Students get through AP Inter 1st Year Botany Important Questions 10th Lesson జీవ అణువులు which are most likely to be asked in the exam.
AP Inter 1st Year Botany Important Questions 10th Lesson జీవ అణువులు
Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ఔషధాలు కృత్రిమంగాగానీ, మొక్కలు, బాక్టీరియా, జంతువులు మొదలైన వాటి నుంచి గానీ (సహజసిద్ధమైన ఉత్పన్నాలు) తయారవుతాయి. కొన్ని సమయాల్లో సహజ ఉత్పన్నాల విషప్రభావాన్ని (side effects) తగ్గించడానికి రసాయనికంగా మార్పులు జరుపుతారు.
ఈ కిందివానిలో ఏవి సహజమైనవో, ఏవి కృత్రిమంగా తయారు చేయబడినవో తెల్పండి. [ AP M-20]
a) పెనిసిలిన్ ………..
b) సల్ఫోనమైడ్ …………
c) విటమిన్ ………..
d) పెరుగుదల హార్మోన్లు ………
జవాబు:
a) పెన్సిలిన్ → సహజ పదార్ధం
b) సల్ఫోనమైడ్ → కృత్రిమ రసాయనం
c) విటమిన్ C → సహజ పదార్ధం
d) పెరుగుదల హార్మోన్ సహజ పదార్ధం
ప్రశ్న 2.
దిగువనిచ్చిన పదార్థాలలో ఎస్టర్ బంధం, గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం, హైడ్రోజన్ బంధాలను గుర్తించండి. [TS May-17]
a) పాలిశాఖరైడు …………
b) ప్రోటీను …………
c) కొవ్వులు …………
d) నీరు ………….
జవాబు:
a) పాలిశాఖరైడ్ → గ్లైకోసైడిక్ బంధం
b) ప్రోటీను → పెప్టైడ్ బంధం
c) కొవ్వులు → ఎస్టర్ బంధం
d) నీరు → హైడ్రోజన్ బంధం
ప్రశ్న 3.
అమైనో ఆమ్లాలు, చక్కెరలు, న్యూక్లియోటైడ్లు, కొవ్వు ఆమ్లాలకు ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి. [IPE Mar- 13] [TS M-16,18]
జవాబు:
a) అమైనో ఆమ్లాలు ఉదా: గ్లైసిన్
b) చక్కెరలు
ఉదా:గ్లూకోజ్
c)న్యూక్లియోటైడ్ లు
ఉదా: ఎడినిలిక్ ఆమ్లం
d) కొవ్వు ఆమ్లాలు
ఉదా:లెసిథిన్, గ్లిసిరాల్
ప్రశ్న 4.
అమైనో ఆమ్లం యొక్క జ్విట్టర్ అయాన్ రూపాన్ని వివరించండి. [IPE Mar-14]
జవాబు:
- అమైనో ఆమ్లం ఆమ్ల (కార్బాక్సిలిక్ ఆమ్లం) మరియు క్షార (అమైనో) సముదాయాలు రెండింటిని కల్గి ఉంటుంది.
- ఒక నిర్దిష్ట pH వద్ద, అమైనో ఆమ్లం ధనాత్మక, ఋణాత్మక ఆవేశాలు సమానంగా కల్గి ద్విధ్రువం వలె తటస్థ రూపాన్ని ఏర్పరుస్తుంది. దీనినే జ్విట్టర్ అయాన్ రూపం అంటారు.
ప్రశ్న 5.
DNA లోని ఏ ఘటకాలు గ్లైకోసైడిక్ బంధాన్ని చూపిస్తాయి? [AP M-15, 17, 19]
జవాబు:
- DNA లో ప్రక్క ప్రక్కన ఉండే ‘మోనోశాఖరైడ్ల కర్బన పరమాణువుల’ మధ్య’ గ్లైకోసైడిక్ బంధాలు’ ఏర్పడతాయి.
- గ్లైకోసైడిక్ బంధం నత్రజని క్షారాన్ని మరియు చక్కెర సముదాయాలను కలుపుతుంది.
ప్రశ్న 6.
గ్లైసిన్, అలానిన్లు వాటి (at) కార్బన్లోని ప్రతిక్షేపకాలననుసరించి వేర్వేరుగా ఉంటాయి. రెండింటిలో ఉండే ప్రతిక్షేపక గ్రూపులేవి? [TS M-19]
జవాబు:
రెండింటిలో ఉండే ప్రతిక్షేపక గ్రూపులు: హైడ్రోజన్, కార్బాక్సిల్ గ్రూపు మరియు అమైనో గ్రూపు.
ప్రశ్న 7.
స్టార్చ్ (పిండి పదార్థాలు), సెల్యూలోస్, గ్లైకోజన్, కైటిన్ అనే పాలిశాఖరైడ్లను ఈ కింది వాటితో జతపరచండి. [AP M-17,22][TS M-15,20]
a) నూలు పోగు
c) కాలేయం
b) బొద్దింక ఎక్సోస్కెలిటిన్
d) తొక్క తీసిన బంగాళదుంప
జవాబు:
a) నూలుపోగు – సెల్యులోజ్
c) కాలేయం – గ్లైకోజన్
b) బొద్దింక ఎక్సోస్కెలిటన్ – కైటిన్
d) తొక్కతీసిన బంగాళదుంప – స్టార్చ్
ప్రశ్న 8.
ప్రాథమిక, ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
- ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు: మొక్కలు మరియు జంతువులు ఉత్పత్తి చేసే గుర్తించదగిన విధులను కల్గిన జీవ అణువులను ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు అంటారు. ఉదా: అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, చక్కెరలు.
- ద్వితీయ జీవక్రియోత్పన్నాలు: జీవ కణాలలో ఉత్పత్తి అయ్యే చెప్పుకోదగ్గ విధులు లేని జీవ క్రియా ఉత్పన్నాలను ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు అంటారు. ఉదా: రబ్బరు, ఔషదాలు, సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు.
Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
పాలిశాఖరైడ్ల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
- పాలిశాఖరైడ్లు పొడవైన గొలుసులతో ఏర్పడిన చక్కెరలు.
- ఇవి వివిధ మోనోశాఖరైడ్లతో ఏర్పడిన దారాల వంటి నిర్మాణాలు.
- సెల్యూలోజ్ పదార్ధం ఒకే రకమైన మోనోశాఖరైడ్ (గ్లూకోజ్)ను కలిగిన పాలిశాఖరైడ్.
- సెల్యూలోజ్ ఒక బాహ్యణుక పాలిశాఖరైడ్, స్టార్చ్ దీనియొక్క వేరే రూపాంతరం.
- జంతువుల్లో సమజాతీయ గ్లైకోజన్ అనే రూపాంతరం ఉంటుంది. ఇన్సులిన్ ఫ్రక్టోస్ యొక్క బాహ్యుణువు.
- పాలిశాఖరైడ్ గొలుసు కుడివైపునున్న చివరి భాగాన్ని క్షయకరణ కొన అని మరియు ఎడమవైపునున్న చివరి భాగాన్ని క్షయకరణం కాని కొన అని అంటారు. ఇది కార్టూన్ లాగ ఉండే అనేక శాఖలను కలిగి ఉంటుంది.
- స్టార్చ్ సర్పిలాకరంలో ద్వితీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. వాటి సర్పిలాలలో 12 అణువులను నిలిపి ఉంచుతుంది.
- స్టార్చ్- 12 నీలివర్ణంలో ఉంటుంది.
- సెల్యులోజ్లో సంక్లిష్ట సర్పిలాలు లేవు కావున అది 12 అణువులను పట్టి ఉంచలేదు.
- ప్రకృతిలో అనేక సంక్లిష్ట పాలిశాఖరైడ్లు ఉన్నాయి.
- బొద్దింకలో బాహ్య అస్థిపంజరం మరియు శిలీంధ్రాల కణత్వచాల్లో ‘కైటిన్’ అనే సంక్లిష్ట పాలిశాఖరైడ్ కలదు.
- ఈ సంక్లిష్టోష్ట పాలిశాఖరైడులు విషమ బాహ్యణువులు.
ప్రశ్న 2.
ప్రోటీన్ని ఉదాహరణగా చేసుకొని దాని పరికల్పనాత్మక (hypothetical) ప్రాథమిక, ద్వితీయ, తృతీయ నిర్మాణాలను పటాల ద్వారా సూచించండి. [AP M-22]
జవాబు:
ప్రాథమిక నిర్మాణం:
- ప్రోటీన్లు విషమ పాలిమర్లు. అవి అనేక అమైనో ఆమ్లాల ప్రోగులను కలిగి ఉంటాయి.
- ప్రతి అమైనో ఆమ్లంలో ఒక హైడ్రోజన్ అణువు, కార్బోక్సైల్ సమూహం, అమైనో సమూహం మరియు ఒక చరాత్మక సమూహాన్ని కలిగి ఉంటుంది.
- ఒక అమైనో ఆమ్లంలోని కార్బాక్సైల్ సమూహం తరువాత అమైనో ఆమ్లంలోని కార్బాక్సైల్ సమూహంతో చర్యను జరిపితే పెప్టైడ్ బంధాలు ఏర్పడుతాయి.
- అనేక అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాలలో ఒకవరుసలో బంధించబడి ఉంటాయి. దీనినే ప్రోటీనుల ‘ప్రాధమిక నిర్మాణం’ అంటారు.
- ఈ నిర్మాణం ప్రోటీను క్రియాత్మకంగా ఉంచదు.
- ఈ అమైనో ఆమ్లాల అమరిక ఒక గీతవరుసలో ఉంటుంది.
ద్వితీయ నిర్మాణం:
- ఒక ప్రోటీన్ ను ఒక గీతలా ఊహిస్తే ఎడమ కొనను మొదటి అమైనో ఆమ్లంగా మరియు కుడి కొనను అంత్య అమైనో ఆమ్లం కలిగినదిగా సూచిస్తారు.
- మొదటి అమైనో ఆమ్లంను N- కొన అమైనో ఆమ్లమని అంటారు.
- ఆఖరి అమైనో ఆమ్లంను C- కొన అమైనో ఆమ్లమని అంటారు.
- ప్రోటీను పోగు చివరివరకు సాగదీయబడిన మరియు దృఢమైన దండంలాగ ఉండదు.
- ఈ ప్రోటీను పోగు సర్పిలాకారంలో మడతలు పడి ఉంటుంది.
- ఈవిధంగా త్రిమితీయంగా ఉన్న క్రియాత్మక ప్రోటీను నిర్మాణం ఏర్పడుతుంది.
- ద్వితీయ ప్రోటీను – సర్పిలాలు మరియు B-పోగులను కలిగి ఉంటుంది.
తృతీయ నిర్మాణం:
- పొడవైన ప్రోటీను గొలుసు ముడతలు పడి డొల్లగా ఉన్న ఊలు బంతి వలె ఉంటుంది.
- ఇది తృతీయ నిర్మాణంను ఏర్పరస్తుంది. ప్రోటీన్ యొక్క త్రిమితీయ నిర్మాణంను చూపిస్తుంది.
- త్రిమితీయ నిర్మాణం ప్రోటీను జీవక్రియలకి ఎంతో ఆవశ్యకమైన నిర్మాణం.
ప్రశ్న 3.
కేంద్రకామ్లం ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. సోదాహరణంగా సమర్థించండి. [TS M-15]
జవాబు:
- ప్రస్తుత DNA నిర్మాణం వాట్సన్ మరియు క్రిక్ శాస్త్రవేత్తలు కనుగొన్న నమూనా.
- ఈ నిర్మాణం ప్రకారం DNA ద్విసర్పిలాకరంలో ఉంటుంది.
- DNAలో ఉన్న రెండు పాలి న్యూక్లియోటైడ్ పోచలు ఒక దానికొకటి వ్యతిరేకంగా అమరి ఉంటాయి.
- పోచల నిర్మాణం చక్కెర – ఫాస్ఫేట్ – చక్కెరలతో ఏర్పడుతుంది. ఈ నిర్మాణం DNAకు వెన్నెముక వంటిది.
- N- క్షారాలు వెన్నెముకకు లంబంగా, లోపలి వైపుకు ప్రతిక్షేపించబడి ఉంటాయి.
- ఒక పోచ లోని ఎడినైన్ (A) మరియు గ్వానైన్ (G) వేరొక పోచలోని థైయమిన్ (T) మరియు సైటోసిన్(C) తో బంధనం ఏర్పరుచుకుంటాయి.
- A మరియు Tల మధ్య రెండు హైడ్రోజన్ అణువుల బంధనం మరియు G మరియు C మధ్య మూడు హైడ్రోజన్ అణువుల బంధనం ఏర్పడుతుంది.
- ఒక్కొక్క పోచ మెలి తిరిగిన మేడ మెట్లవలె ఉంటుంది.
- ప్రతి మెట్టు Nక్షారాల జతతో గుర్తించబడుతుంది.
- ప్రతి ఆరోహణ మెట్టు 360° కోణాన్ని కలిగి ఉంటుంది. ఒక నత్రజని క్షారం 36° కోణాన్ని చూపుతుంది.
- సర్పిలాకారం లోని ఒక పూర్తి మెలికలో పదిమెట్లు లేదా పది నత్రజని క్షారాలు ఉంటాయి.
- ఒక మెలిక నిడివి 34A° ఉంటుంది. నత్రజని క్షారజతల మధ్య దూరం 3.4A° ఉంటుంది.
- పైన చెప్పిన లక్షణాలు కలిగిన DNAను B-DNA అంటారు.
Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)
ప్రశ్న 1.
ద్వితీయ జీవనక్రియోత్పన్నాలంటే ఏమిటి? అవి మానవునికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలపండి.
జవాబు:
అతిధేయిలో చెప్పుకోదగ్గ విధుల లేని జీవక్రియాఉత్పన్నాలను ‘ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటారు. అవి ఆల్కాలాయిడ్లు’ ఫ్లావనాయిడ్లు, రబ్బర్లు, ఆవశ్యక నూనెలు, యాంటి బయాటిక్స్, వర్ణద్రవ్యాలు, అత్తర్లు, జిగుర్లు మరియు సుగంధ ద్రవాలు
ఆల్కలాయిడ్లు:
- మొక్కల నుండి ఏర్కడిన ఆల్కలాయిడ్లను విషాలు మరియు ఔషధాల భాగాలు (ద్రవ ఔషధాలు) తయారీలో ముఖ్య పదార్థాలుగా వినియోగిస్తారు.
- పాతకాలంలో ప్రజలు మొక్కల నుండి లభించే పదార్ధాలను పెద్దమొత్తంలో రోగాల నివారణకు, పాముకాటు, జ్వరం మరియు పిచ్చి నివారణకు వాడేవారు.
ఫ్లావనాయిడ్స్:
ఈ ఫ్లావనాయిడ్లు ఎక్కువగా విస్తరించి ఉన్న ఫాలిఫినోలిక్ సమూహాలు. ఆరోగ్యకర గుణాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా యాంటి క్యాన్సర్, యాంటి వైరస్, యాంటి మండించే గుణం, కేశనాళిక స్వభావం మరియు మానవ రక్త ఫలికల స్కందనం ను ఆపే సామర్థ్యం ఉన్న మందులను తయారు చేయవచ్చు.
రబ్బర్:
- అస్పష్ట రబ్బరును సిమెంటును గట్టిగా చేయుటకు, సంలగ్నం మరియు రాపిడి టేప్ల తయారీలో వినియోగిస్తారు. రబ్బరుకు ఉన్న వంగేగుణం వలన టైర్లు, గొట్టాలు మరియు రోలర్లు వంటి వస్తువుల తయారీకి విస్తృతపరిధిలో. వినియోగిస్తారు.
- దీనికి ఉన్న స్థితిస్థాపక గుణం వలన అనేక రకాల షాకాబ్జర్ల తయారీకి వినియోగిస్తారు.
- వాయువుల వినిమయానికి మన్నికైనది, గాలిగొట్టం, బెలూన్, ఎద్దులు(బుల్స్) మరియు కూషన్స్ వంటి పరికరాల తయారీకి వినియోగిస్తారు.
ఆవశ్యక నూనెలు:
- ఆవశ్యక నూనెలు గాఢతకలిగిన హైడ్రోఫోనిక్ ద్రావాలు.
- వీటిని అస్థిర నూనెలు అనికూడా అంటారు. అంతరిక్ష నూనెలు (లేదా) ఎర్టిహెరోలు, వీటని ‘తైల మర్ధనం’ కు వినియోగిస్తారు.
యాంటీబయాటిక్స్:
- యాంటీ బయాటిక్లు సహజ రసాయన కర్బనాలు, కొన్ని హానికర పరాన్న జీవులను చంపుటకు వినియోగిస్తారు.
- అతిధేయికి ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగించవు.
- యాంటిబయాటికన్ను వ్యాధులు మరియు సంక్రమణలను కలిగించే బాక్టీరియాలకు హాని కలిగించుట లేదా నాశనం చేసేందుకు వాడతారు.
సుగంధ ద్రవ్యాలు:
- ఇంగువ (ఎన్ఫోయిటిడా) కోరింత దగ్గు మరియు గ్యాస్ వలన ఏర్పడే కడుపునొప్పికి మంచి ఉపశమనం.
- కార్డమమ్ (యాలుక) నోటి నుండి వెలువడే దుర్వాసనను మరియు జీర్ణక్రియా అపస్థితులను నియంత్రించుటకు సహాయపడుతుంది.
ప్రశ్న 2.
మూలకాల సంఘటకాలను, జీవకణ సముదాయాల్లోని కర్బన, అకర్బన ఘటకాలను ఏ విధమైన పద్ధతుల ద్వారా విశ్లేషిస్తారు? జీవకణజాలాల్లో అత్యధిక సమృద్ధిగాగల ఘటకాల అనుమితి లేమిటి? సరైన దత్తాంశాలలో అనుమితిలను సమర్ధించండి.
జవాబు:
మూలకాల సంఘటకాలను, జీవకణ సముదాయాల్లోని కర్బన మరియు అకర్బన ఘటకాలను రసాయన పద్ధతుల ద్వారా విశ్లేషిస్తారు.
1. కర్బన సముదాయాల విశ్లేషణ:
- ఒక సజీవ కణజాలం (ఒక కూరగాయ లేదా కాలేయపుభాగం) తీసుకొని ట్రైక్లోరో ఎసిటిక్ ఆమ్లంలో రోకలి లేదా కల్వం సహాయంతో నూరాలి.
- ఒక చిక్కని ద్రవం తయారవుతుంది.
- దీన్ని వడగట్టేగుడ్డ లేదా దూదితో వడపోసినపుడు మనకు రెండు భాగాలు లభిస్తాయి. మొదట వడపోసిన లేదా ఆమ్లంతో కరగగల భాగం, మరియు రెండవది అవశేషం లేదా ఆమ్లంతో కరగని భాగం.
- ఆ వడపోత పదార్ధాన్ని వివిధ రకాల వేరు చేసే పద్ధతులు ద్వారా వేరు చేసి దాని నుండి కర్బన సమూహ పదార్ధాలను విడగొట్టాలి.
- ఒక పదార్ధానికి మనం వినియోగించిన విశ్లేషణ పద్ధతుల ద్వారా ఒక సమ్మేళనం అణుసాంకేతికం మరియు వాటి సంభావ్యతా నిర్మాణాన్ని తెలుసుకోవచ్చును.
- సజీవ కణజాలాల నుంచి లభ్యమయ్యే అన్ని కర్బన సమ్మేళనాలను ‘జీవాణువులు’ అని చెప్పవచ్చు.
2. అకర్బన సముదాయాల విశ్లేషణ:
- ఒక చిన్న మొత్తంలో జీవకణజాలం ఒక పత్రం నుంచి లేదా కాలేయపు ముక్క నుండి తుంచి తీసుకోవాలి దీనిని తడి భారం (wet weight) అంటారు.
- ఈ జీవకణజాలం ను ఆరబెట్టాలి. నీరు అంతా ఆవిరైపోతుంది. ఈ మిగిలిన పదార్ధం ‘పొడిభారం’ dry weight అంటారు.
- ఈ కణజాలాన్ని బాగా కాల్చినప్పుడు దానిలోని కర్బన సమ్మేళనాలన్నీ ఆక్సీకరణ చెంది వాయు రూపంలో తొలగిపోతాయి.
- ఈ రకంగా మిగిలిన పదార్థాన్ని బూడిద అంటారు. దీనిలో అకర్బన మూలకాలైన కాల్షియం మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి.
- ఆమ్లంలో కరిగే భాగంలో సల్ఫేట్ మరియు ఫాస్ఫేట్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.
3. మూలకాల విశ్లేషణ :
- జీవకణజాలాల మూలక విశ్లేషణలో ఉదజని (హైడ్రోజన్), ఆమ్లజని (ఆక్సిజన్), కార్బన్ మరియు క్లోరిన్ వంటి మూలకాల సంఘటన తెలుస్తుంది.
- పదార్థాల విశ్లేషణ వలన జీవకణజాలలో కర్బన మరియు అకర్బన పదార్థాల సమ్మేళనం ఎంత ఉన్నది అనే విషయం గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది.
ప్రశ్న 3.
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వాట్సన్, క్రిక్ నమూనాద్వారా వివరించండి.
జవాబు:
- ప్రస్తుత DNA నిర్మాణం వాట్సన్ మరియు క్రిక్ శాస్త్రవేత్తలు కనుగొన్న నమూనా.
- ఈ నిర్మాణం ప్రకారం DNA ద్విసర్పిలాకరంలో ఉంటుంది.
- DNAలో ఉన్న రెండు పాలి న్యూక్లియోటైడ్ పోచలు ఒక దానికొకటి వ్యతిరేకంగా అమరి ఉంటాయి.
- పోచల నిర్మాణం చక్కెర – ఫాస్ఫేట్ – చక్కెరలతో ఏర్పడుతుంది. ఈ నిర్మాణం DNAకు వెన్నెముక వంటిది.
- N- క్షారాలు వెన్నెముకకు లంబంగా, లోపలి వైపుకు ప్రతిక్షేపించబడి ఉంటాయి.
- ఒక పోచ లోని ఎడినైన్ (A) మరియు గ్వానైన్ (G) వేరొక పోచలోని థైయమిన్ (T) మరియు సైటోసిన్(C) తో బంధనం ఏర్పరుచుకుంటాయి.
- A మరియు T ల మధ్య రెండు హైడ్రోజన్ అణువుల బంధనం మరియు G మరియు C మధ్య మూడు హైడ్రోజన్ అణువుల బంధనం ఏర్పడుతుంది.
- ఒక్కొక్క పోచ మెలి తిరిగిన మేడ మెట్లవలె ఉంటుంది.
- ప్రతి మెట్టు N2క్షారాల జతతో గుర్తించబడుతుంది.
- ప్రతి ఆరోహణ మెట్టు 360° కోణాన్ని కలిగి ఉంటుంది. ఒక నత్రజని క్షారం 36° కోణాన్ని చూపుతుంది.
- సర్పిలాకారం లోని ఒక పూర్తి మెలికలో పదిమెట్లు లేదా పది నత్రజని క్షారాలు ఉంటాయి.
- ఒక మెలిక నిడివి 344° ఉంటుంది. నత్రజని క్షారజతల మధ్య దూరం 3.4A° ఉంటుంది.
- పైన చెప్పిన లక్షణాలు కలిగిన DNAను B-DNA అంటారు.
వాట్సన్ & క్రిక్ల DNA ద్విసర్పిల నమూనా
P= ఫాస్ఫేట్, S= చక్కెర, A =ఎడినిన్, T= థైమిన్, G= గ్వానిన్, C= సైటోసిన్
ప్రశ్న 4.
న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్కు గల భేదమేమి? రెండేసి ఉదాహరణలతో వాటి నిర్మాణాలను తెలపండి.
జవాబు:
న్యూక్లియోటైడ్
- ‘న్యూక్లియోటైడ్’ నత్రజని క్షారం, చక్కెర మరియు ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది.
- న్యూక్లియోటైడ్ యొక్క RNA అణువును రైబోన్యుక్లియోటైడ్ అంటారు.
- న్యూక్లియోటైడ్ యొక్క DNA అణువును ‘డీ ఆక్సీరైబో న్యూక్లియోటైడ్’ అంటారు.
- ఉదా: ఎడినిలిక్ ఆమ్లం, గ్వానిలిక్ ఆమ్లం, సైటిడిలిక్ ఆమ్లం, థైమిడిక్ ఆమ్లం, యూరిడిలిక్ ఆమ్లం AMP.
న్యూక్లియోసైడ్
- ‘న్యూక్లియోసైడ్’ నత్రజని క్షారం మరియు చక్కెరను మాత్రమే కలిగి ఉంటుంది.
- న్యూక్లియోసైడ్ యొక్క RNA అణువును ‘రైబోన్యూక్లి యోసైడ్’ అంటారు.
- న్యూక్లియోసైడ్ యొక్క DNA అణువును ‘డీ ‘ఆక్సిరైబో న్యూక్లియోసైడ్’ అంటారు.
- ఉదా: ఎడినోసిన్, గ్వానోసిన్, సైటిడిన్, థైమిడిన్ మరియు యురిడిన్
ప్రశ్న 5.
వివిధ లిపిడ్ల రూపాలను సోదాహరణంగా వివరించండి.
జవాబు:
- లిపిడ్లు నీటిలో కరగని పదార్ధాలు.
- ఫాటీ ఆమ్లంలో R-సమూహాన్ని అతుక్కొని ఒక కార్బాక్సిల్ సమూహం ఉంటుంది.
- ఇవి R-సమూహం (−CH3) (లేదా) ఇథైల్ (-H2H5) (లేదా) ఎక్కువ సంఖ్య ఉన్న – CH2 సమూహాలు (1 నుండి 19 కర్బనం సంఖ్య) ఉన్న – CH2 సముదాయంను కలిగి ఉండవచ్చు.
- ఉదా: అరాఖిడోనిక్ ఆమ్లం కార్బోక్సిలో కార్బన్ను కలుపుకొని 20 కార్బనులుంటాయి.
- కొవ్వు ఆమ్లాలు సంతృప్తమైనవిగా (ద్విబంధాలు లేకుండా) లేదా అసంతృప్తమైనవిగా ఒకటిగాని అంతకంటే ఎక్కువగా గాని C=C ద్విబంధాలు ఉంటాయి.
- సరళ లిపిడ్లలో, గ్లిసరాలులో ట్రై హెడ్రాక్సి ప్రోపేన్ ఒకటి
- అధిక లిపిడ్లు గ్లిసరాల్ మరియు కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి.
- కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్గా ఎస్టరీకరణం చెందుతాయి.
- వీటిని మోనోగ్లిసరైడ్లు, డైగ్లిసరైడ్లు మరియు ట్రైగ్లిసరైడ్లు అంటారు.
- ద్రవీభవన స్థానాల ఆధారంగా వీటిని ‘కొవ్వులు’ మరియు ‘నూనెలు’ అంటారు.
- నూనెల యొక్క ద్రవీభవన స్థానం చాలా తక్కువ (ఉదా: నువ్వులనూనె). కావున శీతాకాలంలో అవి నూనెలుగానే ఉంటాయి.
- కొన్ని లిపిడ్లు ఫాస్ఫరస్ని మరియు ఫాస్ఫారిలేటెడ్ కర్బన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిని ‘ఫాస్ఫోలిపిడ్లు’ అంటారు.
- నాడీ కణజాలాలు ఎక్కువ సంక్లిష్టమైన నిర్మాణాలు కలిగిన లిపిడ్లను కలిగి ఉంటాయి.