Students can go through AP Inter 1st Year Botany Notes 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం
→ మొక్కల సిస్టమాటిక్స్ అనేది మొక్కల వైవిధ్యాలు, చరిత్ర మరియు వాటి మధ్య ఉన్న పరిణామక్రమ అనుబంధం గురించి అధ్యయనం చేస్తుంది.
→ పుష్పించే మొక్కలను ‘ఆవృతబీజాలు’ అంటారు.
→ ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం పుష్పించే మొక్కల గుర్తింపు, నామీకరణ మరియు వర్గీకరణను గురించి అధ్యయనం చేస్తుంది.
→ వర్గీకరణ రకాలు: (i) ఆల్ఫావర్గీకరణ శాస్త్రం (ii) బీటా వర్గీకరణ శాస్త్రం (iii) ఒమేగా వర్గీకరణశాస్త్రం
→ ఆల్ఫావర్గీకరణ శాస్త్రం: పుష్పించే మొక్కల స్వరూప లక్షణాల మీదే ఆధారపడి చేసిన వర్గీకరణ శాస్త్రమును ఆల్ఫా వర్గీకరణ శాస్త్రం అంటారు.
→ బీటా వర్గీకరణ శాస్త్రం: పుష్పించే మొక్కల స్వరూప లక్షణాలతోపాటు జన్యులక్షణాలు, అంతర్నిర్మాణం, శరీరధర్మాలను గురించి అధ్యయనం చేసే వర్గీకరణ శాస్త్రమును బీటా వర్గీకరణ శాస్త్రం అంటారు.
→ ఒమేగా వర్గీకరణ శాస్త్రం: స్వరూప లక్షణాలతో పాటు ఇతర వృక్షశాస్త్ర శాఖలు అయినటువంటి పిండోత్పత్తిశాస్త్రం, కణశాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, పరాగరేణు శాస్త్రాల నుంచి లభించే సమాచారం మీద ఆధారపడి వర్గీకరించే శాస్త్రాన్ని ‘ఒమేగా వర్గీకరణ’ శాస్త్రం అని అంటారు. [IPE]
→ మృత్తిక లోపల ఫలాలు ఏర్పడడాన్ని భూఫలనం అంటారు. ఉదా: అరాఖిస్ హైపొజియా (వేరుశనగ). [IPE]
→ ‘పుష్పచిత్రం’ అనేది పుష్పభాగాలు మరియు వాటి యొక్క అమరికను చిత్రాల ద్వారా తెలియజేస్తుంది. [IPE]
→ ‘పుష్ప సంకేతం’ వివిధ పుష్ప భాగాలను చిహ్నల ద్వారా తెలియజేస్తుంది. [IPE]
→ ‘ఫాబేసి కుటుంబం’ యొక్క అనావశ్యక అంగాలు రక్షక పత్రాలు. [IPE]
→ ‘లిలియేసి కుటుంబం’ యొక్క ఆవశ్యక పుష్పభాగాలు కేసరావళి మరియు అండకోశం. [IPE]
→ ‘సోలనేసి కుటుంబం’ యొక్క ఆవశ్యక అంగాలు కేసరావళి, అండకోశం మరియు ఆకర్షక పత్రాలు. [IPE]
→ ఆర్ధిక ప్రాముఖ్యం కలిగిన ఫాబేసి కుటుంబం మొక్క ఉత్పత్తులు. [IPE]
- పప్పు ధాన్యాలు
- వంట నూనెలు
- కూరగాయలు
- కలప
- నీలి రంగు
- పశుగ్రాసం
- హరిత ఎరువు
- నారలు