These AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం will help students prepare well for the exams.
AP Board 10th Class Physical Science 11th Lesson Important Questions and Answers లోహ సంగ్రహణ శాస్త్రం
10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
సల్ఫైడ్ ధాతువును సాంద్రీకరణం చెందించడానికి ఏ పద్ధతిని అవలంబిస్తారు?
జవాబు:
ప్లవన ప్రక్రియ పద్ధతిని అవలంబించుట ద్వారా సల్ఫైడ్ ధాతువులను సాంద్రీకరణం చెందించవచ్చును.
ప్రశ్న 2.
ధాతువు నుండి ముడి లోహాన్ని పొందడం కోసం భర్జనం, భస్మీకరణం అను పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ఈ రెండు పద్ధతుల మధ్య తేడా ఏమి?
(లేదా)
భర్జనం, భస్మీకరణం మధ్య భేదాలు రాయండి.
జవాబు:
ప్రశ్న 3.
Fe, Na, Ag మరియు Zn లోహాలను వాటి రసాయన చర్యాశీలత పెరిగే క్రమంలో రాయండి.
జవాబు:
Ag < Fe < Zn < Na (లేదా) Ag, Fe, Zn, Na
ప్రశ్న 4.
ఇనుముతో తయారైన వస్తువులు క్షయం చెందకుండా ఉండడానికి ఎలాంటి చర్యలను తీసుకుంటారో రాయండి.
జవాబు:
ఇనుముతో తయారైన వస్తువులు క్షయం చెందకుండా ఉండడానికి
- ఆ వస్తువులకు రంగు (పెయింట్) చేయవచ్చు.
- ఆ వస్తువుల ఉపరితల వాతావరణంతో స్పర్శ లేకుండా నివారించడం.
- ఆ వస్తువులపై క్షయం కాని లోహాలతో ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో పూతను ఏర్పాటు చేయవచ్చు.
- వస్తువుకు నూనె పూసి భద్రపరచడం.
ప్రశ్న 5.
లోహ సంగ్రహణ అనగానేమి?
జవాబు:
ధాతువుల నుండి లోహాలను సంగ్రహించుట, వాటిని శుద్ధి చేయుట మరియు మిశ్రమ లోహాలను తయారు చేయుటకు సంబంధించిన శాస్త్రాన్ని లోహ సంగ్రహణశాస్త్రం అంటారు.
ప్రశ్న 6.
ఖనిజం అనగానేమి?
జవాబు:
భూమి పై పటలంలో దొరికే లోహం యొక్క సమ్మేళనం.
ప్రశ్న 7.
ధాతువు అనగానేమి?
జవాబు:
లాభసాటిగా లోహాన్ని సంగ్రహించుటకు వీలైన ఖనిజం.
ప్రశ్న 8.
గాంగ్ అనగానేమి?
జవాబు:
ఖనిజంతోపాటు మండే మలినాలు – మన్ను, రాళ్లు మొదలైనవి.
ప్రశ్న 9.
ద్రవకారి అనగానేమి?
జవాబు:
సులభంగా ద్రవంగా మారని మలినాలను ద్రవంగా మార్చుటకు కలుపబడు పదార్థం.
ప్రశ్న 10.
ఆమ్ల ద్రవకారులకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
SiO2, P2O5.
ప్రశ్న 11.
క్షార ద్రవకారులకు ఉదాహరణ లివ్వండి.
జవాబు:
CaO, MgO, FeO.
ప్రశ్న 12.
‘నీటితో కడగటం’ ప్రక్రియను ముడి ఖనిజ సాంద్రీకరణకు ఎలా వాడతారు?
జవాబు:
ధాతువుకు, మలినాలకు సాంద్రతలో గల తేడా ఆధారంగా, నీటి ప్రవాహంలో కడుగుట ద్వారా థాతువు నుండి మలినాలను వేరు చేస్తారు.
ప్రశ్న 13.
‘గలనం చేయడం’ అనగానేమి?
జవాబు:
- ధాతువు ద్రవీభవన స్థానం ‘మలినాల కన్నా తక్కువయితే ఈ పద్ధతి ఉపయోగిస్తారు.
- ఏటవాలుగా నున్న హార్త్ పై ధాతువును వేడిచేయగా అది కరిగి క్రిందకు ప్రవహిస్తుంది. మలినాలు అక్కడే మిగిలిపోతాయి.
ప్రశ్న 14.
‘కొలుములు’ గురించి రాయుము.
జవాబు:
- లోహశాస్త్రంలోని వివిధ ప్రక్రియలను జరుపుటకు వేరువేరు ఆకారాలు గల కొలుములు ఉంటాయి.
- వీటిలో బ్లాస్ట్ కొలిమి, రివర్బరేటరీ కొలిమి, ఓపెనర్త్ కొలిమి, బెస్సిమర్ కన్వర్టర్ ముఖ్యమైనవి.
ప్రశ్న 15.
‘ఛార్జి’ అనగానేమి?
జవాబు:
- ధాతువు మరియు దానితో పాటుగా కలుపబడే ద్రవకారి, క్షయకరణి మొదలగు పదార్థాల మిశ్రమం.
- కొలిమిలోకి ఛార్జిని హూపర్ ద్వారా ప్రవేశపెడతారు.
ప్రశ్న 16.
‘క్షయకరణం’ అనగానేమి?
జవాబు:
- ధాతువు నుండి లోహాన్ని పొందుట క్షయకరణమే.
- ఇందుకు ఉపయోగించే క్షయకరణులు : హైడ్రోజన్, కార్బన్, CO, వాటర్ గ్యాస్, Mg, Al, విద్యుత్ మొదలైనవి.
ప్రశ్న 17.
కొన్ని శుద్ధి చేయు పద్ధతులు రాయుము.
జవాబు:
శుద్ధిచేయు పద్ధతులు :
ద్రవ ప్రవాహం, స్వేదనం, ఆక్సీకరణం, పోలింగ్, మూసవిధి, విద్యుత్ శోధనం.
ప్రశ్న 18.
‘మిశ్రమ లోహం ‘ అనగానేమి?
జవాబు:
- లోహ ధర్మం గల రెండు లేదా అంతకన్నా ఎక్కువ మూలకాల సజాతీయ మిశ్రమం.
- సుమారు ఒకే పరమాణు సైజు గల లోహాలు మిశ్రమ లోహాలను సులభంగా ఏర్పరుస్తాయి.
ప్రశ్న 19.
కాపర్, తగరం లోహాలు, కలిస్తే ఏర్పడే మిశ్రమ లోహాలు రాయండి.
జవాబు:
బ్రాంజ్ (కంచు).
ప్రశ్న 20.
సల్ఫైడ్ ధాతువును శుద్ధిచేయు ప్లవన ప్రక్రియలో కలుపబడు పదార్థాలు ఏవి?
జవాబు:
పైన్ నూనె లేక యూకలిప్టస్ నూనె, పొటాషియం ఇథైల్ గ్రాంథేట్ లేక పొటాషియం అమైల్ గ్జాంథేట్, కొద్దిగా సున్నం లేక Na2 CO3.
ప్రశ్న 21.
‘Al’ తో క్షయకరణం చేయు ప్రక్రియను ఏమని పిలుస్తారు?
జవాబు:
థర్నెట్ చర్య.
ప్రశ్న 22.
‘స్పెల్టర్’ అనగానేమి?
జవాబు:
ముడి జింక్ (97-98%) ను స్పెల్టర్ అంటారు.
ప్రశ్న 23.
ఫెర్రస్ మిశ్రమ లోహాలు అనగానేమి?
జవాబు:
లోహ ధర్మాలను కలిగి ఉండే రెండు లేదా అంతకన్నా ఎక్కువ మూలకాల సజాతీయ మిశ్రమం.
ప్రశ్న 24.
ఎమాలం అని దేనిని అంటారు?
జవాబు:
పాదరసాన్ని కలిగి ఉన్న మిశ్రమ లోహాన్ని ఎమాణం అంటారు.
ప్రశ్న 25.
బ్రాస్ (ఇత్తడి) సంఘటనాన్ని తెలపండి.
జవాబు:
Cu : 60-80%, Zn : 20-40%.
ప్రశ్న 26.
బ్రాంజ్ (కంచు) సంఘటనాన్ని తెల్పండి.
జవాబు:
Cu : 75-90%, Zn : 10-25%.
ప్రశ్న 27.
జర్మన్ సిల్వర్ సంఘటనాన్ని తెల్పండి.
జవాబు:
Cu : 25-50%, Zn : 25-35%, Ni : 10-20%.
ప్రశ్న 28.
క్రింది లోహాలను వాటి చర్యాశీలత యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి.
K, Zn, Ag, Fe, Ca, Au, Na, Ph.
జవాబు:
అధిక చర్యాశీలత గల లోహాలు : K, Na, Ca
సాధారణ చర్యాశీలత గల లోహాలు : Zn, Fe, Pb
తక్కువ చర్యాశీలత గల లోహాలు : Ag, Au
అవరోహణ క్రమం : K, Na, Ca, Zn, Fe, Pb, Ag, Au
ప్రశ్న 29.
ఒక లోహాన్ని దాని ,ధాతువు నుండి సంగ్రహించే విధానంలోని దశలేవి?
జవాబు:
- ముడి ఖనిజ సాంద్రీకరణ,
- ముడి లోహ నిష్కర్షణ,
- లోహాన్ని కుద్ధి చేయడం
ప్రశ్న 30.
ముడి ఖనిజ సాంద్రీకరణ అనగానేమి?
జవాబు:
ఖనిజమాలిన్యం అధిక పరిమాణంలోనున్న ధాతువు నుండి వీలైనంత ఖనిజ మాలిన్యంను తక్కువ ఖర్చుతో కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా వేరుచేసే ప్రక్రియను ధాతు సాంద్రీకరణ అంటారు.
ప్రశ్న 31.
ధాతువును సాంద్రీకరణం చేయడానికి వాడే భౌతిక పద్ధతిని ఎలా ఎంచుకుంటారు?
జవాబు:
ధాతువు, ఖనిజ మాలిన్యంల మధ్య భౌతిక ధర్మాలలో గల భేదంపై ఆధారపడి కొన్ని భౌతిక పద్ధతులను ధాతువు సాంద్రీకరణ చేయడానికి అవలంబిస్తారు.
ప్రశ్న 32.
కార్బతో లోహ ఆక్సైడ్ల క్షయకరణానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
లోహ ఆక్సైడ్ లను, మూసి ఉన్న కొలిమిలో తీసుకున్న కోక్ తో వేడిచేసి క్షయకరణం గావిస్తే లోహం, కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడతాయి.
ప్రశ్న 33.
లోహశుద్ధి అనగానేమి?
జవాబు:
అపరిశుద్ధ లోహం నుండి శుద్ద లోహంను పొందే ప్రక్రియను లోహశుద్ధి అంటారు.
ప్రశ్న 34.
లోహశుద్ధిలోని వివిధ పద్ధతులేవి?
జవాబు:
స్వేదనం, పోలింగ్, గలనం చేయడం, విద్యుత్ విశ్లేషణం.
ప్రశ్న 35.
ద్రవకారి (flux) అనగానేమి?
జవాబు:
ధాతువులోని మలినాలను తొలగించడానికి ధాతువుకు బయటినుండి కలిపిన పదార్థాన్ని ‘ద్రవకారి’ అంటారు.
ప్రశ్న 36.
లోహ సంగ్రహణంలో కొలిమి పాత్ర ఏమిటి?
జవాబు:
లోహ నిష్కర్షణలో ఉష్ణరసాయన ప్రక్రియలను చేయడానికి వాడేదే కొలిమి.
ప్రశ్న 37.
చర్యాశీలత శ్రేణి అనగానేమి?
జవాబు:
లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చితే వచ్చే శ్రేణిని “చర్యాశీలత శ్రేణి” అంటారు.
ప్రశ్న 38.
మిశ్రమ లోహం సజాతీయమా? విజాతీయమా?
జవాబు:
మిశ్రమ లోహం సజాతీయం
10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ఖనిజాన్ని నిర్వచించండి. ఏవైనా రెండు మెగ్నీషియం ధాతువులను రాయండి.
జవాబు:
ఖనిజం :
ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను “ఖనిజం” అంటారు.
(లేదా)
భూమిపై పటలంలో దొరికే లోహం యొక్క సమ్మేళనాలను “ఖనిజం” అంటారు.
మెగ్నీషియం ధాతువులు :
- మాగ్నసైట్ (MgCO3),
- కార్నలైట్ (KCl.MgCl2.6H2O)
ప్రశ్న 2.
పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఎక్కువ చర్యాశీలత కలవి మరియు క్లోరైడ్ల రూపంలో ప్రకృతిలో లభిస్తున్నాయి. వీటి లోహ సంగ్రహణానికి అనుకూలమైన పద్ధతిని సూచించి వివరించండి.
జవాబు:
- ఎక్కువ చర్యాశీలత గల లోహాలను వాటి క్లోరైడ్ నుండి సంగ్రహణం చేయడానికి వాటి ద్రవరూప సమ్మేళనాలను విద్యుద్విశ్లేషణ చేయడం అనువైన పద్ధతి.
- వీటి సంగ్రహణకు క్షయకరణ పద్ధతి, వాటి జల ద్రావణాల విద్యుద్విశ్లేషణ పద్దతులు సులభంగా సాధ్యం కావు.
ప్రశ్న 3.
అధిక చర్యాశీలత గల లోహాలు అల్ప చర్యాశీలత గల లోహాలను వాటి సంయోగ పదార్థాల నుండి స్థానభ్రంశం చెందిస్తాయని తెలుపడానికి మీరు ఏ ప్రయోగాన్ని నిర్వహిస్తారో వివరించండి.
జవాబు:
ఈ ప్రయోగ నిర్వహణకు ఏదైనా ఒక లోహం యొక్క సల్ఫేట్, క్లోరైడ్, నైట్రేట్స్ వంటి సంయోగ పదార్థాన్ని మరియు ఆ లోహం కన్నా ఎక్కువ చర్యాశీలత కలిగిన మరొక లోహాన్ని పెంచుకోవాలి.
- మనం తీసుకున్న లోహం యొక్క సంయోగ పదార్థాన్ని నీటిలో కలిపి ద్రావణం తయారుచేయాలి.
- ఆ ద్రావణాన్ని ఒక పరీక్షనాళికలో తీసుకొని అందులో మనం ఎంచుకొన్న లోహపు ముక్కను ఉంచి కొంత సమయం తర్వాత ద్రావణాన్ని, లోహపు ముక్కని పరిశీలించాలి.
- ద్రావణంలో ఉంచిన లోహపు ముక్కపై, సంయోగ పదార్థంలోని లోహం యొక్క పూత ఏర్పడితే, అధిక చర్యాశీలత గల లోహాలు అల్ప చర్యాశీలత గల లోహాలను వాటి సంయోగ పదార్థాల నుండి స్థానభ్రంశం చెందిస్తాయని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
మిశ్రమ లోహాలు కనిపెట్టబడి ఉండకపోతే గృహోపకరణాల వినియోగ విషయంలో ఏం జరిగి ఉండేది?
జవాబు:
- మిశ్రమ లోహాలైన స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే ధృఢత్వం, మెరుపు మొదలైన లక్షణాలు లేని సాధారణ లోహాలతో తయారైన వంటపాత్రలు వినియోగించవలసి వచ్చేది.
- సాధారణంగా ఇనుము, రాగి లాంటి లోహాలతో చేయబడిన వంట పాత్రలు ఉపయోగించడం వలన ఆక్సీకరణ చర్యల కారణంగా తుప్పుపట్టడం, చిలుము పట్టడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
- ఆహార పదార్థాలను భద్రపరచడానికి స్టెయిన్లెస్ స్టీల్ అందుబాటులో లేకపోవడం వలన ప్లాస్టిక్, కుండ పాత్రలు మాత్రమే వినియోగించవలసి వచ్చేది. కాని వాటి మన్నిక తక్కువ.
- అల్యూమినియం సామాగ్రి మన్నిక కూడా తక్కువ.
- కొన్ని అవసరాలకి ఇత్తడి మిశ్రమలోహం బదులు రాగి, వెండి పాత్రలు వినియోగించడం వలన అధిక ఖర్చు భరించవలసి వచ్చేది.
- కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, ఫ్రిజ్ లు ఇతర గృహోపకరణాలలో వినియోగించే మిశ్రమ లోహాలు బదులు శుద్దలోహాలు వాడడం వలన విద్యుత్ ఖర్చు పెరుగుతుంది.
- మిశ్రమ లోహాలు లేకపోవుట వలన ఫర్నిచర్‌ను ప్లాస్టిక్, సాధారణ లోహాలు, చెక్కతో చేసినవి వినియోగించవలసివచ్చేది. దాని వలన ఖర్చు పెరుగుతుంది. పర్యావరణ సమస్యలు ఎక్కువ అవుతాయి.
ప్రశ్న 5.
అధిక చర్యాశీలత గల లోహాలతో ధాతువులను క్షయకరణం చేసే చర్యకు ఒక ఉదాహరణనిచ్చి, సమీకరణంను వ్రాయండి.
జవాబు:
ఐరన్ ఆక్సైడ్ ను అల్యూమినియంతో క్షయకరణం చేయడం. Fe2O2 + 2Al → 2Fe + Al2O2 + ఉష్ణశక్తి (లేదా)
టైటానియం క్లోరైడ్ ను మెగ్నీషియంతో క్షయకరణం చేయడం. TiCl4 + 2Mg → Ti + 2MgCl2 (లేదా)
టైటానియం క్లోరైడ్ ను సోడియంతో క్షయకరణం చేయడం. TiCl4 + 4Na → Ti + 4Nacl (లేదా)
క్రోమియం ఆక్సైడ్ ను అల్యూమినియంతో క్షయకరణం చేయడం. Cr2O3 + 2Al → 2Cr + Al2O3 + ఉష్ణశక్తి
ప్రశ్న 6.
నిత్య జీవితంలో లోహక్షయాన్ని నివారించుటకు మీరు తీసుకునే రెండు జాగ్రత్తలు రాయండి.
జవాబు:
లోహక్షయాన్ని నివారించుటకు తీసుకునే జాగ్రత్తలు :
- లోహాలకు రంగులు వేయడం.
- లోహాలను తేమ తగలని ప్రదేశాలలో ఉంచడం.
- లోహాల పై క్షయంకాని లోహాలతో పూతపూయడం.
- మిశ్రమ లోహాలను తయారుచేయడం.
- లోహాలకు నూనె/గ్రీజ్ వంటి పదార్థాలను పూయడం.
ప్రశ్న 7.
సిలికాన్ (Si) ఒక అర్ధలోహం (Metalloid). దీనిని నీవు ఎలా సమర్థిస్తావు?
జవాబు:
సిలికాన్ కు క్రింది ధర్మాలుండుట వలన అది ఒక అర్ధలోహంగా సమర్థించగలను.
- ఇది లోహధృతి స్వభావంను కలిగి ఉండును.
- ఇది అనేక లోహాత్మక మరియు అలోహాత్మక సమ్మేళనాలను ప్రదర్శించును.
- ఇది స్వతహాగా పెళుసుదనంను కలిగి ఉండును.
- ఇది లోహస్థితిలోను మరియు అలోహస్థితులలోనూ తటస్థించును.
ప్రశ్న 8.
రాగి, వెండి వస్తువులకు చిలుము ఏర్పడకుండా మీరు ఏమి చేస్తారు?
జవాబు:
రాగి, వెండి వస్తువులకు చిలుము ఏర్పడకుండాఉండుటకు పాటించు పద్ధతులు :
- వస్తువుల లోహతలంపై ఒక పొరను ఏర్పరచి దాని ద్వారా ఆక్సిజన్ మరియు తేమ తగలకుండా చేయుట.
- లోహతలంపై రంగు వేయడం, నూనె, గ్రీజు, లేదా క్రోమియం పూతలను పూయటం.
- మిశ్రమ లోహాలను తయారుచేయడం ద్వారా.
ప్రశ్న 9.
సల్ఫైడ్ ధాతువుల స్వయం క్షయకరణానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
సల్ఫైడ్ ధాతువుల నుండి రాగిని సంగ్రహించేటప్పుడు ఆ ధాతువును గాలిలో పాక్షిక భర్జనం చేసి ఆక్సైడ్ గా మారుస్తారు.
2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2
గాలిని అందజేయడం ఆపివేసి, ఉష్ణోగ్రత పెంచినపుడు ఇంకా మిగిలి ఉన్న లోహసల్ఫైడ్, లోహ ఆక్సైడ్ తో చర్య పొంది లోహాన్ని మరియు SO, ను ఏర్పరుస్తుంది.
2Cu2O + Cu2S → 6Cu + 2SO2
ప్రశ్న 10.
లోహాలను మిశ్రమలోహాలుగా మార్చడం వల్ల ఉపయోగమేమి?
జవాబు:
- ఒక లోహం యొక్క ధర్మాలను పెంపొందించడానికి దానిని మిశ్రమ లోహం (Alloy) గా మార్చడం మంచి పద్దతి.
- ఉదా : ఇనుము శుద్ధస్థితిలో చాలా మృదువుగాను మరియు వేడి చేసినపుడు సులువుగా సాగిపోతుంది.
- దీనికి చాలా తక్కువ మొత్తంలో కార్బనను మిశ్రమం చెందించినపుడు అది గట్టిగాను, దృఢంగాను మారుతుంది.
- ఇనుమును నికెల్, క్రోమియంతో మిశ్రమం చెందిస్తే స్టెయిన్లెస్ స్టీల్ ఏర్పడుతుంది. ఇది తుప్పు పట్టదు.
ప్రశ్న 11.
22 కారట్ బంగారం అనగానేమి? ఇది ఆభరణాల తయారీలో ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
- 24 కారట్ల బంగారంగా పిలువబడుతున్న శుద్ధమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. అందుచే ఇది ఆభరణాల తయారీకి అంత అనువుగా ఉండదు.
- వెండి లేదా రాగి కలిసియున్న 22 కారట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి వాడుతారు.
10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
A, B, C, D అనే నాలుగు లోహాలు వివిధ ద్రావణాలతో కలిసినప్పుడు జరిగే చర్యలను కింది పట్టికలో ఇవ్వడం జరిగింది.
పై సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) అధిక చర్యాశీలత గల లోహం ఏది? ఎలా చెప్పగలవు?
ii) కాపర్ (II) సల్ఫేట్ ద్రావణంతో B లోహం కలిసినప్పుడు ఏం జరుగుతుంది?
iii) A, B, C, D లోహాలను చర్యాశీలత పెరిగే క్రమంలో అమర్చండి.
iv) పై ద్రావణాలన్నింటిని సురక్షితంగా నిల్వచేయడానికి ఉపయోగపడే లోహపు పాత్రలను పైన ఇచ్చిన ఏ లోహంతో చేయవచ్చు?
జవాబు:
i) అధిక చర్యాశీలత గల లోహం – B
కారణం :
B అనే లోహం ఐరన్ సల్ఫేట్ నుండి ఐరన్ ను స్థానభ్రంశం చెందించగలిగింది.
ii) స్థానభ్రంశ చర్య జరుగుతుంది. (లేదా) కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ స్థానభ్రంశం చెందుతుంది.
కారణం :
A లోహం కాపర్ సల్ఫేట్ నుండి కాపర్‌ను స్థానభ్రంశం చెందించింది.
B లోహం ఐరన్ సల్ఫేట్ నుండి ఐరన్ ను స్థానభ్రంశం చెందించింది.
C లోహం సిల్వర్ నైట్రేట్ నుండి సిల్వర్ ను స్థానభ్రంశం చెందించింది.
B లోహం కాపర్ కంటే అధిక చర్యాశీలత గల లోహమైన ఇనుమును ఐరన్ సల్ఫేట్ నుండి స్థానభ్రంశం చెందించింది. కావున అది కాపర్ సల్ఫేట్ నుండి కూడా కాపర్‌ను స్థానభ్రంశం చెందించగలదు.
iii) D, C, A, B (or) D < C < A < B.
iv) D లోహంతో తయారుచేయవచ్చు.
ప్రశ్న 2.
లోహాలను శుద్ధి చేసే విధానాలను తెలిపి, ఆ పద్ధతులను ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో వివరించండి.
జవాబు:
ఆయా లోహాలలో ఉన్న మలినాలను బట్టి శుద్ధి చేసే పద్దతులు వేరుగా ఉంటాయి. వీటిలో కొన్ని (i) స్వేదనం, (ii) పోలింగ్, (iii) గలనం చేయడం, (iv) విద్యుత్ విశ్లేషణం.
i) స్వేదనం :
a) అల్ప బాష్పశీల లోహాలు, అధిక బాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి ఉన్నపుడు ,ఈ పద్ధతిని వాడతారు.
b) ఈ పద్ధతిలో ద్రవస్థితిలో ఉన్న నిష్కర్షించబడిన లోహాలను స్వేదనం చేసి శుద్ధలోహాన్ని పొందుతారు.
ii) పోలింగ్ :
a) ఈ పద్దతిలో ద్రవస్థితిలో వున్న లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలుపుతారు.
b) ఈ విధంగా చేయుట ద్వారా మలినాలు వాయువు రూపంలో వేరుపడడం గాని లేదా నురగలా ద్రవరూప లోహ ఉపరితలంపై ఏర్పడడం జరుగును.
c) ఈ పద్ధతిలో కాపర్‌ను శుద్ధి చేస్తారు.
iii) గలనం చేయడం :
a) ఈ పద్ధతిలో అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాలను వేడి చేసి వాలుగా ఉన్న తలంపై జారునట్లు చేస్తారు.
b) ఈ స్థితిలో లోహం కరిగి కిందకు జారడం ద్వారా అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలు వేరు చేయబడును.
iv) విద్యుత్ విశ్లేషణం :
a) ఈ పద్ధతిలో అపరిశుద్ధ లోహంను ఆనోడ్ గా ఉపయోగిస్తారు.
b) అదే శుద్ధలోహపు ముక్కను కాథోడ్ గా వాడతారు.
c) విద్యుద్విశ్లేషణ తొట్టెలో అదే లోహానికి చెందిన ద్రవస్థితి గల లోహ లవణాన్ని విద్యుద్విశ్లేషణంగా తీసుకుంటారు.
d) అవసరమైన లోహం కాథోడ్ వద్ద శుద్ధ స్థితిలో నిక్షిప్తమగును.
e) మలినాలు “ఆనోడ్ మడ్”గా ఆనోడ్ వద్ద’ అడుగుకు చేరును.
ఆనోడ్, కాథోడ్ వద్ద జరుగు చర్యలు :
ఆనోడ్ వద్ద : M → M+n + ne– కాథోడ్ వద్ద : M+n + ne– → M
ఇక్కడ M = శుద్ధలోహం
n = 1, 2, 3, ………
ప్రశ్న 3.
ఇనుప వస్తువు క్షయం జరగడానికి గాలి, నీరు అవసరమని నిరూపించు ప్రయోగ విధానం వ్రాయుము.
(లేదా)
ఇనుముతో తయారు చేసిన వస్తువులు తుప్పు పట్టడానికి గాలి, నీరు అవసరం అని చూపు ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపి, ప్రయోగ విధానమును రాయండి.
జవాబు:
ప్రయోగం :
లక్ష్యం : ఇనుప వస్తువులు క్షయం చెందడానికి గాలి, నీరు అవసరం అని నిరూపించుట.
కావలసిన వస్తువులు : 3 పరీక్షనాళికలు, 9 ఇనుప మేకులు, నూనె, నీరు, రబ్బరు కార్కులు, అనార్థ కాల్షియం క్లోరైడ్
ప్రయోగ పద్ధతి :
- మూడు పరీక్షనాళికలు తీసుకుని, వాటిని A, B, C లు గా గుర్తించండి. ఒక్కొక్క దానిలో శుభ్రంగా ఉన్న మూడేసి ఇనుప మేకులను వేయండి.
- పరీక్షనాళిక A లో కొంత నీటిని తీసుకొని, దానిని రబ్బరు బిరడాతో బిగించండి.
- పరీక్షనాళిక B లో మరిగించిన స్వేదన జలాల్ని ఇనుప మేకు మునిగేంత వరకు తీసుకొని, దానికి 1 మి.లీ. నూనెను కలిపి, రబ్బరు బిరడాతో బిగించండి.
- పరీక్ష నాళిక ‘C’ లో కొంచెం అనార్థ కాల్షియం క్లోరైడ్ ను తీసుకొని, రబ్బరు బిరడాను బిగించండి.
- అనార్థ కాల్షియం క్లోరైడ్ గాలిలో తేమను గ్రహించును.
- పై పరీక్షనాళికలను కొన్ని రోజుల వరకూ అలా ఉంచేసి తర్వాత వచ్చిన మార్పులను పరిశీలించండి.
పరిశీలనలు :
- పరీక్షనాళిక A లో మేకు తుప్పు పట్టును.
- కానీ B మరియు C పరీక్షనాళికలోని మేకులు తుప్పు పట్టవు.
కారణం :
- పరీక్షనాళిక ‘A’ లోని మేకులు గాలి, నీరు ఉన్న వాతావరణంలో ఉంచబడ్డాయి. అందుకే తుప్పుపట్టాయి.
- ‘B’ పరీక్ష నాళికలోని మేకులు కేవలం నీటిలోను, ‘C’ పరీక్షనాళికలోని మేకులు పొడి గాలిలో ఉంచబడ్డాయి. తుప్పు పట్టలేదు.
నిర్ధారణ :
కనుక ఈ ప్రయోగం ద్వారా లోహక్షయానికి గాలి, నీరు అవసరం అని నిర్ధారించవచ్చును.
ప్రశ్న 4.
ప్లవన ప్రక్రియ ద్వారా సల్ఫైడు ధాతువు సాంద్రీకరణను చూపు పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 5.
ముడిఖనిజం గానీ లేదా ఖనిజ మాలిన్యం గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయివుంటే వాటిని వేరుచేసే పద్ధతి పేరు తెల్పండి. ఆ పద్ధతిని సూచించే చక్కని పటాన్ని గీయండి.
జవాబు:
ముడిఖనిజం గానీ లేదా ఖనిజ మాలిన్యం గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే వాటిని వేరు చేసే పద్ధతి అయస్కాంత వేర్పాటు పద్ధతి.
ప్రశ్న 6.
A, B, C, D, E అనే లోహాలు వివిధ ద్రావణాలతో చర్య జరిపినపుడు వచ్చిన ఫలితాలు క్రింది పట్టికలో ఉన్నాయి. పట్టికను పరిశీలించండి. సమాధానాలు రాయండి.
అ) అధిక చర్యాశీలత గల లోహం ఏది? ఎందుకు?
ఆ) అల్ప చర్యాశీలత గల లోహం ఏది? ఎందుకు?
ఇ) గోధుమరంగు పూత ఏర్పరచే లోహాలు ఏవి?
ఈ) A, B, C, D, E లోహాలను చర్యాశీలతల ఆరోహణక్రమంలో అమర్చండి.
జవాబు:
అ) ‘E’ అను లోహము మిగిలిన వాటన్నింటికంటే అధిక చర్యాశీలత కలది. ఎందుకనగా ఇది అన్ని ద్రావణాలతో అవక్షేపాలను ఏర్పరచుచున్నది కాబట్టి.
ఆ) ‘C’ అను లోహము మిగిలిన వాటన్నింటికంటే అల్ప చర్యాశీలత కలది. ఎందుకనగా ఇది ఏ ద్రావణంతోను చర్య జరిపి అవక్షేపమును ఏర్పరచలేదు కాబట్టి.
ఇ) B మరియు E అను లోహములు గోధుమరంగు పూతను ఏర్పరచుచున్నవి.
ఈ) ఇచ్చిన లోహాల చర్యాశీలత యొక్క ఆరోహణ క్రమము C
ప్రశ్న 7.
కింద ఇవ్వబడిన ఉత్పన్నాలలో ఉన్న అతిముఖ్యమైన లోహ మరియు అలోహాలను తెల్పండి.
అ) అన్నపూర్ణ ఉప్పు
జవాబు:
అన్నపూర్ణ ఉప్పు — అయోడిన్, క్లోరిన్ – అలోహము
ఆ) థర్మామీటరులో వాడే ద్రవం
జవాబు:
థర్మామీటరులో వాడు ద్రవము — మెర్క్యురీ (పాదరసము) – ద్రవలోహము
ఇ) పెన్సిల్ ములుకు
జవాబు:
పెన్సిల్ ములుకు – గ్రాఫైట్ – అలోహము
ఈ) క్లోరోఫిల్
జవాబు:
క్లోరోఫిల్ – మెగ్నీషియం — లోహము
ఉ) విద్యుత్ బల్బ్ లోని ఫిలమెంట్
జవాబు:
ఫిలమెంట్ – టంగ్స్టన్ – లోహము
ఊ) దంతాలపైనున్న ఎనామిల్ (enamel) పూత
జవాబు:
దంతాలపైనున్న ఎనామిల్ పూత – కాల్షియం ఫాస్ఫేట్ – అలోహము
ప్రశ్న 8.
లోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహించుటలోని వివిధ దశలను ఫ్లోచార్టు రూపంలో తెలుపుము.
జవాబు:
ప్రశ్న 9.
లోహాలు ఆక్సిజన్ తో, నీటితో, నీటి ఆవిరితో, బలమైన విలీన ఆమ్లాలతో, క్లోరిన్ తో జరిపే చర్యలను పట్టిక రూపంలో చూపుము.
జవాబు:
ప్రశ్న 10.
ధాతువు నుండి ముడిలోహ సంగ్రహణ గురించి రాయుము.
జవాబు:
భూమి నుండి లభించిన ధాతువును సాంద్రీకరించిన తరువాత శుద్ధిచేసిన ధాతువును పొందుతాం. ఈ ధాతువు నుండి లోహాన్ని సంగ్రహించడానికి క్షయకరణ చర్య ద్వారా దీనిని లోహ ఆక్సైడ్ గా మారుస్తారు. ఈ లోహ ఆక్సైడ్ ను మరలా క్షయకరణమునకు గురిచేయటం ద్వారా కొన్ని మలినాలతో కూడిన లోహాన్ని పొందగలం. ఒక లోహాన్ని దాని ధాతువుల నుండి సంగ్రహించటం, ఆ లోహం యొక్క చర్యాశీలతపై ఆధారపడి ఉంటుంది.
1) చర్యాశీలత శ్రేణిలో ఎగువభాగంలో ఉన్న లోహాల సంగ్రహణం :
ఈ లోహాలను సంగ్రహణం చేయడానికి అనువైన పద్ధతి విద్యుద్విశ్లేషణ.
ఉదా : Nacl నుండి సోడియం (Na) పొందడానికి ద్రవరూప Nacl ను స్టీల్ కాథోడ్, గ్రాఫైట్ ఆనోడ్ సహాయంతో విద్యుద్విశ్లేషణ చేస్తారు. కాథోడ్ వద్ద సోడియం లోహం నిక్షిప్తమై ఆనోడ్ వద్ద క్లోరిన్ వెలువడుతుంది.
కాథోడ్ వద్ద : 2Na+ + 2e– → 2Na
ఆనోడ్ వద్ద : 2Cl– → Cl2 + 2e–
2) చర్యాశీలత మధ్యలోనున్న లోహాల సంగ్రహణం :
ఈ లోహ ధాతువులు సాధారణంగా సల్ఫైడ్లు కార్బొనేట్ల రూపంలో వుంటాయి. ఈ ధాతువులను ముందు ఆక్సైడ్లుగా మారుస్తారు. భర్జనం ద్వారా సల్ఫైడ్ ధాతువులను ఆక్సైడ్లుగా మార్చి తరువాత క్షయకరణం ద్వారా లోహాన్ని పొందుతారు. సరైన ఓయీకరణ కారకాన్నుపయోగించి కార్బన్ వంటి లోహ ఆక్సైడ్లను లోహాలుగా క్షయకరణం చెందిస్తారు.
3) చర్యాశీలత శ్రేణిలో దిగువననున్న లోహాల సంగ్రహణం :
ఇలాంటి లోహాలను వేడిమిచర్యతో క్షయీకరింపజేయడం ద్వారా లేదా కొన్నిసార్లు వీని జలద్రావణాల నుండి స్థానభ్రంశం చెందించడం ద్వారా పొందవచ్చు.
ప్రశ్న 11.
రాగిని విద్యుత్ శోధనం ద్వారా పొందే విధానమును వివరింపుము.
జవాబు:
కాపర్ యొక్క విద్యుత్ శోధన కొరకు పరికరాల అమరిక
- అపరిశుద్ధ కాపర్‌ను ఆనోడ్ గాను, స్వచ్ఛమైన పలుచటి కాపర్ రేకులను కాథోడ్ గాను తీసుకుంటారు.
- విద్యుద్విశ్లేషకంగా ఆమీకృత కాపర్‌సల్ఫేట్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ తొట్టెలో తీసుకొని అందులో కాథోడ్, ఆనోట్లను వ్రేలాడదీస్తారు.
- విద్యుద్విశ్లేషణ ప్రక్రియ చేసినపుడు శుద్ధ స్థితిలో కాపర్, కాథోడ్ వద్ద నిక్షిప్తమవుతుంది.
కాథోడ్ వద్ద : Cu → Cu2+ + 2e–
ఆనోడ్ వద్ద : Cu2+ + 2e– → Cu
ద్రావణంలో కరగగలిగే మలినాలు ద్రావణంలోనే ఉండిపోతాయి. బ్లిస్టర్ కాపర్ నుండి వచ్చిన కరగని మలినాలు ఆనోడ్ మడ్ గా అడుగుభాగానికి చేరిపోతాయి.
ప్రశ్న 12.
లోహక్షయం అనగానేమి? అది ఎలా జరుగుతుంది?
జవాబు:
లోహక్షయం :
ఒక లోహం, దానిచుట్టూ ఉన్న పరిసరాలతో చర్య జరపడం ద్వారా తుప్పు పట్టుట, నల్లని పూత ఏర్పడుట వంటి మార్పులకు లోనగుటను లోహక్షయం అంటారు.
లోహక్షయం జరిగే విధానం :
1) ఇది ఒక విద్యుత్ రసాయన దృగ్విషయం.
2) ఇనుప వస్తువుల ఉపరితలంపై నిర్దిష్ట ప్రాంతంలో క్షయం జరిగేటప్పుడు అక్కడ ఆక్సీకరణం జరిగి, ఆ ప్రాంతం ఆనోడ్ గా ప్రవర్తిస్తుంది.
2Fe → 2Fe2+ + 4e– a
3) ఈ ఆనోడ్ వద్ద విడుదలైన ఎలక్ట్రాన్లు లోహం గుండా వేరే ప్రాంతం వద్దకు పోయి హైడ్రోజన్ అయాన్ (H+) సమక్షంలో ఆక్సిజన్‌ను క్షయీకరిస్తాయి. ఈ ప్రాంతం కాథోడ్ గా వ్యవహరిస్తుంది.
O2 +4H+ + 4e– → 2H2O
మొత్తం చర్య : 2 Fle + O2 + 4H+ → 2 Fe2+ + 2H2O
వాతావరణంలోని ఆక్సిజన్ చే ఫెర్రస్ (Fe2+) అయాన్లు ఆక్సీకరణం చెంది ఫెర్రిక్ అయాన్లు (Fe3+) గా మారి హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ (Fe2O3 . XH2O) రూపంలో తుప్పుగా మారతాయి.
ప్రశ్న 13.
లోహక్షయాన్ని ఎలా నివారిస్తారు?
జవాబు:
- లోహ ఉపరితలాన్ని పెయింట్ తో గాని, కొన్ని రసాయనాలతోగాని కప్పి ఉంచడం వల్ల లోహక్షయాన్ని నివారించవచ్చు.
- అల్ప చర్యాశీలత కలిగి ఉండి వాతావరణంలో తామే ముందుగా చర్య జరిపి, వస్తువును రక్షించగలిగే లోహాలైన Sn, Zn వంటి వాటిలో లోహ వస్తువును కప్పి ఉంచడం.
- విద్యుత్ రసాయన పద్దతిలో Zn, Mg వంటి లోహ ఎలక్ట్రోడ్లు తమకు తామే క్షయం చెంది వస్తువును క్షయం కాకుండా రక్షిస్తాయి.
ప్రశ్న 14.
బ్లాస్ట్ కొలిమి పటం గీచి, భాగములు గుర్తించుము.
జవాబు:
10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం ½ Mark Important Questions and Answers
1. ప్రకృతిలో లభించే ధాతువుల నుండి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని ఏమంటారు?
జవాబు:
లోహ సంగ్రహణ శాస్త్రం
2. ‘కంచు’ అనగానేమి?
జవాబు:
రాగి మరియు తగరంతో తయారైన మిశ్రమ లోహం
3. ప్రస్తుతం లభ్యమయ్యే మూలకాలలో లోహాలు ఎంత శాతం ఉంటాయి?
జవాబు:
75% కన్నా ఎక్కువ
4. భూ పొరలలో లోహాలు లభించే పొర ఏమిటి?
జవాబు:
భూ పటలం
5. సాధారణంగా సముద్రంలో లభించే లవణాల పేర్లు రాయుము.
జవాబు:
సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్
6. A : ప్రకృతిలో బంగారం, వెండి వంటి లోహాలు స్వేచ్చా స్థితిలో లభ్యమవుతాయి.
R: బంగారం, వెండి లోహాలకు చర్యాశీలత తక్కువ.
A) A, Rలు సరియైనవి. R, A ను సమర్థించును.
B) A, R లు సరియైనవి. R, A ను సమర్థించదు.
C) A సరియైనది కాదు. R సరియైనది.
D) A సరియైనది. R సరియైనది కాదు.
జవాబు:
A) A, Rలు సరియైనవి. R, A ను సమర్థించును.
7. ప్రకృతిలో లభించే లోహమూలకాలు లేదా సమ్మేళనాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
లోహ ఖనిజాలు
8. లోహాలను పొందడానికి అత్యంత అనుకూలత గలిగినవి?
A) ఖనిజాలు
B) ధాతువులు
C) పై రెండూ
D) రెండూ కావు
జవాబు:
B) ధాతువులు
9. భూ పటలంలో లభించే అతిసాధారణ మూలకం
A) Mg
B) Zn
C) Al
D) Ca
జవాబు:
C) Al
10. అల్యూమినియంను సంగ్రహించడానికి అనువైన ధాతువు పేరు ఏమిటి?
జవాబు:
బాక్సైట్ (Al2O3, 2H2O)
11. బాక్సైట్లో అల్యూమినియం శాతం
A) 50 – 70%
B) 80 – 90%
C) 30 – 40%
D) 20 – 30%
జవాబు:
A) 50 – 70%
12. అన్ని ఖనిజాలు ధాతువులే. కానీ అన్ని ధాతువులు ఖనిజాలు కానక్కరలేదు.
ఈ వాక్యాన్ని మీరు సమర్థిస్తున్నారా?
జవాబు:
సమర్థించను.
13. బాక్సైట్లో లభించే లోహం ఏది?
జవాబు:
అల్యూమినియం
14. సల్పెడ్ ధాతువులకు కొన్ని ఉదాహరణలిమ్ము.
జవాబు:
Zns (జింక్ బ్లెండ్), HgS (సిన్నబార్).
15. పాదరసం (Hg)ను కలిగియుండే ధాతువు ఏది?
జవాబు:
సిన్నబార్ (Hgs)
16. Ca లభించే ధాతువుల పేర్లు రాయండి.
జవాబు:
జిప్సం (CaSO4.2H2O); సున్నపురాయి (CaCO3)
17. ఇనుము ఏఏ ధాతువుల నుండి సంగ్రహిస్తారు?
జవాబు:
హెమటైట్ (Fe2O3); మాగ్న టైట్ (Fe3O4)
18. ఎప్సం లవణంలో ఎన్ని నీటి అణువులు ఉంటాయి?
జవాబు:
‘7’ (MgSO4.7H2O)
19. మాగ్నసైట్ మరియు ఎప్సం లవణాలలో లభించే లోహం ఏమిటి?
జవాబు:
Mg
20. హార్న్ సిల్వర్ యొక్క రసాయన సంకేతం ఏమిటి?
జవాబు:
AgCl (Ag లోహం)
21. జతపర్చుము :
1) CuFeS2, Hgs, PbS ( ) a) క్లోరైడ్ ధాతువులు .
2) NaCl, AgCl ( ) b) సల్ఫేట్ ధాతువులు జ. ‘B’
3) MgCO3, CaCO3 ( ) c) కార్బొనేట్ ధాతువులు
4) Fe3O4, MnO2 ( ) d) ఆక్సైడ్ ధాతువులు
జవాబు:
1 – b; 2 – a; 3 – c; 4 – d
22. చాల్కోజన్ కి అర్థం ఏమిటి?
జవాబు:
చాల్కో = ధాతువు, జీనస్ = పుట్టింది.
23. క్రియాశీలత ఎక్కువ గల మూలకాలు ఏవి?
జవాబు:
K, Na, Ca, Mg, AL
24. జతపరుచుము
a) Ca ( ) i) ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభించవు
b) Fe ( ) ii) భూ పటలంపై లభిస్తాయి.
c) Ag ( ) iii) స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి.
జవాబు:
(a) – i (b) – ii (c) – iii
25. లోహాల నుండి వాటి దాతువును వేరు చేయడానికి అవలంబించే దశలను ఒక క్రమపద్ధతిలో రాయండి.
1) ముడి ఖనిజ సాంద్రీకరణ
2) లోహాన్ని శుద్ధి చేయడం
3) ముడి లోహ నిష్కర్షణ
జవాబు:
1 → 3 → 2
26. చల్లని నీటితో చర్య జరిపే కొన్ని లోహాలు రాయుము.
జవాబు:
K, Na
27. Fe, K, Mg, Pb లోహాలు బలమైన విలీన ఆమ్లాలతో చర్య జరిపి H2 వాయువును విడుదల చేస్తాయి. అయితే వీటి చర్యాశీలతను ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
Pb < Fe < Mg < K
28. సాధారణంగా అన్ని లోహాలు క్రింది వానిలో దేనితో చర్య జరుపును?
A) ఆక్సిజన్
B) చల్లని నీరు
C) విలీన ఆమ్లం
D) క్లోరిన్
జవాబు:
D) క్లోరిన్
29. క్రింది వానిలో వేరుగా గల పద్ధతి
A) చేతితో ఏరడం
B) ప్లవన ప్రక్రియ
C) స్వేదనం
D) అయస్కాంత వేర్పాటు పద్ధతి
జవాబు:
C) స్వేదనం
30. ఖనిజాలలో మట్టి, ఇసుక వంటి మలినాలను ఏమంటారు?
జవాబు:
ఖనిజ మాలిన్యం
31. పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని ధాతువు నుండి భౌతికంగా వేరు చేసే ప్రక్రియను ఏమందురు?
జవాబు:
ధాతు సాంద్రీకరణ
32. రంగు, పరిమాణం వంటి ధర్మాలలో ధాతువుకి, మలినాలకి మధ్య వ్యత్యాసం ఉంటే వినియోగించే ముడిఖనిజ సాంద్రీకరణ పద్ధతి పేరు రాయుము.
జవాబు:
చేతితో ఏరివేత
33. సల్ఫైడ్ ధాతువుని సాంద్రీకరించే పద్ధతిని రాయుము.
జవాబు:
ప్లవన ప్రక్రియ
34. ప్లవన ప్రక్రియలో కలిపే నూనె పేరు ఏమిటి?
జవాబు:
పైన్ ఆయిల్
35. ప్లవన ప్రక్రియలో మాలిన్య ఖనిజాలు ఎక్కడికి చేరుతాయి?
A) తొట్టె అడుగుకి
B) నురుగుపై
C) గాలిలోకి
D) వేరే పాత్రలోకి
జవాబు:
A) తొట్టె అడుగుకి
36. ముడిఖనిజం గానీ, ఖనిజమాలిన్యం గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే వినియోగించు ఖనిజ సాంద్రీకరణ పద్ధతిని రాయుము.
జవాబు:
అయస్కాంత వేర్పాటు పద్ధతి.
37. సంపీడ్యత చెందిన గాలిని ఏ సాంద్రీకరణ పద్ధతిలో వినియోగిస్తారు?
జవాబు:
ప్లవన ప్రక్రియ
38. a) అధిక క్రియాశీలత గల ఆక్సైడ్ ధాతువు ( ) i) భర్జనం
b) మధ్యస్థ క్రియాశీలత గల కార్బొనేట్ ధాతువు ( ) ii) విద్యుత్ విశ్లేషణ
c) అల్ప క్రియాశీలత గల సల్సైడ్ ధాతువు ( ) iii) భస్మీకరణ
జవాబు:
a – ii, b – iii, c – i
39. గెలీనా నుండి లభించే లోహం
A) Pb
B) A
C) Hg
D) Mg
జవాబు:
A) Pb
40. కాల్సియం ధాతువులు రెండింటిని రాయుము.
జవాబు:
జిప్సం, సున్నపురాయి
41. రాక్ సాల్ట్ (రాతి ఉప్పు) ఫార్ములా రాయండి.
జవాబు:
Nacl
42. a) పాదరసం ( ) x) మేగ్నటైట్
b) సీసం ( ) y) గెలీవా
c) ఇనుము ( ) z) సిన్నబార్
జవాబు:
a – z, b – y, c – x
43. ఆవర్తన పట్టికలో చాల్క్కోన్ కుటుంబం ఎన్నవ గ్రూపునకు చెందినవి?
జవాబు:
16 (VIA)
44. మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు రాయుము.
జవాబు:
Zn, Fe, Pb, Cu
45. అల్ప చర్యాశీలత గల లోహాలు రాయుము.
జవాబు:
Hg, Ag, Pt, Au
46. చాల్కో అనగానేమి?
జవాబు:
చాల్కో = ధాతువు
47. Mg, Pb, Ag లను వాటి చర్యాశీలత క్రమంలో రాయండి.
జవాబు:
Mg > Ag > Pb
48. ప్లవన ప్రక్రియలో పైన్ ఆయిల్ కలుపుట వలన ఉపయోగమేమి?
జవాబు:
ఎక్కువ నురగ కొఱకు.
49. చర్యా శీలత శ్రేణి (activity series) అనగానేమి?
జవాబు:
లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమం.
50. ఒక లోహ ధాతువును క్షయకరణం చేసి లోహంగా లోహాలు. మార్చడానికి ఉపయోగించే పద్ధతిని దేనినాధారంగా నిర్ణయిస్తారు?
జవాబు:
చర్యాశీలతలో ఆ లోహ స్థానంపై ఆధారపడి
51. చర్యాశీలత శ్రేణి ఎగువన గల లోహాలను వాటి ధాతువును వేరు చేయు పద్ధతిని రాయండి.
జవాబు:
విద్యుత్ విశ్లేషణ
52. సోడియం క్లోరైడ్ (NaCl) నుండి Na ను పొందడానికి ఉపయోగించే విద్యుత్ విశ్లేషణం ఏమిటి?
జవాబు:
ద్రవరూప NaCl
53. విద్యుద్విశ్లేషణ చేసినపుడు మలినాలను కలుపుతారు. ఎందుకు?
జవాబు:
ధాతువు యొక్క ద్రవీభవన స్థానం తగ్గించడానికి
54. అధిక పరిమాణం గల గాలిలో సల్సైడ్ ధాతువులను బాగా వేడి చేయు పద్ధతిని ఏమంటారు?
జవాబు:
భర్జనం
55. భర్తనం వలన ధాతువు ఇలా మారుతుంది.
A) కార్బో నేట్
B) సల్ఫైడ్
C) ఆక్సైడ్
D) క్లోరైడ్
జవాబు:
C) ఆక్సైడ్
56. 2PbS + 3O2 → 2PbO + 2SO2. ఈ ఆక్సీకరణ ప్రక్రియను ఏమందురు?
జవాబు:
భర్జనం
57. ఆక్సైడ్ ధాతువులను క్షయకరణం చెందించడానికి ఏ పరికరాలను వినియోగిస్తారు?
జవాబు:
కొలిమి
58. స్వయం క్షయకరణం చెందే ధాతువుకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
Cu2S
59. Fe2O3 + 3CO + 2 Fe + 3CO2 ఈ క్షయకరణంను ఏ కొలిమిలో చేస్తారు?
జవాబు:
బ్లాస్ట్ కొలిమి
60. PbO ను క్షయకరణం చెందించడానికి వినియోగించే పదార్థం ఏమిటి?
జవాబు:
కోక్ (C)
61. ధర్మైట్ చర్యలు
A) ఉష్ణగ్రాహక చర్యలు
B) ఉష్ణమోచక చర్యలు
C) A లేదా B
D) చెప్పలేం
జవాబు:
B) ఉష్ణమోచక చర్యలు
62. థర్మైట్ చర్య యొక్క ఒక ఉపయోగం / అనువర్తనం రాయండి.
జవాబు:
విరిగిన రైలుపట్టాలను అతికించడానికి.
63. సాధారణంగా థర్మైట్ ప్రక్రియ వేటి మధ్య జరుగును?
జవాబు:
లోహ ఆక్సైడ్లు మరియు అధిక చర్యాశీలత గల
64. థర్మైట్ ప్రక్రియలో లభించే లోహం ఎలా వుంటుంది?
జవాబు:
కరిగిన ద్రవ స్థితిలో
65. థర్మైట్ ప్రక్రియకు ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
Fe2O3 + 2Al → 2Fe + Al2O3 + ఉష్ణశక్తి
66. థర్మైట్ ప్రక్రియలో లభించే లోహాలు
A) అధిక చర్యా శీలత గలవి.
B) అల్ప చర్యాశీలత గలవి.
జవాబు:
B) అల్ప చర్యాశీలత గలవి.
67. 2PbS + 3O2 → 2pbO + 2SO2
• pb ఏ చర్యాశీలత శ్రేణికి చెందినది?
జవాబు:
మధ్యస్థ చర్యాశీలత శ్రేణి
• గాలి లేకుండా చేసే ఉష్ణ రసాయన ప్రక్రియను ఏమందురు?
జవాబు:
భస్మీకరణం
• పై ఉదాహరణ భస్మీకరణం అవుతుందా?
జవాబు:
అవ్వదు.
68. సిన్నబార్ నుండి పాదరసంను పొందడానికి ఏ ప్రక్రియను వినియోగిస్తారు?
జవాబు:
భరనం
69. [Ag(CN)2]– ఈ అయాన్ పేరు ఏమిటి?
జవాబు:
డై సై నార్జియేట్ (I) అయాన్.
70. డై సై నార్జియేట్ నుండి పాదరసం పొందుటకు ……. చూర్ణం కలుపుతారు.
A) Mg
B) Fe
C) Zn
D) Si
జవాబు:
C) Zn
71. అపరిశుద్ధ లోహం నుండి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
లోహ శుద్ధి (లోహ శోధనం).
72. లోహాన్ని శుద్ధి చేసే రెండు పద్ధతులు రాయండి.
జవాబు:
స్వేదనం, పోలింగ్, గలనం చేయడం, విద్యుత్ శోధనం
73. అల్ప బాష్పశీల లోహాలు – అధిక భాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి వుంటే వినియోగించే లోహ శుద్ది పద్దతి.
A) స్వేదనం
B) పోలింగ్
C) గలనం చేయడం
D) విద్యుత్ శోధనం .
జవాబు:
A) స్వేదనం
74. పచ్చికర్రలను ఏ ‘లోహపు శుది’ ప్రక్రియలో వినియోగిస్తారు?
జవాబు:
పోలింగ్
75. బిసర్ కాపరను ఏ పద్ధతిలో శుది చేసారు?
జవాబు:
పోలింగ్
76. పోలింగ్ లో కాపర్ ఆక్సీకరణం చెందకుండా నిరోధించేవి ఏవి?
జవాబు:
పచ్చికర్రల నుండి వెలువడిన క్షయకరణ వాయువులు
77. పోలింగ్ లో మలినాలు ఎలా బయటకు వస్తాయి?
జవాబు:
1) లోహ ఉపరితలంపై నురగ ద్వారా,
2) వాయు రూపంలో గాని.
78. a) ద్రవీభవన స్థానాలు ( ) i) స్వేదనం
b) బాష్పీభవన స్థానాలు ( ) ii) గలనం
iii) శోధనం
జవాబు:
a – ii, b – i
79. విద్యుత్ శోధనం (ఎలక్ట్రోలిటిక్ రిఫైన్)లో అపరిశుద్ధ లోహంను ఏ ఎలక్ట్రోయ్ వినియోగిస్తారు?
జవాబు:
కాథోడ్
80. విద్యుత్ విశ్లేషణలో లోహం ఏ ఎలక్ట్రోడ్ వద్దకు చేరును?
జవాబు:
కాథోడ్
81. స్టర్ కాపర్‌ను విద్యుత్ విశ్లేషణ చేసినపుడు వచ్చే కరగని మలినాలను ఏమంటారు?
జవాబు:
ఆనోడ్ మడ్
82.
లోహం | లోహక్షయం |
1) ఇనుము | a) కాపర్ కార్బొ నేట్ |
2) వెండి | b) ఐరన్ ఆక్సైడ్ |
3) రాగి | c) సిల్వర్ సల్ఫైడ్ |
పై వానిని జతపరుచుము.
జవాబు:
1 – b, 2 – c, 3 – a
83. ఒక్కొక్కసారి ఇంట్లో రాగి వస్తువులపై ఆకుపచ్చని పొర ఏర్పడుతుంది? ఇది ఏమిటి?
జవాబు:
లోహ క్షయం (కాపర్ కార్బొనేట్)
84. వెండి వస్తువులు గాలిలో ఉంచినపుడు కాంతి దీనికి కారణం ఏమిటి?
జవాబు:
సిల్వర్ సల్సైడ్
85. ఇనుము తుప్పు పట్టడానికి కావలసిన పరిస్థితులు ఏమిటి?
జవాబు:
నీరు, గాలి ఉండాలి.
86. గాలిలో తేమను తీసివేయడానికి వినియోగించే రసాయనం ఏమిటి?
జవాబు:
అనార్థ కాల్షియం క్లోరైడ్
87. ‘ఇనుము తుప్పు పట్టుట’ ఏ దృగ్విషయం?
జవాబు:
విద్యుత్ రసాయన దృగ్విషయం
88. ఇసుము తుప్పు పట్టుటకు కారణమవు ఫెర్రస్ నియాను ఎలా ఏర్పడుతాయో సమీకరణం రాయుము
జవాబు:
2Fe + O2 + 4H+ → 2 Fe+2 + 2H2O
89. తుప్పు రసాయన నామం ఏమిటి?
జవాబు:
Fe2O3 × H2O (హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్)
90. లోహక్షయం యొక్క ఒక నష్టం రాయుము.
జవాబు:
- లోహపు వంతెనలు కూలిపోవుట
- యంత్రాలు మొరాయించుట.
91. లోహక్షయం నివారణకు ఒక పద్ధతి రాయుము.
జవాబు:
- పెయింట్
- ఎలక్ట్రో ప్లేటింగ్
92. పెయింట్ ఎలా లోహక్షయాన్ని నివారిస్తుంది?
జవాబు:
లోహ ఉపరితలం వాతావరణంతో స్పర్శ లేకుండా కప్పి ఉంచుతుంది.
93. ధాతువును ద్రవకారితో కలిపి, ఇంధనంతో వేడి చేసే ఉష్ణ రసాయన ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
ప్రగలనం
94. ప్రగలనంలో మలినాలు ఏ రూపంలో వేరు చేయబడతాయి?
జవాబు:
లోహ మలం (slag) గా.
95. హెమటైట్ ను ప్రగలనం చేసేటప్పుడు ఇంధనం మరియు ద్రవకారులు ఏవి ఉపయోగిస్తారు?
జవాబు:
కోక్ (ఇంధనం), సున్నపురాయి (ద్రవకారి).
96. సాధారణంగా ప్రగలన ప్రక్రియను ఏ కొలిమిలో చేస్తారు?
జవాబు:
బ్లాస్ట్ కొలిమి
97. భర్జనంలో పొందే ఉత్పన్నాలు ఏ స్థితిలో ఉంటాయి?
జవాబు:
ఘనస్థితి
98. భర్జన ప్రక్రియకు వినియోగించే కొలిమి ఏమిటి?
జవాబు:
రివర్బరేటరీ
99. భర్జన ప్రక్రియకు ఒక ఉదాహరణ ఇమ్ము.
జవాబు:
2Zns + 3O2 → 2ZnO + 2SO2
100. ఏ ప్రక్రియలో ధాతువును గాలి లేదా ఆక్సిజన్ అందుబాటు లేకుండా వేడి చేస్తారు?
జవాబు:
భస్మీకరణం విహీనమవుతాయి.
101. భస్మీకరణానికి ఉదాహరణనిమ్ము.
జవాబు:
MgCO3 → MgO + CO2
102. ధాతువులోని మలినాలను ఏమంటారు?
జవాబు:
గాంగ్
103. గాంగ్ ను తొలగించుటకు ధాతువుకు బయట నుండి కలిపే పదార్థాన్ని ఏమంటారు?
జవాబు:
ద్రవకారి (flux)
104. ఒకవేళ గాంగ్ SiO2 అయితే ద్రవకారిగా దీనిని కలపవచ్చును?
జవాబు:
CaO
105.
వీనిలో 1, 2, 3 లు ద్రవకారి, లోహమలం, గాంగ్ లో వేనిని సూచించును?
జవాబు:
1-ద్రవకారి, 2-గాంగ్, 3-లోహమలం.
106. Feo + ……..?…….. → FeSiO3
జవాబు:
SiO2
107. లోహ నిష్కర్షణలో కొలిమి ఎలా సహాయపడుతుంది?
జవాబు:
అధిక ఉష్ణోగ్రతలు అందించును.
108. లోహ నిష్కర్షణలో ఉష్ణ రసాయన ప్రక్రియలు చేయడానికి దేనిని వినియోగిస్తారు?
జవాబు:
కొలిమి
109. కొలిమిలో గల ప్రధాన భాగాలు ఏవి?
జవాబు:
హార్త్, చిమ్నీ, అగ్గి గది
110. కొలిమిలో ధాతువును ఉంచే ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
హార్త్
111. కొలిమిలో చిన్ని పాత్ర ఏమిటి?
జవాబు:
వ్యర్ధ వాయువులను బయటకు పంపుట.
112. కొలిమిలో ఇంధనం మండే ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
అగ్గి గది
113. అగ్గి గది, హాలు ఒకే ఛాంబర్ లో ఉండే కొలిమి ఏమిటి?
జవాబు:
బ్లాస్ట్ కొలిమి
114. అగ్గి గది, హాలు విడిగా ఉండే కొలిమి ఏది?
జవాబు:
రివర్బరేటరీ కొలిమి.
115. హార్త్ మరియు అగ్గిగదికి ప్రత్యక్షంగా సంబంధం లేని కొలిమి ఏమిటి?
జవాబు:
రిటార్ట్ కొలిమి
116. రివర్బరేటరీ కొలిమిని దేనిలో వాడుతారు?
A) భస్మీకరణం
B) భర్జనం
C) రెండూ
D) రెండూ కావు
జవాబు:
C) రెండూ
117. ప్రగలనంలో ధాతువును ఏమి చేస్తారు?
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) విద్యుత్ విశ్లేషణ
D) తటస్థీకరణం
జవాబు:
A) ఆక్సీకరణం
118. క్రింది ఏ ప్రక్రియలో O2 అవసరం లేదు?
A) ప్రగలనం
B) భర్జనం
C) భస్మీకరణం
D) A మరియు C
జవాబు:
C) భస్మీకరణం
119. జతపర్చుము
1) MgCO3 → MgO + CO2 ( ) a) భర్జనం
2) 2PbS + 3O2 → 2PbO + 2SO2 ( ) b) భస్మీకరణం
జవాబు:
1 – b, 2 – a
10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 1 Mark Bits Questions and Answers
సరియైన సమాధానమును గుర్తించండి.
1. ప్లవన ప్రక్రియ పద్ధతిలో ఉపయోగించేవి …..
A) కిరోసిన్
B) పైన్ ఆయిల్
C) కొబ్బరినూనె
D) ఆలివ్ నూనె
జవాబు:
B) పైన్ ఆయిల్
2. ముడి ధాతువుతో కలిసి ఉన్న మలినాలను అంటాం.
A) గాంగ్
B) ద్రవరారి
C) లోహమలం
D) ఖనిజం
జవాబు:
A) గాంగ్
3. Na, Mg, Zn, Fe, Ag మరియు Au లు లోహాల క్రియాశీల శ్రేణిలోని కొన్ని మూలకాలు.
రాము : Fe ఒక మధ్యస్థ క్రియాశీలత మూలకం.
రాజు : Mg ఒక మధ్యస్థ క్రియాశీలత మూలకం కాదు.
A) రాము ఒప్పు, రాజు తప్పు
B) రాము తప్పు, రాజు ఒప్పు
C) రాము, రాజు ఇద్దరూ ఒప్పు
D) రాము, రాజు ఇద్దరూ తప్పు
జవాబు:
C) రాము, రాజు ఇద్దరూ ఒప్పు
4. కింది పట్టికను గమనించండి.
లోహము | ధాతువు |
P | బాక్సైట్ |
పాదరసం | Q |
R | హెమటైట్ |
PQR స్థానాలలో ఉండవలసిన వాటిని గుర్తించండి.
A) అల్యూమినియం, సిన్నబార్, ఇనుము
B) సోడియం, గెలీనా, మెగ్నీషియం
C) సోడియం, సిన్నబార్, ఇనుము
D) మెగ్నీషియం , గెలీనా, ఇనుము
జవాబు:
A) అల్యూమినియం, సిన్నబార్, ఇనుము
5. పటంలో చూపిన విధంగా జింక్ సల్ఫేట్ ద్రావణం గల పరీక్షనాళికలో శుభ్రమైన ఇనుప ముక్కలను ఉంచి నప్పుడు ఏం జరుగుతుంది?
A) ద్రావణం రంగును కోల్పోయి, ఇనుప ముక్కలపై జింక్ పూత ఏర్పడుతుంది.
B) ద్రావణం ఆకుపచ్చ రంగులోకి మారి, ఇనుప ముక్కలపై జింక్ పూత ఏర్పడుతుంది.
C) ద్రావణాన్ని ఆకుపచ్చ రంగులోకి మార్చుతూ, ఇనుప ముక్కలు ద్రావణంలో కరుగుతాయి.
D) ఎటువంటి చర్య జరుగదు.
జవాబు:
D) ఎటువంటి చర్య జరుగదు.
6. క్రింది వానిలో కాల్షియం లోహ ధాతువు
A) బాక్సైట్
B) సున్నపురాయి (లైమ్ స్టోన్)
C) రాక్ సాల్ట్
D) హెమటైట్
జవాబు:
B) సున్నపురాయి (లైమ్ స్టోన్)
7. క్రింది మూలకాలలో అర్ధ లోహము ఏది?
A) సిలికాన్
B) సోడియమ్
C) క్లోరిన్
D) అల్యూమినియమ్
జవాబు:
A) సిలికాన్
8. ప్లవన ప్రక్రియ ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు?
A) సల్ఫైడ్
B) ఆక్సైడ్
C) కార్బొనేట్
D) నైట్రేట్
జవాబు:
A) సల్ఫైడ్
మీకు తెలుసా?
ఒక లోహం యొక్క ధర్మాలను పెంపొదించడానికి దానిని మిశ్రమలోహం (alloys) గా మార్చడం ఒక మంచి పద్దతి. ఈ పద్ధతిలో మనకు కావలసిన ధర్మాలు గల మిశ్రమ పదార్థాన్ని పొందవచ్చు. ఉదాహరణకు ఇనుము మనం విరివిగా వాడే లోహం. కానీ శుద్ధస్థితిలో ఇనుము ఎప్పుడూ వాడం. దీనికి కారణం శుద్ద ఇనుము చాలా మృదువుగా మరియు వేడిచేసినపుడు సులువుగా సాగిపోతుంది. చాలా తక్కువ మొత్తంలో కార్బన్ ను ఇనుముతో మిశ్రమం చెందించినపుడు, అది గట్టిగాను, దృఢంగాను మారుతుంది. ఇనుమును నికెల్, క్రోమియంతో మిశ్రమం చెందిస్తే స్టెయిన్లెస్ స్టీల్ (Stainless Steel) ఏర్పడుతుంది. ఇది త్రుప్పు పట్టదు.
24 కారట్ గోల్డ్ గా పిలువబడుతున్న శుద్ధమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. అందుచే ఇది ఆభరణాల తయారీకి అంత అనువుగా ఉండదు. వెండి లేదా రాగి కలసి ఉన్న 22 కారట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి వాడతారు. “22 కారట్ బంగారం అనగా – 22 భాగాల శుద్ద బంగారం, 2 భాగాల వెండి లేదా రాగిల మిశ్రమ పదార్థం” అని అర్థం.