AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన

Students get through AP Inter 1st Year Botany Important Questions 11th Lesson కణచక్రం, కణ విభజన which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Botany Important Questions 11th Lesson కణచక్రం, కణ విభజన

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
కేంద్రక పూర్వ, నిజకేంద్రక కణాలలో, ఏ కణం తక్కువ వ్యవధిలో కణవిభజన చెందును?
జవాబు:
కేంద్రక పూర్వకణము.

ప్రశ్న 2.
కేంద్రక పూర్వ, నిజకేంద్రక కణాలలో, ఏ కణ చక్రానికి తక్కువ వ్యవధి ఉండును?
జవాబు:

  1. ‘కేంద్రక పూర్వ కణం’ యొక్క కణచక్రమునకు తక్కువ వ్యవధి ఉండును.
  2. కేంద్రక పూర్వకణము యొక్క కణ చక్ర వ్యవధి 20 నిమిషములు. అదే నిజకేంద్రక కణమునకు 24 గంటలు.

ప్రశ్న 3.
ఎక్కువ వ్యవధి ఉండునటు వంటి కణ చక్ర దశ ఏది?
జవాబు:
ఎక్కువ వ్యవధి ఉండునటు వంటి కణ చక్ర దశ ‘అంతర్దశ’.

AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 4.
మొక్కలు, జంతువులలోని ఏ కణజాలం క్షయకరణ విభజన కనబర్చును? [AP M-16]
జవాబు:

  1. జంతువులలోని ‘సంయోగబీజాశయ కణజాలంలో క్షయకరణ విభజన జరుగును.
  2. థాలోఫైటా మొక్కలో ‘సంయుక్తబీజం’లో క్షయకరణ విభజన జరుగును.
  3. బ్రయోఫైట్స్లోలోని ‘సిద్ధబీజ మాతృకణాలు లేదా పునరుత్పత్తి కణాల’లో క్షయకరణ విభజన జరుగును.

ప్రశ్న 5.
ఈ.కొలై (E.coli) సగటున 20 నిముషములలో కణ విభజన చెంది రెట్టింపైనచో, రెండు కణాల నుంచి 32 ఈ. కొలై కణాలు ఏర్పడుటకు ఎంత సమయం పడుతుంది? [TS M-18]
జవాబు:

  1. 80 నిమిషాలు
  2. కారణం: ప్రతి 20 నిమిషాలకొకసారి కణం విభజన చెందును. 32 – 24. కావున నాలుగు తరాలు అవసరం. అవి 32 కణాలుగా ఏర్పడుటకు పట్టు కాలం 20+20+20+20 = 80 నిమిషాలు.

ప్రశ్న 6.
సమ విభజన దశలను విశదీకరించడానికి, మానవ దేహంలోని ఏ భాగాలను ఉపయోగించవచ్చును?
జవాబు:
సమ విభజన దశలను విశదీకరించడానికి, మానవ దేహంలోని దేహకణాలు (గొంతు పొరలలోని పైపూత కణాలు మరియు చర్మ కణాలు)ను ఉపయోగించవచ్చు.

ప్రశ్న 7.
క్రోమోసోమ్ వలె వర్గీకరించుటకు క్రొమాటిడ్కు ఏ లక్షణాలు ఉండవలెను?
జవాబు:
క్రోమోసోమ్ వలె వర్గీకరించుటకు క్రొమాటిడ్ ఈ క్రింది లక్షణాలను కలిగి ఉండవలెను.

  1. స్వయం ప్రతిపత్తి (ఉనికి)
  2. స్వయం సెంట్రోమియర్ మరియు ఒక DNA అణువును కలిగి ఉండాలి.

ప్రశ్న 8.
క్షయకరణ విభజనలోని ప్రథమ దశ I లో బైవలెంట్లోని నాలుగు క్రొమాటిడ్లలో ఏవి జన్యుమార్పిడి/పారగతిలో పాల్గొనును. [TS M-16][AP M-19]
జవాబు:
సోదరేతర క్రొమాటిడ్లు

ప్రశ్న 9.
ఒక కణజాలంలో 1024 కణాలు ఉన్నచో ప్రథమ జనక కణం ఎన్నిమార్లు సమవిభజన చెంది ఉంటుంది? [AP M-20,22][TS M-17,22]
జవాబు:

  1. 10 సమవిభజనలు
  2. కారణం: 210=1024

ప్రశ్న 10.
ఒక పరాగ కోశంలో 1200 పరాగ రేణువులు ఉన్నచో, వాటిని ఎన్ని సూక్ష్మ సిద్ధ బీజ మాతృకలు ఉత్పత్తి చేసి ఉండవచ్చును? [AP M-15,16,17][IPE- 13][TS M-17,20]
జవాబు:

  1. 300 సూక్ష్మ సిద్ధ బీజ మాతృకలు
  2. కారణం: ¼(1200) = 300

ప్రశ్న 11.
కణ చక్రంలోని ఏ దశలో DNA సంశ్లేషణ జరుగుతుంది? [AP, TS M-18]
జవాబు:
S-దశ లేదా అంతర్దశలోని సంశ్లేషణ దశ.

ప్రశ్న 12.
మానవుని కణాలు (నిజ కేంద్రక కణాలు) కణ విభజనకు 24 గంటల సమయం వినియోగించినచో, చక్రంలోని ఏ దశ ఎక్కువ సమయం తీసుకొంటుంది?
జవాబు:
S-దశ లేదా అంతర్దశ యొక్క సంశ్లేషణ దశ

AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 13.
ఖాళీలను పూరించండి: హృదయ కణాలు కణ విభజన చెందవు. కణ చక్రములో ఈ కణాలు విభజన చెందకుండా …………. .దశ నుంచి నిష్క్రమించి ………….. అవే నిష్క్రియ దశలోకి ప్రవేశిస్తాయి.
జవాబు:

  1. G1 దశ
  2. శాంత దశ (G0)

ప్రశ్న 14.
క్షయకరణ విభజనలోని ఏ దశలో క్రోమోసోమ్ సంఖ్య వాస్తవంగా తగ్గుతుంది?
జవాబు:
క్షయకరణ విభజనలోని చలన దశ -I

ప్రశ్న 15.
మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లలో వాటి సొంత DNA (జన్యు పదార్థం) ఉంటుంది. సమవిభజనలోని కేంద్రక విభజనలో వాటి గతిని తెలపండి.
జవాబు:
కణవిభజన సమయంలో మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు రెండు పిల్ల కణాలలోనికి వితరణ చెందుతాయి.

ప్రశ్న 16.
కణ చక్రంలో ఈ కింద పేర్కొనిన దశలు సంభవించును. ఖాళీలను పూరించండి.
a) కేంద్రకత్వచం కరిగిపోవు దశ …………..
c) సెంట్రోమియర్ విభజన చెందే దశ …………….
b) కేంద్రకాంశం కనబడే దశ …………..
d) DNA ప్రతికృతి చెందే దశ ……………….
జవాబు:
a) ప్రథమదశ
b) అంత్యదశ
c) చలన దశ
d) S-దశ

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
క్షయకరణ విభజనలోని ఏ దశలో ఈ కింద పేర్కొన్నవి ఏర్పడతాయి. కింద ఇచ్చిన సూచనల నుంచి ఎన్నుకొండి.
a) సినాప్టోనీమల్ సంక్లిష్టం……….
b) పునఃసంయోజన బొడిపెలు……
c) ………….. లో రికాంబినేస్ ఎంజైమ్లు కనబడతాయి/ క్రియాశీలత వహించును .
d) కయాస్మేటా అంతిమ స్థితికరణ.
e) విభజన మధ్యస్థ దశ ………
f) కణజతలు ఏర్పడుట ………..
సూచనలు:
1. జైగోటిన్ 2. పాకీటీన్ 3. పాకీటీన్ 4. డయాకైనిసిస్, 5. అంత్యదశ I తరవాత/క్షయకరణ విభజన II కు ముందు,
6. అంత్యదశ 1 తరవాత/ క్షయకరణ విభజన తరవాత
జవాబు:
a) సినాప్టోనీమల్ సంక్లిష్టం – ‘జైగోటిన్’
b) పునఃసంయోజన బొడిపెలు – ‘పాకిటీస్’
c) ‘పాకిటీన్’లో – రికాంబినేస్ ఎంజైమ్లు కనబడతాయి/ క్రియాశీలత వహించును
d) కయాస్మేటా అంతిమ స్థితికరణ – ‘డయాకైనిసిస్’
e) విభజన మధ్యస్థ దశ – ‘అంత్యదశ I తరువాత/క్షయకరణ విభజన II కు ముందు’
f) కణ జతలు ఏర్పడుట – ‘అంత్యదశ తరువాత/ క్షయకరణ విభజన I తరువాత’

AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 2.
సమవిభజనలో రెండు ఒకే పోలికలున్న కణాలు ఏర్పడతాయి. సమవిభజనలో ఈ క్రింద పేర్కొన్న నియమ విరుద్ధమైనవి (irregularity) జరిగినచో పర్యవసానం ఏ విధంగా ఉంటుంది?
a) కేంద్రకత్వచం కరిగిపోకుండ ఉండటం
b) DNA ద్విగుణీకృతం చెందకుండటం
c) సెంట్రోమియర్లు విభజన చెందకుండటం
d) కణ ద్రవ్య విభజన జరగకుండటం
జవాబు:
a) కేంద్రక త్వచం కరిగిపోకుండా ఉంటే క్రోమోజోమ్లు జీవపదార్ధంలోనే ద్విగుణీకృతం అవుతాయి.
b) DNA ద్విగుణీకృతం చెందకపోతే, జన్యుపదార్ధం రెట్టింపు జరగదు, క్రోమోజోమ్ల సంఖ్య పెరగదు, మరియు పిల్లకణాలలో జనకకణంలో ఉన్నన్ని క్రోమోజోమ్ల సంఖ్య ఏర్పడదు.
c) సెంట్రీమియర్లు విభజన చెందకపోతే, క్రోమాటిడ్లు ధ్రువాలవైపు లాగబడవు.
d) కేంద్రక విభజన జరిగి, రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడిన తరువాత కణద్రవ్య విభజన జరగపోతే పిల్ల కణాలు ఏర్పడవు.

ప్రశ్న 3.
క్షయకరణ విభజనలో ప్రథమదశ-I లోని ఉపదశలను వివరించండి. [TS M-19]
జవాబు:
సమవిభజనలోని ప్రథమ దశ కన్నా క్షయకరణ విభజనలోని ప్రథమ దశ ఎక్కువ సంక్లిష్టముగా ఉంటూ మరింత ఎక్కువ సమయం తీసుకుంటుంది.
క్రోమోసోమ్ల ప్రవర్తనను అనుసరించి ప్రథమ దశ-I ని ఐదు ఉపదశలుగా విభజించారు.
అవి

  1. లెప్టోటిన్
  2. జైగోటిన్
  3. పాకీటిన్
  4. డిప్లోటిన్
  5. డయాకైనిసిస్

1. లెప్టోటిన్: కణద్రవ్యం నుండి నీటిని కేంద్రకం గ్రహించుట వల్ల పరిమాణం పెరుగుతుంది. క్రొమాటిన్ పదార్థం క్రోమోసోమ్ల సంఖ్యను స్థిరంగా ఉంచుతుంది.

2. జైగోటిన్: క్రోమోసోమ్లు పొట్టిగా, మందంగా అవుతాయి. అవి ఒకదానిని మరొకటి తాకి జతలుగా ఏర్పడుతాయి. ఈ సమజాతీయ జతలను ‘బైవలెంట్’ అని, ఈ పద్ధతిని ‘సూత్రయుగ్మనం’ లేదా ‘అనుదైర్ఘ్య సంధానం’ అని అంటారు.

3. పాకిటిన్: ఈ బైవలెంట్ క్రోమోసోమ్లు చతుష్కాలుగా స్పష్టంగా కన్పిస్తాయి. ఈ దశలో క్రోమాటిడ్లపై పునః సంయోజన బొడిపెలు ఏర్పడుట ముఖ్య లక్షణం. ఈ బొడిపెల స్థానాల మధ్య వినిమయం జరుగుతుంది. రికాంబినేస్ అనే ఎంజైమ్ వల్ల వినిమయం జరుగుతుంది. వినిమయం వల్ల జన్యు పదార్థం మార్పిడి జరుగుతుంది.

4. డిప్లోటిన్: సినాప్టోనీమల్ సంక్లిష్టం కరిగిపోవడం వలన బైవలెంట్లలోని సమజాతీయ క్రోమోసోమ్లు జన్యుమార్పిడి ప్రదేశం వద్ద తప్ప మిగిలిన భాగం అంతా విడిపోతుంది. మిగిలిన ‘X’ ఆకారపు నిర్మాణాలను ‘కయాస్మేటా’ అంటారు.

5. డయాకైనైసిస్: ఇది క్షయకరణ విభజన-I లో ప్రథమ దశ-I లోని ఆఖరి దశ. ఆ దశలో కయాస్మాలు అంతిమ స్థితీకరణ చెందుతాయి. డయాకైనెసిస్ చివరిదశలో కేంద్రకాంశం అదృశ్యం అవుతుంది. కేంద్రకత్వచం కరిగిపోతుంది.
AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన 1

ప్రశ్న 4.
క్షయకరణ విభజనలోని ముఖ్యాంశాలను తెల్పండి.
జవాబు:
క్షయకరణ విభజనలోని ముఖ్యాంశాలు:

  1. క్షయకరణ విభజనలో 2 దశలలో కణవిభజనలు జరుగుతాయి. వాటిని క్షయకరణ విభజన I మరియు క్షయకరణ విభజన II అని అంటారు. కాని DNA ప్రతికృతి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
  2. S-దశ జనక క్రోమోసోమ్లు ప్రతికృతిని జరుపుకొని రెండు సమానమైన సోదర క్రోమాటిడ్లుగా ఏర్పడిన తరువాత క్షయకరణ విభజన ప్రారంభమవుతుంది.
    AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన
  3. క్షయకరణ విభజనలో సమజాతీయ క్రోమోజోమ్ల జంట ఏర్పడుతుంది. వాటి మధ్య పునః సంయోజనం జరుగుతుంది.
  4. నాలుగు ఏకస్థితిక పిల్లకణాలు క్షయకరణ విభజన II చివరలో ఏర్పడుతాయి.
    క్షయకరణ దశలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు .
    AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన 2

ప్రశ్న 5.
బహుకణ జీవులలోని కణాలలో క్రోమోసోమ్ల సంఖ్య స్థిరంగా ఉండవలెనన్న ఏ రకమైన విభజన అవసరం? ఎందుకు? [IPE Mar-14]
జవాబు:

  1. బహుకణ జీవులలోని కణాలలో క్రోమోసోమ్ల సంఖ్య స్థిరంగా ఉండవలెనన్న ‘సమవిభజన’ అవసరం.
  2. ఎందుకనగా సమవిభజన ఫలితంగా ‘ద్వయస్థితిక పిల్ల కణాలు’ ఏర్పడటమే కాకుండా జన్యుపరంగా అవి
    ఒకదానికొకటి సమానంగా ఉంటాయి.
  3. సమవిభజన బహుకణ జీవులలో క్రోమోసోమ్ల సంఖ్యను స్థిరంగా ఉంచుతుంది.
  4. సమవిభజన గాయాలు మాన్పుటకు, మొక్కల భాగాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.
  5. సమవిభజన వల్ల ఏర్పడిన పిల్ల కణాలు తల్లి కణాన్ని పోలి ఉంటాయి.
  6. సమవిభజన వల్ల జీవులు పెరుగుతాయి, మరియు కణ ఉపరితల పరిమాణం పెరుగుట వల్ల కేంద్రక కణ ద్రవ్య పరిమాణ నిష్పత్తి మారుతుంది.

ప్రశ్న 6.
విరామంలో లేకపోయినప్పటికీ అంతర్ధశను విరామదశ అంటారు. వ్యాఖ్యానించండి? [ TS Mar-17,20,22][AP Mar-15,16,17,18,19,20,22] [IPE Mar – 13]
జవాబు:
కణచక్రదశలో కేంద్రక విభజన చూపించని దశని అంతర్ధశ అని అంటారు. దీనిలో రెండు ఫలవంతమైన కణవిభజనలు జరుగుతాయి.
అంతర్ధశను విరామ దశ అన్నప్పటికి ఈ దశలో కణ పెరుగుదల మరియు DNA ప్రతికృతి ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి.
అంతర్ధశను మూడు ఉపదశలుగా వర్గీకరించవచ్చు.
G1 దశ(Gap-1), S దశ(Synthesis), G2 దశ (Gap-2)
1. G1 దశ: ఇది సమవిభజనకు, ప్రతికృతి ఆరంభమునకు మధ్య ఉంటుంది. G దశలో కణం నిరంతరం పెరుగుతూ, జీవ క్రియా పరంగా అధిక క్రియాశీలత కల్గి ఉంటుంది. కాని DNA ప్రతికృతి జరగదు.
AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన 3

2. S దశ: ఈ దశలో DNA సంశ్లేషణ లేదా ప్రతికృతి జరుగును. ఈ సమయంలో కణంలోని DNA పరిమాణం రెట్టింపు అవుతుంది. అంటే DNA పరిమాణం 2C గా వుంటే 4C గా మారుతుంది. కాని క్రోమోసోమ్ల సంఖ్య పెరగదు.

3. G2 దశ: G2 దశలో ప్రోటీన్లు మరియు RNA సంశ్లేషణ చెందుతూ ఉంటాయి. వివిధ కణాంగాలు క్రొత్తగా తయారవుతాయి. కండె పోగులు తయారీ కోసం ATP శక్తిని ఉపయోగించుకొంటాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
అంత్యదశ ప్రథమ దశకు ఉత్కృమం? ఈ వ్యాఖ్యానం గురించి చర్చించండి?
జవాబు:
ప్రథమ దశ

  1. ప్రథమదశలో క్రొమాటిన్ పదార్థాలు సంగ్రహణం చెంది పొట్టిగా, దళసరిగా ఉండే క్రోమోసోములు ఏర్పడతాయి. కాని అంత్యదశలో క్రోమోసోమ్లు ప్రతి సంగ్రహణం చెంది వాటి గుర్తింపు కోల్పోయి క్రమేణా కనిపించవు.
  2. ప్రథమదశలో గాల్జీసంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలం, కేంద్రకాంశం, కేంద్రక త్వచం క్రమేపీ అదృశ్యమౌతాయి. కాని అంత్యదశలో గాల్జీ సంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలం, కేంద్రకాంశం, కేంద్రక త్వచం పునర్నిర్మితమవుతాయి.
  3. ప్రథమదశలో ప్రతి క్రోమోసోమ్లో రెండు క్రొమాటిడ్లు ఉంటాయి.
    ప్రతి క్రోమోసోమ్లో ఒక క్రొమాటిడ్ మాత్రమే ఉంటుంది.
  4. ప్రథమదశలో కణద్రవ్యంలో ఉన్న ప్రోటీను పదార్థాలు, సూక్ష్మనాళికలు కండె పరికరం ఏర్పడుటకు తోడ్పడతాయి. కాని అంత్యదశలో కండె పరికరం అదృశ్యమవుతుంది.
    కావున అంత్యదశ అనేది ప్రథమ దశకు ఉత్కృమంగా ఉంటుంది.

AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 3.
సమవిభజన, క్షయకరణ విభజనలలో వివిధ దశలలోని తేడాలను వివరించండి?
జవాబు:
సమవిభజన

  1. ఇది ఏకస్థితిక మరియు ద్వయస్థితిక రెండు కణాలలో జరుగుతుంది.
  2. ఇది శారీరక కణాలలో మాత్రమే జరుగుతుంది.
  3. కేంద్రకం ఒక్కసారి మాత్రమే విభజన చెందుతుంది.
  4. పిల్లకణాలు ఒకేలా ఉంటాయి.
  5. రెండు పిల్లకణాలు ఏర్పడుతాయి.
  6. ప్రథమ దశ సాధారణంగా ఉంటుంది.
  7. క్రోమోజోమ్ల జతలు ఏర్పడవు.
  8. కయాస్మాటా ఏర్పడి వినిమయం జరగడం అనేది ఉండదు.
  9. సెంట్రోమియర్ విభజన చలనదశలో జరుగుతుంది.
  10. పిల్ల క్రోమోజోమ్లు ధృవాల వైపుకు కదులుతాయి.
  11. పిల్ల కణాలలో క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పు ఉండదు.
  12. దీని కాల వ్యవధి తక్కువ.

క్షయకరణ

  1. ఇది ద్వయస్ధితిక కణాలలో మాత్రమే జరుగుతుంది.
  2. ఇది ప్రత్యుత్పత్తి కణాలలో మాత్రమే జరుగుతుంది.
  3. కేంద్రక విభజన రెండుసార్లు జరుగుతుంది.
  4. పిల్లకణాలు ఒకలా ఉండవు.
  5. నాలుగు పిల్లకణాలు ఏర్పడతాయి.
  6. ప్రధమ దశ సంక్లిష్టంగా 5 ఉప దశలను కలిగి ఉంటుంది.
  7. సమజాతీయ బైవలెంట్ క్రోమోజోమ్లు ఏర్పడతాయి.
  8. సోదరేతర క్రొమాటిడ్ల మధ్య కయాస్మాటాలు ఏర్పడి వినిమయం జరుగుతుంది.
  9. సెంట్రోమియర్ చలనదశ లో విభజన చెందదు, కాని చలనదశ II లో విభజన చెందుతుంది.
  10. చలన దశ I లో బైవలెంటు ఎదురెదురు ధృవాల వైపుకు కదులుతాయి.
  11. పిల్ల కణాలలో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గిపోతుంది.
  12. దీని కాల వ్యవధి ఎక్కువ.

సమవిభజనలోని దశలు
AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన 4

క్షయకరణవిభజనలోని దశలు
AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన 5

ప్రశ్న 4.
ఈ కింది వాటి గురించి క్లుప్తంగా తెలపండి.
a) సినాప్టోనీమల్ సంక్లిష్టం
b) మధ్యస్థ దశ ఫలకం
జవాబు:
a. సినాప్టోనీమల్ సంక్లిష్టం:
జైగోటీన్ దశలో క్రోమోసోమ్లు జతలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియను అనుదైర్ఘ్య సంధానం’ లేదా ‘సూత్రయుగ్మనం’ (synapsis) అంటారు.
ఈ క్రోమోసోమ్ జతలను సమజాతీయ క్రోమోసోమ్లు అంటారు.
క్రోమోసోమ్ సూత్రయుగ్మనం తరువాత సంక్లిష్ట నిర్మాణం ఏర్పడుతుంది. దీనినే ‘సినాప్టోనీమల్ సంక్లిష్టం’ అంటారు.
సమజాతీయ క్రోమోసోమ్లచే ఏర్పడిన సంక్లిష్టంను ‘బైవలెంట్’ లేదా ‘క్రోమాటిడ్ల చతుష్కం’ అంటారు.

AP Inter 1st Year Botany Important Questions Chapter 11 కణచక్రం, కణ విభజన

b. మధ్యస్థ దశ ఫలకం:
మధ్యస్థ దశ రెండు ముఖ్య మార్పుల ద్వారా గుర్తించబడుతుంది.
కండెపోగులు ఏర్పడి, అదే క్రోమోసోమ్లోని కైనిటోకోర్తో అతుక్కొని ఉండటం.
క్రోమోసోమ్లు మధ్యరేఖ వద్దకు చేరుకొన్ని మధ్యస్థ ఫలకం లేదా మధ్యరేఖ ఫలకంను ఏర్పరచడం.

ప్రశ్న 5.
బహుకణయుత జీవులలో సమవిభజన, క్షయకరణ విభజనల ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:
సమవిభజన ప్రాముఖ్యత: –

  1. దేహ వ్యవస్థలలో పెరుగుదల సమవిభజన వలన జరుగుతుంది. కణం యొక్క ఉపరితలం లేదా ఘనపరిమాణ నిష్పత్తిని పునరుద్ధరణ చేస్తుంది.
  2. సమవిభజనలలో ఏర్పడిన పిల్లకణాలు తల్లి కణాలని పోలి ఉంటాయి.
  3. ఏకకణ జీవులలో సమవిభజన ప్రత్యుత్పత్తికి సహాయపడుతుంది.
  4. ‘సమవిభజన’ గాయాలు మాన్పుట మరియు పాడైన భాగాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.
  5. సమవిభజన శాఖీయ ప్రత్యుత్పత్తిలో ‘కణచ్ఛేదనం’ ప్రక్రియకు సహాయపడుతుంది.
  6. ఇది దేహంలోని అన్ని కణాలలోని క్రోమోజోమ్ల సంఖ్యను స్థిరంగా ఉంచుతుంది.

క్షయకరణ విభజన ప్రాముఖ్యత:

  1. క్రోమోజోమ్ల సంఖ్య తరతరాలకు మారకుండా నిర్ధిష్టంగా ఉండేలా చూస్తుంది.
  2. వినిమయం వలన, జన్యు పునఃసయోగం జరిగి క్రొత్త జీవులు ఏర్పడుతాయి. ఇది జీవపరిణామంకు దారితీస్తుంది.

Leave a Comment