకారం కొరకు మరియు ఔషధాల కొరకు వీటిని వినియోగిస్తారు.
  5. మొక్క ప్రధాన దేహం అయిన సమసిద్ద బీజం వేర్లు కాండం మరియు పత్రాలు గా విభేదన చెంది ఉంటుంది.
  6. వేర్లు అబ్బురపు వేర్లు మరియు కాండం అంతర్నిర్మాణంలో బాహ్యచర్మం, వల్కలం మరియు ప్రసరణస్ధంభంను కలిగి ఉంటుంది.
  7. ప్రసరణస్తంభం ప్రధమ ప్రసరణ స్ధంభం లేదా నాళాకార ప్రసరణ స్థంభం లేదా సోలెనోస్టీల్ .
  8. పత్రాలు సెలాజినెల్లాలో సూక్ష్మపత్రాలు, మరియు ఫెర్న్ మొక్కలలో స్థూల పత్రాలు
  9. సిద్ధబీజదాలలో సిద్ధ బీజశాయాలు ఉన్నటువంటి పత్రం వంటి నిర్మాణాన్ని ‘సిద్ధబీజాశయ పత్రాలు’ అంటారు.
  10. సిద్ధబీజాశయాభివృద్ధి ‘లెప్టోస్పోరాంజియేట్’ లేదా యూస్పోరాంజియేట్ పద్ధతిలో జరుగుతుంది.
  11. అధిక శాతం టెరిడోఫైటా మొక్కలు ఒకే రకమైన సిద్ధ బీజాలను (హోమోస్పోరస్) ఏర్పరుస్తాయి.
  12. సెలాజినెల్లా మరియు సాల్వినియా ‘భిన్న సిద్ధబీజ మొక్కలు’. ఇవి రెండు రకాల సిద్ధ బీజాలు (స్థూల సూక్ష్మ) ను ఏర్పరుస్తాయి.
  13. సిద్ధ బీజాశయ పత్రాలు ఒక నిర్ధిష్టమైన నిర్మాణాలను ఏర్పరుస్తాయి. వీటిని శంకులు (లేదా) కోన్లు అంటారు.
  14. సిద్ధ బీజాలు మొలకెత్తి చిన్న, బహుకణయుత, కిరణజన్య సంయోగ సంయోగ బీజదంగా మారతాయి. దీనినే ‘ప్రధమాంకురం’ అంటారు.
  15. ‘ప్రధమాంకురం’ ద్విలింగాశ్రయ స్థితిలో (లేదా) ఏకలింగాశ్రయస్థితిలో ఉంటుంది.
  16. లైంగిక అవయవాలు ఆంధరిడియం (లేదా) ఆర్కీగోనియా.
  17. ఆంధరీడియా పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది. ఇవి ఏకకణయుతం, ద్వి (లేదా) బహు కశాభాయుతాలు.
  18. ఆర్కిగోనియా అండాలను మాత్రమే కలిగి ఉంటుంది.
  19. పురుష మరియు స్త్రీ సంయోగబీజదాల కలయిక ద్వయస్ధితిక సంయుక్త బీజాలను ఏర్పరుస్తుంది.
  20. సంయుక్త బీజం ద్వయస్ధితిక పిండంగా స్త్రీ సంయోగ బీజదంలో అభివృద్ధి చెందుతుంది.
  21. ఈ పిండం బహుకణయుత సిద్ధబీజదంగా విభేదన చెందుతుంది. ఇది టెరిడోఫైటా మొక్కల్లో ప్రబలమైన దశ.

ప్రశ్న 4.
భిన్న సిద్ధబీజత అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యం గురించి క్లుప్తంగా వ్రాయండి. రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:
భిన్న సిద్ధబీజత: మొక్కలో రెండు రకాల సిద్ధబీజాలు (స్థూల మరియు సూక్ష్మ) బీజాలు కలిగి ఉన్న స్థితిని భిన్న సిద్ధబీజత అంటారు.
A. జీవిత చక్రాలు.
I. ఏకస్థితిక జీవిత చక్రం:

  1. మొక్కలో ప్రధానమైన దశ కిరణజన్య సంయోగక్రియ ద్వారా స్వంతంత్ర జీవనం గడిపే ‘సంయోగ బీజదశ”.
  2. సిద్ధబీజదశ ఏకకణయుత సంయుక్త బీజం ద్వారానే గుర్తింపబడుతుంది.
  3. సిద్ధబీజాలు స్వతంత్ర జీవనం గడపలేవు.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం 4
  4. సంయుక్త బీజంలో క్షయకరణ విభజన వల్ల ఏకస్థితిక సిద్ధబీజాలు ఏర్పడి సంయోగబీజదాన్ని ఏర్పరుస్తాయి.
  5. ఈ రకమైన జీవిత చక్రాన్ని ‘ఏకస్థితిక జీవిత చక్రం’ అంటారు. ఉదా: శైవలాలైన వాల్వాక్స్ మరియు స్పైరోగైరా.

II. ద్వయస్థితిక జీవిత చక్రం :

  1. ద్వయస్ధితిక సిద్ధబీజదం స్వతంత్ర జీవనం కలిగిన ప్రధాన దశ
  2. ఏకస్థిక దశ సంయోగ బీజాల ద్వారా గుర్తించబడుతుంది.
  3. ఈ రకమైన జీవిత చక్రాన్ని ‘ద్వయస్థితిక జీవిత’ చక్రం అంటారు.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం 5
  4. జీవిత చక్రం అనేది కేవలం స్వతంత్ర ‘సిద్ధ బీజదం’ కొన్ని కణాల సంయోగబీజదం ద్వారా సూచించబడితే అటువంటి
  5. జీవిత చక్రాన్ని ‘ద్వయ ఏకస్థితిక’ జీవిత చక్రం అంటారు. ఉదా: టెరిడోఫైట్లు మరియు విత్తనాలను కలిగిన మొక్కలు

III. ఏక = ద్వయస్ధితిక జీవిత చక్రం:

  1. బ్రయోఫైటా మొక్కలు ఈ రెండిటికి మధ్యస్థంగా ఉన్న ఏక ద్వయ స్థితిక దశను ప్రదర్శిస్తాయి.
  2. ఈ రెండు దశలు బహుకణయుతాలు
  3. సంయోగ బీజ దశ ప్రబలమైన స్వతంత్ర దశ
  4. సిద్ధబీజ దశ స్వయం పోషణ దశ, కాని సంయోగబీజదంపై ఆధారంపడి ఉంటుంది.
  5. దీని జీవిత చక్రాన్ని ‘ఏక – ద్వయస్ధితిక’ జీవిత చక్రం అంటారు.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం 6
  6. అధిక శాతం శైవలాలు ఏకస్థితికాలు
  7. ‘ఎక్ట్రోకార్పస్ లామినేరియా’ వంటి శైవలాలు ‘ఏక – ద్వయస్ధితిక’ శైవలాలు
  8. ఫ్యూకస్ ‘ద్వయ స్థితికం’ మరియు పాలిసైఫోనియా ‘ద్విదయ స్థితికాలు’.

B. ఏకాంతర దశలు:

  1. మొక్క దేహంలో రెండు తరాల జీవిత దశలు ఉంటాయి. అవి సంయోగబీజదశ మరియు సిద్ధబీజ దశ
  2. ఏకస్థితిక సంయోగబీజదం సమవిభజన ద్వారా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది.
  3. సంయోగ బీజాల కలయిక ‘ద్వయస్థితిక సంయుక్తబీజం’ ను ఏర్పరుస్తుంది.
  4. సంయుక్తబీజం సమవిభజన జరిపి ద్వయస్థితిక సిద్ధబీజద మొక్క దేహాన్ని ఏర్పరుస్తుంది.
  5. సిద్ధబీజదం సిద్ధ మాతృకణాలను ఏర్పరుస్తుంది. ఇవి క్షయకరణ విభజన జరిపి ఏకస్థితిక సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి.
  6. ఈ సిద్ధబీజాలు మరొకసారి క్షయకరణ విభజనను జరిపి ఏకస్థితిక మొక్క దేహాన్ని ఏర్పరుస్తాయి.
  7. లైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరిపే ఏ మొక్క జీవిత చక్రంలోనైనా సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే ద్వయస్థితిక సిద్ధ బీజదదశ ఏకాంతరంగా ఉంటాయి.

AP Inter 1st Year Botany Important Questions Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 5.
శైవలాలు, బ్రయోఫైటా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
వివృత బీజాలు మరియు ఆవృతబీజాలు రెండూ విత్తనాలను కలిగి ఉంటాయి. కానీ ఈ క్రింది లక్షణాలు ఆధారంగా వీటిని వేర్వేరుగా వర్గీకరించారు.
వివృత బీజాలు లక్షణాలు

  1. వివృత బీజాలు ‘నగ్న విత్తనాలు’ కలిగిన మొక్కలు
  2. అండాలు, అండాశయ కవచాలతో కప్పబడి ఉండవు.
  3. కావున, విత్తనాలు కూడా ఫలకవచంతో కప్పబడి
  4. పరాగసంపర్కం ప్రత్యక్షం.
  5. పురుష సంయోగ బీజాలు శైలికాయుతాలు
  6. అంకురచ్ఛదం ఏకస్థితిక కణజాలం మరియు పూర్వఫలదీకరణ కణజాలం.
  7. విత్తనాలు ద్విదళబీజయుతాలు
  8. వీటిలో బహుపిండత కనిపిస్తుంది.

ఆవృత బీజాల లక్షణాలు

  1. ఆవృత బీజాలు ‘కవచయుత విత్తనాలు’ కలిగిన మొక్కలు.
  2. అండాలు అండాశయ కవచాలతో కప్పబడి ఉంటాయి.
  3. విత్తనాలు ఫలంతో కప్పబడి మరియు ఫలం ఫలకవచంతో కప్పబడి ఉంటాయి.
  4. పరాగసంపర్కం పరోక్షం.
  5. పురుష సంయోగ బీజాలు శైలికాయుతం కాదు.
  6. ద్విఫలదీకరణం లేదా త్రి ఫలదీకరణం ద్వారా ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. ఇది త్రయస్ధితిక అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది.
  7. విత్తనాలు ఏకదళబీజాలు లేదా ద్విదళ బీజయుతాలు.
  8. వీటిలో బహుపిండత గుర్తించబడలేదు.

Leave a Comment