AP Inter 1st Year Botany Important Questions Chapter 1 జీవ ప్రపంచం

Students get through AP Inter 1st Year Botany Important Questions 1st Lesson జీవ ప్రపంచం which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Botany Important Questions 1st Lesson జీవ ప్రపంచం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ICBN దేనికి సూచిక?
జవాబు:

  1. ICBN అనగా అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియామవళి. (International Code for Botanical Nomenclature).
  2. ICBN ఆధారంగా గుర్తించిన జీవికి నామాన్ని ఆపాదిస్తారు.

ప్రశ్న 2.
ఫ్లోరా (flora) అంటే ఏమిటి? [AP M-19, 18] [ TS M-18] [TS M-15, 22]
జవాబు:
ఫ్లోరా: ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసం, విస్తరణల సమాచారం, మొక్కల జాబితాను ఒక క్రమ పద్ధతిలో కలిగి ఉన్న పుస్తకమును ఫ్లోరా అంటారు.

ప్రశ్న 3.
జీవక్రియను నిర్వచించండి? నిర్మాణాత్మక, విచ్ఛిన్న క్రియల మధ్య తేడా ఏమిటి?
జవాబు:
జీవక్రియ అనేది ఒకజీవి యొక్క దేహంలో జరిగే అన్ని జీవ రసాయనిక చర్యల మొత్తం.
నిర్మాణాత్మక క్రియ

  1. ఇది సరళమైన అణువుల నుండి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే క్రియ.
  2. ఉదా: కిరణజన్యసంయోగక్రియ

విచ్ఛిన్న క్రియ

  1. ఇది సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే క్రియ.
  2. ఉదా: శ్వాసక్రియ.

AP Inter 1st Year Botany Important Questions Chapter 1 జీవ ప్రపంచం
ప్రశ్న 4.
ప్రపంచంలోని అతి పెద్ద వృక్షశాస్త్ర ఉద్యానవనం ఏది? భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ వృక్షశాస్త్ర ఉద్యానవనాలను పేర్కొనండి. [TS M-19]
జవాబు:

  1. ప్రపంచంలోని అతి పెద్ద వృక్షశాస్త్ర ఉద్యానవనం లండన్లో క్యూ వద్ద ఉన్న “రాయల్ బొటానికల్ గార్డెన్” (RBG).
  2. భారతదేశంలో కొన్ని ప్రసిద్ధ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు:
    (a) ఇండియన్ బొటానికల్గార్డెన్ – హౌరా
    (b) నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – లక్నో.

ప్రశ్న 5.
వర్గీకరణశాస్త్ర ‘కీ’ లో వాడే కప్లెట్, లీడ్ పదాలను నిర్వచించండి. [AP & TS M-16, AP M-15]
జవాబు:

  1. కప్లెట్: ‘కీ’లో విరుద్ధ లక్షణాలతో జంటలుగా ఉండే వ్యాఖ్యలను ‘కప్లెట్’ అంటారు.
  2. లీడ్: ‘క్రీ’లోని ప్రతి వ్యాఖ్యను ‘లీడ్’ అంటారు.

ప్రశ్న 6.
మాన్యుయల్లు (manuals), మోనోగ్రాఫ్లు (monographs) అంటే ఏమిటి? [AP M-17]
జవాబు:

  1. మాన్యుయల్ :తక్షణ సంప్రదింపు కోసం రూపొందించిన చిన్న పుస్తకాన్ని మాన్యువల్ అంటారు. ఇది ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందిస్తుంది.
  2. మోనోగ్రాఫ్: ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన సమాచారాన్ని కలిగి ఉన్న పుస్తకమును మోనోగ్రాఫ్ అంటారు.

ప్రశ్న 7.
‘సిస్టమాటిక్స్’ (systematics) అంటే ఏమిటి?
జవాబు:

  1. సిస్టమాటిక్స్ అనగా విభిన్న రకాల జీవులు, వాటి వైవిధ్యాలు మరియు వాటి మధ్య సంబంధ బాంధవ్యాలను గురించి అధ్యయనం చేసే జీవశాస్త్ర విభాగం.
  2. ‘సిస్టమాటిక్స్’ అనే పదం లాటిన్ పదం ‘సిస్టిమా’ నుండి కనుగొన్నారు. దీని అర్ధం ‘జీవుల క్రమపద్ధతి అమరిక’

ప్రశ్న 8.
జీవులను ఎందుకు వర్గీకరించారు?
జవాబు:

  1. జీవ ప్రపంచంలో ఆకారం, నిర్మాణం మరియు జీవనవిధానం పరంగా భేదం కలిగిన రకరకాల జీవులు ఉన్నాయి.
  2. ఇలా అనేక రకాల జీవుల గురించి సులువుగా అర్ధం చేసుకొనుటకు మరియు అధ్యయనం చేయుట కొరకు వీటిని వివిధ రకాల సమూహాలుగా వర్గీకరించారు.

ప్రశ్న 9.
వర్గీకరణలో మౌలిక ప్రమాణం ఏది? దాన్ని నిర్వచించండి? [TS M-20][AP M -17,20,22][IPE- 13,14]
జవాబు:

  1. వర్గీకరణలో మౌలిక ప్రమాణం ‘జాతి’.
  2. మౌలికమైన పోలికలను కల్గిన జీవుల సముదాయాన్ని ‘జాతి’ అని పరిగణిస్తారు.

ప్రశ్న 10.
మామిడి శాస్త్రీయ నామాన్ని తెలపండి. ప్రజాతి, జాతి నామాలను (epithet) గుర్తించండి. [TS M -17]
జవాబు:

  1. మామిడి శాస్త్రీయనామం ‘మాంజిఫెరా ఇండికా’:
  2. ప్రజాతి మాంజిఫెరా మరియు జాతి ‘ఇండికా’.

AP Inter 1st Year Botany Important Questions Chapter 1 జీవ ప్రపంచం

ప్రశ్న 11.
పెరుగుదల అంటే ఏమిటి? జీవులు నిర్జీవుల పెరుగుదల మధ్యగల తేడా ఏమిటి?
జవాబు:

  1. పెరుగుదల: ద్రవ్యరాశి మరియు పరిమాణంలోని వృద్ధిని ‘పెరుగుదల’ అంటారు.
  2. జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన, అద్విగతమైన వృద్ధిని పెరుగుదల అంటారు. జీవులలో పెరుగుదల అంతర్గతంగా కణవిభజన ద్వారా జరుగును.
  3. నిర్జీవులలో పెరుగుదల వాటి ఉపరితలంపై పదార్థాలు సంచయనం చెందటం ద్వారా జరుగుతుంది.
    ఇది బాహ్యంగా జరుగుతుంది.
    ఉదా: ఇసుక తిన్నెల పెరుగుదల, రాతి ఉపరితలంపై లైకెన్లు, మాస్ మొక్కల పెరుగుదల.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
గుర్తింపు, నామీకరణ అంటే ఏమిటి? ఒక జీవిని గుర్తించడంలోనూ, వర్గీకరించడం లోనూ ‘కీ'(key) ఏ విధంగా సహాయపడుతుంది?
జవాబు:
గుర్తింపు: సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేదా పూర్వమే గుర్తించబడినదా అనే విషయమును నిర్ధారించు విధానమును ‘గుర్తింపు’ అని అంటారు.
నామీకరణ: గుర్తించిన జీవికి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నామాన్ని ఇవ్వడాన్ని ‘నామీకరణం’ అంటారు.

  1. ‘కీ’ అనేది వర్గీకరణశాస్త్ర సహాయకం. దీని సహాయంతో మొక్కలు మరియు జంతువులను వాటి యొక్క పోలికలు మరియు వ్యత్యాసాల ఆధారంగా గుర్తించవచ్చును.
  2. ‘కీ’లో విరుద్ధ లక్షణాలతో, జంటలుగా ఉండే వ్యాఖ్యలను ‘కప్లెట్’ అంటారు.
  3. కప్లెట్ రెండు వ్యతిరేక లక్షణాలలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని వలన ఒక లక్షణం స్వీకరించబడుతుంది, మరొకటి తిరస్కరించబడుతుంది.
  4. ‘కీ’ యందలి ప్రతి వాఖ్యను ‘లీడ్’ అంటారు.
  5. మొక్కలలో ‘గుర్తింపు’ అనేది ప్రత్యక్షంగా వాటి మధ్య లక్షణాలను పోల్చుతూ హెర్బేరియమ్ యందలి నమూనాల ద్వారా లేదా పరోక్షంగా ఫ్లోరాలోని ‘కీ’ ల సహాయంతో జరుగుతుంది.
  6. వర్గీకరణ స్థాయిలను అనుసరించి అనగా కుటుంబ, ప్రజాతి మరియు జాతులను గుర్తించుటకు వేర్వేరు వర్గీకరణ ‘కీ’ లు అవసరం.

ప్రశ్న 2.
వర్గీకరణశాస్త్ర సహాయకాలు (taxonomical aids) ఏవి? హెర్బేరియంలు (herbaria), మ్యూజియంల(museums) ప్రాముఖ్యం తెలపండి?
జవాబు:
మొక్కలు మరియు జంతుజాతుల యొక్క వివిధ జాతుల యొక్క నిల్వ మరియు భద్రపరచిన సమాచారమును అందించే వాటిని ‘వర్గీకరణ శాస్త్ర సహాయకాలు’ అంటారు.
ఉదా:హెర్బేరియమ్స్, మ్యూజియమ్స్, ఉద్యానవనాలు మరియు జంతుప్రదర్శనశాలలు.
హెర్బేరియమ్స్ అనేవి సేకరించిన వృక్షనమూనాను ఆరబెట్టి, కాగితాల మధ్య ఒత్తి మరియు కాగితాలపై (షీట్స్) భద్రపరచి నిల్వ ఉంచే ప్రదేశాలు.

  1. ఈ షీట్లు అంతర్జాతీయంగా ఆమోదించబడిన వర్గీకరణ వ్యవస్థ విధానంలో అమర్చబడి ఉంటాయి.
  2. పూర్తి సమాచారంతో కూడిన వీటి నమూనాలను భవిష్యత్తు వినియోగం కొరకు భద్రపరచి ఉంచుతారు.
  3. హెర్బేరియమ్ షీట్స్లో మొక్కలను ‘సేకరించిన తేది’, సేకరించిన స్థలం, శాస్త్రీయనామం, కుటుంబం, సేకరించిన వారి పేరు మొదలైన సమాచారం ఉంటుంది.
  4. వర్గీకరణ అధ్యయనంలో హెర్బేరియమ్స్ అనేవి శీఘ్రసంప్రదింపు వ్యవస్థగా పనిచేస్తాయి.

మ్యూజియం:

  1. భద్రపరచబడిన మొక్కల మరియు జంతువుల నమూనాలను అధ్యయనం మరియు పరిశీలన కొరకు మ్యూజియమ్లలో ఉంచుతారు.
  2. ఈ మ్యూజియమ్లు విద్యాసంస్థలైన పాఠశాలలు మరియు కళాశాలయందు విస్తరించబడి ఉన్నాయి.
  3. నమూనాలను పాత్రలలో కాని లేదా జాడీలలోగాని నిల్వ ఉంచే ద్రావకంలో భద్ర పరుస్తారు.
  4. వృక్ష మరియు జంతు నమూనాలను ఎండిన స్థితిలో నిల్వచేస్తారు.

AP Inter 1st Year Botany Important Questions Chapter 1 జీవ ప్రపంచం

ప్రశ్న 3.
టాక్సాన్ (taxon) ను నిర్వచించండి. స్థాయి క్రమంలోని వివిధ స్థాయిలో టాక్సాన్ల (taxa) కు కొన్ని ఉదాహరణలను తెలపండి.
జవాబు:

  1. టాక్సాన్ అనేది వర్గీకరణ వ్యవస్థ యందు ప్రమాణము (లేదా) స్ధాయి.
  2. వర్గీకరణలో స్థాయిక్రమం ప్రకారం వివిధ మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టూ ఒక స్థాయి లేదా రకాన్ని సూచిస్తుంది.
  3. అన్ని వర్గాలు కలిసి టాక్సాన్ స్థాయిక్రమాన్ని ఏర్పరుస్తాయి.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 1 జీవ ప్రపంచం 1

ప్రశ్న 4.
జీవ వైవిధ్య సంరక్షణలలో వృక్షశాస్త్ర ఉద్యానవనాలు ఏ విధంగా తోడ్పడతాయి. ‘ఫ్లోరా’ (flora), ‘మాన్యుయల్’లు (manuals) ‘మోనోగ్రాఫ్లు'(monographs), కాటలాగ్ (catalogues) లను నిర్వచించండి.
జవాబు:
1. వృక్షశాస్త్ర ఉద్యానవనాలు అనేవి ప్రత్యేక ఉద్యానవనాలు. వీటియందు వివిధ రకాల మొక్కలు సేకరించబడి ఉంటాయి. ఇవి మొక్కల శాస్త్రీయ అధ్యయనం, సమాజ (విద్య) మరియు పునః(సృజన) ఉత్పత్తి కొరకు ఉపయోగపడతాయి.

2. ప్రతి మొక్క వాటి యొక్క సాధారణ, శాస్త్రీయ నామాలతో పాటు కుటుంబంకు సంబంధించిన సమాచారం ఉన్న చీటిని కలిగి ఉంటుంది.

3. ఈ ఉద్యానవనాలు అంతరించిపోతున్న మొక్కజాతులకు పెరుగుదల వాతావరణాన్ని కల్పించి, జీవవైవిధ్యాన్ని కాపాడుటకు సహాయపడతాయి.

4. ‘ఫ్లోరా’ అనబడే పుస్తకంలో ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసము, విస్తరణ మరియు మొక్కల జాబితా ఒక క్రమ పద్ధతిలో వ్రాయబడి ఉంటాయి.

5. ‘మ్యానుయల్’ అనునది తక్షణ సంప్రదింపు కోసం వాడే చిన్న పుస్తకము. ఒక ప్రదేశములోని మొక్కల జాతుల పేర్లను వెంటనే గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని ఇది కలిగి ఉంటుంది.

6. ‘మోనోగ్రాఫ్’ అనేది ప్రత్యేక పుస్తకం. ఇది కేవలం ఒక వర్గానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుంది.

7. ‘కాటలాగ్’ అనే పుస్తకం మొక్కలను ఖచ్చితంగా గుర్తించడానికి కావలసిన సమాచారాన్ని అందిస్తుంది.

ప్రశ్న 5.
ద్వినామ నామీకరణను వివరించండి. [TS M-22]
జవాబు:
1. ద్వినామ నామీకరణం: గుర్తించిన మొక్కను రెండు పదాలతో కూడిన సరైన శాస్త్రీయ నామంతో నామీకరణం చేయుటను ‘ద్వినామ నామీకరణం’ అంటారు.

2. ఇందులో మొదటి పదం ప్రజాతి పేరును మరియు రెండవ పదం జాతి పేరును సూచిస్తాయి.

3. సార్వత్రిక (అంతర్జాతీయ) సూత్రాలు:

  1. శాస్త్రీయ నామం ఖచ్చితంగా ‘లాటిన్’ భాషలో ఉండాలి.
  2. చేతితో వ్రాసినపుడు పేరు కింద గీతగీయాలి లేదా ఇటాలిక్ ముద్రించాలి.
  3. ప్రజాతిని సూచించే పదం పెద్ద అక్షరంతో ప్రారంభమవ్వాలి
  4. జాతిని సూచించే పదం చిన్న అక్షరంతో ప్రారంభమవ్వాలి.
  5. ఉదా: వంకాయ శాస్త్రీయ నామం ‘సొలానమ్ మెలాంజినమ్’ (Solanum melongenum).
  6. దీనియందు సోలానమ్ అనేది ప్రజాతి పేరు మరియు మెలాంజినమ్ అనేది జాతి పేరు.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
‘జీవించడం’ (living) అంటే ఏమిటి? జీవరూపాలను నిర్వచించే ఏవైనా నాలుగు లక్షణాలను వివరించండి.
జవాబు:
‘జీవించడం’ అనే పదానికి అర్ధం జీవం ఉన్న జీవుల ద్వారా ప్రదర్శించబడే విభిన్న లక్షణాలు అనగా పెరుగుదల, ప్రత్యుత్పత్తి, జీవక్రియలు, పరిస్థితులను గ్రహించే సామర్థ్యం, స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండుట, పరస్పర చర్య వంటి వాటిని కలిగి ఉండటం.
జీవరూపాలను నిర్వచించే లక్షణాలు:
1. పెరుగుదల: –

  • ద్రవ్యరాశి మరియు పరిమాణంలోని వృద్ధిని పెరుగుదల అంటారు.
  • జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన, అద్విగతమైన వృద్ధిని పెరుగుదల అంటారు. జీవులలో పెరుగుదల అంతర్గతంగా కణవిభజన ద్వారా జరుగును.
  • నిర్జీవులలో పెరుగుదల వాటి ఉపరితలంపై పదార్థాలు సంచయనం చెందటం ద్వారా జరుగుతుంది.
  • ఇది బాహ్యంగా జరుగుతుంది.
  • ఉదా: ఇసుక తిన్నెల పెరుగుదల, రాతి ఉపరితలంపై లైకెన్లు, మాస్ మొక్కల పెరుగుదల.

AP Inter 1st Year Botany Important Questions Chapter 1 జీవ ప్రపంచం

2. ప్రత్యుత్పత్తి:

  1. ప్రత్యుత్పత్తి అనగా జనకుల లక్షణాలను పోలిన సంతతిని ఉత్పత్తి చేయుట.
  2. ఇది జీవులలో మాత్రమే కనిపించే లక్షణం. ఇది నిర్జీవులలో కనిపించదు.
  3. జీవులు సాధారణంగా లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి.
  4. శిలీంధ్రాలు మిలియన్ల కొద్ది అలైంగిక సిద్ధబీజాలను ఉత్పత్తి చేయటం వలన అవి రెట్టింపు అయి త్వరగా సులువుగా విస్తరిస్తాయి.
  5. నిష్న జీవులైన ఈస్ట్ మరియు హైడ్రాలలో మొగ్గ తొడగడం గమనిస్తాము.
  6. ఏకకణ జీవులైన బాక్టీరియా, అమీబా మరియు కొన్ని శైవలాలు లాంటి జీవులలో పెరుగుదల ప్రత్యుత్పత్తికి పర్యాయము. పెరుగుదల ద్వారా అవి వాటి సంఖ్యను పెంచుకుంటాయి.
  7. కొన్ని జీవులైన మ్యూల్స్, శ్రామిక తేనెటీగల మరియు సంతానరాహిత్య దంపతులు ప్రత్యుత్పత్తిని జరపలేవు.

3. జీవక్రియలు:

  1. జీవక్రియ అనేది ఒకజీవి యొక్క దేహులో జరిగే అన్ని జీవరసాయనిక చర్యల మొత్తం.
  2. అన్ని జీవులు విభిన్న పరిమాణంలో మరియు విభిన్న విధులు కలిగిన రసాయనాలతో ఏర్పడి ఉంటాయి.
  3. అన్ని మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు ‘జీవక్రియలను’ ప్రదర్శిస్తాయి.

4. పరిస్థితులను గ్రహించే సామర్ధ్యం.

  1. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అనుక్రియను చూపుతాయి.
  2. జీవులు భౌతిక, రసాయనిక లేదా జీవ సంబంధమైన పర్యావరణ ప్రేరణలకు స్పందిస్తాయి.
  3. మొక్కలు బాహ్యాకారకాలైన కాంతి, నీరు, ఉష్ణోగ్రత మొదలగు వాటికి అసుక్రియను చూపుతాయి.
  4. మనిషి మాత్రమే తనకు తాను గుర్తింపు కలిగి ఉంటాడు, అంటే స్వయం స్పృహను కలిగి ఉంటాడు.

ప్రశ్న 2.
ఈ కింది పదాలను సోదాహరణలతో నిర్వచించండి.
(i) తరగతి
(ii) కుటుంబం
(iii) క్రమం
(iv) ప్రజాతి
(v) విభాగం
జవాబు:
i. తరగతి: ఒకే పోలికలు ఉన్న క్రమాల సముదాయమును ‘తరగతి’ అంటారు.
ఉదా: ‘ద్విదళ బీజాల తరగతి’ మాల్వేస్, రోజేల్స్, పోలిమోనియేల్స్ వంటి క్రమాలను కలిగి ఉంటుంది.

ii. కుటుంబం: సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సమూహాలను ‘కుటుంబం’ అంటారు. కుటుంబాలను ప్రజాతుల యొక్క శాకీయ మరియు ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా గుర్తిస్తారు.
ఉదా: ‘సోలనేసి కుటుంబం’ మూడు భిన్న ప్రజాతులను కలిగి ఉన్నది. అవి సాలానమ్, నికోటియానా మరియు దతూర

iii. క్రమం: కొన్ని సారూప్య లక్షణాలను మాత్రమే కలిగిన వేర్వేరు కుటుంబాల సముదాయమును ‘క్రమం’ అంటారు. కుటుంబంలోని విభిన్న ప్రజాతులలో ‘క్రమం’ కొన్ని లక్షణాలలో మాత్రమే పోలికలను కలిగి ఉంటాయి. ఉదా: ‘పోలిమోనియేల్స్ క్రమం’ లో కన్వాల్వులేసి మరియు సోలనేసి కుటుంబాలు పుష్ప లక్షణాలు ఆధారంగా మాత్రమే చేర్చబడినవి.

AP Inter 1st Year Botany Important Questions Chapter 1 జీవ ప్రపంచం

iv. ప్రజాతి: దగ్గర సంబంధం ఉన్న జాతుల సముదాయమును ప్రజాతి అంటారు.
ఉదా: ‘సోలానమ్ ప్రజాతి’ బంగాళదుంప మరియు వంకాయ వంటి రెండు జాతులను కలిగి ఉన్నది.

v. విభాగం లేదా ఫైలమ్: దగ్గర సంబంధం ఉన్న తరగతుల సముదాయంను ‘విభాగం’ అంటారు. ఉదా: ‘స్పెర్మటోఫైటా విభాగం’ ద్విదళబీజాలు మరియు ఏకదళబీజాలు అనే రెండు తరగతులను కలిగి ఉన్నది.

Leave a Comment