Students can go through AP Inter 1st Year Botany Notes 9th Lesson కణం: జీవప్రమాణం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 9th Lesson కణం: జీవప్రమాణం
→ కణం అనేది జీవనం యొక్క ప్రాధమిక ప్రమాణం. ఇది జీవులన్నింటిలో మౌలికమైన, నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం.
→ అన్ని జీవులు కణాలు మరియు కణసంకలితాలతో ఏర్పడి ఉంటాయి.
→ కణాలు ఆకారం, పరిమాణం మరియు విధులలో భిన్నంగా ఉంటాయి.
→ ‘కణసిద్ధాంతం’ ను ప్లీడన్ మరియు ష్వాన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. తరువాత రుడాల్ఫ్ విర్షా అనే శాస్త్రవేత్త కణసిద్ధాంతానికి పరిపూర్ణత కల్పించాడు.
→ కణసిద్ధాంతం:
అన్ని జీవులు కణాలు మరియు కణసంకలితాలతో నిర్మితమవుతాయి.
(ii) కొత్త కణాలు పూర్వపు కణాల నుండి ఏర్పడతాయి.
→ కణాల రకాలు: (i) కేంద్రక పూర్వకణం (ii) నిజకేంద్రక కణం
→ వృక్ష కణాలు యొక్క ‘ద్రవాభిసరణతను’ నియంత్రించుటలో ‘రిక్తికలు’ ముఖ్య పాత్రను పోషిస్తాయి. [IPE]
→ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ మధ్యభాగంలో సెంట్రోమియర్ ను కలిగి రెండు సమాన బాహువులను ఏర్పరుస్తుంది.
→ కొన్ని క్రోమోసోమ్లలో ఉండే చిన్న ఖండికలాంటి నిర్మాణాన్ని ‘శాటిలైట్’ అంటారు.
ఇది ప్రధాన క్రోమెసోమ్ నుండి ద్వితీయ కుంచనం ద్వారా వేరు చేయబడుతుంది. [IPE]
→ ‘మధ్య పటలిక’ కాల్షియం పెక్టెట్తో తయారవుతుంది. ఇది ప్రక్కనున్న ఇతర కణాలను బంధించి ఉంచుతుంది.
→ హరిత వర్ణకాన్ని కలిగి ఉన్న కణాంగాలను ‘హరితరేణువులు’ అంటారు. [IPE]
→ మైటో కాండ్రియాలు ‘కణ శక్త్యాగారాలు’. [IPE]
→ కేంద్రక నిర్మాణం నాలుగు ప్రధాన అంశాలతో జరుగుతుంది. అవి: [IPE]
- కేంద్రక త్వచం
- కేంద్రకమాత్రిక
- క్రోమాటీన్ పదార్ధం
- న్యూక్లియోలస్
→ క్రోమోజోముల రకాలు (సెంట్రోమియర్ ఆధారంగా): [IPE]
- మెటాసెంట్రిక్
- సబ్మెటా సెంట్రిక్
- ఏక్రోసెంట్రిక్
- టీలోసెంట్రిక్
→ క్రొమాటిన్ మీద ఉన్న పూసల వంటి నిర్మాణాలను న్యూక్లియోసోమ్స్ అంటారు.
→ న్యూక్లియోసోమ్ నిజకేంద్రక క్రోమోజోమ్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. [IPE]